బెంగళూరు/ఢిల్లీ: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రేపు(శనివారం, మే 20) ప్రమాణం చేయనున్నారు. ఇదే వేదికగా పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా, మరో 28 మంత్రులు సైతం ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక కేబినెట్ కూర్పు కోసం సిద్ధూ, డీకేఎస్‌లు కలిసి ఇవాళ మరోసారి హస్తినకు వెళ్లారు.
ఈ క్రమంలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు ముఖ్యనేతలను కలిశారు. అనంతరం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోనూ భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఈ భేటీ జరిగనట్లు తెలుస్తోంది. ‘‘మంత్రి వర్గ జాబితాను కాబోయే సీఎం, డిప్యూటీ సీఎంలు పార్టీ సెక్రటరీ ఇంఛార్జితో చర్చించాక సిద్ధం చేశారని, దీనికి పార్టీ అధ్యక్షుడి ఆమోదం లభించడమే తరువాయి’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే(మల్లికార్జున ఖర్గే తనయుడు) పేర్కొన్నారు. ఇప్పటికే కేబినెట్ లిస్ట్‌కు ఆమోద ముద్ర పడినట్లు తెలుస్తోంది.
బెంగళూరులోని శ్రీ కంఠీరవ అవుట్‌డోర్ స్టేడియంలో శనివారం ముఖ్యమంత్రి, కేబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలను, మళ్లింపును ప్రకటించారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు.
Comments
Please login to add a commentAdd a comment