ఉలవల ప్రయోజనాలు తెలిస్తే, క్షణం ఆలస్యం చేయకుండా..! | Check these amazing Benefits Of Horse Grams | Sakshi
Sakshi News home page

ఉలవల ప్రయోజనాలు తెలిస్తే, క్షణం ఆలస్యం చేయకుండా..!

Published Tue, Mar 19 2024 3:12 PM | Last Updated on Tue, Mar 19 2024 3:55 PM

Check these amazing Benefits Of Horse Grams - Sakshi

#Horse Gram Health Benefits ఉలవలు తింటే గుర్రానికి వచ్చినంత బలం వస్తుందని  మన పెద్దవాళ్లు చెప్పేవారు. మొదట్లో గుర్రాలు, పశువుల మేతగా ఉపయోగించేవారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో, పేదవారి ఆహారంగా కూడా ఉండేది. తరువాతి కాలంలో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఉలవల్నే ఇంగ్లీషులో ‘హార్స్‌ గ్రామ్‌’ అనీ  ఇంకా కులిత్, హర్డిల్ లేదా మద్రాస్ బీన్స్  అని కూడా పలుస్తారు. అంతేకాదు అమెరికా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకారం ఉలవలు భవిష్యత్తులో మంచి ఆహార వనరుగా మారనుంది.  

చాలా పోషకాలతో నిండిన ఉలవల్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిల్లో  తెల్లవి, నల్లవి అని రెండు రకాలుగా లభిస్తాయి. ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, ఫైబర్ లాంటివి పోషకాలు వీటిల్లో పుష్కలంగా లభిస్తాయి. బీ1, బీ2, బీ6, సీ, విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. మాంసాహారినికి సమానమైన ప్రోటీన్‌ కూడా లభిస్తుంది. 

ఉలవలు ఆరోగ్య ప్రయోజనాలు 
♦ బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
♦ ఉలవల్లోని ఫైబర్‌ రక్తంలోగుండె ఆరోగ్యానికి మంచిది, చక్కెర స్థాయిని తగ్గించవచ్చు.
♦ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడండి.
♦ వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మ సమస్యల నివారణలో తోడ్పడతాయి. 
♦ రుతుక్రమ రుగ్మతలు , ల్యుకోరియా చికిత్సకు సాయపడుతుంది
♦ అతి మూత్ర  వ్యాధికి  చక్కటి ఔషధం
♦ స్పెర్మ్ కౌంట్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
♦ కాలేయ పనితీరును రక్షిస్తుంది.
♦ ఎముకలను బలోపేతం  చేస్తుంది
♦ రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది.
♦ కాలేయ పనితీరును రక్షిస్తుంది
♦ మూత్రపిండాల్లో రాళ్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుం
♦ కొన్ని ప్రాంతాల్లో ఉలవల పాలను పిల్లలకు పోషక ఆహారంగా  ఇస్తారు

నోట్‌: సాధారణంగా గింజలు, పప్పు ధాన్యాలను నాన బెట్టి తినడం మంచింది.  ముఖ్యంగా ఉలవల్నినానబెట్టి ఉడికించడం వల్ల జీర్ణం సులభమవుతుంది. అధికంగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం లాంటి  సమస్యలొచ్చే  అవకాశం ఉంది. దీన్ని గమనంలో ఉంచుకోవాలి. అలాగే హైపర్‌ ఎసిడిటీ సమస్య ఉన్న వారు అధిక ఆమ్లత్వం ఉన్నవారు గౌట్‌తో బాధపడేవారు కూడా ఉలవలకు దూరంగా ఉండటం  మంచిది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement