ఫారం కోడిగుడ్ల కంటే నాటు కోడి గుడ్లలో చాలా బలం ఉంటుందని చాలామందిలో ఓ దురభిప్రాయం ఉంటుంది. అది కేవలం అపోహ మాత్రమే. అందుకే తెల్లగా ఉండే ఫారం కోడిగుడ్ల కంటే... కాస్తంత గోధుమ రంగులో లేదా ముదురు రంగులో ఉండే నాటు కోడి గుడ్లను మరింత ఎక్కువ ధర పెట్టి కొంటుంటారు.
నాటు గుడ్లయినా, ఫారం గుడ్లయినా అందులోని పోషకాలు ఒకేలా ఉంటాయి. కాకపోతే కొన్నిసందర్భాల్లో నాటు కోడి గుడ్డు పరిమాణం కాస్త చిన్నగానూ, ఫారం కోడి గుడ్లు కాస్త పెద్దగానూ ఉంటాయి. అయితే వాటిల్లోని తెల్లసొన, పచ్చసొనలో పోషక విలువలు మాత్రం ఒకేలా ఉంటాయి. ఆ రెండు రకాల గుడ్లలో ఉండే ఐరన్ పాళ్లు కూడా ఒకటే.
Comments
Please login to add a commentAdd a comment