Egg Side Effects: గుడ్డు ఆరోగ్యానికి మంచిది కాదా..? | Side Effects Of Eating Too Many Eggs | Sakshi
Sakshi News home page

Egg Side Effects: గుడ్డు ఆరోగ్యానికి మంచిది కాదా..?

Published Mon, Sep 11 2023 3:39 PM | Last Updated on Mon, Sep 11 2023 5:07 PM

Side Effects Of Eating Too Many Eggs - Sakshi

గుడ్డు ఆరోగ్యానికి మంచిదని డైట్‌లో కంప్లసరీ ఉండేలా చూసుకుంటారు. దీనిలో ప్రోటీన్ల తోపాటు శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు మినరల్స్‌ కూడా ఉంటాయన్నది నిజమే. కానీ అలా అని వాటిని ఎక్కువగా తింటే చాలా తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయి. గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో  అతిగా తింటే అంతే ప్రమాదం అంటున్నారు వైద్యులు.

గుడ్డు ఎక్కువగా తీసుకుంటే కలిగే దుష్పరిణామాలు

  • కొలస్ట్రాల్‌ సమస్య ఉన్నవారు గుడ్డు అస్సలు తినకూడదు. తింటే ఒక్కసారిగి శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయి పెరుగుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. గుండె జబ్బుల అవకాశాలను పెంచుతుంది. 
  • అధిక రక్తపోటు ఉన్న పేషెంట్లు తింటే మరింత ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. తినాలనుకుంటే గుడ్డులోని పసుపు భాగాన్ని బయటకు తీసి తినవచ్చు. 
  • ఇవి ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడమే గాక శరీరంలో అదనపు ప్రోటీన్లు, కొవ్వు కూడా పెరుగుతుంది. 
  • మధుమేహం పెరిగే ప్రమాదం ఎక్కువే. ఇది ఇన్సులిన్‌ నిరోధకతను కూడా పెంచుతుంది. 
  • ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజు రెండు నుంచి మూడు గుడ్లు తీసుకోవాలి. అతిగే తింటే మాత్రం తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కొనక తప్పదని హెచ్చరిస్తు‍న్నారు వైద్యులు

(చదవండి: జీ20లో అదిరిపోయే వంటకాలు ఇవే..ఏకంగా 500కిపైగా..)


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement