కావలసినవి: బటర్–రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ–ఒకటి(తరగాలి), బంగాళాదుంప–ఒకటి, తరిగిన క్యాలిఫ్లవర్–నాలుగుటేబుల్ స్పూన్లు, పాలు–ఒక కప్పు, చీజ్–ఒక స్లైస్
తయారి: బాణలిలో వెన్న వేసి వేడయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాల సేపు వేగనివ్వాలి. అప్పుడు బంగాళాదుంప ముక్కలను వేసి నాలుగు నిమిషాల సేపు వేయించిన తర్వాత క్యాలిఫ్లవర్ వేయాలి. పిల్లలు ఇష్టపడేటట్లయితే క్యారట్ లేదా కూరగాయలను కూడా వేసుకోవచ్చు. క్యాలిఫ్లవర్ వేడయిన తర్వాత కూరగాయల ముక్కలు వాటిని ఉడికించిన నీటితో సహా బాణలిలో వేసి మూత పెట్టి ఉడికించాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫుడ్ ప్రాసెసర్‌లో బ్లెండ్ చేయాలి. దీనిని సాస్ పాన్‌లో వేసి సన్నమంట మీద ఉడికించి, పాలు పోసి, ఉప్పు కలిపి చీజ్‌తో గార్నిష్ చేయాలి. సూప్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి. ఇది ఈవెనింగ్ స్నాక్‌గా అయితే పిల్లలు ఇష్టపడతారు. పిల్లలకు ఉదయం పూట ఇవ్వాలంటే చల్లగా ఇవ్వాలి. ముందు రోజు సాయంత్రం చేసి ఆ మర్నాడు ఉదయం తీసుకుంటే మంచిది.
దీనిని తీసుకోవడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు జంక్ ఫుడ్ తినాలన్న కోరిక తగ్గుతుంది. కూరగాయలు ఉడికించిన నీటికి బదులుగా కాని వాటితోపాటు కాని చికెన్ ఉడికించిన నీళ్లు, కోడిగుడ్డులోని తెల్లసొన వాడవచ్చు. పోషకాలు: ఎనర్జీ : 435 క్యాలరీలు, ప్రొటీన్లు – 17గ్రా; కార్బోహైడ్రేట్లు – 33గ్రా; ఫ్యాట్ – 33 గ్రా, ఐరన్ – 4 మి.గ్రా.
Comments
Please login to add a commentAdd a comment