
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం(BJP government) అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు(మంగళవారం)అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు. కాగ్ నివేదికను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. సమావేశం ప్రారంభంకాగానే ఆప్ ఎమ్మెల్యేల నినాదాలతో గందరగోళం నెలకొన్న దరిమిలా ప్రతిపక్ష నేత అతిషితో సహా 11 మంది ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా సస్పెండ్ చేశారు. అనంతరం ఆప్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ వెలుపల నిరసనకు దిగారు.
ఢిల్లీ అసెంబ్లీ బయట అతిషితో పాలు ఆప్ ఎమ్మెల్యేలు భగత్ సింగ్(Bhagat Singh) తదితరులు భీమ్‌రావ్ అంబేద్కర్ ఫోటోలను పట్టుకుని నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని భగత్ సింగ్, అంబేద్కర్ ఫోటోలను ఎందుకు తొలగించారని అతిషి ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీ నుంచి ఈ రోజంతా సస్పెండ్ అయిన ఆప్ ఎమ్మెల్యేలలో ఒకరైన సంజీవ్ ఝా మీడియాతో మాట్లాడుతూ ‘నిన్న సీఎం కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటో స్థానంలో ప్రధాని మోదీ ఫొటో పెట్టారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కంటే ప్రధాని మోదీ గొప్పవారా? అని తామంతా స్పీకర్‌ను అడగడంతో ఆయన తమను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. వారు (బీజేపీ) డాక్టర్ బిఆర్ అంబేద్కర్(BR Ambedkar)ను ద్వేషించడాన్నిదేశం దీనిని అంగీకరించదు’ అని అన్నారు. ఈరోజు సభ ప్రారంభం కాగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు పలు నినాదాలు చేసిన దరమిలా అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా వారిని శాంతంగా ఉండాలని కోరారు. అయితే ఆ ఎమ్మెల్యేలు నినాదాలు ఆపకపోవడంతో విజయేందర్ గుప్తా ఆప్ నేత అతిషితో సహా 11 మంది ఆప్ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు.
ఇది కూడా చదవండి: ‘ఆ గోధుమలతోనే జుట్టూడింది’
Comments
Please login to add a commentAdd a comment