'కేరళ, కర్ణాటక ప్రజలంతా నలుపు కాదు' | not all people in Kerala, Karnataka and TN are black: TKS Elangovan | Sakshi
Sakshi News home page

'కేరళ, కర్ణాటక ప్రజలంతా నలుపు కాదు'

Published Fri, Apr 7 2017 5:09 PM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM

'కేరళ, కర్ణాటక ప్రజలంతా నలుపు కాదు'

'కేరళ, కర్ణాటక ప్రజలంతా నలుపు కాదు'

చెన్నై: జాతివివక్షపై బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్‌ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని డీఎంకే నాయకుడు టీకేఎస్‌ ఇలంగోవన్‌ అన్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడులోని ప్రజలందరూ నల్లజాతీయులు కాదని తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు ఎంకే కరుణానిధి, దివంగత నాయకురాలు జయలలిత తెల్లగా(ఫెయిర్‌) ఉంటారని చెప్పారు.

తాము జాత్యహంకారులం అయితే దక్షిణ భారతీయులతో కలిసి ఎలా నివసిస్తామని 'ఆల్ జజీరా' చానల్ చర్చా కార్యక్రమంలో తరుణ్‌ విజయ్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రేగాయి. దీంతో ఆయన క్షమాపణ చెప్పారు. 'నేను మాట్లాడిన మాటలు సరిగా అన్వయించలేకపోయాను. దీనికి చాలా బాధపడుతున్నా. నా మాటలు బాధ పెట్టినందుకు క్షమాపణ చెబుతున్నాన'ని తరుణ్‌ విజయ్‌ ట్విటర్‌ లో పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement