Racist comments
-
కమల గెలిస్తే శ్వేతసౌధంలో కర్రీ వాసనలే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా పోటీ పడుతున్న భారత సంతతి మహిళ కమలా హారిస్ పట్ల జాతి వివక్ష వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సన్నిహితురాలు లారా లూమర్ తాజాగా కమల హారిస్‌పై నోరుపారేసుకున్నారు. కమల అమెరికా అధ్యక్షురాలైతే శ్వేతసౌధం కర్రీ (కూర) వాసనలతో నిండిపోతుందని వ్యంగ్యా్రస్తాలు విసిరారు. కమల తల్లి శ్యామల గోపాలన్ భారతీయురాలన్న సంగతి తెలిసిందే. కమల భారతీయ మూలాలను, అలవాట్లు, సంస్కృతిని లారా లూమర్ పరోక్షంగా ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఇటీవల ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే వైట్‌హౌస్‌లో కూర వాసనలే ఉంటాయి. వైట్‌హౌస్‌లో ప్రసంగాలు కాల్ సెంటర్ ద్వారా వినిపిస్తాయి. అమెరికా ప్రజలు ప్రభుత్వానికి తమ సలహాలు, సూచనలు కేవలం కస్టమర్ శాటిస్ఫాక్షన్ సర్వే ద్వారా పంపించాల్సి ఉంటుంది’’ అని లూమర్ పేర్కొన్నారు. నేషనల్ గ్రాండ్‌పేరెంట్స్ డే సందర్భంగా కమలా హారిస్ సోషల్ మీడియా పోస్టు చేసిన చేసిన ఫోటోపై ఆమె పై విధంగా స్పందించారు. కమలా హారిస్‌పై లూమర్ చేసిన వ్యాఖ్యల పట్ల వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెరీన్ జీన్–పియర్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మళ్లీ అదే పాతపాట: కమల
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ జాతి వివక్ష వ్యాఖ్యలకు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ మళ్లీ తన పాత విభజన సిద్ధాంతాన్నే ముందుకు తెస్తున్నారని, అగౌరవపరిచే ధోరణి కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి విభజనవాది కాకుండా, అమెరికాకు నిజాలు మాట్లాడే నాయకులు, వాస్తవాలను ఎదుర్కోవాల్సి వచి్చనప్పుడు.. శత్రుభావంతో, ఆగ్రహంతో ఊగిపోకుండా అర్థం చేసుకునే నాయకులు కావాలని ఆమె అభిప్రాయపడ్డారు. హూస్టన్‌లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రజల్లో ఉన్న వైరుధ్యాలు విభజనకు తావివ్వకూడదని, అవే మన బలమని తెలిసిన నాయకుడు అమెరికాకు కావాలని చెప్పారు. అమెరికా ప్రజలను విభజించడానికి ట్రంప్ ప్రయ్నతిస్తున్నారని హారిస్ ఎన్నికల ప్రచార డైరెక్టర్ మైఖేల్ టేలర్ విమర్శించారు. మాజీ అధ్యక్షుడి వ్యాఖ్యలు అవమానకరమైనవిగా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జీన్ పెర్రీ పేర్కొన్నారు. వ్యక్తులను ఎలా గుర్తించాలో చెప్పే హక్కు ఎవరికీ లేదని, అది ఎవరికి వారు సొంతగా తీసుకునే నిర్ణయమన్నారు. -
Donald Trump: భారతీయురాలా? బ్లాకా?
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జాతివివక్ష వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కానున్న కమలా హారిస్ భారతీయురాలా? లేక నల్ల జాతీయురాలా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఆమె చాలాకాలంగా భారతీయ సంతతికి చెందిన అమెరికన్‌గా తెలుసని, ఇప్పుడు హఠాత్తుగా నల్లజాతీయురాలినని చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. షికాగోలో బుధవారం జరిగిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్స్ కన్వెన్షన్‌లో ట్రంప్ మాట్లాడారు. వేదికపై ట్రంప్‌ను ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్టులలో ఒకరు.. ‘హారిస్ ఎప్పుడూ నల్లజాతీయురాలిగానే గుర్తింపును కోరుకున్నారు. నల్లజాతీయుల యూనివర్సిటీలోనే చదువుకున్నారు’ అని చెప్పడానికి ప్రయత్నించగా ట్రంప్ అడ్డుపడ్డారు. ఆమె ఏదో ఒకదానికి కట్టుబడితే గౌరవిస్తానని, కానీ గతంలో భారతీయ వారసత్వం గురించి చెప్పుకున్న ఆమె అకస్మాత్తుగా నల్లజాతి వైపు మలుపు తిరిగారని, ఎవరైనా దానిని పరిశీలించాలని వ్యాఖ్యానించారు. న్యాయవాదిగా ఆమె బార్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని, పాస్ అవుతానని కూడా ఆమె అనుకోలేదని, ఆ తరువాత ఏమి జరిగిందో తనకు తెలియదని ఎద్దేవా చేశారు. అంతకుముందు రోజు ఫాక్స్‌న్యూస్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో సైతం ట్రంప్ అభ్యంతరకరంగా మాట్లాడారు. కమల అధ్యక్షురాలిగా ఎన్నికైతే ప్రపంచవ్యాప్తంగా నేతలు ఆమెను ఆట బొమ్మలా చూస్తారని, ఆమె చుట్టూరా తిరుగుతారని వ్యాఖ్యానించారు. -
ఆ పోలీసును తొలగించాలి
వాషింగ్టన్: అమెరికాలో గత జనవరిలో పోలీసు వాహనపు అతి వేగానికి బలైన తెలుగమ్మాయి జాహ్నవి కందుల విషయంలో జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సియాటిల్ పోలీసు అధికారి డేనియల్ ఆడరర్పై ఆగ్రహ జ్వాలలు నానాటికీ పెరుగుతున్నాయి. ‘ఇదేమంత పెద్ద విషయం? ఏ 11 వేల డాలర్లకో చెక్కు రాస్తే సరి. ఆమెకు 26 ఏళ్లు. అలా చూస్తే ఆమె జీవితం అంత విలువైనదేమీ కాదు‘ అంటూ ఈ ఉదంతంపై అతను చేసిన వ్యాఖ్యలు గత సోమవారం బాడీకామ్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. అప్పటినుంచీ వాటిపై తీవ్ర దుమారం రేగుతోంది. రాజా కృష్ణమూర్తి వంటి భారత అమెరికన్ చట్ట సభ్యులతో పాటు అమెరికా చట్ట సభ్యులు కూడా వాటిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. డేనియల్ ప్రవర్తన మీద స్వతంత్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలంటూ శుక్రవారం (అమెరికా కాలమానం ప్రకారం) ఆన్లైన్ పిటిషన్ దాఖలైంది. నిషిత రహేజా గోయల్ అనే భారత్ అమెరికన్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఇప్పటికే వేలాది మంది సంతకాలు చేశారు. శుక్రవారం రాత్రికే సంతకాల సంఖ్య 6,700 దాటిపోయింది. ‘డేనియల్ ప్రవర్తనతో సియాటిల్ పోలీసు శాఖపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. అందుకే అతన్ని తక్షణం ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు ఇకపై కొత్తగా పోలీసు శాఖలో చేరే ప్రతి ఒక్కరికీ సున్నితత్వం తదితరాల విషయంలో విధిగా శిక్షణ ఇవ్వాలి. అప్పుడే జాహ్నవి, అలాంటి ఇతర బాధిత కుటుంబాలకు కాస్తయినా సాంత్వన చేకూరుతుంది‘ అని పిటిషన్ పేర్కొంది. మరోవైపు, డేనియల్ను సియాటిల్ పోలీసు అధికారుల గిల్డ్ సమర్థించింది! అతను ప్రైవేట్‌గా చేసిన వ్యాఖ్యలను అసంబద్ధంగా విడుదల చేసి అపార్థాలకు తావిచ్చారని ఆరోపించింది. ఈ మేరకు సుదీర్ఘ వివరణ విడుదల చేసింది. తన వ్యాఖ్యలను దురర్థం వచ్చేలా వక్రీకరించారని డేనియల్ కూడా ప్రకటన విడుదల చేశాడు. -
జాహ్నవికి న్యాయం జరగాల్సిందే
వాషింగ్టన్: అమెరికాలో పోలీసుల నిర్లక్ష్యంతో జరిగిన కారు ప్రమాదానికి బలైపోవడమే గాక మరణానంతరం కూడా వాళ్ల చేతుల్లో జాత్యహంకార హేళనకు గురైన తెలుగు యువతి జాహ్నవి కందుల ఉదంతాన్ని అక్కడి భారతీయ చట్ట సభ్యులు సీరియస్‌గా తీసుకున్నారు. వాషింగ్టన్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయిన 23 ఏళ్ల జాహ్నవి గత జనవరిలో సియాటిల్‌లో రోడ్డు దాటుతుండగా పోలీసు వాహనం ఢీ కొని మరణించడం తెలిసిందే. 25 మైళ్ల స్పీడ్ లిమిట్ ఉన్న చోట సదరు వాహనం ఏకంగా 74 మైళ్ల వేగంతో దూసుకురావడమే ప్రమాదానికి కారణమని తేలింది. కానీ డేనియల్ ఆడరర్ అనే సియాటెల్ పోలీసు అధికారి ఈ ఉదంతంపై చేసిన అత్యంత అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘అయితే ఏమయిందిప్పుడు?! ఆమెకు ఆల్రెడీ 26 ఏళ్లు. అంత విలువైనదేమీ కాదు. ఏ 11 వేల డాలర్లకో ఓ చెక్కు రాసి పారేయండి‘ అంటూ అతనన్న మాటలు బాడీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అతనిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, సియాటిల్ సిటీ కౌన్సిల్ సభ్యురాలు క్షమా సావంత్ తదితరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా పోలీసుల్లో జాత్యహంకారం ఎంతగా జీరి్ణంచుకుపోయిందో చెప్పేందుకు ఈ ఉదంతం మరో నిదర్శనమని వారన్నారు. డేనియల్‌పై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం డిమాండ్ చేశారు. ‘జాహ్నవి దుర్మరణానికి కారకులైన పోలీసులే ఆమె జీవితం విలువే లేనిదంటూ అంత నీచంగా మాట్లాడటం వింటే చెప్పరానంత జుగుప్స కలుగుతోంది. జాతి విద్వేషం, జాత్యహంకారం అమెరికాలో ఆమోదనీయత పొందుతున్నాయనేందుకు ఇది సంకేతం. ఈ చెడు ధోరణికి తక్షణం అడ్డుకట్ట పడాలి‘ అని కృష్ణమూర్తి అన్నారు. ఈ ఉదంతం మీద పూర్తి అధికారాలతో కూడిన పౌర సంఘ సభ్యుల కమిటీ వేసి స్వతంత్రంగా విచారణ జరిపించాలని సావంత్ కోరారు. డేనియల్ మీద 2014 నుంచి కనీసం 18 విచారణలు జరిగితే అతన్ని ఒక్క దాంట్లోనూ శిక్షించకపోవడం దారుణమన్నారు. పోలీసులే ఇంతటి నోటి దురుసుతో జాత్యహంకార వ్యాఖ్యలకు పాల్పడ్డ ఇలాంటి హై ప్రొఫైల్ కేసులో కూడా విచారణను ఆర్నెల్లు సాగదీయడం, రివ్యూ పేరిట ఏడాది దాకా లాగడం క్షమించరానిదని సౌత్ సియాటిల్ సిటీ కౌన్సిల్ సభ్యుడు టామీ జె.మోరల్స్ ఆవేదన వెలిబుచ్చారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్ అసోసియేషన్స్ కూడా ఒక ప్రకటనలో కోరింది. వందలాది మంది గురువారం సియాటిల్‌లో నిరసన ప్రదర్శన కూడా చేశారు. దోషులైన పోలీసులకు శిక్ష పడి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. జాహ్నవికి మరణానంతరం డిగ్రీ అమెరికాలో పోలీసు వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం చేయనున్నట్లు నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ ప్రకటించింది. మాస్టర్స్ డిగ్రీ పట్టాను జాహ్నవి కుటుంబ సభ్యులకు అందజేస్తామని వెల్లడించింది. జాహ్నవి మృతి పట్ల నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ చాన్సలర్ సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. -
మహిళకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్
Woman Racist Comments.. అమెరికాలో జాత్యహంకార కామెంట్స్ కామన్. నల్లజాతీయుల పట్ల తెల్లజాతీయులకు చిన్నచూపు ఉంటుంది. పలు సందర్భాల్లో నల్లజాతీయులపై దాడులు జరిగిన ఘటనలు సైతం చాలానే చూశాము. తాజాగా జాత్యహంకార కామెంట్లు చేస్తున్న ఓ మహిళకు క్యాబ్ డ్రైవర్ రైడ్ నిరాకరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుండటంతో నెటిజన్లు.. క్యాబ్ డ్రైవర్‌ను మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..పెన్సిల్వేనియాలోని ఫాసిల్స్ లాస్ట్ స్టాండ్ బార్ బయట జాకీ అనే మహిళ.. బోడే అనే వ్యక్తి క్యాబ్‌లో ఎక్కింది. డ్రైవర్‌ను విష్ చేసిన తర్వాత, “వావ్, నువ్వు తెల్లవాడిలా ఉన్నావే” అని కామెంట్ చేయగా.. బోడే ‘‘ఎక్స్క్యూజ్ మీ’’ అని అనడంతో.. మళ్లీ ఆమె.. “నువ్వు సాధారణ వ్యక్తివా?.. ఇంగ్లీష్ మాట్లాడతారా?” అంటూ బోడే భుజం మీద తడుముతూ కనిపించింది. దీంతో, సీరియస్ అయిన బోడే.. ఇది కరెక్ట్ కాదు. ఎవరో వ్యక్తి తెల్లవాడు కాకపోయినా ఆ సీటులో కూర్చుంటే వచ్చే తేడా ఏంటి అని ప్రశ్నించే సరికి ఆమె షాకైంది. అనంతరం బోడే.. ఆ మహిళను మీరు కారు దిగి వదిలివెళ్లిపోవచ్చు. రైడ్‌ను క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పేశాడు. ఈ ఘటనకు సంబంధిన వీడియో మొత్తాన్ని డ్రైవర్ బోడే.. తన హ్యాండ్ కామ్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. A @lyft driver, James W. Bode exemplified what it is to be a White Ally. He lost money. Risked his rating. All in the name of doing what he believed is right. Be more like James! I owe you a beer, Jimmy. pic.twitter.com/WrdA2AxntD — Kenny Nwankwo (@KennyNwankw0) May 16, 2022 వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ నిలిచింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. రేసిస్ట్ కస్టమర్లను తిరస్కరించడం కరెక్ట్ అని కామెంట్స్ చేస్తూనే దీనిని చూసి ప్రతిఒక్కరూ నేర్చుకోవాలంటున్నారు. కానీ, అది అంత ఈజీ కాదంటూ డ్రైవర్ బోడేకు అభినందనలు తెలుపుతున్నారు. అంతకు ముందు.. అమెరికన్ పొలిటికల్ యాక్టివిస్ట్, రైటర్ ఏంజెలా డేవిస్ ఒకానొక సమయంలో.. "జాత్యంహకార సమాజంలో జాత్యంహకారం చేయకుండా ఉంటే సరిపోదు. జాత్యంహకార వ్యతిరేకి అయి కూడా ఉండాలి" అని అన్నారు. ఈ ఘటన ఆయన కామెంట్స్‌కు సూట్ అయ్యేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ముప్పై ఏళ్ల బంధానికి ముగింపు.. రష్యా నుంచి దిగ్గజ కంపెనీ నిష్క్రమణ -
మైఖేల్ వాన్‌పై నిషేధం..!
Michael Vaughan Dropped From BBC After Racism Allegations: జాత్యాహంకార ఆరోపణల నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, వివాదాస్పద వ్యాఖ్యాత మైఖేల్ వాన్‌పై ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ నిషేధం విధించింది. తమ ఛానల్లో ప్రసారమయ్యే "ద టఫర్స్ అండ్ వాన్ క్రికెట్ షో" నుంచి వాన్‌ను తప్పిస్తున్నట్లు శనివారం ప్రకటన విడుదల చేసింది. వాన్ బీబీసీలో గత 12 ఏళ్లుగా టెస్ట్ మ్యాచ్ విశ్లేషకుడిగా పనిచేస్తున్నాడు. 2009లో నాటింగ్హమ్‌తో మ్యాచ్ సందర్భంగా తనతో పాటు జట్టులోని పలువురు సభ్యులపై వాన్ జాత్యాహంకార వ్యాఖ్యలు చేశాడని యార్క్‌షైర్ ఆటగాడు అజీమ్ రఫీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీబీసీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై బీబీసీ చర్యలను వాన్ పూర్తిగా ఖండించాడు. తనపై ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నాడు. 1991 నుంచి 2009 వరకు ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వాన్.. గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా టీమిండియా ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ వాన్ చాలాసార్లు తన నోటికి పని చెప్పాడు. ఇదిలా ఉంటే, జాతి వివక్షపై కుప్పలు తెప్పలుగా ఆరోపణలు రావడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ (వైసీసీసీ)పై సస్పెన్షన్ వేటు వేసింది. వాన్‌పై ఫిర్యాదు చేసిన రఫీక్ ఇదే కౌంటీ తరఫున 2008–2018 వరకు ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: యార్క్‌షైర్ కౌంటీపై వేటు -
రేసిజం ఎఫెక్ట్..వరల్డ్ ఫేమస్ టిక్ టాకర్‌కు షాక్
వరల్డ్ వైడ్‌గా 115 మిలియన్ల మంది టిక్ టాక్ ఫాలోవర్స్‌తో సెకండ్ మోస్ట్ పాపులర్ క్రియేటర్‌గా ఉన్న 21 ఏళ్ల ఖాబీ లేమ్ వివాదంలో చిక్కుకున్నారు. ఫేస్బుక్, టెస్లా వంటి దిగ్గజ సంస్థలే జాత్యహంకార వ్యాఖ్యల వివాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ తరుణంలో ఖాబీలేమ్ సే టూ నో రేసిజం అంటూ చేసిన పోస్ట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిక్కుల్లో వరల్డ్ ఫేమస్ క్రియేటర్ ఖాబీ లేమ్ ఆఫ్రికన్ కంట్రీస్లోని సెనెగలీస్లో పుట్టాడు. పెరిగింది మాత్రం ఇటలీలోని చివాస్సో. చదువుతోంది గ్రాడ్యుయేషన్. ఏడాది క్రితం వరకు ఇతను ఒక మామూలు వ్యక్తి. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఖాబీలేమ్ వరల్డ్ ఫేమస్ అయ్యాడు. మాట్లాడకుండా చిత్ర విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో టిక్‌టాక్ వీడియోలు చేసేవాడు. ఆ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. దీంతో దశ తిరిగి అనతి కాలంలోనే 115 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఫాలోవర్స్‌తో పాటు స్పాన్సర్ల రూపంలో ఇబ్బడి ముబ్బడి డబ్బు వచ్చి పడుతుంది. ఇప్పుడు ఇటలీలో ఉంటూ టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ భారీగా అర్జిస్తున్నాడు. అయితే తాజాగా ఇన్ స్టాగ్రామ్‌లో ఆయన చేసిన పోస్ట్‌పై మండిపడుతున్నారు. సే టూ నో రేసిజం పేరుతో చేసిన ఇన్‌స్టా గ్రామ్ పోస్ట్ వివాదంలో చిక్కుకుంది. దెబ్బకు ఫాలోవర్స్ ఖాబీలేమ్ను అన్ ఫ్రెండ్ చేస్తున్నారు. ఎందుకంటే తాను రేసిజంపై పోస్ట్ చేసినందుకేనని పోస్ట్‌లో పేర్కొన్నాడు. చదవండి: సుఖం కోసం కష్టమెందుకు?: టిక్‌టాకర్ ఖబి -
వాళ్లు నిజంగా జాత్యహంకారులే.. ఇప్పటికీ మన యాసను ఎగతాలి చేస్తారు
న్యూఢిల్లీ: ఇంగ్లీష్ క్రికెటర్ ఓలీ రాబిన్సన్ ఎపిసోడ్‌పై భారత మాజీ వికెట్ కీపర్ ఫరూఖ్ ఇంజినీర్ స్పందించాడు. రాబిన్సన్ ఎనిమిదేళ్ల కిందట చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించాడు. అతని విషయంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) నిర్ణయం సరైందేనని, మున్ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై జీవితకాల నిషేదం విధించాలని ఈసీబీని కోరాడు. ఈ సందర్భంగా రాబిన్సన్ను వెనకేసుకొచ్చిన వారిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. గతంలో తాను లాంకషైర్ కౌంటీకి ప్రాతినిధ్యం వహించే రోజుల్లో జాతి వివక్షను ఎదుర్కొన్నానని, ఇంగ్లీష్ వాళ్లు భారతీయుల పట్ల అహంకారులుగా వ్యవహరించే వాళ్లని తెలిపాడు. వాళ్లు అప్పుడు ఇప్పుడు మన యాసను ఎగతాలి చేస్తున్నారని, వాళ్లలో జాత్యాంహంకారం బుసలు కొడుతుందని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ అయితే తరచూ బ్లడీ ఇండియన్స్ అంటూ సంబోధించేవాడని, అలాంటి వాడిని మన వాళ్లే అందలమెక్కించారని వాపోయాడు. ఈ విషయంలో ఇంగ్లీష్ క్రికెటర్ల తర్వాత ఆసీస్ ఆటగాళ్లుంటారని, వాళ్లు కూడా భారతీయుల పట్ల అహంకారపూరితంగా వ్యవహరిస్తారని పేర్కొన్నాడు. ఒకప్పుడు మనపై వివక్ష చూపిన వాళ్లంతా ఇప్పుడు ఐపీఎల్ పుణ్యమా అని మన బూట్లు నాకుతున్నారని దుయ్యబట్టాడు. ఇంగ్లీష్ క్రికెటర్లు డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారని, వాళ్ల నిజస్వరూపమేంటో తనకు తెలుసునని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్ట్ అరంగేట్రం చేసిన రాబిన్సన్.. తాను టీనేజర్‌గా ఉన్న సమయంలో ఆసియా వాసులు, ముస్లింలపై జాతి వివక్ష ట్వీట్లు చేశాడన్న ఆరోపణలపై ఈసీబీ అతన్ని అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: క్రికెట్ చరిత్రలో 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే అత్యుత్తమం -
పాపం రాబిన్సన్.. క్షమించమని కోరినా కనికరించలేదు
లండన్: ఎనిమిదేళ్ల క్రితం మిడిమిడి జ్ఞానంతో చేసిన తప్పిదానికి ఇంగ్లండ్ యువ పేసర్ ఓలీ రాబిన్సన్ ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నాడని టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విచారం వ్యక్తం చేశాడు. లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన 27 ఏళ్ల రాబిన్సన్.. 2013లో సోషల్ మీడియా వేదికగా స్త్రీల పట్ల అనుచిత వ్యాఖ్యలతో పాటు జాత్యాంహకార వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతనిపై విచారణ చేపట్టి, అతన్ని తక్షణమే అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ వ్యవహారంపై టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ట్విటర్ వేదికగా ఓలీ రాబిన్సన్కు మద్దతు తెలుపుతూనే.. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోని ప్రవర్తించాలని ఈ తరం ఆటగాళ్లను హెచ్చరించాడు. ఈ సందర్భంగా ఆయన ఈసీబీ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. రాబిన్సన్ అప్పుడెప్పుడో చేసిన తప్పుకు క్షమించమని కోరినా ఈసీబీ ఇంత కఠినంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుబట్టాడు. టెస్ట్ కెరీర్లో అద్భుతమైన ఆరంభం లభించిన ఆటగాడిని ఈ రకంగా శిక్షించడం బాధగా ఉందని వాపోయాడు. ఏదిఏమైనప్పటికీ.. ఈ సోషల్ మీడియా యుగంలో ప్రస్తుత తరం ఆటగాళ్లకు ఇదో హెచ్చరిక లాంటిదని ట్వీట్ చేశాడు. కాగా, ఓలీ రాబిన్సన్ తన తొలి టెస్ట్‌లో 7 వికెట్లతో పాటు 42 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ డ్రాతో గట్టెక్కింది. కివీస్ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఖరి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. ఓపెనర్ డామినిక్ సిబ్లీ 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలువగా, కెప్టెన్ జో రూట్ (40) పర్వాలేదనిపించాడు. ఇక అరంగేట్రంలోనే ద్విశతకంతో అదరగొట్టిన కివీస్ ఆటగాడు డెవాన్ కాన్వేను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఇరు జట్ల మధ్య చివరిదైన రెండో టెస్టు, జూన్ 10 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా జరగనుంది. చదవండి: నదాల్‌కు మళ్లీ పెళ్ళా.. ఫేస్బుక్ అప్డేట్ చూసి షాక్ తిన్న అభిమానులు -
ఎనిమిదేళ్ల క్రితం చేసిన ట్వీట్‌కు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు..
లండన్: లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లతో సంచలన ప్రదర్శన చేసిన ఇంగ్లండ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఒలీ రాబిన్సన్ గతంలో సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ కారణంగా వివాదాల్లో చిక్కుకున్నాడు. 27 ఏళ్ల రాబిన్సన్ 2012-13లో ట్విటర్ వేదికగా చేసిన జాత్యాంహకార వ్యాఖ్యలే ఇందుకు కారణం. దాదాపు ఎనిమిదేళ్ల కిందట రాబిన్సన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పోస్ట్ తాజాగా వెలుగుచూడటంతో, అతనిపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) దర్యాప్తునకు ఆదేశించింది. ఈ అంశంపై ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్ గ్రహం థోర్ఫ్ స్పందిస్తూ.. భవిష్యత్తులో జాతీయ జట్టుకు ఎంపికయ్యే అటగాళ్లకు సంబంధించిన సోషల్ మీడియా చరిత్ర ఆయా దేశాలకు చెందిన క్రికెట్ బోర్డ్‌లు పరిశీలనలోకి తీసుకుంటాయేమోనని వ్యాఖ్యానించాడు. యువ క్రికెటర్లు తెలిసి తెలియని వయసులో చేసిన తప్పుల కారణంగా వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాలంటే ఇది సరైన నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే, రాబిన్సన్ కూడా ఈ విషయంపై స్పందించాడు. యుక్త వయసులో మిడిమిడి జ్ఞానంతో ఆ తప్పు చేశానని, ఇప్పుడు తాను పరిణితి చెందానని, ఏదిఏమైనా తాను అలాంటి లింగ పక్షపాతంతో కూడిన జాత్యాంహకార వ్యాఖ్యలు చేసి ఉండకూడదని క్షమాణలు చెప్పాడు. గతంలో తన చర్యల వల్ల సిగ్గుపడుతున్నానని, దయ చేసి సభ్య సమాజం తనను మన్నించాలని విజ్ఞప్తి చేశాడు. ఇదిలా ఉంటే, బుధవారం న్యూజిలాండ్‌తో మొదలైన తొలి టెస్ట్‌లో డెవాన్ కాన్వే అద్భుత ద్విశతకం సాయంతో పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. మీడియం పేసర్ ఒలీ రాబిన్సన్(4/75), మార్క్ వుడ్(3/81), జేమ్స్ ఆండర్సన్(2/83)లకు వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. ఆరంభంలోనే డామినిక్ సిబ్లీ(0), జాక్ క్రాలీ(2)ల వికెట్లు కోల్పోయినప్పటికీ.. రోరీ బర్న్స్(59 నాటౌట్), కెప్టెన్ జో రూట్(42 నాటౌట్) ఆదుకోవడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు నష్టానికి 111 పరుగులు సాధించింది. చదవండి: కోహ్లీ, రవిశాస్త్రి ఆడియో లీక్.. -
మారని తీరు: సిరాజ్‌పై మరోసారి జాతి వివక్ష వ్యాఖ్యలు
బ్రిస్బేన్: టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌పై కొందరు ఆస్ట్రేలియా ప్రేక్షకులు మరోసారి జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. బ్రిస్బేన్ వేదికగా గబ్బా స్టేడియంలో జరగుతున్న నాలుగో టెస్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయాన్ని టీమిండియా మేనేజ్మెంట్ క్రికెట్ ఆస్ట్రేలియా, దాంతోపాటు ఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. కాగా, సిడ్నీ టెస్టులో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్, బుమ్రాపై సైతం ఆస్ట్రేలియన్లు జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై ఇప్పటికే టీమిండియా మేనేజ్మెంట్ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) దృష్టికి తీసుకెళ్లగా.. చర్యలు తీసుకున్నామని తెలిపింది. కామెంట్ చేసిన వారిని గుర్తించి స్టేడియం నుంచి బయటకు గెంటేశామని పేర్కొంది. వారిని పోలీసులకు అప్పగిస్తామని కూడా సీఏ హామి ఇచ్చింది. వారం గడవక ముందే మళ్లీ అదే తరహా ఉదంతం వెలుగు చూడటంతో టీమిండియా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించనుంది. (చదవండి: పంత్ మొత్తుకున్నా నమ్మలేదు..) ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు మెరుగైన స్థానంలో నిలిచింది. ఐదు వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (1), మార్కస్ హ్యారిస్ (5).. 17 పరుగులకే ఔటైనా లబూషేన్‌తో కలిసి మూడో టెస్టు సెంచరీ హీరో స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. జట్టు స్కోరు 87 పరుగుల వద్ద స్మిత్ రూపంలో భారత్‌కు భారీ వికెట్ లభించింది. అయితే, మాథ్యూ వేడ్‌తో కలిసి లబూషేన్ (204 బంతుల్లో 108; 9 ఫోర్లు) టీమిండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని పరుగుల వరద పారించాడు. మూడో సెషన్లో ఈ ఇద్దరూ పెవిలియన్ చేరడంతో రహానే సేన ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం కామెరూన్ గ్రీన్ (28), కెప్టెన్ పైన్ (38) క్రీజులో ఉన్నారు. అరంగేట్ర బౌలర్ నటరాజన్ 2, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్‌సుందర్, సిరాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. (చదవండి: లైఫ్ ఇచ్చారు.. మూల్యం చెల్లించుకున్నారు!) Mohammed Siraj was labelled a “bloody grub” by members of the Gabba crowd less than a week after the abuse allegations which marred the Sydney Test Full story 👇https://t.co/gQtnhwbxMq#AUSvIND pic.twitter.com/QI1tfjRl9z — Sam Phillips (@samphillips06) January 15, 2021 -
సిరాజ్‌కు సారీ చెప్పిన డేవిడ్ వార్నర్!
సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రసవత్తర టెస్టు సిరీస్ సమరంలో జాతివివక్ష వ్యాఖ్యలు కలవరం పుట్టించాయి. ఇప్పటికే పూర్తయిన వన్డే సిరీస్‌ను ఆతిథ్య జట్టు, టీ20 సిరీస్‌ను భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టెస్టు సిరీస్ విషయానికి వస్తే తొలి టెస్టులో ఆస్ట్రేలియా, రెండో టెస్టులో భారత్ విజయం సాధించి సమంగా నిలిచాయి. ఈసమయంలో సిడ్నీ జరిగిన మూడో టెస్టు మూడో రోజున ఆస్ట్రేలియాకు చెందిన కొంతమంది ఆకతాయిలు బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్‌పై జాతివివక్ష వ్యాఖ్యలు చేయడంతో టీమిండియా క్రికెట్ ఆస్ట్రేలియాకు ఫిర్యాదు చేసింది. నాలుగో రోజు కూడా అలాంటి సీనే రిపీట్ అయింది. ఈసారి బుమ్రాను జాతి వివక్ష వ్యాఖ్యలతో ఆసీస్ మూకలు ఇబ్బందులు పెట్టడంతో మరోసారి టీమిండియా ఫిర్యాదు చేయక తప్పలేదు. ఈ ఘటనపై తాజాగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. జాతి వివక్ష వ్యాఖ్యలపై సిరాజ్‌కు, బుమ్రాకు, టీమిండియాకు క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన వెల్లడించాడు. జాతి వివక్ష వ్యాఖ్యలపై విచారిస్తున్నానని అన్నాడు. అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. భారత ఆటగాళ్లపై ఆకతాయిల వైఖరి తీవ్ర నిరాశకు గురి చేసిందని వాపోయాడు. నిందితులపై క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు తీసుకుటుందని స్పష్టం చేశాడు. మరోసారి అలాంటి ఘటనలు రిపీట్ కావని ఆశిస్తున్నట్టు వార్నర్ తన పోస్టులో చెప్పుకొచ్చాడు. (చదవండి: 'అశ్విన్‌పై చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నా') గబ్బా స్టేడియంలో జరిగే ఫైనల్ టెస్టుకు రెడీ అవుతున్నామని పేర్కొన్నాడు. అలాగే, సిడ్నీ టెస్టులో గొప్పగా రాణించి మ్యాచ్‌ను నిలుపుకున్న భారత ఆటగాళ్ల పోరాట పటిమను వార్నర్ ప్రశంసించాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాగా ఆడుతున్నారని కొనియాడాడు. కాగా, జాతి వివక్ష వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా సంజాయిషీ ఇచ్చుకుంది. మరోసారి అలా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, ఆ ఆకతాయిలను గుర్తించి పోలీసులకు అప్పగిస్తామని హామీ ఇచ్చింది. ఐసీసీ కూడా జాతి వివక్ష వ్యాఖ్యల్ని ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
భారత ఆటగాళ్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు
సిడ్నీ: ప్రపంచం ఓ వైపు వైరస్‌తో పోరాడుతోంది. మరోవైపు జాతి వివక్షపై చేయిచేయి కలుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆస్ట్రేలియా మూకలు బరితెగించాయి. చిత్తుగా తాగిన మద్యం మత్తులో భారత క్రికెటర్లపై చెత్త వాగుడుకు దిగాయి. జాత్యాహంకార దూషణకు తెగబడి టెస్టు మ్యాచ్‌లో అలజడి రేపాయి. శనివారమే (మూడో రోజు ఆటలో) ఇది భారత ఆటగాళ్లను తాకింది. ఆదివారమైతే శ్రుతి మించింది. దీంతో టీమిండియా ఫిర్యాదు చేసింది. అంపైర్లు వెంటనే స్పందించారు. తర్వాత ఇరు దేశాల క్రికెట్ బోర్డులు కూడా సమస్యపై దృష్టి పెట్టాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అయితే ‘వివక్ష’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)ను నివేదిక కోరింది. భారత ఆటగాళ్లు దీనిపై ఉక్కుపిడికిలి బిగించాల్సిందేనన్నారు. అసలేం జరిగింది? బుమ్రా, సిరాజ్‌లపై శనివారం ఆసీస్ ఆకతాయి ప్రేక్షకులు జాత్యహంకార మాటలతో హేళన చేశారు. ఆదివారం వీరిచేష్టలు మరింత శ్రుతిమించాయి. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ సమయంలో స్క్వేర్ లెగ్ బౌండరీ వద్ద ఉన్న మూకలు అసలే తండ్రిని కోల్పోయి బాధలో ఉన్న సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకొని ‘బ్రౌన్ డాగ్’, ‘బిగ్ మంకీ’ అంటూ దూషించారు. దీనిని గమనించిన ఆటగాళ్లంతా సిరాజ్‌ను అనునయించారు. 86వ ఓవర్ ముగిశాక భారత ఆటగాళ్లంతా ఓ చోట చేరుకున్నారు. ఏం చేశారు? ఐసీసీ సీరియస్ క్రికెట్లో జాతి వివక్షను ఉపేక్షించబోమని ఐసీసీ తెలిపింది. సిడ్నీ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఉదంతంపై సీఏ వివరణ కోరామని, నివేదిక వచ్చాక పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఐసీసీ పేర్కొంది. సీఏ క్షమాపణ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) జరిగిన సంఘటనపై విచారం వెలిబుచ్చింది. భారత ఆటగాళ్లను, క్రికెట్ బోర్డును క్షమాపణ కోరింది. ‘ఇంతటితో దీన్ని విడిచిపెట్టం. ఆకతాయిలను ఇప్పటికే గుర్తించాం. సీఏ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇకపై వారిని మైదానాల్లోకి అనుమతించకుండా నిషేధిస్తాం. చట్టపరమైన చర్యల కోసం న్యూసౌత్‌వేల్స్ పోలీసులకు అప్పగిస్తాం’ అని సీఏ ఉన్నతాధికారి సీన్ కారల్ అన్నారు. బీసీసీఐ కార్యదర్శి జై షా ‘మన సమాజంలో, క్రీడల్లో జాత్యహంకారానికి చోటులేదు. ఇప్పటికే సీఏతో సంప్రదించాం. దోషులపై చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరాం’ అని ట్వీట్ చేశారు. నాకు ఇది నాలుగో ఆసీస్ పర్యటన. గతంలో ప్రత్యేకించి సిడ్నీలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నేనూ బాధితుణ్నే. బౌండరీలైన్ వద్ద ఉండే క్రికెటర్లకు ఇలాంటి దూషణలు పరిపాటి. ఇవి పునరావృతం కాకుండా ఉండాలంటే ఉక్కుపిడికిలి బిగించాల్సిందే. – భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ జాత్యహంకారాన్ని సహించేది లేదు. మైదానాల్లో ఇలాంటి రౌడీ మూకల ప్రవర్తన ఆటగాళ్లను బాధిస్తోంది. నేను 2011–12లో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను. దీన్ని తీవ్రంగా పరిగణించాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. – విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ -
నువ్వు మూర్ఖుడివే.. అదే తగిన శాస్తి!
‘తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు’ అన్నట్లుగా ఉంటుంది కొంతమంది వైఖరి. వాస్తవాలను అంగీకరించకుండా మొండిగా వ్యవహరిస్తూ.. తమ వాదనే సరైందనే భావనలో ఉంటారు. వాస్తవాలను అంగీకరించకుండా ఇష్టారీతిన ఇతరులపై విమర్శలకు దిగుతూ మూర్ఖంగా ప్రవర్తిస్తారు. అమెరికాకు చెందిన ఓ 23 ఏళ్ల కుర్రాడు సోషల్ మీడియాలో లేవనెత్తిన చర్చే ఇప్పుడు ఈ ప్రస్తావనకు కారణం. ఓ భారతీయ విద్యార్థిని ఆంగ్ల పరిజ్ఞానాన్ని చూసి ఓర్చుకోలేక.. ‘‘నేనేమైనా మూర్ఖుడినా’’అంటూ అతడు ప్రశ్నించిన తీరు నెటిజన్లకు చిరాకు తెప్పిస్తోంది. అందుకే.. ‘‘నువ్వు నిజంగా స్టుపిడ్వే’’ అంటూ చురకలు అంటిస్తూ ఇప్పటికైనా జాత్యహంకారం వీడమని సలహా ఇస్తున్నారు. నీ ప్రేయసి తీసుకున్న నిర్ణయం సరైందే అంటూ చివాట్లు పెడుతున్నారు. ఆ రెడిట్ యూజర్ పోస్టుకు సంబంధించిన వివరాలు.. ఏంటి ఇండియా వాళ్లకు ఇంగ్లీష్ వచ్చా?! నా గర్ల్‌ఫ్రెండ్‌కు 18 ఏళ్ల ప్రియా అనే ఇండియన్ ఫ్రెండ్ ఉంది. ఉన్నత చదువుల కోసం.. ఏడాది క్రితం... ఇంగ్లీష్ మాట్లాడే నా దేశానికి వచ్చిందామె. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. నేనేమో ఇంగ్లీష్ లిటరేచర్ స్టూడెంట్ను. తను ఇంకా సైన్స్ చదువుతోంది. ఇదిలా ఉంటే.. కొన్ని రోజుల క్రితం నా గర్ల్‌ఫ్రెండ్‌ను, నన్ను ప్రియా వాళ్లింటికి ఆహ్వానించింది. మాకు భారతీయ వంటకాలు పెట్టింది. వైన్ ఇచ్చింది. నేనైతే బాగా తిన్నాను. చాలా బాగా గడిచింది రోజంతా. అయితే నా గర్ల్‌ఫ్రెండ్, ప్రియాకు ఓ స్క్రాబల్(గేమ్ బోర్టు- అక్షరాలతో అర్థవంతమైన పదాలు పేరుస్తూ ఆట ఆడుతారు) బహుమతిగా ఇచ్చింది. తనకు ఈ ఆట చాలా ఇష్టమని చెప్పింది. (చదవండి: ఫేస్‌బుక్‌కు దూరంగా ప్రముఖులు?) కాబట్టి మేం గేమ్ ఆడాలని నిర్ణయించుకున్నాం. నేనైతే ముందే డిసైడ్ అయ్యా. వాళ్లిద్దరిని ఈజీగా ఓడించేయవచ్చని. కానీ అనూహ్యంగా ప్రియా లీడ్‌లోకి వచ్చేసింది. చాలా కఠినమైన పదాలను తను బోర్డులో చేర్చింది. నాకైతే తను పక్కాగా చీటింగ్ చేసింది అనిపించింది. ఎందుకంటే గేమ్ మధ్యలో తను బాత్రూంకి వెళ్లింది. 3 నిమిషాలు అక్కడే ఉంది. అప్పుడే గూగుల్ చేసి ఈ పదాలను పెట్టిందని అనుమానం. ఎందుకంటే ఇండియా నుంచి వచ్చిన ఆమెకు ఇంతటి ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం ఎలా ఉంటుంది. నేనిలా అన్నా... తనేం మాట్లాడలేదు. కనీసం సమర్థించుకునే ప్రయత్నం చేయలేదు. నవ్వుతూనే ఉంది. నేనేం చీటింగ్ చేయలేదు అని మాత్రం చెప్పింది. అయితే ఈ విషయంలో నా గర్ల్‌ఫ్రెండ్ చాలా అప్సెట్ అయ్యింది. నేను ఓడిపోయానని, తనకిది అవమానకరమని అన్నది. అయితే నేను నిజాయితీగా ఆడానని, చీటింగ్ చేసి ప్రియా నా మీద గెలిచిందని చెప్పాను. దాంతో నా గర్ల్‌ఫ్రెండ్‌కు కోపం వచ్చింది. నన్ను రేసిస్ట్ అంటూ తిట్టింది. అంతేకాదు నాతో బంధం గురించి మరోసారి ఆలోచిస్తానని చెప్పింది. నేను అన్నదాంట్లో తప్పేముంది’’అంటూ అతడు ప్రశ్నించాడు. ఇందుకు స్పందనగా, ప్రియాకు మద్దతుగా చాలా మంది నెటిజన్లు అతడిపై విమర్శలు గుప్పించారు. ఐఈఎల్‌టీఎస్‌తో పలు కఠినమైన పరీక్షలు రాసి ఇండియన్ విద్యార్థులు యూఎస్‌కు వస్తారని, అంతేగాక ఎంతో మంది ఇండో అమెరికన్ చిన్నారులు స్పెల్ బీ పోటీలో ప్రతిభ చాటుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. నిజంగానే నువ్వు తెలివితక్కువ వాడివి అంటూ ఏకాభిప్రాయానికి వచ్చేశారు. ఇకనైనా బుద్ది మార్చుకో అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
‘భారతీయ మహిళలు అందవిహీనులు’
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ వైట్‌హౌస్ నుంచి పలు వివాదకర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వెలువడిన కొన్ని ఆడియో క్లిప్స్ దేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ భారతీయ మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు ఈ టేప్స్ వివరిస్తున్నాయి. ‘భారతీయ మహిళలు.. ప్రపంచంలోనే అత్యంత అందవిహీనులు.. సెక్స్‌లెస్, ఆకర్షణ లేనివారు, ఎలా పునరుత్పత్తి చేస్తారో తెలియదు’ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు నిక్సన్. ఈ విషయాన్ని తాజాగా ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ గ్యారీ జె. బాస్ ది న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఓపీనియన్ పోల్‌లో వెల్లడించారు. అమెరికాకు 37వ అధ్యక్షుడిగా రిచర్డ్ నిక్సన్ 1969 నుంచి 1974 వరకు పనిచేశారు. ఇక ఆయనకు సంబంధించిన ఈ టేప్స్‌ను రిచర్డ్ నిక్సన్ లైబ్రరీ అండ్ మ్యూజియం విడుదల చేసింది. (చదవండి: ట్రంప్‌ను పొగడుదామని తప్పులో కాలేసింది) భారతీయుల పట్ల నిక్సన్‌లో ఉన్న వ్యతిరేకతకు ఆ సమయంలో జాతీయ భద్రతా సలహాదారు హెన్రీ కిస్సింజర్ వీరాభిమాని అని బాస్ తెలిపారు. అంతేకాక హెన్రీ 1970 ల ప్రారంభంలో భారత్ పట్ల అమెరికా విధానాన్ని కూడా నిర్ణయించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. జూన్ 17, 1971 న సాయంత్రం 5:15-6:10 గంటల మధ్య జరిగిన సమావేశంలో భాగంగా నిక్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వీటిని ఓవల్ ఆఫీస్ టేపింగ్ సిస్టమ్ రికార్డ్ చేసింది. ఈ టేప్స్‌ను బాస్ తన పుస్తకం ‘ది బ్లడ్ టెలిగ్రామ్’లో ప్రస్తావించారు. నిక్సన్ భారతీయ మహిళలను నల్లజాతి మహిళలతో పోల్చారు. ‘నా ఉద్దేశ్యం ఏమిటంటే, బ్లాక్ ఆఫ్రికన్లలో కొద్దిగా ఆకర్షణ ఉంటుంది. కానీ భారతీయ మహిళలు చూడటానికి అందవిహీనులుగా ఉంటారు’ అని నిక్సన్ పేర్కొన్నారు. అంతేకాకుండా నిక్సన్ నవంబర్ 4, 1971న అప్పటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీతో మాట్లాడుతున్నప్పుడు ‘నాకైతే వారు అసలు నచ్చరు. మిగిలిన వ్యక్తులకు వారు ఎలా నచ్చుతున్నారో తెలియట్లేదు’ అని చెప్పినట్లు విన్నానని బాస్ స్పష్టం చేశారు.(చదవండి: వైట్‌హౌస్ ఒరలో ఇమడరనీ!) అంతేకాక ఈ టేపులు అంతర్జాతీయ సంఘటనలు, నటుల పట్ల నిక్సన్ వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి. వ్యక్తిగత జాత్యహంకారం, భారతీయుల పట్ల అతని వ్యతిరేకతను ఈ టేపులు వెల్లడిస్తున్నాయి. తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) లోని బెంగాలీ ప్రజలపై పాకిస్తాన్ సైన్యం చేసిన దురాగతాల విషయలో కూడా నిక్సన్ సానుకూల వైఖరిని కలిగి ఉండటమే కాక భారత్ పట్ల ఎంతటి శత్రుత్వం కలిగి ఉన్నారో కూడా ఈ టేపులు స్పష్టం చేస్తున్నాయి. -
‘దేశం విడిచి వెళ్లిపోకుంటే.. కాల్చిపారేస్తాం’
టెక్సాస్: అమెరికాలో మరోసారి జాత్యహంకార బెదిరింపుల కలకలం రేగింది. స్వదేశానికి తిరిగి వెళ్లకపోతే కాల్పులకు దిగుతామంటూ గుర్తు తెలియని దుండగులు టెక్సాస్‌లోని ఇర్వింగ్ నివాసికి మెయిల్ పంపించారు. వలసదారుల వల్ల స్థానిక అమెరికన్లకు ఉద్యోగాలు రావడం లేదని, కాబట్టి వెంటనే దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. లేని పక్షంలో విచక్షణారహితంగా కాల్పులకు దిగుతామంటూ బెదిరించారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు, చైనీయులు సహా ఇతర ఆసియా దేశాల ప్రజలను ఉద్దేశించి జాతి వివక్ష పూరిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు అమెరికా పోస్టల్ సర్వీస్‌ను సంప్రదించి విచారణ ముమ్మరం చేశారు. లేఖ రాసిన దుండగుల చిరునామా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: భారత సంతతి రీసెర్చర్ హత్య) ఈ నేపథ్యంలో ఇలాంటి వేధింపులు, విద్వేషపూరిత చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇర్వింగ్ పోలీసులు స్పష్టం చేశారు. అదే విధంగా ఇలాంటి మెయిల్స్ ఇంకా ఎవరికైనా వచ్చి ఉంటే తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు... ‘‘ఐటీ ఇండస్ట్రీ, ఇతర రంగాల్లో భారతీయులు, చైనీయుల కారణంగా అమెరికా పౌరులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీరంతా దేశాన్ని విడిచి వెళ్లిపోవాలి. లేనట్లయితే మీరు పనిచేసే చోట, స్విమ్మింగ్ పూల్ లేదా ప్లేగ్రౌండ్ ఇలా ఎక్కడైనా విచక్షణారహితంగా కాల్పులకు దిగడం కంటే మాకు వేరే మార్గం లేదు’’ దుండగులు పంపిన లేఖను ఫేస్బుక్లో షేర్ చేస్తూ కమ్యూనిటీ అలర్ట్ జారీ చేశారు. కాగా యూఎస్ హౌజ్ క్యాండిడేట్ (టెక్సాస్-24), డెమొక్రటిక్ పార్టీ నేత కాండేస్ వాలేన్జులా మాట్లాడుతూ.. ‘‘ఉత్తర టెక్సాస్‌లో ఇలాంటి విద్వేషానికి తావులేదు. మనమంతా కలిసి కట్టుగా ఉండి ఇలాంటి పిరికపంద చర్యలను, జాత్యహంకార, విభజన పూరిత చర్యలను తిప్పికొట్టాలి. ఇలాంటి ఘటనలకు మరింత ఆజ్యం పోయకుండా, ఉద్రిక్తతలు చల్లారేలా వ్యవహరించాలి’’అని విజ్ఞప్తి చేశారు. -
నన్ను ‘కాలూ’ అని పిలిచారు
కింగ్స్టన్: ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా తాను కూడా జాతి వివక్ష వ్యాఖ్యల్ని ఎదుర్కొన్నానని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ అన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన సమయంలో తనతో పాటు శ్రీలంక క్రికెటర్ తిసారా పెరీరా వర్ణ వివక్షకు గురయ్యాడని తెలిపాడు. ‘సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో నన్ను, పెరీరాను ‘కాలూ... కాలూ’ (నల్లోడు) అని పిలిచేవారు. అప్పుడు దానర్థం మాకు తెలిసేది కాదు. భారత్‌లో ‘కాలూ’ అంటే ‘బలమైన వ్యక్తి’ అని పిలుస్తున్నారేమో అనుకునేవాడిని. కానీ ఈ మధ్యే ఆ పదానికి అర్థం తెలుసుకున్నా. చాలా బాధగా ఉంది’ అని స్యామీ ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నాడు. అయితే ఏ ఐపీఎల్ సీజన్ సందర్భంగా తాను ఈ వివక్షను ఎదుర్కొన్నాడో స్యామీ తెలపలేదు. జెంటిల్మెన్ క్రీడ క్రికెట్లో ఉన్న జాత్యాంహకారం పట్ల తీవ్రంగా పరిగణించాలని ఇటీవలే అతను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి విజ్ఞప్తి చేశాడు. ఇప్పటివరకు 38 టెస్టులు, 126 వన్డేలు, 68 టి20లు ఆడిన స్యామీ.... విండీస్‌కు కెప్టెన్‌గా రెండు టి20 ప్రపంచకప్‌లను అందించాడు. -
పాక్ కెప్టెన్‌పై వేటు
దుబాయ్: దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఆండిల్ పెహ్లువాకియాపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు సారథి సర్ఫరాజ్ అహ్మద్‌పై వేటు పడింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నిబంధనావళిని అతిక్రమించిన సర్ఫరాజ్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని విధించింది. దీంతో దక్షిణాఫ్రికాతో జరగబోయే చివరి రెండు వన్డేలు, రెండు టీ20లకు దూరమవనున్నాడు. దీంతో పాక్ సీనియర్ ఆటగాడు షోయాబ్ మాలిక్ తాత్కాలిక సారథిగా వ్యహరించనున్నాడు. ఆటగాళ్లను వ్యక్తిగతంగా గానీ, కుటుంబం సభ్యులపై గానీ, వర్ణ, జాతి వివక్షలు, అంపైర్లపై అసహనాన్ని ప్రదర్శిచడం ఐసీసీ ప్రవర్తనా నియమావళిని అతిక్రమించడమేనని పేర్కొంది. (‘మేం క్షమించాం.. ఇక ఐసీసీ ఇష్టం’) అసలేం జరిగిందంటే..? డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో క్రీడా సూర్తిని మరిచి పాక్ సారథి సర్ఫరాజ్ అహ్మద్ వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఆండిల్ పెహ్లువాకియా నలుపు రంగును ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ ఏ నల్లోడా.. మీ అమ్మ ఎక్కడ కూర్చుంది. నీకు ఏం కావాలని ఆమెను ప్రార్థించమన్నావ్?’ అంటూ ఒళ్లు మరిచి మాట్లాడటం స్టంప్స్ మైక్‌లో రికార్డయ్యాయి. (పాక్ క్రికెటర్ జాతి వివక్ష వ్యాఖ్యలు!) దీనిపై దక్షిణాఫ్రికా జట్టు అధికారికంగా ఫిర్యాదు చేయకపోయినా... ఐసీసీ స్వతంత్ర విచారణ చేపట్టింది. సరదాగా స్లెడ్జింగ్ కాకుండా ఇవి వర్ణ వివక్ష వ్యాఖ్యలు కావడంతో దోషిగా తేలితే సర్ఫరాజ్‌కు పెద్ద శిక్షే పడవచ్చు. మరోవైపు మ్యాచ్ తర్వాతి రోజు సర్ఫరాజ్ దీనిపై క్షమాపణలు కోరాడు. ‘మ్యాచ్‌లో అసహనాన్ని ప్రదర్శిస్తూ నేను చేసిన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడితే మన్నించండి. ఎవరినీ కావాలని ఆ మాటలు అనలేదు. మరెవరినీ బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు. ప్రపంచవ్యాప్తంగా సహచర క్రికెటర్లను నేను ఎప్పుడైనా గౌరవిస్తాను’ అని సర్ఫరాజ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. -
ఒళ్లు మరిచి కామెంట్ చేసిన పాక్ కెప్టెన్
-
పాక్ క్రికెటర్ జాతి వివక్ష వ్యాఖ్యలు!
డర్బన్ : పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మైదానంలో క్రీడాస్పూర్తి మరిచి జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెటర్‌నని, ఓ జట్టు కెప్టెన్ అనే సోయి లేకుండా దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఆండిల్ పెహ్లువాకియా పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్నాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ పెహ్లువాకియా దాటికి 203 పరుగులకే కుప్పకూలింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సఫారి జట్టు మళ్లీ పెహ్లువాకియా(69 నాటౌట్)నే ఆదుకొని విజయాన్నందించాడు. అయితే సఫారీ ఇన్నింగ్స్ 37 ఓవర్లో పెహ్లువాకియా బ్యాటింగ్‌తో తీవ్ర అసహనానికి గురైన సర్ఫరాజ్ అహ్మద్ నోటికి పనిచెబుతూ స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. పెహ్లువికియా బ్యాటింగ్ చేస్తుండగా వికెట్ల వెనుక ఉర్దూలో అత్యంత జుగుప్సాకరంగా కామెంట్ చేశాడు. ‘ ఏ నల్లోడా.. మీ అమ్మ ఎక్కడ కూర్చుంది. నీకు ఏం కావాలని ఆమెను ప్రార్థించమన్నావ్?’ అంటూ ఒళ్లు మరిచి మాట్లాడాడు. ఈ మాటలు స్టంప్స్ మైక్‌లో స్పష్టంగా రికార్డవ్వడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ తరహా వ్యాఖ్యల పట్ల క్రీడా అభిమానులు మండిపడుతున్నారు. సర్ఫరాజ్‌పై ఐసీసీ కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. Sarfaraz Ahmed to Andile Phehlukwayo: "abbay kaale teri Ami kahan bethi hoyi hain aaj, kya parhwa kay aya hai aaj" "black man wheres your mother sat? What have you asked your mother to pray for you today?"#SAvPAK pic.twitter.com/vw6yuE73OE — Saj Sadiq (@Saj_PakPassion) January 22, 2019 -
అలీ ఆరోపణల్లో ఆధారాల్లేవ్: క్రికెట్ ఆస్ట్రేలియా
సిడ్నీ: తనపై ఆస్ట్రేలియా క్రికెటర్ ఒకరు ‘ఒసామా’ అని సంబోధిస్తూ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) విచారణకు కూడా ఆదేశించింది. తాజాగా తమ విచారణలో ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని ఇంతటితో ఈ విచారణను ఆపేస్తున్నామని పేర్కొంది. ‘ఈ ఘటన సమయంలోనే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సూచనల మేరకు మా టీం మేనేజ్మెంట్ విచారణ చేపట్టింది. అప్పుడే మొయిన్ అలీకి తమ స్పందనను కూడా తెలియజేయడం జరిగింది. అతను ఆరోపణలు చేసిన నేపథ్యంలో మరోసారి విచారణ చేపట్టిన మాకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఈ వివాదానికి ముగింపు పలుకుతున్నాం’ అని సీఏ అధికార ప్రతినిధి ఒకరు తమ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు. 2015 యాషెస్ సిరీస్ సందర్భంగా కార్డిఫ్‌లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ ఆటగాడు తనను ఉద్దేశించి ‘ఒసామా’ అని సంబోధించాడని అలీ తన ఆత్మకథలో రాసుకొచ్చాడు. -
నన్ను ఒసామా అని పిలిచాడు: క్రికెటర్
మెల్బోర్న్: తనపై ఆస్ట్రేలియా క్రికెటర్ ఒకరు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఆరోపించాడు. 2015 యాషెస్ సిరీస్ సందర్భంగా కార్డిఫ్‌లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ ఆటగాడు తనను ఉద్దేశించి ‘ఒసామా’ అని సంబోధించాడని పేర్కొన్నాడు. త్వరలో విడుదల కానున్న తన ఆత్మకథలో అలీ ఈ విషయాన్ని రాసుకొచ్చాడు. ‘యాషెస్‌లో నాకు అదే తొలి టెస్టు. నా ప్రదర్శన (77 పరుగులు, ఐదు వికెట్లు)ను గొప్పగా భావిస్తున్నా. అదే సమయంలో మైదానంలో ఓ ఘటన కలచి వేసింది. ఆస్ట్రేలియా క్రికెటర్ ఒకరు నావైపు తిరిగి ‘టేక్ దట్, ఒసామా’ అని వ్యాఖ్యానించాడు. ఆ క్షణంలో నిజమేనా? అని ఆశ్చర్యపోయా. తర్వాత అర్థమైంది. నేనైతే గ్రౌండ్లో ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు’ అని అలీ అన్నాడు. ‘ఇంగ్లండ్ జట్టులోని ఇద్దరు ఆటగాళ్లకు విషయం చెప్పా. వారు మా కోచ్ ట్రెవర్ బేలిస్‌కు చేరవేశారు. ఆయన ఆసీస్ కోచ్ డారెన్ లీమన్‌తో మాట్లాడాడు. లీమన్ ఆ ఆటగాడిని పిలిచి ప్రశ్నించగా... అతడు ఖండించాడు. ‘టేక్ దట్ యు పార్ట్ టైమర్’ అని మాత్రమే అన్నట్లు చెప్పాడు. సిరీస్ ముగిశాక కూడా ఆ ఆటగాడు తప్పును ఒప్పుకోలేదు’ అని అలీ వివరించాడు. ఈ వ్యాఖ్యల కారణంగా మిగతా మ్యాచ్ మొత్తం తాను ఆగ్రహంగా ఆడానని పేర్కొన్నాడు. మరోవైపు ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికార ప్రతినిధి తెలిపారు. ఇలాంటి ప్రవర్తనను సహించమని, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నుంచి పూర్తి వివరాలు తెప్పించుకుని విచారణ చేపడతామని స్పష్టం చేశారు. -
కూచిభొట్ల కేసులో నిందితుడి నేరాంగీకారం
వాషింగ్టన్: భారతీయ ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య కేసు విచారణ త్వరలో ముగియనుంది. ఈ నేరానికి పాల్పడినట్లు మాజీ నేవీ ఉద్యోగి ప్యూరింటన్ అంగీకరించటంతో అతనికి యావజ్జీవ జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి 22న శ్రీనివాస్ తన స్నేహితుడు అలోక్ మాడసానితో కలిసి బార్లో ఉండగా ప్యూరింటన్(52) జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ తుపాకీతో వారిపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో గాయపడిన శ్రీనివాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన సంగతి తెలిసిందే. దర్యాప్తు అధికారులు పూర్తి ఆధారాలు సమర్పించటంతో తాజాగా జరిగిన విచారణలో తానే ఈ నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. దీనిపై జడ్జి చార్లెస్ డ్రోగ్ మాట్లాడుతూ..ప్యూరింటన్‌కు హత్య నేరం కింద జీవిత కాల జైలు శిక్ష, హత్యాయత్నానికి 12 నుంచి 54 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముందని చెప్పారు. అయితే, విద్వేషపూరిత నేరం రుజువైతే అదనంగా మరో శిక్ష ఉంటుందని తెలిపారు. తాజా పరిణామాన్ని శ్రీనివాస్ భార్య సునయన స్వాగతించారు. ‘ఈ తీర్పుతో శ్రీనివాస్‌ను తిరిగి పొందలేను. కానీ, విద్వేషపూరిత నేరాలకు పాల్పడే వారికి ఇది ఒక హెచ్చరిక’ అని పేర్కొన్నారు. మే 4వ తేదీన కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. -
చెత్త దేశాల పౌరులు మాకెందుకు?
వాషింగ్టన్: నోటి దురుసుకు కేరాఫ్‌గా నిలిచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరుజారారు. హైతీ, ఎల్సాల్వడార్లతో పాటు ఆఫ్రికాలోని అత్యంత చెత్త(షిట్ హోల్) దేశాల పౌరుల్ని అమెరికాలోకి ఎందుకు అనుమతించాలని జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడిక్కడి ఓవల్ కార్యాలయంలో రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల సెనెటర్లతో సమావేశమైన ట్రంప్ ఈ మేరకు స్పందించారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలపై ఐక్యరాజ్యసమితి, ఆఫ్రికన్ యూనియన్‌తో పాటు ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ట్రంప్ ఎట్టకేలకు స్పందించారు. హైతీ, ఎల్‌సాల్వడార్, ఆఫ్రికా దేశాలపై తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ట్రంప్ తెలిపారు. డీఏసీఏ సమావేశంలో తాను సీరియస్ కామెంట్స్ మాత్రమే చేశానని స్పష్టం చేశారు. అమెరికా రక్షణ కల్పిస్తున్న పౌరుల జాబితా నుంచి హైతీ దేశస్తుల్ని తొలగించాలని తాను ఆదేశించినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ట్వీటర్లో తెలిపారు. ఇదంతా డెమొక్రటిక్ పార్టీ సభ్యులు చేసిన కుట్రనీ, భవిష్యత్‌లో అన్ని సమావేశాలను రికార్డు చేస్తామని వెల్లడించారు. ఓవల్ కార్యాలయంలో గురువారం ఇరుపార్టీల సెనెటర్లతో సమావేశమైన ట్రంప్.. బాల్యంలో అమెరికా వచ్చినవారిపై చర్యల వాయిదా(డీఏసీఏ) బిల్లును తిరస్కరించారు. ఈ సందర్భంగా కొందరు నేతలు హైతీ, ఎల్సాల్వడార్తో పాటు ఆఫ్రికా దేశాల పౌరుల రక్షణ కోసం పోరాడటంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘మన దేశంలో అత్యంత చెత్త(షిట్ హోల్) దేశాలకు చెందిన పౌరులంతా ఎందుకున్నారు? వీరందరినీ అసలు ఎందుకు అనుమతించాలి? అమెరికా ఆర్థిక వ్యవస్థకు లబ్ధి చేకూర్చే కొన్ని ఆసియా దేశాలతో పాటు నార్వే నుంచి వలసల్ని ప్రోత్సహించండి’ అని వారితో ట్రంప్ వ్యాఖ్యానించినట్లు పలు అమెరికన్ పత్రికలు గురువారం వార్తలు ప్రచురించాయి. లండన్‌లో ఎంబసీని ప్రారంభించను లండన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఫిబ్రవరిలో బ్రిటన్ వెళ్లాల్సిన ట్రంప్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ‘ఒబామా ప్రభుత్వం లండన్‌లో కీలకమైన మేఫైర్లో ఉన్న అమెరికా ఎంబసీని చిల్లరకు అమ్మేసి 1.2 బిలియన్ డాలర్లతో ఎక్కడో మారుమూలన నైన్ ఎల్మస్లో ఎంబసీని నిర్మించింది’ అని ట్రంప్ వరుస ట్వీట్లు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు సిగ్గుచేటు: ఐరాస ఆఫ్రికా దేశాలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఐరాస మానవహక్కుల కార్యాలయం అధికార ప్రతినిధి రూపర్ట్ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.. ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికాలోని వలసదారులు, మైనారిటీలపై దాడులు పెరిగే ప్రమాదముందన్నారు. ఆఫ్రికన్ యూనియన్(ఏయూ) ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. కాగా, తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఆర్థిక సాయాన్ని నిలిపేస్తామని ఇటీవల అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో పలు ఆఫ్రికా దేశాలు ఈ విషయంలో స్పందించేందుకు నిరాకరించాయి. అమెరికా ప్రతినిధుల సభలో డెమొక్రటిక్ పార్టీ విప్ హోయర్ స్పందిస్తూ..‘జాత్యహంకారంతో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయన నిజస్వరూపాన్ని తెలియజేస్తున్నాయ్. ఓ అమెరికన్‌గా సిగ్గుపడుతున్నాను’ అని అన్నారు.