Roman
-
ఎద్దులు కాపలాకాస్తున్న సమాధి..ఏకంగా రెండువేల..!
పురాతన ఆచారాలు, సంస్కృతులు కాస్త వింతగా ఉంటాయి. అందులోనూ తవ్వకాల ద్వారా బయటపడ్డవి అయితే ఓ పట్టాన అర్థం కావు. చాలా విస్తుపోయాలా ఉంటాయి ఆనాటి ఆచారాలు. అలాంటి విచిత్రమైన ఆవిష్కరణ పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో బయటపడింది. నాటికాలాలతో అంత్య క్రియలు ఇలాచేసేవారా..!అని నోరెళ్లబెడతారు..టర్కిలోని థార్సా నగరంలో పురావస్తు శాస్త్రవేత్తలు రెండు వేల ఏళ్ల నాటి సమాధిని కనుగొన్నారు. ఇది అడయమాన్ శాన్‌ల్యర్ఫా హైవేపై కుయులు గ్రామానికి సమీపంలో ఉంది. అక్కడ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో అత్యంత విచిత్రమైన సమాధి బయటపడింది. రోమన్ కాలాం నాటిదిగా గురించారు. ఈ సమాధి నాటికాలంలోని చరిత్రపై కొత్త ఆశను అందిస్తోంది. నాటికాలంలో ఉండే పురాతన నాగరికత, శ్మశాన వాటికల గురించి ఒక అవగాహన ఏర్పడేందుకు ఈ సమాధి దోహదపడుతుంది. థార్సా నగరంలోని నెక్రోపోలి ప్రాంతంలో 2024 నుంచి జరిపిన తవ్విన తవ్వకాల్లో ఈ సమాధి వెలుగులోకి వచ్చింది. ఇది ప్రముఖంగా ఎద్దుల తల బొమ్మలతో అలంకరించినట్లు ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఎద్దు తలల పరివేక్షణలో సమాధి ఉన్నట్లు అనిపిస్తుంది. దీన్ని చూస్తుంటే నాటి రోమన్ అంత్యక్రియలు, ఆచారాలు కాలక్రమేణ అభివృద్ధి చెందాయని తెలుస్తోంది. నేటి కాలంలో దహనం చేయడం వంటివి చేస్తున్నారు, కానీ క్రీస్తూ శకం రెండో శతాబ్దంలో అంత్యక్రియ ఆచారాలు వేరుగా ఉండేవని వెలుగులోకి వచ్చిన సమాధిని బట్టి తెలుస్తోందని చెప్పారు పురావస్తు శాస్త్రవేత్తలు. నాటికాలంలో మరణాంతరానికి సంబంధించిన ప్రబలమైన నమ్మకాలు బలంగా ఉండేవని ఈ సమాధి అలంకరణే అందుకు నిదర్శనమేనని అన్నారు.(చదవండి: ఈ గ్రామం చాలా స్పెషల్!..కిచెన్ ఒక దేశంలో ఉంటే..బెడ్రూం ఏకంగా..) -
పార్కింగ్ స్థలంలో 1800 ఏళ్ల నాటి పురాతన విగ్రహం!
కొన్ని పురాతన వస్తువులు చాలా విచిత్రంగా బయటపడతాయి. పురావస్తు శాస్త్రవేత్తలకు చిక్కని కొన్ని మిస్టీరియస వస్తువులు సాధారన కూలీలకు లేదా భవన నిర్మాణ కార్మికులకు కనిపించి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. పాపం వారు అదేదో సాధారణ వస్తువుగా పరిగణిస్తారు. అదికారులకు చెంతకు చేరే వరకు అదేంటన్నది తెలియదు. అలాంటి విచిత్ర ఘటన యూకేలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఇంగ్లండ్‌లోని లింకన్ షైర్ కౌంటీలో ఉన్న 16వ శతాబ్దపు పురాతన భవనం బర్గ్లీ హౌస్ పార్కింగ్ స్థలంలో నిర్మాణ పనులు చేస్తుండగా పాలారాతి శిల్పం కనిపించింది. అదేదో రాయిగా భావించానని గ్రెగ్ క్రాలే అనే కార్మికుడు చెబుతున్నాడు. దాన్ని ఒక బకెట్లో పెడుతుండగా తిరగబడటంతో అది విగ్రహం తల అని అర్థమయ్యింది. దాన్ని అధికారుల వద్దకు తీసుకెళ్లి చూపగా అది పురాతన రోమన్ విగ్రహమని చెప్పడంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యానని అన్నాడు క్రాలే. చాలా ప్రత్యేకమైనది, పురాతనమైనదని తెలుసుకుని ఆశ్చర్యపోయినట్లు తెలిపాడు క్రాలే. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ విగ్రహం మెండెం భాగం కూడా లభించింది. ఆ తర్వాత తలను, మెండెంను దగ్గరకు చేర్చి అసలు రూపంలోకి మార్చారు నిపుణులు. ఇది మొదటి లేదా రెండో శతాబ్దానికి చెందిన పురాతన విగ్రహ అవశేషాలుగా చెబుతున్నారు. ఈ విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్ధే ప్రక్రియలో నిమగ్నమయ్యారు అధికారులు. ఇలాంటి పురాతన ప్రతిమలను ఇటలీలో గ్రాండ్ టూర్ అని పిలిచే కులీనులే తయారు చేస్తారని, ఆ ప్రతిమ చెక్కిన తీరులో అది కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు దీన్ని 9వ ఎర్ల్ తన గ్రాండ్ టూర్ ఆఫ్ ఇటలీ పర్యటన నేపథ్యంలో ఈ శిల్పాన్ని బర్గ్లీకి తీసుకువచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. (చదవండి: వందేళ్ల క్రితం కరెంట్ లేకుండా పనిచేసిన ఫ్రిడ్జ్) -
ఇషా అంబానీ పార్టీలో స్టార్స్ హంగామా (ఫోటోలు)
-
మనిషి మొదటి శాలరీ ఉప్పు?
ఉద్యోగం చేసే వ్యక్తి జీవితంలో శాలరీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఉద్యోగులు ప్రతినెలా తమ శాలరీ కోసం ఎదురుచూస్తుంటారు. అయితే ఈ శాలరీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఒకానొక కాలంలో శాలరీ పేరుతో ఉప్పును ఇచ్చేవారనే సంగతి మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పురాతన రోమ్‌లో డబ్బుకు బదులుగా ఉప్పును ఉపయోగించేవారు. ఆ సమయంలో రోమన్ సామ్రాజ్యంలో పనిచేసే సైనికులకు వారి పనికి ప్రతిఫలంగా ఉప్పును ఇచ్చేవారు. ‘ఉప్పు ఋణం’ లాంటి సామెతలు ఆ కాలం నుంచే ఉద్భవించాయని చెబుతుంటారు. ప్రముఖ మీడియా సంస్థ అందించిన ఒక నివేదిక ప్రకారం రోమన్ చరిత్రకారుడు ప్లినీ ది ఎల్డర్ తన ‘నేచురల్ హిస్టరీ’ పుస్తకంలో.. రోమ్‌లో సైనికులకు ఉప్పు రూపంలో శాలరీ ఇచ్చేవారని పేర్కొన్నారు. శాలరీ అనే పదం ఉప్పు నుండి వచ్చిందని దానిలో తెలిపారు. సోల్జర్ అనే పదం లాటిన్ పదం 'సల్ డేర్' నుండి ఉద్భవించిందని, దీని అర్థం ‘ఉప్పు ఇవ్వడం’ అని పలు నివేదికలు పేర్కొన్నాయి. రోమన్లో ఉప్పును సలారియం అంటారు. దీని నుండి శాలరీ అనే పదం ఉద్భవించింది. 10,000 బీసీ, 6,000 బీసీ మధ్య మొదటిసారి శాలరీ ఇచ్చారని ఫ్రెంచ్ చరిత్రకారులు భావిస్తున్నారు. పురాతన రోమ్‌లో పనికి బదులుగా బదులుగా ఉప్పు ఇచ్చేవారు. ఆ సమయంలో రోమన్ సామ్రాజ్యంలోని సైనికులకు శాలరీగా వారి చేతినిండా ఉప్పు ఇచ్చేవారు. అప్పట్లో ఉప్పు వ్యాపారం కూడా బాగా జరిగేది. -
1700 ఏళ్ల నాటి పురాతన గుడ్డు..ఇప్పటికీ లోపల పచ్చసొన..!
పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలతో నాటి కాలంలో వాడే పనిముట్లు, వారు ఉపయోగించిన టెక్నాలజీ తదితరాలను వెలికితీస్తుంటారు. నాటి పూర్వీకుల వైభవం కళ్లముందుకు తీసుకురావడమే గాక తెలియని ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తుంటారు. అలాంటి ఒక అద్భుతమైన ఆవిష్కరణను తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించి వెలుగులోకి తీసుకొచ్చారు. మాములుగా ఏ గుడ్డు అయినా సాధారణంగా కొన్ని రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఆ తర్వాత కుళ్లిపోడవం లేదా పాడైపోవడం జరుగుతుంది. కానీ పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించిన అద్భుత ఆవిష్కరణ అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఇంతకీ అదేంటంటే..? వివరాల్లోకెళ్తే..శాస్తవేత్తలు.2007-2016 నుంచి జరుపుతున్న ఐలెస్బరీ త్రవ్వకాల్లో ఏకంగా 17 వందల ఏళ్ల నాటి పురాతన రోమన్ గుడ్డుని గుర్తించి వెలికితీశారు. తవ్వకాలు జరిపిన ప్రదేశాల్లో మరో మూడు గుడ్లు ఉన్నప్పటికీ అవి బయటకీ తీసే క్రమంలో పగిలి దుర్గంధం వెదజల్లింది. అయితే ఈ గుడ్డుని శాస్త్రవేత్తలు జాగ్రత్తగా వెలికితీశారు. నీటితో నిండి ఉన్న గొయ్యి నుంచి వీటిని బయటకు తీయడం జరిగింది. ఇది నాటి రోమన్ల వైభవాన్ని గుర్తు చేస్తోంది. ఇక మైక్రో స్కాన్లతో ఆ గుడ్డుని పరీక్షించగా దానిలో పచ్చసొన, తెల్లసొనతో చెక్కు చెదరకుండా ఉన్నట్లు చూపించాయి. అన్ని వేల ఏళ్ల నుంచి చెక్కు చెదరకుండా ఉండటం అందర్నీ చాలా ఆశ్చపర్చింది. నాటి రోమన్లు వాడే సాంకేతికత శాస్త్రవేత్తల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఈ మేరకు ఆక్స్ఫర్డ్ ఆర్కియాలజీ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎడ్వర్డ్ బిడ్డుల్ఫ్ మాట్లాడుతూ..అక్కడ తవ్వకాల్లో బయటపడిన వాటిని చూసి తాము ఒక్కసారిగా షాకయ్యామని, ఊహించని వాటిని కనుగొనడమే కాకుండా చెక్కుచెదరకుండా ఉండటం మమల్ని మరింత ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ప్రంపచంలోనే వేల ఏళ్ల నాటి నుంచి చెక్కుచెదరకుండా ఉన్న తొలి కోడిగుడ్డు ఇదే అన్నారు. నిజానికి ఆ గుడ్డు లోపల ద్రవాలు ఉండవని అనుకున్నాం. అయితే స్కాన్‌లో పచ్చసొన, అల్బుమెన్ వంటివి కనిపించడం నిజంగా అద్భుతం అనిపించింది. దీన్ని తాము లండన్‌లో ఉన్న నేచురల్ హిస్టరీ మ్యూజియమ్‌కు తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. అలాగే ఆ గుడ్డుని సంరక్షించే పద్ధతుల గురించి ఆ మ్యూజియంలో ఉండే పక్షుల సంరక్షకులను సంప్రదించినట్లు పేర్కొన్నారు. (చదవండి: అతిపెద్ద ఉప్పు సరస్సు గుండా వెళ్తున్న రైలు..వీడియో వైరల్) -
రెండువేల ఏళ్ల క్రితమే ఇంత అద్భుత ఆభరణమా!
రోమన్ సామ్రాజ్యం గురించి కథలు కథలుగా విన్నాం. అలాగే ఓ సామెత కూడా చెబుతుంటారు రోమ్ నగరం ఒక్కరోజులో నిర్మించలేదని అంటుంటారు. ఒకప్పుడూ రోమ్ నగరం చాలా బావుండేదని, అప్పట్లోనే ఎన్న కళాఖండాలకు, నైపుణ్యాలకు పెట్టింది పేరుగా ఉండేది. ఆ కాలం నాటి ఓ అద్భుతమైన ఆభరణం వెలుగులోకి వచ్చింది. అది ఓ రోమన్ సమాధి నుంచి బయటపడింది. ఆ ఆభరణం క్రీస్తూ శకం ఒకటో శతాబ్దపు కాలాంలోనిదిగా నిపుణులు అంచనా వేశారు. ఆ ఆభరణాన్ని కార్విలయోస్ రింగ్ అని అంటారని చెబుతున్నారు. మాట్రాన్ ఎబుటియా క్వార్టా అనే రోమన్ మహిళ తన కొడుకు కార్విలయస్ జ్ఞాపకార్థం అతడి ముఖ చిత్రం కనిపించేలా తయారు చేయించుకుందని నిపుణులు చెబుతున్నారు. ఆ ఉంగరాన్ని నిశితంగా పరిశీలిస్తే.. రాక్ క్రిస్టల్స్ కింద చనిపోయిన ఆమె కొడుకు ముఖ చిత్రం ఉంది. దీన్ని చూస్తే అప్పట్లోనే ఎంత గొప్ప నైపుణ్యం ఉందని ఆశ్చర్యపోక మానరు. ఈ ఉంగరం హోలోగ్రాఫిక్ ప్రభావాన్నిచూపిస్తోంది. అలాగే నాటి కాలంలోని ఓ గొప్ప మొజాయిక్ ఫ్లోర్ ఇటలీలో బయటపడింది. ఆ కళఖండాన్ని నాటి కళాకారులు ఎంత అద్భుతం తీర్చిదిద్దారో దాన్ని చూస్తేనే అవగతమవుతుంది. ఇది నాటి రోమన్ సామ్రాజ్యంలోనిదేనని, కీస్తూ శకం 4వ లేదా 5వ శతాబ్దం నాటిదని చెబుతున్నారు. రోమన్ సామ్రాజ్యం ఓ వెలుగు వెలుగుతున్నప్పుడూ ఈ అసాధారణ కళాత్మక నైపుణ్యాలు కోకొల్లలుగా ఉండేవని చెబుతున్నారు. Carvilio's Ring is a unique 1st-century AD artifact recovered from Roman tomb. Commissioned by a matron Aebutia Quarta in memory of her son Carvilius the ring features a gold likeness of the deceased beneath a rock crystal lens creating a holographic effect. pic.twitter.com/ZyKjghpHw1 — ThePhotino (@the_photino) June 9, 2023 The Roman mosaic floor located in Montorio, Verona, Italy, is a remarkable archaeological discovery that dates back to the 4th and 5th centuries AD. This intricate mosaic artwork showcases the extraordinary craftsmanship and artistic excellence of the Roman Empire during its… pic.twitter.com/t6ljf1hRny — Historic Vids (@historyinmemes) July 5, 2023 -
అత్యంత అందమైన టాప్ 10 రోమన్ యాంఫీథియేటర్స్
-
తవ్వకాల్లో భారీగా బంగారు నాణేలు
ఉత్తర ఇటలీలోని ఓ పాత థియేటర్ తవ్వకాల్లో బంగారు నాణేల నిధిని శాస్త్రవేత్తలు గుర్తించారు. పురాతత్వ శాస్త్రవేత్తల అధ్యయనంలో నేలమాళిగలో భద్రపర్చిన వందల కొద్దీ నాణేలను వారు కొనుగొన్నారు. మిలియన్ డాలర్ల విలువైన రోమన్ బంగారు నాణేలు కనిపించడం విశేషం. ఇటలీలోని ఓ ప్రాంతంలో పునాది పనులు చేస్తుండగా వందల సంఖ్యలో రోమన్ బంగారు నాణేలు లభించినట్లు ఇటలీ సాంస్కృతిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. స్విట్జర్లాండ్ సరిహద్దులో ఉత్తర ఇటలీలోని కోమోలోని కాస్సోనీ థియేటర్ బేస్మెంట్ తవ్వకాల్లో 4, 5 వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్య కాలంనాటి 300 నాణేలను తవ్వి తీసామని అధ్యయన వేత్తలు తెలిపారు. క్వింగ్ రాజవంశానికి చెందిన రాతి కూజాలో బంగారు పట్టీతోపాటు, 19 మిలియన్‌డార్ల విలువైన నాణేలుణ్నాయని పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించారు. చారిత్రాత్మక, సాంస్కృతిక ప్రాముఖ్యత వివరాలు సంపూర్ణంగా తెలియనప్పటికీ, పురాతత్వ శాస్త్రానికి నిజమైన నిధిని గుర్తించామని సంస్కృతి మంత్రి అల్బెర్టో బోన్సిసోలీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా మంత్రిత్వ శాఖ ఫేస్బుక్లో అప్లోడ్ చేసింది. మిలన్లోని మిబాక్ రిస్టోరేషన్ ప్రయోగశాలకు బదిలీచేసామని వీటి చారిత్రక ప్రాముఖ్యత తెలుసుకోవాల్సి వుందన్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు, పునరుద్ధరణకర్తలు వాటిని పరిశీలిస్తున్నారని తెలిపారు. వీటిని విలువను అధికారులు స్పష్టం చేయనప్పటికీ, మిలియ న్డాలర్ల విలువ వుంటుందని అంచనా. ఏదో ప్రమాద సమయంలో వీటిని దాచిపెట్టి వుంటారని నాణేల నిపుణులు మారియా గ్రాజియా ఫెచీనిటి తెలిపారు. ఈ నాణేలపై 474 ఏడీ నాటి చక్రవర్తులు హోనోరియాస్, వాలెంటినియమ్ III, లియోన్ I, ఆంటోనియో, లిబియో సెవెరోల గురించి రాసివున్నట్టు ఆమె తెలిపారు. ప్రస్తుతం బ్యాంకులలో అమర్చేవిధంగానే వీటిని పొందుపర్చినట్టు చెప్పారు. అలాగే ఇది వ్యక్తిగత సంపద కాకపోవచ్చు అని, పబ్లిక్ బ్యాంకువి లేదా డిపాజిట్లు కావచ్చు అని అభిప్రాయపడ్డారు. -
బికినీకి 70 ఏళ్ళు!
ప్రపంచ అతిచిన్న బాతింగ్ సూట్ గా ప్రకటనల్లో ప్రసిద్ధి చెంది, ఫిలిప్పీన్స్, బాలి, హవాలి, గోవా వంటి ఎన్నో దేశాల్లో రంగు రంగులతో ఆకట్టుకున్న బికినీల వెనుక.. పెద్ద చరిత్రే ఉంది. బికినీలు రూపొందిన తర్వాత మొదట్టో ఎన్నో అభ్యంతరాలు వెల్లువెత్తినా... అనంతరం ఈతకోసం స్త్రీలు ధరించే ప్రత్యేక దుస్తులుగా గుర్తింపు పొంది, ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకట్టుకున్నాయి. అతి కురుచ దుస్తులైన బికినీల వెనుక అభ్యంతరాలు కోకొల్లలైనా... ప్రాచుర్యంలోకి వచ్చి 70 ఏళ్ళు పూర్తి చేసుకున్నాయి. భారతదేశంలో సాధారణ ప్రజలు బికినీలను ధరించడం అరుదుగా కనిపించినా.. బాలీవుడ్ సినిమాల్లో తారలు తమ అందాలను ఆరబోసేందుకు బికినీలను ధరించడం దశాబ్దాల క్రితమే కనిపిస్తుంది. సముద్ర తీరాల్లోనూ, స్విమ్మింగ్ పూల్స్ లోనూ ఈతకోసం స్త్రీలు ధరించే ఈ ప్రత్యేక దుస్తులైన బికినీలు శరీరభాగాలను బహిర్గతం చేస్తున్నాయన్న కారణంతో చాలా దేశాల్లో ఈ దుస్తులపై నిషేధం కూడా విధించారు. టూ పీస్ డ్రెస్ అంటూ మొట్టమొదటిసారి ఈ దుస్తులను ఫ్రాన్స్ దేశస్థుడు లూయిజ్ రియర్డ్ రూపొందించగా..బెర్నార్గీ అనే ఫ్రెంచ్ మోడల్ ధరించి జూలై 5, 1946 లో జరిగిన ప్యారిస్ ఫ్యాషన్ షోలో ప్రదర్శించి ప్రపంచ ప్రజలను ఆకట్టుకుంది. సంప్రదాయాలకు పెద్ద పీట వేసే భారతదేశంలో సాధారణ ప్రజలు బికినీలకు వ్యతిరేకమైనా.. తారల అందచందాలను ఒలకబోసేందుకు సినీరంగం ఈ దుస్తులను బాగానే ఆదరించింది. బాలీవుడ్ తార మీనాక్షీ శిరోద్కర్ ఓ మరాఠీ సినిమాలో సింగిల్ స్విమ్ సూట్ లో కనిపించి, చరిత్రను తిరగరాసింది. అనంతరం యాన్ ఈవెనింగ్ ఇన్ ప్యారిస్ సినిమాలో షర్మిలా ఠాగూర్, బాబీ సినిమాలో డింపుల్ కపాడియా.. స్విమ్ సూట్ (బికినీ) లో కనిపించగా... తర్వాత ఎందరో నటీమణులు ఆ సంప్రదాయాన్ని ధైర్యంగా కొనసాగించారు. అలాగే తెలుగు సినిమాల్లోనూ నాటితరం నుంచి నేటివరకూ బికినీ భామలు హొయలొలికిస్తూనే ఉన్నారు. రోమన్ చిత్ర పటాల్లోని బికినీలను పోలిన దుస్తులను చూస్తే ఎన్నో వేల ఏళ్ళ క్రితమే స్త్రీలు బికినీలు ధరించినట్లు తెలుస్తుంది. 1700 సంవత్పరాల క్రితం ఛాంబర్ ఆఫ్ టెన్ మెయిడెన్స్ అనే రోమన్ మొజాయిక్ చరిత్రను చూస్తే.. క్రీడాకారిణులు బికినీలు ధరించినట్లు కనిపిస్తుంది. అనంతరం అనేక రకాల ఆధునిక బికినీలు ప్రపంచానికి పరిచయమయ్యాయి. బీచ్ లాంజెర్ లో రిలాక్స్ అయ్యేందుకు మొట్టమొదటి సౌరశక్తి బికినీ 'ఐకిని' ని డిజైనర్ ఆండ్రూ స్కూనైడర్ రూపొందించారు. 1951 లో జరిగిన ప్రిమియర్ మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన స్వీడన్ కు చెందిన కికి హాకన్ సన్ బికినీని ధరించి టైటిల్ గెలుచుకొంది. అయితే అనంతరం బ్యూటీ పేజెంట్లలో ప్రపంచవ్యాప్తంగా బికినీలపై నిషేధం విధించడంతో.. బికినీ ధరించి మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న మొట్టమొదటి, చివరి మహిళగా ఆమె మిగిలిపోయింది. అలాగే 30 మిలియన్ డాలర్ల అతి ఖరీదైన బికినీని డైమండ్స్ తో సుసాన్ రోజెన్ రూపొందించారు. స్టార్ వార్స్ 6వ ఎపిసోడ్ లో ప్రిన్సెస్ లీయా డోన్డ్ సైతం మెటాలిక్ బికినీ ధరించి కనిపిస్తుంది. 90వ శకంలో ఇంటర్నేషనల్ వాలీబాల్ ఫెడరేషన్ బీచ్ వాలీబాల్ పోటీలకు 'శాండ్ రిలీజ్ సిస్టమ్' కలిగిన బికినీని మహిళల యూనిఫాంగా అనుమతించింది. జంతు హింసను నిరోధించి జనం శాకాహారులుగా మారాలంటూ చేసిన ప్రచారానికి సైతం మహిళలు.. ముఖ్యంగా ఆకులు అలములతో రూపొందించిన బికినీలు ధరించినట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది.