రాంచీ: జార్ఖండ్‌లో గత వారం కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఇటీవల వెలువడిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం ఘన విజయం సాధించడంతో..జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్(49) గనవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సోరెన్ ప్రమాణ స్వీకారం చేసి అయిదు రోజులు అవుతున్న కేబినెట్ విస్తరణపై మాత్రం జాప్యం కొనసాగుతోంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు లేవని తెలుస్తోంది.
ప్రస్తుతానికి జార్ఖండ్ కేబినెట్‌లో సోరెన్ ఒక్కరు మాత్రమే మంత్రిగా కొనసాగుతున్నారు. ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కలిసిగా పోటీచేయడంతో.. మిత్రపక్షాల మధ్య బెర్త్‌ల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఇందుకు కారణమని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.
ఇక జార్ఖండ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా గరిష్టంగా 12 మంది మంత్రులుగా ఉండవచ్చు. అయితే గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నలుగురు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఈసారి సోరెన్ మంత్రివర్గం భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఒక్కో పార్టీ గెలిచిన నాలుగు స్థానాలకు గానూ ఒక మంత్రి పదవి లభించింది. ఈ ఫార్ములాతో కాంగ్రెస్‌కు నాలుగు బెర్త్‌లు, సోరెన్‌కు చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చాకు ముఖ్యమంత్రి పదవితో సహా ఏడు స్థానాలు లభించాయి. తేజస్వి యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్‌కు ఒక మంత్రి పదవి లభించింది.
గతంతో పోల్చితే ఈసారి జేఎంఎం నాలుగు సీట్లు అదనంగా గెలుపొంది. దీంతో ఒక మంత్రి పదవికి ఐదు 5 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిబంధనతో కాంగ్రెస్‌కు మంత్రి పదవులు తగ్గే అవకాశం ఉంది. జేఎంఎం గెలుచుకున్న 34 సీట్లతో పోలిస్తే ఆ పార్టీకి 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఆర్జేడీ ప్రస్తుతం నాలుగు సీట్లు గెలుచుకున్నందున ఒకటి కంటే ఎక్కువ మంత్రి పదవులు ఆశించవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ఆ పార్టీ గతసారి ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment