చాలామంది భారతీయులు ఎక్కువగా విదేశాల్లోనే స్థిరపడుతున్నారు. ఇక అక్కడ ఉండే మన వాళ్లకు కొన్ని విషయాల్లో మన భారత్‌లో ఉన్నట్లు కుదరదు. ఆ దేశ నియమ నిబంధనలకు అనుగుణంగా మలసుకోక తప్పదు. అలాంటి వాటికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని కంటెంట్ క్రియేటర్ శివీ చౌహాన్ నెట్టింట షేర్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె ఆ వీడియోలో మన భారతీయ వంటకాల వాసనలు దుస్తుల నుంచి రాకూడదంటే ఏం చేయాలో.. కొన్ని చిట్కాలను షేర్ చేశారు.
మన భారతీయులు వంట చేయగానే కూర వాసన చూస్తారు. ఆ తర్వాత రుచి ఎలా ఉందో చూస్తాం. పైగా ఆ ఘుమ ఘుమలు వండిన వాళ్ల శరీరం నుంచి రావడం మాములే. కానీ పాశ్చాత్యా దేశాల్లో ప్రజల తీరు చాలా క్లీన్‌గా.. క్రమపద్ధతిలో ఉంటుంది. అక్కడ ఆహారాలన్నీ మన వంటకాల మాదిరి ఘుమఘుమలు రావు.
అందువల్ల బట్టలకు గనుక కూర వాసన వస్తే చాలు వాళ్లు భారతీయులు అన్నట్లు గుర్తించడమే గాక అదోలా ముఖాలు పెట్టుకుంటారు కూడా. అందువల్ల ఆ వాసన రాకుండా కాస్త జాగ్రత్తలు తప్పనిసరి ఆ విషయాన్నే కంటెంట్ క్రియేటర్ శివీ చౌహాన్ నెట్టింట షేర్ చేసింది. తనకు కూడా అలా దుస్తుల నుంచి కూరల వాసన రావడం ఇష్టముండదట.
అలా కర్రీ వాసన రాకుండా ఎలా జాగ్రత్తపడాలో కొన్ని చిట్కాలు కూడా చెప్పుకొచ్చింది. మన భారతీయ వంటకాల్లో ఉల్లిపాయలు, మసాలాలు ఉంటాయి. వాటి ఘాటు వాసన దుస్తులను అంటిపెట్టుకుని ఉంటుంది. కాబట్టి వంట చేసేటప్పడు ధరించిన బట్టలనే బయటకు వెళ్లేటప్పడు ధరించొద్దని అంటున్నారు. అలాగే వంట చేసే సమయంలో జాకెట్లు ధరించకపోవడమే మంచిదని సూచించింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. ఆమెది శ్వేతజాతీయుల భావన అని తిట్టిపోస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: గత 75 ఏళ్లుగా ఫ్రీ టిక్కెట్ సర్వీస్ అందిస్తున్న ఏకైక రైలు ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment