ప్రస్తుతం చాలామంది ఆరోగ్య స్ప్రుహతో ఎన్నో రకాల పండ్లను తీసుకుంటున్నారు. వాటిలో పైనాపిల్ కూడా ఒకటి. అయితే పైనాపిల్ పండులో విటమిన్ బి6, ఫోలేట్, మాంగనీస్, కాపర్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు.
అయితే ఈ పైనాపిల్ తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ పండులో ఉండే తీపి, పిలుపు రుచి కారణంగా చాలామంది తినేందుకు ఇష్టపడతుంటారు. ఇందులో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. ఈ పైనాపిల్లో ఉన్న బ్రోమోలైన్ ఎంజైమ్ జీర్ణ క్రియను మెరుగ్గా ఉంచుతుంది
ఇన్ని ప్రయోజనాలు ఉన్నా..దీనిలో సహజ చక్కెరలు, కేలరీలు అధికం. అలాగే ఈ పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. అందువల్ల వాళ్లు ఈ పండు తీసుకోకపోవడమే మంచిది.
అలాగే కడుపులో అల్సర్, అసిడిటీ సమస్య ఉన్నవారికి ఇది మరింత సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి సమయంలో పైనాపిల్ తీసుకోవడం అస్సలు మంచిది కాదు. అలాగే కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడేవారు విటమిన్స్ సీ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వేళ తినాలనుకున్నా ఈ పండుని మితంగా తీసుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు.
(చదవండి: సునీతా విలియమ్స్: ఆరోగ్యంగానే ఉన్నా..! సుదీర్ఘకాలం ఉంటే శరీరంలో..)
Comments
Please login to add a commentAdd a comment