Opposition unity
-
కళ్లముందు కూటమి కనిపిస్తున్నా.. కలిసుండేది కష్టమే..
బెంగళూరు: కాంగ్రెస్ కూటమి సమావేశానికి హాజరైన ప్రతిపక్షాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీది మరోవ్యూహం. బెంగాళ్లో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీతో ఫైట్ చేయడానికి దీదీకి జాతీయ స్థాయిలో ఒక కూటమి అవసరం. లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం తానే అని మమతా ప్రొజెక్టు చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యారు. దీదీకి పీఠంపై కన్ను.. బెంగాల్లో లోక్‌సభ సీట్లు క్లీన్ స్వీప్ చేస్తే తాను ప్రతిపక్షాల తరుపున ప్రధాని రేస్‌లో ఉంటానని మమత అనుకుంటున్నారు. ప్రస్తుతం బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడింది. కేవలం నాలుగైదు జిల్లాల్లోనే ఉన్న కాంగ్రెస్‌తో తనకు ప్రమాదం లేదని మమత భావిస్తోంది. అందుకే కాంగ్రెస్‌తో కూటమిలో చేరితే అటు ముస్లిం ఓట్లను సాధించడంతో పాటు లెఫ్ట్ పార్టీలను ఒంటరి చేయవచ్చనేది దీదీ ప్లాన్. పెద్దన్నది పెద్ద ప్లానే.. ఇక ఎవరి వ్యూహాలు వారికి ఉంటే కాంగ్రెస్ మాత్రం అందరికి మించిన ప్లాన్ వేసింది. కర్ణాటక గెలుపుతో వచ్చిన పాజిటివ్ వేవ్‌కు తోడుగా కూటమిని ఏర్పాటు చేస్తే బలం మరింత పెరుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. కూటమి ద్వారా తాము బీజేపీని ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నామని ప్రజలను నమ్మించడం కాంగ్రెస్ లక్ష్యం. అందుకే ఎవరితో ఎన్ని విభేధాలున్నా.. కాంగ్రెస్ ఇప్పుడు కూటమి కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కూటమితో మరోసారి జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టగలమని క్యాడర్‌కు ధైర్యం ఇస్తే .. రాబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పనికొస్తుందనేది కాంగ్రెస్ వ్యూహం. టార్గెట్ 2024 లోక్‌సభ ఎన్నికలని చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ అసలు లక్ష్యం మాత్రం 2023 డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే అని సుస్పష్టం. అందుకే కళ్లముందు కూటమి కనిపిస్తున్నా.. ఐక్యత అనేది అసాధ్యమని తేలిపోతోంది. -ఇస్మాయిల్, ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ -
విపక్షాల ఐక్యతకు కౌంటర్‌గా ఎన్డీయే బలప్రదర్శన!
సాక్షి, న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలకు దృష్టిలో ఉంచుకునే రాజకీయ పరిణామాలు శరవేగంగా.. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బీజేపీకి అధికారం దూరం చేసే క్రమంలో.. సాధ్యమైనంత వరకు ఐక్యంగా ఉండాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అవసరమైతే ఉమ్మడి ప్రధాని అభ్యర్థిని నిలపాలనే యోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈలోపే బీజేపీ మరో ప్లాన్‌తో ముందుకు వచ్చింది. విపక్ష కూటమి సమావేశం కంటే ముందే ఎన్డీయే కూటమి బలప్రదర్శన చేయాలని నిర్ణయించుకంది. ఈ మేరకు జులై 18వ తేదీన ఎన్డీయే విస్తృతస్థాయి సమావేశానికి సిద్ధమవుతున్న బీజేపీ.. మిత్రపక్షాలకు సమాచారం అందించింది. ఎన్డీయే పక్షాలనే కాదు.. ఏ కూటమికి చెందని కొన్ని పార్టీలకు సైతం ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో అకాలీదళ్, చిరాగ్ పాశ్వాన్ కూడా ఉన్నారు. మరోవైపు కర్ణాటకలో జేడీఎస్‌తోనూ పొత్తు కోసం యత్నిస్తున్న బీజేపీ.. ఆ పార్టీకి ఆహ్వానం పంపింది. ఇక తమిళనాడులో గత కొంతకాలంగా విబేధాలతో దూరంగా ఉంటూ వస్తున్న మిత్రపక్షం అన్నాడీఎంకేకు సైతం ఆహ్వానం పంపింది. పార్లమెంట్ సమావేశాలకు ముందరే జరగనున్న ఈ కీలక సమావేశం ద్వారా విపక్షాల ఐక్యతకు కౌంటర్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. మంత్రివర్గ విస్తరణపై సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఇవాళ(గురువారం) మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ భేటీ జరిగింది. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. నాలుగు గంటలకు పైగా సాగిన సమావేశంలో.. కేబినెట్ మార్పులు చేర్పులపైనే ప్రధానాంశంగా చర్చ జరిగింది. ఈ శని లేదంటే ఆదివారం మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల దృష్ట్యానే ఈ కేబినెట్ కూర్పు ఉండనున్నట్లు తెలుస్తోంది. -
విపక్షాల ఐక్యత చెడగొట్టడమే అతని పని
న్యూఢిల్లీ: జూన్ 23న బీహార్ వేదికగా జరిగిన విపక్షాల ఐక్య సమావేశం తరవాత నుండి కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా ఈ రెండు పార్టీల ప్రతినిధులు ఒకరిపై ఒకరు మాటలతో దాడి చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మార్కెట్ అంతా విద్వేషాలుంటే అందులో రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం తెరిచారని ఎద్దేవా చేస్తే.. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ విపక్షాల ఐక్యతను దెబ్బ తీయడమే అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యమని అన్నారు. ఢిల్లీ ఆర్దనెన్స్ కు వ్యతిరేకంగా బలాన్ని కూడగడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ మద్దతును కూడా కోరింది. కానీ కాంగ్రెస్ పార్టీ నుండి ఎటువంటి సానుకూల సంకేతాలు అందకపోవడంతో ఆ పార్టీ నేతలు మాటల యుద్ధానికి తెరతీశారు. ఈ సందర్బంగా ఆప్ నేత ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తరచుగా ప్రేమ గురించి మాట్లాడుతూ బీజేపీ ద్వేషాన్ని రెచ్చగొడుతోందని అంటున్నారు. మరి మొహబ్బత్ కి దుకాన్ పేరిట ప్రేమ దుకాణాన్ని తెరచిన ఆయన ఎవరు ఏమి కోరినా ప్రేమతో అంగీకరించాలి కదా? ఇప్పుడు అయన అధికారంలో లేరు కాబట్టి ఆయనలో ఇగో లేదు. రేపు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇగో వస్తే ఏమిటి పరిస్థితి? ఆయన సంయమనంతో వ్యవహరించి ప్రేమతత్వాన్ని చాటుకోవాలని అన్నారు. #WATCH | "I always see that Rahul Gandhi talks about love and says that BJP spreads hate. So if Rahul Gandhi is running 'Mohabbat ki Dukan' then whosoever will come to him can buy that love. When he said that his party spread love then he has to show this also. Right now he… pic.twitter.com/XTDmQtTsOP — ANI (@ANI) June 25, 2023 ఇక కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ మాత్రం ఆప్ నేతలపైనా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైనా తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. ఒకపక్క ఢిల్లీ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మా మద్దతు కోరతారు.. మరోపక్క మాపైనే విచక్షణారహితంగా విమర్శలు చేస్తారు. ఢిల్లీ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పంతం నెగ్గించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన 31 మంది రాజ్యసభ సభ్యుల మద్దతు తప్పనిసరి. మరి అలాంటప్పుడు కాళ్లబేరానికి వెళ్ళకుండా కయ్యానికి కాలు దువ్వుతుండడం ఆశ్చర్యకరమే మరి. ఈ రెండు నాలుకల ధోరణి వలన ఎవరికి ప్రయోజనం? నాకైతే ఒక్కటే ప్రయోజనం కనిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు బీజేపీ పక్కలో చేరారు. విపక్షాలు ఐక్యత చెడగొట్టడమే ప్రస్తుతం కేజ్రీవాల్ ముఖ్య లక్ష్యమని అన్నారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో భారీ వర్షాలు.. కరెంటు షాక్ కొట్టడంతో యువతి మృతి -
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్ధి అయితే మద్దతివ్వం
న్యూఢిల్లీ: ఇటీవల బీహార్‌లో జరిగిన విపక్షాల సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ఆర్డినెన్స్ పై స్పందించిన విధానం నచ్చక బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మరో షాక్ ఇచ్చారు. విపక్షాలు తమ నాయకుడిగా రాహుల్ గాంధీని ఎంచుకుంటే మాత్రం తాము మద్దతిచ్చేది లేదని తేల్చి చెప్పేశారు ఆప్ నేత ప్రియాంక కక్కర్. ట్విట్టర్ వేదికగా ప్రియాంక కక్కర్ స్పందిస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతివ్వకుంటే వారి నేతృత్వంలోని విపక్షాలతో మేము భాగస్వామ్యులము కాలేము. దేశం బాగుపడాలంటే మొదట కాంగ్రెస్ మరోసారి రాహుల్ గాంధీని నాయకుడిగా నిలబెట్టి విపక్షాలను కూడా అతడికి మద్దతివ్వమని అడగకూడదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇది రాజ్యాంగాన్ని పరిరక్షించడం కంటే కూడా చాలా ముఖ్యమైన విషయమని రాశారు. అనుకుందొక్కటి.. అయినదొక్కటి.. బీహార్ వేదికగా జరిగిన విపక్షాల సమావేశంలో ఢిల్లీలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతిస్తుందని కోటి ఆశలతో వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ కు దానిపై కూలంకషంగా చర్చించి గాని నిర్ణయం తీసుకోలేమని రాహుల్ చెప్పిన సమాధానం రుచించలేదు. సమావేశం అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడకుండా ఢిల్లీ పయనమైన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తమకు మద్దతివ్వకుంటే వారితో కలిసి ప్రయాణించడం కష్టమని సందేశం పంపించారు. ఈ సమావేశానికి ఆప్ తరపున ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్, ఎంపీ సంజయ్ సింగ్, రాఘవ్ చడ్డా కూడా హాజరయ్యారు. సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీని విభేధాలన్నిటినీ పక్కన పెట్టేసి కలిసి నడుద్దామని అభ్యర్ధించగా రాహుల్ మాత్రం ఆర్డినెన్స్ పై చర్చించడానికి ఒక పద్ధతుంటుందని తేలికగా చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీపై ఆప్ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆర్టికల్ 370 రద్దుకు మీరు మద్దతిచ్చినప్పుడు కూడా మేము ఇలాగే బాధపడ్డామని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. अगर देश बचाना है तो सबसे पहले कांग्रेस को बोल देना चाहिए की वो तीसरी बार भी Rahul Gandhi पर दाव नहीं लगायेंगे और समूचे विपक्ष पर ये दबाव नहीं डालेंगे। देश हित में ये संविधान बचाने से भी ऊपर है। — Priyanka Kakkar (@PKakkar_) June 24, 2023 ఇది కూడా చదవండి: మరో ప్రమాదం.. లూప్ లైన్లో ఉన్న రైలును ఢీకొన్న గూడ్స్ -
కాంగ్రెస్, ప్రతిపక్షాల బల ప్రదర్శనగా ‘సిద్ధూ’ ప్రమాణ స్వీకారం
సాక్షి, బెంగళూరు: కంఠీరవ స్టేడియం వేదికగా కర్ణాటక కేబినెట్ శనివారం ప్రమాణ స్వీకారం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. సిద్ధరామయ్యతో గవర్నర్ థావర్ చంద్ గేహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. వీరితోపాటు ఎనిమిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, ప్రతిపక్షాల బల ప్రదర్శనగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార వేదిక నిలిచింది. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు బీజేపీ వ్యతిరేక పక్షాలు హాజరయ్యాయి. దేశంలోని విపక్షాల నేతలందరూ కదిలొచ్చి తమ ఐక్యతను ప్రదర్శించారు.ఒక వేదికపై విపక్షాలన్నీ కలిసి రావడం 2014 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమానికి 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. విపక్షాల మద్దతుతో వచ్చే ఎన్నికల్లో కర్ణాటక రోల్ మోడల్‌గా గెలవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ సభతో 2024 సార్వత్రిక ఎన్నికలకు విపక్షాలతో కలిసి వస్తామని కాంగ్రెస్ సూచనప్రాయంగా బయటపెట్టింది. #WATCH | Opposition leaders display their show of unity at the swearing-in ceremony of the newly-elected Karnataka government, in Bengaluru. pic.twitter.com/H1pNMeoeEC — ANI (@ANI) May 20, 2023 హాజరైన ప్రముఖులు వీళ్లే.. ►తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్, హిమాచల్ ప్రదేశ్ సుఖ్వీందర్ సింగ్, బిహార్ సీఎం నితీష్ కుమార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బిహార్ సీఎం నితీష్ హాజరు ►తేజస్వీ యాదవ్, మెహబూబా ముఫ్తీ, ఏచూరి సీతారం, డీ రాజా, శరద్ పవార్, ఫారుఖ్ అబ్ధుల్లా ► కమల్ హాసన్, శివరాజ్ కుమార్. చదవండి: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. 8 మంది మంత్రులు వీళ్లే తొలి కేబినెట్ బేటీ: రాహుల్ గాంధీ మరో రెండు గంటల్లో కర్ణాటక తొలి కేబినెట్ సమావేశం జరగనున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. కర్ణాటక ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘ప్రజలకు స్వచ్ఛమైన, అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తాం. ఎన్నికలకు ముందు మేం ఏం చెప్పామో అవే చేస్తాం. 5 వాగ్దానాలు చేశాం. ఈ కేబినేట్ భేటీలో ఈ 5 హామీలు చట్టంగా మారుతాయి’ అని తెలిపారు. #WATCH | We made 5 promises to you. I had said we don't make false promises. We do what we say. In 1-2 hours, the first cabinet meeting of the Karnataka govt will happen and in that meeting these 5 promises will become law: Congress leader Rahul Gandhi pic.twitter.com/hhsancnayq — ANI (@ANI) May 20, 2023 -
కాంగ్రెస్‌కు మద్దతిస్తాం! కానీ..: మమతా బెనర్జీ
ఎన్నికల పోరులో ప్రతిపక్షాల ఐక్యత విషయమై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ నేత మమతా బెనర్జీ తొలిసారిగా తన వైఖరి ఏంటో ముందుగానే స్పష్టం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ఉన్న చోట తమ పార్టీ మద్దతు ఇస్తుందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట పోరాడనివ్వండి అని అన్నారు. అందుకు తమ మద్దతు ఇక్కడ ఇస్తామని చెప్పారు. కానీ అదేసమయంలో వారు కూడా ఇతర పార్టీలకు కూడా మద్దతు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ మద్దతు పొందాలంటే మొదటగా అది కూడా ఇతర పార్టీలకు మద్దతివ్వాల్సి ఉంటుందని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా ఆమె బలమైన ప్రాంతీయ పార్టీలకు తప్పక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఈమేరకు ఆమె బీజేపీని ఓడించేలా కొత్త వ్యూహ రచనను కూడా తెరపైకి తీసుకొచ్చారు. ప్రాంతీయ పార్టీలు అన్ని తమ కంచుకోటలో బీజేపీని ఎదుర్కోవాలి, కాంగ్రెస్ మాత్రం తన సొంత సీట్లను గెలవడంపై దృష్టి సారించాలన్నారు. ఆ తర్వాత విపక్షాలన్ని కలసి బలమైన పార్టీకే ప్రాధాన్యత(ఏ పార్టీ ఎక్కువ సీట్లు దక్కించుకుందో) ఇవ్వాలని అన్నారు. అలాగే ప్రాంతీయ పార్టీలకు కూడా కాంగ్రెస్ మద్దతివ్వాలని చెప్పారు. కేవలం తనకు కావల్సిన మద్దుతు తీసుకుని రోజు మాపైనే పోరాడుతూ ఉండటం అనేది సరైన పాలసీ కాదని చెప్పారు. కాగా, సీటు షేరింగ్ ఫార్ములా బలంగా ఉన్న ప్రాంతాల్లోని ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇస్తామని తృణమూల్ నాయకురాలు మమతా కూడా చెప్పకనే చెప్పారు. అంతేగాదు ఆమె కర్ణాటకలో కాంగ్రెస్‌కి పట్టం కట్టిన ప్రజలకు సెల్యూట్ చేశారు కూడా. (చదవండి: ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉత్తర్వును ఉల్లంఘించడంతో..ఐఏఎస్ అధికారికి నోటీసులు) -
విపక్షాల ఐక్యతా యత్నాలు
న్యూఢిల్లీ: 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాల ఐక్యతకు వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ గురువారం సీపీఎం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజాతో సమావేశమయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌తోనూ నితీశ్ కుమార్ భేటీ అయ్యారు. విపక్షాల ఐక్యత, తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది. అతిత్వరలో వివిధ పార్టీల అగ్రనేతలతో కీలక భేటీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. విపక్షాలు రాష్ట్రాల స్థాయిలో సీట్ల సర్దుబాటు చేసుకోవాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి అన్నారు. దేశంలో మూడో కూటమి సాధ్యమేనని ఉద్ఘాటించారు. అయితే, ఈ కూటమి ఎన్నికలు పూర్తయిన తర్వాత ఏర్పడే అవకాశం ఉందన్నారు. దేశాన్ని, దేశ ప్రజల జీవితాలను కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందేనని సీతారం ఏచూరి ట్వీట్ చేశారు. బీజేపీ అరాచక పాలనతో దేశ ప్రజలంతా విసుగెత్తిపోయారని డి.రాజా ట్విట్టర్లో పేర్కొన్నారు. -
'రాహుల్‌కు 19 రాజకీయ పార్టీల మద్దతు..దాని గురించి బాధ లేదు..'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నెల రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. జై భారత్ సత్యాగ్రహ పేరుతో మంగళవారం సాయంత్రం ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఇక నెల రోజుల పాటు కాంగ్రెస్ శ్రేణులు బ్లాక్, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనల్లో పాల్గొననున్నారు. రాహుల్ గాంధీకి మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. అయితే ఈ నిరసన కార్యక్రమం కేవలం రాహుల్ గాంధీ కోసమే కాదని, ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఢిల్లీలో 'సేవ్ డెమొక్రసీ' పేరుతో కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు మొదలవుతున్నట్లు చెప్పారు. అలాగే రాహుల్ గాంధీకి 19 రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినట్లు జైరాం వివరించారు. అనర్హత వేటు, బంగ్లా ఖాళీ చేయాలని ఇచ్చిన నోటీసులపై ఆయనకు ఎలాంటి బాధ లేదని చెప్పారు. ఉద్దవ్ బాలాసాహెబ్ థాక్రే సేన కూడా రాహుల్‌కు ఈ విషయంలో మద్దతుగానే ఉందని పేర్కొన్నారు. పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా ప్రకటించిన 24 గంటల్లోనే ఆయను ఎంపీ పదవి నుంచి తొలగించారని, ఆ తర్వాత ఆయన ప్రెస్‌మీట్ పెట్టిన 24 గంటల్లోనే ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని జైరాం గుర్తు చేశారు. లోక్‌సభ సెక్రెటేరియెట్ జెట్ స్పీడు చూసి తమకు ఆశ్చర్యం వేసిందని సెటైర్లు వేశారు. కానీ రాహుల్ గాంధీకి వీటి గురించి ఎలాంటి ఆందోళన లేదని వాళ్లకు తెలియదన్నారు. అలాగే సూరత్ కోర్టు తీర్పును రాహుల్ సవాల్ చేసే విషయంపైనా జైరాం రమేశ్ వివరణ ఇచ్చారు. ఎప్పుడు ఎక్కడ అప్పీల్ చేయాలో తమకు తెలుసునని, న్యాయ నిపుణులతో దీనిపై చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేసేందుకు రాహుల్‌కు 30 రోజుల వరకు గడువుంది. దేశంలో దొంగల ఇంటి పేరు మోదీనే అని ఎందుకు ఉందని 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే దీనిపై పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత 24 గంటల్లోనే రాహల్‌పై ఎంపీగా అనర్హత వేటు పడటం దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. చదవండి: రాహుల్ గాంధీకి మరో షాక్.. బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు.. -
అపూర్వమైన ప్రతిపక్ష ఐక్యతకు నాంది పలికింది: శశి థరూర్
సాక్షి, న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్షపడి, అనర్హత వేటు పడగానే ప్రతిపక్షాలన్ని ఏకతాటిపైకి వచ్చాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ అన్నారు. ఈ మేరకు శశి థరూర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఒకరంగా ఇది అపూర్వమైన ప్రతిపక్ష ఐక్యతకు నాంది పలికింది. వాస్తవానికి ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థిగా భావించే ప్రాంతీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉండటమే చూశాం మనం. కానీ నేడు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డాయి ఆయా పార్టీలు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్‌లోని మమతా బెనర్జీ, హైదరాబాద్‌లో చంద్రశేఖర్ తోసహా అందరూ రాహుల్‌కి మద్దతుగా నిలిచారు. గతంలో కాంగ్రెస్‌తో ఈ పార్టీలన్నీ ఏవిధంగానూ సంబంధం కలిగి లేవు. బీజేపీ చర్య అనాలోచిత పరిణామాల చట్టల పరిధిలో తొలిస్థానంలో ఉంది. ఆయా పార్టీ ముఖ్యమంత్రులందరూ రాహుల్ పేరు ప్రస్తావించకుండానే ఈ చర్యను ఖండించారు. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని ముక్త కంఠంతో వ్యాఖ్యానించారు. అంతేగాదు కాంగ్రెస్‌తో మాకు విభేదాలు ఉన్నాయి. కానీ రాహుల్ గాంధీని పరువు నష్టం కేసులో ఇరికించడం అనేది సరి కాదని అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అదీగాక పారపోయిన వ్యాపారవేత్తలు లలిత్ మోదీ, నీరవ్ మోదీ, ఇద్దరూ వెనకబడినవారు కానందున రాహుల్‌పై వచ్చిన అభియోగాలు అర్థరహితమైనవి. వారంతా తమ అక్రమ సంపాదనను విదేశాలకు తరలించి విలాసవంతంగా జీవిస్తున్నారు. వారిని వెనుకబడిన తరగతుల వారుగా చెబుతూ..ఓబీసీలపై దాడి అని వ్యాఖ్యనించి చెబుతున్న వారి ఇంగితజ్ఞానం విస్మయానికి గురి చేస్తోంది. అని ఘాటుగా విమర్శించారు. ఈ మేరకు థరూర్ కూడా రాహుల్‌పై కోర్టు విధించిన శిక్ష పట్ల అభ్యంతరం చెబుతూ..ఈ కేసు బలహీనంగా ఉంది. మాకు మంచి న్యాయవాదులు ఉన్నారు. ఫిర్యాదుదారుడికి బలహీనమైన కేసు ఇది అని అన్నారు. అలాగే కేసు పెట్టిన నాల్గవ మోదీ..పూర్ణేశ్ మోదీ తనను ఏ రకంగా టార్గెట్ చేశారని నిరూపించగలడు అని శశి థరూర్ అన్నారు. కాగా రాహుల్ గాంధీ తరుఫు న్యాయవాది కోర్టు కార్యకలాపాలు ఆది నుంచి లోపభూయిష్టంగా ఉన్నాయని అన్నారు. రాహుల్ తన ప్రసంగంలో మోదీని లక్ష్యంగా చేసుకున్నందున ఫిర్యాదుదారునిగా ప్రధాని మోదీ ఉండాలి కానీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ కాదని ఆయన వాదించారు. (చదవండి: ట్వీట్ దుమారంపై స్పందించిన ఖుష్బు! మరిన్ని తీయండి అంటూ కౌంటర్) -
సోనియాతో నితీశ్, లాలూ కీలక భేటీ..
సాక్షి,న్యూఢిల్లీ: బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌లు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఢిల్లీలో ఆదివారం సాయంత్రం ఈ భేటీ జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలన్నీ ఐక్యంగా వెళ్లాలని నితీశ్, లాలూ సోనియాను కోరినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన లాలూ యాదవ్.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరిగిన తర్వాత 2024 ఎన్నికలపై చర్చిస్తానని సోనియా హామీ ఇచ్చారని చెప్పారు. బీజేపీని ఈసారి గద్దెదించాలని, అందుకే నితీశ్‌తో కలిసి సోనియాను కలిసినట్లు పేర్కొన్నారు. దేశ పురోగతి కోసం విపక్షాలన్ని ఐక్యంగా ముందుకుసాగాల్సిన అవసరం ఉందని నితీశ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల తర్వాత ఈ విషయం మాట్లాడదామని సోనియా చెప్పారని వెల్లడించారు. గత నెలలో ఎన్డీఏతో తెగదెంపులు చేసుకోని ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి మహాఘట్బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్. ఆ తర్వాత ఆయన సోనియాతో భేటీ కావడం ఇదే తొలిసారి. చదవండి: రాజస్థాన్ సీఎం పదవికి అశోక్ గహ్లోత్ రాజీనామా! -
విపక్షాల ఐక్యత అంటే కాంగ్రెస్‌ను బలహీనం చేయడం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాల ఐక్యత అంటే కాంగ్రెస్‌ను బలహీనం చేయడం కాదన్నారు ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చే విషయంపై స్పందించారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఉద్దేశంలో విపక్ష పార్టీలన్నీ కలవడం అంటే కాంగ్రెస్‌ను బలహీనపర్చడం కాదని జైరాం రమేశ్ అన్నారు. బలమైన కాంగ్రెసే విపక్ష కూటమికి మూలస్తంభం అన్నారు. తమను ఇంకా బలహీనపర్చాలని చూస్తే అనుమతించే ప్రసక్తే లేదని, ఈ విషయాన్ని మిత్రపక్షాలు అర్థం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ తనను తాను పటిష్ఠం చేసుకోగలదని స్పష్టం చేశారు. ఏనుగు నిద్రలేచింది రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు వస్తున్న స్పందన చూసి బీజేపీ కంగుతింటోందని జైరాం రమేశ్ అన్నారు. ఇది ప్రధాని మన్ కీ బాత్లా కాదు ప్రజా సమస్యలను లేవనెత్తే యాత్ర అన్నారు. ఈ యాత్రతో ఏనుగు మేల్కొందని అందరికీ అర్థమయ్యిందని, ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగుతోందన్నారు. కాంగ్రెస్ ఏం చేస్తుందో అన్ని పార్టీలు చూస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకే భారత్ జోడో యాత్ర చేపడుతున్నట్లు జైరాం రమేశ్ స్పష్టం చేశారు. అయితే ఈ యాత్ర వల్ల విపక్షాల్లో ఐక్యత వచ్చినా స్వాగతిస్తామని చెప్పారు. చదవండి: కాంగ్రెస్ షేర్ చేసిన ఆర్ఎస్ఎస్ నిక్కర్ ఫోటోపై తీవ్ర దుమారం -
బీజేపీని ఓడిద్దాం రండి
పట్నా: కేంద్రంలో బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఒక్కటి కావాలని జనతాదళ్(యునైటెడ్) సీనియర్ నాయకుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. పార్టీలన్నీ తమ మధ్యనున్న విభేదాలను పక్కనపెట్టి, ప్రజా సంక్షేమం కోసం చేతులు కలపాలని అన్నారు. శనివారం బిహార్ రాజధాని పాట్నాలో జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశంలో నితీశ్ ప్రసంగించారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం పనిచేయాలన్నదే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. బీజేపీయేతర పార్టీలను ఉమ్మడి వేదికపైకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. విపక్షాలన్నీ కలిసి పోరాడితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కేవలం 50 సీట్లకే పరిమితం చేయొచ్చని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయాల్సిన బాధ్యతను నితీశ్‌కు అప్పగిస్తూ జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అలాగే కాషాయ పార్టీ పాలనలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే అసమ్మతి తెలియజేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని తీర్మానంలో ఉద్ఘాటించారు. అసమ్మతి తెలిపినవారిపై దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని విమర్శించారు. మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘‘మైనార్టీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సమాజంలో అసహనం, తీవ్రవాదం పెరిగిపోతున్నాయి. దళితులు, గిరిజనులు వేధింపులకు గురవుతున్నారు’’ అని జేడీ(యూ) ఆందోళన వ్యక్తం చేసింది. మోదీకి ప్రత్యామ్నాయం నితీశ్ జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నేతగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను తెరపైకి తీసుకొచ్చేందుకు బిహార్‌లో అధికార కూటమిలోని జేడీ(యూ) ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. పార్టీ జాతీయ కార్యవర్గ, జాతీయ మండలి సమావేశాలు శనివారం పాట్నాలో ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరుగున్న ఈ భేటీల్లో తొలిరోజు కీలక అంశాలపై చర్చించారు. నితీశ్‌ను ప్రధాని అభ్యర్థిగా అభివర్ణిస్తూ వేదిక వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘దేశ్ కా నేత కైసా హో.. నితీశ్ కుమార్ జైసా హో’ అంటూ జేడీ(యూ) కార్యకర్తలు నినదించారు. రేపటి నుంచి నితీశ్ ఢిల్లీ పర్యటన! 2024 ఎన్నికల్లో బీజేపీ ఢీకొట్టడానికి విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా నితీశ్ ఈ నెల 5 నుంచి మూడు రోజులపాటు ఢిల్లీలో పర్యటించే అవకాశముంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా విపక్ష నాయకులతో ఆయన భేటీ కానున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలాతోపాటు కమ్యూనిస్ట్ నేతలతోనూ ఆయన సమావేశమవుతారని జేడీ(యూ) వర్గాలు తెలిపాయి. బిహార్‌లో బీజేపీతో తెగతెంపుల తర్వాత నితీశ్‌కు ఇదే తొలి ఢిల్లీ పర్యటన. మణిపూర్‌లో జేడీ(యూ)కు షాక్ బీజేపీలోకి ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్ పట్నా/ఇంఫాల్: జేడీ(యూ)కు మణిపూర్‌లో పెద్ద షాక్ తగిలింది. ఆరుగురు ఎమ్మెల్యేలకు గాను, ఏకంగా ఐదుగురు శుక్రవారం అధికార బీజేపీలో చేరారు. వారి విలీనానికి స్పీకర్ ఆమోదం కూడా తెలిపారని అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. ఆ ఎమ్మెల్యేలకు సాదర స్వాగతం పలుకుతున్నట్టు ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎన్.శారదాదేవి సాదర పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో విందు కార్యక్రమంలో సదరు ఎమ్మెలోయేలతో వారు భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పట్ల ప్రజల విశ్వాసానికి, ప్రేమకు ఎమ్మెల్యేల చేరిక సూచిక అని బీరేన్‌సింగ్ ఫేస్బుక్లో పోస్టు చేశారు. 60 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీలో తాజా చేరికలతో బీజేపీ బలం 37కు పెరిగింది. ఎమ్మెల్యేలను కొనడమే పనా: నితీశ్ తాజా పరిణామాలపై జేడీ(యూ) నేత, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనేయడం రాజ్యాంగబద్ధమేనా అని బీజేపీని నిలదీశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకోవడమే పనిగా పెట్టుకుందని బీజేపీపై ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో అన్ని పార్టీలూ బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీలో చేరిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మణిపూర్ జేడీ(యూ) అధ్యక్షుడు కుశ్ బీరేన్ చెప్పారు. వారి తీరు రాజ్యాంగ ఉల్లంఘనే అన్నారు. -
యూపీలోనే విపక్షాలకు తొలి పరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓ ఉమ్మడి ఫ్రంట్‌గా ఏర్పడేందుకు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయా? ప్రతిపక్షాల ప్రయత్నాలకు తొలి పరీక్ష ఉత్తరప్రదేశ్ నుంచే ఎదురుకానుంది. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఏప్రిల్ నెలలో పది సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసేందుకు సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు తమ విభేదాలను విస్మరించి చేతులు కలుపుతాయా? ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు 31 మంది సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తుండగా, వారిలో తొమ్మిది మంది సభ్యత్వం ఏప్రిల్ రెండో తేదీతో ముగిసి పోతుంది. బీఎస్పీ చీఫ్ మాయావతి తన రాజ్యసభ సభ్యత్వానికి గత జూలై నెలలోనే రాజీనామా చేశారు. దీంతో మొత్తం పది సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. రిటైర్ అవుతున్న తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల్లో సమాజ్‌వాది పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు, నరేష్ అగర్వాల్, జయాబచ్చన్, కిరణ్మయ్ నందా, అలోక్ తివారీ, మునావర్ సలీం, దర్శన్ సింగ్ యాదవ్‌లు, బీజేపీ సభ్యుడు వినయ్ కటియార్, బీఎస్పీ సభ్యులు మొహమ్మద్ అలీ, కాంగ్రెస్‌కు చెందిన ప్రమోద్ తివారీలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 312 మంది సభ్యుల బలం కలిగిన బీజేపీ సులభంగా ఎనిమిది రాజ్యసభ సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. 47 మంది సభ్యులు కలిగిన సమాజ్‌వాది పార్టీ ఒక్క రాజ్యసభ సీటును గెలుచుకోగలదు. పదవ సీటును గెలుచుకోవాలంటే మూడూ పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేయాల్సిందే. ఈ విషయంలో మూడు పార్టీలు ఒక అవగాహనకు వస్తాయన్నది ప్రశ్న. తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి బీఎస్పీ ముందుకు వస్తే మంచిదని సమాజ్‌వాది పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మాయావతి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని బీఎస్పీ నాయకుడు సతీష్ శర్మ తెలిపారు. ఉమ్మడి అభ్యర్థి విషయంలో నిర్ణయం చొరవ తీసుకోవాల్సింది ఆ రెండు పార్టీలేనని అసెంబ్లీలో అంతగా బలంలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఏదిఏమైనా ఇప్పుడు ఓ అవగాహనకు వచ్చినట్లయితే గోరఖ్‌పూర్, ఫుల్పూర్ లోక్‌సభ స్థానాలకు జరుగనున్న ఉప ఎన్నికలకు, 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఏకమయ్యేందుకు దోహదపడుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. గతవారమే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ 17 పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి పార్లమెంట్ లోపల, బయట వివిధ సమస్యలపై పోరాటం జరిపేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకతాటిపైకి రావాలని చర్చించారు. ఈ సమావేశానికి కూడా బీఎస్పీ గైర్హాజరవడం పలు సందేహాలకు దారితీసింది. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఏకం కావాలంటే ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేయడం అవసరం. -
2019లో ప్రధాని మోదీకి సవాల్ తప్పదు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకుని రావడం ప్రస్తుతానికి కష్టమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అభిప్రాయపడ్డారు. అయినా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి సవాల్ తప్పదని అన్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబం లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని షీలా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం ఎంతో అవసరమని, పార్టీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలది తిరుగులేని నాయకత్వమని అన్నారు. గాంధీ కుటుంబం కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీని, దేశాన్ని పాలించిందని చెప్పారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజకీయాల్లో బాగా రాణిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు కొందరు ఇటీవల పార్టీని వీడి బీజేపీలో చేరడంపై ఆమె స్పందిస్తూ.. తాను ఎప్పటికీ బీజేపీలో చేరే ప్రసక్తే లేదని, మరో జన్మలోనూ సిద్ధాంతపరంగా తాము విభేదిస్తామని స్పష్టం చేశారు. మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఓ కూటమిగా ఏర్పడాలని షీలా దీక్షిత్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీల మధ్య అవగాహన కుదరాలని, కూటమి ఏర్పాటులో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరముందన్నారు. కాంగ్రెస్ పార్టీలో మోదీ స్థాయి గల నాయకుడు ఉన్నారా అన్న ప్రశ్నకు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అద్భుతంగా పనిచేశారని, సమయం వచ్చినపుడు మోదీని ఎదుర్కొనే నాయకుడిని ప్రకటిస్తామని షీలా చెప్పారు.