31న దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం | Devendra Fadnavis to take oath as Maharashtra Cheif Minister on October 31 | Sakshi
Sakshi News home page

31న దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం

Published Wed, Oct 29 2014 2:33 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

31న దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం - Sakshi

31న దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంగళవారం జరిగిన బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో నాయకుడిగా దేవేంద్ర ఫడ్నవిస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. 
 
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ఆహ్వానించారని, ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని అక్టోబర్ 31 తేదిగా నిర్ణయించామని దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. 15 రోజుల్లోగా బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ సూచించినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. 
 
మంత్రివర్గంలో బెర్తుల కోసం శివసేన ప్రతిపాదనల్ని పంపినట్టు సమాచారం. ఈ సాయంత్రం శివసేన, బీజేపీల మధ్య సమావేశం థాక్రే నివాసం మాతోశ్రీలో జరుగనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement