రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు. కానీ వచ్చిన తర్వాత ప్రజల ఆదరణ పొందడమే ప్రధానం. అప్పట్లో తమిళనాడు మక్కల్ తిలకంగా ఎంజీఆర్.. రాజకీయాల్లో సత్తాచాటి ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందే సినీ రంగానికి చెందిన అన్నాదురై, కరుణానిధి లాంటివారు తమిళనాడుని ఏలారు. ఎంజీఆర్ తర్వాత ఆయన పార్టీని జయలలిత ముందుకు నడిపించి సీఎం అయ్యారు.
(ఇదీ చదవండి: ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ద కేరళ స్టోరీ'.. రిలీజ్ డేట్ ఫిక్స్)
ఎప్పటి నుంచో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ఊరిస్తూ వచ్చిన రజనీకాంత్.. చివరి క్షణంలో వెనకడుగు వేశారు. ఆయన తర్వాత నిర్ణయం తీసుకున్న కమలహాసన్.. మక్కల్ నీతి మయ్యం పేరుతో పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లో గెలవకపోయారు. ప్రముఖ హీరో దళపతి విజయ్.. ఈ మధ్యే రాజకీయాల్లో వచ్చేశారు. పార్టీ పేరుతో సహా నోట్ విడుదల చేశారు. ఇప్పుడు హీరో విశాల్ కూడా రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం అంటున్నట్లు తాజా సమాచారం.
చెప్పాలంటే విశాల్ చాలా కాలం క్రితమే రాజకీయాల్లోకి వచ్చారు. ఆ మధ్య శాసనసభ ఎన్నికల్లో ఆర్‌కే నగర్ నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. కానీ దీన్ని తిరస్కరించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కాగా విశాల్ తన అభిమాన సంఘాన్ని ప్రజా రక్షణ సంఘంగా మార్చి ప్రజాసేవలో మమైకమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తన సినిమాల షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిశీలిస్తూ వస్తున్నారు. రాబోయే 2026 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి త్వరలోనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ పెంచేసిన రష్మిక.. తెలుగులో ఈమెనే టాప్?)
Comments
Please login to add a commentAdd a comment