క్యాబేజీ పకోడీ
ఈజీ కుకింగ్
కావలసినవి: క్యాబేజీ తురుము – రెండు కప్పులు శనగపిండి – కప్పు బియ్యప్పిండి – అర కప్పు పచ్చిమిర్చి తరుగు – రెండు టీ స్పూన్లు కార్న్‌ఫ్లోర్ – రెండు టీ స్పూన్లు కరివేపాకు – రెండు రెమ్మలు నూనె – డీప్ ఫ్రైకి సరిపడా జీలకర్ర – టీ స్పూన్ కారం – టీ స్పూన్ ఉప్పు – తగినంత
తయారి: ఒక గిన్నెలో క్యాబేజీ తురుము, శనగపిండి, బియ్యప్పిండి, పచ్చిమిర్చి తరుగు, కార్న్‌ఫ్లోర్, కరివేపాకు, జీలకర్ర, కారం, తగినంత ఉప్పు, తగినంత నీరు పోసి గట్టిగా కలుపుకోవాలి. తరువాత బాణలిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగిన తరువాత పిండిని పకోడీలుగా వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించాలి. తరవాత టిష్యూపేపర్ మీదకు తీసుకోవాలి. కరకరలాడే ఈవెనింగ్ స్నాక్ క్యాబేజీ పకోడీ రెడీ.