నటుడు విశాల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'మార్క్ ఆంటోని'. ఎస్ జే.సూర్య ప్రతినాయకుడిగా నటించిన ఇందులో నటి రీతు వర్మ నాయకిగా నటించారు. నటి అభినయ, ఈ చిత్రాన్ని సునీల్, వైజీ మహేంద్రన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై ఎస్.వినోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
(ఇది చదవండి: బోల్డ్ సీన్స్ చేయను.. అలాంటి వాటికైతే ఓకే : గుంటూరు కారం హీరోయిన్)
త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలతో చిత్రబృందం బిజీగా ఉంది. అందులో భాగంగా చిత్ర యూనిట్ ఇటీవల పుదుచ్చేరిలోని ఓ కళాశాలలో విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నటుడు విశాల్‌ను ఒక విద్యార్థి ఆసక్తికర ప్రశ్న అడిగాడు. స్టార్ హీరో విజయ్ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మీరు ఆయనకు మంచి స్నేహితుడు కాబట్టి ఆయన పార్టీలో చేరుతారా? అని అడిగాడు.
అందుకు విశాల్ బదులిస్తూ అది ఆ దేవుడే నిర్ణయిస్తాడన్నారు. అయితే చాలా కాలంగా ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నానని చెప్పారు. ఆకలితో ఉన్న వారికి చేతనైన సాయం చేస్తున్నానని విశాల్ తెలిపారు. ఆకలితో ఉన్న వారికి రూ.100 సాయం చేసేవాడు రాజకీయ నాయకుడేనని.. రాజకీయం అంటే సామాజిక సేవ అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా మార్క్ ఆంటోని చిత్రంలో విశాల్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. కాగా.. గతంలో విజయ్ 10, 12 తరగతుల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను సత్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దళపతి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలొచ్చాయి.
(ఇది చదవండి: సినిమాల్లో నటనే కాదు.. అమ్మతనం ఉట్టి పడుతోంది!)
Comments
Please login to add a commentAdd a comment