మిచాంగ్ తుపాన్ చైన్నె ప్రజల్ని నిలువునా ముంచేసింది. కష్టాల కడగండ్లలోకి నెట్టేసింది. జనజీవనం స్తంభించిపోయింది. పేదలు, ధనికులు ఎవరినీ వదలలేదు.. అందరి నోటా ఆదుకోమన్న ఆర్తనాదాలే. తన తల్లి వైద్యం కోసం స్థానిక కాట్పాడిలో ఉంటున్న బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్, అదే ప్రాంతంలో నివసిస్తున్న హీరో విష్ణు విశాల్, మైలాపూర్ ప్రాంతంలో నివసిస్తున్న నటి నమిత తుపాన్ బాధితులే.
రూ.10 లక్షల విరాళం
ప్రభుత్వం సత్వరం స్పందించి నివారణ చర్యలకు ఉపక్రమించినా, మరో పక్క విమర్శల దాడి జరుగుతోంది. సినీ తారలు విశాల్, పార్థిబన్, అతిథి బాలన్ వంటి వారు ప్రభుత్వ అలసత్వం గురించి ప్రశ్నించారు. ఇక తుపాన్ బాధితులకు ఆపన్న హస్తం అందించిన వారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా నటుడు సూర్య, కార్తీక్ తమ అభిమానులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. చైన్నె, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లోని అభిమానుల కోసం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
తారల సాయం..
విజయ్ తన అభిమాన సంఘం నిర్వాహకులను రంగంలోకి దింపి బాధితులను తన వంతుగా ఆదుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేసిన నటుడు విశాల్, పార్థిబన్ కూడా తన వంతు సాయం అందించారు. అదేవిధంగా హాస్యనటుడు బాలా తమ వంతు సాయం అందించారు. అలాగు లేడీ సూపర్‌స్టార్ నయనతార తుపాన్ బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావడం విశేషం. ఈమె పిగ్మీ 9 సంస్థ ద్వారా వేలచ్చేరి ప్రాంతంలోని బాధితులకు శానిటరీ, మంచి నీళ్లు, బ్రెడ్, బియ్యం వంటి నిత్యావసర సరుకులు అందించారు.
చదవండి: ప్రశాంత్‌కు తన చేతులతో టైటిల్ అప్పగించేసిన అమర్! రైతుబిడ్డ అంటే అంత చులకనా..?
Comments
Please login to add a commentAdd a comment