Gram
-
ఉలవల ప్రయోజనాలు తెలిస్తే, క్షణం ఆలస్యం చేయకుండా..!
#Horse Gram Health Benefits ఉలవలు తింటే గుర్రానికి వచ్చినంత బలం వస్తుందని మన పెద్దవాళ్లు చెప్పేవారు. మొదట్లో గుర్రాలు, పశువుల మేతగా ఉపయోగించేవారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో, పేదవారి ఆహారంగా కూడా ఉండేది. తరువాతి కాలంలో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఉలవల్నే ఇంగ్లీషులో ‘హార్స్ గ్రామ్’ అనీ ఇంకా కులిత్, హర్డిల్ లేదా మద్రాస్ బీన్స్ అని కూడా పలుస్తారు. అంతేకాదు అమెరికా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకారం ఉలవలు భవిష్యత్తులో మంచి ఆహార వనరుగా మారనుంది. చాలా పోషకాలతో నిండిన ఉలవల్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిల్లో తెల్లవి, నల్లవి అని రెండు రకాలుగా లభిస్తాయి. ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, ఫైబర్ లాంటివి పోషకాలు వీటిల్లో పుష్కలంగా లభిస్తాయి. బీ1, బీ2, బీ6, సీ, విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. మాంసాహారినికి సమానమైన ప్రోటీన్ కూడా లభిస్తుంది. ఉలవలు ఆరోగ్య ప్రయోజనాలు ♦ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ♦ ఉలవల్లోని ఫైబర్ రక్తంలోగుండె ఆరోగ్యానికి మంచిది, చక్కెర స్థాయిని తగ్గించవచ్చు. ♦ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడండి. ♦ వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మ సమస్యల నివారణలో తోడ్పడతాయి. ♦ రుతుక్రమ రుగ్మతలు , ల్యుకోరియా చికిత్సకు సాయపడుతుంది ♦ అతి మూత్ర వ్యాధికి చక్కటి ఔషధం ♦ స్పెర్మ్ కౌంట్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ♦ కాలేయ పనితీరును రక్షిస్తుంది. ♦ ఎముకలను బలోపేతం చేస్తుంది ♦ రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. ♦ కాలేయ పనితీరును రక్షిస్తుంది ♦ మూత్రపిండాల్లో రాళ్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుం ♦ కొన్ని ప్రాంతాల్లో ఉలవల పాలను పిల్లలకు పోషక ఆహారంగా ఇస్తారు నోట్: సాధారణంగా గింజలు, పప్పు ధాన్యాలను నాన బెట్టి తినడం మంచింది. ముఖ్యంగా ఉలవల్నినానబెట్టి ఉడికించడం వల్ల జీర్ణం సులభమవుతుంది. అధికంగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం లాంటి సమస్యలొచ్చే అవకాశం ఉంది. దీన్ని గమనంలో ఉంచుకోవాలి. అలాగే హైపర్ ఎసిడిటీ సమస్య ఉన్న వారు అధిక ఆమ్లత్వం ఉన్నవారు గౌట్‌తో బాధపడేవారు కూడా ఉలవలకు దూరంగా ఉండటం మంచిది. -
ఒకటి, రెండు కాదు..శనగ వయసు ఏకంగా 12,600 ఏళ్లు
సాక్షి, హైదరాబాద్: భారత్‌తో పాటు దాదాపు 50 దేశాల్లో విరివిగా వాడే శనగల పూర్తిస్థాయి జన్యుక్రమ నమోదు పూర్తయింది. అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) నేతృత్వంలో దేశ విదేశాలకు చెందిన 41 పరిశోధన సంస్థలు కలసి నిర్వహించిన ప్రాజెక్టు ఫలితంగా సంపూర్ణ జన్యుక్రమం సిద్ధమైంది. దీంతో అధిక దిగుబడులిచ్చే, చీడపీడలు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని సమర్థంగా తట్టుకోగల కొత్త వంగడాల సృష్టికి మార్గం సుగమైంది. ఇక్రిశాట్ 2013లో ‘కాబూలీ చనా’అని పిలిచే ఒక రకం శనగల జన్యుక్రమాన్ని విజయవంతంగా నమోదు చేసింది. చదవండి: Stress Relief:: నువ్వులు.. గుడ్లు.. శనగలు..షెల్ఫిష్! అయితే మరిన్ని రకాల జన్యుక్రమాలను కూడా నమోదు చేయడం ద్వారా శనగల పుట్టు పూర్వోత్తరాల గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. దాదాపు 3,366 శనగ రకాలను ఎంపిక చేసి వాటన్నింటి జన్యుక్రమాలను నమోదు చేసి, విశ్లేషణ జరిపింది. ఫలితంగా శనగల్లో దాదాపు 29,870 జన్యువులు ఉంటాయని స్పష్టం కాగా ఇందులో 1,582 జన్యువులను మొదటిసారి గుర్తించారు. చదవండి: ఇక్రిశాట్ మరో అద్భుతం.. కరువు తట్టుకునేలా.. మధ్యధరా ప్రాంతంలో పుట్టుక.. ‘సిసెర్ రెటిక్యులాటమ్’అనే అడవిజాతి మొక్క నుంచి దాదాపు 12,600 ఏళ్ల కింద శనగలు పుట్టుకొచ్చాయని ఇక్రిశాట్ సంపూర్ణ జన్యుక్రమ విశ్లేషణ ద్వారా తేలింది. ఫర్టైల్ క్రెసెంట్‌గా పిలిచే ప్రస్తుత ఇజ్రాయెల్, ఇరాక్, సిరియా ప్రాంతంలో పుట్టిన ఈ పంట కాలక్రమంలో టర్కీ మీదుగా మధ్యధరా ప్రాంతానికి, దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికా ప్రాంతాలకు రెండు మార్గాల్లో విస్తరించింది. ప్రయోజనాలేమిటి? శనగల సంపూర్ణ జన్యుక్రమం నమోదు కారణంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ప్రొటీన్ వనరుగా శనగల కోసం డిమాండ్ పెరగనుంది. వేర్వేరు రకాల జన్యుక్రమాలను ఈ సంపూర్ణ జన్యుక్రమంతో పోల్చి చూడటం ద్వారా పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతున్న జన్యువులను గుర్తించడం సులువు కానుంది. చెడు జన్యువులను తగ్గించి.. మంచి జన్యువుల పనితీరును మెరుగుపరిస్తే మంచి లక్షణాలున్న శనగల వంగడాలను అభివృద్ధి చేయొచ్చు. మంచి జన్యువులను చొప్పిస్తే కొత్త వంగడాల్లో వచ్చే తేడాను కంప్యూటర్ మోడలింగ్ ద్వారా పరిశీలించారు. దీని ప్రకారం శనగల దిగుబడికి కొలమానంగా చూసే వంద విత్తనాల బరువు 12 నుంచి 23 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. పుష్టికరంగా మార్చేందుకు ‘శనగ పంట దిగుబడిని పెంచేందుకు మాత్రమే కాదు. శనగలను మరింత పుష్టికరంగా మార్చేందుకు ఈ సంపూర్ణ జన్యుక్రమం చాలా ఉపయోగపడుతుంది.’ – ప్రొఫెసర్ రాజీవ్ వార్ష్నీ, రీసెర్చ్ ప్రోగ్రామ్ డైరెక్టర్, ఇక్రిశాట్ పరిశోధనలు కొనసాగిస్తాం ‘దశాబ్ద కాలంలో శనగలకు సంబంధించిన పలు జన్యుపరమైన వనరులను ఇక్రిశాట్ అందుబాటులోకి తెచ్చింది. రైతులు, వినియోగదారులు, దేశాలకు ఎంతో ప్రయోజనకరమైన శనగ పరిశోధనలను కొనసాగిస్తాం’. –డాక్టర్ జాక్వెలీన్ హ్యూగ్స్, డైరెక్టర్ జనరల్, ఇక్రిశాట్ -
క్యాబేజీ పకోడీ
ఈజీ కుకింగ్ కావలసినవి: క్యాబేజీ తురుము – రెండు కప్పులు శనగపిండి – కప్పు బియ్యప్పిండి – అర కప్పు పచ్చిమిర్చి తరుగు – రెండు టీ స్పూన్లు కార్న్‌ఫ్లోర్ – రెండు టీ స్పూన్లు కరివేపాకు – రెండు రెమ్మలు నూనె – డీప్ ఫ్రైకి సరిపడా జీలకర్ర – టీ స్పూన్ కారం – టీ స్పూన్ ఉప్పు – తగినంత తయారి: ఒక గిన్నెలో క్యాబేజీ తురుము, శనగపిండి, బియ్యప్పిండి, పచ్చిమిర్చి తరుగు, కార్న్‌ఫ్లోర్, కరివేపాకు, జీలకర్ర, కారం, తగినంత ఉప్పు, తగినంత నీరు పోసి గట్టిగా కలుపుకోవాలి. తరువాత బాణలిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగిన తరువాత పిండిని పకోడీలుగా వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించాలి. తరవాత టిష్యూపేపర్ మీదకు తీసుకోవాలి. కరకరలాడే ఈవెనింగ్ స్నాక్ క్యాబేజీ పకోడీ రెడీ. -
కందులకు గిట్టుబాటు ధర కల్పించాలి
నిర్మల్‌టౌన్ : కందులకు రూ. 10వేలు గిట్టుబాటు ధర కల్పించాలని దళిత బహుజన వామపక్షాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం వారు పరిశీలించారు. ఈ సీజన్ లో రైతులు ఎక్కువగా కంది పంటను వేశారని తెలిపారు. గత ఏడాది కందులకు రూ. 8500 నుంచి రూ. 12వేల వరకు మద్ధతు ధరతో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారని గుర్తుచేశారు. కాగా ఈ యేడాది కేవలం రూ.5050 మద్దతు ధరను కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 3,667 క్వింటాళ్ల కందుల కొనుగోలు చేశారని తెలిపారు. మద్ధతు ధర పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశీలనలో నాయకులు కిషన్ కుమార్, జగన్ మోహన్, ఎస్ఎన్ రెడ్డి, శంకర్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పెసల కొనుగోలులో అక్రమాలు
వ్యాపారుల సరుకు దర్జాగా కొనుగోలు పథకం ప్రకారమే వ్యాపారులు, అధికారులు కుమ్మక్కు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు ఖమ్మం వ్యవసాయం: రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మార్క్‌ఫెడ్ ద్వారా ఏర్పాటు చేసిన పెసల కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వ లక్ష్యŠం పక్కదారి పడుతోంది. బినామీ రైతుల పేరిట వ్యాపారులు దర్జాగా పెసలను మార్క్‌ఫెడ్‌కు విక్రయిస్తున్నారు. మార్క్‌ఫెడ్ అధికారులు, ఉద్యోగులు, వ్యాపారులు కుమ్ముౖక్కె ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో పెసర సాగు విస్తీర్ణం దృష్టిలో పెట్టుకొని ఈ నెల 14న ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మార్క్‌ఫెడ్ ద్వారా పెసల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా నెలపాటు కొనుగోలు చేసిన సరుకును బినామీ రైతుల పేరిట ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో వ్యాపారులు విక్రయిస్తున్నారు. మార్క్‌ఫెడ్ అధికారులను, ఉద్యోగులను వలలో వేసుకొని రైతుల వద్ద రూ.4,000ల నుంచి రూ.4,200లకు కొనుగోలు చేసిన సరుకును వ్యాపారులు కేంద్రంలో విక్రయిస్తున్నారు. దర్జాగా వ్యాపారుల సరుకు.. మార్కెట్లో రైతులు తెచ్చిన పెసలను ఓ వైపు కొనుగోలు చేస్తూనే.. అదే సరుకును వ్యాపారులు తిరిగి మార్క్‌ఫెడ్ కేంద్రంలో విక్రయిస్తున్నారు. రైతులకు పెట్టుబడి పెట్టిన వ్యాపారులే.. పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆయా వ్యాపారులకే పంట ఉత్పత్తులను విక్రయించక తప్పటం లేదు. కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ముందు నెల రోజులపాటు కొనుగోలు చేసిన సరుకును కూడా కొందరు వ్యాపారులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయిస్తున్నారు. ఒప్పందం ప్రకారం వ్యాపారుల నుంచి ముడుపులు ముడుతుండటంతో అధికారులు, ఉద్యోగులు ఎక్కడా వారి సరుకు కొనుగోలులో ఆటంకం కలిగించకుండా చూస్తున్నారు. కొందరు వ్యాపారులు నిత్యం 30 నుంచి 50 క్వింటâýæ్ల వరకు కూడా బినామీ రైతుల పేరిట విక్రయిస్తున్నట్లు సమాచారం. ప్రమాణాల పేరిట రైతుల సరుకు రిజెక్ట్.. అధికారులు, ఉద్యోగులు.. వ్యాపారులు సరుకు కే ప్రాధాన్యం ఇస్తున్నారు. రైతులు తెచ్చిన సరుకును తీసుకునేందుకు నానా షరతులు విధి స్తున్నారు. నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్టుగా సరుకు లేదని రిజెక్ట్ చేస్తున్నారు. దీంతో తెచ్చిన సరుకును ఇంటికి తీసుకు వెళ్లలేక అక్కడే ఉన్న వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు ఇదే అదునుగా రూ.4,000ల నుంచి రూ.4,300 ల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీనికితోడు మార్క్‌ఫెడ్‌కు సరుకును విక్రయిస్తే వెంటనే డబ్బు చేతికందదని ప్రచారం చేస్తున్నారు. డబ్బు అవసరం ఉండటంతో రైతులు వ్యాపారులకే సరుకును విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు మార్క్‌ఫెడ్ దాదాపు 800 క్వింటâýæ్ల పెసలు కొనుగోలు చేసింది. ఈ మొత్తంలో దాదాపు మూడొంతుల సరుకు వ్యాపారుల నుంచే కొనుగోలు జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. -
జన్మభూమి పండగ రూ.కోటి దండగ
- తూతూ మంత్రంగా ముగిసిన గ్రామసభలు - నిర్వహణ పేరిట భారీగా నిధులు డ్రా - ‘కోడ్' ఉన్నా కొత్త పింఛన్లు పంపిణీ సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వం మంజూరుచేసిన కోటి రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుచేసినట్లు అధికారులు లెక్కలు చూపడం తప్ప తప్ప జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజలకు ఒరిగిందేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఈ నెల 3 నుంచి ప్రారంభమైన రెండో విడత జన్మభూమి - మా ఊరు ఆదివారంతో ముగిసింది. ఈ సభల్లో డ్వాక్రా సంఘాల పొదుపు ఖాతాల్లో రూ.3 వేల చొప్పున జమ చేసి సంబంధిత పత్రాలను అట్టహాసంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఉన్న పింఛన్లలో కోతేసి వాటి స్థానంలో కొత్తగా మంజూరుచేసిన పింఛన్లను కూడా ఈ సభల్లోనే పంపిణీ చేయాలనుకున్నారు. నీరు- చెట్టు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వంటి కార్యక్రమాలతో పాటు నెల వారీగా పంపిణీ చేసే పింఛన్లు, పీడీఎస్ సరకుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాలని తలపోశారు. సభల నిర్వహణ కోసం జిల్లాకు ఏకంగా రూ.కోటి మంజూరు చేశారు. అర్బన్ ప్రాంతాల్లో కమిషనర్లు, రూరల్‌లో మండల పరిషత్ అధికారుల అకౌంట్లకు ఈ నిధులు జమ చేశారు. సభలకు ప్రజాప్రతినిధులు దూరం ఇంతలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఈ కార్యక్రమం మొక్కుబడి తంతుగానే ముగిసింది. కొత్త పింఛన్లతో పాటు, డ్వాక్రా సంఘాల పొదుపు ఖాతాలకు రూ.3 వేల జమచేసే కార్యక్రమాలపై ఎన్నికల సంఘం ఆంక్షలు పెట్టింది. ప్రభుత్వ భజన, రాజకీయ ఉపన్యాసాలకు ఆస్కారం లేకపోవడంతో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ సభల పట్ల ఆసక్తి చూపలేదు. ఈ నెల 6న ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక పర్యటన కూడా రద్దయింది. ఇక జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, సీహెచ్ అయ్యన్న పాత్రుడులు ఒకటి రెండు సభలకే పరిమితమయ్యారు.స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ సభల జోలికి పోలేదు. జరగకపోయినా.. జరిగినట్టు.. పెదబయలు మండలం పెదకొడపల్లి గ్రామస్తులు తమ గ్రామానికి రోడ్లు నిర్మించడం లేదంటూ ఆగ్రహంతో తొలిరోజు సభను బాయ్ కాట్ చేశారు. మిగిలిన 924 పంచాయతీలతో పాటు జీవీఎంసీ, ఇతర మున్సిపాలటీల్లోని 190 వార్డుల్లో సభలు జరిగాయని లెక్క తేల్చేరు. ఈ మేరకు జన్మభూమి నిర్వహణకు మంజూరైన కోటీ ఖర్చయినట్టుగా లెక్కలు చూపారు. కానీ వాస్తవంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించాల్సిన 1144 సభల్లో కనీసం మూడో వంతు సభలు కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. అవి కూడా మొక్కుబడిగానే సాగాయి. సభలు జరిగిన చోట పెద్ద ఎత్తున రైతులు, డ్వాక్రా మహిళల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. సభలు జరగకపోయినా.. జరిగినట్టు రికార్డుల్లో పేర్కొంటూ..సభల నిర్వహణకు టెంట్లు, ఇతరసౌకర్యాల పేరిట మండలాలకు కేటాయించిన సొమ్మును పూర్తిస్థాయిలో ఖర్చు చేసినట్టు ఓచర్లు పెట్టి డ్రాచేశారు. సమస్యలు పరిష్కారం మాటెలా ఉన్నా కోటి రూపాయలను మాత్రం ఖర్చుచేయడంలో అధికారులు సఫలీకృతమయ్యారు. అర్జీలు 20 వేలే! జిల్లా వ్యాప్తంగా 1113 సభలు నిర్వహించినట్టుగా లెక్కలు చెబుతున్న అధికారులు నెల వారీగా పంపిణీ చేసే రేషన్ సరకులతో పాటు లక్షా 63 వేల 156 మందికి రూ.16.33 కోట్ల విలువైన పింఛన్లను పంపిణీ చేసినట్టు అధికారులు ప్రకటించారు. -
పేదల నోట్లో మట్టి !
అందని అమ్మహస్తం పామోలిన్, గోధుమల నిలిపివేత మార్కెట్లో నింగినంటిన ధరలు వినియోగదారులపై నెలకు *12.54 కోట్ల భారం చిత్తూరు: అమ్మహస్తం పేరుతో గత ప్రభుత్వం పేదల కోసం చేపట్టిన నిత్యావసర సరుకుల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుత ప్రభుత్వం వినియోగదారులకు పామోలిన్, గోధుమలు,కందిపప్పు తదితర వస్తువులను నిలిపేసింది. పేద ప్రజలు బయట దుకాణాల్లో సరుకులు కొనాల్సివస్తోంది. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో ఇది పేదలకు భారంగా మారింది. పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తున్న అరకొర సరుకుల్లో కూడా అధిక భాగం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోందనే ఆరోపణలున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం రాకముందు జిల్లాలో 10 లక్షల 37 వేల రేషన్ కార్డులు ఉండగా, ఆధార్ సీడింగ్ అంటూ కోతలు పెట్టి 9.65 లక్షల కార్డులను తేల్చారు. 72 వేల కార్డులను తొలగించారు. అర్హులైన పేదలు సైతం కార్డులు కోల్పోయి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఉన్న కార్డులకు నిత్యావసర సరుకులను సక్రమంగా పంపిణీ చేయడం లేదు. గత ప్రభుత్వ హయాంలో అమ్మహస్తం పేరుతో బియ్యం, చక్కెర, పామోలిన్, కందిపప్పు, కిరోసిన్, గోధుమలు, చింతపండు అంటూ 9 రకాల వస్తువుల పేర్లు చెప్పి తొలుత ఆర్భాటం చేసినా ఆ తరువాత కొన్ని వస్తువులను మాత్రమే పంపిణీ చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆ వస్తువులను కూడా పంపిణీ చేయడంలేదు. బియ్యం,కిరోసిన్, ఒక్కో కార్డుకు అర కిలో చక్కెర మాత్రమే అందిస్తోంది. గోధుమలు,పామోలిన్, కందిపప్పు, చింతపండు పంపిణీ నిలిపేసింది. కందిపప్పు, పామోలిన్‌ను ప్రతి కుటుంబం తప్పనిసరిగా వినియోగించేది, వీటి ధరలు మార్కెట్లో ఆకాశాన్నంటాయి. పేదలు కొనలేని పరిస్థితి. మార్కెట్లో కిలో చక్కెర *34 ఉండగా,కందిపప్పు * 80,గోధుమలు *36,పామోలిన్ కిలో పాకెట్ ధర * 54 ఉంది. ప్రభుత్వం వీటిని పంపిణీ చేస్తుంటే పేదలకు కొంతైనా ఉపశమనం ఉంటుంది. గతంలో ఇస్తున్న మేర అయినా సరుకులు పంపిణీచేస్తే వినియోగదారులపైన కోట్లాది రూపాయల భారం తగ్గేది. పౌరసరఫరాల శాఖ గణాంకాల మేరకు 9.65 లక్షల కార్డుదారులు నెలకు కిలో గోధుమలు బయట మార్కెట్లో కొనడంవల్ల జిల్లా వ్యాప్తంగా * 3,47,40,000 భారం పడుతుంది. ఇక పామోలిన్ పాకెట్‌పై *5,21,10,000 భారం పడుతుండగా, అర కిలో కందిపప్పు బయట మార్కెట్లో కొనడం వల్ల *3,86,00.000 భారం పడుతోంది. ఈ లెక్కన చూసినా నెలకు * 12 కోట్ల, 54 లక్షల, 50 వేలు వినియోగ దారులపై భారం పడుతోంది. ఇక ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు చెప్పుకుంటున్న సరుకులు సక్రమంగా వినియోగదారులకు అందడంలేదు. రేషన్‌షాపుల డీలర్లు, అధికారులు కుమ్మక్కై బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు ఏమాత్రం స్పందించడంలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా కందిపప్పు,గోధుమలు,పామోలిన్‌తో పాటు మరిన్ని సరుకులు పంపిణీచేసి పేదలకు ఆర్థిక భారాన్ని తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. -
బంగారం బహు ప్రియం
చెన్నై, సాక్షి ప్రతినిధి: బంగారు ధర రాష్ట్రంలో ఎనిమిదేళ్ల క్రితం నుంచే పరుగులు పెట్టడం ప్రారంభించింది. 2004లో గ్రాము ధర సరాసరి 600 నిలకడగా ఉండేది. బంగారు వ్యాపారం గ్లోబల్ మార్కెట్‌గా మారడంతో ధర పెరుగుతూ ఒక దశలో గ్రాము 3 వేలకు చేరుకుంది. నెల క్రితం సవరం ధర *20 వేలు పలికింది. వార ం క్రితం *22 వేలకు చేరింది. తమిళనాడు మార్కెట్లో బంగారు ధరను ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో సవరించడం ఆనవాయితీ. ఈ నెల 13వ తేదీ ఉదయం గ్రాము *2791, సాయంత్రానికి *2787 పలికింది. ఈ నెల 14న ధర తగ్గుముఖం పట్టి రెండు వేళల్లోనూ గ్రాము 2776 రూపాయలకు అమ్మారు. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ సెలవు కావడంతో అదే ధర కొనసాగింది. అరుుతే 16వ తేదీ గ్రాము ఉదయం *2904, సాయంత్రం *2881 చొప్పున అమ్మారు. శనివారం గ్రాము*2946, సవరం ధర *23,568 పలికారుు. కేవలం ఒక రోజులోనే సవరంపై *520 పెరిగింది. ఈ నెల 6న సవరం 21,144 రూపాయలకు విక్రరుుం చారు. శనివారం నాటి ధరతో పోలిస్తే కేవలం ఈ పది రోజుల్లో సవరంపై *2,424 పెరిగినట్లు అరుుంది. బంగారు దిగుమతులపై ఆంక్షలు, ప్రపంచ మార్కెట్లో ధర పెరగడమే ఈ పరిస్థితికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. రూపారుు పతనమే కారణం ప్రపంచ మార్కెట్లో ఒక ఔన్సు (31 గ్రాములు) బంగారాన్ని గత వారం 1250 డాలర్లు పెట్టి కొన్నామని తమిళనాడు బంగారు నగల వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు జయంతీలాల్ తెలిపారు. అదే శుక్రవారం 1365 డాలర్లకు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ధర ఒక వారంలోనే 115 డాలర్లు పెరిగిందని బంగారం బహు ప్రియంవివరించారు. బంగారు ధర పెరుగుదలకు రూపాయి పతనమే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. మరో నెల వరకు ధర తగ్గే అవకాశం లేదని అన్నారు. విదేశాల నుంచి దిగుమతయ్యే బంగారంలో 25 నుంచి 35 శాతం నాణేలుగా మారిపోతున్నాయని వెల్లడించారు. ధర పెరుగుదల నేపథ్యంలో 22, 24 క్యారెట్ల బంగారు నాణేల అమ్మకాలను నిలిపేసినట్లు తెలియజేశారు. మరో వ్యాపారి మాట్లాడుతూ బంగారు అమ్మకాలపై గతంలో 4 శాతం ఉన్న పన్ను ఈ నెల 12న 10 శాతానికి పెంచేశారని చెప్పారు. ఈ పరిణామం బంగారు స్మగ్లింగ్‌కు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి-జూలై వరకు చెన్నై నుంచి *30 కోట్ల విలువైన బంగారు స్మగ్లింగ్‌కు వినియోగమైందని తెలిపారు. ఇదిలావుండగా తమిళనాడు సంప్రదాయం ప్రకారం శనివారం నుంచి శ్రావణమాసం ప్రవేశించింది. ఈ మాసంలో ప్రజలు వివాహాది శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. ఈ క్రమంలో ఆభరణాల కొనుగోలు పెరుగుతుంది. ప్రస్తుతం బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో కొనుగోళ్లపై జనం ఆసక్తి చూపకపోవచ్చు.