బాగేపల్లి(బెంగళూరు): బాగేపల్లి దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్. బి.నారాయణ స్వామి సమాధిని అధికారులు నిర్లక్ష్యంగా వదిలేయడంతో మట్టిలో కలిసిపోయేలా ఉంది. ఇటీవల ఎమ్మెల్యే సుబ్బారెడ్డి ఆదేశించినా కూడా పట్టించుకోలేదు. 1985లో అప్పటి సీఎం రామకృష్ణ హెగడె ప్రభావంతో రాష్ట్రంలో జనతాపార్టీ ధాటికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కనుచూపు మేరలో లేకుండా పోయారు. కానీ బి.నారాయణ స్వామి ఆ హవాను ఎదిరించి బాగేపల్లిలో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి గుండెపోటుతో కన్నుమూశారు. చిత్రావతి నది వంతెన పక్కన ఆయన అంత్యక్రియలు జరిపారు. ఇటీవల బాగేపల్లి మునిసిపాలిటీ అధికారులు డ్రైనేజీ కోసం తవ్వకాలు చేస్తుండగా ఆయన సమాది బయట పడింది. ఆయన స్మారకం ఇక్కడే నిర్మించాలని అధికారులకు ఎమ్మెల్యే ఎస్.ఎన్.సుబ్బారెడ్డి ఆదేశించినా పట్టించుకోకుండా సమాధిని మట్టిలో పూడ్చివేశారు.
చదవండి: Bengaluru Traffic Police: ట్రాఫిక్ పోలీసుల తీరు.. ఏపీ వాహనం ఆపాల్సిందే
Comments
Please login to add a commentAdd a comment