ట్రంప్ సన్నిహితురాలు లారా వివాదాస్పద వ్యాఖ్య
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా పోటీ పడుతున్న భారత సంతతి మహిళ కమలా హారిస్ పట్ల జాతి వివక్ష వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సన్నిహితురాలు లారా లూమర్ తాజాగా కమల హారిస్‌పై నోరుపారేసుకున్నారు. కమల అమెరికా అధ్యక్షురాలైతే శ్వేతసౌధం కర్రీ (కూర) వాసనలతో నిండిపోతుందని వ్యంగ్యా్రస్తాలు విసిరారు. కమల తల్లి శ్యామల గోపాలన్ భారతీయురాలన్న సంగతి తెలిసిందే. కమల భారతీయ మూలాలను, అలవాట్లు, సంస్కృతిని లారా లూమర్ పరోక్షంగా ఎద్దేవా చేశారు.
ఈ మేరకు ఇటీవల ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే వైట్‌హౌస్‌లో కూర వాసనలే ఉంటాయి. వైట్‌హౌస్‌లో ప్రసంగాలు కాల్ సెంటర్ ద్వారా వినిపిస్తాయి. అమెరికా ప్రజలు ప్రభుత్వానికి తమ సలహాలు, సూచనలు కేవలం కస్టమర్ శాటిస్ఫాక్షన్ సర్వే ద్వారా పంపించాల్సి ఉంటుంది’’ అని లూమర్ పేర్కొన్నారు. నేషనల్ గ్రాండ్‌పేరెంట్స్ డే సందర్భంగా కమలా హారిస్ సోషల్ మీడియా పోస్టు చేసిన చేసిన ఫోటోపై ఆమె పై విధంగా స్పందించారు. కమలా హారిస్‌పై లూమర్ చేసిన వ్యాఖ్యల పట్ల వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెరీన్ జీన్–పియర్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment