protiens food
-
అద్భుతమైన ‘5’ టిప్స్‌తో 72 కిలోలు బరువు తగ్గింది!
బరువు తగ్గడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అలాగని అంత కష్టమూ కాదు. బాడీ తత్వాన్ని తెలుసుకుని సరైన ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులతో మనం కోరుకున్న బరువు లక్ష్యాన్ని చేరు కోవచ్చు. ఈ విషయాన్ని అంబర్ క్లెమెన్స్ మరోసారి నిరూపించారు. పట్టుదలగా, నిబద్దతగా కొన్ని రకాల నియమాలను పాటించి రెండేళ్లలో ఏకంగా 160 పౌండ్లు (72 కిలోలు) బరువును తగ్గించుకుంది. అంతేకాదు తగ్గిన బరువును స్థిరంగా కొనసాగిస్తోంది. ఈ ప్రయాణంలో తాను అనుసరించిన ముఖ్యమైన సూత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Amber Clemens (@amber_c_fitness)విజయవంతంగా బరువు తగ్గడం అనేది అలవాట్లను మార్చుకోవడంతో మొదలవుతుంది అంటుంది అంబర్. అంతకుముందు పిచ్చి పిచ్చిగా డైటింగ్ చేశానని, ఆ తరువాత తాను అనుసరించిన పద్దతి, ఆహార నియమాల మూలంగా చక్కటి ఫలితం సాధించానని తెలిపింది. ముఖ్యంగా ప్రతిరోజూ చేసే ఐదు విషయాలను పంచుకుంది. ప్రతి భోజనంతో కనీసం 25-20 గ్రాముల ప్రోటీన్‌ను తీసుకుంటుంది. అలాగే స్నాక్స్‌గా ఆమె 5-10 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటుంది. అలా ఆమె రోజువారీ తీసుకోవాల్సిన ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. ఎక్కువ నీళ్లు తాగడం చేయడం వలన మంచి ఫలితం సాధించానని చెప్పుకొచ్చింది. అద్భుతమైన 5 టిప్స్రోజుకి 7-10 వేల అడుగులు నడవడం: చిన్న అడుగులు పెద్ద మార్పులకు నాంది పలుకుతాయి. రోజూ నడవడం అలవాటుగా చేసుకుంటే అద్భుతాలు చేయవచ్చు. తన రోజుకి మరింత శారీరక శ్రమ కలిగేలా ఎక్కువగా నడవడం,లిఫ్ట్ లేదా ఎలివేటర్‌కు బదులుగా నడుచుకుంటూ వెళ్లానని అంబర్ చెప్పింది.3 లీటర్ల నీరు తాగడం: హైడ్రేషన్ కీలకం, కనీసం మూడు లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా , ఆరోగ్యంగా ఉంటుందని చెబుతోంది అంబర్.25-30 గ్రాముల ప్రోటీన్: ప్రతి భోజనంతో, అంబర్ కనీసం 25-20 గ్రాముల ప్రోటీన్‌ను తీసుకుంటుంది. స్నాక్స్ కోసం, ఆమె 5-10 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటుంది. ఇది ఆమె రోజువారీ ప్రోటీన్ తీసుకోవడం లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడిందట.ముందస్తు ప్లాన్ : రోజు రాత్రి ఆహారాన్ని ముందస్తుగా తినడం లాంటివి చేసింది. రేపు ఏం తినాలి అనేది ముందుగానే నిర్ణయించుకొని సిద్ధం చేసుకోవడం కూడా ఇందులో భాగంగా పాటించింది.కొద్దిగా స్వీట్: అలాగే స్వీట్స్ తినాలనే తన కోరిక మేరకు రాత్రి డెజర్ట్ లేదా టిఫిన్‌లో కొద్దిగా ఏదైనా తీపిని జోడించినట్టు తెలిపింది. అలాగే వ్యాయామాన్ని ఆనందంగా ఎంజాయ్ చేస్తూ చేయాలనీ, రోజుకి కనీసం 30 నిమిషాలు, వారానికి నాలుగు సార్లు చేయాలి. దీంతోపాటు మంచి నిద్ర ఉంటే చాలు బరువు తగ్గడం ఈజీ అంటోంది ఈ ఫిట్నెస్ కోచ్. -
చిన్న గింజలే కదాని లైట్ తీసుకోవద్దు : చికెన్ కూడా దిగదుడుపే!
పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు, మహిళలు భారత దేశంలో చాలామందే ఉన్నారు. పేదరికం, అవగాహన లేక పోవడం, ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఫాస్ట్ ఫుడ్ తదితరాలను దీనికి కారణాలుగా చెప్పుకోవచ్చు. పోషకాహారం అంటే అదేదో ఖరీదైన వ్యవహారంగా చాలా మంది అపోహపడతారు. బ్రెజిల్ నట్స్,హాజిల్ నట్స్, బాదం, పిస్తా, జీడి పప్పు లాంటివే అనుకుంటారు. కానీ భారతదేశంలో చక్కటి పోషకాలందించే గింజలు ఇంకా చాలా ఉన్నాయి. వీటి వల్ల శరీరానికి అనేక పోషకాలంది ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సులభంగా, తక్కువ ధరలో దొరికే వీటిని తీసుకోవడం వల్ల లాభాలేంటి? తెలుసుకుందాం!సులభంగా లభించే ఎక్కువ పోషకాలు లభించేవాటిలో వేరుశనగలునువ్వులు, గుమ్మడి గింజలను ముఖ్యంగా చెప్పుకోవచ్చు.పల్లీలు, వేరుశనగలువేరుశనగలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఇతర ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి,. దీనివల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఫైబర్ ఎక్కువగా అధిక బరువుపెరగకుండా నియంత్రిస్తాయి. వేరుశనగల్లో పుష్కలంగా లభించే కాల్షియం, మెగ్నీషియంఎదిగే పిల్లల్లో ఎముకల వృద్ధికి తోడ్పడతాయి. ఎముకలకు బలాన్నిస్తాయి. జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి. వీటిల్లోని విటమిన్ ఈ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, ముడతలు పడకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. వేరుశనగల్లో ఉండే మాంగనీస్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.ఎలా తీసుకోవాలిఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ఆహారానికి రుచితోపాటు, పోషకాలు అందుతాయి. పచ్చిగా తీసుకోవచ్చు. వేయించి తినవవచ్చు. నాన బెట్టి మొలకలు వచ్చిన తరువాత తింటే ఇంకా శ్రేష్టం.బెల్లంతో కలిపి చేసిన వేరుశనగ ఉండల్ని, అచ్చులను తినిపిస్తే రక్త హీనత నుంచి కాపాడుకోవచ్చు.వంటల్లో వేరుశనగ నూనెను వాడవచ్చు. ఇది. ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తుంది.దక్షిణ భారతదేశంలో కరకర లాడే కారం మాసాలా పల్లీలు, పల్నీ చట్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఇడ్లీ, దోసలతో కలిపి తింటే పోషకాలు అందుతాయి. గుమ్మడి గింజలుగుమ్మడి గింజల్లో అత్యధిక స్థాయిలో మెగ్నీషియం, జింక్ పుష్కలంగా లభిస్తాయి.రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం చేస్తుంది. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణకు తోడ్పడుతుంది. మానసిక ఒత్తిళ్ల నియంత్రణ, జుట్టు పెరుగుదలలో గుమ్మడి గుంజలు బాగా పనిచేస్తాయి. ఆధునిక జీవన శైలి పురుషుల్లో కనిపిస్తున్న సంతానోత్పత్తి సమస్యలకు చెక్ చెబుతుంది. స్పెర్మ్ నాణ్యత మంచి పరిష్కారం. ఐరన్ తగిన స్థాయిలో ఉండేందుకు గుమ్మడి గింజలు తోడ్పడుతాయి.ఎలా తీసుకోవాలిగుమ్మడి గింజల్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవచ్చు.సాధారణంగా రోజూ తీసుకునే ఆహారంలో గుమ్మడి గింజలను భాగం చేసుకోవచ్చు. పెరుగు, పండ్లు, సలాడ్లు సూప్‌లో కొన్ని గుమ్మడి గింజలను వేసుకోవచ్చు.కుకీలు, బ్రెడ్, తీపి పదార్థాల్లో గుమ్మడి గింజల్ని చక్కగా అమరుతాయి.నువ్వులు, లడ్డూలునువ్వుల గింజలు కాల్షియం, రాగి, ఫైబర్, మెగ్నీషియం, ఇనుము అధికంగా లభిస్తాయి. పిల్లల్లో పోషకాహార లోపానికి నువ్వులు, బెల్లం లడ్డూలను తినపించవచ్చు. ఆడపిల్లల్లో అనేక గైనిక్సమస్యలకు చక్కటి పరిష్కారంగా నువ్వుల గురించి పెద్దలు చెబుతారు. -
సమ్మర్లో పిల్లలకు ఇలా చేసి పెడితే, ఇష్టంగా తింటారు, బలం కూడా!
వేసవి అంటే పిల్లలకు ఆటవిడుపు కాలం. పరీక్షలు పూర్తయ్యిన తరువాత ఆనందంగా ఆడుకునే కాలం. ఎండా, కొండా లెక్క చేయకుండా హాయిగా తోటి స్నేహితులతో కలిసి చెంగు చెంగున గెంతులేస్తూ ఉత్సాహంగా గడిపే కాలం. మరి ఇలాంటి సమయంలో వారికి మంచి పోషకాహారాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఫుడ్, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటూ.. ఇంట్లోనే రుచికరంగా తయారు చేసి పెట్టాలి. తాజా ఆకుకూరల్ని, కూరగాయల్ని, పండ్లను డైట్లో ఉంచాలి. మంచి పోషకాహారమే వారికి అసలైన దివ్యౌషధం. మొలకలొచ్చిన గింజ ధాన్యాలు శనగలు, పెసలతోపాటు మొలకలు వచ్చిన గింజలతో క్యారట్ లాంటి కూరగాయ ముక్కల్ని కలిపి సలాడ్‌లా పెడితే కాల్షియం, ఇతర ప్రొటీన్లు లభిస్తాయి. దీంతో వారి ఎముకలు, కండరాలు దృఢంగా పెరుగుతాయి. ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. ఉడికించిన శనగలు ఉడికించిన శనగలు రెగ్యులర్‌గా తీసుకుంటే రక్త హీనతకు చెక్ చెప్పవచ్చు. ఇందులోని ఐరన్ కంటెంట్ శరీరానికి అంది రక్త వృద్ధి జరుగుతుంది.రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది. మెదడు చురుగ్గా, వేగంగా పని చేస్తుంది.అలసట, నీరసం వంటి సమస్యలుండవు. పిస్తా, బాదం, జీడిపప్పుతో పాటు పల్లీలు, కుసుమలు. లాంటి గింజలను ఆహారంలో చేరిస్తే చిన్నారుల ఇమ్యూనిటీ పెరుగుతుంది. బల వర్ధకంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినిపించటం వల్ల పిల్లల మెదడు చురుకుగా పని చేస్తుంది. ప్రతిరోజూ కాల్షియం కోసం పాలు, పౌష్టికాహారం కోసం కోడిగుడ్లు లాంటివి సరైన సమయంలో వారికందేలా చేస్తే తొందరగా వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. బలవర్ధకమైన సలాడ్ ఉడికించిన శనగలు, ఉడికించిన బొబ్బర్లు, ఉడికించిన పెసలు, ఉల్లిపాయ, టమాటా ముక్కలు, యోగర్ట్, కొద్దిగా కొత్తిమీర, తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ముందుగానేఉడికించి పెట్టుకున్నగింజలు, ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసి బాగాకలపాలి. దీనికి తాజా యోగర్ట్, కొద్దిగా ఉప్పు, మిరియాలు వేసి కలపాలి. దీనిపైన సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తమీద చల్లి, చల్లచల్లగా అందిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లల ఇష్టాఇష్టాలను బట్టి, ఇందులో కొబ్బరి, వేయించిన పల్లీలు, స్వీట్‌కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బలవర్ధక ఆహారం కూడా. -
ఉలవల ప్రయోజనాలు తెలిస్తే, క్షణం ఆలస్యం చేయకుండా..!
#Horse Gram Health Benefits ఉలవలు తింటే గుర్రానికి వచ్చినంత బలం వస్తుందని మన పెద్దవాళ్లు చెప్పేవారు. మొదట్లో గుర్రాలు, పశువుల మేతగా ఉపయోగించేవారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో, పేదవారి ఆహారంగా కూడా ఉండేది. తరువాతి కాలంలో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఉలవల్నే ఇంగ్లీషులో ‘హార్స్ గ్రామ్’ అనీ ఇంకా కులిత్, హర్డిల్ లేదా మద్రాస్ బీన్స్ అని కూడా పలుస్తారు. అంతేకాదు అమెరికా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకారం ఉలవలు భవిష్యత్తులో మంచి ఆహార వనరుగా మారనుంది. చాలా పోషకాలతో నిండిన ఉలవల్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిల్లో తెల్లవి, నల్లవి అని రెండు రకాలుగా లభిస్తాయి. ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, ఫైబర్ లాంటివి పోషకాలు వీటిల్లో పుష్కలంగా లభిస్తాయి. బీ1, బీ2, బీ6, సీ, విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. మాంసాహారినికి సమానమైన ప్రోటీన్ కూడా లభిస్తుంది. ఉలవలు ఆరోగ్య ప్రయోజనాలు ♦ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ♦ ఉలవల్లోని ఫైబర్ రక్తంలోగుండె ఆరోగ్యానికి మంచిది, చక్కెర స్థాయిని తగ్గించవచ్చు. ♦ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడండి. ♦ వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మ సమస్యల నివారణలో తోడ్పడతాయి. ♦ రుతుక్రమ రుగ్మతలు , ల్యుకోరియా చికిత్సకు సాయపడుతుంది ♦ అతి మూత్ర వ్యాధికి చక్కటి ఔషధం ♦ స్పెర్మ్ కౌంట్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ♦ కాలేయ పనితీరును రక్షిస్తుంది. ♦ ఎముకలను బలోపేతం చేస్తుంది ♦ రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. ♦ కాలేయ పనితీరును రక్షిస్తుంది ♦ మూత్రపిండాల్లో రాళ్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుం ♦ కొన్ని ప్రాంతాల్లో ఉలవల పాలను పిల్లలకు పోషక ఆహారంగా ఇస్తారు నోట్: సాధారణంగా గింజలు, పప్పు ధాన్యాలను నాన బెట్టి తినడం మంచింది. ముఖ్యంగా ఉలవల్నినానబెట్టి ఉడికించడం వల్ల జీర్ణం సులభమవుతుంది. అధికంగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం లాంటి సమస్యలొచ్చే అవకాశం ఉంది. దీన్ని గమనంలో ఉంచుకోవాలి. అలాగే హైపర్ ఎసిడిటీ సమస్య ఉన్న వారు అధిక ఆమ్లత్వం ఉన్నవారు గౌట్‌తో బాధపడేవారు కూడా ఉలవలకు దూరంగా ఉండటం మంచిది. -
శుద్ధిచేసిన మురుగు నీటితో వరి సాగు.. ప్రొటీన్ రిచ్ రైస్, ఇంకా..
వరి సాగుకు రసాయనిక ఎరువులు, మంచి నీరు అవసరం లేదు.. శుద్ధిచేసిన మున్సిపల్ మురుగు నీటిని క్రమం తప్పకుండా డ్రిప్ ద్వారా అందిస్తే చాలు.. చక్కని దిగుబడులూ వస్తాయి. ఇలా పండించిన వరి బియ్యంలో ప్రొటీన్ (ప్రొటీన్ రిచ్ రైస్) కూడా అధికంగా ఉంటుంది అంటున్నది జపాన్‌కు చెందిన యమగటా విశ్వవిద్యాలయం. అంతేకాదు, రసాయనిక వ్యవసాయం వల్ల వెలువడే కర్బన ఉద్గారాల్లో 70% వరకు తగ్గుతాయి అంటున్నారు ‘యమగటా’ శాస్త్రవేత్తలు. అర్బన్ వ్యర్థ జలాల పునర్వినియోగం ద్వారా రసాయనిక ఎరువులను, మంచి నీటిని నూటికి నూరు శాతం ఆదా చేసుకోగలగటం హర్షదాయకం. ముఖ్యంగా, వరి బియ్యాన్నే ప్రధాన ఆహారంగా తీసుకునే ఆసియా వాసులకు ఇదెంతో శుభవార్త. పైపులైన్ల ద్వారా నేరుగా వేరు వ్యవస్థకు సాగు నీరందించే మెరుగైన భూగర్భ నీటిపారుదల వ్యవస్థ ఉపయోగం గురించి కూడా యమగటా విశ్వవిద్యాలయం పరిశోధించటం విశేషం. పట్టణాలు, నగరాల్లో జనావాసాల నుంచి వెలువడే మురుగు నీరు కానే కాదు. నిజానికి శుద్ధి చేసి తిరిగి వాడుకుంటే వ్యవసాయానికి ఇది గొప్ప పోషక జలంలా ఉపయోగపడుతుందని తమ పరిశోధనల ద్వారా నిరూపించారు యమగటా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. జపాన్‌లోని సురుయోకా నగరంలో ఈ విశ్వవిద్యాలయం ఉంది. బురదను కంపోస్టుగా మార్చి జనావాసాల నుంచి వెలువడే మురుగు నీటిలో నుంచి హానికారక క్రిములు, భార లోహాలు వంటి కలుషితాలేవీ లేకుండా శుద్ధి చేసి వరి పొలాలకు డ్రిప్ ద్వారా అవసరం మేరకు నిరాటంకంగా అందించాలి. దీనితో పాటు, మురుగునీటిని శుద్ధి చేసే క్రమంలో వెలువడే బురదను కంపోస్టుగా మార్చి, ఆ సేంద్రియ ఎరువును సైతం వరి పొలాల్లో వేసుకుంటే చాలు. అంతకన్నా ఇంక ఏ ఎరువులూ అవసరం లేకుండా వరి పంటలో చక్కని దిగుబడులు సాధించవచ్చు. ఇందుకోసం వినూత్న నీటిపారుదల వ్యవస్థలను రూపొందించి, పరీక్షించి చక్కని ఫలితాలు సాధించాం అంటున్నారు ‘యమగటా’ పరిశోధకులు. అర్బన్ మురుగు నీటిని శుద్ధి చేసి పునర్వినియోగించే వరి నీటిపారుదల వ్యవస్థలను అభివృద్ధి చేశారు. శుద్ధి చేసిన మురుగు నీటిని వరి పొలంలో సాధారణ పద్ధతిలో నీటిని నిల్వగట్టి పంటలు పండించారు. అదేవిధంగా, భూగర్భ పైపుల వ్యవస్థ ద్వారా వరి మొక్కల వేరు వ్యవస్థకు నేరుగా నీటిని పొదుపుగా అందించటం ద్వారా వరి సాగు చేసి పంట దిగుబడులు తీశారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. శుద్ధి చేసిన మురుగు నీరు కేవలం నీరు మాత్రమే కాదు, పోషకాలతో కూడిన జలం. తద్వారా రసాయనిక ఎరువుల వాడకాన్ని నూటికి నూరు శాతం నివారించవచ్చు. బోర్లు లేదా కాలువల ద్వారా ఇప్పుడు వరి సాగుకు వాడుతున్న మంచి నీటిని ఆదా చేసుకొని, ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. దిగుబడులు తగ్గే అవకాశం లేదు. రసాయనిక సేద్యంలో పండించిన వరి బియ్యంలో కన్నా ఎక్కువ ప్రోటీన్‌తో కూడిన బియ్యం ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. నీరు నిల్వగట్టి రసాయనాలతో పండించే వరి పొలాల నుంచి విడుదలయ్యే మీథేన్ ఉద్గారాలను 80%, నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలను కనీసం 60% తగ్గించడానికి ఆస్కారం ఉందని ‘యమగటా’ పరిశోధనల్లో తేలింది. తద్వారా సాంప్రదాయ వరి పొలాల వల్ల పెరిగే భూతాపాన్ని 70% తగ్గించవచ్చని ఈ ప్రయోగాల్లో నిరూపితమైంది. పట్టణాలు, నగరాల్లో జనావాసాల నుంచి వెలువడే వ్యర్థ జలాలను శుద్ధి చేసి పునర్వినియోగించడం ద్వారా తక్కువ ఖర్చుతోనే వరి పొలాలకు నీటిని, పోషకాలను అందించడం సాధ్యమేనని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ సాంకేతికతపై యమగటా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ మేధోహక్కుల సంస్థ(వైపో) నుంచి పేటెంట్ పొందింది. ప్రొటీన్ గణనీయంగా పెరిగింది వాతావరణ మార్పుల్ని దీటుగా ఎదుర్కొనేందుకు ఈ గ్రీన్ టెక్నాలజీ దోహదపడుతుందని అంతర్జాతీయ మేధోహక్కుల సంస్థ(వైపో) ప్రశంసించింది. ప్రొటీన్ గణనీయంగా పెరిగింది. జనావాసాల నుంచి వెలువడే మురుగు నీటిని శుద్ధిచేసి వరి సాగులో డ్రిప్ ద్వారా ఉపయోగించినప్పుడు బియ్యంలో ప్రొటీన్లు, రాగి గణనీయంగా పెరిగాయి. పాషాణం సమస్య 50% తగ్గింది. శుద్ధిచేసిన మురుగు నీటితోపాటు, మురుగు నీటిని శుద్ధి చేసే క్రమంలో వెలువడే బురదతో తయారు చేసిన సేంద్రియ ఎరువులను వాడటం వల్ల భూసారం బాగుంది. లెడ్, జింక్, నికెల్, కాడ్మియం సమస్య రాలేదు. నీటి ఎద్దడి ఉండే ప్రాంతాల్లో వ్యర్థజలాలను శుద్ధి చేసుకొని వరిసాగుకు వాడుకోవటం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించవచ్చని మా అధ్యయనంలో నిర్థారణ అయ్యింది. – నిండియా ఊబా, యమగటా విశ్వవిద్యాలయం, జపాన్ నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ చదవండి: తేనెటీగల పెంపకంలో రాణిస్తున్న యువకుడు.. 400 బాక్సులతో 200 కేజీల తేనె -
Sushil Kumar: జైల్లో ఇచ్చే ప్రోటీన్ సరిపోదు!
న్యూఢిల్లీ: జైలులో ఇచ్చే ఆహారంలోని పోట్రీన్ తనకు సరిపోవని.. కాబట్టి ప్రోటీన్ షేక్, వ్యాయామ సామాగ్రి కావాలని రెజ్లర్ సుశీల్ కుమార్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. రాబోయే టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నందున ప్రోటీన్ సప్లిమెంట్స్, వ్యాయామ సామాగ్రి, ప్రత్యేక ఆహారం అందించాల్సిందిగా ఆయన కోర్టును కోరారు. ప్రత్యేక ఆహారం కింద ఒమేగా 3 క్యాప్సూల్స్, ప్రీ-వర్కౌట్ సప్లిమెంట్స్, మల్టీవిటమిన్ మాత్రలు కావాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా సుశీల్ కుమార్ పిటిషణ్‌పై బుధవారం కోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఇక సాధారణంగా జైల్లో ఐదు రోటీలు, ఏదైనా కూరగాయలతో చేసిన రెండు కర్రీలు, పప్పు, అన్నం ఇస్తారు. అంతేకాకుండా క్యాంటీన్లో నెలకు రూ. 6,000 వరకు కొనుక్కుని తినవచ్చు. అయితే సుశీల్ కుమార్ రెజ్లర్ కావడంతో మరింత ప్రోటీన్స్ అవసరమని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇక ఛత్రసాల్ స్టేడియం వద్ద యువ రెజ్లర్ సాగర్ ధనకర్ హత్యకు సంబంధించి మే 23న ఢిల్లీ పోలీసులు సుశీల్ కుమార్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుశీల్‌ను ఢిల్లీలోని మాండోలి జైలులో ప్రత్యేక సెల్లో ఉంచారు. అంతేకాకుండా భద్రతా కారణాల దృష్ట్యా అతన్ని కలవడానికి ఎవరినీ అనుమతించడం లేదు. -
తెలుపు, బ్రౌన్ కలర్ గుడ్డు: ఈ నిజాలు మీకు తెలుసా?
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కకావికలం చేస్తోంది. ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు, వైరస్ సోకిన వారు దాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు చాలా మంది పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడంపై దష్టిపెడుతున్నారు. ఇందులో గుడ్డు మొదటి వరుసలో ఉంది. సాధారణంగా కోడి గుడ్లను మనం ఎక్కువగా తీసుకుంటుంటాం. ఇందులో బ్రాయిలర్, నాటు కోడి గుడ్లు ముఖ్యమైనవి. ఇవి తెలుపు రంగులో ఉంటాయి. అయితే, వీటికితోడు బ్రౌన్ (గోధుమ రంగు) గుడ్లు కూడా మనకు లభిస్తున్నాయి. ఇవి తెల్లటి గుడ్లకంటే మంచివని అంతా భావిస్తుంటారు. వాస్తవానికి రంగుతో సంబంధం లేకుండా, గుడ్డు ఏదైనా సరే పోషకాలు మాత్రం ఒక్కటేనని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు రకాల గుడ్లలో విటమిన్లు, మినరల్స్‌తో పాటు శరీరానికి అవసరమైన ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. రుచి విషయంలో తెలుపు, గోధుమ రంగు గుడ్లలో కొద్ది తేడా ఉన్నప్పటికీ పోషకాలు మాత్రం సమానమే. నిజానికి కోడి గుడ్డు పెంకు ఏ రంగులో ఉన్నా వాటిల్లోని పోషకాలు ఒకేలా ఉంటాయి. కాకపోతే నాటు కోడి గుడ్డు పరిమాణం కాస్త చిన్నగానూ ఫారం కోడి గుడ్లు కాస్త పెద్దగానూ ఉంటాయి. ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్.. కేలరీలు, ప్రొటీన్స్, కొలెస్ట్రాల్ విషయంలో తెలుపు, గోధుమ రంగు గుడ్లు సమానంగా ఉంటాయి. బ్రౌన్ గుడ్లలో మాత్రం ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ పాళ్లు కొంత ఎక్కువగా ఉంటాయి. అది పెద్ద తేడా కాదని నిపుణులు చెబుతున్నారు. తెల్లవైనా, బ్రౌన్‌వి అయినా 100 గ్రాముల గుడ్డులో దాదాపు 13 గ్రాముల ప్రొటీన్స్ ఉంటాయి. కానీ బ్రౌన్ ఎగ్స్‌ను సేంద్రియ పద్ధతి(ఆర్గానిక్)లో ఉత్పత్తి చేయడం వల్ల అందులో పోషకాలు అధికంగా ఉంటాయన్న అపోహతోనే వినియోగదారులు వీటిని కొనుగోలుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిజానికి బ్రౌన్ ఎగ్స్ ఉత్పత్తి తక్కువ కాబట్టే డిమాండ్ ఎక్కువని, అందుకే అవి అధిక ధర పలుకుతున్నాయని నిపుణులు అంటున్నారు. కోళ్లను బట్టి సైజు... గుడ్ల సైజు విషయంలో తెల్లవి కాస్త పెద్దగా, బ్రౌన్‌వి కాస్త చిన్నగా ఉంటాయి. గుడ్డు పరిమాణం కోడి సైజును బట్టి ఉంటుంది. అలాగే వేసవిలో పెట్టే గుడ్లు చిన్నవిగానూ, చలికాలంలో పెట్టే గుడ్లు పెద్దవిగానూ ఉంటాయి. -
కండలు పెరగాలంటే మాంసాహారమే అక్కర్లేదు!
కండరాలు పెరిగి, మంచి శరీర సౌష్ఠవం కలగాలంటే తప్పనిసరిగా మాంసాహారం తినాల్సిన అవసరం లేదంటున్నారు పరిశోధకులు. శాకాహారంలో ఉండే ప్రొటీన్లు సైతం సౌష్ఠవం తో కూడిన కండర నిర్మాణానికి బాగా పనికి వస్తాయని పేర్కొంటున్నారు. కండరాల నిర్మాణానికి, వాటి పెరుగుదలకూ, నిర్వహణకూ ప్రోటీన్ అవసరం. అయితే... బలమైన కండరానికి ప్రొటీన్ కావాలి తప్ప... అది మాంసం నుంచి లభ్యమైందా లేక శాకాహారంలో దొరికిందా అన్నది అంత ప్రధానాంశం కాదంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్‌కు చెందిన పరిశోధకులు. వీరు వ్యాయామ నిపుణులైన దాదాపు మూడు వేల మంది స్త్రీ, పురుషుల మీద తమ అధ్యయనాన్ని నిర్వహించారు. వారిని ఆరు గ్రూపులుగా విభజించి, ఆరు రకాలైన వనరుల నుంచి, అంటే... బాగా కొవ్వులు ఎక్కువగా ఉండే పాలు–వాటి ఉద్పాదనలు, చేపలు, వేటమాంసం, చికెన్, కొవ్వు తక్కువగా ఉండే పాలు, బఠాణీ గింజల వంటి పూర్తి పప్పుధాన్యాలను వారికి ఆహారంగా అందించారు. మిగతా పోషకాలను మామూలుగానే ఇచ్చారు. నిర్ణీత సమయం తర్వాత వారి కండరాలలోని మజిల్‌మాస్, కండరాలు బలం, కండరాల సౌష్ఠవం వంటి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని లెక్కించారు. ప్రోటీన్ ఏదైనప్పటికీ మజిల్‌మాస్, బలం, సౌష్ఠవం వంటి అంశాల్లో పెద్ద తేడాలేమీ కనిపించలేదు. పైగా డాక్టర్ కెల్సే మ్యాంగనో బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అధ్యయన పరిశోధనలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. అదేమిటంటే... శాకాహార ప్రొటీన్‌పై ఉంచిన వారిలో ప్రోస్టేట్‌కు సంబంధించిన కొన్ని అనర్థాలు కనిపించలేదు. పైగా సోయాబీన్స్ వంటి శాకాహార ప్రోటీన్ల సహాయంతో బాడీబిల్డింగ్ చేసిన వారు మిగతావారి తో పోలిస్తే దీర్ఘకాలం బతికినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ పరిశోధనల వివరాలను అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్’లో ప్రచురించారు. చదవండి: రాహుల్ కండలపై నెటిజన్ల ట్రోలింగ్ -
గుడ్డుకు జై నిమ్మకు సై
వేసవి కాలంలో నిమ్మకాయ ధరలుపెరగడం, కోడిగుడ్ల ధరలు తగ్గడంసాధారణమే. కానీ ప్రస్తుతం గ్రేటర్లోవీటి వినియోగం భారీగా ఉన్నప్పటికీ ధరలు అందుబాటులోనే ఉండటంగమనార్హం. కారణం నిమ్మకాయలవినియోగం వేసవిలో ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది వేసవిలో, వేసవిముగిసిన అనంతరంనిమ్మకాయల ధరలుపెరగలేదు. సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల రోజువారీ మెనూలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. కోవిడ్ ఉపద్రవం ముంచుకొచ్చిన ప్రస్తుతతరుణంలో సరికొత్త ఆరోగ్య సూత్రాలకు ప్రాధాన్యం పెరిగింది. కరోనా మహమ్మారి బారిన పడకుండా గట్టి జాగ్రత్తలు అవసరమని సిటీజనులు భావిస్తున్నారు. రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దినసరి ఆహార పదార్థాల్లో కోడిగుడ్డు, నిమ్మకాయ వచ్చి చేరాయి. నెల రోజులుగా గ్రేటర్ పరిధిలో నిమ్మకాయలు, కోడిగుడ్లవినియోగం విపరీతంగా పెరగడమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గతంలోవారానికి ఒకటి రెండు రోజులునిమ్మకాయ, కోడిగుడ్లు వినియోగించేవారు ప్రస్తుతం వీటిని ప్రతిరోజూ వాడుతున్నారు. కోడిగుడ్లను ఉడకబెట్టి తింటున్నారు. నిమ్మకాయలను జ్యూస్ చేసుకుని తాగుతున్నారు.కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు, వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు ఇదే సరైన విధానమని భావిస్తున్నారు. దీంతో నిమ్మ, కోడిగుడ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. వేసవి కాలంలో నిమ్మకాయ ధరలు పెరగడం, కోడిగుడ్ల ధరలు తగ్గడం సాధారణమే. కానీ ప్రస్తుతం గ్రేటర్లో వీటి వినియోగం భారీగా ఉన్నప్పటికీ ధరలు అందుబాటులోనే ఉండటం గమనార్హం. కారణం నిమ్మకాయల వినియోగం వేసవిలో ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది వేసవిలో, వేసవి ముగిసిన అనంతరం నిమ్మకాయల ధరలు పెరగలేదు. వేసవి తర్వాత మామూలుగా వర్షాలు ప్రారంభమైతే జనం నిమ్మకాయల వినియోగం తగ్గిస్తారు. కానీ కరోనా విరుగుడుకు చాలా మంది నిమ్మకాయను వినియోగిస్తున్నారు. అయినా ధరలు మాత్రం అంతగా పెరగలేదు. రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు ‘సి’ విటమిన్ ఎక్కువగా తీసువాలని జనం నిత్యం నిమ్మకాయలను వినియోగిస్తున్నారు. వర్షాకాలంలోనూ నిమ్మకు డిమాండ్ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ రోగ నిరోధకశక్తి పెంచుకునేందుకు ‘సి’ విటమిన్ బాగా లభించే నిమ్మకాయ వినియోగం పెంచారు గ్రేటర్‌వాసులు. అయినా ధరలు మాత్రం అంతగా పెరగలేదు. గ్రేటర్ పరిధిలో మార్కెట్లు, రైతు బజార్లతో పాటు దారుషిపా, చాదర్‌ఘాట్‌లోని మార్కెట్లకు ఎక్కువ మోతాదులో నిమ్మకాయలు దిగుమతి అవుతున్నాయి. దీంతో గ్రేటర్ డిమాండ్‌కు సరిపడా ఇవి అందుబాటులో ఉండడంతో ధరలు పెరగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది ఇదే సీజన్లో నిమ్మకాయల బస్తా ఒకటి రూ.600 నుంచి రూ.800 ఉందని, ప్రస్తుతం బస్తా రూ.250 నుంచి రూ. 350 వరకు ఉందని వ్యాపారులు అంటున్నారు. ఒక బస్తాలో దాదాపు 300 నుంచి 400 నిమ్మకాయలు ఉంటాయి. కోడిగుడ్లు సైతం భారీగా వినియోగం వ్యాధి నిరోధకశక్తి పెంచుకోవడానికి గ్రేటర్ ప్రజలు తమ రోజువారీ మెనూలో పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కోడ్ల వినియోగం పెరిగింది. కొన్ని రోజుల నుంచి గుడ్ల వినియోగం పెరిగిందని, ప్రస్తుతం జంట నగరాల్లో కోటి కోడిగుడ్ల మేరకు వినియోగమవుతున్నట్టు ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ (నెక్) అధికారులు అంటున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కోడిగుడ్ల ఉత్పత్తులు బాగానే ఉన్నాయని నెక్ వర్గాలు చెబుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో దాదాపు 80 వరకు ఉన్న పౌల్ట్రీఫారాలు చికెన్‌తోపాటు కోడిగుడ్లపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. ప్రస్తుతం చికెన్ వినియోగం కొంత తగ్గినా, గుడ్ల వినియోగం మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నట్టు పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. ధరలు అందుబాటులోనే.. వేసవిలో తగ్గిన గుడ్ల ధరలు ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నాయి. హోల్‌సేల్ మార్కెట్లో కోడిగుడ్డు ధర రూ. 3.60 పైసలు ఉండగా రిటేల్ మార్కెట్లో రూ. 4.50 పైసల వరకు ఉంది. గత వారం రోజులుగా గుడ్ల వినియోగం పెరిగిన ధరలు అంతగా పెరగలేదు. ప్రస్తుతం వర్షాకాలంలో గుడ్ల వినియోగం ఎక్కువగా ఉండదని భావించినా.. కరోనా ప్రభావంతో గుడ్లకు గతంలో ఎప్పుడూ లేనంతగా డిమాండ్ ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ల ఉత్పత్తి బాగానే ఉందని నెక్ అధికారులు అంటున్నారు. ♦ గత ఏడాది బస్తా నిమ్మకాయల ధర రూ.600– రూ.800 ♦ ప్రస్తుతం రూ.250– రూ.350 ♦ ఒక బస్తాలో 300– 400 నిమ్మకాయలు ♦ హోల్‌సేల్‌లో కోడిగుడ్డు రూ.3.60 పైసలు ♦ రిటైల్ మార్కెట్లో రూ.4.50 పైసలు ♦ నగరంలో రోజుకు కోటి కోడిగుడ్ల వినియోగం -
కరోనా జయించాలంటే ఇవి తినాలి
ప్రపంచ దేశాల ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న కరోనా వైరస్ (కోవిడ్-19) సోకకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల గురించి ప్రపంచ వైద్య నిపుణులు ఇప్పటికే పలుసార్లు వెల్లడించిన విషయం తెల్సిందే. కరోనా వైరస్ సోకితే కచ్చితంగా ప్రాణాపాయమంటూ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, సకాలంలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటే ఎలాంటి ప్రాణహాని ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. కరోనా బాధితుల్లో మృతుల సంఖ్య 3.6 శాతానికి మించి లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేయగా, ఒక శాతానికి మించి ఉండదని లండన్, ఆస్ట్రేలియా వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. (కరోనా పుణ్యమా.. గూగుల్ వేటలో అదే టాప్) కరోనా వైరస్‌ను జయంచడంలో ప్రజల్లో ఉండే రోగ నిరోధక వ్యవస్థ ఎక్కువగా దోహద పడుతోంది. ఈ రోగ నిరోధక వ్యవస్థ మనం తీసుకునే ఆహారం అలవాట్లపై ఆధారపడి ఉంటుందని, రోగ నిరోధక వ్యవస్థను పెంచే ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుందని ఆస్ట్రేలియా వైద్యులు సూచిస్తున్నారు. మన వంటకాల్లో, తినే పదార్థాల్లో యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే అల్లం, ఉల్లిపాయ, క్యారెట్లు, గుమ్మడికాయ, పసుపు లాంటివి రోజు ఒక్కసారైనా ఉండేలా చూసుకోవాలి. రోజు విడిచి రోజు నాలుగు రకాల కూరలు లేదా కూరగాయలు తినాలి. వీటిలో పాలకూర, బ్రోకలీ, పుట్ట గొడుగులు ప్రశస్తమైనవి. అల్ల నేరేడు పండ్లు, బెర్రీలు, దానిమ్మ పండ్లు, బాదం గింజలు వారానికి మూడుసార్లు తీసుకోవాలి. వీటిలో రోగ నిరోధక శక్తిని పెంచే సీ, బీ, ఈ విటమిన్లు ఉంటాయి. చేపలు, గుడ్లు, మాంసంలో కండరాలు, ఎముకలను బలంగా ఉంచే ప్రొటీన్లతోపాటు డీ సహా 20 రకాల విటమిన్లు ఉంటాయి. జింకు ఎక్కువగా ఉండే నత్త గుల్లలు వారానికి ఓసారి తినడం మంచిది. (ఆపిల్, నైక్, సోని ఆఫీసుల మూసివేత) వీటన్నింటితోపాటు బ్యాక్టీరియా సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల కూడా రోగ నిరోధక శక్తి మరింత పెరగుతుందని ఆస్ట్రేలియా న్యూట్రిషనల్ థెరపిస్ట్ హన్నా బ్రాయ్ తెలిపారు. అలాగే రోజు గ్రీన్ టీ తీసుకోవడం మంచిది. మనం తీసుకునే ఆహారంలో ఇవి ఉండేలా చేసుకున్నట్లయితే సులభంగానే కరోనా వైరస్‌ను జయంచవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. (కరోనా వ్యాప్తికి విరుగుడు కనిపెట్టిన ప్రధాని) -
వసివాడుతున్న పసి మొగ్గలు
సాక్షి, విశాఖపట్నం : పోషకాహార లోపం చిన్నారులకు శాపంగా మారుతోంది. పోషకాహార లోపంతో సరైన ఎదుగుదల లేక చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. గర్భిణులు రక్త హీనతతో వ్యాధుల బారిన పడుతున్నారని వివిధ సంస్థల అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర సగటుతో పోలిస్తే.. ఈ సమస్యలతో బాధపడుతున్న పిల్లలు, మహిళలు ఎక్కువగానే ఉన్నారని స్పష్టమవుతోంది. చైల్డ్ రైట్స్ అండ్ యూ(క్రై) అనే స్వచ్ఛంద సంస్థ విశాఖ ఏజెన్సీ గ్రామాల్లో సర్వే నిర్వహించింది. శైశవ దశనుంచే చిన్నారులకు పోషకాహారం అందిస్తేనే సరైన ఎదుగుదల కనిపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఈ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. సాధారణంగా శిశువు జన్మించినప్పుడు 2.5 కిలోల కంటే ఎక్కువగా బరువు ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. కానీ. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2.5 కిలోల కంటే తక్కువ బరువుతో జన్మిస్తున్న వారి శాతం 5.7గా ఉంటే విశాఖలో దాదాపు 4.2 శాతంగా ఉంది. 5 ఏళ్లలోపు వయసుకి తగ్గ బరువు ఎదగలేకపోతున్న వారి శాతం రాష్ట్రంలో 31.9గా ఉంటే విశాఖలో దాన్ని మించి పోయి ఏకంగా 33.1శాతంగా ఉంది. ఐదేళ్లు నిండకుండానే నూరేళ్లు విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లోని చిన్నారులు తీవ్రమైన పోషకాహార సమస్య బారిన పడుతున్నారు. చైల్డ్ రైట్స్ అండ్ యూ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2015 నుంచి 2018 మధ్య 18 గిరిజన గ్రామాల్లో 115 మంది చిన్నారులు పోషకాహారలోపం, రక్త హీనతతో బాధపడుతూ మరణించారని పేర్కొంది. వీరంతా 0 నుంచి 5 సంవత్సరాల్లోపు శిశువులే కావడం శోచనీయం. ఈ సంస్థ 18 గ్రామాల్లో చేసిన సర్వేలో కొన్ని ఆందోళనకరమైన అంశాలు కూడా వెల్లడయ్యాయి. ఐసీడీఎస్ నివేదిక ప్రకారం చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో ఈ తరహా చిన్నారులు 165 మంది అతి తీవ్రమైన పౌష్టికాహార లోపంతో బాధపడుతుండగా 87 మంది చిన్నారులు తీవ్రమైన పౌష్టికాహార లోపంతో ఉన్నట్టుట్టు గుర్తించారు. 25 మంది ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ బరువుతో ఉన్నట్లు గుర్తించారు. మహిళా లోకమా.. మన్నించు... అవనిలో సగమని చెబుతున్న అతివల ఆరోగ్య విషయంలో టీడీపీ సర్కారు ఆది నుంచి చిన్నచూపు చూసింది. ముఖ్యంగా రక్తహీనత సమస్య మహిళల్లో అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో చూస్తే గతేడాది 56 శాతంగా ఉన్న రక్తహీనత మూడేళ్లలో 60 శాతానికి చేరుకుంది. మహిళల ఆరోగ్యంపై జీవిత కాలం ప్రతికూల ప్రభావం చూపుతోంది. పౌష్టికాహారం సరిగా అందకపోవడంతో ఎక్కువగా ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. రక్త హీనతతో బాధపడుతున్న మహిళల శాతం రాష్ట్ర సగటుతో పోలిస్తే జిల్లాలో ఎక్కువగా ఉంది. 2015 నుంచి 2018 కాలంలో 35 ప్రసూతి మరణాలు సంభవించాయని చైల్డ్ రైట్స్ అండ్ యూ సర్వేలో వెల్లడైంది. ప్రాణాలు కాపాడని పథకాలు వాస్తవంగా జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో.. ఈ తరహా సమస్యలు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. అయితే ఏజెన్సీలో సరైన పౌష్టికాహారం అందించేందుకు గత ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపించింది. అన్న అమృత హస్తం, గిరి గోరు ముద్ద, బాలసంజీవని పేరుతో.. అనేక పథకాలు అమలు చేసినా.. అవేవీ చిన్నారుల ప్రాణాలు కాపాడలేకపోయాయి. దిద్దుబాటు చర్యలు చేపడుతున్న ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఏజెన్సీ పాలిట శాపంలా మారిపోయింది. ఈ పరిస్థితి నుంచి గిరిజన గ్రామాల్ని కాపాడేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గిరిజన గ్రామాల్లో పోషకాహారలోపంతో మరణాలు, ప్రసూతి మరణాలు సంభవించకుండా ఉండేందుకు చర్యలకు ఉపక్రమించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గిరిపుత్రులకు 100 శాతం పౌష్టికాహారం అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పోషణ్ అభియాన్ మొదలైన పథకాల ద్వారా పాలు, గుడ్లు, శనగ చెక్కీలతో పాటు ప్రతినెలా కిలో ఖర్జూరం, రాగిపిండి, బెల్లం మొదలైన పౌష్టికాహారం అందిస్తోంది. దీనికితోడు కొత్త పథకాలు అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రతి ఒక్కరికీ పౌష్టికాహారం చిన్నారుల్లో పౌష్టికాహార లోపం, మహిళల్లో ఐరన్ లోపాల్ని అధిగమించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఇంటికీ పౌష్టికాహారం అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల్లో రక్త హీనతల్ని, పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. – సీతామహాలక్ష్మి, జిల్లా మహిళా శిశు, అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రొటీన్ లోపం వల్లే మరణాలు 2015–18 మధ్య కాలంలో పౌష్టికాహార లోపం 0–6 సంవత్సరాల్లోపు చిన్నారుల్లో ఎక్కువగా ఉన్నట్లు మేము చేసిన సర్వేలో తేలింది. అలాగే గర్భిణులు, బాలింతల్లో కూడా అధికంగా కనిపించింది. సరైన ప్రొటీ æన్ అందకపోవడమే దీనికి ప్రధాన కారణం. అతి తక్కువ నాణ్యత ఉన్న రేషన్‌ను అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేయడం వల్లే ఈ పరిస్థితి. కొత్త ప్రభుత్వం దీన్ని అధిగమించేలా చర్యలు తీసుకోవాలి. – జాన్ రాబర్ట్స్, చైల్డ్ రైట్స్ అండ్ యూ ప్రోగ్రామ్ హెడ్. -
గర్భిణులు కాయధాన్యాలను ఎందుకు తినాలి?
గర్భిణికి తగిన మోతాదులో విటమిన్లు, ఖనిజాలు, మాంసకృత్తులు, పీచు పదార్థాలు అందుతుండాలి అని వైద్యులు చెబుతుంటారు. ప్రసవించాక కూడా తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పోషకాలు తప్పనిసరి. దీనర్థం గర్భంతో ఉన్నవారు పెద్ద మొత్తంలో ఆహారం తీసుకోవాలని కాదు. కొద్ది మొత్తంలో తీసుకుంటూనే పెద్దమొత్తంలో పై పోషకాలు ఉండేలా శ్రద్ధ తీసుకుంటే చాలు. గుడ్లు, ఆకుకూరలు, చేపలతో పాటు.. కాయధాన్యాలలో గర్భిణికి అవసరమైన పోషకాలన్నీ ఉంటాయి. కాయధాన్యాలంటే.. కాయల్లో ఉండే ధాన్యా లు. కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఇంకా బీన్స్ వంటి వాటితో వండిన కాయధాన్య ఆహారం గర్భిణికి సత్తువనిస్తుంది. శక్తిని ఇవ్వడమే కాదు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా నివారిస్తుంది. అవి ఏమిటో ఒక్క మాటలో తెలుసుకుందాం. కాయధాన్యాలుగర్భిణులలో రక్తహీనతను నివారిస్తాయి.గర్భస్థ శిశు లోపాలను తగ్గిస్తాయి.అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి.మైగ్రేన్ తలనొప్పుల తీవ్రత ఉండదు.మలబద్ధక సమస్య తలెత్తదు.రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సరిగా ఉంటాయి. -
ఎక్కువ పోషకాలు లభించే ఆహార పదార్ధం ఇదే...
ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం చాలా ముఖ్యం. పోషకాలు సమృద్ధిగా లభించే ఆహార పదార్ధాలలో చేపలు ప్రధానమైనవి. చేపలలో ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలు లభించే ఆహార పదార్ధంగా చేపను చెప్పవచ్చు. 2001 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది జూలై 9, 10 తేదీల్లో జాతీయ మత్స్య రైతుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆక్వా కల్చర్ ఫార్మింగ్ దేశంలోనూ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన కల్చర్‌గా అభివృద్ధి అవుతున్న తరుణంలో జాతీయస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశం నలుమూలల నుంచి 5వేల మంది ప్రతినిధులు,అయిదువేల మంది ప్రజలు రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపల పెంపకం సంబంధించిన సాంకేతిక సలహాలు, విశిష్ట ప్రసంగాలతోపాటు, 30కిపైగా రకాలు చేపల ప్రదర్శన, నోరూరించే చేపల వంటకాల ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ,వ్యవసాయ నిపుణులు యమ్‌వీఎస్ నాగిరెడ్డి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. -
ప్రొటీన్ బార్స్‌తో రిస్క్
లండన్: బరువు తగ్గేందుకు బాడీని ఫిట్‌గా ఉంచుకునేందుకు ప్రొటీన్ బార్స్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని ఓ అథ్యయనం హెచ్చరించింది. వీటిలో కొవ్వును కరిగించే పదార్థాలు ఏమీ లేవని ఈ పరిశోధన తేల్చింది. ప్రొటీన్ బార్లు అదే పనిగా తింటే అవి శరీరానికి మేలు కన్నా హానే తలపెడతాయని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రొటీన్ షేక్స్, బార్లు మెరుగైన జీవనశైలికి ప్రత్యామ్నాయం కాదని లండన్ డాక్టర్స్ క్లినిక్‌కు చెందిన డాక్టర్ డేలియన్ ఫెంటాన్ చెప్పారు. ప్రొటీన్ బార్స్‌లో పలు రకాల ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రంగులు, స్వీటెనర్లు, నూనెలు ఉంటాయని, వీటి వల్ల అధిక కొవ్వు చేరడం మినహా మరో ప్రయోజనం లేదని ఆయన వివరించారు. ప్రొటీన్ బార్స్‌ను ఆహారంగా తీసుకునేవారు బరువు పెరుగుతారని స్పష్టం చేశారు. 50 ప్రముఖ ప్రొటీన్ బార్స్‌లో ఉండే కొవ్వు, ప్రొటీన్, కార్బోహైడ్రేట్, చక్కెర ఏ మేరకు ఉంటాయనేదానిపై పరిశోధకుల బృందం క్షుణ్ణంగా అథ్యయనం చేసింది. ప్రొటీన్ బార్స్‌లో అధిక కొవ్వులు ఉన్నాయని, వీటి ద్వారా బరువు తగ్గడం అసాధ్యమని పరిశోధకులు తేల్చారు. శరీర కండర నిర్మాణానికి అవసరమైన కీలక అమినో ఆమ్లాలు ఈ ప్రొటీన్ బార్స్‌లో లేవని స్పష్టం చేశారు.