దళపతి విజయ్‌ కీలక నిర్ణయం.. వారి కోసం ప్రత్యేక కార్యక్రమం! | Thalapathy Vijay to honour class 10 and 12 toppers of Tamil Nadu | Sakshi
Sakshi News home page

Vijay: విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. వారికి సన్మాన కార్యక్రమం!

Published Mon, Jun 10 2024 9:23 PM | Last Updated on Mon, Jun 10 2024 9:23 PM

Thalapathy Vijay to honour class 10 and 12 toppers of Tamil Nadu

తమిళ స్టార్‌ దళపతి విజయ్ ప్రస్తుతం 'గోట్‌' చిత్రంలో నటిస్తున్నారు. సురేశ్ ప్రభు డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. గతేడాది లోకేశ్ కనగరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన లియో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా కనిపించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.

అయితే విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళగ వెట్రి కజగం పేరుతో పార్టీని కూడా స్థాపించారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు విద్యార్థులను ఆయన త్వరలోనే సన్మానించనున్నారు. ఈ ఏడాది 10,12 తరగతుల్లో టాపర్‌గా నిలిచిన వారికి  సర్టిఫికెట్‌తో పాటు రివార్డులను విజయ్ అందజేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ ప్రతినిధులు ప్రకటించారు.

 జూన్ 28, జూలై 3 తేదీలలో చెన్నైలోని తిరువాన్మియూర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల  చేతుల మీదుగా  బహుమతులు అందజేయనున్నారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో టాపర్‌గా నిలిచిన విద్యార్థులను సన్మానించనున్నట్లు పార్టీ ప్రకటించింది. రాజకీయంగా తన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

కాగా.. విజయ్ ప్రస్తుతం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT)లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, అజ్మల్ అమీర్, వైభవ్, లైలా, మోహన్, అరవింద్ ఆకాష్, అజయ్ రాజ్ నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 5, 2024న థియేటర్లలోకి రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement