
Why Tamil Heros Not Attend Puneeth Rajkumar Funerals: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం యావత్ సినీ పరిశ్రమను విషాదంలో నెట్టింది. ఎంతో భవిష్యత్తు ఉన్న పునీత్ హఠాన్మరణం చెందడం అందరిని కలిచివేస్తుంది. పేరుకు కన్నడ హీరో అయినా అందరితో ఎంతో సత్సంబంధాలు కొనసాగించేవారు. పునీత్ ఇకలేరని తెలిసి కన్నడ ఇండస్ట్రీనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ సహా ఎంతోమంది ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పునీత్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతం అయ్యారు. చదవండి: పునీత్‌కి మాటిస్తున్నాను.. ఆ పిల్లలను నేను చదివిస్తా: విశాల్
ఇక పునీత్ అంత్యక్రియలకు లక్షలాది అభిమానులు సహా టాలీవుడ్ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కంఠీరవ స్టేడియంలో పునీత్ పార్థివదేహానికి నివాళులర్పించారు. అయితే కోలీవుడ్ నుంచి మాత్రం ఒక్కరు కూడా హాజరుకాలేదు. నిజానికి విశాల్, సూర్య, విజయ్ వంటి హీరోలతో పునీత్‌కి మంచి స్నేహం ఉంది. అయినా వాళ్లు కడసారి చూపుకు రాలేదు.
దీనికి కారణం కావేరీ జలాల సమస్య అని తెలుస్తుంది. ఎన్నో ఏళ్లుగా కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జల వివాదం నడుస్తుంది. ఆ మధ్య తమిళ సినిమాలను కర్ణాటకలో విడుదల చేయకూడదని అప్పట్లో కన్నడ హీరోలు నినాదాలు కూడా చేశారు. దీంతో ఇలాంటి సమయంలో పునీత్ అంత్యక్రియలకు హాజరైతే రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదురువుతాయనే ఉద్దేశంతోనే కోలీవుడ్ హీరోలు హాజరు కాలేదని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
చదవండి:నెంబర్1 హీరోల అకాల మరణం.. శాండల్‌వుడ్‌కు అది శాపమా?
పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం ‘జేమ్స్’ మేకర్స్ కీలక నిర్ణయం