Karnataka Cabinet Formation: Big Opposition Unity Show At Karnataka Government Swearing-In Ceremony - Sakshi
Sakshi News home page

Karnataka Cabinet Formation: కాంగ్రెస్‌, ప్రతిపక్షాల బల ప్రదర్శనగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం

Published Sat, May 20 2023 1:46 PM | Last Updated on Sat, May 20 2023 3:35 PM

Big Opposition Unity Show At Karnataka Government Swearingin Ceremony - Sakshi

సాక్షి, బెంగళూరు: కంఠీరవ స్టేడియం వేదికగా కర్ణాటక కేబినెట్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీనియర్‌ నేత సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. సిద్ధరామయ్యతో గవర్నర్‌ థావర్‌ చంద్‌ గేహ్లాట్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ప్రమాణం చేశారు. వీరితోపాటు ఎనిమిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

కాంగ్రెస్‌, ప్రతిపక్షాల బల ప్రదర్శనగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార వేదిక నిలిచింది. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు బీజేపీ వ్యతిరేక పక్షాలు హాజరయ్యాయి. దేశంలోని విపక్షాల నేతలందరూ కదిలొచ్చి తమ ఐక్యతను ప్రదర్శించారు.ఒక వేదికపై విపక్షాలన్నీ కలిసి రావడం 2014 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమానికి 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. విపక్షాల మద్దతుతో వచ్చే ఎన్నికల్లో కర్ణాటక రోల్‌ మోడల్‌గా గెలవాలని కాంగ్రెస్‌ ప్లాన్‌ చేస్తోంది. ఈ సభతో 2024 సార్వత్రిక ఎన్నికలకు విపక్షాలతో కలిసి వస్తామని కాంగ్రెస్‌ సూచనప్రాయంగా బయటపెట్టింది.

హాజరైన ప్రముఖులు వీళ్లే..
►తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌, చత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సుఖ్‌వీందర్‌ సింగ్‌, బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌,  బిహార్‌ సీఎం నితీష్‌ హాజరు
►తేజస్వీ యాదవ్‌, మెహబూబా ముఫ్తీ, ఏచూరి సీతారం, డీ రాజా, శరద్‌ పవార్‌,  ఫారుఖ్‌ అబ్ధుల్లా
► కమల్‌ హాసన్‌, శివరాజ్‌ కుమార్‌.
చదవండి: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. 8 మంది మంత్రులు వీళ్లే 

తొలి కేబినెట్ బేటీ: రాహుల్‌ గాంధీ
మరో రెండు గంటల్లో కర్ణాటక తొలి కేబినెట్‌ సమావేశం జరగనున్నట్లు రాహుల్‌ గాంధీ తెలిపారు. కర్ణాటక ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ మాట్లాడారు. ‘ప్రజలకు స్వచ్ఛమైన, అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తాం. ఎన్నికలకు ముందు మేం ఏం చెప్పామో అవే చేస్తాం. 5 వాగ్దానాలు చేశాం. ఈ కేబినేట్‌ భేటీలో ఈ 5 హామీలు చట్టంగా మారుతాయి’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement