Woman Racist Comments.. అమెరికాలో జాత్యహంకార కామెంట్స్ కామన్. నల్లజాతీయుల పట్ల తెల్లజాతీయులకు చిన్నచూపు ఉంటుంది. పలు సందర్భాల్లో నల్లజాతీయులపై దాడులు జరిగిన ఘటనలు సైతం చాలానే చూశాము. తాజాగా జాత్యహంకార కామెంట్లు చేస్తున్న ఓ మహిళకు క్యాబ్ డ్రైవర్ రైడ్ నిరాకరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుండటంతో నెటిజన్లు.. క్యాబ్ డ్రైవర్‌ను మెచ్చుకుంటున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..పెన్సిల్వేనియాలోని ఫాసిల్స్ లాస్ట్ స్టాండ్ బార్ బయట జాకీ అనే మహిళ.. బోడే అనే వ్యక్తి క్యాబ్‌లో ఎక్కింది. డ్రైవర్‌ను విష్ చేసిన తర్వాత, “వావ్, నువ్వు తెల్లవాడిలా ఉన్నావే” అని కామెంట్ చేయగా.. బోడే ‘‘ఎక్స్‌క్యూజ్ మీ’’ అని అనడంతో.. మళ్లీ ఆమె.. “నువ్వు సాధారణ వ్యక్తివా?.. ఇంగ్లీష్ మాట్లాడతారా?” అంటూ బోడే భుజం మీద తడుముతూ కనిపించింది.
దీంతో, సీరియస్ అయిన బోడే.. ఇది కరెక్ట్ కాదు. ఎవరో వ్యక్తి తెల్లవాడు కాకపోయినా ఆ సీటులో కూర్చుంటే వచ్చే తేడా ఏంటి అని ప్రశ్నించే సరికి ఆమె షాకైంది. అనంతరం బోడే.. ఆ మహిళను మీరు కారు దిగి వదిలివెళ్లిపోవచ్చు. రైడ్‌ను క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పేశాడు. ఈ ఘటనకు సంబంధిన వీడియో మొత్తాన్ని డ్రైవర్ బోడే.. తన హ్యాండ్ కామ్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
A @lyft driver, James W. Bode exemplified what it is to be a White Ally. He lost money. Risked his rating. All in the name of doing what he believed is right.
— Kenny Nwankwo (@KennyNwankw0) May 16, 2022
Be more like James!
I owe you a beer, Jimmy. pic.twitter.com/WrdA2AxntD
వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ నిలిచింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. రేసిస్ట్ కస్టమర్లను తిరస్కరించడం కరెక్ట్ అని కామెంట్స్ చేస్తూనే దీనిని చూసి ప్రతిఒక్కరూ నేర్చుకోవాలంటున్నారు. కానీ, అది అంత ఈజీ కాదంటూ డ్రైవర్ బోడేకు అభినందనలు తెలుపుతున్నారు. అంతకు ముందు.. అమెరికన్ పొలిటికల్ యాక్టివిస్ట్, రైటర్ ఏంజెలా డేవిస్ ఒకానొక సమయంలో.. "జాత్యంహకార సమాజంలో జాత్యంహకారం చేయకుండా ఉంటే సరిపోదు. జాత్యంహకార వ్యతిరేకి అయి కూడా ఉండాలి" అని అన్నారు. ఈ ఘటన ఆయన కామెంట్స్‌కు సూట్ అయ్యేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ముప్పై ఏళ్ల బంధానికి ముగింపు.. రష్యా నుంచి దిగ్గజ కంపెనీ నిష్క్రమణ
Comments
Please login to add a commentAdd a comment