పురాతన ఆచారాలు, సంస్కృతులు కాస్త వింతగా ఉంటాయి. అందులోనూ తవ్వకాల ద్వారా బయటపడ్డవి అయితే ఓ పట్టాన అర్థం కావు. చాలా విస్తుపోయాలా ఉంటాయి ఆనాటి ఆచారాలు. అలాంటి విచిత్రమైన ఆవిష్కరణ పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో బయటపడింది. నాటికాలాలతో అంత్య క్రియలు ఇలాచేసేవారా..!అని నోరెళ్లబెడతారు..
టర్కిలోని థార్సా నగరంలో పురావస్తు శాస్త్రవేత్తలు రెండు వేల ఏళ్ల నాటి సమాధిని కనుగొన్నారు. ఇది అడయమాన్ శాన్‌ల్యర్ఫా హైవేపై కుయులు గ్రామానికి సమీపంలో ఉంది. అక్కడ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో అత్యంత విచిత్రమైన సమాధి బయటపడింది. రోమన్ కాలాం నాటిదిగా గురించారు. ఈ సమాధి నాటికాలంలోని చరిత్రపై కొత్త ఆశను అందిస్తోంది. నాటికాలంలో ఉండే పురాతన నాగరికత, శ్మశాన వాటికల గురించి ఒక అవగాహన ఏర్పడేందుకు ఈ సమాధి దోహదపడుతుంది.
థార్సా నగరంలోని నెక్రోపోలి ప్రాంతంలో 2024 నుంచి జరిపిన తవ్విన తవ్వకాల్లో ఈ సమాధి వెలుగులోకి వచ్చింది. ఇది ప్రముఖంగా ఎద్దుల తల బొమ్మలతో అలంకరించినట్లు ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఎద్దు తలల పరివేక్షణలో సమాధి ఉన్నట్లు అనిపిస్తుంది. దీన్ని చూస్తుంటే నాటి రోమన్ అంత్యక్రియలు, ఆచారాలు కాలక్రమేణ అభివృద్ధి చెందాయని తెలుస్తోంది. నేటి కాలంలో దహనం చేయడం వంటివి చేస్తున్నారు, కానీ క్రీస్తూ శకం రెండో శతాబ్దంలో అంత్యక్రియ ఆచారాలు వేరుగా ఉండేవని వెలుగులోకి వచ్చిన సమాధిని బట్టి తెలుస్తోందని చెప్పారు పురావస్తు శాస్త్రవేత్తలు. నాటికాలంలో మరణాంతరానికి సంబంధించిన ప్రబలమైన నమ్మకాలు బలంగా ఉండేవని ఈ సమాధి అలంకరణే అందుకు నిదర్శనమేనని అన్నారు.
(చదవండి: ఈ గ్రామం చాలా స్పెషల్!..కిచెన్ ఒక దేశంలో ఉంటే..బెడ్‌రూం ఏకంగా..)
Comments
Please login to add a commentAdd a comment