శీతాకాలం అనగానే మన జీర్ణవ్యవస్థ స్తబ్దుగా ఉండిపోతుంది. చురుకుగా ఉండదు. ముఖ్యంగా తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణం కాదు. పొద్దున్న ఎప్పుడో తిన్నం టిఫిన్, బోజనం ఇంకా కడుపులో నిండుగానే ఉన్నట్లనిపిస్తుంది. ఆకలవ్వదు. ఇలాంటి కాలంలో అస్సలు హార్డ్‌గా ఉండే పదార్థాల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం.
ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఈ కాలంలో అరుగుదల సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. అందుకని ఈ కాలంలో అజీర్తీ వంటి జీర్ణ సంబంధ సమస్యలకు చెక్‌పెట్టేలా ఇలాంటి సూప్‌లు చేసుకుని తాగడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇది బలవర్ధకమే గాకుండా అధిక బరువు సమస్యను తగ్గిస్తుందట. అదెలాగో చూద్దామా..!.
శెనగలు పోషకాల పవర్‌హాస్‌లు. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలని చెబుతున్నారు. దీంతో చేసే సూప్ ఈ గజగజ వణికించే చలిలో చక్కటి ఓదార్పునిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా గట్ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందట. జీర్ణక్రియను సాఫీగా ఉంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.
అలాగే గ్యాస్, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలను కూడా నివారిస్తుందట. ఇది అద్భుతమైన ప్రోటీన్ మూలం. ముఖ్యంగా బ్లడ్ షుగర్ లెవెల్స్‌కి మద్దతిస్తుంది. దీనిలోని ఫైబర్ కంటెంట్ రక్తంలోని చక్కెరను నిర్వహించడంలో సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆహారం అని చెబుతున్నారు. ఎందుకంటే దీనిలోని ఫైబర్ కంటెంట్ పొట్టనిండుగా ఉన్న అనుభూతిని ఇస్తుందట. తద్వారా అతిగా తినడాన్ని తెలియకుండానే కట్టడి చేస్తుందట.
సూప్ తయారీ విధానం..
నల్లటి సెనగలు: వందగ్రాములు
ఉల్లిపాయలు: 1 కప్పు
అల్లం: 1 టీ స్పూన్ క్యారెట్లు: రెండు
కాలీఫ్లవర్: 1 కప్పు
బీన్స్: 1 కప్పు
క్యాప్సికమ్: 1 కప్పు
ఎండుమిర్చి, జీరా పొడి: ఒక టీ స్పూన్
తయారీ విధానం: ముందుగా మూడు గ్లాస్‌ల నీటిలో క్యారెట్లు, బీన్స్ బాగా ఉడికించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, మెత్తగా ఉడికించిన సెనగలు వాటర్‌తో సహా వేయాలి. చివరగా ఎండుమిర్చి, జీరా పొడి వేసి ఐదు నిమిషాలు మరగనివ్వాలి. ఆ తర్వాత సర్వ్ చేసేటప్పుడు కొద్దిగా నిమ్మచుక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. మరింత టేస్ట్ కోసం పన్నీర్ ముక్కలను కూడా జోడించవచ్చు.
(చదవండి: శారీరక శిక్షణే అతిపెద్ద 'గేమ్ ఛేంజర్'.!: విశ్వనాథన్ ఆనంద్)
Comments
Please login to add a commentAdd a comment