పచ్చసొన పారేస్తున్నారా? చాలామంది గుడ్డులోని తెల్లసొన మాత్రం తిని పచ్చసొన వదిలేస్తుంటారు. ఎందుకంటే పచ్చసొన మంచిది కాదేమోనని కొందరి అనుమానం. నిజానికి పచ్చసొన మీకు ఎటువంటి హానీ కలిగించదు. పైగా గుడ్డులోని తెల్లటి భాగాన్ని మాత్రమే తినడం వల్ల పచ్చసొనలో ఉండే ఎ, బి. ఇ. కె. విటమిన్లని పొందలేరు. పచ్చసొన తినకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం
పోషకాల లోపం గుడ్డులోని పచ్చసొనలో కోలిన్ అనే పోషకం ఉంటుంది. ఇది చికెన్, చేపలు, బంగాళదుంపలు, బియ్యం వంటి వాటిలో కనిపిస్తుంది. పూర్తిగా ఉడికించిన గుడ్డులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే పచ్చసొనలో ఐరన్, జింక్ ఉంటాయి. మీరు దీనిని తినకపోతే ఈ పోషకాలు కోల్పోతారు.
రోగనిరోధక శక్తి కోల్పోవడం:
గుడ్లలో ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ మినరల్స్, అమినో యాసిడ్స్, విటమిన్ డి, బి12 ఉంటాయి. అనేక అధ్యయనాల ప్రకారం గుడ్లు తినడం వల్ల శక్తి పెరుగుతుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. కళ్లను సురక్షితంగా ఉంచడమే కాకుండా చర్మం, జుట్టుకి కూడా మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉన్న చాలామంది వ్యక్తులు గుడ్డులోని పసుపు భాగాన్ని తినకుండా వదిలేస్తారు.
ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో డైటరీ కొలెస్ట్రాల్ ఉంటుంది. దాదాపు ఒక గుడ్డులో 187 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే ఇది ఎప్పుడూ తీసుకునే మటన్ , ఐస్ క్రీం వంటి ఆహార పదార్థాలతో పోలిస్తే తక్కువే. ఇలాంటి పరిస్థితులలో గుడ్డులోని పసుపుభాగం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి.. ప్రకృతి మనకు గుడ్డులో తెల్లసొన, పచ్చసొన కలిపే ఇచ్చింది. అంటే కలిపే తినమని అర్థం. కాబట్టి అది మంచిది కాదేమోననే అనుమానంతో దానిని వేరు చేయాల్సిన అవసరం లేదు.
(చదవండి: బరువు తగ్గడం..అంత బరువేం కాదు!)
Comments
Please login to add a commentAdd a comment