
బెంగళూరు: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపింది. అభిమానులు ఇంకా ఈ వార్తను జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఇక పునీత్ కుటుంబ సభ్యుల ఆవేదనను వర్ణించడానికి మాటలు చాలడం లేదు. జిమ్ చేస్తూ గుండెపోటుకు గురై మృతి చెందారు పునీత్ రాజ్‌కుమార్.
కుటుంబ సభ్యుల్లో కొందరు.. ముఖ్యంగా కుమార్తె ధృతి విదేశాల్లో ఉండటం.. ఆమె ఇంకా భారత్ చేరుకోకపోవడంతో పునీత్ అంత్యక్రియలను ఆదివారానికి వాయిదా వేశారు. ఈ క్రమంలో అమెరికాలో ఉంటున్న పునీత్ కుమార్తె ధృతి శనివారం సాయంత్రం భారత్‌కు చేరుకున్నారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి సరాసరి కంఠీరవ స్టేడియానికి చేరుకున్న ధృతి.. తండ్రి పార్థీవదేహాన్ని చూసి కన్నీరుపెట్టుకుంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
(చదవండి: పోటెత్తిన అభిమానులు : శోకసంద్రమైన బెంగళూరు )
చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ, రానా దగ్గుబాటి, నరేశ్, శివబాలాజీ, ప్రభుదేవా తదితర సినీ ప్రముఖులు పునీత్ కుమార్‌కు నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చదవండి: Puneeth Rajkumar: ఆ ఇష్టమే రాజ్‌కుమార్‌కు కంటకంగా మారిందా?
Comments
Please login to add a commentAdd a comment