క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం.. కారు రివర్స్ తీస్తుండగా.. | Three year Girl Killed by Car as Driver Reversing in Hyderabad | Sakshi
Sakshi News home page

క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం.. కారు రివర్స్ తీస్తుండగా..

Published Tue, May 10 2022 7:54 AM | Last Updated on Tue, May 10 2022 8:05 AM

Three year Girl Killed by Car as Driver Reversing in Hyderabad - Sakshi

సిరి (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: కారు ఢీ కొని చిన్నారి మృతి చెందిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. నాచారం ఇన్‌స్పెక్టర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాఘవేంద్రనగర్‌ కాలనీకి చెందిన యాటల కరుణాకర్, రవళి దంపతుల కుమార్తె సిరి(03) ఆడుకునేందుకు మధ్యాహ్నం ఇంట్లోనుంచి బయటికి వచ్చింది.

అదే సమయంలో అటువైపు వచ్చిన క్యాబ్‌ రివర్స్‌ తీస్తుండగా చిన్నారి కారు కింద పడిపోయింది.  సిరి తలకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబసభ్యులు ఆమెను  గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ రాజీవన్‌కుమార్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: (ప్రేమపేరుతో బాలికను మహారాష్ట్ర తీసుకెళ్లి.. గది అద్దెకు తీసుకుని..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement