Cauliflower
-
ఈ సమస్యలు ఉన్నవాళ్లు కాలీఫ్లవర్ తినకూడదట.. ఎందుకో తెలుసా?
కాలీఫ్లవర్‌తో వివిధ రకాల వంటకాలు తయారు చేసుకుని చాలా మంది ఇష్టంగా తింటారు. కాలీఫ్లవర్‌లోని పోషకాలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.విటమిన్ సి తో పాటు, ఫోలేట్, విటమిన్ B6, పొటాషియం, మాంగనీస్ వంటి మినరల్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. కానీ కాలీఫ్లవర్‌లో ఎన్ని పోషకాలు ఉన్నా, దీనిని అతిగా తినడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ముఖ్యంగా అలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్లు కాలీఫ్లవర్‌కు దూరంగా ఉండటమే మంచిది. ►కాలీఫ్లవర్‌ను అతిగా తినడం వల్ల కడుపు ఉబ్బరంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. ముఖ్యంగా వీటిని పచ్చిగా తింటే పొట్టలో గ్యాస్ సమస్య, జీర్ణక్రియ సమస్యలతో పోరాడక తప్పదు. ► కాలీఫ్లవర్‌లో ఉండే గ్లూకోసినోలేట్స్ అనే సల్ఫర్ కలిగిన రసాయనాలు కడుపులోకి ప్రవేశించినప్పుడు, అవి హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. ఇది కడుపులో వాయువును సృష్టిస్తుంది. అందువల్లనే, కాలీఫ్లవర్ తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. థైరాయిడ్ సమస్య..కాలీఫ్లవర్ వంటి కూరగాయలు గ్రంథుల పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. ► హైపోథైరాయిడిజం వంటి సమస్యలతో బాధపడేవారు కాలీఫ్లవర్ తినకపోవడం మంచిది. అలెర్జీ ప్రమాదం..కొందరికి కాలీఫ్లవర్ తినడం వల్ల చర్మంపై దురద, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాపు వంటి సమస్యలు తలెత్తుతాయి. ► థైరాయిడ్ సమస్యలతో బాధపడే వాళ్లు కాలీఫ్లవర్ తీసుకోకపోవడమే మంచిది అని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎందుకంటే కాలీఫ్లవర్‌ను తినడం వల్ల T3,T4 హార్మోన్లు పెరిగి థైరాయిడ్ సమస్యని మరింత ఎక్కువ చేస్తాయి. ► గ్యాస్ సమస్య ఉన్నవారు కాలీఫ్లవర్ తినకూడదు. క్యాబేజీలో పిండి పదార్థాలు ఉంటాయి. దీని వల్ల ఎసిడిటీ సమస్య పెరుగుతుంది. ► పాలిచ్చే తల్లులు కూడా కాలీఫ్లవర్‌కు దూరంగా ఉంటే మంచిది. కాలీఫ్లవర్ అతిగా తినడం వల్ల తల్లి పాలు తాగి పిల్లలకు కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. ► కీళ్లలో నొప్పి, వాపు, యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కాలీఫ్లవర్ తినకూడదు. ఎందుకంటే ఇది సమస్యని మరింత పెంచుతుది. దీంతో కీళ్లలో వాపు, నొప్పి ఎక్కువవుతుంది. -
లో క్యాలరీస్ కోసం కాలిఫ్లవర్ బ్రెడ్ ట్రై చేయండి
కాలీఫ్లవర్ బాదం బ్రెడ్ తయారీకి కావల్సినవి: కాలీఫ్లవర్ – 1 (వేడి నీళ్లతో బాగా శుభ్రం చేసుకుని, మిక్సీ పట్టుకోవాలి) బాదం తురుము – ఒకటింపావు కప్పులు, గుడ్లు – 6 ఆలివ్ నూనె – పావు కప్పు, ఉప్పు – కొద్దిగా ఓరెగాన్ , బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్ చొప్పున తయారీ విధానమిలా.. ముందుగా ఒక పెద్ద బౌల్లో గుడ్లు పగలగొట్టుకుని.. హ్యాండ్ బ్లెండర్తో నురుగు వచ్చేలా బాగా మిక్సీ పట్టుకోవాలి. అందులో కాలీఫ్లవర్ తురుము, ఆలివ్ నూనె, బాదం తురుము, ఓరెగాన్ , బేకింగ్ పౌడర్, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని బ్రెడ్ మేకర్లో వేసుకుని బేక్ చేసుకుంటే సరిపోతుంది. సర్వ్ చేసుకునే ముందు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. -
Health Tips: క్యారెట్లు, బీట్రూట్ తరచుగా తింటున్నారా? డేంజర్!
Health Reasons Not to Eat These Vegetables Too Much: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యలకు ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహారాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రకాల కూరగాయల వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఎలాంటి కూరగాయలను తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ ఆరోగ్యకరమైన కూర అయినప్పటికీ ఇది అందరికీ పడదు. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా దీనివల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా కాలీఫ్లవర్‌ను ఎప్పుడూ పచ్చిగా తినకూడదని నిపుణులు తెలుపుతున్నారు. దీనిని పచ్చిగా తినడం వల్ల కడుపు నొప్పి రావడంతోపాటు పొట్టలో దీర్ఘకాలిక సమస్యలకు గురయ్యే అవకాశాలున్నాయి. పుట్టగొడుగులు పుట్టగొడుగులు శరీరానికి మంచి పోషకాహారం అయినప్పటికీ దీనిని అతిగా తీసుకోవద్దని నిపుణులు తెలుపుతున్నారు. వీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే.. అలెర్జీ సమస్యలు వస్తాయి. అందువల్ల వీటిని తీసుకున్నప్పుడు ఏవైనా తేడాగా అనిపిస్తే దానికి దూరంగా ఉండటం మేలు. వండుకునేటప్పుడు కూడా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. క్యారట్లు క్యారట్లలో బాడీకి అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. కానీ వీటిని పచ్చిగా తింటే.. అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని తినేముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వీటిని అతిగా తీసుకుంటే.. చర్మం రంగు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. బీట్రూట్ బీట్రూట్స్ను సలాడ్లలో ఎక్కువగా వినియోగిస్తారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలున్నా.. అతిగా తీసుకుంటే శరీరానికి ప్రమాదకరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు వీటిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. అందువల్ల ఎవరైనా సరే, వీటిని పరిమిత పరిమాణంలో తీసుకుంటే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. చదవండి: Hypothyroidism During Pregnancy: రెండో నెల.. హైపో థైరాయిడ్! డైట్‌తో కంట్రోల్ చెయ్యొచ్చా? Bone Pain: ఎముకల నొప్పులా? అవిశ, సబ్జా, గుమ్మడి గింజల పొడి రోజూ స్పూన్ తీసుకున్నారంటే! -
Health: పైల్స్‌తో బాధపడుతున్నారా? వీటిని తగ్గించండి! ఇవి తింటే మేలు!
Diet Tips For Control Piles: కొందరికి నిద్రలేవగానే టాయిలెట్‌కి వెళ్లాలంటే నరకమే. పైల్స్ మూలాన తీవ్ర రక్తస్రావం. నొప్పితో బాధపడుతుంటారు. అయితే పైల్స్ ఉన్న వారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం లేదా బాగా తగ్గించి తినడం వల్ల కొంత మేలు జరుగుతుంది. అవేమిటో చూద్దాం... ►పాల ఉత్పత్తులు, పాలు, పెరుగు మొదలైనవి. ►ఎర్ర మాంసం లేదా ప్రాసెస్ చేసిన మాంసాలు. ఎందుకంటే వీటిలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. మలబద్దకానికి దారితీసి, ఆహారం జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. ►వేయించిన ఆహారం: ఇది మీ జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది కాబట్టి ఫ్రై చేసిన వాటికి దూరంగా ఉండటం మంచిది. ►ఉప్పు అధికంగా తినొద్దు. ►కారంగా ఉండే ఆహారాలు: ఫైబర్ తక్కువగా ఉండకూడదు, కారంగా ఉండే ఆహారం నొప్పిని పెంచుతుంది. ►కెఫిన్ ఉన్న ఆహార పానీయాలు: ముఖ్యంగా కాఫీ, టీల వల్ల పైల్స్ సమస్య పెరుగుతుంది. అందువల్ల వాటిని వీలయినంత వరకు తగ్గించడం మేలు. ►ఆల్కహాల్: కెఫిన్ పానీయాల మాదిరిగా, ఆల్కహాల్‌తో కూడిన పానీయాలు మలాన్ని గట్టిగా ఉండేలా చేస్తాయి. తద్వారా మోషన్‌కి వెళ్లేటప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది. అందుకని పైల్స్ సమస్య మరింత పెరగకుండా ఉండేందుకు ఆల్కహాల్ మానుకోవడం మంచిది. వీటిని తినండి.. ►బార్లీ ►క్వినోవా ►బ్రౌన్ రైస్ ►వోట్స్ ►చిక్కుళ్ళు వంటి అధిక ఫైబర్ ఉన్న వాటిని మీ ఆహారంలో తీసుకోండి. ►క్యారట్ ►బీట్రూట్ ►బ్రోకలీ ►కాలీఫ్లవర్ ►కాలే ►క్యాబేజీ ►గుమ్మడికాయ ►బెల్ పెప్పర్స్ ►దోసకాయ ► జామపండు ►బొప్పాయి వంటి పండ్లు కూరగాయలు తినండి. చదవండి: ఔషధాల ఖజానా పుదీనా Urinary Incontinence: దగ్గినప్పుడల్లా మూత్రం పడుతోంది! ట్రీట్మెంట్ ఉందా? -
ఓటీటీలోకి సంపూర్ణేష్ బాబు ‘క్యాలీ ఫ్లవర్’
Cauliflower Movie OTT Release Date: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా ఆర్కే మలినేని తెరకెక్కించిన తాజా చిత్రం తాజా చిత్రం ‘క్యాలీ ఫ్లవర్’ .‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని నిర్మించిన ఈ చిత్రం గతేడాది నవంబరు 26న థియేటర్స్ లో విడుదలై మిశ్రమ స్పందనను దక్కించుకుంది. సంపూ కామెడీ అందరిని ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కి సిద్దమయ్యింది. ఏప్రిల్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ,హంగామా మొదలగు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాతలు ఆశా జ్యోతి, శ్రీరామ్ లు మాట్లాడుతూ.. థియేటర్స్‌లో మిస్సైయిన ప్రేక్షకులందరూ ఈ నెల 9న ఓటీటీలో ‘క్యాలీఫ్లవర్’ చిత్రాన్ని వీక్షించాలని కోరారు. దర్శకుడు ఆర్కే మలినేని మాట్లాడుతూ.. శీలం అనేది ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లకు కూడా ముఖ్యం. అది కనుక పాటిస్తే ప్రపంచంలో ఎలాంటి సమస్యలు ఉండవు అనే పాయింట్ ను ఈ సినిమాలో చెప్పడం జరిగింది.నవంబర్ 26న ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేయడం జరిగింది.ఎన్నో సీరియల్స్ తీసిన నన్ను చాలా మంది ఇన్ని సీరియల్స్ చేస్తున్న నువ్వు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాలను ఎందుకు తీయలేవు అన్నదానికి సమాధానమే ఈ క్యాలీఫ్లవర్.మేము చేసిన మంచి ప్రయత్నాన్ని అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను’ అన్నారు -
Health Tips: కాలీఫ్లవర్ తింటే ఇన్ని ఉపయోగాలా.. బోర్ కొడితే ఇలా ట్రై చేయండి!
Amazing Health Benefits Of Cauliflower: Add To Diet Try These Recipes: పచ్చని ఆకుల మధ్య తెల్లగా చూడముచ్చటగా కనిపించే పువ్వే కాలీఫ్లవర్. స్వచ్ఛమైన తెల్లటి వెన్నముద్దలాంటి ఈ పువ్వులో పోషకాలకు కొదవే ఉండదు. విడిగా వండినా, ఇతర కూరగాయలతో కలిపి వండినా రుచి మారదు. కాలీఫ్లవర్ వల్ల ఎన్ని లాభాలో తెలుసా...? ►దంత సమస్యలతో బాధపడేవారు తరచుగా కాలీఫ్లవర్ తింటే ఉపశమనం పొందవచ్చు. ►కాలీఫ్లవర్‌లో విటమిన్లు, మినరల్స్ ఎక్కువ. మరి క్యాలరీలేమో తక్కువ. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ►అంతేగాక... కాలీఫ్లవర్ కడుపులోని అసిడిటీ కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ►బరువు తగ్గాలనుకునే వారు తరచుగా కాలిఫ్లవర్‌ని ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ►అంతేకాదు... కాలీఫ్లవర్ రసాన్ని పరగడపునే తాగితే క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ►అదే విధంగా తరచుగా కాలీఫ్లవర్ని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో విరివిగా దొరుకుతున్న కాలీఫ్లవర్‌ను వివిధ కాంబినేషన్లతో రుచికరంగా ఎలా వండుకోవచ్చో చూద్దాం... గోబీ గోష్ కర్రీ... కావల్సినవి: బోన్ లెస్ మటన్ – ముప్పావు కేజీ; ఉల్లిపాయలు – రెండు (ముక్కలుగా తరగాలి); ఆయిల్ – ఐదు టేబుల్ స్పూన్లు; అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు టీస్పూన్లు; మిరియాలపొడి – అరటీస్పూను; లవంగాలు – అర టీ స్పూను; టొమాటోలు – రెండు (ముక్కలు తరగాలి); ఉప్పు – రుచికి సరిపడా; ధనియాల పొడి – అరటీస్పూను; జీలకర్రపొడి – టీస్పూను; గరంమసాలా పొడి – టీస్పూను; కారం – టేబుల్ స్పూను; పసుపు – అరటీస్పూను; పెరుగు – అరకప్పు; కాలీఫ్లవర్ – అరకేజీ; కొత్తిమీర తరుగు – అరకప్పు; పచ్చిమిర్చి – నాలుగు. తయారీ: ముందుగా వేడెక్కిన బాణలిలో ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించి, కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలను వేయాలి. రెండు నిమిషాలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి, లవంగాలు వేసి తిప్పాలి. తరువాత టొమాటో ముక్కలు కూడా వేసి పదినిమిషాలు మగ్గనివ్వాలి ∙ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కారం, పసుపు వేసి బాగా కలపాలి. తరువాత మూతపెట్టి పదినిమిషాలు ఉడికించాలి. తరువాత పెరుగు, కొద్దిగా నీళ్లుపోసి మరో ఐదు నిమిషాలు సిమ్‌లో మగ్గనివ్వాలి ∙మరుగుతున్న నీటిలో కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఐదు నిమిషాల తరువాత తీసి మటన్ మిశ్రమంలో వేసి ఉడికించాలి. ∙ఆయిల్ పైకి తేలిన తరువాత, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి దించేయాలి. మటర్ కాలీ బుర్జి కావల్సినవి: కాలీఫ్లవర్ – ఒకటి; పచ్చిబఠాణి – కప్పు; ఉల్లిపాయ – ఒకటి (ముక్కలు తరగాలి); టొమాటో – ఒకటి (ముక్కలు తరగాలి); పచ్చిమిర్చి – మూడు; అల్లంవెల్లుల్లి పేస్టు – టీస్పూను; పసుపు – పావు టీస్పూను; కారం – టీస్పూను; గరం మసాలా పొడి – అరటీస్పూను; ఆయిల్ – ఒకటిన్నరటేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ: కాలీఫ్లవర్‌ను వేడి నీటిలో వేసి పదినిమిషాలు నానబెట్టాలి. ∙పదినిమిషాల తరువాత నీటిని వంపేసి కాలీఫ్లవర్‌ను సన్నగా తరగాలి. ఇప్పుడు వేడెక్కిన బాణలిలో అరటేబుల్ స్పూను ఆయిల్, కాలీఫ్లవర్ తరుగు వేసి ఐదు నిమిషాలు ఫ్రై చేసి పక్కనబెట్టుకోవాలి. స్టవ్ మీద మరో బాణలి పెట్టి వేడెక్కిన తరువాత టేబుల్ స్పూను ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.∙ఉల్లిపాయ వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, టొమాటో ముక్కలు వేయాలి. టొమాటో మెత్తబడిన తరువాత బఠాణి, పసుపు, కారం రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి, ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ తరుగు వేసి మూతబెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించాలి ∙తరువాత గరం మసాలా పొడి, కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆపేయాలి. గోబీ ఫ్రిట్టర్స్ కావల్సినవి: కాలీఫ్లవర్ – ఒకటి; గోధుమ పిండి – అరకప్పు; గుడ్లు – రెండు (గుడ్డుసొనను కలిపి పెట్టుకోవాలి); వెల్లుల్లి రెబ్బలు – మూడు (సన్నగా తరగాలి); కొత్తిమీర తరుగు – మూడు టేబుల్ స్పూన్లు; పచ్చిమిర్చి తరుగు – మూడు టీ స్పూన్లు; ఆయిల్ – వేయించడానికి సరిపడా; ఫ్రెష్ క్రీమ్ – గార్నిష్‌కు తగినంత; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: ముందుగా మరుగుతున్న నీటిలో కాలీఫ్లవర్ వేసి పదినిమిషాలపాటు ఉడికించి, చల్లారనివ్వాలి. చల్లారాక కాలీఫ్లవర్‌ను చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. ∙గోధుమ పిండిలో కాలీఫ్లవర్ ముక్కలు, గుడ్ల సొన, రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు వేసి కలిపి ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి. నానిన మిశ్రమాన్ని నాన్ స్టిక్పాన్పై చిన్నచిన్న వడల్లా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా వేయించాలి. ∙ఈ ఫ్రిట్టర్స్ (వడలు) పై క్రీమ్ వేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. చదవండి: Health Tips: అలర్జీలూ, ఆస్తమాలతో జాగ్రత్త!.. గుడ్లు, పల్లీలు, పచ్చళ్లు.. ఇంకా.. -
మగవాళ్లు 35 ఏళ్లు వచ్చేవరకు పవిత్రంగా ఉండాలి: సంపూర్ణేష్ బాబు
‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు సంపూర్ణేష్ బాబు. బర్నింగ్ స్టార్‌గా పేరు పొందిన సంపూ ప్రస్తుతం ‘క్యాలీ ఫ్లవర్’ అనే సరికొత్త టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చసినిమాను నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబరు 26న రిలీజవుతోంది. ఈ సందర్భంగా హీరో సంపూర్ణేష్‌బాబు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాను. పెద్దాయన ఆండ్రిఫ్లవర్.. రెండో పాత్రకు క్యాలీఫ్లవర్ అనిపెట్టారు. క్యాలీఫ్లవర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారని నేనూ అడిగాను. క్యారెక్టర్ పాత్ర పేరు కూడా అదే.. ఒకానొక సమయంలో అదే కాపాడే కవచంగా మారుతుందని డైరెక్టర్ అన్నారు. ► శీలం అనేది ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లకు కూడా ముఖ్యం. అది కనుక పాటిస్తే ప్రపంచంలో ఎలాంటి సమస్యలు ఉండవు అనే పాయింట్ చెప్పాడు. అది చాలా నచ్చింది. కొత్త చెబుతున్నాడని అనిపించింది. అందుకే ఓకే చెప్పాను. ► ఇందులో కొత్తగా కనిపిస్తాను. కొబ్బరిమట్టలో చెప్పినట్టుగా భారీ లెంగ్తీ డైలాగ్స్ ఉండవు. కోర్ట్ సీన్లో మాత్రం అలాంటి డైలాగ్స్ ఉంటాయి. ► 35 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి చేసుకోకూడదని వంశపారంపర్యంగా వస్తుంది. అందుకే అంతవరకు పవిత్రంగా ఉండాలని, ఏ అమ్మాయి కూడా దగ్గరగా వచ్చి మాట్లాడకూడదని, అంత దూరంలో ఉండాలని ఆ స్కేల్ వాడాం. ► ఈ సినిమాలో గెటప్స్ బాగా సెట్ అయ్యాయి.. హీరో రేప్‌కు గురవ్వడం, ఆ తరువాత వచ్చే పాటలు ఇలా అన్నీ బాగుంటాయి. అందరూ ఎంజాయ్ చేస్తారు. అందుకే హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాల్లా అందరికీ నచ్చుతుందని అన్నాను. ► డైరెక్టర్ ఆర్కే ఇంతకు ముందు సీరియల్స్ చేశారు. ఈ కథను ఎప్పటి నుంచో అనుకున్నారట. ఈ పాత్ర అలా ఉండాలి.. ఇలా ఉండాలని అనుకున్నారట. సంపూర్ణేష్ బాబు అయితే బాగుంటుందని అనుకున్నారట. అలా నా వద్దకు వచ్చి కథ చెప్పారు. ► హీరోయిన్ వాసంతి ఇది వరకు కన్నడలో సీరియల్స్ చేశారు. తనకు ఇదే మొదటి తెలుగు సినిమా. అయినా కూడా చక్కగా నటించారు. పల్లెటూరిలో చలాకీగా తిరుగుతూ, బావను ఏడిపించే మరదలి పాత్రలో కనిపిస్తారు. ► నేను ఎంత అతి చేసినా ప్రేక్షకులు ఆదరిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే కథలు రాస్తుంటారు. హృదయ కాలేయంలో చితిలోంచి లేచి రావడం, కొబ్బరిమట్టలో కొడితే సుమో చేతిలోకి వస్తుంది. అది పరాకాష్ట. సింగం 123 సినిమాలో ఇంట్లో స్మిమ్మింగ్ పూల్‌లో దూకితే ఎక్కడెక్కడో తేలుతాను. ► ఈ రోజు సంతోషంగా ఉన్నామా? రేపు మంచిగా ఉంటామనే నమ్మకం ఉందా? అనే ఆలోచిస్తాను. నటుడిగా ఏం చేయడానికైనా రెడీ. ఏ పాత్రలు వస్తే అవి చేస్తాను. ► హీరోగా నాలుగు సినిమాలు చేస్తున్నాను. అందుకే గెస్ట్ అప్పియరెన్స్ ఎక్కువగా చేయలేకపోతోన్నాను. ఒక సినిమాలో ఓ కారెక్టర్ వేశాను. గోల్డ్ మ్యాన్ సినిమా చేద్దామనుకున్నాను. కానీ కరోనా వల్ల వెనక్కి వెళ్లిపోయింది. ► నరసింహాచారి నుంచి సంపూగా ఎదగడం, ఆటోలో తిరగడం నుంచి ఫ్లైట్‌లో తిరిగే స్థాయి వరకు వచ్చాను. అదే నాకు సంతోషం. ప్రస్తుతం నా చేతిలో ఐదు సినిమాలు ఉండటం అదృష్టం. ► ఉన్నదాంట్లో ఎంతో కొంత దానం చేయడం నాకు ఆనందంగా ఉంటుంది. తెలియని సంతృప్తినిస్తుంది. ► తమిళంలో హీరోగా ఓ సినిమా చేస్తున్నాను. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయింది. స్టోరీ బేస్డ్ సినిమా. సీరియస్‌గా సాగుతుంది. ► సాయి రాజేష్ గారు ప్రస్తుతం ఆనంద్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత మేం మళ్లీ ఓ సినిమా చేస్తాం. -
ఆ టైటిల్ విని షాక్ అయ్యాను!
సంపూర్ణేష్ బాబు, వాసంతి జంటగా ఆర్కే మలినేని దర్శకత్వంలో గుడూరు శ్రీధర్ సమర్పణలో ఆశాజ్యోతి గోగినేని నిర్మించిన చిత్రం ‘క్యాలీఫ్లవర్’. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా వాసంతి మాట్లాడుతూ – ‘‘నేను తెలుగు అమ్మాయినే కానీ బెంగళూరులో చదువుకున్నాను. ఏరో నాటికల్ ఇంజనీర్ అవుదామనుకున్న నేను హీరోయిన్ అయ్యాను. ఐదు సంవత్సరాల క్రితం మోడల్‌గా నా కెరీర్‌ను స్టార్ట్ చేసి, ఆ తర్వాత నటి అయ్యాను. కన్నడంలో ఐదు సినిమాలు చేశాను. ఇప్పుడు ‘క్యాలీఫ్లవర్’తో తెలుగు చిత్రపరిశ్రమకు వస్తున్నాను. ఇందులో హీరోగా నటించిన సంపూర్ణేష్ బాబుకు మరదలిగా, నీలవేణి క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ నా కోసమే డిజైన్ చేశారా? అన్నట్లు నాకనిపించింది. కొందరిలా నేను కూడా ‘క్యాలీఫ్లవర్’ టైటిల్ విని షాకయ్యాను. కానీ సస్పెన్స్, థ్రిల్, కామెడీ, మెసేజ్ ఉన్న ఈ చిత్రం ఆడియన్స్‌కు నచ్చుతుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయాలని ఉంది. హీరో నానీగారంటే ఇష్టం. ఆయనతో వర్క్ చేయాలని ఉంది. ప్రస్తుతం ఆది సాయికుమార్, మారుతి అండ్ టీమ్ సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తున్నాను. కన్నడంలో కొత్త సినిమాలు కమిట్ కాలేదు’’ అన్నారు. -
శీల రక్షణ కోసం రంగంలోకి సంపూ.. ఇప్పుడంతా క్యాలీఫ్లవర్ గురించే చర్చ
సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘క్యాలీఫ్లవర్’. ‘శీలో రక్షతి రక్షితః’ అనేది ఉపశీర్షిక. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వాసంతి హీరోయిన్ . గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌పై ఆశా జ్యోతి గోగినేని నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘క్యాలీఫ్లవర్’ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ‘ఇప్పుడు ఎక్కడ చూసినా క్యాలీఫ్లవర్ గురించే చర్చ. ‘అసెంబ్లీ సాక్షిగా సభ పెట్టాడు ఈ క్యాలీఫ్లవర్’ వీడెవడే ఒక్కరోజులో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు’అనే డైలాగ్స్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఇక సంపూ చెప్పే డైలాగ్స్ అయితే నవ్వులు పూయిస్తున్నాయి. ‘ఈ ఊర్లో పుట్టిన మనిషితో పాటు జంతువుకు అందరికీ ఒక్కటే భర్త, ఒక్కటే భార్య ఇదే ఈ క్యాలీఫ్లవర్ రూల్’అని సంపూ అంటుండగా.. అక్కడే ఉన్న ఓ గేదె ‘ఏం కర్మరా బాబు.. నాక్కుడా ఒక్కడే మొగుడు అట’అని చెప్పడం ఫన్నీగా ఉంది. మొత్తంగా ఎనీ టైమ్ శీలాన్ని కాపాడే సింబలేరా.. క్యాలీఫ్లవర్ అంటూ సంపూ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. -
‘క్యాలీ ఫ్లవర్’తో వచ్చేస్తున్న సంపూర్ణేష్ బాబు
‘‘ఓ మహిళ వల్ల శీలం పోగొట్టుకున్న ఒక మగాడు న్యాయం కోసం చేసే పోరాటమే ‘క్యాలీ ఫ్లవర్’ కథ’’ అని సంపూర్ణేష్ బాబు అన్నారు. ఆర్కే మలినేని దర్శకత్వంలో సంపూర్ణేష్, వాసంతి జంటగా తెరకెక్కిన చిత్రం ‘క్యాలీ ఫ్లవర్’. గూడూరు శ్రీధర్ సమర్పణలో ఆశాజ్యోతి గోగినేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతోంది. విలేకరుల సమావేశంలో సంపూర్ణేష్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకుల్ని నవ్వించేందుకు ఆర్కే మలినేని శాడిజాన్ని చూపించి నాలోని నటుణ్ణి బయటకు తీసుకొచ్చారు. ఈ సినిమా హిట్ అయితే దానికి కారణం ప్రేక్షకులు.. తేడా కొట్టిందంటే నా వల్లే’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కోల నాగేశ్వరరావు, హరిబాబు జెట్టి. -
నోరూరించే ఎగ్ మఫిన్స్, పనీర్ జల్ప్రెజీ తయారీ ఈజీగా ఇలా..
కావల్సిన పదార్థాలు: గుడ్లు – ఆరు, స్ప్రింగ్ ఆనియన్ – ఒకటి, ఉల్లిపాయలు – రెండు, టోపు – ఆరు ముక్కలు, చీజ్ తురుము – అరకప్పు, ఉప్పు – అరటిస్పూను, ఆలివ్ ఆయిల్ – టీ స్పూను. తయారీ విధానం: ►ముందుగా స్ప్రింగ్ ఆనియన్, ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ►తరువాత టోపును కూడా క్యూబ్‌లుగా తరగాలి. ►ఒక గిన్నెలో టోపు ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, చీజ్ తురుము గుడ్లు పగల కొట్టి వేసి కలపాలి. ఉప్పువేసి మరోసారి కలపాలి. ►ఇప్పుడు మఫిన్ ఉడికించే పాత్రకు ఆలివ్ ఆయిల్ రాసి దానిలో ఈ గుడ్ల మిశ్రమాన్ని వేసి ఇరవై నిమిషాలపాటు బేక్ చేస్తే ఎగ్ మఫిన్స్ రెడీ. పనీర్ జల్ప్రెజీ కావల్సిన పదార్థాలు: పనీర్ – పావుకేజీ, క్యాప్సికం – ఒకటి, టొమాటోలు – రెండు, ఉల్లిపాయ – ఒకటి, అల్లం – అంగుళం ముక్క, వెల్లుల్లి రెబ్బలు – నాలుగు, ధనియాలు – టేబుల్ స్పూను, ఆయిల్ – మూడు టేబుల్ స్పూన్లు, జీలకర్ర – టీ స్పూను, కారం – అర టీస్పూను, పసుపు – అరటీస్పూను, గరం మసాలా – పావు టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర – గార్నీష్కు సరిపడా. తయారీ విధానం: ►ముందుగా పనీర్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్‌చేసి వేడినీళ్లలో పదిహేను నిమిషాలపాటు నానబెట్టుకోవాలి. ►క్యాప్సికం, టొమాటో, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి రెబ్బలను సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. ►ధనియాలను దోరగా వేయించి పొడిచేసి పక్కన పెట్టుకోవాలి. ►ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టుకుని ఆయిల్ వేసి వేడెక్కిన తరువాత జీలకర్ర, ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు వేసి వేగనివ్వాలి. ►ఇవి వేగాక క్యాప్సికం, టొమాటో ముక్కలు, అల్లం ముక్కలు సగం వేయాలి. ►ఇవి దోరగా వేగిన తరువాత ఉప్పు, ధనియాల పొడి, కారం, పసుపు, గరంమసాలా వేసి మీడియం మంటమీద కూరగాయ ముక్కలు రంగు పోకుండా వేయించాలి. ►టొమాటోలు మెత్తబడిన తరువాత పనీర్ ముక్కలు వేసి కలిపి ఐదు నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి. ►తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేస్తే పనీర్ జల్ప్రేజీ రెడీ. ఇది నాన్, తందూరీ రోటీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. గార్లిక్ స్మాష్డ్ పొటాటో కావల్సిన పదార్థాలు: బంగాళ దుంపలు – ఆరు, వెన్న – రెండు టేబుల్ స్పూన్లు, ఆలివ్ ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు, మిరియాల పొడి – రుచికి సరిపడా, బరకగా దంచిన ఎండుమిర్చి కారం – టేబుల్ స్పూను, వెల్లుల్లి పొడి – టేబుల్ స్పూను. తయారీ విధానం: ►ముందుగా బంగాళ దుంపలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి ఉప్పు కలిపి ఉడకబెట్టి నీళ్లు తీసేసి పక్కనబెట్టుకోవాలి. ►ఉడికించిన బంగాళ దుంప స్మాషర్తో మెత్తగా చిదుముకోవాలి. ఈ మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి పొడి వేసి కలపాలి. ►ఇప్పుడు ఈ దుంపల మిశ్రమాన్ని సన్నని స్లైసుల్లా చేసి నలభై ఐదు నిమిషాలపాటు బేక్ చేస్తే గార్లిక్ స్మాష్డ్ పొటాటోస్ రెడీ. ఆరెంజ్ క్యాలీఫ్లవర్ కావల్సిన పదార్థాలు: క్యాలీఫ్లవర్ – పెద్దది ఒకటి బ్యాటర్ కోసం: గోధుమ పిండి – ఒకటింబావు కప్పు, బాదం పాలు – కప్పు, పసుపు – టీ స్పూను, వెల్లుల్లి పొడి – టీస్పూను, ఉప్పు – పావుటీస్పూను. ఆరెంజ్ సాస్: నీళ్లు – ముప్పావు కప్పు, ఆరెంజ్ జ్యూస్ – కప్పు, బ్రౌన్ సుగర్ – ముప్పావు కప్పు, మేపిల్ సిరప్ – ముప్పావు కప్పు, రైస్ వెనిగర్ – రెండు టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి తరుగు – రెండు టీస్పూన్లు, అల్లం తురుము – ఒకటిన్నర టేబుల్ స్పూను, ఆలివ్ ఆయిల్ – టీస్పూను, కార్న్‌స్టార్చ్ – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: ►ముందుగా బ్యాటర్కోసం తీసుకున్న పదార్థాలన్నీ కలిపి బ్యాటర్‌ను రెడీ చేసుకోవాలి. ►క్యాలీఫ్లవర్‌ను శుభ్రంగా కడిగి మీడియం సైజు ముక్కలుగా కట్ చేయాలి. ఒక్కోముక్కను బ్యాటర్లో ముంచి ముక్కకు పట్టించాలి. ►అన్ని ముక్కలకు బ్యాటర్ పట్టించిన తరువాత ముక్కలను ఇరవై నిమిషాలపాటు బేక్ చేయాలి. ►ఇప్పుడు కార్న్‌స్టార్చ్‌ను నీళ్లల్లో వేసి మందంగా కలుపుకోవాలి. ►స్టవ్ మీద బాణలిపెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తరువాత వెల్లుల్లి, అల్లం తురుమును వేసి మూడు నిమిషాలు వేయించాలి.ఇవి వేగాక కార్న్‌స్టార్చ్ మిశ్రమం వేసి కలుపుతూ ఉడికించాలి. తరువాత ఆరెంజ్ సాస్‌కోసం తీసుకున్న పదార్థాలన్నీ వేసి ఐదు నిమిషాలపాటు ఉడికిస్తే ఆరెంజ్ సాస్ రెడీ అయినట్లే. ►ఇప్పుడు బేక్ చేసిపెట్టిన క్యాలీఫ్లవర్ ముక్కలను ఆరెంజ్ సాస్‌లో ముంచి మరో పదినిమిషాల పాటు బేక్ చేయాలి. ►ఐదు నిమిషాల తరువాత క్యాలీఫ్లవర్ ముక్కలను మరోవైపు తిప్పి గోల్డ్ కలర్లోకి మారేంత వరకు బేక్ చేస్తే ఆరెంజ్ క్యాలీఫ్లవర్ రెడీ. -
వంటల్లో వాడే ఈ పూల ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
అరటిపువ్వు, కాలీఫ్లవర్ వంటి వాటిని మనం ఎప్పటి నుంచో వంటల్లో ఉపయోగిస్తున్నాం. కుంకుమపువ్వునూ అనాదిగా పాలతో గర్భిణులచే తాగించడమూ మన సంస్కృతిలో భాగమే. ఇప్పుడు బ్రోకలీ వంటి విదేశీ పూలూ మన వంటల్లో భాగమయ్యాయి. ఇటీవల తామరపూలనూ ఆరోగ్యం కోసం మనం ఆహారంలో భాగం చేసుకుంటున్నాం. ఇక మందారపూలతో టీ తాగడమూ చూస్తున్నాం. ఆయా పూలతో మనకు సమకూరే పోషకాలూ, ఒనగూరే (ఆరోగ్య) ప్రయోజనాలను తెలుసుకుందాం. కాలీఫ్లవర్ గోబీ పువ్వు అని తెలుగులో, ఫూల్ గోబీ అని హిందీలో పిలిచే ఈ పువ్వును మనం ఎప్పటినుంచో వంటలో కూరగానూ, కాలీఫ్లవర్ పకోడీ రూపంలో శ్నాక్స్గానూ తింటూనే ఉన్నాం. ఇది క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తుంది. ముఖ్యంగా కాలీఫ్లవర్‌లో సల్ఫోరఫేన్ అనే ఫైటో కెమికల్ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. కాలీఫ్లవర్‌లోని ఇండోల్–3–కార్బినాల్ అనే స్టెరాల్ కూడా క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. కాలిఫ్లవర్ తినేవారిలో అది ప్రోస్టేట్, పెద్దపేగు, రొమ్ము, ఒవేరియన్ క్యాన్సర్ల నివారణకు తోడ్పడుతుందని అనేక పరిశోధనల్లో తేలింది. ఇక ముందు చెప్పుకున్న సల్ఫోరఫేన్ పోషకం ఆటిజమ్‌ను నివారించడంలో కొంతమేర తోడ్పడుతుందని కొన్ని అధ్యయనాల్లో తెలిసివచ్చింది. అప్పటినుంచి ఈ విషయమై మరికొన్ని పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అరటిపువ్వు ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థం, కొవ్వులు, క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్, పొటాషియమ్, మెగ్నీషియమ్, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. అరటిపువ్వుతో ఆరోగ్యానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. అరటిపువ్వుతో కూరలను వండి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. ఉదాహరణకు... అరటిలోని పోషకగుణాలు ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇందులోని ఇథనాల్ హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి, గాయం త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది. అరటిపువ్వులోని పోషకాలు మలేరియా కారక క్రిములను ఎదుర్కొంటాయని ఒక అధ్యయనం చెబుతోంది. అయితే ఈ విషయం ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. అరటిపువ్వులోని యాంటీ ఆక్సిడెంట్స్... క్యాన్సర్ కారకాలుగా మారే ఫ్రీరాడికల్స్‌ని నివారిస్తాయి. రక్తంలోని చెక్కెరను నియంత్రించడం ద్వారా డయాబెటిస్‌ను నివారిస్తుంది. ఇందులో ఐరన్ ఎక్కువ కాబట్టి రక్తహీనత అనీమియాను అరికడుతుంది. అరటిపువ్వుల కూర తినడం మహిళల ఆరోగ్యానికి బాగా మేలు చేస్తుంది. ఉదాహరణకు రుతు సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ కావడం తగ్గుతుంది. రుతుస్రావం వచ్చే ముందు మూడ్స్ త్వరత్వరగా మారిపోవడం, కడుపునొప్పి వంటి అనేక సమస్యలు కనిపించే పీ–మెనుస్ట్రువల్ సిండ్రోమ్ (పీఎమ్ఎస్) తగ్గిపోతుంది. ఇందులోని మెగ్నీషియమ్ వల్ల యాంగై్జటీ తగ్గి, మంచి మూడ్స్ సమకూరుతాయి. బిడ్డకు పాలిచ్చే తల్లుల్లో (బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్‌లో) పాలు బాగా ఊరేలా తోడ్పడుతుంది. కుంకుమపువ్వు మనమెంతోకాలంగా కుంకుమపువ్వును ఓ సుగంధద్రవ్యంగా వాడుతున్న సంగతి అందరికీ తెలిసిన విషమయే. జఫ్రానీ బిర్యానీ అంటూ బిర్యానీ తయారీలోనూ, కశ్మీరీ పులావ్ వంటి వంటకాల్లోనూ కుంకుమపువ్వును ఉపయోగిస్తుంటాం. మంచి మేనిఛాయతో పండండి బిడ్డ పుట్టడానికి కుంకుమపువ్వు దోహదం చేస్తుందన్న నమ్మకం చాలామందిలో ఉంది. ఆ మాటలో ఎంత వాస్తవం ఉందన్న సంగతి పక్కన పెడితే అనాదిగా అదో సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే ఇందులో బీ–కాంప్లెక్స్ విటమిన్‌కు సంబంధించిన థయామిన్, రైబోఫ్లేవిన్ అన్న విలువైన పోషకాలు గర్భవతుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే గర్భవతుల్లో ప్రోజెస్టెరాన్ అన్న హార్మోన్ కారణంగా మలబద్దకం రావడం చాలా సహజంగా జరుగుతుంటుంది. చాలా పరిమితమైన మోతాదులో తీసుకుంటే కుంకుమపువ్వు జీర్ణప్రక్రియను సాఫీగా జరిగేలా చేస్తుంది. ఆకలిని కూడా పెంచుతుంది. ఇలా ఎన్నో రకాలుగా ఇది గర్భవతులకు ఇది మేలు చేస్తుంది. అయితే ఎక్కువ మోతాదులో దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ఎందుకంటే ఇదో నేచురల్ హెర్బ్ కాబట్టి పరిమితికి మించినప్పుడు అది గర్భసంచిని ముడుచుకుపోయేలా చేస్తుంది. అందుకే మరీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే గర్భస్రావం అయ్యే అవకాశమూ ఉంది. అందుకే చిటికెడంటే చిటికెడే వాడాలి. తామరపువ్వులు(కమలం పువ్వులు) తామరపూలతో చాలా మంది టీ కాచుకొని తాగుతుంటారు. అయితే తూర్పు ఆసియా ఖండంలో అనేక మంది తామరతూళ్లను వంటకోసం ఉపయోగిస్తుంటారు. తామరపూలలో విటమిన్ ఏ, బీ, సి లు చాలా ఎక్కువ. విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇక విటమిన్ బి కాంప్లెక్స్‌లో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్ సి అన్నది స్వాభావికమైన యాంటీ ఆక్సిడెంట్ అన్న విషయం తెలిసిందే. దాంతో ఇది క్యాన్సర్లతో పోరాడుతుంది. విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్–సి రోగనిరోధకశక్తిని పెంచి ఎన్నో వ్యాధులకు కవచంగా పనిచేస్తాయి. గులాబీ మనదేశంలో గులాబీరేకులతో స్వీట్పాన్లోని తీపినిచ్చే గుల్ఖండ్ తయారు చేస్తారన్న విషయం తెలిసిందే. ఇది మినహా మన దగ్గర ఆహారంలో దీని ఉపయోగం చాలా తక్కువే అయినా చైనీయులు తమ ఔషధాల్లో దీన్ని ఉపయోగిస్తుంటారు. ఇందులో ఫీనాలిక్స్ అనే పోషకాలు ఉన్నాయి. అవి గాయపు మంటను తగ్గిస్తాయి. రోజాపువ్వు రేకులతో టీ కాచుకోవడం చాలా మంచిది. ఇది గుండెజబ్బు ముప్పునూ, క్యాన్సర్, డయాబెటిస్‌నూ రిస్క్‌ను తగ్గిస్తుంది. దీన్ని చాలా పరిమితంగా టీ కాచుకోడానికీ లేదా ఫ్లేవర్‌గా ఉపయోగించడమే మంచిది. బ్రకోలీ / బ్రోకలీ బ్రకోలీ అనేది ఓ ఇటాలియన్ పేరు. ఇటాలియన్ భాషలో ‘బ్రొకోలో’ అంటే క్యాబేజీ తాలూకు పుష్ప శిఖరాగ్రం (ఫ్లవరింగ్ క్రెస్ట్ ఆఫ్ క్యాబేజీ) అని అర్థం. గతంలో క్యాలీఫ్లవర్లా అంత విస్తృతంగా దొరకకపోయినా... ఇప్పుడు మన భారతీయ నగర మార్కెట్లలోనూ విరివిగానే దొరుకుతోంది. ఇందులో విటమిన్ ఏ పాళ్లు చాలా ఎక్కువ. మేని నిగారింపుకూ, మంచి దృష్టికి ‘విటమిన్–ఏ’ దోహదపడుతుంది. ఇందులోని పోషకాలు దేహంలో పేరుకుపోయిన విషాలను తొలగించే ‘డీ–టాక్సిఫైయర్స్’గా ఉపయోగపడతాయి. మందారపువ్వు చాలా మంది దీన్ని పువ్వులను ఎండబెట్టుకొని టీ కాచుకొని తాగుతారు. మందారపువ్వు జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంపొందిస్తుంది. శరీర జీవక్రియలను క్రమబద్ధం చేస్తుంది. ఇందులో విటమిన్–సితో పాటు అనేక యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అవి కాలేయ క్యాన్సర్ వంటి అనేక క్యాన్సర్లను నివారిస్తాయి. మందారపూలతో కాచిన టీ వల్ల రక్తపోటు, యాంగై్జటీ కూడా తగ్గుతాయి. అయితే ఈ చాయ్‌ను పరిమితంగా తాగితేనే మేలు. ఇదే కాదు అన్ని రకాల టీలనూ పరిమితంగా తాగడమే మంచిది. -
శ్రీరాముని అవతారంలో సంపూర్ణేష్ బాబు
‘హృదయకాలే యం’, ‘కొబ్బరిమట్ట’ చిత్రాల ఫేమ్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘క్యాలీఫ్లవర్’కి గుమ్మడికాయ కొట్టారు. ఆర్కే మలినేని దర్శకత్వంలో సంపూర్ణేష్, వాసంతి జంటగా నటించిన చిత్రం ‘క్యాలీఫ్లవర్’. గుడూరు శ్రీధర్ సమర్పణలో ఆశాజ్యోతి గోగినేని నిర్మించారు. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా సినిమాలో శ్రీరాముడు వేషధారణలో ఉన్న సంపూర్ణేష్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఇంగ్లాండ్ నుంచి ఇండియా వచ్చిన ఓ ఇంగ్లిష్ వ్యక్తిగా సంపూ కనిపిస్తారు. గోపీ కిరణ్ చక్కని కథ అందించారు’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కోల నాగేశ్వరరావు, హరిబాబు జెట్టి. -
‘క్యాలీఫ్లవర్’ షూటింగ్‌కు రెడీ అయిన సంపూ
‘హృదయ కాలేయం’, ‘కొబ్బరిమట్ట’ చిత్రాల ఫేమ్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘క్యాలీఫ్లవర్’. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వాసంతి హీరోయిన్ గా నటిస్తున్నారు. గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్ పతాకాలపై ఆశాజ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం షూటింగ్‌కి కొంచెం విరామం ఇచ్చిన చిత్రబృందం తాజాగా హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలుపెట్టింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కోల నాగేశ్వరరావు, హరిబాబు జెట్టి, కథ: గోపీ కిరణ్, సంగీతం: ప్రజ్వల్ క్రిష్, కెమెరా: ముజీర్ మాలిక్. -
సంపూ బర్త్‌డే: క్యాలీఫ్లవర్ ఫస్ట్‌లుక్ రిలీజ్
సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘క్యాలీఫ్లవర్’. ‘శీలో రక్షతి రక్షితః’ అనేది ఉపశీర్షిక. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వాసంతి హీరోయిన్ . గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌పై ఆశా జ్యోతి గోగినేని నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే మొదలైంది. మే 9 సంపూర్ణేష్ బర్త్ డేకి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చిన వ్యక్తిగా సంపూ లుక్ అదిరిపోయింది. సంపూ స్టైల్ కామెడీతో సినిమా ఉంటుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: దీప్ ప్రజ్వల్ క్రిష్, కెమెరా: ముజీర్ మాలిక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కోల నాగేశ్వరరావు, హరిబాబు జెట్టి. -
కూరగాయలతోనే పొట్ట తగ్గించుకోండి
► కొంతమందికి పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోయి చూడటానికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అయితే కూరగాయలతోనే ఈ కొవ్వును తగ్గించుకోవచ్చు. ► కొవ్వును కరిగించేందుకు గుమ్మడి కాయ తీసుకోవడం మంచిది. మంచి గుమ్మడితో కూర చేసుకుని తినడం, బూడిద గుమ్మడి జ్యూస్ చేసుకుని తాగడం మంచి ఫలితాలనిస్తుంది. ► ఆహారంలో పచ్చి మిరపకాయలను విరివిగా వాడటం ద్వారా కూడా కొవ్వు కరుగుతుందని నిపుణుల మాట. ► కాలీఫ్లవర్, క్యాబేజీలను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వీటిలో ఉండే పీచు పదార్థాలు పొట్ట పెరగడాన్ని ఆరోగ్యంగా అరికడతాయి. ► అదేవిధంగా వారానికి రెండు మూడు సార్లు పుట్టగొడుగులు తీసుకోవడం కూడా కొవ్వు కరిగించడానికి తోడ్పడుతుంది. పుట్టగొడుగుల్లో ఉన్న ప్రోటీన్లు మన శరీరంలో మెటబాలిజంను బాగా పెంచుతాయి. దీంతో కొవ్వు బాగా కరుగుతుంది. ► ఎక్కువ మోతాదులో ఆకుకూరలు తీసుకోవడమూ శరీరంలోని అదనపు కొవ్వు ను కరిగించడానికి తోడ్పడుతుంది. ఇక్కడ చదవండి: ఫోడ్మ్యాప్ ఆహారం అంటే..? ఈ ఆహారంతో అస్తమాకు చెక్! -
గోబీ మంచూరియా లాగిద్దామా..
క్యాలీ ఫ్లవర్ పువ్వులు వెన్నముద్దల్లా ఉంటాయి. సరిగ్గా వండితే గొంతులోకి రుచిగా జారుతాయి. తెలుగువారి వంట గదుల్లోకి లేటుగా వచ్చినా లేటెస్ట్ రెసిపీతో ఎప్పటికప్పుడు తన రుచిని చాటుకుంటూనే ఉంది ఈ పువ్వు. ఫైబర్ ఎక్కువగా ఉండే క్యాలీ ఫ్లవర్ ఆరోగ్య ప్రియుల పట్టికలో మొదటి వరుసలో ఉండాలి. ఈ ఫ్లవర్ ఫ్లేవర్స్‌ని ఎంజాయ్ చేయండి. ► పాప్‌కార్న్ క్యాలీఫ్లవర్ కావలసినవి: పంచదార – 4 టీ స్పూన్లు; ఉప్పు – టీ స్పూను; కారం – టీ స్పూను; పసుపు – టీ స్పూను; ఉల్లి పొడి – అర టీ స్పూను; వెల్లుల్లి పొడి – అర టీ స్పూను; క్యాలీఫ్లవర్ – చిన్న పువ్వు; కుకింగ్ స్ప్రే – తగినంత; (ఇందులో పదార్థాలు సూపర్ మార్కెట్లలో కాని బేకరీలలో కాని దొరుకుతాయి). తయారీ: ముందుగా అవెన్‌ను 400 డిగ్రీల ఫారెన్‌హీట్ దగ్గర వేడి చేసుకోవాలి బేకింగ్ షీట్ మీద అల్యూమినియం ఫాయిల్ వేయాలి ఒక పాత్రలో పంచదార, ఉప్పు, కారం, పసుపు, ఉల్లి పొడి, వెల్లుల్లి పొడి వేసి బాగా కలపాలి క్యాలీఫ్లవర్‌ను చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేడి నీళ్లలో శుభ్రంగా కడిగి తడిపోయే వరకు నీడలో ఆరబెట్టాలి బేకింగ్ షీట్ మీద క్యాలీ ఫ్లవర్ తరుగు పల్చగా పరవాలి కుకింగ్ స్ప్రేను అన్నిటి మీద తేలికగా స్ప్రే చేయాలి కలిపి ఉంచుకున్న మసాలాను వీటి మీద చల్లాలి సుమారు 30 నిమిషాలు అవెన్‌లో ఉంచి తీసి వేడివేడిగా అందించాలి. ► ఆలూ గోబీ కావలసినవి: నూనె – టేబుల్ స్పూను; జీలకర్ర – టీ స్పూను; వెల్లుల్లి రేకలు – 4; అల్లం తురుము – టీ స్పూను; బంగాళ దుంపలు – 2 (ఉడికించి తొక్క తీసి, పెద్ద పెద్ద; ముక్కలుగా కట్ చేయాలి); పసుపు – అర టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – తగినంత; క్యాలీఫ్లవర్ – చిన్నది (1); కొత్తిమీర తరుగు – టీ స్పూను. తయారీ: బాణలిలో నూనె వేడయ్యాక జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అల్లం తురుము వేసి వేయించాలి బంగాళ దుంప ముక్కలు వేసి బాగా కలపాలి పసుపు, కారం, జీలకర్ర, గరం మసాలా, ఉప్పు, కరివేపాకు, ఆరేడు నిమిషాలు మధ్యమధ్యలో కలుపుతుండాలి క్యాలీ ఫ్లవర్, కొత్తిమీర తరుగు జత చేసి బాగా కలపాలి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించి దింపేయాలి. ► క్యాలీఫ్లవర్ ఆవకాయ కావలసినవి: క్యాలీఫ్లవర్ తరుగు – మూడు కప్పులు; ఆవాలు – ఒకటిన్నర టీ స్పూన్లు; మెంతులు – అర టేబుల్ స్పూను; నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు; కారం – 100 గ్రా.; నువ్వుపప్పు నూనె – పావు కేజీ; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; వెల్లుల్లి రెబ్బలు – 10. తయారీ: ముందుగా క్యాలీఫ్లవర్‌ను శుభ్రంగా కడగాలి ఉప్పు జత చేసిన నీళ్లు గోరు వెచ్చని నీళ్లలో క్యాలీఫ్లవర్ తరుగును సుమారు పది నిమిషాలు ఉంచాక, నీళ్లను వడకట్టాలి తడి పూర్తిగా పోయేవరకు క్యాలీఫ్లవర్‌ను నీడలో ఆరబెట్టాలి బాణలిలో నూనె పోసి కాగాక, క్యాలీఫ్లవర్ తరుగు వేసి సన్న మంట మీద సుమారు ఐదు నిమిషాలు వేయించి, నూనె తీసి పక్కన ఉంచాలి (నూనెలోనే ఉంచితే ముక్కలు మెత్తబడిపోతాయి) బాణలిలో నూనె లేకుండా మెంతులు వేయించి, చల్లారాక పొడి చేసి పక్కన ఉంచుకోవాలి ఆవాలను ఎండబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి పెద్ద పాత్రలో క్యాలీఫ్లవర్ ముక్కలు, పక్కన ఉంచిన నూనె వేసి కలపాలి ఆవ పొడి, మెంతి పొడి, కారం, ఉప్పు, పసుపు, మెత్తగా చేసిన వెల్లుల్లి వేసి బాగా కలపాలి నిమ్మరసం వేసి మరోమారు కలపాలి ∙తడి లేని జాడీలో నిల్వ చేసుకోవాలి (ఫ్రిజ్లోఉంచితే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది విడిగా ఉంచితే 15 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది) వేడివేడి అన్నంలో, కమ్మటి నెయ్యితో క్యాలీఫ్లవర్ ఆవకాయ అందిస్తే రుచిగా ఉంటుంది. ► ఉల్లిపాయ క్యాలీఫ్లవర్ సూప్ కావలసినవి: రౌండ్ బ్రెడ్ – 1 స్లైసు; వెన్న – 2 టేబుల్ స్పూన్లు (కరిగించాలి) సూప్ కోసం; ఉల్లి తరుగు – కప్పు; క్యాలీఫ్లవర్ తరుగు – కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 2 (సన్నగా తరగాలి); బటర్ లేదా ఆలివ్ ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు; మైదా పిండి – టేబుల్ స్పూను; ఉడికించిన కూరగాయల నీళ్లు (వెజిటబుల్ స్టాక్) – 2 కప్పులు; పాలు – కప్పు (చిక్కటివి); కుంకుమ పువ్వు – చిటికెడు; ఉప్పు – తగినంత; మిరియాల పొడి – 2 టీ స్పూన్లు. బ్రెడ్ బౌల్ తయారీ: బ్రెడ్ పై భాగంలో గుండ్రంగా కట్ చేసి బౌల్ మాదిరి చేసుకోవాలి కరిగించిన బటర్‌ను బ్రెడ్ లోపలి భాగమంతా పూతలా పూయాలి అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసి, బ్రెడ్ బౌల్స్‌ను సుమారు 20 నిమిషాలు బేక్ చేయాలి. సూప్ తయారీ: పాన్‌లో బటర్ లేదా ఆలివ్ ఆయిల్‌ను వేడి చేసి వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్ది సేపు వేయించాలి ఉల్లి తరుగు, క్యాలీఫ్లవర్ తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి మైదా పిండి వేసి బాగా కలపాలి ∙వెజిటబుల్ స్టాక్ జత చేసి బాగా కలపాలి పాలలో కలిపిన కుంకుమ పువ్వు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి, మరిగాక సన్నని మంట మీద సుమారు పది నిమిషాలు ఉంచితే సూప్ బాగా చిక్కబడుతుంది సూప్‌ను బ్రెడ్ బౌల్స్‌లో వేసి వేడివేడిగా అందించాలి. (బ్రెడ్ బౌల్స్ అవసరం లేదనుకుంటే, మామూలు పాత్రలో సూప్ సర్వ్ చేసుకోవచ్చు). ► క్యాలీఫ్లవర్ పరాఠా కావలసినవి: క్యాలీఫ్లవర్ – చిన్నది (1); పచ్చి మిర్చి ముద్ద – టీ స్పూను; ధనియాల పొడి – టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – తగినంత; గోధుమపిండి – 3 కప్పులు. తయారీ: ముందుగా క్యాలీఫ్లవర్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్‌చేసి, గోరువెచ్చని నీటిలో పది నిమిషాలు ఉంచి తీసేయాలి తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి మెత్తగా ఉడికించాలి పెద్ద పాత్రలో గోధుమ పిండి, ఉడికించిన క్యాలీఫ్లవర్, పచ్చి మిర్చి ముద్ద, ధనియాల పొడి, ఉప్పు వేసి చపాతీలా కలపాలి (అవసరమనుకుంటేనే నీళ్లు జత చేయాలి) పెద్ద నిమ్మకాయ పరిమాణంలో ఉండలు చేసి పక్కన ఉంచాలి ఒక్కో ఉండను పరాఠాలా జాగ్రత్తగా ఒత్తి, పెనం మీద వేసి రెండు వైపులా నూనె వేసి కాల్చాలి కుర్మాతో కాని, పెరుగుతో కాని తింటే రుచిగా ఉంటాయి. ► క్యాలీ ఫ్లవర్ 65 కావలసినవి: క్యాలీఫ్లవర్ – 1 (మీడియం సైజుది); కరివేపాకు – 3 రెమ్మలు; మైదా పిండి – 2 టేబుల్ స్పూన్లు; బియ్యప్పిండి – 1 టేబుల్ స్పూను; కార్న్ ఫ్లోర్ – 1 టేబుల్ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; గరం మసాలా – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – రెండు టీ స్పూన్లు; నూనె – వేయించటానికి తగినంత. తయారీ: ఒక పాత్రలో మైదా పిండి, బియ్యప్పిండి, కార్న్ ఫ్లోర్, మిరప కారం, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా నీళ్లు జత చేసి కలపాలి క్యాలీఫ్లవర్‌ను శుభ్రం చేసి, చిన్న చిన్న ఫ్లవర్స్‌లా వచ్చేలా విడదీయాలి ఒక పాత్రలో నీళ్లు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి కొద్దిగా వేడయ్యాక, విడదీసిన క్యాలీఫ్లవర్‌ను అందులో వేసి కొద్దిసేపు ఉడికించి తీసేసి, కలిపి ఉంచుకున్న పిండి మిశ్రమానికి జత చేయాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, కొద్దికొద్దిగా తీసుకుంటూ నూనెలో వేసి బాగా వేగాక, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి కరివేపాకుతో అలంకరించి వేడివేడిగా సర్వ్ చేయాలి ∙అన్నం, చపాతీలలోకి మాత్రమే కాదు, స్నాక్‌లా తిన్నా కూడా రుచిగా ఉంటుంది. ► క్యాలీ ఫ్లవర్ బోండా కావలసినవి: క్యాలీ ఫ్లవర్ – అర కేజీ (చిన్న చిన్న పువ్వులుగా విడదీసుకోవాలి); సెనగ పిండి – పావు కేజీ; బియ్యప్పిండి – 50 గ్రా.; పచ్చి మిర్చి – 7; మిరప కారం – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్ స్పూన్లు (పిండి కలుపుకోవటానికి); జీలకర్ర – అర టీ స్పూను; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; బేకింగ్ సోడా – పావు టీ స్పూను; నీళ్లు – తగినన్ని; నూనె – వేయించడానికి తగినంత. తయారీ: పచ్చి మిరపకాయలను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకోవాలి ∙జీలకర్ర జత చేసి మరోమారు మిక్సీ పట్టి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి క్యాలీఫ్లవర్ తరుగును ఉప్పు వేసిన గోరు వెచ్చని నీళ్లలో శుభ్రంగా కడిగి, మంచినీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి, కొద్దిగా ఉడికించాలి ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి నూనె జత చేసి మరోమారు ఉండలు లేకుండా బాగా కలపాలి తగినన్ని నీళ్లు జత చేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి మిరప కారం, పచ్చిమిర్చి + జీలకర్ర మిశ్రమం జత చేసి మరోమారు కలపాలి చివరగా కొత్తిమీర జత చేసి మరోమారు కలిపి, మూత పెట్టి, అరగంటసేపు పక్కన ఉంచాలి స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగనివ్వాలి ∙కలిపి ఉంచుకున్న పిండికి బేకింగ్ సోడా జత చేయాలి కొద్దిగా ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను బొండాల మాదిరిగా పిండిలో ముంచుతూ నూనెలో వేయాలి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి సాస్, కెచప్, చట్నీలతో సర్వ్ చేయాలి.(నూనెలో వేయించినవి తిన్న తరవాత మజ్జిగ తాగితే మంచిది. నూనె పదార్థాలకు మజ్జిగ విరుగుడుగా పనిచేస్తుంది) ►గోబీ మంచూరియా కావలసినవి: క్యాలీఫ్లవర్ – 1; మైదా పిండి – కప్పు; కార్న్ ఫ్లోర్ – కప్పు; పచ్చి మిర్చి – 6; అల్లం తురుము – టీ స్పూను; వెల్లుల్లి ముద్ద – టీ స్పూను; ఉప్పు – తగినంత; ఉల్లి తరుగు – కప్పు; ఉడికించిన బఠాణీ – కప్పు; సోయా సాస్ – టీ స్పూను; అజినమోటో – అర టీ స్పూను; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; ఉల్లికాడల తరుగు – పావు కప్పు. తయారీ: ముందుగా క్యాలీఫ్లవర్‌ను శుభ్రంగా నీళ్లతో కడిగి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా ఉడికించాలి మిక్సీలో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి మెత్తగా చేయాలి పెద్ద పాత్రలో క్యాలీ ఫ్లవర్ తరుగు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముద్ద, ఉడికించిన బఠాణీ, ఉల్లి తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి కార్న్‌ఫ్లోర్, మైదా పిండి వేసి పకోడీల పిండిలా కలపాలి (నీళ్లు పోయకూడదు) బాణలిలో నూనె కాగాక క్యాలీఫ్లవర్ మిశ్రమాన్ని చిన్న చిన్న మంచూరియాలుగా వేసి దోరగా వేయించి కిచెన్ న్యాప్కిన్ మీదకు తీసుకోవాలి వేరొక బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక వెల్లుల్లి రెబ్బలు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఉల్లి కాడల తరుగు వేసి వేయించాలి తయారైన మంచూరియాలను వేసి అన్నీ కలిసేలా కలుపుతుండాలి చిన్న గిన్నెలో కొద్దిగా కార్న్‌ఫ్లోర్, తగినన్ని నీళ్లు వేసి పల్చగా పిండి కలిపి, బాణలిలోని మంచూరియాల మీద వేసి కలపాలి సోయాసాస్, అజినమోటో వేసి మరోమారు కలిపి రెండు నిమిషాలలో దింపేసి, టొమాటో సాస్‌తో సర్వ్‌చేయాలి. నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ -
క్యాలీ ఫ్లేవర్
క్యాలీ ఫ్లవర్ పువ్వులు వెన్నముద్దల్లా ఉంటాయి. సరిగ్గా వండితే గొంతులో రుచిగా జారుతాయి. తెలుగువారి వంట గదుల్లోకి లేటుగా వచ్చినా లేటెస్ట్ రెసిపీతో ఎప్పటికప్పుడు తన రుచిని చాటుకుంటూనే ఉంది ఈ పువ్వు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ కూర పువ్వు ఆరోగ్య ప్రియుల పట్టికలో మొదటి వరుసలో ఉండాలి. ఈ ఫ్లవర్ ఫ్లేవర్స్‌ని ఎంజాయ్ చేయండి. క్యాలీఫ్లవర్ బటర్ మసాలా కర్రీ కావలసినవి: – క్యాలీఫ్లవర్ – 1 (మీడియం సైజు); పసుపు – అర టీ స్పూను; బటర్ – 3 టేబుల్ స్పూన్లు; బిర్యానీ ఆకు – 1; లవంగాలు – 2; ఏలకులు – 2; దాల్చిన చెక్క – చిన్న ముక్క; ఉల్లి తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు; మిరప కారం – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – 3 టీ స్పూన్లు; గరం మసాలా – అర టీ స్పూను; జీడిపప్పు పలుకులు – 12; కసూరీ మేథీ – అర టీ స్పూను; తాజా క్రీమ్ – పావు కప్పు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – కొద్దిగా; ఉప్పు – తగినంత. తయారీ: ►క్యాలీఫ్లవర్‌ను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ►స్టౌ మీద బాణలిలో నీళ్లు, పసుపు వేసి మరిగించాలి ►క్యాలీఫ్లవర్ తరుగును జత చేసి కొద్దిగా ఉడికించి, క్యాలీఫ్లవర్‌ను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►స్టౌ మీద పాన్‌లో బటర్ వేసి కరిగాక క్యాలీఫ్లవర్ తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి ►కొద్దిగా నీళ్లు జత చేసి మూత ఉంచి పది నిమిషాలు ఉడికించి, ప్లేట్లోకి తీసుకోవాలి ►అదే బాణలిలో మరి కాస్త బటర్ వేసి కరిగాక బిర్యానీ ఆకు, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ►టొమాటో తరుగు, జీడిపప్పు పలుకులు, ధనియాల పొడి, గరం మసాలా, మిరప కారం వేసి టొమాటో తరుగు ఉడికేవరకు కలిపి దింపి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►స్టౌ మీద బాణలి ఉంచి, వేడయ్యాక నూనె వేసి కాగాక, ఈ మసాలా ముద్దను అందులో వేసి బాగా కలిపి, క్యాలీఫ్లవర్ ముక్కలు, ఉప్పు జత చేసి కలియబెట్టి, సుమారు ఐదు నిమిషాలపాటు ఉడికించాలి ►తాజా క్రీమ్, కసూరీ మేథీ జత చేసి మరోమారు కలియబెట్టి, రెండు నిమిషాలు ఉడికిన తరవాత కొత్తిమీరతో అలంకరించి దింపేయాలి. ధాబా స్టయిల్ క్యాలీఫ్లవర్ కావలసినవి: – క్యాలీ ఫ్లవర్ – 1 (మీడియం సైజు); నూనె – 6 టేబుల్ స్పూన్లు; ఇంగువ – పావు టీ స్పూను; బంగాళ దుంప – 1 (పెద్దది, పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి); పసుపు – అర టీ స్పూను; క్యాప్సికమ్ తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి – ఒక టే బుల్ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; గరం మసాలా – ఒక టీ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ∙ ►గోరు వెచ్చని నీళ్లలో క్యాలీఫ్లవర్ తరుగు వేసి శుభ్రంగా కడగాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఇంగువ, పసుపు, బంగాళ దుంప ముక్కలు వేసి బాగా వేయించి, ముక్కలు మెత్తపడేవరకు మూత ఉంచాలి ►క్యాలీ ఫ్లవర్ తరుగు, ఉప్పు జత చేసి బాగా కలిపి మరో పది నిమిషాలు మూత ఉంచాలి ►క్యాప్సికమ్ తరుగు జత చేసి మరో ఐదు నిమిషాలు ఉంచాలి (ముక్కలు మరీ మెత్తగా అవకూడదు) ►మిరప కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి బాగా కలియబెట్టాలి ►టొమాటో తరుగు జత చేసి మరోమారు కలిపి, ముక్కలు మెత్తబడేవరకు ఉంచాలి ►కొత్తిమీర తరుగు జత చేసి దింపేయాలి ►గోబీ ధాబా స్టయిల్ కూర రెడీ అన్నం, రోటీ, పరాఠాలలోకి రుచిగా ఉంటుంది. క్యాలీఫ్లవర్ ఫ్రై కావలసినవి: క్యాలీఫ్లవర్ తరుగు – 3 కప్పులు; నీళ్లు – 3 కప్పులు; ఉప్పు – తగినంత; పేస్ట్ కోసం; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు; సోంపు – పావు టీ స్పూను; కొబ్బరి నూనె లేదా నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 1; కరివేపాకు – రెండు రెమ్మలు; టొమాటో తరుగు – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; గరం మసాలా పొడి – పావు టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ►గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి, అందులో క్యాలీఫ్లవర్ తరుగు వేసి శుభ్రంగా కడగాలి ►స్టౌ మీద బాణలిలో మూడు కప్పుల నీళ్లు, ఉప్పు వేసి మరిగించి దింపేయాలి ►క్యాలీఫ్లవర్‌ను అందులో వేసి సుమారు పది నిమిషాల తరవాత నీరంతా ఒంపేయాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి లేదా కొబ్బరి నూనె వేసి కాగాక, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►టొమాటో తరుగు, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి ►ముక్కలు బాగా మెత్తపడ్డాక, పసుపు, మిరపకారం, మిరియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి వేయించాలి ►క్యాలీఫ్లవర్ తరుగు వేసి బాగా కలియబెట్టాలి (నీళ్లు పోయకూడదు) మూత పెట్టి సన్నని మంట మీద కొద్దిసేపు ఉంచి, దింపేయాలి (మధ్యమధ్యలో కలుపుతుండాలి) ►కొత్తిమీరతో అలంకరించాలి ►అన్నం, చపాతీ, పరాఠాలలోకి రుచిగా ఉంటుంది. క్యాలీ ఫ్లవర్ తోరణ్ (కేరళ స్టయిల్) కావలసినవి: – క్యాలీ ఫ్లవర్ – 1; ఉల్లి తరుగు – ఒక కప్పు; కొబ్బరి నూనె – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; తాజా కొబ్బరి తురుము – 4 టేబుల్ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – 4; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ►క్యాలీఫ్లవర్‌ను శుభ్రం చేసి సన్నగా తరిగి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక జీలకర్ర వేసి వేయించాలి ►మినప్పప్పు వేసి మరోమారు వేయించాలి ►ఉల్లి తరుగు వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి ►పచ్చి మిర్చి తరుగు, పసుపు, కరివేపాకు జత చేసి మరోమారు కలియబెట్టాలి ►క్యాలీఫ్లవర్ తరుగు, ఉప్పు జత చేసి బాగా కలిపి మూత ఉంచి, క్యాలీఫ్లవర్ మెత్తబడే వరకు ఉడికించాలి ►కొబ్బరి తురుము వేసి బాగా కలిపి రెండు నిమిషాల పాటు సన్నటి మంట మీద ఉంచి దింపేయాలి అన్నంలో రుచిగా ఉంటుంది. క్యాలీఫ్లవర్ కుర్మా కావలసినవి: –క్యాలీఫ్లవర్ తరుగు – ఒక కప్పు; క్యారట్ తరుగు – అర కప్పు; పచ్చి బఠాణీ – 3 టేబుల్ స్పూన్లు; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టేబుల్ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – 2; టొమాటో గుజ్జు – పావు కప్పు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; జీలకర్ర పొడి – అర టీ స్పూను; దాల్చిన చెక్క – చిన్న ముక్క; కరివేపాకు – రెండు రెమ్మలు; పల్చటి కొబ్బరి పాలు – ఒక కప్పు; చిక్కటి కొబ్బరి పాలు – అర కప్పు ; ఉప్పు – తగినంత; జీడిపప్పు పలుకులు – 10; నూనె – తగినంత; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను. తయారీ: ►స్టౌ మీద ఒక పెద్ద పాత్రలో నీళ్లు, క్యాలీ ఫ్లవర్ తరుగు, క్యారట్ తరుగు, పచ్చి బఠాణీ జత చేసి ఉడికించాక, దింపి నీళ్లు ఒంపేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక దాల్చిన చెక్క, కరివేపాకు వేసి వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి వేసి వేయించాలి ►టొమాటో గుజ్జు, మిరప కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా వేయించాలి ►పల్చటి కొబ్బరి పాలు, ఉప్పు, కూరముక్కలు వేసి ఉడికించాలి ►ఐదారు నిమిషాల తరవాత బాగా ఉడికిందనుకున్న తరవాత చిక్కటి పాలు, జీడిపప్పు పలుకులు జత చేసి కలిపి దింపేయాలి ►కొత్తిమీర తరుగుతో అలంకరించి అందించాలి ►రోటీలు, పూరీలలోకి రుచిగా ఉంటుంది. గోబీ మసాలా కావలసినవి: – క్యాలీఫ్లవర్ – చిన్నది (ఒకటి); పసుపు – అర టీ స్పూను; ఆవ నూనె – 2 టేబుల్ స్పూన్లు; జీలకర్ర – అర టీ స్పూను; బిర్యానీ ఆకు – 1; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; నీళ్లు – 2 టీ స్పూన్లు + ఒక కప్పు; ఉల్లి తరుగు – ఒక కప్పు; గరం మసాలా – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; టొమాటో గుజ్జు – పావు కప్పు; నెయ్యి – ఒక టీ స్పూను; తాజా క్రీమ్ – 2 టేబుల్ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – 4; జీడిపప్పు ముక్కలు – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత తయారీ: ►క్యాలీఫ్లవర్‌ను చిన్నచిన్నగా విడదీసి పక్కన ఉంచాలి ►గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి అందులో క్యాలీఫ్లవర్ తరుగు వేసి శుభ్రంగా కడిగి బయటకు తీసేయాలి ►ఒక పాత్రలో క్యాలీఫ్లవర్ తరుగు, పసుపు, ఉప్పు వేసి బాగా కలియబెట్టి పది నిమిషాల తరవాత తీసేయాలి ►స్టౌ మీద బాణలి వేడయ్యాక మంట కొద్దిగా తగ్గించి నూనె వేసి, కాగాక అందులో క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి సుమారు ఐదు నిమిషాల పాటు పచ్చి వాసన పోయేవరకు వేయించి, ప్లేట్లోకి తీసుకోవాలి ►అదే బాణలిలో ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, దింపి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►ఆ బాణలిలో మిగిలిన నూనెలో బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేగాక, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి తరుగు, రెండు టీ స్పూన్ల నీళ్లు పోసి కొద్దిసేపు ఉడికించాలి ►క్యాలీఫ్లవర్ తరుగు, టొమాటో గుజ్జు అన్నీ వేసి బాగా కలియబెట్టాలి ►వేయించిన ఉల్లి తరుగు, మిరప కారం, ఒక కప్పు నీళ్లు జత చేసి సుమారు ఐదు నిమిషాలపాటు ఉడికించాలి ►మంట బాగా తగ్గించి, ఐదు నిమిషాల తరవాత తాజా క్రీమ్, గరం మసాలా పొడి, నెయ్యి వేసి కలియబెట్టాలి ►జీడిపప్పులతో అలంకరించి తందూరీ రోటీతో కాని, అన్నంతో కాని వేడివేడిగా అందించాలి ►ఈ కూర మనమే తయారుచేసుకుంటే ఇంక రెస్టారెంట్ మీద ఆధారపడక్కర లేదు. మిక్స్డ్ స్ప్రౌట్స్ పులావ్ కావలసినవి: నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; బాస్మతి బియ్యం – ఒక కప్పు; లవంగాలు – 2; ఏలకులు – 1; దాల్చిన చెక్క – చిన్న ముక్క; బిర్యానీ ఆకు – 1; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 3; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; క్యాప్సికమ్ తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; మిక్స్డ్ స్ప్రౌట్స్ – ఒక కప్పు (పెసలు, సెనగలు, పల్లీలు... నచ్చినవన్నీ); చెన్నా మసాలా – అర టీ స్పూను; చాట్ మసాలా – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; నీళ్లు – మూడున్నర కప్పులు; కొత్తిమీర తరుగు – కొద్దిగా; పుదీనా – కొద్దిగా. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కాగాక లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క వేసి వేయించాలి ►ఉల్లి తరుగు, తరిగిన పచ్చిమిర్చి వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి వేయించాలి ►క్యాప్సికమ్ తరుగు, టొమాటో తరుగు, మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి బాగా వేయించాలి ►చెన్న మసాలా, చాట్ మసాలా, ఉప్పు, మిరప కారం వేసి బాగా కలియబెట్టాలి ►జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మరోమారు కలపాలి ►మూడున్నర కప్పుల నీళ్లు పోసి, బాగా మరిగిన తరవాత కడిగి ఉంచుకున్న బియ్యం వేసి కలిపి, ఉడికించాలి ►కొద్దిగా ఉడికిన తరవాత కొత్తిమీర, పుదీనా తరుగు వేసి, మూత ఉంచి ఉడికించాలి పావు గంట తరవాత మూత తీసి, ప్లేట్లోకి తీసుకోవాలి ►వేడివేడిగా అందించాలి. – నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ -
ఇంటిప్స్
►పాలు విరిగిపోతాయని అనుమానంగా ఉంటే కాచేటప్పుడు చిటికెడు వంటసోడా వేస్తే సరి. ►నెయ్యి కాచి దించేముందు కాసిని మెంతులు లేదా తమలపాకు వేస్తే సువాసనగా ఉండటంతోపాటు నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉన్నా, తాజాగా ఉంటుంది. ►ఇంటికి అతిథులు వచ్చారు. ఆధరువులన్నీ వడ్డించారు కానీ, సమయానికి మజ్జిగ సరిపోవని అనుమానం వచ్చిందనుకోండి, అప్పుడు కాసిని గోరువెచ్చటి పాలలో చిటికెడు ఉప్పు వేసి, నిమ్మ రసం పిండితే సరి. మజ్జిగలా తయారవుతుంది. ►కూరలో ఉప్పు ఎక్కువైందనుకోండి, కంగారు పడకండి, రెండు స్పూన్ల పాలమీగడ కలిపెయ్యండి... ఉప్పదనం కాస్తా పరారైపోయి, యమా టేస్టీగా తయారవుతుంది కూర. ►బెండకాయముక్కల్ని ముందుగా కాస్త వేయించి, ఆ తర్వాత ఉడకబెట్టి వండితే, జిగటగా ఉండకుండా, వేటికవి విడివిడిగా వస్తాయి ముక్కలు. ►క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివి ఉడికించేటప్పుడు అదొకరకమైన వాసన వేస్తాయి. అలా వాసన రాకుండా ఉండాలంటే, చిన్న బ్రెడ్ ముక్క వేయాలి లేదా స్పూను పంచదార వేయాలి. ►పులిహోర చేసేటప్పుడు, అన్నం పొడపొడలాడుతూ రావాలంటే, అన్నం ఉడికేటప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసం, ఒక స్పూను నూనె వేస్తే, అన్నం తెల్లగా మల్లెమొగ్గల్లా, పొడిపొడిగా వస్తుంది. -
కాలీఫ్లవర్‌తో క్యాన్సర్లు దూరం...
కాలిఫ్లవర్‌తో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. గోబీ పువ్వు అని మనం పిలుచుకునే కాలీఫ్లవర్ క్యాన్సర్లను దూరంగా తరిమేస్తుంది. దానితో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే.మహిళల ఆరోగ్య నిర్వహణకు కాలిఫ్లవర్ బాగా తోడ్పడుతుంది. ఎందుకంటే ఇది హార్మోన్ల సమతౌల్యతను కలిగించడంలో మేటి.కాలిఫ్లవర్ అలర్జీల పాలిటి దివ్యౌషధం. అది అన్ని రకాల అలర్జీలతో పాటు జలుబును సమర్థంగా తగ్గించగలదు. కాలీఫ్లవర్‌లోని ఇండోల్–3–కార్బినాల్ అనే జీవరసాయనం క్యాన్సర్‌తో పోరాడుతుంది. అది ప్రోస్టేట్, పెద్దపేగు, రొమ్ము, ఒవేరియన్ క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తుంది. కాలీఫ్లవర్‌లోని సల్ఫోరఫేన్ వంటి ఫైటో కెమికల్స్ కూడా ఎన్నో ఉన్నాయి. అవి సైతం క్యాన్సర్లతో సమర్థంగా పోరాడటంలో తోడ్పడతాయి. వీటిలోని సల్ఫోరఫేన్ పిల్లల్లో కనిపించే ఆటిజమ్‌ను నివారిస్తుందని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే ఇది పరిశోధన దశలో ఉంది. ఒకవేళ ఈ పరిశోధన విజయవంతమైతే వెజిటబుల్ రూపంలో ఆటిజమ్‌కు ఒక స్వాభావిక ఔషధం లభ్యమైనట్టే. కాలిఫ్లవర్ గాయాల/ దెబ్బల వల్ల కలిగే వాపు, మంట, నొప్పి (ఇన్ఫ్లమేషన్)ని తగ్గిస్తుంది. కాలిఫ్లవర్ మంచి డీ–టాక్సిఫైయింగ్ ఏజెంట్. ఇది ఒంట్లో పేరుకుపోయే చాలా విషాలనూ, వ్యర్థాలను సమర్థంగా శుభ్రం చేస్తుంది. ఇది మాక్యులార్ డీజనరేషన్ వంటి కంటి జబ్బులను నివారిస్తుంది. కాలిఫ్లవర్‌ను తినేవారిలో కనుచూపు చాలాకాలం పాటు పదిలంగా ఉంటుంది. డయాబెటిస్, పక్షవాతం, మెదడుకు సంబంధించిన అలై్జమర్స్ డిసీజ్, పార్కిన్సన్స్ డిసీజ్లను కాలిఫ్లవర్ సమర్థంగా నివారిస్తుంది. కాలిఫ్లవర్‌లో కొలెస్ట్రాల్ పాళ్లు ఇంచుమించు జీరో. కాబట్టి గుండెజబ్బులు ఉన్న వాళ్లు నిర్భయంగా తీసుకోవచ్చు. దాదాపు అన్ని రకాల గుండెజబ్బులను అది సమర్థంగా నివారిస్తుంది. బరువును ఆరోగ్యకరమైన రీతిలో తగ్గించడంలో, స్థూలకాయాన్ని నివారించడంలో దీని భూమిక చాలా కీలకమైనది. -
క్యాలిఫ్లవర్ సూప్
కావలసినవి: బటర్–రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ–ఒకటి(తరగాలి), బంగాళాదుంప–ఒకటి, తరిగిన క్యాలిఫ్లవర్–నాలుగుటేబుల్ స్పూన్లు, పాలు–ఒక కప్పు, చీజ్–ఒక స్లైస్ తయారి: బాణలిలో వెన్న వేసి వేడయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాల సేపు వేగనివ్వాలి. అప్పుడు బంగాళాదుంప ముక్కలను వేసి నాలుగు నిమిషాల సేపు వేయించిన తర్వాత క్యాలిఫ్లవర్ వేయాలి. పిల్లలు ఇష్టపడేటట్లయితే క్యారట్ లేదా కూరగాయలను కూడా వేసుకోవచ్చు. క్యాలిఫ్లవర్ వేడయిన తర్వాత కూరగాయల ముక్కలు వాటిని ఉడికించిన నీటితో సహా బాణలిలో వేసి మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫుడ్ ప్రాసెసర్‌లో బ్లెండ్ చేయాలి. దీనిని సాస్ పాన్‌లో వేసి సన్నమంట మీద ఉడికించి, పాలు పోసి, ఉప్పు కలిపి చీజ్‌తో గార్నిష్ చేయాలి. సూప్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి. ఇది ఈవెనింగ్ స్నాక్‌గా అయితే పిల్లలు ఇష్టపడతారు. పిల్లలకు ఉదయం పూట ఇవ్వాలంటే చల్లగా ఇవ్వాలి. ముందు రోజు సాయంత్రం చేసి ఆ మర్నాడు ఉదయం తీసుకుంటే మంచిది. దీనిని తీసుకోవడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు జంక్ ఫుడ్ తినాలన్న కోరిక తగ్గుతుంది. కూరగాయలు ఉడికించిన నీటికి బదులుగా కాని వాటితోపాటు కాని చికెన్ ఉడికించిన నీళ్లు, కోడిగుడ్డులోని తెల్లసొన వాడవచ్చు. పోషకాలు: ఎనర్జీ : 435 క్యాలరీలు, ప్రొటీన్లు – 17గ్రా; కార్బోహైడ్రేట్లు – 33గ్రా; ఫ్యాట్ – 33 గ్రా, ఐరన్ – 4 మి.గ్రా. -
క్యాన్సర్లతో పోరాడే కాలీఫ్లవర్...
గోబీ పువ్వు అంటూ తెలుగులో మనం పిలుచుకునే దీనితో సాధారణంగా కూర చేసుకుంటాం. కూరగా తింటే రుచిగా ఉండటమే కాదు... క్యాన్సర్ల పాలిట క్రూరంగా కూడా ఉంటుంది కాలీఫ్లవర్. దీనితో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని ఇవి... ►కాలీఫ్లవర్‌లోని సల్ఫోరఫేన్ వంటి ఫైటో కెమికల్స్ క్యాన్సర్లతో పోరాడతాయి. సల్ఫోరఫేన్ అనే పోషకం ఆటిజమ్‌ను నివారించడంలో కూడా తోడ్పడుతుందని అధ్యయనాలచెబుతున్నాయి. అయితే ఇవి ఇంకా పరిశోధన దశలోనే ఉన్నాయి. ►కాలీఫ్లవర్‌లోని ఇండోల్–3–కార్బినాల్ అనే స్టెరాల్ అనే జీవరసాయనం కూడా క్యాన్సర్‌తో పోరాడుతుంది. ప్రోస్టేట్, పెద్దపేగు, రొమ్ము, ఒవేరియన్ క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తుంది. ►అన్ని రకాల అలర్జీలతో పాటు జలుబును సమర్థంగా తగ్గించే సామర్థ్యం కాలిఫ్లవర్‌కు ఉంది. ►హార్మోన్ల సమతౌల్యతకు కాలిఫ్లవర్ బాగా దోహదపడుతుంది. ►మాక్యులార్ డీజనరేషన్ వంటి కంటి జబ్బులను నివారిస్తుంది. కనుచూపును దీర్ఘకాలం పరిరక్షిస్తుంది. ∙డయాబెటిస్, పక్షవాతం, మెదడుకు సంబంధించిన అలై్జమర్స్ డిసీజ్,పార్కిన్సన్స్ డిసీజ్లను ఇది నివారిస్తుంది. ►కాలిఫ్లవర్‌లో కొలెస్ట్రాల్ దాదాపుగా ఉండదు కాబట్టి గుండెజబ్బులు ఉన్న వాళ్లు నిర్భయంగా తీసుకోవచ్చు. అలాగే అన్ని రకాల గుండెజబ్బులను అది నివారిస్తుంది. బరువునుఆరోగ్యకరమైన రీతిలో తగ్గించి స్థూలకాయం వచ్చే అవకాశాలను నివారిస్తుంది. ►ఇది గాయాల/దెబ్బల వల్ల కలిగే వాపు, మంట, నొప్పి (ఇన్ఫ్లమేషన్)ను తగ్గిస్తుంది. కాబట్టి ఇన్ఫ్లమేషన్ తగ్గాలనుకున్న వారికి దీన్ని సిఫార్సు చేయవచ్చు. ►ఒంట్లో పేరుకుపోయే చాలా విషాలనూ, వ్యర్థాలను ఇది సమర్థంగా శుభ్రం చేస్తుంది. -
కడుపును క్లీన్ చేసే కాలీఫ్లవర్...
గుడ్‌ఫుడ్ ఆరోగ్యాన్నిచ్చే ఆహారాల్లో కాలిఫ్లవర్‌ది అగ్రస్థానం అని చాలామంది న్యూట్రిషనిస్ట్‌లు అంటారు. గోబి పువ్వు అని కూడా పిలిచే కాలిఫ్లవర్ ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని... కాలిఫ్లవర్‌లో కొలెస్ట్రాల్ దాదాపుగా ఉండదు కాబట్టి గుండె జబ్బులు ఉన్న వాళ్లు నిర్భయంగా తీసుకోవచ్చు. ఇది గాయాల/దెబ్బల వల్ల కలిగే వాపు, మంట, నొప్పులను తగ్గిస్తుంది. కాబట్టి ఇన్ఫ్లమేషన్ తగ్గాలనుకున్న వారికి దీన్ని సిఫార్సు చేయవచ్చు. డయాబెటిస్, పక్షవాతం, మెదడుకు సంబంధించిన అలై్జమర్స్, పార్కిన్సన్స్ వ్యాధులను ఇది నివారిస్తుంది. అలర్జీలతో పాటు జలుబును సమర్థంగా తగ్గించే సామర్థ్యం కాలిఫ్లవర్‌కు ఉంది. రోగనిరోధక శక్తిని పెంపొందించే అనేకరకాల పోషకాలు కాలిఫ్లవర్‌లో ఉన్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్‌తోనూ సమర్థంగా పోరాడతాయి. అందుకే క్యాన్సర్ నివారిణిగా కాలిఫ్లవర్‌కు మంచి పేరుంది. శరీరంలో పేరుకునే విషాలనూ, వ్యర్థాలను సమర్థంగా శుభ్రం చేస్తుంది. అందుకే దురలవాట్లు ఉన్నవారూ లేదా వాటిని మానేసిన వారు... వంట్లోని విషపదార్థాలను దూరం చేసుకునేందుకు దీన్ని వాడటం మంచిది. స్థూలకాయులు బరువు తగ్గడానికి వంటల్లో కాలిఫ్లవర్‌ను వాడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. హార్మోన్ల సమతౌల్యతకు కాలిఫ్లవర్ బాగా దోహదపడుతుంది. మాక్యులార్ డీజనరేషన్ వంటి కంటి జబ్బులను నివారిస్తుంది. -
ఘుమఘుమల ఫ్లవర్ బొకే
షెజ్వాన్ స్టైల్ కావలసినవి: క్యాలీఫ్లవర్ ముక్కలు - 2 కప్పులు, ఉప్పు+మిరియాలపొడి - తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు, టొమాటో సాస్ - 4 టేబుల్ స్పూన్లు, సోయాసాస్ - 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లితరుగు - టీ స్పూను, అల్లం తురుము - టీ స్పూను, మిరప్పొడి - టీ స్పూను, ఉల్లికాడల తరుగు - అర కప్పు, ఉల్లితరుగు - పావు కప్పు (పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేయాలి) తయారి: ఉప్పు వేసిన వేడి నీళ్లలో క్యాలీఫ్లవర్‌ను సుమారు 5 నిముషాలు ఉడికించి, నీరు వడకట్టి, పక్కన ఉంచాలి బాణలిలో నూనె కాగాక క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించి, ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలిపి ముక్కలను ఒక పాత్రలోకి తీసుకోవాలి అదే బాణలిలో వెల్లుల్లి తరుగు, అల్లం తురుము వేసి వేగాక, ఉల్లి తరుగు వేసి వేయించాలి మిగతా పదార్థాలను (ఉల్లికాడల తరుగు తప్ప) జత చేసి మంట తగ్గించి వేయించాలి వేయించి ఉంచుకున్న క్యాలీఫ్లవర్, సోయా సాస్, టొమాటో సాస్ వేసి కలిపి, ఉల్లికాడల తరుగుతో గార్నిష్ చేసి, దించేయాలి. చదవేస్తే కూరగాయకైనా బుద్ధి వికసిస్తుందట! ఈ మాటనే మార్క్ ట్వెయిన్ ఇంకోలా అంటారు. క్యాబేజీని కాలేజీకి పంపిస్తే క్యాలీఫ్లవర్ అవుతుందని!! అయితే, చదువయ్యాక మళ్లీ... క్యాలీఫ్లవర్‌ను ఎక్కడికి పంపించాలి? ఇంకెక్కడికి? పాఠాలు చెప్పొద్దా మనకీ, మన పిల్లలకీ! పాఠాలు రుచించనట్లే... మనలో చాలామందికి క్యాలీఫ్లవర్ రుచించకపోవచ్చు. అలాగని వదిలేస్తామా?! రుచిగా ఉన్నా, లేకున్నా... క్యాలీఫ్లవర్‌లోని ఔషధగుణాలను ‘వంట’ పట్టించుకోవాల్సిందే. ఆకులు అలముల్ని కూడా నోరూరించేలా మార్చుకోవడం ఎటూ మన చేతిలో పనే కాబట్టి.. భోజనంలోకి క్యాలీఫ్లవర్ని బొకేలా అందుకుందాం! సూప్ కావలసినవి: క్యాలీఫ్లవర్ - 1 (చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), బటర్ - 2 టీ స్పూన్లు, ఉల్లితరుగు - పావు కప్పు, బంగాళదుంప తురుము - పావుకప్పు, లవంగాలు + దాల్చినచెక్క పొడి - పావు టీ స్పూను, వెల్లుల్లి పేస్ట్ - పావు టీ స్పూను, నీరు - 2 కప్పులు, ఉప్పు, మిరియాల పొడి - తగినంత, పాలు - కప్పు, కార్న్‌ఫ్లోర్ - టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు + మిరియాలపొడి - తగినంత, కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు తయారి: ఒక పాత్రలో బటర్ వేసి కరిగాక వెల్లుల్లి పేస్ట్, ఉల్లి తరుగు వేసి వేయించాలి ఒకటిన్నర కప్పుల నీరు, బంగాళదుంప తురుము, కొత్తిమీర తరుగు, క్యాలీఫ్లవర్ జత చేసి మరిగించి, మంట తగ్గించి, దాల్చినచెక్క + లవంగాల పొడి వే సి, అన్ని పదార్థాలూ మెత్తగా అయ్యేలా గరిటెతో మెదపాలి కార్న్‌ఫ్లోర్‌ను చల్లటి నీళ్లలో కలిపి, ఉడుకుతున్న గిన్నెలో వేసి, మిశ్రమం బాగా చిక్కబడేవరకు కలపాలి ఉప్పు, మిరియాలపొడి, పాలు వేసి బాగా కలిపి దించేయాలి. రొయ్యల కూర కావలసినవి: రిఫైన్డ్ ఆయిల్ - 2 టేబుల్‌స్పూన్లు, ఉల్లితరుగు - పావు కప్పు, పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 2, అల్లం తురుము - టేబుల్ స్పూను, మిరప్పొడి - టీ స్పూను, ఉప్పు - తగినంత, మసాలాపొడి - టీ స్పూను, క్యాలీఫ్లవర్ తరుగు - 4 కప్పులు, రొయ్యలు - 2 కప్పులు తయారి: బాణలిలో నూనె కాగాక ఉల్లితరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి మగ్గిన తర్వాత, అల్లం తురుము, వెల్లుల్లి రేకలు, మిరప్పొడి, ఉప్పు, ఉడికించుకున్న రొయ్యలు (శుభ్రం చేసుకున్న రొయ్యలు, పసుపు స్టౌ మీద ఉంచి నీరు ఇగిరే వరకు ఉడికించి పక్కన ఉంచాలి) వేసి సుమారు 3 నిముషాలు వేయించాక, తగినంత నీరు పోసి ఉడికించాలి మసాలాపొడి వేసి కలిపి దించేయాలి. అమ్మమ్మ చేతి వంట కావలసినవి: క్యాలీఫ్లవర్ తురుము - 3 కప్పులు, బఠాణీలు - పావుకప్పు, టొమాటో తరుగు - అర కప్పు, ఉల్లి తరుగు - అరకప్పు, వెల్లుల్లి తరుగు - టీ స్పూను, నూనె - 2 టేబుల్ స్పూన్లు, మిరప్పొడి - అర టీ స్పూను, ఉప్పు - అర టీ స్పూను, మిరియాలపొడి - టీ స్పూను, కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు తయారి: ఉప్పు వేసిన వేడినీటిలో క్యాలీఫ్లవర్‌ను శుభ్రంగా కడగాలి బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లితరుగు వేసి రెండు నిముషాలు వేయించాలి క్యాలీఫ్లవర్ తురుము, బఠాణీలు, జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి, టొమాటో తరుగు జతచేసి సుమారు ఏడు నిముషాలు ఉంచాలి ఉప్పు, మిరప్పొడి వేసి బాగా కలిపి, కొత్తిమీర, మిరియాల పొడులతో గార్నిష్ చేసి దించేయాలి. పాన్‌కేక్స్ కావలసినవి: సజ్జలు - 200 గ్రా., క్యాలీఫ్లవర్ - 1, కొత్తిమీర తరుగు -2 టేబుల్ స్పూన్లు, కోడిగుడ్లు - 4, చీజ్ - 10 గ్రా., ఓట్స్ - 100 గ్రా, రిఫైన్డ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత, మిరియాలపొడి - అర టీ స్పూను తయారి: ఒక పాత్రలో అరలీటరు నీరు, ఉప్పు, సజ్జలు వేసి ఉడికించి ఉంచుకోవాలి క్యాలీఫ్లవర్‌ను ఉప్పు నీటితో కడిగి, బియ్యపుగింజ పరిమాణంలో తురమాలి ఒక పాత్రలో ఉడికించిన సజ్జలు, గిలక్కొట్టిన కోడిగుడ్డు, ఓట్స్, చీజ్ వేసి కలిపి, ఫ్రిజ్‌లో సుమారు 30 నిముషాలు ఉంచి తీసేయాలి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని వడల మాదిరిగా ఒత్తి, కాగిన నూనెలో, ఒక్కొక్కటిగా వేసి, బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించి, పేపర్ నాప్కిన్ మీదకు తీసుకోవాలి.