ఆ సమాధి ఏ కాలానిది?! | Archaeologists find an undisturbed Bronze Age tomb | Sakshi
Sakshi News home page

ఆ సమాధి ఏ కాలానిది?!

Published Wed, Sep 13 2017 2:01 PM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM

ఆ సమాధి ఏ కాలానిది?!

ఆ సమాధి ఏ కాలానిది?!

సాక్షి,  ఏథెన్స్‌ : మానవ జాతి వృద్ధి ఎక్కడ జరిగింది..? మనిషి ప్రయాణం ఎక్కడనుంచి ఎక్కడకు సాగింది? ప్రపంచంలో పురాతన నాగరికతలు ఏవి? మనిషి నేడు సాధించిన టెక్నాలజీకన్నా.. ఇనుప, కాంస్య యుగంలోవారే.. అధికంగా సాధించారా? ఇటువంటి ప్రశ్నలు మనిషిని అప్పుడప్పుడూ వేధిస్తుంటాయి.. అందుకు అనుగుణంగానే ప్రపంచంలో ఏదోమూల ఏదో ఒక వింత, విశేషం బయటపడుతూ ఉంటుంది.

గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌కు 100 కిలోమీటర్ల దూరంలో అత్యంత పురాతన మైనటొక సమాధి బయటపడింది. పురాతనం​ అనుకుంటే.. ఏదో సాదాసీదా కాదు.. సుమారు 3,500 ఏళ్ల నాటిది అని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. ఈ సమాధి కాంస్య యుగం నాటికి అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం​ చేస్తున్నారు.

ఏమా సమాధి? ఏమిటా కథ?
ఈ సమాధి ( చిన్నసైజు డబుల్‌బెడ్‌ రూం అంత ఉంటుంది) నాటి గ్రీస్‌లోని సంపన్నవర్గానికి చెం‍దినదిగా పురాతత్వ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సమాధిలో స్కెల్టెన్‌కు అత్యంత ఖరీదైన బంగారు ఆభరణాలు,  చేతులకు స్వర్ణ కంకణాలు, ఇతర విలువైన సామగ్రి అందులో లభించింది.

సమాధిలో..!

సమాధిలో చనిపోయిన వ్యక్తికి 40 నుంచి 50 ఏళ్లు ఉంటాయని, మిసీనియన్ నాగరికతకు చెందిన వ్యక్తిగా పురాతత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సమాధిలో ఆభరణాలతో పాటు మృణ్మయపాత్రలు, విల్లంబులు, పురాతన మద్యం, బాణసంచా ఉన్నాయి

సమాధి నిర్మాణం
సమాధి నిర్మాణం కూడా అత్యంత పటిష్టంగా నిర్మించారు. సమాధిని పగలగొట్టడానికి కూడా సాధ్యం కాకుండా.. పెద్దపెద్ద బండరాళ్లతో నాలుగువైపులా.. పైన నిర్మించారు. సమాధి 21 అడుగుల ఎత్తు ఉంటుంది. చుట్టూ బంకమట్టి, ఇతర పదర్థాలతో సిమెంట్‌లా ప్లాస్టింగ్‌ చేశారు.

ఈ సమాధి వల్ల కాంస్యయుగంలో ముఖ్యంగా గ్రీకు నాగరికత ఎలా విలసిల్లిందో తెలుసుకోవచ్చని ఆర్కియాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆనాటి సామాజిక, ఆర్థిక, జీవన విధానాన్ని అర్థం చేసుకోవచ్చని వారు చెబుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement