Cab Driver
-
ఈ క్యాబ్ ఎక్కితే దిగరు..!
సాధారణంగా మీరు క్యాబ్‌ని (cab) బుక్ చేసుకుని ఎక్కగానే ఎంత త్వరగా గమ్యస్థానాన్ని చేరుకుంటామా అని ఆలోచిస్తారు. కానీ ఢిల్లీలోని అబ్దుల్ ఖదీర్ ఉబెర్ (Uber) క్యాబ్లోకి అడుగు పెడితే రైడ్ ముగియాలని కోరుకోకపోవచ్చు! ఎందుకంటే స్నాక్స్, నీరు, వై-ఫై, పెర్ఫ్యూమ్లు, మందులు, హ్యాండ్‌హెల్డ్ ఫ్యాన్లు, టిష్యూలు, శానిటైజర్లు, యాష్‌ట్రే ఒకటేమిటి అన్నీ సౌకర్యాలు ఈ క్యాబ్‌లోనే ఉన్నాయి. దీనిపై రెడ్డిట్‌లో పెట్టిన ఒక పోస్ట్ వైరల్‌గా మారింది.అబ్దుల్ ఖదీర్ కేవలం రైడ్ మాత్రమే అందించడం లేదు. బిజినెస్ క్లాస్ ఫ్లైట్‌లో (business class flight) ఉండే లాంటి లగ్జరీ అనుభూతిని ఇస్తున్నాడు. పైగా క్యాబ్‌లో అతడు అందిస్తున్న ప్రతిదీ ఉచితం. ఇది సాధారణ టాక్సీ కంటే విలాసవంతమైన లాంజ్ లాగా అనిపిస్తుంది. తన క్యాబ్ ఫోటోను షేర్ చేసిన ఓ ప్రయాణికుడు.. "విమానాల కంటే క్యాబ్ సౌకర్యాలు మెరుగ్గా దొరికాయి!" అని చమత్కరించాడు.క్యాబ్‌లో ప్రయాణికులకు ఖదీర్ అందిస్తున్న విశిష్ట కస్టమర్ సేవలపై సోషల్ మీడియా యూజర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్ల పట్ల ఖదీర్‌కు ఉన్న శ్రద్ధ అతనిని ఎంతగానో పాపులర్ చేసింది. ఎప్పుడు క్యాబ్ అవసరం వచ్చినా అతని క్యాబ్‌నే బుక్ చేసుకుంటామంటున్నారు చాలా మంది. కొంతమంది అయితే ఖదీర్ అందిస్తున్న సౌకర్యాలకు అదనంగా చెల్లిస్తామని కూడా చెబుతన్నారు. -
ఫేక్ ఉబర్ డ్రైవర్ల హల్ చల్..
అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే అట్లాంటా ఎయిర్పోర్ట్ దగ్గర ఉబర్, లిఫ్ట్ వంటి రైడ్ షేర్ల పేరుతో ఫేక్ రైడ్ డ్రైవర్లు హల్చల్ చేస్తున్నారు. వీరు ప్రయాణికులను మోసగిస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైడ్‌షేర్ డ్రైవర్ల ముసుగులో ప్రయాణికులను మోసగిస్తున్న ఫేక్ రైడ్ డ్రైవర్లను స్థానిక వార్తా సంస్థ 11అలైవ్ గుర్తించింది. ఈ మోసగాళ్లు తక్కువ రేట్లను రైడ్లను అందిస్తారు. వివిధ చెల్లింపు పద్ధతులను అంగీకరిస్తారు. అయితే వారికి డబ్బు కంటే కూడా మానవ అక్రమ రవాణా వంటి వేరే అక్రమ ఉద్దేశాలు ఉండవచ్చు. ఈ వ్యవహారంపై అట్లాంటా పోలీస్ డిపార్ట్మెంట్ రహస్య ఆపరేషన్ చేపట్టింది. ప్రయాణికులను మోసగిస్తున్న పలువురు ఫేక్ డ్రైవర్లను అరెస్టు చేసింది. అయినప్పటికీ వీరి ఆగడాలు తగ్గడం లేదు. తొందరలో ఉండే ప్రయాణికులే లక్ష్యంగా వీళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అధికారిక యాప్‌ల ద్వారా తమ రైడ్‌షేర్ ఏర్పాట్లను నిర్ధారించుకోవాలని, నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే డ్రైవర్లను కలవాలని అధికారులు ప్రయాణికులకు సూచిస్తున్నారు. దీంతోపాటు పికప్ చేసుకునేందుకు వచ్చిన వ్యక్తి పేరు తెలుసుకుని నిర్ధారించుకోవాలని సలహా ఇస్తున్నారు. -
క్యాబ్ డ్రైవర్‌ది హత్యా? ఆత్మహత్యా?
విశాఖపట్నం: ఎండాడలో సగం కాలిన ఓ క్యాబ్ డ్రైవర్ మృతదేహం కలకలం రేపింది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. ఎండాడలోని సెయింట్ లుక్స్ కళాశాలకు సమీపంలో సగం కాలిన మృతదేహాన్ని ఆదివారం వాకర్లు గుర్తించి.. ఆరిలోవ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఆ మృతదేహం ఎంవీపీకాలనీలో నివాసం ఉంటున్న మోసగంటి సుబ్రహ్మణ్యం(42)దిగా గుర్తించారు. ఆయన క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. సుబ్రహ్మణ్యంకు 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరి సొంతూరు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం జగ్గన్నపేట. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య తగాదాల కారణంగా మూడేళ్ల కిందట విడాకులు తీసుకున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అప్పటి నుంచి సుబ్రహ్మణ్యం ఒంటరిగానే ఎంవీపీలో నివాసం ఉంటూ.. క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కాగా.. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జీవితంపై విరక్తి చెందుతున్నట్లు, బాధతో కొన్ని కొటేషన్లను తన వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకున్నాడు. తెల్లవారేసరికి విగతజీవిగా మారాడని అతని సోదరుడు ప్రకాష్ విలపించారు. అనుమానాలెన్నో.. గతంలో సుబ్రహ్మణ్యం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో చేతులు కోసుకున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఒంటరిగా బతకలేక పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా హత్య చేసి కాల్చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం చనిపోయిన స్థలంలో రెండు మద్యం బాటిల్స్, అతని కాలిపై గాయాలున్నాయి. సంఘటన స్థలంలోనే కారు ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ రాంబాబు, ఆరిలోవ సీఐ గోవిందరావు సుబ్రహ్మణ్యం మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని.. ఇప్పటికే క్లూస్ టీమ్ వివరాలు సేకరించిందన్నారు. సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు వివరించారు. -
డెలివరీ బాయ్‌గా దిగ్గజ కంపెనీ సీఈఓ!
కరోనా... రెండు సంవత్సరాల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఎన్నో కోట్ల కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ముఖ్యంగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో ప్రజలు అనుభవించిన నరకం మాటల్లో చెప్పలేం. అయినవారి ప్రాణాలు కాపాడుకునేందుకు ఎన్నో కుటుంబాలు రూ.కోట్లు కుమ్మరించడం, చికిత్స కోసం ఆస్తులు అమ్ముకున్న ఘటనలు కోకొల్లలు. అప్పటి పరిస్థితులను గుర్తుచేసుకుంటే ఇప్పటికీ చాలామంది భయంతో వణికిపోతుంటారు. కరోనా సోకిన వారి కుటుంబాలు ఎంతటి మానసిక క్షోభ అనుభవించాయో తలుచుకుంటేనే గుండె బరువెక్కిపోతోంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహి డెలివరీ బాయ్‌గా పనిచేసినట్లు చెప్పారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నందన్ నిలేకనితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖస్రోషాహి ఆ చీకటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉండి పిచ్చెక్కిపోయేది. అందుకే నేను ఇంటి నుండి బయటకు వెళ్లాలని అనుకున్నాను. వెంటనే ఈబైక్ సాయంతో ఉబర్ ఈట్స్ లో డెలివరీగా బాయ్‌గా చేరాను. ఫుడ్ డెలివరీ చేయడం, కస్టమర్లను రేటింగ్స్ అడిగినట్లు చెప్పారు. మాస్క్ పెట్టుకుని విధులు నిర్వహించడంతో తాను డెలివరీ డెలివరీ బాయ్‌గా పనిచేయడం మరింత సులభమైందని అన్నారు. View this post on Instagram A post shared by CNBC-TV18 (@cnbctv18india) కోవిడ్ ముగిసిన తర్వాత టెస్లా కారు ఉబెర్ డ్రైవర్ గా పనిచేశారంటూ నందన్ నిలేకనితో తన అనుభవాల్ని పంచుకున్నారు. కాగా, ఉబర సీఈఓ భారత్ లో తమ సర్వీస్‌లను విస్తరించేందుకు ప్రభుత్వ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఓఎన్డీసీలో ఉబర్ చేరింది. -
Suchana Seth: బ్యాగులో మద్యం బాటిళ్లున్నాయ్!
బెంగళూరు: గోవాలో నాలుగేళ్ల కొడుకు చంపి, మృతదేహం ఉంచిన సూట్ కేసును బెంగళూరుకు తీసుకువచ్చిన సీఈవో సూచనా సేథ్ గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 12 గంటలపాటు కొడుకు మృతదేహంతో కారులో ప్రయాణించిన సమయంలో ఆమె ఎలా ప్రవర్తించిందనే విషయాన్ని క్యాబ్ డ్రైవర్ రేజాన్ డిసౌజా వెల్లడించాడు. ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నట్లు డిసౌజా తెలిపాడు. జనవరి 7వ తేదీన అర్ధరాత్రి 12.30 సమయంలో గోవాలోని కండోలిమ్‌లో ఉన్న ‘సోల్ బన్యాన్ గ్రాండ్’అనే సర్వీస్ అపార్టుమెంట్ నుంచి డిసౌజాకు కాల్ వచ్చింది. ఒక మహిళను అర్జంటుగా బెంగళూరుకు తీసుకెళ్లాల్సి ఉందనేది కాల్ సారాంశం. వెంటనే డిసౌజా కారుతో అక్కడికి వెళ్లాడు. ఒంటి గంటకు సూచనా సేథ్ బయటకు వచ్చింది. డిసౌజా ఆమెను రిసెప్షన్ దగ్గర రిసీవ్ చేసుకున్నాడు. ఆమెతోపాటు ఉన్న నల్ల రంగు బ్యాగు చాలా బరువుగా ఉంది. బ్యాగు గురించి ఆ సమయంలో డిసౌజాకు ఎటువంటి అనుమానం రాలేదు. ‘మద్యం బాటిళ్లు గానీ ఉన్నాయా మేడం, బ్యాగు బరువుగా ఉంది’అని అడిగా. అందుకామె, అవును, మద్యం బాటిళ్లున్నాయి అని సమాధానమిచ్చిందని డిసౌజా తెలిపాడు. ప్రయాణం మొత్తమ్మీద దాదాపుగా వాళ్లిద్దరూ మాట్లాడుకోలేదు. గోవా–కర్ణాటక సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్‌తో 4 గంటలు లేటయింది. అయినా కూడా సూచన ఎటువంటి అసహనం కానీ, భయపడ్డట్లుగానీ కనిపించలేదని డిసౌజా చెప్పాడు. ‘ఆమె ఎవరికీ ఫోన్ చేయలేదు. ఆమెకు కూడా ఫోన్ కాల్స్ రాలేదు’అని తెలిపాడు. ‘ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యేందుకు ఆలస్యమవుతుంది మేడం. అర్జంటు అన్నారు కదా, యూ–టర్న్ తీసుకుని ఎయిర్ పోర్టుకు పోనివ్వమంటారా? అని అడిగా. అయితే, ఆమె ఎయిర్‌పోర్టుకు వద్దు, ట్రాఫిక్ క్లియర్ అయ్యాకే వెళ్దామని బదులిచ్చింది. అర్జంటుగా వెళ్లాలంటూనే, ట్రాఫిక్ సమస్య ఉన్నా సమస్య లేదనడం వింతగా అన్పించింది. కర్ణాటక సరిహద్దులు దాటగానే గోవా పోలీసుల నుంచి ఫోనొచ్చింది. కారులో ఉన్న మహిళతోపాటు బాబు ఉన్నాడా అని అడిగారు. ఆమె ఇచ్చిన అడ్రస్, ఇతర వివరాలన్నీ ఫేక్ అని చెప్పారు. దగ్గర్లోని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లాలని సూచించారు. నేరుగా పోలీస్ స్టేషన్లావరణలో కారును ఆపడంతో, సూచన ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? అని అడిగింది. పోలీసులు మీతో మాట్లాడుతామన్నారు’అని ఆమెకు చెప్పినట్లు వివరించాడు. ‘పోలీసులు కారు సోదా చేసి, బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు’అని డిసౌజా చెప్పాడు. -
నైట్‌లో ముంబయి మొదటిస్థానం.. వీకెండ్లో..
ట్యాక్సీ సర్వీసులను అందించే ఉబర్ సంస్థ 2023లో చేసిన పర్యటనలకు సంబంధించి ఆసక్తికర విషయాలను విడుదల చేసింది. ఈ ఏడాది దిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, పుణెల్లో ఎక్కువ మంది రైడ్ బుక్ చేసినట్లు సంస్థ వెల్లడించింది. రాత్రి సమయంలో వచ్చిన బుకింగ్‌ల విషయానికొస్తే.. ముంబయి మొదటిస్థానంలో నిలిచింది. వీకెండ్లో మాత్రం కోల్‌కతాలోని ప్రజలు ఎక్కువగా బుక్ చేసుకున్నారు. 2023 సంవత్సరానికిగాను ఉబర్ రైడ్స్ రికార్డు స్థాయిలో 6800 కోట్ల కిలోమీటర్లలో సేవలందించిందని తెలిపింది. ఇది దేశంలోని మొత్తం రోడ్ నెట్‌వర్క్‌లో వెయ్యి రెట్లు అని కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: టెస్లా యూనిట్‌కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..? ఉబెర్ వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలు రైడ్స్‌లో ఎక్కువ భాగం సాయంత్రం 6-7 గంటల మధ్య షెడ్యూల్ చేస్తున్నవే. శనివారం ఉబెర్ ఫేవరెట్ డే. ఆ రోజే అధికంగా బుకింగ్స్ వస్తున్నాయి. రైడ్ బుక్ చేసిన ట్రిప్‌ల సంఖ్య పరంగా దసరా, క్రిస్మస్ అత్యంత ప్రజాదరణ పొందిన రోజులు. ఒక్క డిసెంబర్లోనే అత్యధిక సంఖ్యలో రైడ్లు బుక్ అయినట్లు సంస్థ తెలిపింది. విమానాశ్రయాలకు అధిక సంఖ్యలో ఉబర్ ట్రిప్‌లు ఉదయం 4-5 గంటల మధ్య బుక్ అయ్యాయి. -
5 లక్షల ప్రమాద బీమా.. 10 లక్షల ఉచిత వైద్యం
సాక్షి, హైదరాబాద్: ఉబర్, ఓలా, జొమాటో, స్విగ్గీ, అర్బన్ కంపెనీ లాంటి యాప్ ఆధారిత సంస్థల్లో పనిచేస్తున్న డ్రైవర్లు, బాయ్‌లకు రూ. 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్య సాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌లో ఫుడ్ డెలివరీ కోసం వెళ్లినప్పుడు కుక్క తరమడంతో కంగారులో భవనం పైనుంచి పడి మరణించిన ఓ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు అందించాలని అధికారులను ఆదేశించారు. క్యాబ్ సంస్థలు నిర్వహిస్తున్న తరహాలో ఓ యాప్‌ను టీ–హబ్ ద్వారా సిద్ధం చేసి అవకాశం ఉన్న వారికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటించినప్పుడు నవంబర్ 27న కొందరు ఫుడ్ డెలివరీ బాయ్‌లతో భేటీ కావడం తెలిసిందే. అప్పుడు వారి సమస్యలను అడిగి తెలుసుకున్న రాహుల్... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఆయా సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తిని ఈ మేరకు ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఓలా, ఉబర్ ద్వారా పనిచేసే ఆటో డ్రైవర్లతోపాటు క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్‌ల సమస్యలను తెలుసుకోవడానికి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న బాయ్‌లతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఆయా సంస్థల్లో పనిచేస్తూ రక్షణ లేకుండా ఇబ్బందులు పడుతున్న వారికి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నామని వెల్లడించారు. అసంఘటిత రంగ కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని... ఆ క్రమంలో విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం రాజస్తాన్‌లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అంతకంటే మెరుగైన విధంగా చట్టం తయారీకి బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. కార్మికుల సంక్షేమంపై దృష్టిపెట్టని సంస్థలపై చర్యలు.. ‘సంస్థలు కూడా లాభాపేక్ష మాత్రమే చూడకుండా కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టాలి. సిబ్బంది సంక్షేమాన్ని విస్మరించే ఎంత పెద్ద సంస్థలపైనైనా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోం. నాలుగు నెలల క్రితం ఓ స్విగ్గి డెలివరీ బాయ్ కుక్క తరిమితే భవనం పైనుంచి పడి మృతి చెందాడు. అప్పటి ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అందుతుందేమోనని చూశా. కానీ ఆ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మానవత్వంతో వ్యవహరించాలి. అందుకే ఆ కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిధి నుంచి మృతుని కుటుంబానికి రూ. 2 లక్షలు అందించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా’అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించే ప్రజాపాలన గ్రామసభల్లో పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్‌లకు సీఎం సూచించారు. డిజిటల్, మాన్యువల్ రూపంలోనైనా దరఖాస్తులు ఇవ్వొచ్చన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ఏఐసీసీ సెక్రటరీలు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీఖాన్, మాధుయాష్కీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఆటోవాలాలు ఆందోళన పడొద్దు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో కల్పించిన ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని ఆటోవాలాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆటోవాలాలతోనూ త్వరలో చర్చించి వారికి ఇబ్బంది లేని రీతిలో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్యాబ్, ఫుడ్ డెలివరీ బాయ్స్‌తో సమావేశం అనంతరం పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు. ఈ పథకం వల్ల ఆటోవాలాల ఉపాధి పడిపోదని, బస్సులు దిగాక ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రయాణికులు మళ్లీ ఆటోలనే కదా ఆశ్రయించాల్సిందని అన్నారు. -
క్యాబ్‌లలో ఈ స్ట్రాటజీ గురించి తెలుసా? ఇలా చేస్తే డబ్బులు బాగా సంపాదించవచ్చు!
అదనపు ఆదాయం కోసం మన దేశంలో ఆయా రైడ్ హైరింగ్ సంస్థల్లో పార్ట్‌టైం, లేదంటే ఫుల్ టైం డ్రైవర్‌గా విధులు నిర్వహించే ఉద్యోగులు ఎంత సంపాదిస్తుంటారు? ఇలా ఎప్పుడైనా తెలుసుకోవాలని అనిపించిందా? రైడ్ షేరింగ్ సర్వీసులు అందించే ఉబర్ సంస్థ 2013 ఆగస్ట్ నెలలో భారత్‌లో తన కార్యకలాపాల్ని ప్రారంభించింది. 2023 ఆగస్ట్ నెలలో 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం.. గడిచిన పదేళ్లలో ఉబర్ కంపెనీలో ఫుల్‌టైం, పార్ట్‌టైం విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లు 2013 ఆగస్ట్ నుంచి 2023 ఆగస్ట్ వరకు మొత్తం 3,300 కోట్ల కిలోమీటర్ల మేర ప్రయాణించి కస్టమర్లను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చారు. ఫలితంగా ఈ పదేళ్ల కాలంలో దేశీయంగా ఉన్న ఉబర్ డ్రైవర్ల మొత్తం సంపాదన సుమారు రూ.50 వేలకోట్లు సంపాదించారు. ఆ మొత్తంలో కస్టమర్ల ఉబర్ డ్రైవర్లకు టిప్కింద ఇచ్చిన మొత్తం రూ.300 కోట్లు సంపాదించినట్లు ఉబర్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. పైన పేర్కొన్న డేటా అంతా ఉబర్ అధికారికంగా విడుదల చేస్తే.. రైడ్ హైరింగ్ సంస్థల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న వారు కాస్త తెలివి తేటలు ఉపయోగించి ఏడాదిలో భారీ మొత్తంలో సంపాదించవచ్చని అంటున్నాడు అమెరికాకు చెందిన ఓ ఉబర్ క్యాబ్ డ్రైవర్. ఆ స్ట్రాటజీతో అమెరికాలో అంత సంపాదిస్తే.. దేశీయ ఉబర్ డ్రైవర్లు ఆదాయం పెంచుకునే అవకాశం ఉందా? క్యాబ్ డ్రైవర్ సంపాదన రూ.23లక్షలు అమెరికాలోని నార్త్ కరోలినా ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల ‘బిల్’ అనే ఉబర్ డ్రైవర్ 2022లో ఏడాది మొత్తం సంపాదించింది అక్షరాల రూ.23లక్షలు ఇది వినడానికి నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఇది అక్షరాల నిజం. ఎందుకంటే! ఆరేళ్ల క్రితం రిటైరైన బిల్కి ప్రయాణాలు చేయడం అంటే మహా ఇష్టం. డబ్బుకు డబ్బుకు.. ప్రయాణం చేస్తున్నామన్న సంతృప్తితో ఉబర్‌లో పార్ట్‌టైం డ్రైవర్‌గా చేరాడు. వారానికి 40 గంటల పని చేస్తూ కొన్ని సింపుల్ టెక్నిక్స్‌ని ఉపయోగించి తన ఆదాయాన్ని మరింత పెంచుకోవడం మొదలు పెట్టాడు. అదెలానో వివరించాడు. స్ట్రాటజీ ఇందుకోసం ఉబర్ డ్రైవర్ బిల్ ఈ కొత్త స్ట్రాటజీని అప్లయి చేశాడు. ముందుగా రద్దీగా ఉండే ప్రాంతాలైన ఎయిర్‌పోర్ట్‌లు, శనివారం, ఆదివారం రెస్టారెంట్లు, బార్లను సెలక్ట్ చేసుకున్నాడు. ఈ ఏరియాల్లో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2.30 వరకు కిటకిటలాడుతుంటాయి. పీక్ అవర్స్ కాబట్టి కస్టమర్లు అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని అదునుగా చేసుకుని లాంగ్ రైడ్లు కాకుండా, స్థానిక ఏరియాల్లో మాత్రమే ప్రయాణికుల్ని ఎక్కించుకుంటాడు. కస్టమర్లు ఎన్ని కిలోమీటర్లు వెళతారో తెలుసుకుని తనకు ఏమాత్రం లాభం లేదనిపిస్తే ఆ రైడ్లను క్యాన్సిల్ చేస్తాడు. కస్టమర్ల డిమాండే ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి రైడ్ ధరల్ని స్వయంగా తానే నిర్ణయించినట్లు ఓ మీడియా సంస్థకు తెలిపాడు. ఎయిర్ పోర్ట్ ప్రాంతాల్లో సాధారణంగా 20 నిమిషాల రైడ్‌కి ఉబర్ 10 నుంచి 30 డాలర్లు వరకు ఉంటుంది. కానీ బిల్ మాత్రం కస్టమర్ల రైడ్లను క్యాన్సిల్ చేసి 50 నుంచి 60 డాలర్లు ఛార్జీలు విధించాడు. రైడ్ రిక్వెస్ట్‌లో 10 శాతం కంటే తక్కువ రైడ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేసి..వాటిలో 30 శాతానికి పైగా రద్దు చేసి తద్వారా ఆర్థికంగా ఎక్కువ మొత్తంలో చెల్లించే రైడ్లను పొందాడు. ఇలా గత ఏడాది సుమారు 1,500 ఉబర్ ట్రిప్‌ల నుంచి సుమారు 28,000 డాలర్ల (దాదాపు రూ.23 లక్షలు) మనీ సంపాదించినట్లు చెప్పాడు. ఇబ్బందులు తప్పవ్ రైడ్ క్యాన్సిల్ చేస్తే సదరు డ్రైవర్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని బిల్ చెప్పాడు. ఉబర్ రైడ్‌ను క్యాన్సిల్ చేస్తే అకౌంట్‌ను కోల్పోవడంతో పాటు 10 శాతం కంటే ఎక్కువ రైడ్లను క్యాన్సిల్ చేసిన డ్రైవర్లకు నిర్ధిష్ట పెట్రోల్ బంకుల్లో లభించే డిస్కౌంట్లు, ఇతర ప్రోత్సాహకాలు కోల్పోతారని అన్నాడు. అయినప్పటికీ, బిల్ ప్రస్తుతానికి తన బిల్ స్ట్రాటజీకి కట్టుబడి ఉన్నానని, అది లాభదాయకంగా ఉందని అంటూనే.. డ్రైవర్‌గా పనిచేస్తున్న నాకు ఇప్పుడు డబ్బు అవసరం లేదు. ఎందుకంటే నాకు డ్రైవింగ్ చేయడం అంటే ఇష్టమని మనసుల మాటని బయట పెట్టాడు. చదవండి👉🏻 అమ్మ, నాన్న కోసమే.. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఎమోషనల్ -
క్యాబ్ డ్రైవర్ ఖాతాలో ఏకంగా రూ. 9 వేల కోట్లు..ఏం చేశాడంటే?
తమిళనాడులోని పళనికి చెందిన రాజ్‌కుమార్ అనే డ్రైవర్‌కి ఉన్నట్టుండి తన ఖాతాలో భారీ మొత్తంలో నగదు డిపాజిట్ అయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 వేల కోట్ల జమ కావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తరువాత విషయం తెలుసి సంబరాలు చేసుకునేలోపే జరిగిన పరిణామానికి ఉసూరు మన్నాడు. సెప్టెంబరు 9న చెన్నైలోని క్యాబ్ డ్రైవర్ రాజ్‌కుమార్ ఎదురైనా అనుభవం ఇది. ఇంతకీ ఏమైంది అంటే.. రాజ్‌కుమార్ చెన్నైలోని కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తమిళనాడు మర్కెంటైల్ బ్యాంకు నుంచి తన ఖాతాలో రూ.9,000 కోట్లు డిపాజిట్ కావడంతో ముందు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అప్పటిదాకా అతని ఖాతాలో రూ.105 మాత్రమే ఉంది. ఆ తరువాత ఇదేదో స్కాం అనుకున్నాడు. అక్కడితో ఆగలేదు.. ఒకసారి టెస్ట్ చేస్తే పోలా అనుకున్నాడు. వెంటనే తన స్నేహితుడికి రూ.21 వేలు బదిలీ చేశాడు. లావాదేవీపూర్తియిందా లేదా ఆసక్తిగా ఎదురు చూశాడు. ఆశ్చర్యంగా.. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో ఇది నిజమేనని నిర్ధారించుకున్నాక ఎగిరి గంతేశాడు. కానీ అరగంటలోనే ఉత్సాహం అంతా ఆవిరైపోయింది. మరుసటి రోజు ఉదయం తూత్తుకుడి బ్యాంకు అధికారులు రంగంలోకి దిగారు. పొరపాటున రూ.9 వేల కోట్లు బదిలీ అయ్యిందని ఫ్రెండ్‌కి ట్రాన్సఫర్ చేసిన సొమ్ము మొత్తం అప్పగించాల్సిందేని డిమాండ్ చేశారు. దీంతో కంగు తిన్న రాజ్‌కుమార్ లాయర్లతో బ్యాంకు అధికారులతో సంప్రదింపులు చేశాడు. చివరికి రూ. 21 వేలను వాహనరుణంగా సర్దుబాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. -
Shamshabad Airport: సారీ.. ఎయిర్‌పోర్టుకు రాలేం
హైదరాబాద్: క్యాబ్‌వాలాలు సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు క్యాబ్ సేవలను నిలిపివేస్తూ ‘లో ఫేర్..నో ఎయిర్’ ప్రచారం చేపట్టారు. ఎయిర్‌పోర్టు నుంచి నడిపే క్యాబ్‌డ్రైవర్లకు సరైన ఆదాయం లభించకపోవడమే ఇందుకు కారణం. దీంతో సకాలంలో క్యాబ్‌లు లభించక.. ఒకవేళ సర్వీసులు బుక్ అయినప్పటికీ డ్రైవర్లు నిరాకరించడం వల్ల ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సకాలంలో క్యాబ్‌లు లభించక గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 65 వేల మంది జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ఆర్టీసీ పుష్పక్ బస్సులు, ప్రీపెయిడ్ ట్యాక్సీలు, సొంత వాహనాలు మినహాయించి మరో 5 వేల క్యాబ్‌లు ఇటీవల వరకు ఎయిర్‌పోర్టుకు అందుబాటులో ఉండేవి. కానీ కొంతకాలంగా ఎయిర్‌పోర్టు నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడికి వెళ్లినా తమకు రూ.500 నుంచి రూ.700 వరకు మాత్రమే లభిస్తున్నాయని. దీంతో ఇంధన ఖర్చులు కూడా రావడం లేదని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఓలా, ఉబెర్ సంస్థలు డ్రైవర్ల నుంచి 30 శాతం వరకు కమిషన్ తీసుకుంటున్నాయి. ఇది మరింత భారంగా మారిందని తెలంగాణ గ్రిగ్ అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రీపెయిడ్ ట్యాక్సీలకు ఒక ట్రిప్పుపైన రూ.980 నుంచి రూ.1150 వరకు లభిస్తుండగా తమకు మాత్రం అతి తక్కువ ఆదాయం లభిస్తుందన్నారు. దీంతో ఎయిర్‌పోర్టుకు క్యాబ్‌లు నడిపేందుకు నిరాకరిస్తున్నట్లు చెప్పారు. ప్రీపెయిడ్ ట్యాక్సీల తరహాలో ఎయిర్‌పోర్టుకు నడిచే క్యాబ్‌లకు ప్రతి కిలోమీటర్‌కు రూ.21 చొప్పున ఇవ్వాలని, అగ్రిగేటర్ సంస్థలకు ఇచ్చే కమిషన్‌ను 30 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని క్యాబ్ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ దాడి
కృష్ణరాజపురం: బెంగళూరులో ఉబర్ డ్రైవర్ దారుణానికి పాల్పడ్డాడు, ప్రయాణికురాలపై దాడి చేసిన ఘటన నగరంలోని బెళ్లండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బోగనహళ్లిలో చోటు చేసుకుంది. బాధిత మహిళ తన కుమారున్ని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకుంది. అంతలోనే కుమారుడు మరో క్యాబ్‌ను బుక్ చేశాడు. ముందు వచ్చిన క్యాబ్లోకి ఎక్కారు, అయితే కుమారుడు ఇది మనం బుక్ చేసిన క్యాబ్ కాదని చెప్పాడు. క్యాబ్ డ్రైవర్ వారిని దించి ఆమెతో గొడవ పడ్డాడు. ఆమైపె చేయి చేసుకోవడంతో సమీపంలోని అపార్టుమెంట్ వాసులు వచ్చి కాపాడారు. ఇంతలో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. -
కార్పొరేట్ ఇంజినీర్ కన్నా క్యాబ్ డ్రైవరే నయం! సోషల్ మీడియా పోస్ట్ వైరల్..
ఈరోజుల్లో చాలా మంది తమ చదువుకు తగిన ఉద్యోగం చేయడం లేదు. ఒక వేళ చేసినా అందులో సంతృప్తి లేక కొన్ని రోజులకే మానేసి వేరే పని చేసుకుంటున్నారు. కొంతమంది విధి లేక ఇలా చేస్తుంటే మరికొంత మంది మాత్రం పెద్ద చదువులు చదువుకున్నా కూడా ఇష్టపూర్వకంగానే చిన్న చిన్న పనులు చేస్తున్నారు. ఇలా చిన్న పనులు చేసుకునేవారిని చిన్నచూపు చూస్తుంటారు. వారు పెద్దగా సంపాదించలేరు అనుకుంటుంటారు. కానీ కార్పొరేట్ కంపెనీల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారి కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నారు. అలాంటి దానికి ఉదాహరణే ఈ సంఘటన. రద్దీగా ఉండే రోడ్డుపై క్యాబ్ నడిపే వ్యక్తి కూడా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చునే ఇంజనీర్ కంటే ఎక్కువే సంపాదిస్తున్నాడంటే మీరు నమ్మకపోవచ్చు. అయితే ఇది నిజం. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఓ క్యాబ్ డ్రైవర్ ఉద్యోగం, సంపాదన గురించి సోషల్ మీడియాలో శ్వేతా కుక్రేజా అనే యూజర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇటీవల తాను ఓ క్యాబ్‌లో ప్రయాణించానని, ఆ క్యాబ్ డ్రైవర్ ఇంజనీర్ అని పేర్కొన్నారు. తాను ఇంతకుముందు క్వాల్కామ్ కంపెనీలో పనిచేసేవాడినని చెప్పిన అతను, ఆ ఉద్యోగంతో కంటే క్యాబ్ డ్రైవింగ్‌తోనే ఎక్కువగా సంపాదిస్తున్నానని చెప్పినట్లు శ్వేత ట్వీట్ చేశారు. శ్వేత ఆగస్ట్ 6న ఈ ట్వీట్ చేయగా ఇప్పటి వరకు 7.7 లక్షల మంది వీక్షించారు. 6,700లకు పైగా లైక్‌లు వచ్చాయి. క్యాబ్ డ్రైవర్ సంపాదనపై యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు. కార్పొరేట్ జాబ్‌లు చేసినంత మాత్రాన ఎవరూ గొప్పవారు కాదని, క్యాబ్ డ్రైవర్లు ఎంత మాత్రం తక్కువ కాదని శ్వేత పేర్కొన్నారు. I was in a cab yesterday and that driver was an engineer. He said he earns more from the cab driving than his corporate job at Qualcomm. 🥲 — Shweta Kukreja (@ShwetaKukreja_) August 6, 2023 -
క్యాబ్‌లో ఏం మాట్లాడుతున్నారు? డ్రైవర్‌కు దుర్భుద్ధి పుడితే ఎలా?
క్యాబ్‌లో ఎక్కాక చేతులు ఊరికే ఉండవు. ఫోన్ తీసి కబుర్లు చెప్పమంటాయి. కాని కబుర్లు మరీ పర్సనల్ అయినప్పుడు, అవి విన్న డ్రైవర్‌కు దుర్బుద్ధి పుడితే నరకం అనుభవించాల్సి ఉంటుంది. బెంగళూరులో క్యాబ్ ఎక్కిన మహిళ ఫోన్లో చేసిన పర్సనల్ టాక్‌ను విన్న డ్రైవర్ ఆమెను ఏడు నెలలుగా బ్లాక్మెయిల్ చేసి 40 లక్షలు గుంజాడు. అనుకోకుండా దొరికాడు. ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నాయో! ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? స్త్రీలు విధులు, ఉపాధికి బయటకు వెళ్లక తప్పదు. ఇప్పుడున్న ప్రయివేటు రవాణా యాప్‌లను నమ్ముకోకా తప్పదు. ఇలాంటి యాప్‌లలో పని చేసే డ్రయివర్లు నూటికి తొంభై తొమ్మిది మంది తమ బతుకు తెరువు కోసం పని చేస్తున్నా ఒకరిద్దరు ప్రమాదకరంగా మారుతున్నారు. ఇటీవల బెంగళూరులో ఒక మహిళ టూ వీలర్ బుక్ చేసుకుంటే ఆమెను వెనుక కూచోబెట్టుకున్న డ్రైవర్ ఆమె చూసేలా తన శరీరాన్ని తాను తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తుంటే ఆమె మధ్యలో బైక్ మీద నుంచి దూకేయాల్సి వచ్చింది. ఇప్పుడు వెలికి వచ్చిన మరో ఘటన ఒంటరి స్త్రీలు ఎంత జాగ్రత్తగా క్యాబ్ లేదా టూ వీలర్ వ్యవస్థను ఉపయోగించుకోవాలో తెలుపుతోంది. అసలేం జరిగింది? ఇది నవంబర్ 2022లో జరిగింది. బెంగుళూరులో ఒక వివాహిత క్యాబ్ మాట్లాడుకుని ఇంటినుంచి బయలుదేరింది. క్యాబ్‌లో వెనుక సీట్లో కూచుని ఫోన్ తీసి మిత్రుడితో మాట్లాడసాగింది. అప్పటికే డిప్రెషన్లో ఉన్న ఆమె తన మిత్రుడితో ఇంటి సమస్యలు చెప్పుకుని, త్వరలో విడాకులు తీసుకుందామనుకుంటున్న ఆలోచన చెప్పి, మిత్రునితో సాన్నిహిత్యపు మాటలు మాట్లాడింది. తను క్యాబ్‌లో ఉన్నానని ఇంకో వ్యక్తి ఆ మాటలు వింటున్నాడని మర్చిపోవడం ఆమె తప్పు. ఈ మాటలన్నీ విన్న క్యాబ్ డ్రైవర్ ఆమెను గమ్యంలో దింపి సోషల్ మీడియా ద్వారా ఆమెనూ ఆమె భర్తనూ గుర్తించాడు. తర్వాత ఆమెకు కాల్ చేసి ఆ రోజు తాను విన్న సంగతంతా భర్తకు చెప్పేస్తానని, మరో పురుషుడితో సన్నిహితంగా వ్యవహరిస్తున్నావని చెప్పేస్తానని బెదిరించాడు. ఆ వివాహిత హడలిపోయింది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియక భయపడిపోయింది. దాంతో క్యాబ్ డ్రైవర్ ఆమె నుంచి గత ఏడు నెలలుగా డబ్బు గుంజడం మొదలెట్టాడు. ఆమె తన దగ్గరున్న 20 లక్షల రూపాయలు అతనికి సమర్పించింది. అయినప్పటికీ ఆశ చావక వేధిస్తుండటంతో తల్లిగారి ఇంటికి వెళ్లి తల్లికి చెందిన 20 లక్షల విలువైన నగలు తెచ్చి ఇచ్చింది. పరువు మర్యాదలు ఎలా కాపాడుకోవాలో తెలియక, మరోవైపు ఈ క్యాబ్ డ్రైవర్ పెడుతున్న నరకం నుంచి ఎలా బయటకు రావాలో అర్థం కాక సతమతమైంది. ఇంత జరుగుతున్నా ఆమె ఈ విషయాన్ని భర్తకు కాని, పోలీసులకు కాని తెలిపే ధైర్యం చేయలేదు. అయినప్పటికీ దుర్మార్గుడు దొరికాడు. జాగ్రత్త... మాటలు వింటారు మీ మాటలు, చాటింగ్ ప్రతిదీ అపరిచితుల కంట పడకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం స్త్రీలకు ఉంది. అపరిచితుల ఎదుట ఫోన్లలో పర్సనల్ విషయాలు మాట్లాడకపోవడం, ఇంట్లో ఒంటరిగా ఉంటుంటే గనక అలాంటి వివరాలు చెప్పకపోవడం, ఏ సమయంలో ఎక్కడ ఉండేది చెప్పకపోవడం చాలా ముఖ్యం. అలాగే ఫోన్ క్యాబ్‌లో వదిలి ఏదైనా కొనడానికి కిందకు దిగకూడదు. పిల్లల స్కూల్ టైమింగ్స్, డ్రాపింగ్ పికప్ వంటి విషయాలు ఫోన్లో డ్రైవర్ వినేలా చెప్పకూడదు. డబ్బు విషయాలు కూడా. అలాగే డ్రైవర్‌తో కాలక్షేపం కబుర్లు కూడా మంచివి కావు. ఏ క్యాబ్ డ్రైవర్ అయినా ఏ కొంచెం ఇబ్బంది పెట్టినా వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలి. ఎందుకంటే మన వ్యక్తిగత సమస్యలను కుటుంబం అర్థం చేసుకుంటుంది. వాటిని అడ్డు పెట్టి ఎవరూ బ్లాక్మెయిల్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిదీ... ముఖ్యంగా స్త్రీలది. తస్మాత్ జాగ్రత్త! ఎలా దొరికాడు? జూలై 24న బెంగళూరులోని రామ్మూర్తి నగర్లో ఒక క్యాబ్ ఆగి అందులో కొందరు పార్టీ చేసుకుంటున్నారని పోలీసులు గమనించారు. రాత్రిపూట అలా క్యాబ్‌లో పార్టీ చేసుకోవడం సరికాదని హెచ్చరించి వెళ్లిపోయారు. అయితే వెళుతూ ఉండగా ఎస్.ఐకి అనుమానం వచ్చింది. క్యాబ్‌లో ఉన్నది డ్రైవర్ స్థాయి మనుషులు. వారు తాగుతున్నది గ్లెన్లివట్ విస్కీ. ఆ బాటిల్ ధర బెంగళూరులో 9,900. అంత ఖరీదైన బాటిల్ ఎక్కడిదని డ్రైవర్ని పేరడిగితే ‘ప్రవీణ్’ అని చెప్పాడు. ఐడి కార్డులో కిరణ్ అని ఉంది. దాంతో పోలీసులకు పూర్తిగా అనుమానం వచ్చింది. ఆ క్యాబ్‌కు డ్రైవర్ అతడే. మిగిలినవారు స్నేహితులు. కిరణ్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి తగు మర్యాదలు చేశాక మొత్తం కక్కాడు. పోలీసులు అవాక్కయ్యి ఆ వివాహితను, ఆమె భర్తను కలిసి విషయం చెప్పారు. అయినప్పటికీ వారు కేసు పెట్టడానికి సంశయిస్తే బాధితుల పేర్లు బయటకు రాకుండా చూస్తామని హామీ ఇచ్చి కేసు పెట్టించారు. వెంటనే కిరణ్‌ని అరెస్ట్ చేశారు. కుదువ పెట్టిన నగలన్నీ బయటకు తెచ్చారు. డబ్బు మాత్రం అతడు బెట్టింగ్‌లో ఖర్చు పెట్టేశాడు. -
రూట్ మార్చి కారు డ్రైవింగ్.. క్యాబ్ డ్రైవర్ని మహిళ నిలదీయడంతో
బనశంకరి(చెన్నై): నగరంలో ఉబర్ క్యాబ్ డ్రైవరు మహిళా ప్రయాణికురాలితో అనుచితంగా ప్రవర్తించినట్లు బాధితులు ఫిర్యాదు చేసింది. వివరాలు.. నగరంలో బీటీఎం లేఔట్ రెండో స్టేజ్ నుంచి జేపీ.నగర మెట్రోస్టేషన్ వరకు ప్రయాణించడానికి ఒక మహిళ ఉబర్ ట్యాక్సీని బుక్‌చేసింది. డ్రైవరు మ్యాప్ ఆధారంగా వెళ్లకుండా మరో మార్గంలో వెళ్తుండగా, మ్యాప్ మేరకు వెళ్లాలని మహిళ కోరారు. కానీ డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో మహిళ తనను తీసుకువచ్చిన స్థలంలో వదిలిపెట్టాలని, ఆ డబ్బులను చెల్లిస్తానని చెప్పింది. సమ్మతించని డ్రైవరు మహిళతో అనుచితంగా ప్రవర్తించినట్లు తెలిసింది. బాధితురాలు సోషల్ మీడియాలో ఈ ఘటనను వివరించింది. డ్రైవర్ తీరుతో భయభ్రాంతులకు గురై ఎలా తప్పించుకుని జనసందడి ఉన్న ప్రాంతంలోని వచ్చానని తెలిపింది. దీనిపై ఉబర్ సంస్థ స్పందిస్తూ ఆ డ్రైవరును గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. చదవండి: HYD: తల్లీకూతుళ్ల ఆత్మహత్య.. చేతిపై ఏం రాసి ఉంది? -
సెల్ఫ్ ఎంపవర్మెంట్
కోల్‌కతాకు చెందిన దీప్తి ఘోష్ ఇంజనీరింగ్ చదువుకుంది. తండ్రి చనిపోవడంతో కుటుంబ బరువు బాధ్యతలు తనపై పడ్డాయి. ఉద్యోగాల వేటలో పడింది. అయితే వచ్చిన ఒకటీ రెండు ఉద్యోగాలు ‘ఔట్ ఆఫ్ కోల్‌కతా’ వచ్చాయి. తల్లి, చెల్లిని విడిచి దూరంగా ఉండలేని పరిస్థితి. సిటీలో ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందో ఏమో అనుకునే పరిస్థితుల్లో ఖాళీగా ఉండడం ఎందుకని క్యాబ్ డ్రైవర్‌గా మారింది. మంచి ఆదాయాన్ని అర్జిస్తూ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా నిలుస్తోంది. దీప్తి క్యాబ్‌లో ప్రయాణించిన దిల్లీకి చెందిన పరమ్ కల్యాణ్‌సింగ్ ఆమె స్టోరీని పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘సెల్ఫ్ ఎంపవర్మెంట్ అంటే ఇదే’ ‘చదువుకు తగ్గ ఉద్యోగం దొరకడం లేదని బాధపడుతూ కూర్చోవడం కంటే ఇది ఎంత గొప్ప పని!’ ‘దీప్తి తన వృత్తిని గౌరవిస్తుంది. శ్రమజీవుల లక్షణం ఇది. స్త్రీ సాధికారతకు తిరుగులేని ఉదాహరణ దీప్తి’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. -
నటి లగేజీ ఎత్తుకెళ్లైన క్యాబ్ డ్రైవర్.. తాగి ఫోన్ చేసి వేధింపులు
చిత్రవిచిత్ర డ్రెస్సులతో సోషల్ మీడియాను ఆగం చేసే బిగ్‌బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఢిల్లీలో ఓ క్యాబ్ డ్రైవర్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని ట్విటర్లో రాసుకొచ్చింది. 'ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వెళ్లడానికి ఓ క్యాబ్ బుక్ చేసుకున్నాను. దాదాపు ఆరు గంటల కోసం దాన్ని బుక్ చేసుకున్నా. మధ్యలో లంచ్ చేద్దామని ఆగాను. ఇంతలో ఆ కారు డ్రైవర్ నా లగేజీతో ఉడాయించాడు. నేను వెంటనే నాకు తెలిసిన ఫ్రెండ్ సాయం కోరాను. అతడు కల్పించుకోవడంతో ఆ క్యాబ్ డ్రైవర్ ఓ గంట తర్వాత పూటుగా తాగి వచ్చాడు. నిజానికి అతడు పార్కింగ్ ఏరియాలోనే ఉన్నాడు. కానీ తన లొకేషన్ మాత్రం నేనున్న చోటుకు దూరంగా ఉన్నట్లు చూపించింది. పైగా ఆ డ్రైవర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. అతడు తిరిగి వచ్చాక ఎందుకిలా చేశావంటే సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా మాట్లాడాడు' అని రాసుకొచ్చింది. దీనిపై ఉబర్ యాజమాన్యం స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయితే ఇక్కడే మరో సమస్య మొదలైంది. ఉర్ఫీకి సదరు డ్రైవర్ తాగి ఫోన్లు చేస్తున్నాడట. ఈ విషయాన్ని సైతం ఉర్ఫీ ట్విటర్లో తెలియజేసింది. 'ఉబర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ డ్రైవర్ తాగి మరీ ఫోన్లు చేస్తున్నాడు. ఇప్పటివరకు 17 మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఇంకా ఫోన్ చేస్తూ నన్ను వేధిస్తూనే ఉన్నాడు. ఇంత ఫిర్యాదు చేసినా మళ్లీ ఇలా జరుగుతోందంటే మీరసలు ఏమాత్రం పట్టించుకోలేదని అర్థమవుతోంది' అంటూ ఉబర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది నటి. Had the worst experience with @UberINSupport @Uber in delhi,booked a cab for 6 hours,on my way to airport stopped to have lunch, the driver vanished with my luggage in the car. After interference from my male friend the driver came back completely drunk after 1 hour @Uber_India pic.twitter.com/KhaT05rsMQ — Uorfi (@uorfi_) February 21, 2023 Cont- @Uber_India That guy couldn’t even walk properly , at first he kept lying about his location that he was in the parking but his location showed 1 hour further from ours. Had to call my male friend to intervene cause he wasn’t moving at all despite calling him so many times — Uorfi (@uorfi_) February 21, 2023 The fact that your driver still kept drunk calling me even after complaining it to you , 17 miss calls , kept calling and abusing me . I complained to the Uber safety team , they were useless. @Uber_India Girls avoid using Uber — Uorfi (@uorfi_) February 22, 2023 చదవండి: నన్ను కిందకు లాగుతున్నారు, డబ్బులిచ్చి మరీ... కిరణ్ -
Hyderabad: ప్రయాణికులకు ఊరట.. పోలీసుల కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం వేడుకలలో ఎలాంటి అపశ్రుతి దొర్లకుండా ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్స్పాట్లు, డ్రంకెన్ డ్రైవ్ (డీడీ) విస్తృత తనిఖీలు చేసేందుకు సిద్ధమయ్యారు. క్యాబ్‌లు, ట్యాక్సీ, ఆటో రిక్షాల డ్రైవర్లు సరైన యూనిఫాం, అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాస్ సూచించారు. ప్రయాణికులు రైడ్ బుక్ చేస్తే ఆపరేటర్లు నిరాకరించకూడదని, ఒకవేళ ఎవరైనా అలా చేస్తే వాహన చట్టం–1988 సెక్షన్ 178 కింద ఉల్లంఘన కిందకే వస్తుందని, ఆయా డ్రైవర్‌కు ఈ–చలానా రూపంలో రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. డ్రైవర్లు అనుచితంగా ప్రవర్తించినా లేదా అదనపు చార్జీలు వసూలు చేసినా ప్రయాణికులు వాహనం, సమయం, స్థలం తదితర వివరాలతో 94906 17346 వాట్సాప్ నంబరులో ఫిర్యాదు చేయాలని సూచించారు. (క్లిక్ చేయండి: న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షల్లేవ్ ) -
ఎన్నారైను టెన్షన్ పెట్టిన నాలుగు గంటలు
ఢిల్లీ: ఏమరపాటులో చేసే పని.. ఒక్కోసారి తీవ్రపరిణామాలకు దారి తీస్తుంటుంది. తన కూతురి పెళ్లి కోసం నగలతో వచ్చిన ఓ ఎన్నారైకి అలాంటి పరిస్థితే ఎదురైంది. నాలుగు గంటల పాటు పోలీస్ స్టేషన్లో టెన్షన్.. టెన్షన్‌గా గడిపాడు ఆ పెద్దయాన. నిఖిలేష్ సిన్హా(50).. లండన్ నుంచి తన కూతురి వివాహం కోసం వచ్చారు. గ్రేటర్ నోయిడాలో ఓ హోటల్లో బస చేసిన ఆయన.. బుధవారం మధ్యాహ్నం సమయంలో ఊరికి వెళ్లేందుకు లగేజీతో ఓ క్యాబ్ బుక్ చేసుకుని బయల్దేరారు. అయితే.. తీరా గమ్యస్థానం చేరుకున్నాక ఆయన ఓ బ్యాగ్‌ను క్యాబ్‌లోనే మరిచిపోయి వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాతే ఆయన తలపట్టుకున్నారు. ఆ బ్యాగులో సుమారు కోటి రూపాయల విలువ చేసే నగలు ఉన్నాయట. దీంతో ఆలస్యం చేయకుండా ఆయన బిస్రాఖ్ పోలీసులను ఆశ్రయించాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఆ క్యాబ్ నిర్వహణ కార్యాలయానికి వెళ్లి.. నాలుగు గంటల్లో ఆ క్యాబ్ ఉన్న లొకేషన్ గుర్తించారు. తీరా.. ఘజియాబాద్ లాల్ కౌన్ వద్ద క్యాబ్‌ను పోలీసులు పట్టుకున్నారు. అయితే.. ఆ పెద్దాయన క్యాబ్‌లో బ్యాగ్ మరిచిపోయిన విషయం తనకు తెలియదని డ్రైవర్ పోలీసులతో చెప్పాడు. దీంతో నేరుగా క్యాబ్, డ్రైవర్‌తో సహా స్టేషన్‌కి చేరుకున్న పోలీసులు.. నిఖిలేష్ ముందే ఆ బ్యాగ్‌ను ఓపెన్ చేసి నగలను అప్పగించారు. పోలీసుల త్వరగతిన స్పందన ఎన్నారై నిఖిలేష్ సంతోషం వ్యక్తం చేసి.. క్యాబ్ డ్రైవర్‌పై పెట్టిన కేసును ఉపసంహరించుకున్నారు. అప్పటికి సమయం రాత్రి ఎనిమిది గంటలు అయ్యింది. ఇదీ చదవండి: మీరు దళితులు.. మీకు ఏం అమ్మం! -
సాయం కోరిన స్నేహితుడి ప్రేయసిపై కన్నేసి.. ఇద్దరిని ఇంటికి పిలిపించి..
సాక్షి, హైదరాబాద్: సాయం కోరిన స్నేహితుడి ప్రేయసిపై కన్నేశాడో యువకుడు. మాయమాటలతో స్నేహితుడిని, తన ప్రేయసిని ఇంటికి రప్పించి వారికి తెలియకుండా వారున్న రూమ్‌లో సీక్రెట్ కెమెరా అమర్చాడు. ఆ తర్వాత నుంచి తన కోరిక తీర్చాలంటూ వెంటపడి వేధించిన యువకుడు ప్రస్తుతం కటకటాలపాలయ్యాడు. మరో ఘటనలో అడ్రస్ చెబుతున్న యువతి పట్ల అసభ్యకరంగా తాకుతూ ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్ సైతం జైలు పాలయ్యాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించిన షీటీం బృందం.. వివరాలను కోర్టులో పొందుపరిచారు. నాంపల్లిలోని మెట్రోపొలిటన్ క్రిమినెల్ కోర్టు ఇద్దరికీ ఎనిమిదేసి రోజుల చొప్పున జైలు శిక్ష విధించినట్లు షీటీం అడిషినల్ డీసీపీ సి.శిరీషరాఘవేంద్ర తెలిపారు. నగరానికి చెందిన అబ్థుల్ సాల్మన్(23) తన స్నేహితుడు, ప్రియురాలికి తన ఇంటిలో చోటు కల్పించాడు. వారిద్దరూ శారీరకంగా కలిసిన సన్నివేశాల్ని ఫోన్లో చిత్రీకరించి తనతో కూడా గడపాలంటూ యువతిని బెదిరించాడు. దీనిపై యువతి, తన ప్రియుడు షీటీం పోలీసుల్ని ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించిన షీటీం అబ్దుల్ సాల్మన్ వద్ద ఉన్న ఫోన్‌ను పరిశీలించగా దానిలో నగ్నచిత్రాలు ఉన్నట్లు స్పష్టమవ్వడంతో వాటిని స్వాధీనం చేసుకుని కోర్టుకు అందజేశారు. అదేవిధంగా కొద్దిరోజుల క్రితం నారాయణగూడ మెట్రో స్టేషన్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిని మహ్మద్ హైదర్అలీఖాన్(25) అనే క్యాబ్ డ్రైవర్ తనకు అడ్రస్ చెప్పాలంటూ కోరాడు. తను అడ్రస్ చెప్పేందుకు హైదర్ అలీఖాన్ వద్దకు రావడంతో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ సమయంలో యువతి చాకచక్యంగా డ్రైవర్ ఫొటోలు, కారు నంబర్‌ను తన ఫోన్లో క్యాప్చర్ చేసి షీటీంకు పంపింది. రంగంలోకి దిగిన షీటీం బృందం మహ్మద్ హైదర్ అలీఖాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. చేసిన తప్పును ఒప్పుకున్నాడు. సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను సేకరించి కోర్టులో సమర్చించారు. ఈ ఇద్దరి వ్యవహారంపై గురువారం ఇద్దరికీ వేర్వేరుగా 8 రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. -
క్యాబ్ డ్రైవర్‌పై దాడిలో 12 మందిపై కేసు
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి ప్రాంతంలో క్యాబ్ డ్రైవర్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వివేక్‌రెడ్డి కస్టడీ సోమవారం ముగిసింది. దీంతో పోలీసులు ప్రధాన నిందితుడిని జైలుకు తరలించారు. క్యాబ్ డ్రైవర్ వెంకటేష్‌తో పాటు యజమాని పర్వతాలును తనతో పాటు 12 మంది కలిసి దాడి చేసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. గత నెల 31న ఉప్పర్‌పల్లికి చెందిన వివేక్‌రెడ్డి (24) బీఎన్‌రెడ్డినగర్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని ఉప్పర్‌పల్లికి ప్రయాణం అయ్యాడు. బుకింగ్ స్వీకరించిన వెంకటేష్ (27) వివేక్‌రెడ్డిని పికప్ చేసుకుని చంద్రాయణగుట్ట మీదుగా ఉప్పర్‌పల్లికి వెళ్తున్నాడు.ఈ క్రమంలో రాత్రి 12 గంటల సమయంలో యజమాని ఫోన్ చేయడంతో ఉప్పర్‌పల్లి వద్ద డ్రాప్ చేసి వస్తానని తెలపడంతో తాను చంద్రయణగుట్ట వద్దే ఉన్నానని తాను కూడా వస్తానంటూ తెలపడంతో కారులోనే ముగ్గురు కలిసి వెళ్లారు. డబ్బుల చెల్లింపులో వివాదం.. ఉప్పర్‌పల్లి వద్ద కారు దిగి డబ్బులు చెల్లించడంలో వివాదం చోటు చేసుకుని అతడు ఘర్షణకు దిగాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడికి తెలపడంతో వారు సైతం ఘటనా స్థలానికి వచ్చి డ్రైవర్‌తో పాటు యజమానిని సైతం చితకబాదారు. అనంతరం వారి కారులోనే ఇద్దరిని బందించారు. ఇదే సమయంలో రాజేంద్రనగర్ గస్తీ పోలీసులు పెట్రోలింగ్‌కు రాగా ఘర్షణ విషయాన్ని గమనించి వారందరినీ స్టేషన్‌కు తరలించారు. ఇరువురి భిన్న వాదనలు.. వివేక్‌రెడ్డి మొదట కారు డ్రైవర్ వెంకటేష్, పర్వతాలు ఇద్దరు తన గొలుసు తీసుకుని దాడి చేశారంటూ ఫిర్యాదు చేయగా.. డ్రైవర్ డబ్బులు చెల్లించమంటే తమపై దాడి చేశారని తెలపడంతో వారిని స్టేషన్లోనే కూర్చోబెట్టారు. అప్పటికే ఉదయం కావడంతో వెంకటేష్ అస్వస్థతకు గురై రక్తపు వాంతులు చేసుకోవడంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దెబ్బలు తాళలేకే.. దెబ్బలు తాళలేకే ఇరువురు అస్వస్థతతకు గురి కావడంతో వారిని ఉస్మానియాకు తరలించామని డ్రైవర్ వెంకటేష్ పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు ఉస్మానియా నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అదే రోజు సాయంత్రం కోమాలోకి వెళ్లిన వెంకటేష్ ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. హత్యాయత్నం కేసు.. మొదట రాజేంద్రనగర్ పోలీసులు వివేక్‌రెడ్డితో పాటు అతడి స్నేహితులపై దాడి కేసు నమోదు చేసి అనంతరం బాధితుడు కోమాలోకి వెళ్లడంతో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎస్ఐ పరీక్షలకు సిద్ధమవుతుండగా.. బాధితుడు వెంకటేష్ ఎస్ఐ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తునే శిక్షణ పొందుతున్నాడని ఆదివారం పరీక్షలు రాయాల్సి ఉండగా ఆసుపత్రిలో కోమాలో ఉ డని వారు విలపించారు. దాడి జరగకపోతే పరీక్షలు రాసి ఎస్ఐగా సెలక్ట్ అయ్యేవాడని దాడికి పాల్పడిన నిందితులను శిక్షించాలని వారు కోరారు. -
దారుణం.. ఆలస్యంగా వచ్చాడని ఓలా డ్రైవర్‌ను చితకబాదిన గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. క్యాబ్ బుక్ చేస్తే అరగంట ఆలస్యంగా వచ్చినందుకు డ్రైవర్, అతని యజమానిని చితకబాదింది ఓ గ్యాంగ్. ఈ ఘటనలో డ్రైవర్, ఓనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఉప్పర్‌పల్లికి చెందిన వినయ్ రెడ్డి అనే యువకుడు ఓలా క్యాబ్ బుక్ చేశాడు. అరగంట ఆలస్యం కావడంతో డ్రైవర్‌ను నిలదీశాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఓలా డ్రైవర్‌పై వియన్ రెడ్డి అతని స్నేహితులు దాడి చేశారు. డ్రైవర్ ఈ విషయాన్ని తన యజమానికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. వెంటనే ఉప్పర్‌పల్లికి చేరుకున్న యజమానిని సైతం వియన్ రెడ్డి గ్యాంగ్ చితకబాదింది. రౌడీల్లా రెచ్చిపోయి ఉదయం 4 గంటల వరకు ఓ గదిలో బంధించి కొట్టారు. చదవండి: ట్రాఫిక్ రద్దీకి చెల్లు.. సైబరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం -
ఆన్లైన్ గేమ్స్‌కు అడిక్ట్.. ప్రయాణికుల ప్రాణాలతో క్యాబ్ డ్రైవర్ చెలగాటం
హైదరాబాద్: ఆన్లైన్ గేమ్స్‌కు బానిసలై ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీనివల్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కళ్లకు కట్టే ఘటన హైదరాబాద్‌లో జరిగింది. మొబైల్లో గేమ్స్‌కు అడిక్ట్ అయిన ఓ క్యాబ్ డ్రైవర్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ప్యాసెంజర్లను సురక్షితంగా గమ్య స్థానాలకు తీసుకెళ్లాల్సిన అతడు ఫోన్లో గేమ్ ఆడుతూ డ్రైవింగ్ చేస్తున్నాడు. అది కూడా ఒకట్రెండు నిమిషాలు కాదు.. చాలా సేపు. వెనకాల కూర్చున్న ప్యాసెంజర్ గేమ్ ఆడకుండా డ్రైవింగ్ చేయమని చెప్పినా అతడు పట్టించుకోలేదు. అలాగే నిర్లక్ష్యంగా కారును ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ తీసుకెళ్లాడు. కనీసం సీట్ బెల్టు ధరించమని చెప్పినా పట్టించుకోలేదు. డ్రైవర్ వెర్రి చర్యకు చిర్రెత్తిపోయిన ప్యాసెంజర్ రాజీవ్ సింగ్ ఈ విషయంపై హైదరాబాద్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులకు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశాడు. @CYBTRAFFIC driving while playing pic.twitter.com/RRUP7GXF2E — Rajiv Singh (@rajusingh0810) August 5, 2022 ఇతని పేరు రాజు. అరుదైన డ్రైవింగ్ స్టైల్ ఉన్నట్టుంది. ఫోన్లో గేమ్ ఆడుతూనే కారు నడపుతున్నాడు. అసలు ఇతడ్ని డెల్ సంస్థ క్యాబ్ డ్రైవర్‌గా ఎలా తీసుకుంది అని వాపోయాడు. రాజీవ్ షేర్ చేసిన వీడియో చూసి నగర పోలీసులు కూడా వెంటనే స్పందించి ఆ చోటు ఎక్కడని అడిగారు. ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ మధ్యలో అని అతడు బదులిచ్చాడు. ఇందులో నిజానిజాలు ఎంతో తెలుసుకుని పోలీసులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో చూడాలి. చదవండి: ‘పోలీసు పరీక్ష’కు నిమిషం నిబంధన.. అభ్యర్థులకు కీలక సూచనలు -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ.. కాకినాడలో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ
-
వైఎస్సార్ వాహనమిత్ర: మూడేళ్ల కంటే మిన్నగా..
సాక్షి, అమరావతి: అర్హులైన ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వరుసగా నాలుగో ఏడాది ‘వైఎస్సార్ వాహనమిత్ర’ భరోసా లభించనుంది. 2022–23 సంవత్సరానికి గాను రాష్ట్రంలో 2,61,516 మంది సొంత ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ కలిగిన డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఈ ఏడాది రూ.261.51 కోట్ల మేర డ్రైవర్లకు ప్రయోజనం కలగనుంది. గత మూడేళ్ల కంటే ఈ సారి ఎక్కువ మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందనుండటం విశేషం. వాహనాల మరమ్మతులు, బీమా ఖర్చులు తడిసిమోపెడవుతుండటంతో డ్రైవర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే డ్రైవర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి ఏడాదే ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకాన్ని ప్రకటించారు. 2022–23కు గాను అర్హత గల డ్రైవర్ల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. గతంలో లబ్ధిదారులుగా ఉన్నవారితోపాటు కొత్తవారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పరిశీలించి రవాణా శాఖకు పంపించారు. ఈ ఏడాది మొత్తం 2,61,516 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. ఈ నెల 15న విశాఖపట్నంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లబ్ధిదారులకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. బడుగు, బలహీన వర్గాల లబ్ధిదారులే సింహభాగం సామాజిక వర్గాల వారీగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల నుంచి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో ఆర్థిక సహాయం జమ కానుంది. వైఎస్సార్ వాహనమిత్ర పథకం లబ్ధిదారుల్లో మొదటి స్థానంలో బీసీలు ఉండగా.. రెండో స్థానంలో ఎస్సీలు ఉన్నారు. 2022–23కు గాను మొత్తం లబ్ధిదారులు 2,61,516 మంది ఎంపిక కాగా.. వారిలో బీసీ లబ్ధిదారులు 1,44,164 మంది (55 శాతం) ఉన్నారు. తరువాత స్థానంలో ఎస్సీలు 63,594 మంది, ఎస్టీలు 10,472 మంది ఉన్నారు. నాలుగేళ్లలో రూ.1,025.96కోట్లు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు మూడుసార్లు (2019–20, 2020–21, 2021–22) వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద ఆర్థిక సహాయం చేశారు. 2022–23కు కూడా ఆర్థిక సహాయం చేసేందుకు లబ్ధిదారులను గుర్తించారు. మొత్తంగా ఈ నాలుగేళ్లలో ఏకంగా 10.25 లక్షల మంది డ్రైవర్లకు రూ.1,025.96 కోట్లను ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించినట్టు అవుతుంది. లబ్ధిదారుల సంఖ్య ఏటా పెరుగుతున్నా సరే ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఈ పథకాన్ని అందిస్తోంది. కరోనా పరిస్థితులతో రెండేళ్లు ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా పేదలైన డ్రైవర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించింది. -
ఓటీపీ చెప్పలేదని భార్య, పిల్లల ఎదుటే..
సాక్షి, చెన్నై: వాహన బుకింగ్‌కు సంబంధించి ఓటీపీ నంబర్ తెలియజేయక పోవడంతో ఓ క్యాబ్‌డ్రైవర్ భార్య, పిల్లల ఎదుటే కొట్టి మరీ ఓ ప్రయాణికున్ని చంపేసిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. చెన్నై శివారులోని గూడువాంజేరి సమీపంలోని కన్నివాక్కం కుందన్‌నగర్‌లో ఉంటున్న ఉమేందర్(33) కోయంబత్తూరులోని ఓ ప్రముఖ సంస్థలో ఐటీ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. ప్రతి శని, ఆదివారం చెన్నైకు వచ్చి కుటుంబంతో గడుపుతాడు. ఆదివారం ఉమేందర్ భార్య భవ్య(30), పిల్లలు అక్రోష్, కరన్‌తో పాటు భవ్య సోదరి దేవిప్రియ, ఆమె పిల్ల లతో కలిసి ఓఎంఆర్ రోడ్డులోని సినీ కాంప్లెక్స్‌లో సినిమాకు వెళ్లారు. అనంతరం ఇంటికి వెళ్లడానికి దేవిప్రియ క్యాబ్ బుక్ చేసింది. కారు ఎక్కాక డ్రైవర్ రవి బుకింగ్ ఓటీపీ నంబర్ చెప్పాలని కోరాడు. ఈ విషయమై వారి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. కారు దిగే సమయంలో ఉమేందర్ డోర్‌ను గట్టిగా నెట్టడంతో రవి దాడి చేశాడు. దీంతో అతను స్పృహ తప్పాడు. అయితే డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా కేలంబాక్కం పోలీసులు అరెస్టు చేశారు. స్పృహ తప్పిన ఉమేందర్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చదవండి: అతి పిన్న వయసులో కంప్యూటర్ భాషలను నేర్చుకున్న చిచ్చర పిడుగు! -
హైదరాబాద్‌లో భారీగా తగ్గిన క్యాబ్‌లు, ఆటోలు!
నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. ఏ సమయంలోనైనా బుక్ చేసిన కొన్ని నిమిషాల్లోనే క్యాబ్‌లు రయ్‌రయ్‌మంటూ దూసుకొచ్చేవి. కానీ కొంతకాలంగా ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాలు, కొన్ని సమయాల్లో మినహా నో క్యాబ్స్ అనో, నో ఆటోస్ అనో యాప్‌లు చేతులెత్తేస్తున్నాయి. గతేడాది భారీ వర్షాల్లో కూడా సేవలందించిన క్యాబ్స్‌కు ఇప్పుడేమైంది? కొన్నేళ్లుగా క్యాబ్‌లతో కళకళలాడిన భాగ్యనగరం ఇప్పుడు వాటి జాడ కోసం ఎందుకు వెతుక్కోవాల్సి వస్తోంది? – సాక్షి, హైదరాబాద్ వాహనాలపై కేంద్రం పిడుగు.. కరోనా లాక్‌డౌన్‌తో నగరంలో కొన్ని నెలలపాటు క్యాబ్‌లు, ఆటోలు తిరగక డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. వారిలో కొందరు వాహనాలను అమ్మేయగా, ఇల్లు గడవడం కష్టమై మరికొందరు కార్లను వేరే రకంగా అద్దెలకు ఇచ్చారు. ఇలా నగరంలో కరోనా వ్యాప్తి తర్వాత క్యాబ్‌ల సంఖ్య తగ్గి కొంత సమస్య ఏర్పడింది. దీనికితోడు డీజిల్ ధరలు అమాంతం పెరగడం.. ఆ మేరకు చార్జీలు పెరగకపోవడం ఒక కారణమైతే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నిబంధనతో క్యాబ్‌లు, ఆటోలు భారీగా నిలిచిపోయాయి. ఈ కారణంగానే క్యాబ్‌లకు కొరత వచ్చి పడింది. ఇదీ సమస్య.. కేంద్ర మోటారు వాహనాల చట్టంలో జరిగిన మార్పు మూడు నెలల క్రితం అమలులోకి వచ్చింది. పర్యావరణానికి ప్రాధాన్యమిచ్చే క్రమంలో వాహనాలు కచ్చితంగా ఎప్పటికప్పుడు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా లోపాలు సరిదిద్దాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా ఏటా ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందే నిబంధనను కఠినతరం చేసింది. గడువు తీరినా ఫిట్నెస్ సర్టిఫికెట్‌ను రెన్యూవల్ చేయించుకోని రవాణా వాహనాలపై రోజుకు రూ. 50 చొప్పున పెనాల్టీ వసూలు చేసే నిబంధనను తెరపైకి తెచ్చింది. అది ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వచ్చింది. దీన్ని రాష్ట్ర రవాణా శాఖ సైతం అమలు చేయడం ప్రారంభించింది. ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన నాటి నుంచి రోజుకు రూ.50 చొప్పున లెక్కగట్టి వసూలు చేస్తోంది. గత రెండు నెలలుగా ఇది తీవ్రమైంది. నగరంలో చాలా క్యాబ్‌లు, ఆటోల ఫిట్నెస్ గడువు ఎప్పుడో ముగిసింది. చాలా వాహనాలకు ఫిట్నెస్ రెన్యూవల్ చేయించుకోవాల్సిన గడువు 3–4 ఏళ్లు దాటిపోయింది. దీంతో ఒక్కో వాహనంపై రూ.60–70 వేల పెనాల్టీ పెండింగ్‌లో ఉంది. దీంతో వాహనాలను రోడ్డుపైకి తేవడానికి యజమానులు జంకుతున్నారు. అలా ఏకంగా 35 వేలకుపైగా క్యాబ్‌లు, 25–30 వేల ఆటోలు నిలిచిపోయాయి. కరోనా దెబ్బకు ఇప్పటికే దాదాపు 15 వేల క్యాబ్‌ల డ్రైవర్లు వేరే పనులు చూసుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో క్యాబ్‌లు, ఆటోలు లేకపోయేసరికి ప్రయాణికుల బుకింగ్స్‌కు స్పందన తగ్గిపోయింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు... భారీ పెనాల్టీల నుంచి విముక్తి కలిగించాలంటూ పదుల సంఖ్యలో డ్రైవర్లు హైకోర్టును ఆశ్రయించగా ఓ కేసు విషయంలో న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి తీర్పు వచ్చే వరకు రోజుకు రూ. 10 చొప్పున పెనాల్టీ వసూలు చేసి తాత్కాలిక ఫిట్‌నెస్‌ల సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించింది. మరోవైపు ఈ భారాన్ని తగ్గించాలంటూ క్యాబ్‌లు, ఆటోల యూనియన్లు ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. కానీ దీనిపై ఇప్పటివరకు రవాణాశాఖ సానుకూల ప్రకటనేదీ విడుదల చేయలేదు. కొత్త ఆటోలకూ కష్టమే.. ధాసాధారణంగా ప్రతినెలా నగరంలో దాదాపు ప్రతి నెలా వెయ్యి వరకు పాత ఆటోలను తుక్కుగా మార్చి వాటి స్థానంలో కొత్త ఆటోలు తీసుకుంటారు. ఇప్పుడు తుక్కుగా మార్చాలంటే.. అప్పటివరకు ఉన్న ఫిట్నెస్ పెనాల్టీ చెల్లించాలనే నిబంధన ఉంది. దీంతో తుక్కుగా మార్చే ప్రక్రియ కూడా బాగా తగ్గిపోయింది. కొత్త ఆటోలకు 100 పర్మిట్లు జారీ చేసే చోట 2–3 జారీ అవుతుండటం గమనార్హం. ఈ సమస్య పరిష్కారమయ్యేవరకు నగర వాసులకు క్యాబ్ కష్టాలు తీరేలా లేవు. -
Hyderabad: మరో దారుణం.. మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలిక అత్యాచార ఘటన మరవక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. నగరంలో ఇంకో మైనర్ బాలిక కిడ్నాప్‌కు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది మొగల్ పురాలో మైనర్ బాలిక(13)ను ఓ క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. బాలిక తన తల్లిని చూసేందుకు పహడిషరీఫ్‌కు వెళ్తుండగా లుక్మాన్ అనే క్యాబ్ డ్రైవర్ ఆమెను మభ్యపెట్టి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లాడు, అక్కడ మరో ఇద్దరితో కలిసి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాలికను ఓ రాత్రంతా వేరే చోట ఉంచి తిరిగి విడిచి పెట్టాడు. తిరిగి ఇంటికి చేరుకున్న బాలిక జరిగిందంతా తల్లిదండ్రులకు వివరించింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్యాబ్ డ్రైవర్ లుక్మాన్ అహ్మద్‌తోపాటు అతనికి ఆశ్రయం ఇచ్చి మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బయటికి రాకుండా పోలుసులు గోప్యతపాటిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం బాలిక ఇంటి నుంచి అదృశ్యమైంది. బాలిక కోసం గాలించిన కుటుంబ సభ్యులు అదే రోజు రాత్రి మొగల్ పురా పపీఎస్లో ఫిర్యాదు చేశారు. లుక్మాన్ అనే క్యాబ్ డ్రైవర్ తనను రంగారెడ్డి జిల్లాలోని ఏదో ఊరికి తీసుకెళ్లాడని బాలిక పోలీసులకు చెప్పింది. దీంతో మిస్సింగ్ కేసును కిడ్నాప్ కేసుగా పోలీసులు మార్చారు. బాలికను రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ గ్రామానికి తీసుకెళ్ళి, అక్కడ తెలిసిన వ్యక్తులు ఆశ్రయం ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. లుక్మాన్‌కు ఆశ్రయమిచ్చిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసుకున్న మొఘల్ పురా పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు. -
మహిళకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్
Woman Racist Comments.. అమెరికాలో జాత్యహంకార కామెంట్స్ కామన్. నల్లజాతీయుల పట్ల తెల్లజాతీయులకు చిన్నచూపు ఉంటుంది. పలు సందర్భాల్లో నల్లజాతీయులపై దాడులు జరిగిన ఘటనలు సైతం చాలానే చూశాము. తాజాగా జాత్యహంకార కామెంట్లు చేస్తున్న ఓ మహిళకు క్యాబ్ డ్రైవర్ రైడ్ నిరాకరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుండటంతో నెటిజన్లు.. క్యాబ్ డ్రైవర్‌ను మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..పెన్సిల్వేనియాలోని ఫాసిల్స్ లాస్ట్ స్టాండ్ బార్ బయట జాకీ అనే మహిళ.. బోడే అనే వ్యక్తి క్యాబ్‌లో ఎక్కింది. డ్రైవర్‌ను విష్ చేసిన తర్వాత, “వావ్, నువ్వు తెల్లవాడిలా ఉన్నావే” అని కామెంట్ చేయగా.. బోడే ‘‘ఎక్స్క్యూజ్ మీ’’ అని అనడంతో.. మళ్లీ ఆమె.. “నువ్వు సాధారణ వ్యక్తివా?.. ఇంగ్లీష్ మాట్లాడతారా?” అంటూ బోడే భుజం మీద తడుముతూ కనిపించింది. దీంతో, సీరియస్ అయిన బోడే.. ఇది కరెక్ట్ కాదు. ఎవరో వ్యక్తి తెల్లవాడు కాకపోయినా ఆ సీటులో కూర్చుంటే వచ్చే తేడా ఏంటి అని ప్రశ్నించే సరికి ఆమె షాకైంది. అనంతరం బోడే.. ఆ మహిళను మీరు కారు దిగి వదిలివెళ్లిపోవచ్చు. రైడ్‌ను క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పేశాడు. ఈ ఘటనకు సంబంధిన వీడియో మొత్తాన్ని డ్రైవర్ బోడే.. తన హ్యాండ్ కామ్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. A @lyft driver, James W. Bode exemplified what it is to be a White Ally. He lost money. Risked his rating. All in the name of doing what he believed is right. Be more like James! I owe you a beer, Jimmy. pic.twitter.com/WrdA2AxntD — Kenny Nwankwo (@KennyNwankw0) May 16, 2022 వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ నిలిచింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. రేసిస్ట్ కస్టమర్లను తిరస్కరించడం కరెక్ట్ అని కామెంట్స్ చేస్తూనే దీనిని చూసి ప్రతిఒక్కరూ నేర్చుకోవాలంటున్నారు. కానీ, అది అంత ఈజీ కాదంటూ డ్రైవర్ బోడేకు అభినందనలు తెలుపుతున్నారు. అంతకు ముందు.. అమెరికన్ పొలిటికల్ యాక్టివిస్ట్, రైటర్ ఏంజెలా డేవిస్ ఒకానొక సమయంలో.. "జాత్యంహకార సమాజంలో జాత్యంహకారం చేయకుండా ఉంటే సరిపోదు. జాత్యంహకార వ్యతిరేకి అయి కూడా ఉండాలి" అని అన్నారు. ఈ ఘటన ఆయన కామెంట్స్‌కు సూట్ అయ్యేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ముప్పై ఏళ్ల బంధానికి ముగింపు.. రష్యా నుంచి దిగ్గజ కంపెనీ నిష్క్రమణ -
క్యాబ్ అగ్రిగేటర్లపై కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: ఓలా, ఉబెర్ తదితర ట్యాక్సీ సర్వీసుల సంస్థలపై (క్యాబ్ అగ్రిగేటర్స్) ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించింది. ఆయా సంస్థల ప్రతినిధులతో మంగళవారం సమావేశమైంది. సిస్టమ్‌లను సత్వరం మెరుగుపర్చుకోవాలని, వినియోగదారుల ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని ఆదేశించింది. తమ విధానాలు మార్చుకోకపోతే కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది. ‘వారి ప్లాట్‌ఫామ్‌లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయన్న సంగతి వారికి చెప్పాం. గణాంకాలు కూడా చూపించాము. సిస్టమ్‌లను సరిచేసుకోవాలని, ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించాము. లేకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశాము‘ అని సమావేశం అనంతరం వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. క్యాబ్ అగ్రిగేటర్స్‌పై తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆయన చెప్పారు. ట్యాక్సీ సేవల సంస్థలు సత్వరం పరిష్కార మార్గాలతో ముందుకు రావాలని సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) చీఫ్ కమిషనర్ నిధి ఖరే పేర్కొన్నారు. వినియోగదారుల హక్కులకు భంగం కలిగేలా క్యాబ్ అగ్రిగేటర్లు అనుచిత వ్యాపార విధానాలు పాటించకుండా త్వరలోనే ఆదేశాలు జారీ చేయనున్నట్లు వివరించారు. తప్పుడు విధానాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటూ ప్రభుత్వం ఇప్పటికే వారికి స్పష్టం చేసినట్లు ఖరే పేర్కొన్నారు. మరోవైపు, సమావేశంలో లేవనెత్తిన సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా చర్యలు తీసుకుంటామని క్యాబ్ అగ్రిగేటర్లు పేర్కొన్నారు. క్యాన్సిలేషన్ చార్జీల విషయానికొస్తే, ఆర్డరు రద్దవడం వల్ల డ్రైవరు నష్టపోకుండా పరిహారం చెల్లించేందుకే సదరు చార్జీలు విధిస్తున్నట్లు తెలిపారు. ఓలా, ఉబెర్, మేరు, రాపిడో, జుగ్ను ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. వివాదాస్పద అంశాల పరిష్కారంపై వినియోగదారుల వ్యవహారాల విభాగంతో కలిసి పని చేస్తున్నామని ఉబెర్ ఇండియా సెంట్రల్ ఆపరేషన్స్ విభాగం హెడ్ నితీష్ భూషణ్ తెలిపారు. ఫిర్యాదులు ఇలా..: చార్జీలు, ట్రిప్‌ల రద్దు విషయాల్లో క్యాబ్ అగ్రిగేటర్లపై భారీగా ఫిర్యాదులు ఉంటున్నాయి. వివిధ కారణాల వల్ల ట్రిప్‌లను అంగీకరించడానికి ఇష్టపడని డ్రైవర్లు వాటిని రద్దు చేసుకోవాలంటూ వినియోగదారులపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే, ట్రిప్ క్యాన్సిల్ చేస్తే అగ్రిగేటర్ సంస్థ పెనాల్టీలు విధిస్తోంది. అలాగే, అసలు ఏ ప్రాతిపదికన ప్రయాణ చార్జీలను నిర్ణయిస్తున్నారన్న అంశంపై పారదర్శకత లోపించింది. ఈ నేపథ్యంలో క్యాబ్ అగ్రిగేటర్లు అనుసరిస్తున్న అల్గోరిథమ్‌లు, ఇతరత్రా విధానాలను కూడా తెలుసుకోవాలని భావిస్తున్నట్లు ఖరే పేర్కొన్నారు. ట్రావెల్, ఫుడ్ అగ్రిగేటర్లపై ఎఫ్హెచ్ఆర్ఏఐ ఫిర్యాదు.. ఆన్లైన్ ట్రావెల్ (ఓటీఏ), ఫుడ్ అగ్రిగేటర్లు (ఎఫ్ఎస్ఏ) పోటీని దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాపార విధానాలు అమలు చేస్తున్నాయంటూ ఆతిథ్య రంగ సంస్థల సమాఖ్య ఎఫ్హెచ్ఆర్ఏఐ తాజాగా ఆర్థిక అంశాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం కమిటీ చైర్మన్ జయంత్ సిన్హాకు లేఖ రాసింది. కొన్ని ఓటీఏ, ఎఫ్‌ఎస్‌ఏలు విధ్వంసం సృష్టిస్తున్నాయని ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదుల పరిష్కారానికి ఆయా సంస్థల్లో ఎలాంటి వ్యవస్థా లేకపోవడంతో వినియోగదారులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఎఫ్హెచ్ఆర్ఏఐ వైస్ ప్రెసిడెంట్ గుర్బక్షీష్ సింగ్ కోహ్లి పేర్కొన్నారు. ఓటీఏలు, ఎఫ్‌ఎస్‌ఏలు.. కస్టమర్లకు సర్వీసులు అందించడంలో విఫలమవుతుండటం వల్ల ఇటు కస్టమర్లు అటు సర్వీస్ ప్రొవైడర్లు సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తోందని వివరించారు. పైగా తమకు సంబంధం లేని చార్జీలను వివిధ పేర్లు, సాకులతో రెట్టింపు స్థాయిలో విధిస్తున్నాయన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లే వీటిని విధిస్తున్నాయనే భావనలో కస్టమర్లు ఉంటున్నారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఓటీఏ, ఎఫ్‌ఎస్‌ఏల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం.. కారు రివర్స్ తీస్తుండగా..
సాక్షి, హైదరాబాద్: కారు ఢీ కొని చిన్నారి మృతి చెందిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. నాచారం ఇన్స్పెక్టర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన యాటల కరుణాకర్, రవళి దంపతుల కుమార్తె సిరి(03) ఆడుకునేందుకు మధ్యాహ్నం ఇంట్లోనుంచి బయటికి వచ్చింది. అదే సమయంలో అటువైపు వచ్చిన క్యాబ్ రివర్స్ తీస్తుండగా చిన్నారి కారు కింద పడిపోయింది. సిరి తలకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబసభ్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ రాజీవన్‌కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ప్రేమపేరుతో బాలికను మహారాష్ట్ర తీసుకెళ్లి.. గది అద్దెకు తీసుకుని..) -
క్యాబ్ డ్రైవర్‌గా మారిన హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్
కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. కౌసల్యా కృష్ణమూర్తి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఐశ్వర్యా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యక ఇమేజ్ను సంపాదించుకుంది. తాజాగా ఆమె క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తింది. రాజేశ్ కిన్ స్లిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘డ్రైవర్ జమున’ అనే పేరును ఖరారు చేశారు. గురువారం ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 18 రీల్స్ బ్యానర్‌పై ఎస్పీ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. తమిళంతో పాటు ఈ సినిమాను తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. -
ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ.. ఏకాంతంగా ఉండగా..
సాక్షి, సిటీబ్యూరో/నాగోలు: నగర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న కొలిపాక శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. హతురాలు అతడికి రెండో భార్య అని, ఆమె ప్రియుడితో గడపడానికి అంగీకరించినట్లు నటించి ఇద్దరినీ అంతం చేశాడని పోలీసులు తేల్చారు. ఏసీపీ కె.పురుషోత్తమ్‌రెడ్డితో కలిసి గురువారం డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ వివరాలు వెల్లడించారు. ఏడాది క్రితం నగరానికి వలసవచ్చి.. విజయవాడలోని పాయకాపురం సుందరయ్య కాలనీకి చెందిన కొలిపాక శ్రీనివాసరావు మొదటి భార్య ముగ్గురు పిల్లలు పుట్టిన అనంతరం అనారోగ్యంతో చనిపోయింది. దీంతో సత్యవతి అలియాస్ జ్యోతిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు తొమ్మిది, పదో తరగతి చదువుతున్నారు. ఐదుగురు సంతానంలో ఇద్దరికి వివాహాలు కాగా... మిగిలిన ముగ్గురూ విజయవాడలో నానమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఏడాది క్రితం బతుకుదెరువు నిమిత్తం శ్రీనివాసరావు తన భార్య జ్యోతితో కలిసి నగరానికి వలస వచ్చాడు. స్క్రాప్ వ్యాపారం చేస్తున్న ఇతడు ఆరు నెలలు పార్శిగుట్టలో ఉండి ఆపై వారాసిగూడకు మారాడు. నామాలగుండులో ఉంటున్న సమయంలో బౌద్ధనగర్‌కు చెందిన యడ్ల యశ్వంత్ అలియాస్ బన్నీతో జ్యోతికి పరిచయం ఏర్పడింది. గతంలో బన్నీ క్యాబ్ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఓ సందర్భంలో జ్యోతి అతడి క్యాబ్ బుక్ చేసుకోవడంతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ వినకపోవడంతో ‘వదిలించుకోవాలని’... వారి మధ్య వివాహేతర సంబంధం విషయం కొన్నాళ్ల క్రితమే శ్రీనివాసరావుకు తెలిసింది. మందలించినప్పటికీ జ్యోతి తన ప్రవర్తన మార్చుకోలేదు. కొన్ని సందర్భాల్లో ఇద్దరూ తన ఇంట్లోనే ఏకాంతంగా గడుపుతున్నారని తెలిసి శ్రీనివాసరావు ఆవేశంతో రగిలిపోయాడు. మాట వినని జ్యోతితో పాటు ఆమెను లోబర్చుకున్న బన్నీని అంతం చేయాలని నిర్ణయించుకుని సరైన సమయం కోసం వేచి చూశాడు. తొలుత జ్యోతిని తీసుకుని విజయవాడకు కాపురం మారిస్తే పరిస్థితులు సద్దుమణుగుతాయని భావించాడు. ఇదే విషయం ఆమెకు చెప్పిన శ్రీనివాసరావు గత వారమే సామాన్లు పంపేశాడు. ఆదివారం బైక్‌పై ఇద్దరూ విజయవాడ వెళ్లాల్సి ఉంది. ఆ సందర్భంలో జ్యోతి ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ శ్రీనివాసరావుతో చెప్పింది. ఇలాంటి సందర్బం కోసమే ఎదురు చూస్తున్న అతడు వెంటనే అంగీకరించి ఆమెతోనే బన్నీకి ఫోన్ చేయించి తన ఇంటికి రప్పించాడు. నగర శివార్లకు వెళ్లిన తర్వాత అనువైన ప్రాంతంలో ఇద్దరూ ఏకాంతంగా గడపాలని, ఆపై తాము విజయవాడ వెళ్లిపోతామని, నువ్వు వెనక్కు వచ్చేయమంటూ బన్నీకి చెప్పాడు. సుత్తితో కొట్టి, స్క్రూడ్రైవర్‌తో పొడిచి... దీంతో నామాలగుండు నుంచి శ్రీనివాసరావు, జ్యోతి ఒక వాహనంపై బన్నీ తన సోదరుడి వాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో మద్యం, బిర్యానీ ప్యాకెట్లు కొనుక్కున్నారు. అనంతరం ముగ్గురూ అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, కొత్తగూడెం గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కగా నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడి పొదల మధ్యలో శ్రీనివాసరావు మద్యం తాగుతుండగా... కాస్త దూరంలో జ్యోతి, బన్నీ ఏకాంతంగా గడుపుతున్నారు. ఇద్దరూ నగ్నంగా ఉన్న సమయంలో తన వాహనంలో నుంచి సుత్తి, స్క్రూడ్రైవర్ తీసుకుని వెళ్లి వారిపై దాడి చేశాడు. తేరుకునే లోపే ఇద్దరి తలపై కొట్టాడు. ఆపై స్క్రూడ్రైవర్‌తో విచక్షణారహితంగా పొడిచాడు. సమీపంలో ఉన్న రాయితో బలంగా మోది చంపేశాడు. అక్కడ నుంచి జ్యోతి సెల్‌ఫోన్ తీసుకుని తన వాహనంపై విజయవాడకు వెళ్లిపోయాడు. మంగళవారం ఈ హత్యలు వెలుగులోకి రావడంతో అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణాలో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ వి.స్వామి, ఎస్సై డి.కరుణాకర్‌రెడ్డి, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ బి.అంజిరెడ్డి నిందితుడిని గురువారం అరెస్టు చేశారు. ఇతడి నుంచి వాహనంతో పాటు హత్యకు వినియోగించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. -
అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసు: భర్త శ్రీనివాసే సూత్రధారి
సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జంట హత్యలు తీవ్ర కలకలం సృష్టించగా.. ఈ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఊహించినట్లుగానే వివాహేతర సంబంధం ఈ హత్యకు ప్రధాన కారణంగా తేలింది. జ్యోతి భర్త శ్రీనివాసరావే నిందితుడిగా గుర్తించారు. జ్యోతితో యశ్వంత్‌కు గత కొంతకాలం నుంచి వివాహేతర సంబంధం ఉండడంతో.. ఈ నేపథ్యంలోనే హత్య చేసినట్లు శ్రీనివాస్ పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్‌తో పాటు ఈ హత్యలో అతనికి నలుగురు సహకరించినట్లు సమాచారం. దీంతో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని వారాసిగూడ ప్రాంతానికి చెందిన యెడ్ల యశ్వంత్(22) క్యాబ్ డ్రైవర్‌గా పని చేసేవాడు. అతడికి అదే ప్రాంతానికి చెందిన జ్యోతి(28)అనే మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో.. కొత్తగూడెం గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశంలో వీళ్ల మృతదేహాలు నగ్నంగా పడి ఉండడం కలకలం రేపింది. యశ్వంత్ తలపై బలమైన గాయం కాగా, జ్యోతి తలపై బండరాయితో కొట్టి చంపినట్లు గుర్తులు ఉన్నాయి. వివాహేతర సంబంధమే వీరి హత్యకు కారణమై ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు.. ఆ దిశగానే క్లూస్ లభించడం విశేషం. ఇదిలా ఉంటే.. హత్యకు గురైన మహిళతో యశ్వంత్‌కు పరిచయం ఉన్న విషయం తెలియదని యశ్వంత్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సంబంధిత వార్త: హైదరాబాద్ శివారులో నగ్నంగా మృతదేహాలు! -
Crime News: నగ్నంగా మృతదేహాలు, వివాహేతర సంబంధమే కారణమా?
అబ్దుల్లాపూర్‌మెట్ : హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జంట హత్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని వారాసిగూడ ప్రాంతానికి చెందిన యెడ్ల యశ్వంత్(22) క్యాబ్ డ్రైవర్‌గా పని చేసేవాడు. అతడికి అదే ప్రాంతానికి చెందిన జ్యోతి(28)అనే మహిళతో పరిచయం ఉంది. కొత్తగూడెం గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి వచ్చిన వీరు హత్యకు గురై ఉంటారని భావించిన పోలీసులు క్లూస్‌టీంతో పలు ఆధారాలను సేకరించారు. మృతదేహాలు నగ్నంగా ఉండటం, యశ్వంత్ తలపై బలమైన గాయాలు ఉన్నాయి. జ్యోతి తలపై బండరాయితో కొట్టి చంపినట్లు గుర్తించారు. సంఘటన స్థలంలో చార్జింగ్‌లైట్లు.. సంఘటన స్థలంలో బ్యాగు, చార్జింగ్ లైట్లు, ప్లాస్టిక్‌పూలు, మొబైల్ చార్జర్‌తో పాటు కూల్‌డ్రింక్ సీసాలు లభ్యమయ్యాయి. సంఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే బైక్ పార్కింగ్ చేసి ఉంది. వివాహేతర సంబంధమే వీరి హత్యకు కారణమై ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. సంఘటనా స్థలాన్ని ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ వాసంస్వామి పరిశీలించారు. వివాహేతర సంబంధమే కారణమా? హత్యకు వివాహేతర సంబంధమే కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యశ్వంత్, జ్యోతి ఏకాంతంగా ఉన్న సమయంలోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది. తెలిసిన వారే వీరిని వెంబడిస్తూ వచ్చి హత్య చేశారా? అనే కోణంలో దర్యా ప్తు చేస్తున్నారు. జ్యోతి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మిస్సింగ్ కేసు నమోదు కాలేదు అబ్ధుల్లాపూర్‌మెట్ ఠాణా పరిధిలో దారుణహత్యకు గురైన ఎడ్ల యశ్వంత్ సంబంధించి ఎటువంటి మిస్సింగ్ కేసు నమోదు కాలేదని చిలకలగూడ సీఐ నరేష్ తెలిపారు. వారాసిగూడలోని మృతుడి తల్లితండ్రులు ఎడ్ల సురేష్, మంజుల మీడియాతో మాట్లాడుతూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసే యశ్వంత్ ఆదివారం ఇంటినుంచి బయటికి వెళ్లినట్లు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం పోలీసులు సమాచారం అందించడంతో యశ్వంత్ సోదరుడు ఘటనా స్థలానికి వెళ్లినట్లు తెలిపారు. ఆదివారం ఇంటి నుంచి వచ్చాడు ఈనెల 1 న సాయంత్రం నా బైక్ తీసుకుని మా అన్న యశ్వంత్ బయటికి వచ్చాడు. ఒక్కోసారి రెండు మూడు రోజుల వరకూ ఇంటికి రాడు. అలాగే ఎక్కడికైనా వెళ్లాడనుకున్నాం. పోలీసుల ద్వారా సమాచారం తెలిసి ఇక్కడికి వచ్చాం. మా అన్నకు ఎవరితో విభేదాలు లేవు. హత్యకు గురైన మహిళతో పరిచయం ఉన్న విషయం తెలియదు. – మృతుడి సోదరుడు అనిరుద్ -
ఒకప్పుడు మంత్రి.. ఇప్పుడేమో రోడ్ల మీద..!
అధికారంలో ఉన్నా.. అది పోయాక కూడా అంతే విలాసాలతో, హంగులతో బతికే నాయకులను చూస్తున్నాం. కానీ, అధికారం దూరం అయ్యాక.. సాదాసీదా జీవితం గడిపేవాళ్లు లేకపోలేరు. అయితే పరిస్థితుల మూలంగా అధికారానికి దూరమైన ఓ మంత్రి.. కుటుంబం కోసం రోడ్లపై క్యాబ్‌లు నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయనే.. ఆప్ఘానిస్థాన్ మాజీ ఆర్థిక మంత్రి ఖలీద్ పయేంద Khalid Payenda. తాలిబన్లు కిందటి ఏడాది అప్ఘనిస్థాన్ ఆక్రమణ కొనసాగిస్తున్న టైంలో.. ఖలీద్ పయేంద అమెరికాకు వెళ్లి తలదాచుకున్నారు. ప్రస్తుతం ఆయన వాషింగ్టన్లో ఉబెర్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. అంతేకాదు.. జార్జ్ టౌన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గానూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. అయితే ఆ వచ్చే జీతం చాలకనే.. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇలా రాత్రిళ్లు క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నారట ఆయన. తాజాగా.. ఆయన దుస్థితిపై వాషింగ్టన్ పోస్ట్ ఇంటర్వ్యూ ద్వారా ప్రపంచానికి తెలిసొచ్చింది. అష్రఫ్ ఘనీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు ఖలీద్ పయేంద. లెబనీస్ కంపెనీకి చెల్లింపుల విషయంలో ఆరోపణలు రావడంతో తనను అరెస్ట్ చేయిస్తారేమోనని ఆయన భయపడ్డాడట. అందుకే తాలిబన్లు ఆక్రమణ మొదలుపెట్టాక.. అమెరికాకు ఆయన పారిపోయారు. ‘‘నాకంటూ ఓ చోటు లేదు. నేను ఇక్కడి వాడిని కాదు. అక్కడి వాడిని కూడా కాదు. జీవితం శూన్యంగా కనిపిస్తోంది. అలాగని ఎవరిని నిందించాలని అనుకోవడం లేదు’’ అని అంటున్నారాయన. అఫ్గన్లను అమెరికా అనాధలుగా వదిలేసిందని, అలాగని ఇప్పుడు మళ్లీ సమిష్టిగా నిర్మించుకుందామనే సంకల్పం కూడా లేదన్నారు. ‘‘మేమంతా అవినీతిపై పేక ముక్కలతో ఇంటిని నిర్మించుకున్నాం. అందుకే అంత వేగంగా కుప్పకూలింది. బక్క పలుచగా ఉన్నా జనాల్ని.. ప్రభుత్వం దోచుకోవాలనే చూసింది. మా ప్రజలకు మేమే ద్రోహం చేశాం. చేసిన పాపం ఇవాళ మాకు ఈ బతుకుల్ని ఇచ్చింది’’ అని పయేంద్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. విశేషం ఏంటంటే.. ఖలీద్ పయేంద కుటుంబం ఆర్థికంగా బాగున్న కుటుంబమే ఒకప్పుడు. అఫ్గనిస్థాన్‌లో మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్సిటీ నెలకొల్పిన భాగస్వాముల్లో ఈయన కూడా ఉన్నారు. ఆయనకు ఈ పరిస్థితీ కొత్తేం కాదు. ఎందుకంటే.. అఫ్గనిస్థాన్‌లో అంతర్యుద్ధంతో తన 11 ఏళ్ల వయసు లో కుటుంబంతోపాటు పాక్‌కు వలస వెళ్లాడు ఆయన. తిరిగి అమెరికా దళాల ఎంట్రీతో.. సొంత గడ్డపై అడుగుపెట్టి, సంపాదించిన దాంతో యూనివర్సిటీలో పెట్టుబడి పెట్టారు. -
నాడు యువతి చేతిలో చెంప దెబ్బలు.. నేడు రాజకీయాల్లో ప్రవేశం
సాదత్ అలీ అనే క్యాబ్ డ్రైవర్.. గుర్తున్నాడా? ఈ ఏడాది జూలై 30న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ప్రియదర్శిని యాదవ్ అనే ఓ యువతి చేతిలో నడిరోడ్డుపై 22 చెంప దెబ్బలు తిన్నాడు. అప్పుడు ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే తాజాగా సాదత్ అలీ ఉత్తరప్రదేశ్ రాజీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. అయితే అలీ రాజకీయ పార్టీలో చేరికపై స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా అన్యాయంగా యువతుల చేతిలో తీవ్రమైన వేధింపులకు గురైన పురుషులకు కోసం తన గళాన్ని వినిపించడానికి రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. చదవండి: నీ కడుపుకోత తీర్చలేం.. ‘జై హింద్ మాజీ’ దాంతో పాటు క్యాబ్ డ్రైవర్లకు అండగా నిలుస్తానని చెప్పారు. చాలా చోట్ల పురుషులు కూడా వేధింపులకు గురవుతున్నారని చెప్పారు. అందుకు తనపై యువతి చేసిన దాడి ఘటన ఓ నిదర్శమని అన్నారు. ఆ ఘటనలో తనకు ఇంకా న్యాయం జరగలేదని, న్యాయం జరిగితే.. తనలా వేధింపులకు గురవుతున్న పురుషులకు అండగా నిలిచి, సాయం చేస్తామని తెలిపారు. ఇప్పటికీ సాదత్ అలీకి న్యాయం జరగలేదని.. అందుకోసమే ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో అడుగుపెట్టారని అలీ తరఫు లాయర్ మీడియాకు వెల్లడించారు. సాదల్ అలీ చేరిన ఈ పార్టీని మాజీ ముఖ్యమంత్రి ములయం సింగ్ యాదవ్ సోదరుడు శివ్‌పాల్ సింగ్ స్థాపించిన విషయం తెలిసిందే. నాడు యువతి చేతిలో చెంప దెబ్బలు తిన్న క్యాబ్ డ్రైవర్.. ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చాడని సోషల్ మీడియాలో చర్చసాగుతోంది. Ye lo pura video isme ladke ki galti hogi to batana pic.twitter.com/gumOCP6LAz — Neeraj Yadav 🇮🇳 (@thekingneeraj1) August 2, 2021