1/10
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గత 50ఏళ్లలో ఏ ప్రభుత్వం సాధించలేని విక్టరీని మహాయుతి కూటమి సాధించింది. బీజేపీ 132, షిండే శివసేన 57, అజిత్ పవార్ ఎన్సీపీ 41.. మొత్తంగా ఎన్డీయే కూటమి వన్‌సైడెడ్ విక్టరీ
2/10
ఫలితాలు వెలువడుతుండగానే.. బీజేపీ శ్రేణులు సంబురాల్లో ముగినిపోయాయి. దేవేంద్ర ఫడ్నవిస్‌ను ముఖ్యమంత్రిగా ఫిక్స్ అయిపోయాయి.
3/10
అయితే సీఎంగా ఉన్న ఏక్‌నాథ్ షిండే, ఫడ్నవిస్ ఎంపికకు అభ్యంతరం చెప్పారు. సంఖ్యా బలం ఆధారంగా సీఎం ఎంపిక ఉండదని, మూడు పార్టీలే కూర్చుని చర్చిస్తాయని అన్నారు.
4/10
మహారాష్ట్రకు సీఎం కావడం తన ఆశయమని చెప్పుకునే అజిత్ పవార్.. తానూ రేసులో ఉన్నాననే సంకేతాలిచ్చారు. దీంతో ముక్కోణపు పోటీ మొదలైంది
5/10
మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 26తో ముగియాల్సి ఉంది. ఈలోపు సీఎం ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటు జరగాల్సి ఉండగా.. పరిస్థితులు అందుకు అనుగుణంగా కనిపించలేదు. దీంతో రాష్ట్రపతి పాలన తప్పదంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే..
6/10
గడువు తేదీనే ఏక్‌నాథ్‌షిండే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. ఆపై అపద్ధర్మ సీఎంగా షిండే కొనసాగుతారని గవర్నర్ ప్రకటించారు.
7/10
అయితే.. సీఎం పదవి కోసం మహాయుతిలో సైలెంట్ వార్ నడిచింది. అజిత్ పవార్.. ఫడ్నవిస్‌కు మద్దతు ప్రకటించగా.. షిండే మాత్రం వెనకడుగు వేశారు. అయితే సీఎం పదవికి ఎవరిని ఎంపిక చేసినా తనకు అభ్యంతరం లేదని, నిర్ణయాన్ని ప్రధాని మోదీ, అమిత్ షాకు వదిలేశానని, వాళ్ల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని షిండే ప్రకటించారు.
8/10
పైకి సీఎం పదవి కోసం పని చేయాలని షిండే ప్రకటించినప్పటికీ.. లోలోపల మాత్రం ఆయన రగిలిపోతున్నారని శివసేన ప్రకటనలతో స్పష్టమైంది. ఈలోపు బీజేపీ పెద్దలు షిండేను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. మరోవైపు.. షిండే చిటపటల నడుమ ఫడ్నవిస్ కాకుండా మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి.
9/10
అయితే బీజేపీ మాత్రం ఫడ్నవిస్ వైపే మొగ్గు చూపింది. కీలకమైన మహాయుతి కూటమి సమావేశానికి దూరంగా ఉన్న షిండేను.. మళ్లీ సొంతూరు నుంచి ముంబైకి రప్పించింది. ఫడ్నవిస్‌తో చర్చించేలా చేసింది. మొత్తానికి.. పలు డిమాండ్లతో షిండే ఉపముఖ్యమంత్రి పదవికే ఫిక్స్ అయినట్లు సమాచారం.
10/10
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి కూటమి మధ్య చర్చలు కొలిక్కివచ్చినట్లే కన్పిస్తోంది. తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ రాష్ట్ర పగ్గాలు అందుకోవడం ఖాయమైనట్లు సమాచారం. 5వ తేదీన ఆయన సీఎంగా ప్రమాణం చేయబోతున్నట్లు ఆంగ్ల మీడియా సంస్థల కథనాల సారాంశం.