బంగారం బహు ప్రియం | gold price hikes | Sakshi
Sakshi News home page

బంగారం బహు ప్రియం

Published Sat, Aug 17 2013 11:44 PM | Last Updated on Thu, Aug 2 2018 3:54 PM

gold price hikes

 చెన్నై, సాక్షి ప్రతినిధి: బంగారు ధర రాష్ట్రంలో ఎనిమిదేళ్ల క్రితం నుంచే పరుగులు పెట్టడం ప్రారంభించింది. 2004లో గ్రాము ధర సరాసరి 600 నిలకడగా ఉండేది. బంగారు వ్యాపారం గ్లోబల్ మార్కెట్‌గా మారడంతో ధర పెరుగుతూ ఒక దశలో గ్రాము 3 వేలకు చేరుకుంది. నెల క్రితం సవరం ధర *20 వేలు పలికింది. వార ం క్రితం *22 వేలకు చేరింది. తమిళనాడు మార్కెట్‌లో బంగారు ధరను ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో సవరించడం ఆనవాయితీ. ఈ నెల 13వ తేదీ ఉదయం గ్రాము *2791, సాయంత్రానికి *2787 పలికింది. ఈ నెల 14న ధర తగ్గుముఖం పట్టి రెండు వేళల్లోనూ గ్రాము 2776 రూపాయలకు అమ్మారు. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ సెలవు కావడంతో అదే ధర కొనసాగింది. అరుుతే 16వ తేదీ గ్రాము ఉదయం *2904, సాయంత్రం *2881 చొప్పున అమ్మారు. శనివారం గ్రాము*2946, సవరం ధర *23,568 పలికారుు. కేవలం ఒక రోజులోనే సవరంపై *520 పెరిగింది. ఈ నెల 6న సవరం 21,144 రూపాయలకు విక్రరుుం చారు. శనివారం నాటి ధరతో పోలిస్తే కేవలం ఈ పది రోజుల్లో సవరంపై *2,424 పెరిగినట్లు అరుుంది. బంగారు దిగుమతులపై ఆంక్షలు, ప్రపంచ మార్కెట్‌లో ధర పెరగడమే ఈ పరిస్థితికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
 
 రూపారుు పతనమే కారణం
 ప్రపంచ మార్కెట్‌లో ఒక ఔన్సు (31 గ్రాములు) బంగారాన్ని గత వారం 1250 డాలర్లు పెట్టి కొన్నామని తమిళనాడు బంగారు నగల వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు జయంతీలాల్ తెలిపారు. అదే శుక్రవారం 1365 డాలర్లకు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ధర ఒక వారంలోనే 115 డాలర్లు పెరిగిందని బంగారం బహు ప్రియంవివరించారు. బంగారు ధర పెరుగుదలకు రూపాయి పతనమే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. మరో నెల వరకు ధర తగ్గే అవకాశం లేదని అన్నారు. విదేశాల నుంచి దిగుమతయ్యే బంగారంలో 25 నుంచి 35 శాతం నాణేలుగా మారిపోతున్నాయని వెల్లడించారు. ధర పెరుగుదల నేపథ్యంలో 22, 24 క్యారెట్ల బంగారు నాణేల అమ్మకాలను నిలిపేసినట్లు తెలియజేశారు.
 
 మరో వ్యాపారి మాట్లాడుతూ బంగారు అమ్మకాలపై గతంలో 4 శాతం ఉన్న పన్ను ఈ నెల 12న 10 శాతానికి పెంచేశారని చెప్పారు. ఈ పరిణామం బంగారు స్మగ్లింగ్‌కు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి-జూలై వరకు చెన్నై నుంచి *30 కోట్ల విలువైన బంగారు స్మగ్లింగ్‌కు వినియోగమైందని తెలిపారు. ఇదిలావుండగా తమిళనాడు సంప్రదాయం ప్రకారం శనివారం నుంచి శ్రావణమాసం ప్రవేశించింది. ఈ మాసంలో ప్రజలు వివాహాది శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. ఈ క్రమంలో ఆభరణాల కొనుగోలు పెరుగుతుంది. ప్రస్తుతం బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో కొనుగోళ్లపై జనం ఆసక్తి చూపకపోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement