న్యూఢిల్లీ: ఇటీవల బీహార్లో జరిగిన విపక్షాల సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ఆర్డినెన్స్ పై స్పందించిన విధానం నచ్చక బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మరో షాక్ ఇచ్చారు. విపక్షాలు తమ నాయకుడిగా రాహుల్ గాంధీని ఎంచుకుంటే మాత్రం తాము మద్దతిచ్చేది లేదని తేల్చి చెప్పేశారు ఆప్ నేత ప్రియాంక కక్కర్.
ట్విట్టర్ వేదికగా ప్రియాంక కక్కర్ స్పందిస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతివ్వకుంటే వారి నేతృత్వంలోని విపక్షాలతో మేము భాగస్వామ్యులము కాలేము. దేశం బాగుపడాలంటే మొదట కాంగ్రెస్ మరోసారి రాహుల్ గాంధీని నాయకుడిగా నిలబెట్టి విపక్షాలను కూడా అతడికి మద్దతివ్వమని అడగకూడదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇది రాజ్యాంగాన్ని పరిరక్షించడం కంటే కూడా చాలా ముఖ్యమైన విషయమని రాశారు.
అనుకుందొక్కటి.. అయినదొక్కటి..
బీహార్ వేదికగా జరిగిన విపక్షాల సమావేశంలో ఢిల్లీలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతిస్తుందని కోటి ఆశలతో వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ కు దానిపై కూలంకషంగా చర్చించి గాని నిర్ణయం తీసుకోలేమని రాహుల్ చెప్పిన సమాధానం రుచించలేదు.
సమావేశం అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడకుండా ఢిల్లీ పయనమైన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తమకు మద్దతివ్వకుంటే వారితో కలిసి ప్రయాణించడం కష్టమని సందేశం పంపించారు.
ఈ సమావేశానికి ఆప్ తరపున ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్, ఎంపీ సంజయ్ సింగ్, రాఘవ్ చడ్డా కూడా హాజరయ్యారు. సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీని విభేధాలన్నిటినీ పక్కన పెట్టేసి కలిసి నడుద్దామని అభ్యర్ధించగా రాహుల్ మాత్రం ఆర్డినెన్స్ పై చర్చించడానికి ఒక పద్ధతుంటుందని తేలికగా చెప్పారు.
దీంతో కాంగ్రెస్ పార్టీపై ఆప్ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆర్టికల్ 370 రద్దుకు మీరు మద్దతిచ్చినప్పుడు కూడా మేము ఇలాగే బాధపడ్డామని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
अगर देश बचाना है तो सबसे पहले कांग्रेस को बोल देना चाहिए की वो तीसरी बार भी Rahul Gandhi पर दाव नहीं लगायेंगे और समूचे विपक्ष पर ये दबाव नहीं डालेंगे। देश हित में ये संविधान बचाने से भी ऊपर है।
— Priyanka Kakkar (@PKakkar_) June 24, 2023
ఇది కూడా చదవండి: మరో ప్రమాదం.. లూప్ లైన్‌లో ఉన్న రైలును ఢీకొన్న గూడ్స్
Comments
Please login to add a commentAdd a comment