కాలీఫ్లవర్‌తో వివిధ రకాల వంటకాలు తయారు చేసుకుని చాలా మంది ఇష్టంగా తింటారు. కాలీఫ్లవర్‌లోని పోషకాలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.విటమిన్ సి తో పాటు, ఫోలేట్, విటమిన్ B6, పొటాషియం, మాంగనీస్ వంటి మినరల్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. కానీ కాలీఫ్లవర్‌లో ఎన్ని పోషకాలు ఉన్నా, దీనిని అతిగా తినడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ముఖ్యంగా అలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్లు కాలీఫ్లవర్‌కు దూరంగా ఉండటమే మంచిది.
►కాలీఫ్లవర్‌ను అతిగా తినడం వల్ల కడుపు ఉబ్బరంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. ముఖ్యంగా వీటిని పచ్చిగా తింటే పొట్టలో గ్యాస్ సమస్య, జీర్ణక్రియ సమస్యలతో పోరాడక తప్పదు.
► కాలీఫ్లవర్‌లో ఉండే గ్లూకోసినోలేట్స్ అనే సల్ఫర్ కలిగిన రసాయనాలు కడుపులోకి ప్రవేశించినప్పుడు, అవి హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. ఇది కడుపులో వాయువును సృష్టిస్తుంది. అందువల్లనే, కాలీఫ్లవర్ తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. థైరాయిడ్ సమస్య..కాలీఫ్లవర్ వంటి కూరగాయలు గ్రంథుల పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి.
► హైపోథైరాయిడిజం వంటి సమస్యలతో బాధపడేవారు కాలీఫ్లవర్ తినకపోవడం మంచిది. అలెర్జీ ప్రమాదం..కొందరికి కాలీఫ్లవర్ తినడం వల్ల చర్మంపై దురద, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాపు వంటి సమస్యలు తలెత్తుతాయి.
► థైరాయిడ్ సమస్యలతో బాధపడే వాళ్లు కాలీఫ్లవర్ తీసుకోకపోవడమే మంచిది అని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎందుకంటే కాలీఫ్లవర్‌ను తినడం వల్ల T3,T4 హార్మోన్లు పెరిగి థైరాయిడ్ సమస్యని మరింత ఎక్కువ చేస్తాయి.
► గ్యాస్ సమస్య ఉన్నవారు కాలీఫ్లవర్ తినకూడదు. క్యాబేజీలో పిండి పదార్థాలు ఉంటాయి. దీని వల్ల ఎసిడిటీ సమస్య పెరుగుతుంది.
► పాలిచ్చే తల్లులు కూడా కాలీఫ్లవర్‌కు దూరంగా ఉంటే మంచిది. కాలీఫ్లవర్ అతిగా తినడం వల్ల తల్లి పాలు తాగి పిల్లలకు కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది.
► కీళ్లలో నొప్పి, వాపు, యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కాలీఫ్లవర్ తినకూడదు. ఎందుకంటే ఇది సమస్యని మరింత పెంచుతుది. దీంతో కీళ్లలో వాపు, నొప్పి ఎక్కువవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment