పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలతో నాటి కాలంలో వాడే పనిముట్లు, వారు ఉపయోగించిన టెక్నాలజీ తదితరాలను వెలికితీస్తుంటారు. నాటి పూర్వీకుల వైభవం కళ్లముందుకు తీసుకురావడమే గాక తెలియని ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తుంటారు. అలాంటి ఒక అద్భుతమైన ఆవిష్కరణను తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించి వెలుగులోకి తీసుకొచ్చారు. మాములుగా ఏ గుడ్డు అయినా సాధారణంగా కొన్ని రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఆ తర్వాత కుళ్లిపోడవం లేదా పాడైపోవడం జరుగుతుంది. కానీ పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించిన అద్భుత ఆవిష్కరణ అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఇంతకీ అదేంటంటే..?
వివరాల్లోకెళ్‌తే..శాస్తవేత్తలు.2007-2016 నుంచి జరుపుతున్న ఐలెస్‌బరీ త్రవ్వకాల్లో ఏకంగా 17 వందల ఏళ్ల నాటి పురాతన రోమన్ గుడ్డుని గుర్తించి వెలికితీశారు. తవ్వకాలు జరిపిన ప్రదేశాల్లో మరో మూడు గుడ్లు ఉన్నప్పటికీ అవి బయటకీ తీసే క్రమంలో పగిలి దుర్గంధం వెదజల్లింది. అయితే ఈ గుడ్డుని శాస్త్రవేత్తలు జాగ్రత్తగా వెలికితీశారు. నీటితో నిండి ఉన్న గొయ్యి నుంచి వీటిని బయటకు తీయడం జరిగింది. ఇది నాటి రోమన్‌ల వైభవాన్ని గుర్తు చేస్తోంది.
ఇక మైక్రో స్కాన్‌లతో ఆ గుడ్డుని పరీక్షించగా దానిలో పచ్చసొన, తెల్లసొనతో చెక్కు చెదరకుండా ఉన్నట్లు చూపించాయి. అన్ని వేల ఏళ్ల నుంచి చెక్కు చెదరకుండా ఉండటం అందర్నీ చాలా ఆశ్చపర్చింది. నాటి రోమన్లు వాడే సాంకేతికత శాస్త్రవేత్తల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఈ మేరకు ఆక్స్‌ఫర్డ్ ఆర్కియాలజీ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎడ్వర్డ్ బిడ్డుల్ఫ్ మాట్లాడుతూ..అక్కడ తవ్వకాల్లో బయటపడిన వాటిని చూసి తాము ఒక్కసారిగా షాకయ్యామని, ఊహించని వాటిని కనుగొనడమే కాకుండా చెక్కుచెదరకుండా ఉండటం మమల్ని మరింత ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ప్రంపచంలోనే వేల ఏళ్ల నాటి నుంచి చెక్కుచెదరకుండా ఉన్న తొలి కోడిగుడ్డు ఇదే అన్నారు.
నిజానికి ఆ గుడ్డు లోపల ద్రవాలు ఉండవని అనుకున్నాం. అయితే స్కాన్‌లో పచ్చసొన, అల్బుమెన్ వంటివి కనిపించడం నిజంగా అద్భుతం అనిపించింది. దీన్ని తాము లండన్‌లో ఉన్న నేచురల్ హిస్టరీ మ్యూజియమ్‌కు తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. అలాగే ఆ గుడ్డుని సంరక్షించే పద్ధతుల గురించి ఆ మ్యూజియంలో ఉండే పక్షుల సంరక్షకులను సంప్రదించినట్లు పేర్కొన్నారు.
(చదవండి: అతిపెద్ద ఉప్పు సరస్సు గుండా వెళ్తున్న రైలు..వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment