లక్నో : ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమ మాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాలో నమోదైన మరణాలు సంఖ్య పెద్దది కాదని వ్యాఖ్యానించారు. అయితే, ఆ వ్యాఖ్యల్ని ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
కుంభ మేళాలో హేమమాలిని స్నానమాచరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మౌని అమావాస్య రోజున జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయపడ్డారు’ ఈ దుర్ఘటనపై ప్రశ్నలు సంధించారు. ‘ఇది అంత పెద్ద సంఘటన కాదు. అది ఎంత పెద్దదో నాకు తెలియదు (కానీ).. దానిని బాగా పెద్దది చేసి చూపిస్తున్నారు.
యూపీ సీఎం యోగి ఆధిత్యాథ్ ఏర్పాట్లు బాగా చేశారు. కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇలాంటి వాటి నిర్వహణ చాలా కష్టం. కాబట్టే తొక్కిసలాట జరిగింది. అలాంటి ఘటనలు జరగడం’ అనివార్యం అని అన్నారు.
#WATCH | Delhi: BJP MP Hema Malini says "...We went to Kumbh, we had a very nice bath. It is right that an incident took place, but it was not a very big incident. I don't know how big it was. It is being exaggerated...It was very well-managed, and everything was done very… pic.twitter.com/qIuEZ045Um
— ANI (@ANI) February 4, 2025
యూపీ ప్రభుత్వం వాస్తవ మరణాల సంఖ్యను దాచిపెట్టిందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఆ వ్యాఖ్యలపై హేమమాలిని మాట్లాడుతూ.. వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది చెబుతారు .తప్పుడు విషయాలు చెప్పడమేగా వారి పని’ అని అన్నారు.
హేమమాలిని వ్యాఖ్యలపై ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్ తీవ్రంగా స్పందించారు. హేమమాలిని సందర్శించినప్పుడు ఆమెకు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు. కాబట్టే, కుంబమేళాలో జరిగిన దుర్ఘటనకు సంబంధించిన వాస్తవాలేంటో తెలియడం లేదు. పోలీసులు, అధికారులు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు పాకులాడుతున్నారు. హేమ మాలిని సామాన్య ప్రజల కోసం చేసిన ఏర్పాట్లు, భద్రత గురించి పట్టించుకోలేదు. అందుకే పదుల సంఖ్యలో ప్రాణాలు పోతే ఇదో సమస్య కాదని ఆమె చెప్పడం బాధితుల్ని ఎగతాళి చేయడమే అవుతుందన్నారు.
హేమమాలిని వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ స్పందించారు. హేమ మాలిని ప్రయాగ్‌రాజ్ సందర్శనలో వీఐపీ ట్రీట్‌మెంట్ పొందినట్లు చెప్పారు. ఆమె అధికార పార్టీ నాయకురాలు, పైగా ప్రముఖ నటి. ఆమెకు ప్రత్యేక సౌకర్యాలు ఉండే అవకాశం ఉంది (కానీ) పదుల సంఖ్యలో మరణించారు. గాయపడ్డారు. వాటి గురించి ఎవరు పట్టించుకుంటారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment