పెసల కొనుగోలులో అక్రమాలు | green gram scam | Sakshi
Sakshi News home page

పెసల కొనుగోలులో అక్రమాలు

Published Thu, Sep 22 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

వ్యాపారులకు సరుకును విక్రయిస్తున్న రైతులు

వ్యాపారులకు సరుకును విక్రయిస్తున్న రైతులు

  •     వ్యాపారుల సరుకు దర్జాగా కొనుగోలు
  •  పథకం ప్రకారమే వ్యాపారులు, అధికారులు కుమ్మక్కు
  •     తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
  • ఖమ్మం వ్యవసాయం:  రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్‌ ద్వారా ఏర్పాటు చేసిన పెసల కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వ లక్ష్యŠం పక్కదారి పడుతోంది. బినామీ రైతుల పేరిట వ్యాపారులు దర్జాగా పెసలను మార్క్‌ఫెడ్‌కు విక్రయిస్తున్నారు. మార్క్‌ఫెడ్‌ అధికారులు, ఉద్యోగులు, వ్యాపారులు కుమ్ముౖక్కె ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో పెసర సాగు విస్తీర్ణం దృష్టిలో పెట్టుకొని ఈ నెల 14న ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్‌ ద్వారా పెసల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా నెలపాటు కొనుగోలు చేసిన సరుకును బినామీ రైతుల పేరిట ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో వ్యాపారులు విక్రయిస్తున్నారు. మార్క్‌ఫెడ్‌ అధికారులను, ఉద్యోగులను వలలో వేసుకొని రైతుల వద్ద రూ.4,000ల నుంచి రూ.4,200లకు కొనుగోలు చేసిన సరుకును వ్యాపారులు కేంద్రంలో విక్రయిస్తున్నారు.
    దర్జాగా వ్యాపారుల సరుకు..   
    మార్కెట్‌లో రైతులు తెచ్చిన పెసలను ఓ వైపు కొనుగోలు చేస్తూనే.. అదే సరుకును వ్యాపారులు తిరిగి మార్క్‌ఫెడ్‌ కేంద్రంలో విక్రయిస్తున్నారు. రైతులకు పెట్టుబడి పెట్టిన వ్యాపారులే.. పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆయా వ్యాపారులకే పంట ఉత్పత్తులను విక్రయించక తప్పటం లేదు. కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ముందు నెల రోజులపాటు కొనుగోలు చేసిన సరుకును కూడా కొందరు వ్యాపారులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయిస్తున్నారు. ఒప్పందం ప్రకారం వ్యాపారుల నుంచి  ముడుపులు ముడుతుండటంతో అధికారులు, ఉద్యోగులు ఎక్కడా వారి సరుకు కొనుగోలులో ఆటంకం కలిగించకుండా చూస్తున్నారు. కొందరు వ్యాపారులు నిత్యం 30 నుంచి 50 క్వింటâýæ్ల వరకు కూడా బినామీ రైతుల పేరిట విక్రయిస్తున్నట్లు సమాచారం.  
    ప్రమాణాల పేరిట రైతుల సరుకు రిజెక్ట్‌..
    అధికారులు, ఉద్యోగులు.. వ్యాపారులు సరుకు కే ప్రాధాన్యం ఇస్తున్నారు. రైతులు తెచ్చిన సరుకును తీసుకునేందుకు నానా షరతులు విధి స్తున్నారు. నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్టుగా సరుకు లేదని రిజెక్ట్‌ చేస్తున్నారు. దీంతో తెచ్చిన సరుకును ఇంటికి తీసుకు వెళ్లలేక అక్కడే ఉన్న వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు ఇదే అదునుగా రూ.4,000ల నుంచి రూ.4,300 ల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీనికితోడు మార్క్‌ఫెడ్‌కు సరుకును విక్రయిస్తే వెంటనే డబ్బు చేతికందదని ప్రచారం చేస్తున్నారు. డబ్బు అవసరం ఉండటంతో రైతులు వ్యాపారులకే సరుకును విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు మార్క్‌ఫెడ్‌ దాదాపు 800 క్వింటâýæ్ల పెసలు కొనుగోలు చేసింది. ఈ మొత్తంలో దాదాపు మూడొంతుల సరుకు వ్యాపారుల నుంచే కొనుగోలు జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement