Girl died
-
చిరుతపులి దాడి.. మరో చిన్నారి మృతి
లక్నో: చిరుతపులి దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పశుగ్రాసం తీసుకొచ్చేందుకు తల్లితో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లిన బాలికపై.. చిరుత ఒక్కసారిగా దాడి చేసి.. ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో శుక్రవారం జరిగింది. నహ్తౌర్ ప్రాంతంలోని మల్కాపూర్ గ్రామానికి తాన్య(8) అనే చిన్నారి పశుగ్రాసం సేకరించేందుకు తల్లితో కలిసి ఉదయం 8 గంటల సమయంలో సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లింది.అయితే అదే సమయంలో చిరుత ఒక్కసారిగా బాలికపై దాడి చేసి.. తాన్యను రోడ్డుపై నుంచి ఈడ్చుకెళ్లింది. వెంటనే చిన్నారి తల్లి, ఇతర గ్రామస్థులు కర్రలతో చిరుతను వెంబడించారు. దీంతో భయపడిన చిరుత.. చిన్నారిని వదిలి వెళ్లిపోయింది. బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె తీవ్ర గాయాలతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపినట్లు నహ్తౌర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ధీరజ్ సింగ్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చిరుతపులిని గుర్తించడానికి కెమెరా ట్రాప్లను, థర్మల్ డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు ఫారెస్ట్ డివిజన్ అధికారి పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా ఇటీవల చిరుత దాడిలో యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
ఈత సరదా ప్రాణం తీసింది
వైఎస్సార్: లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో ఈత నేర్చుకోవాలని చిన్నారి సరదా పడగా... ప్రమాదవశాత్తూ ఆమె ప్రాణం తీసింది. స్థానికుల వివరాల మేరకు.. తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన తోట రవీంద్రారెడ్డి, మంజుల దంపతుల కుమార్తె మహిత(12) బుధవారం గ్రామంలోని చెరువులో ఈత నేర్చుకునేందుకు తోటి పిల్లలతో కలిసి వెళ్లింది.నడుముకు ఖాళీ క్యాన్ కట్టుకుని చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. ఆ సమయంలో నడుముకు ఉన్న క్యాన్ ఊడిపోయింది. అక్కడున్న పిల్లలు, పెద్దలు చూస్తుండగానే భయానికి గురైన మహిత నీటిలో మునగగానే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
కారు డోరులో తల ఇరుక్కొని బాలిక మృతి
నల్గొండ: కారు డోరులో తల ఇరుక్కొని బాలిక మృతిచెందిన ఘటన మండలంలోని బొజ్జగూడెం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొజ్జగూడెం గ్రామానికి చెందిన భూక్యా కోట్యా కుమార్తె వివాహం సోమవారం జరిగింది. వివాహం అనంతరం నూతన వధూవరులు కారులో వెళ్తుండగా వారితో పాటు కారు వెనుక సీటులో బానోతు వెంకటేశ్వర్లు కుమార్తె ఇంద్రజ(9) కూర్చుంది. ఈ క్రమంలో ఇంద్రజ కారు డోరులోంచి తల బయట పెట్టి డ్యాన్స్ చేస్తుండగా డ్రైవర్ శేఖర్ అద్దం పైకి లేపడంతో ఊపిరాడక చనిపోయింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
కాకినాడలో విషాదం.. కారులో ఊపిరాడక చిన్నారి మృతి
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంకలో విషాదం చోటుచేసుకుంది. పార్క్ చేసి ఉంచిన కారులో ఆడుకునేందుకు వెళ్లిన పాప.. అందులోనే మృత్యువాతపడింది. కారు డోర్లు లాక్ అవడం.. ఎవరూ గమనించకపోవడంతో ఈ ఘోరం జరిగింది. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలిక అఖిలాండేశ్వరి.. దగ్గరల్లో పార్క్ చేసిన కారులోకి వెళ్లి డోర్ వేసుకుంది. మళ్లీ డోర్ లాక్ తీయరాకపోవడంతో ఊపిరి ఆడక ఇబ్బంది పడింది. ఈ క్రమంలో కారులో గాలి అందకపోవడంతో చిన్నారి స్పృహ కోల్పోయింది. మధ్యాహ్నం కారులోకి వెళ్లిన పాప సాయంత్రం వరకు అందులోనే ఉండిపోయింది. కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కలా మొత్తం గాలించారు. చివరికి ఇంటి పక్కన కారులో కొన ఊపిరితో బాలికను గుర్తించిన స్థానికులు హుటాహుటిన యానాం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇదిలా ఉండగా ఏడాది క్రితమే బాలిక తండ్రి మరణించగా.. బాలికతో పాటు, పదేళ్ల కొడుకును పాచి పనులు చేసుకుంటూ తల్లి ఆదిలక్ష్మి పోషించుకుంటోంది. తాజాగా కూతురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చదవండి: ప్రమాదవశాత్తు మరుగుతున్న రసంలో పడి యువకుడు మృతి -
ఢిల్లీలో ఘోరం: నడిరోడ్డుపై నగ్నంగా యువతి మృతదేహం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కొత్త ఏడాది తొలిరోజే ఓ యువతి దారుణంగా హింసకు గురై ప్రాణాలు కోల్పోయింది. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో తప్పతాగిన ఐదుగురు దుండగులు బాధితురాలి స్కూటర్‌ను ఢీకొట్టడంతో పాటు ఆమెను నాలుగు కిలోమీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. శరీరంపై నూలుపోగు కూడా లేకుండా రోడ్డుపై పడి ఉన్న ఆ యువతి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఈ దారుణ సంఘటన ఢిల్లీ సుల్తాన్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలు ఆదివారం తెల్లవారుజామున తన స్కూటర్‌పై వెళ్తోంది. ఆమె స్కూటర్‌ను ఓ కారు ఢీకొట్టింది. ఈ క్రమంలోనే ఆమె డ్రెస్ కారు టైరులో చిక్కుకుంది. స్కూటర్‌ను ఢీకొట్టినప్పటికీ ఆగకుండా కారును ముందుకు నడిపారు. టైరులో డ్రెస్ చిక్కుకోవడంతో సుమారు 4 కిలోమీటర్లు ఆ బాధితురాలిని ఈడ్చుకెళ్లారు. దీంతో తీవ్రగాయాలపై ఆ యువతి మృతి చెందింది. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా యువతి మృతదేహం కనిపించటం కలకలం సృష్టించింది. రోడ్డుపై నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహాన్ని చూసి ముందుగా హత్యాచారంగా భావించారు. కానీ, రోడ్డు ప్రమాదం కారణంగా ఆమెను కారు వెనకాల ఈడ్చుకెళ్లడం ద్వారా మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 3.24 గంటలకు రోడ్డుపై మృతదేహం సమచారం అందినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ‘ఓ మహిళ మృతదేహాన్ని బలెనో కారుకు కట్టి ఈడ్చుకెళ్తున్నారని ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. కంఝవాలా పోలీస్ స్టేషన్ బృందం ఈ విషయంపై ఆ కాలర్‌కు తిరిగి పలు మార్లు ఫోన్ చేశారు. ఆ తర్వాత బలెనో కారును ఆ వ్యక్తి గుర్తించాడు.’ అని తెలిపారు. ఫోన్ రాగానే పోలీసు బృందం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది. రోహిణి జిల్లా క్రైమ్ టీం సైతం అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఎస్జీఎం ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆ తర్వాత కారును పట్టుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలోనే సుల్తాన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్ జరిగినట్లు వారు తెలిపారు. మహిళా కమిషన్ నోటీసులు యువతిని ఈడ్చుకెళ్లి మృతి చెందేందుకు కారణమైన ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కేసులో నిజానిజాలు తేల్చి పూర్తి వివరాలు సమర్పించాలని ఢిల్లీ పోలీసులకు నోటీసులు ఇచ్చారు మహిళా కమిషన్ ఛైర్పర్సన్ శ్వాతి మాలివాల్. ‘ఢిల్లీ కంఘావాలా ప్రాంతంలో ఓ యువతి మృతదేహం నగ్నంగా పడి ఉంది. కొందరు యువకులు తప్పతాగి ఆమె స్కూటర్‌ను ఢీకొట్టడంతో పాటు ఆమెను పలు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. ఈ సంఘటన చాలా ప్రమాదకరమైనది. ఢిల్లీ పోలీసులకు సమన్లు జారీ చేస్తున్నా.’అని ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: చైనాలో తమిళనాడు యువకుడు మృతి.. సాయం కోసం కుటుంబం వేడుకోలు -
ఛార్జింగ్‌లో ఉన్న మొబైల్ తీస్తుండగా షాక్ తగిలి చిన్నారి మృతి
సాక్షి, గద్వాల్: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఛార్జింగ్‌లో ఉన్న మొబైల్ ఫోన్ తీస్తుండగా షాక్ తగిలి నిహారిక అనే చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. అయిజ మండలం ఈడిగొనిపల్లి గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. కాగా పదేళ్ల నిహారిక 4వ తరగతి చదువుతుంది. కూతురు అకస్మిక మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ పరికరాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. సెల్ఫోన్లు, ఈ-వాహనాలు పేలుతున్న ఘటనలు అధికంగా జరుగుతున్నాయి. కొన్ని సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడవద్దని, పిల్లలను వీటికి దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: మల్లారెడ్డి ఆదాయాలపై ఐటీ విచారణ: 13 మంది హాజరు.. మరో 10 మందికి నోటీసులు -
వైద్యుల నిర్లక్ష్యానికి యువ క్రీడాకారిణి బలి
చెన్నై: ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ యువ క్రీడాకారిణి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని పెరియార్ నగర్ గవర్నమెంట్ పెరిఫెరల్ హాస్పిటల్లో చోటుచేసుకుంది. వ్యాసర్పాడికి చెందిన ఆర్.ప్రియ(17) బీఎస్సీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫస్టియర్ చదువుతోంది. ఫుట్‌బాల్ క్రీడాకారిణి అయిన ప్రియ కుడి మోకాలి లిగమెంట్ దెబ్బతింది. దీంతో ఆమె పెరియార్ నగర్ గవర్నమెంట్ పెరిఫెరల్ హాస్పిటల్‌కు వెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఈ నెల 7న మోకాలికి ఆపరేషన్ చేసి, కంప్రెషన్ బ్యాండేజీ వేశారు. బ్యాండేజీ గట్టిగా వేయడంతో లోపల రక్త స్రావం అయి గడ్డకట్టి, మిగతా కాలికి సరిగ్గా రక్త ప్రసరణ జరలేదు. వైద్యులు గమనించకపోవడంతో పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను రాజీవ్‌గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (ఆర్జీజీజీహెచ్) రెఫర్ చేశారు. వైద్యులు ఈనెల 8న ఆమె కుడి కాలిని తొలగించారు. ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స కొనసాగుతుండగానే కిడ్నీలు, లివర్, గుండె విఫలమై మంగళవారం ప్రియ తుదిశ్వాస విడిచిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ చెప్పారు. నిర్లక్ష్యం వహించిన గవర్నమెంట్ పెరిఫెరల్ హాస్పిటల్‌కు చెందిన ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేశామన్నారు. ప్రియ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారంతోపాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఇదీ చదవండి: నా కూతుర్నే పార్టీ మారమన్నారు: సీఎం కేసీఆర్ -
ఘోరం.. వీధికుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి మృతి..
భోపాల్: మధ్యప్రదేశ్ ఖర్గోన్లో ఘోరం జరిగింది. వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బకావా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. చిన్నారి కిరాణ దుకాణానికి వెళ్లే సమయంలో వీధిలోని అరడజనుకు పైగా శునకాలు ఆమెపై దాడి చేశాయి. మెడ, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్రగాయాలు చేశాయి. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. పాప అరుపులు కేకలు విని స్థానికులు వచ్చి కుక్కలను చెదరగొట్టారు. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ చిన్నారి సోనియా ప్రాణాలు కోల్పోయింది. ఆమె తండ్రి రోజూకూలీగా పనిచేస్తున్నాడు. తాను పని మీద బయటకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని రోదించాడు. చదవండి: స్నేహితుడిని బెదిరించి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై గ్యాంగ్ రేప్ -
హిజాబ్ హీట్: పాఠశాలలో పోలీసుల లాఠీఛార్జ్.. 15ఏళ్ల బాలిక మృతి
టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. 22 ఏళ్ల మహ్సా అమిని అనే యువతి పోలీసు కస్టడీలో కన్నుమూయడంతో ఇరాన్ అంతటా నిరసన జ్వాలలు చెలరేగిన విషయం తెలిసిందే. మహిళలు జట్టు కత్తిరించి.. హిజాబ్‌లు తగలబెట్టి తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. మరోవైపు.. హిజాబ్ ఆందోళనకారులను అణచివేసేందుకు భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ క్రమంలో మరో బాలిక పోలీసుల చేతిలో బలైపోయింది. పాఠశాలలో తనిఖీలు చేపట్టిన పోలీసులు విద్యార్థినులను తీవ్రంగా కొట్టటం వల్ల మృతి చెందినట్లు ద గార్డియన్ మీడియా వెల్లడించింది. దీంతో ఇరాన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థినులు రోడ్లపైకి వచ్చి హిజాబ్‌లు తొలగించి నిరసనలు చేపట్టారు. అక్టోబర్ 13న అర్దాబిల్లోని షహేద్ గర్ల్స్ హైస్కూల్లో భద్రతా దళాలు తనిఖీలు చేశాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ అనుకూల గీతం ఆలపించాలని కోరగా అందుకు నిరాకరించారు విద్యార్థులు. దీంతో స్కూల్ విద్యార్థులపై విచక్షణారహితంగా పోలీసులు దాడి చేశారని, ఈ దాడిలో చాలా మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు ద గార్డియన్ పేర్కొంది. ఈ దాడిలోనే గాయపడిన 15 ఏళ్ల అస్రా పనాహి అనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. అయితే, భద్రతా దళాలు కొట్టటం వల్లే బాలిక మృతి చెందిందన్న వార్తలను ఇరాన్ అధికారులు ఖండించారు. ఈ క్రమంలోనే పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతోనే మరణించినట్లు బాలిక బంధువు ఒకరు తెలపటం గమనార్హం. గత శుక్రవారం పనాహి మృతి చెందిన క్రమంలో టీచర్స్ యూనియన్.. సెక్యూరిటీ బలగాల అమానవీయ, క్రూరమైన దాడులను ఖండించింది. ఇరాన్ విద్యాశాఖ మంత్రి యూసఫ్ నౌరీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పోలీసుల దాడిలో మొత్తం ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మరోవైపు.. దేశవ్యాప్తంగా బలగాల దాడుల్లో 23 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్లు మానవ హక్కుల కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. “Death to the dictator!” School girls waving forced-hijabs, chanting in the streets of Sanandaj. Oct 17 #Mahsa_Amini #مهسا_امینی pic.twitter.com/CggC37eVy9 — IranHumanRights.org (@ICHRI) October 17, 2022 ఇదీ చదవండి: హిజాబ్ నిరసనలకు కారణమైన ‘యువతి’ మరణంలో ట్విస్ట్! -
గుండెల నిండా దుఃఖం.. భుజంపై మేనకోడలి మృతదేహంతో..!
భోపాల్: కనీస మౌలిక సదుపాయలు అందక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్న హృదయవిదారక సంఘటనలు దేశంలో ఏదో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ద్విచక్రవాహనంపై, తోపుడు బండిపై, భుజాలపై మృతదేహాలను మోసుకుంటూ వెళ్లిన సంఘటనలు కలిచివేస్తున్నాయి. అలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని రద్దీ రోడ్డులో ఓ వ్యక్తి తన భుజాలపై మోసుకుటూ బస్టాప్‌కు వెళ్లారు. అందరితో పాటే బస్సులో మృతదేహాన్ని స్వగ్రామం చేర్చారు. ఈ హృదయవిదారక సంఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నాలుగేళ్ల చిన్నారి స్వగ్రామంలో ప్రమాదవశాత్తు మృతి చెందింది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఛాతర్పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానీ, మృతదేహాన్ని తిరిగి ఇంటికి చేర్చేందుకు ఆసుపత్రిలో వాహనం లేదు. ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. దీంతో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు దుఃఖంలో ఉన్న ఆమె మేనమామ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. బస్టాప్ వరకు తన భుజాలపై మోసుకెళ్లాడు. రద్దీగా ఉన్న బస్‌లోనే మృతదేహంతో ఎక్కాడు. అయితే, ఆయన వద్ద బస్సు టికెట్ కొనేందుకు సైతం డబ్బులు లేకపోవటం అందరిని కలచివేసింది. మరో ప్రయాణికుడు టికెట్ కొనిచ్చాడు. ఆసుపత్రి నుంచి మృతదేహాలను తరలించేందుకు పట్టణాభివృద్ధి విభాగం ఏర్పాట్లు చేయాలని చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ లఖన్ తివారీ తెలిపారు. ఇలాంటి వాటిలోకి ఆసుపత్రి, వైద్యులను లాగొద్దని కోరారు. నాలుగు నెలల క్రితం సైతం ఛతార్పుర్ జిల్లాలో ఇలాగే నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు భుజాలపై మోసుకెళ్లారు. దీంతో జిల్లాలో సదుపాయలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. బుధవారమే సింగ్రౌలి జిల్లాలో శిశువును బైక్ సైడ్ బాక్సులో తీసుకెళ్లటం సంచలనంగా మారింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. A man carried the body of his four-year-old niece on his shoulders and took a bus to his village because he could not get a hearse from a hospital, This comes nearly four months after a four-year-old girl's body was carried by her family on their shoulders. Both in Chhatarpur. pic.twitter.com/NXZUNODqUT — Anurag Dwary (@Anurag_Dwary) October 20, 2022 ఇదీ చదవండి: 75వేల మంది యువతకు ప్రధాని మోదీ దివాళీ గిఫ్ట్ -
కెరీర్‌కు అడ్డుగా ఉందని కన్న కూతురును నాల్గో అంతస్తు నుంచి విసిరేసిన కన్న తల్లి
-
బెంగళూరు: ఎంత ఘోరం.. నాలుగో అంతస్తు నుంచి చిన్నారిని పడేసిన తల్లి!
-
నాలుగో అంతస్తు నుంచి చిన్నారిని పడేసిన తల్లి!
బెంగళూరు: బిడ్డకు చిన్న దెబ్బతగిలితేనే అల్లాడిపోతుంది తల్లి. కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కానీ, ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. నాలుగేళ్ల కుమార్తెను నాలుగో అంతస్తు నుంచి కింద పడేసి హత్య చేసింది. బెంగళూరులో జరిగిన ఈ అమానుష సంఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. పాపను కింద పడేసిన తర్వాత ఆమె సైతం కింద దూకేందుకు బాల్కనీ రెయిలింగ్ ఎక్కి కాసేపు నిలబడింది. గమనించిన కుటుంబ సభ్యులు పరుగున వచ్చి ఆమెను వెనక్కి లాగారు. కింద పడిన పాప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర బెంగళూరు ఎస్ఆర్ నగర్‌లోని అపార్ట్మెంట్లో ఈ ఘటన గురువారం జరిగినట్లు పేర్కొన్నారు. నాలుగేళ్ల చిన్నారి మాట్లాడలేదని, చెవులు సైతం వినబడవని తెలిపారు. దాంతో ఆ మహిళ మానసిక ఒత్తిడికి లోనైనట్లు చెప్పారు. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో నిందితురాలిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆమె ఒక డెంటిస్ట్ కాగా.. భర్త సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూడా. ‘తల్లి మానసిక పరిస్థితి సహా మేము అన్ని కోణాల్లో విచారిస్తున్నాము.’ అని పేర్కొన్నారు. A woman was arrested in #Bengaluru for killing her four-year-old mentally challenged daughter by throwing her from the fourth floor of a building, police said. pic.twitter.com/S96GaVblxx — IANS (@ians_india) August 5, 2022 ఇదీ చదవండి: ఎన్నేళ్ల నాటి పగ ఇది.. పాము కాటుకు కుటుంబంలో ఇద్దరు మృతి -
HYD: మిస్టరీగా చిన్నారి మృతి.. ఆటోడ్రైవర్ ఫోన్ కాల్ కీలకం!
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్లో బాలిక మృతి కేసులో మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. బిల్డింగ్‌పై నుంచి కిందపడి ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. మధురానగర్‌లో నివాసం ఉంటున్న సత్యనారాయణ రెడ్డి రెండో కూతురు వర్షిత(9) కిరాణా షాపునకు వెళ్తున్నానంటూ తల్లికి చెప్పి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆటోలో చంద్రపురి కాలనీలోని ఓ బిల్డింగ్ వద్దకు వచ్చింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ ఫోన్ నుండి గుర్తుతెలియని వ్యక్తికి ఫోన్ చేసింది. అనంతరం,ఐదు నిమిషాల సమయంలో వర్షిత.. బిల్డింగ్ పైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందింది. కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక, చిన్నారి అసలు.. బిల్డింగ్ లోకి ఎందుకు వెళ్లింది? ఎవరికి కాల్ చేసింది? ఎలా పడిపోయింది? పాప మృతిలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు.. వర్షితది హాత్యా? లేక ప్రమాదమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. భవనంలో ఉన్న వారిని పోలీసులు విచారిస్తున్నారు. సీసీ ఫుటేజీని సైతం పరిశీలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ప్లైఓవర్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య -
కరీంనగర్: పెళ్లైన 15 ఏళ్లకు పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ.. యువకుల ‘మత్తు’కు బలి
-
పెళ్లైన 15 ఏళ్లకు పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ.. యువకుల ‘మత్తు’కు బలి
ఆ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క బిడ్డ. పెళ్లయిన పదిహేనేళ్లకు పుట్టింది. ఆ బిడ్డకోసం మొక్కని దేవుడు, చేయని పూజలు లేవు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ చిన్నారే ఆ తల్లిదండ్రులకు లోకం. పాపే ప్రాణంగా బతుకుతున్న వారిపై దేవుడు చిన్నచూపు చూశాడు. ముగ్గురు యువకుల మద్యం మత్తు క్రీడకు అభం.. శుభం తెలియని చిన్నారి బలైంది. రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తున్న బాలికను వెనకనుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో ఎగిరిపడింది. తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలింది. తిమ్మాపూర్(మానకొండూర్):పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. లోకిని జంపయ్య– రాజేశ్వరీ దంపతులది సొంతూరు ఇందుర్తి. వీరికి కూతురు శివాని(10) ఉంది. పెళ్లయిన పదిహేనేళ్లకు పుట్టింది. బతుకుదెరువు కోసం తిమ్మాపూర్ వచ్చారు. స్టేజీవద్ద అద్దెకు ఉంటున్నారు. జంపయ్య కూలీపని, రాజేశ్వరి సమీపంలోని ఓ మొబైల్ క్యాంటీన్లో పనిచేస్తుంటుంది. శివాని శుక్రవారం మధ్యాహ్నం తల్లివద్దకు రోడ్డువెంట నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో అలుగునూరు నుంచి తిమ్మాపూర్‌కు వస్తున్న ఇదే గ్రామానికి చెందిన అట్ల సంతోశ్, శ్రీధర్, డేవిడ్ మద్యంమత్తులో కారుతో శివానిని వెనకనుంచి వేగంగా ఢీకొట్టారు. తర్వాత కారు సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. స్తంభం విరిగి పోయింది. బాలికను ఆస్పత్రికి తరలిస్తుండగా చని యింది. కారు నడిపిన సంతోశ్, డేవిడ్ పరారయ్యారు. శ్రీధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యంమత్తు, ఓవర్‌స్పీడే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. ప్రమాదం తరువాత కూడా నిందితులు సమీపంలోని మద్యం దుకాణంలో మద్యం తాగినట్లు స్థానికులు చెబుతున్నారు. కారు నడిపిన సంతోశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రమోద్‌రెడ్డి తెలిపారు. చదవండి: వర్కర్‌పై కర్కశత్వం.. రెండేళ్లుగా చిత్రహింసలు.. బెల్టుతో.. -
క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం.. కారు రివర్స్ తీస్తుండగా..
సాక్షి, హైదరాబాద్: కారు ఢీ కొని చిన్నారి మృతి చెందిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. నాచారం ఇన్స్పెక్టర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన యాటల కరుణాకర్, రవళి దంపతుల కుమార్తె సిరి(03) ఆడుకునేందుకు మధ్యాహ్నం ఇంట్లోనుంచి బయటికి వచ్చింది. అదే సమయంలో అటువైపు వచ్చిన క్యాబ్ రివర్స్ తీస్తుండగా చిన్నారి కారు కింద పడిపోయింది. సిరి తలకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబసభ్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ రాజీవన్‌కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ప్రేమపేరుతో బాలికను మహారాష్ట్ర తీసుకెళ్లి.. గది అద్దెకు తీసుకుని..) -
కస్తూర్బా పాఠశాలలో బాలిక మృతి.. ఉదయం టిఫిన్ తిన్న తర్వాత
సాక్షి, నిజామాబాద్: గరిడేపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో సోమవారం విద్యార్థిని మృతిచెందింది. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సోమ్లాతండా గ్రామానికి చెందిన గుగులోతు చంద్రు, లలిత దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక కుమారుడు ఉన్నారు. రెండో కుమార్తె దివ్య(14) గరిడేపల్లిలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో 8వ తరగతి చదువుతుంది. రోజుమాదిరిగా సోమవారం ఉదయం టిఫిన్ తిన్న తర్వాత దివ్య ఒక్కసారిగా కింద పడిపోయింది. విధుల్లో ఉన్న ఏఎన్ఎం ఇందిర, పీఈటీ ధనమ్మలు వెంటనే దివ్య తల్లిదండ్రులకు సమాచారం అందించి, చికిత్స నిమిత్తం దగ్గరలోని ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బైక్‌పై తీసుకెళ్లగా అప్పటికీ ఇంకా తెరువలేదు. దీంతో అంబులెన్స్‌కు ఫోన్ చేసి హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే దివ్య మృతిచెందినట్లు ధ్రువీకరించారు. కాగా ఆదివారం సెలవు కావటంతో దివ్య తండ్రి చంద్రు పాఠశాలకు వచ్చి కుమార్తెని చూసి తన వెంట తెచ్చిన మిక్చర్(కారా) ఇచ్చి వెళ్లినట్లు తోటి విద్యార్థినులు తెలిపారు. ఉదయం దివ్య తండ్రి తెచ్చిన మిక్చర్ తిన్న అనంతరం కొద్దిసేపటికి ఈ సంఘటన జరిగినట్లు విద్యార్థినులు చెప్పారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖాధికారి అశోక్, ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్‌గౌడ్, తహసీల్దార్ కార్తీక్, మండల విద్యాధికారి చత్రునాయక్, ఎంపీఓ లావణ్య పాఠశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దివ్య చనిపోయిన విషయంపై సిబ్బందిని, విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పజెప్పారు. చదవండి: పిల్లలు పెద్దయ్యారు.. సఖ్యతగా మెలగడం కుదరదని చెప్పినా వినకపోవడంతో ఈ విషయంపై కస్తూర్బా పాఠశాల నిర్వాహకురాలు శైలజ మాట్లాడుతూ.. దివ్య కళ్లు తిరిగి పడిపోయిన వెంటనే హాస్టల్లో ఉన్న సిబ్బంది వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి, విద్యార్థిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా తీయకపోవడంతో హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అప్పటికే దివ్య చనిపోయినట్లు వైద్యులు తెలిపారని, ఆకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చని అభిప్రాయాలను వైద్యులు వ్యక్తం చేసినట్లు ఆమె చెప్పారు. అంతకుముందు దివ్యకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఆమె తెలిపారు. చదవండి: మరణించిన టీచర్ పేరుతో రూ.33 లక్షలు డ్రా... కొడుక్కి విషయం తెలియడంతో.. -
వికటించిన వైద్యం: శరీరం పూర్తిగా కాలిపోయి బాలిక మృతి
సాక్షి, తిరువళ్లూరు: వైద్యం వికటించడంతో శరీరం పూర్తిగా కాలిపోయి బాలిక మృతి చెందిన ఘటన తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎంజీఆర్ నగర్‌కు చెందిన కుమార్‌కు లక్షిత(07) అనే కుమార్తె ఉంది. గతనెల 27న లక్షిత అనారోగ్యానికి గురవడంతో సమీపంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చిక్సిత చేయించారు. వైద్యులు ఇచ్చిన మందులను వాడిన రెండు రోజుల్లోనే బాలిక శరీరంపై బొబ్బలు రావడంతో తల్లిదండ్రులు మళ్లీ అదే వైద్యశాలకు తీసుకెళ్లారు. చదవండి: (తల్లీకొడుకును బలిగొన్న బజ్జీలు) అయితే ఇక్కడ వైద్యం చేయలేమని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లాలని సూచించినట్టు తెలుస్తుంది. దీంతో బాలికను పొన్నేరి వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చిక్సిత అందించిన తరువాత చెన్నై ఎగ్మూర్‌లో ఉన్న చిన్నపిల్లల వైద్యశాలకు తరలించారు. అక్కడ బాలిక చిక్సిత పొందుతూ మంగళవారం మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన బంధువులు ప్రైవేటు వైద్యశాల వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఆస్పత్రిపై రాళ్లు రువ్వి వీరంగం సృష్టించారు. పోలీసు లు బాలిక బంధువులతో చర్చించి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం వైద్యశాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: (విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి) -
11 ఏళ్ల బాలిక ప్రాణాలు తీసిన తామరపూలు
సదుం: నీటికుంటలో పడి బాలిక మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా సదుం మండలంలో చోటుచేసుకుంది. కేవీపల్లె మండలం గర్నిమిట్టకు చెందిన గంగాదేవి, రెడ్డెప్ప కుమార్తె మల్లీశ్వరి (11) మండలంలో తుమ్మగుంటపల్లెలోని అమ్మమ్మ కృష్ణమ్మ వద్ద ఉంటోంది. శుక్రవారం ఉదయం కట్టెల కోసం స్నేహితులతో కలిసి వెళ్లి ఆ బాలిక గ్రామ సమీపంలోని గునానికుంటలో ఉన్న తామర పూలను చూసి ముచ్చటపడింది. వాటిని కోసేందుకు కుంటలోకి దిగింది. పూలవద్దకు వెళ్తూ కుంట లోతుగా ఉండడంతో మునిగిపోయింది. స్నేహితులు ఇది చూసి గ్రామంలోకి పరుగులు తీసి సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు కుంట వద్దకు చేరుకుని గాలించారు. అప్పటి మల్లీశ్వరి మృతి చెందింది. మృతదేహాన్ని వెలికితీశారు. -
తీవ్ర విషాదం: గుక్కెడు నీళ్లు దొరక్క దాహార్తితో..
జైపూర్: గ్రామానికి అమ్మమ్మతో నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారి దాహంతో అలమటించి అలమటించి చివరకు మృత్యు ఒడికి చేరింది. ఈ విషాద ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. గుక్కెడు నీళ్లు దొరక్క చిన్నారి కన్నుమూయడం తీవ్ర విషాదం నింపింది. అయితే ఆ అవ్వ కూడా దాహంతో అల్లాడి స్పృహ తప్పి పడిపోయింది. అటుగా వెళ్లేవారు గుర్తించి సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి అవ్వకు నీళ్లు తాగించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయ్‌పూర్‌లోని రాణివాడ తాలుక రోడ గ్రామానికి చెందిన సుఖిదేవి భిల్ (60), ఐదేళ్ల మనమరాలు ఆదివారం గ్రామానికి నడుచుకుంటూ బయల్దేరారు. రాయిపూర్ నుంచి నడుచుకుంటూ 15 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి వెళ్తున్నారు. ఆ సమయంలో ఎండ తీవ్రంగా ఉంది. నడిచి నడిచి అలసిపోయారు. దాహం వేస్తున్నా ఎక్కడా నీళ్లు లభించలేదు. దీంతో వారిద్దరూ మార్గమధ్యలో కుప్పకూలిపోయారు. దాహార్తితో పాప నీరసించిపోయి మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అవ్వకు నీళ్లు తాపించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌లో ఎండలు అధికంగా ఉంటాయి. పాప నీళ్లు లేక మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది. చదవండి: లాక్‌డౌన్‌తో ఛాన్స్‌ల్లేక నటుడు ఆత్మహత్యాయత్నం నీళ్లు తాగిస్తున్న పోలీసులు -
హారిక మృతి కేసు: విచారణ.. రూ.25 లక్షలు డిమాండ్
వంగర: శ్రీకాకుళం జిల్లా వంగర మండల పరిధి నీలయ్యవలస సమీపంలో బేతిన్ గ్రానైట్ క్వారీ ప్రదేశాన్ని పాలకొండ ఆర్డీవో టి.వి.ఎస్.జి.కుమార్, డీఎస్పీ మల్లంపాటి శ్రావణి గురువారం పరిశీలించారు. ఈ నెల 1వ తేదీన దుస్తులు ఉతికేందుకు తల్లి తొగరాపు సంతోషికుమారితో వెళ్లిన కుమార్తె హారిక క్వారీ గొయ్యిలో పడి మృతిచెందిన విషయం పాఠకులకు విదితమే. ఈ ఘటనపై సమగ్ర సమాచారం సేకరణకు క్వారీ ప్రదేశాన్ని అధికారులు పరిశీలించారు. క్వారీ లీజు సమయం, నిర్వహణ కాలం, ఎప్పటి నుంచి మూసివేశారు, హెచ్చరిక బోర్డులు, రక్షణ కంచెలు వంటివి తనిఖీ చేశారు. క్వారీకి సంబంధించి సమగ్ర సమాచారంపై నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ డి.ఐజాక్‌ను ఆర్డీవో ఆదేశించారు. ఘటనకు సంబంధించిన అంశాలపై డీఎస్పీ ఆరా తీశారు. రాజాం రూరల్ సీఐ డి.నవీన్‌కుమార్, ఎస్సై సంచాన చిరంజీవి, రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. (చదవండి: ‘నా కలల హారికా.. లేమ్మా..!’ కన్నీరు పెట్టిస్తున్న తండ్రి రోదన) రూ.25 లక్షలు చెల్లించాలి.. హారిక కుటుంబానికి క్వారీ యాజమాన్యం రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కరణం సుదర్శనరావుతోపాటు సర్పంచ్ ప్రతినిధి చింతగుంట రామారావు, పలు పార్టీలకు చెందిన నాయకులు బెజ్జిపురం రవి, ఉత్తరావెల్లి మోహనరావు, మజ్జి గణపతిరావు డిమాండ్ చేశారు. హారిక కుటుంబ సభ్యులను క్వారీ యాజమాన్య ప్రతినిధులు కనీసం ఓదార్చలేదని, ఇప్పటివరకు పరామర్శించలేదని మండిపడ్డారు. క్వారీ గుంత వద్ద హారిక మృతదేహం వద్ద రోదిస్తున్న తండ్రి, కుటుంబసభ్యులు (ఫైల్) -
‘నా కలల హారికా.. లేమ్మా..!’ కన్నీరు పెట్టిస్తున్న తండ్రి రోదన
ఆ తండ్రికి కుమార్తె అంటే పంచప్రాణాలు. అందుకే ఏదడిగినా కాదనడు. సరదాగా అమ్మతో కలిసి బట్టలు ఉతికేందుకు వెళ్తానని చెబితే అడ్డుచెప్పకుండా బైక్‌పై ఇద్దరినీ క్వారీ (చెరువు) వద్దకు తీసుకెళ్లి తాను ఇంటికెళ్లిపోయాడు. అయితే తన గారాలపట్టి చివరి చూపు అదేనని తెలుసుకోలేకపోయాడు. కుమార్తె ఇక లేదని తెలుసుకుని మృతదేహంపై పడి ‘హారికా లేవమ్మా..’ అంటూ గుండెలవిసేలా రోదించాడు. మరోవైపు తన కళ్లెదుటే కుమార్తె మృతి చెందడంతో తల్లి అపస్మారక స్థితికి చేరుకుంది. వంగర(శ్రీకాకుళం జిల్లా): మండలంలోని నీలయ్యవలస సమీపంలో గ్రానైట్ క్వారీ గొయ్యిలో పడి తొగరాపు హారిక (13) అనే బాలిక మంగళవారం మృతిచెందింది. ఆ సమయంలో పక్కనే ఉన్న తల్లి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది. వంగర ఎస్సై సంచాన చిరంజీవి తెలిపి వివరాల ప్రకారం.. నీలయ్యవలస సమీపంలో కొన్నాళ్ల కిందట బేతిన్ గ్రానైట్ పరిశ్రమ ఉండేది. అప్పట్లో జరిగిన తవ్వకాల్లో భాగంగా భారీ గొయ్యి (చెరువును తలపించేలా..) ఏర్పడింది. అందులో బట్టలు ఉతికేందుకు గ్రామానికి చెందిన తొగరాపు ఈశ్వరరావు తన భార్య సంతోషకుమారి, కుమార్తె హారికను బైక్‌పై తీసుకువెళ్లి తిరిగి ఇంటికి వచ్చేశాడు. కొద్దిసేపటికే హారిక ప్రమాదవశాత్తు గోతిలోకి జారిపోయింది. అక్కడే ఉన్న తల్లి కుమార్తెను కాపాడే ప్రయత్నంలో ఆమె కూడా గోతిలో జారిపోయి కాపాడాలంటూ కేకలు వేసింది. అటువైపుగా వెళుతున్న ఓ రైతు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించాడు. హుటాహుటిన గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని సంతోషకుమారిని కాపాడారు. హారిక కోసం నీటిలో గాలించగా కొద్దిసేపటికి శవమై కనిపింది. తల్లి సంతోషకుమారి అపస్మారక స్థితిలో ఉండగా, తండ్రి ఈశ్వరరావు గుండెలవిసేలే రోదించారు. ‘నా కలల హారిక.. లేవమ్మా..’ అంటూ మృతదేహాన్ని పట్టుకొని తండ్రి విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. హారిక బాగెంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. తమ్ముడు చంద్రశేఖరరావు అంటే ఎంతో ఇష్టం. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోషు్టమార్టం నిమిత్తం రాజాం తరలించామని ఎస్సై తెలిపారు. క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం.. 2017 ముందు మూతపడిన బేతిన్ గ్రానైట్ క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కరణం సుదర్శనరావు, స్థానికులు మండిపడ్డారు. క్వారీ మూత వేసినప్పటి నుంచి ఈ ప్రదేశంలో రక్షణ చర్యలు చేపట్టలేదని, చిన్నారి మృతికి క్వారీ యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లీజు సమ యం ఉన్నప్పటికీ క్వారీ వద్ద రక్షణ కంచెలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: లాక్‌డౌన్‌తో పాన్ బ్రోకర్ దంపతులు ఆత్మహత్య 15వ అంతస్తు నుంచి దూకి వైద్యుడు -
ఒక్కసారి కళ్లు తెరవమ్మా..
శివ్వంపేట(నర్సాపూర్): ఒక్కసారి లే తల్లీ.. కళ్లు తెరువమ్మా.. అల్లారుముద్దుగా పెంచుకుంటిని కదే.. అప్పుడే నూరేళ్లు నిండాయా తల్లీ.. తమ్ముడు పిలుస్తున్నడు చూడమ్మా.. డాడి పిలుస్తున్నడు ఒక్కసారి ఊ అనవే.. అంటూ పాప మృతదేహం వద్ద ఆ తల్లి రోదించిన తీరు అందరి కంటా కన్నీళ్లు పెట్టించింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని సికింద్లాపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు తూప్రాన్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన మాధవికి ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల పాప జాహ్నవి (6), నాలుగేళ్లు కుమారుడు ఉన్నారు. కూలి పనులు చేస్తే కాని కుటుంబం గడవని పరిస్థితి వారిది. రోజులాగే సోమవారం పిల్లలిద్దరినీ ఇంటివద్దే నాయనమ్మ దగ్గర ఉంచి దంపతులిద్దరూ కూలి పనులకు వెళ్లారు. నాయనమ్మ ఇంట్లో ఉండగా జాహ్నవి ఓ బొమ్మతో ఆరుబయట ఆడుకుంటుండగా బొమ్మ ఇంటి ఎదుట ఉన్న డ్రమ్ములో పడిపోయింది. దీంతో కుర్చీ తీసుకొచ్చి బొమ్మను తీసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో జారి డ్రమ్ములో పడిపోయింది. మనుమరాలు కనిపించకపోయేసరికి నాయనమ్మ ఇంట్లో వెతకగా డ్రమ్ములో పడిన విషయం గుర్తించి చుట్టు పక్కల వారిని పిలిచింది. వారు డ్రమ్ములో నుంచి పాపను బయటకు తీయగా విగతజీవిగా కనిపించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇంటికి చేరుకొని బోరున విలపించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు అకాలమరణం చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. -
బాలిక ఉసురుతీసిన వాటర్ హీటర్
సాక్షి, వర్గల్(గజ్వేల్): పాఠశాలకు వెళ్లాలనే ఆతృత.. చలివేళ వేడి నీళ్ల తాపత్రయం.. అదే బాలిక పాలిట శాపంగా మారింది. స్నానానికి బాత్రూమ్లోకి వెళ్లిన ఎనిమిదో తరగతి బాలిక అనూష కరెంట్ హీటర్‌తో కూడిన నీటిని తాకింది. విద్యుత్ షాక్‌తో అసువులు బాసింది. కన్నవారికి కడుపుకోత మిగిలి్చన ఈ విషాదకర ఘటన గురువారం ఉదయం వర్గల్ మండలం సీతారాంపల్లి గ్రామంలో జరిగింది. విద్యార్ధిని మృతి సమాచారంతో సంతాప సూచకంగా వేలూరు, సీతారాంపల్లి, సీతారాంపల్లి తండా పాఠశాలలు మూసివేశారు. గ్రామస్తులు, ఉపాధ్యాయుల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం వివరాలివి... సీతారాంపల్లి గ్రామానికి చెందిన చిల్ల రవీందర్–జ్యోతి దంపతులకు అనూష(13), జశ్వంత్ ఇద్దరు పిల్లలు. గ్రామ సమీపంలోని వేలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో అనూష ఎనిమిదో తరగతి, జశ్వంత్ ఆరో తరగతి చదువుతున్నారు. గురువారం ఉదయం పాఠశాలకు సకాలంలో చేరే ఆలోచనతో కాలకృత్యాలకు సిద్ధమైంది. స్నానం కోసం బాత్రూమ్లోకి వెళ్లి ప్రమాదవశాత్తు వాటర్ హీటర్ ఉన్న నీళ్లను తాకి విద్యుత్ షాక్‌కు గురైంది. స్నానానికి వెళ్లిన అనూష 15 నిమిషాలు దాటినా బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తలుపులు తీసి చూడగా అప్పటికే కరెంట్‌షాక్‌తో బాలిక అపస్మారక స్థితిలో గుర్తించి విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేటప్పటికి బాలిక మృతి చెందినట్లు తెలిసి బోరుమన్నారు. అలుముకున్న విషాదం పాఠశాలకు వెళ్లాల్సిన బాలిక అనూహ్యంగా మృత్యువు పాలవడంతో తల్లిదండ్రులు పెనువిషాదంలో కూరుకుపోయారు. తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. వేలూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ సహవిద్యారి్థని అనూష మృతి చెందిన సమాచారం తెలిసి కన్నీటి పర్యంతమయ్యాయి. హెచ్ఎమ్ కనకరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల వద్ద సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. పాఠశాల మూసేసి అంత్యక్రియలలో పాల్గొన్నారు. బాలిక తల్లిదండ్రులకు సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగా బాలిక సొంత గ్రామమైన సీతారాంపల్లి ప్రాథమిక పాఠశాలను, అదే పంచాయతీ పరిధిలోని సీతారాంపల్లి తండా పాఠశాలలను సంతాప సూచకంగా మూసేశారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు బాలిక తల్లిదండ్రులను కలిసి ఓదార్చారు. ఈ విషాద ఘటన పట్ల ఎంఈఓ వెంకటేశ్వర్‌గౌడ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో వేలూరు, సీతారాంపల్లి, సీతారాంపల్లి తండాలలో విషాదం అలుముకున్నది. చదవండి : చదవాలని మందలిస్తే..యాసిడ్ తాగి ఆత్మహత్య -
ఆశలు చిదిమేసిన బస్సు
సాక్షి, పీఎం పాలెం(భీమిలి): పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటుందనగా ఓ విద్యార్థిని బస్సు చక్రాలకు బలైపోయింది. అంత వరకూ తోటి విద్యార్థులతో ఆనందంగా గడిపి తిరిగిరాని లోకాలకు అర్ధంతరంగా వెళ్లిపోయింది. ఈ విషాదకర ఘటన నిత్యం రద్దీగా ఉండే కారుషెడ్ కూడలి వద్ద గురువారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో గాడి స్పందన అనే విద్యార్థిని తనువు చాలించింది. ఇందుకు సంబంధించి పీఎం పాలెం పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... పీఎం పాలెం ఆఖరు బస్టాపునకు సమీపంలోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ బీ – 2లో గాడి శంకరరావు, భార్య లక్ష్మి, కుమార్తెలు స్పందన(16), కల్యాణిలతో నివసిస్తున్నాడు. తాపీ మేస్త్రిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పెద్ద కుమార్తె స్పందన రామాటాకీస్ సమీపంలోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతుండగా రెండో కుమార్తె కల్యాణి 8వ తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో కళాశాల నుంచి స్నేహితులతో కలిసి కారుషెడ్ కూడలిలో స్పందన గురువారం సాయంత్రం బస్సు దిగింది. పీఎంపాలెం ఆఖరు బస్టాపునకు వెళ్లే సిటీ బస్సుకోసం స్నేహితురాళ్లతో కారుషెడ్ కూడలి శివాలయం సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఎదురుచూస్తోంది. సాయంత్రం 5 గంటల సమయంలో పీఎం పాలెం ఆఖరు బస్టాపునకు వెళ్లే సిటీ బస్సు రావడంతో దాన్ని అందుకోవడానికి స్నేహితులతో కలిసి కదిలింది. ఈ క్రమంలో కాలు తన్నుకోవడంతో అదుపు తప్పి పీఎంపాలెం ఆఖరు బస్టాపునకు వెళ్లే వన్‌వే ట్రాఫిక్ రోడ్డు మీద పడి పోయింది. అదే సమయంలో సిటీ బస్సు రావడంతో తల భాగం బస్సు కింద నలిగి ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనతో అంత వరకూ తమతో కబుర్లు చెప్పిన స్పందన కళ్ల ముందే దుర్మరణం చెందడంతో ఆమె స్నేహితురాళ్లు హతాశులయ్యారు. భయాందోళనతో కన్నీరుమున్నీరుగా విలపించారు. బస్సు ఎక్కి పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటుందనగా జరిగిన దుర్ఘటనతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పీఎం పాలెం పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
విద్యార్థిపై నుంచి దూసుకెళ్లిన వాటర్ ట్యాంకర్..!
-
విద్యార్థిపై నుంచి దూసుకెళ్లిన వాటర్ ట్యాంకర్..!
సాక్షి, హైదరాబాద్ : డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మరో విద్యార్థిని బండి చక్రాల కిందపడి ప్రాణాలు కోల్పోయింది. అబిడ్స్‌లోని చాపెల్ రోడ్డులో గల రోజారీ కాన్వెంట్లో మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల దియా జైన్‌పై నుంచి వాటర్ ట్యాంకర్ దూసుకుపోయింది. తీవ్ర గాయాలపాలైన బాలిక అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె తండ్రి నరేష్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. -
కేశవరెడ్డి హాస్టల్‌పై నుంచి పడి విద్యార్థిని మృతి
సాక్షి, కర్నూలు: పాణ్యం కేశవరెడ్డి స్కూల్లో దారుణం చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న సుష్మా అనే విద్యార్ధిని మంగళవారం తెల్లవారుజామున హాస్టల్ భవనం పై నుంచి పడి మృతి చెందారు. హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి సుష్మా పడిపోవడంతో.. స్కూల్ యాజమాన్యం ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించింది. అయితే ఆస్పత్రికి తరలించేలోపే విద్యార్థిని మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న పాణ్యం పోలీసులు స్కూల్ వద్దకు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థిని హాస్టల్ పై నుంచి దూకి కింద పడ్డారా లేదా అనే దానిపై విచారణ చేపట్టారు. అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి చెందటంపై.. బాధితురాలి బంధువులు, విద్యార్థి సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థినిని యాజమాన్యమే హత్య చేసి మేడపై నుంచి తోసేసి ఉంటారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థిని మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ ఘటనకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని తెలితే.. స్కూల్‌ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
ప్రేమజంటపై దాడి.. యువతి మృతి
-
ప్రేమజంటపై దాడి.. యువతి మృతి
సాక్షి, పశ్చిమగోదావరి: అమరావతిలో జ్యోతి హత్యోదంతం మరువకముందే ఏపీలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న ప్రేమజంటపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఒంటిపై తీవ్ర గాయాలతో యువతి అక్కడిక్కడే మృతిచెందగా, యువకుడు రక్తపు మడుగులో కొనఊపిరితో పడిఉన్నాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వైద్యం నిమిత్తం యువకుడిని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. కొండపై గల గుంటుపల్లి బౌద్దారామం సందర్శనకు వచ్చిన జంటపై దాడికి పాల్పడ్డారని స్థానికుల సమాచారం. యువకుడిపై అనుమానం.. ఇదిలావుండగా ఘటనలో యువతి అక్కడిక్కడే మృతి చెందగా, గాయాలతో బయటపడిని యువకుడు నవీన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవల జరిగిన పలు సంఘటనల నేపథ్యంలో యువకుడిని పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. యువకుడు చెపుతున్న సమాధానాలపై పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. పోలీసుల విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్తుండడంతో మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కొండపైకి యువతీ, యువకుడికే టికెట్ ఇచ్చినట్లు స్థానిక వాచ్మెన్ తెలిపారు. భీమడోలు సమీపంలోని గ్రామానికి చెందని నవీన్ డిగ్రీ రెండోసంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఘటనతో జీలకర్రగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఆమె మరణం... ఐదుగురికి పునర్జననం..!
మరణించిన మనిషికి ‘పునర్జన్మ’ ఉంటుందా...? మరణానంతర ‘జీవితం’ సాధ్యమేనా..? ‘ఉంటుంది... సాధ్యమే..’నని సమాధానమిచ్చింది 14 ఏళ్ల ఓ అమ్మాయి...! తాను చనిపోయింది...!! కాద్కాదు... మరో ఐదుగురి రూపంలో ‘జీవిస్తోంది’...!!! కొత్తగూడెంరూరల్: చుంచుపల్లి మండలం పెనుబల్లి గ్రామంలోని ఆ అమ్మాయి పేరు అవులూరి అభినయ. ఆమె తండ్రి అవులూరి శ్రీనివాస్. కొత్తగూడెంలో సీనియర్ జర్నలిస్ట్. ఆయన గత ఏడాది మార్చి 1న, తీవ్ర అనారోగ్యంతో మృతిచెందారు. ఆ విషాదం నుంచి ఆయన కుటుంబం ఇంకా తేరుకోనే లేదు. ఇంతలోనే, ఆయన ముద్దుల కూతురైన అభినయ(14)కు అనారోగ్యం. కొత్తగూడెంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో పదోతరగతి చదువుతున్న ఈమెకు వారం కిందట అనారోగ్యం సోకింది. హైదరాబాద్ మలక్‌పేటలోని యశోద ఆస్పత్రిలో కుటుంబీకులు చేర్పించారు. వారి నెత్తిపై ‘పిడుగు’ పడింది... పిడుగులాంటి వార్తను వినాల్సొచ్చింది. అభినయ ‘లేదు’... ఇక ‘లేవదు’. ఆమె ‘బ్రెయిన్ డెడ్’ అయినట్టుగా వైద్యులు బుధవారం నిర్థారించారు. ఆమె కళ్లు బాగానే ఉంటాయి... కానీ, తెరుచుకోవు. మూత్ర పిండాలు బాగానే ఉంటాయి... కానీ, ‘పని’ చేయవు. గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. కానీ, ‘పరిమితు’లుంటాయి. ఆమె శరీరంలోని ప్రధాన అవయవాలను పని చేయించే కీలకమైన మెదడు (బ్రెయిన్) మాత్రం పూర్తిగా పనిచేయడం ఆగిపోయింది... ‘చనిపోయింది’. ఈ స్థితిలో, ఆమెలోని కొన్ని అవయవాలు (కళ్లు, గుండె, మూత్రపిండాలు, కాలేయం) కొన్ని రోజులపాటు మాత్రమే పనిచేస్తాయి. ఇదే విషయాన్ని ఆమె కుటుంబీకులకు అక్కడి వైద్యులు తెలిపారు. ‘‘ఈ స్థితిలోనే ఆమెకు ‘పునర్జన్మ’ ఇవ్వగలం. ఆమెను మరొకరి రూపంలో ‘బతికించగలం’. ఇందుకు చేయాల్సిందల్లా... ఆమె అవయవాలను దానం చేయడమే’’నని ఆ వైద్యులు సావధానంగా వివరించారు. దీనికి, అభినయ తల్లి కవిత, సోదరుడు వెంకట్ వరుణ్ అంగీకరించారు. ఆ తరువాత, అభినయ శరీరం నుంచి కళ్లు.. గుండె.. కాలేయం.. మూత్రపిండాలను వైద్యులు వేరు చేశారు. సరిగ్గా ఇవే అవయవాల వైఫల్యంతో బాధపడుతున్న, ప్రాణాపాయ స్థితికి చేరిన మరో ఐదుగురికి అమర్చేందుకుగాను వాటిని తరలించారు. ఆ ఐదుగురి రూపంలో అభినయ మళ్లీ బతికింది...! ఇకపై, ఆమె కళ్లు ఈ లోకాన్ని చూస్తాయి. ఆమె గుండె కొట్టుకుంటుంది... ఇంకొకరి శరీరంలో. ఆమె కాలేయం పనిచేస్తుంది... మరొకరి శరీరంలో. ఆమె మూత్రపిండాలు పనిచేస్తాయి... వేరొకరి శరీరంలో. మరణం... జననం... ఆమె చనిపోయింది. కానీ, కొన్ని గంటల వ్యవధిలోనే... ఆ ఐదుగురి రూపంలో ‘పునర్జన్మ’ అందుకుంది. ఆమెకు, ఆమె తల్లి కవితకు, సోదరుడు వెంకట్ వరుణ్‌కు ఆ ఐదుగురు... చేతులెత్తి నమస్కరిస్తారు...! నిరంతరం స్మరిస్తారు...!! తుది శ్వాస వరకు...!!! -
మోడల్ స్కూల్ ఎదుట ధర్నా
పర్వతగిరి: వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో గురువారం ఉరేసుకుని మోడల్ స్కూల్ వసతి గృహంలో మృతి చెందిన మడ్డి ప్రసన్న మృతిపై మోడల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రసన్న బంధువులు శుక్రవారం మోడల్ స్కూల్ ఎదుట ప్రసన్న మృతదేహంతో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ప్రసన్న మృతికి కారకులైన మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, వారికి సహకరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటల పాటు నిర్వహించిన ధర్నా, రస్తారోకోలో రెండు వేల మంది పాల్గొని నినాదాలు చేశారు. మోడల్ స్కూల్ యాజమాన్యంపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయని నేటి వరకు యాజమాన్యంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. పాఠశాలలో తరగతి గదులు నిర్వహిస్తున్న సమయంలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు నినాదాలు చేశారు. తమ విద్యార్థులకు రక్షణ కరువైందని ప్రభుత్వం మోడల్ స్కూల్ విద్యార్థులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసన్నకు చదువు తప్ప మరో ద్యాస తెలియదని ప్రసన్న మృతికి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు మరో కారణం చూపించే ప్రయత్నం చేస్తున్నారని ప్రసన్న మృతిపై వాస్తవాలను తెలియజేయాలన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి ప్రసన్న మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
సీఎం సభకు 108 వాహనాలు.. వైద్యం అందక బాలిక మృతి
సాక్షి, తాడికొండ: రాజధాని ప్రాంతంలో పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా అనువైన రోడ్లు లేకపోవడం.. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాల్సిన 108 వాహనాలు అందుబాటులో లేకపోవడం కారణంగా ఓ బాలిక మృత్యుఒడికి చేరింది. తాడికొండ మండలం మోతడక గ్రామ పరిధిలో శుక్రవారం సాయంత్రం వేగంగా వెళుతున్న ఆటోకు టైరు పేలడంతో అదుపుతప్పింది. దీంతో అమరావతి వలస మాలపల్లికి చెందిన రాయపూడి గీతాంజలి (14) తీవ్రగాయాలపాలై కొట్టుమిట్టాడుతుండగా.. స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేశారు. అయితే వాహనం అందుబాటులో లేదని, రావడానికి సమయం పడుతుందంటూ సమాధానం రావడంతో కంగుతిన్నారు. చిన్నారిని హుటాహుటిన ప్రైవేటు వాహనంలో గుంటూరులోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. కాగా, ముఖ్యమంత్రి సభ పేరిట శుక్రవారం ఉదయం 8 గంటలకే తాడికొండ, అమరావతి మండలాలకు చెందిన 108 వాహనాలను తుళ్ళూరు ప్రాంతానికి తరలించారు. దీంతో ఈ ప్రాంతంలో 108 సేవలు శుక్రవారం పూర్తిగా నిలిచిపోయాయి. -
రోడ్డు ప్రమాదంలో బాలిక దుర్మరణం
కృష్ణాజిల్లా, పెనుగంచిప్రోలు (జగ్గయ్యపేట) : రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కొణకంచి క్రాస్‌రోడ్స్ వద్ద గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామానికి చెందిన నెల్లూరి నరేంద్ర పెద్ద కుమార్తె తరుణి (7) నాయనమ్మ ఈశ్వరమ్మతో కలిసి గౌరవరం గ్రామంలో బంధువుల ఇంటికి పండగకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో గౌరవరం నుంచి బస్సులో కొణకంచి క్రాస్ రోడ్స్ వద్ద దిగి ఈశ్వరమ్మ మనమరాలు తరుణి చేయి పట్టుకొని బండిపాలెం వెళ్లేందుకు రోడ్డు దాటుతోంది. అదే సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తరుణి అక్కడికక్కడే మృతి చెందింది. అప్పటి వరకు చేయి పట్టుకొని నడిచిన మనుమరాలు మృతి చెందటంతో ఘటనా స్థలంలో నాయనమ్మ బోరున విలపిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. పండగకు వెళ్లి వస్తూ తమ కుమార్తె మరణించటంతో బాలిక తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. పెనుగంచిప్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాలిక గౌరవరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతోంది. -
మోపెడ్‌ను ఢీకొన్న లారీ
తూర్పుగోదావరి, పెద్దాపురం: మోపెడ్‌పై వెళుతున్న కుటుంబ సభ్యులను లారీ ఢీకొనడంతో 11 ఏళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందగా భార్య, భర్త, కుమారుడు, మనువడు సురక్షితంగా బయటపడ్డారు. గురువారం పెద్దాపురం ఏడీబీ రోడ్డులో జరిగిన ఈ సంఘటనపై స్థానిక పోలీసుల కథనమిలా.. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లుకు చెందిన కుంజా సత్తిబాబు, భార్య చిన్న, మూడో కుమార్తె జ్యోతి, కుమారుడు ఉదయ్‌కుమార్, మనువడు ప్రదీప్‌లతో కలిసి టీవీఎస్ మోపెడ్‌పై వారు నివాసముంటున్న కాకినాడకు బయల్దేరారు. పెద్దాపురం వాలుతిమ్మాపురం దాటే సరికి కాకినాడ వైపునకు వెళుతున్న గుర్తు తెలియని లారీ డ్రైవర్ వాహనాన్ని వెనుకకు తిప్పాడు. దీంతో మోపెడ్ అదుపు తప్పి కిందకు పడగా కుమార్తె జ్యోతి(11) అక్కడిక్కడే మృతి చెందింది. కుటుంబ సభ్యులు నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి పోçస్టుమార్టం కోసం తరలించారు. సంఘటన స్థలం వద్ద తల్లి చిన్న, తండ్రి, తమ్ముడు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
ఓర్వకల్లు: మండలంలోని నన్నూరు బంగ్లా బస్టాండ్ వద్ద కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిపై ఆదివారం కారు ఢీ కొనడంతో పదేళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామానికి చెందిన కురువ మాదమ్మ, బాలకృష్ణ దంపతుల కూమార్తె నాగేంద్రమ్మను పదకొండేళ్ల క్రితం జూపాడుబంగ్లా మండలం, తంగెడంచ గ్రామానికి చెందిన బాలమద్దిలేటికిచ్చి వివాహం చేశారు. వీరికి మధురాణి(10), మైథిలీ అను ఇద్దరు కుమార్తెలు. కాగా బాలమద్దిలేటి అనారోగ్యంతో ఆరేళ్ల క్రితం మృతిచెందడంతో భార్య నాగేంద్రమ్మ ఆరేళ్ల క్రితం పుట్టిళ్లయిన నన్నూరుకు వచ్చి తల్లితండ్రుల వద్దనే స్థానిక బైరెడ్డి కాలనీలో నివాసముంటోంది. కూలీ పనులకు వెళ్తూ పిల్లలద్దరిని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తోంది. మధురాణి 5వ తరగతి, మైథిలీ 2వ తరగతి చదువుతున్నారు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో జాతీయ రహదారి పక్కనున్న హైస్కూల్ వద్ద మిరప దిగుబడిని ఆరబెట్టుకున్న అవ్వ దగ్గరకు వెళ్లేందుకు చిన్నారులిద్దరూ తల్లి నాగేంద్రమ్మతో కలిసి బయలుదేరారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా కర్నూలు నుంచి నంద్యాల వైపునకు వెళ్తున్న కారు మధురాణిని ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కారును అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. కళ్లెదుటే కూతురు కారు ప్రమాదంలో మృతి చెందడంతో నాగేంద్రమ్మ రోధిస్తున్న తీరు పలువురిని కలచివేసింది. హైవేపై స్థానికులు ఆందోళన.. చిన్నారి మృతితో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని హైవే అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా జాతీయ రహదారిని దిగ్భందించారు. దీంతో అరగంట సేపు వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఎస్ఐ మధుసూదన్‌రావు, ట్రైనీ ఎస్ఐ ఆశాలత, ఏస్ వెంకటరామిరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. నన్నూరు బస్టాండ్ వద్ద అండర్ బ్రిడ్జిని నిర్మించాలని పలుమార్లు ఆందోళనలు, ధర్నాలు చేపట్టినా పట్టించుకోలేదని, సమస్య పరిష్కరించాలని మూడు నెలల క్రితం ఎమ్మెల్యే గౌరు చరిత, సీపీఎం నాయకులు రామకృష్ణ ఆధ్వర్యంలో టోల్ గేట్ వద్ద ధర్నా చేసిన సమయంలో 20 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పిన హైవే అధికారులు ఇంతవరకు చర్యలు తీసుకోలేదని పోలీసులతో వాదనకు దిగారు. సమస్యను పరిష్కరించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక మృతికి హైవే అధికారులను బాధ్యులను చేసి కేసు నమోదు చేసే వరకు కదిలేది లేదని భీష్మించుకున్నారు. ఎస్ఐ హైవే అధికారులను మరోసారి ఉన్నతాధికారల వద్దకు పిలిపించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆందోళనకారులకు సర్ది చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే నివాళి.. ప్రమాద విషయం తెలుసుకున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి, పార్టీ జిల్లా నాయకులు విశ్వేశ్వరరెడ్డి, సీపీఎం జిల్లా నాయకుడు రామకృష్ణ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని చిన్నారి మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ప్రత్యేక వెంతెన నిర్మించేందుకు కృషిచేస్తామన్నారు. హైవే అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే మరోసారి ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. అనంతరం చిన్నారి అంత్యక్రియలకు గౌరు దంపతులు రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశారు. వైఎస్సార్సీపీ మండల నాయకులు గౌండ రాముడు, షంషుద్దీన్, షరీఫ్‌మియా, ఉశేన్‌సర్కార్ ఉన్నారు. -
కొంపముంచిన అతివేగం
విజయనగరం, బొబ్బిలి రూరల్: ఓ ఆటో డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఓ బాలిక ప్రాణాలు కోల్పోగా.. మరో బాలిక కోమాలోకి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని లింగంవలస గ్రామానికి చెందిన అలజంగి సునీత (10), మామిడి లావణ్య (18) మరో నలుగురైదుగురు ప్రయాణికులతో కలసి ఆటోలో బొబ్బిలి వెళ్తున్నారు. వీరి ఆటో ముత్తాయవలస జంక్షన్ వద్దకు వచ్చేసరికి డ్రైవర్‌నిర్లక్ష్యంగా నడపడంతో ఇద్దరు బాలికలు రోడ్డుమీద పడిపోయారు. ఈ ప్రమాదంలో సునీత తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరో బాలిక మామిడి లావణ్య స్పృహ కోల్పోయింది. వెంటనే స్థానికులు లావణ్యను బొబ్బిలి ఆస్పత్రికి తరలించడంతో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించారు. ఏఎస్సై చదలవాడ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అల్పాహారానికి వెళ్తూ..అనంత లోకాలకు!
సాక్షి, వేటపాలెం: అల్పాహారానికి వెళ్తున్న బాలికను వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని రామన్నపేటలో సోమవారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన పృధివి బ్రహ్మణి (12) సైకిల్‌పై వస్తుండగా వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో చికిత్స కోసం చీరాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. స్థానికుల, బాధితుల కథనం ప్రకారం.. రామన్నపేట శివాలయం ఎదురుగా నివాసం ఉంటున్న పృధివి శ్రీనివాసరావు, జ్యోతి దంపతులకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి 9వ తరగతి చదువుచుండగా కుమార్తె బ్రహ్మణి స్థానికంగా 7వ తరగతి చదువుతోంది. ఎస్ఏ పరీక్షలు జరగుతుండటంతో ఉదయం ఎనిమిది గంటల సమయంలో తన సైకిల్‌పై బ్రహ్మణి పెట్రోలు బంకు సమీపంలో అల్పాహారం తెచ్చుకునేందుకు ఇంటి నుంచి పందిళ్లపల్లి–వేటపాలెం ప్రధాన రోడ్డు పక్కన సైకిల్‌పై వెళ్తోంది. వాటర్ ట్యాంకు సమీపంలోకి వచ్చే సరికి బాపట్ల ప్రాంతానికి చెందిన ట్రాక్టర్ పందిళ్లపల్లి వైపు వేగంగా వస్తూ ఎడమ వైపు ఉన్న ఉల్లిపాయల ఆటోను క్రాస్ చేసి ముందుకు వెళ్లే ప్రయత్నంలో ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డు మార్జిన్లో సైకిల్‌పై వెళ్తున్న బ్రహ్మణిని ఢీకొట్టింది. కింద పడిన బాలిక ఛాతీపై ట్రాక్టర్ చక్రం ఎక్కడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు చీరాలలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా బ్రహ్మణిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. పక్కనున్న మృతురాలి బంధువులు మృతదేహాన్ని ఇంటికి చేర్చడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా శోకంలో మునిగిపోయారు. ఎప్పుడూ చలాకీగా ఉండే తన కుమార్తె విగత జీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. స్థానికులు, బంధువులు ఆ ప్రాంతం చేరడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ పాటల హోరుతో అతి వేగంగా నడిపినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఎస్ఐ వెంకటకృష్ణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బడి బస్సుకు బాలిక బలి
ఇబ్రహీంపట్నంరూరల్ రంగారెడ్డి : అన్నను బస్సెక్కించి బాయ్.. అని చెబుతూ వెనక్కి వెళ్తున్న ఆ చిన్నారిని అదే బస్సు చిదిమేసింది. రాఖీ కట్టిన చెల్లి 24 గంటలు గడవక ముందే అన్నకు దూరమైంది. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరి«ధిలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.. మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన బోయిని వెంకటేష్ చందన దంపతులు ఇబ్రహీంపట్నం మండలం యంపీపటేల్‌గూడ సమీపంలోని అంతపురం కాలానీలో నివాసం ఉంటున్నారు. వెంకటేష్ ఏఆర్ కానిస్టేబుల్. ప్రస్తుతం ఆయన రాచకొండ జాయింట్ కమిషనర్ సుధీర్‌బాబు వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్నారు. వీరికి ప్రతీక (18నెలలు), ప్రజ్వాల్ (5) సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఉన్నారు. ప్రజ్వాల్‌ను స్థానికంగా బొంగ్లూర్ గేటు వద్ద ఉన్న సాహితీ పాఠశాలలో నర్సరీ చదివిస్తున్నారు. రోజు స్కూల్ బస్సు వచ్చి ప్రజ్వాల్‌ను తీసుకుపోతుంది. రోజులాగే సోమవారం ప్రజ్వాల్‌ను స్కూల్ బస్సు ఎక్కించడానికి తల్లి చందన చిన్నారి ప్రతీకను తీసుకొని వచ్చింది. బస్సు రాగానే ప్రతీకను కింద వదిలేసి ప్రజ్వాల్‌ను ఎక్కించింది. కొడుకుని బస్సు ఎక్కించి కిందికి దిగేలోపే స్కూల్ బస్సు కదిలింది. చిన్నారి ప్రతీక బస్సు ముందు చక్రాల వైపు వచ్చింది. డ్రైవర్ చూసుకోకపోవడంతో అలాగే నడిపించాడు. చిన్నారి తలపై నుంచి ముందు చక్రం వెళ్లడంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కళ్ల ముందే బిడ్డ మరణం చూసిన చందన గుండెలు బాదుకుంది. డ్రైవర్ బస్సును వదిలి పరారయ్యాడు. గ్రామస్తులు వచ్చి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండు గంటల అనంతరం చిన్నారి మృతదేహాన్ని సంఘటన స్థలం నుంచి తరలించారు. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ మోహన్‌రెడ్డి తెలిపారు. -
విద్యార్థిని కాటేసిన మృత్యువు
సంతబొమ్మాళి : స్వాతంత్య్ర దినోత్సవానికి వెళ్లి ఇంటికి చేరిన విద్యార్థిని దుస్తులు ఉతికేందుకు బావి వద్దకు వెళుతుండగా పాము కాటుకు గురై బుధవారం మృతిచెందింది. మండలంలోని రొంకు గ్రామానికి చెందిన టంకాల దీపిక(12) జగన్నాథపురం ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. పాఠశాలలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవానికి వెళ్లి తిరిగి స్వగ్రామం చేరుకుంది. దుస్తులు ఉతికేందుకు తన అక్కను తోడు తీసుకుని గ్రామంలో ఉన్న బావి వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో మార్గమధ్యంలో పాము కాటు వేసింది. మంటిబుక్కడం(విషం లేని పాము) అనుకుని బావి వద్దకు చేరుకుని దుస్తులు ఉతకడం ప్రారంభించింది. కొద్ది సేపటికే దీపిక నోటి నుంచి నురుగలు రావడంతో స్థానికులు అంబులెన్స్‌లో కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. తండ్రి అప్పన్న గత ఏడాదే మృతిచెందడంతో తల్లి అమ్ములు కూలీ చేసి పిల్లలను చదివిస్తున్నారు. దీపిక మృతి చెందడంతో బంధువులు విలపిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. -
ముంబైలో దారుణం.. ట్యాబ్లెట్లు వికటించి..
సాక్షి, ముంబై : ఐరన్, విటమిన్ ట్యాబ్లెట్లు వికటించడంతో ముంబైలోని గోవంది మురికివాడలోని ఓ పాఠశాలలో 12 సంవత్సరాల బాలిక మరణించగా, 197 మంది చిన్నారులు ఆస్పత్రిపాలయ్యారు. కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్న161 మంది చిన్నారులను గట్కోపర్‌లోని రాజవాది ఆస్పత్రికి తరలించగా, 36 మంది చిన్నారులను గోవంది శతాబ్ధి ఆస్పత్రికి తరలించారని డాక్టర్ ప్రదీప్ జాదవ్ తెలిపారు. స్కూల్లో ఇచ్చిన ఐరన్, విటమిన్ ట్యాబ్లెట్‌ను వేసుకున్న చందాని షేక్ అనే బాలిక గురువారం రాత్రి రక్తపు వాంతులు చేసుకుని మృత్యువాత పడిందని చిన్నారి తల్లితండ్రులు వెల్లడించారు. అయితే పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే బాలిక మృతికి కారణాలు వెలుగులోకి వస్తాయని వైద్యులు తెలిపారు. తమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని రాజవాది ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విద్యా ఠాకూర్ తెలిపారు. -
ఏపీలో తొలిసారి డిఫ్తిరీయా కేసు
-
డిఫ్తిరీయా కేసుతో బాలిక మృతి
సాక్షి, అనంతపురం : రాష్ట్రంలో తొలిసారి డిఫ్తీరియా కేసు నమోదవ్వడం కలకలం సృష్టించింది. డిఫ్తిరియా వ్యాధితో శ్రావణి అనే విద్యార్థి మరణించింది. అనంతరపురం జిల్లా కేంద్రంలోని శారదా మన్సిపల్ హైస్కూల్లో ఏడో తరగతి చదివే శ్రావణికి డిఫ్తీరియా సోకడంతో బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పుట్టిన వెంటనే టీకా వేయకపోవడం, శారదా మున్సిపల్ హైస్కూల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యతోనే తమ శ్రావణి మృతి చెందినట్లు ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. అంటు వ్యాధి కావడం, డీటీ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో పాఠశాల విద్యార్థులు, టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ అందజేయకుండా సరఫరా నిలిపివేసిన టీడీపీ ప్రభుత్వ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరా తీసినట్లు తెలుస్తోంది. వ్యాధి ప్రబలకుండా సకాలంలో స్పందించడంలో మున్సిపల్, వైద్యశాఖలు విఫలమయ్యాయి. -
చిన్నారిని బలిగొన్న స్కూల్ బస్సు
మాడ్గుల రంగారెడ్డి : మాడ్గుల మండలం ఆర్కపల్లి పంచాయతీ పరిధిలోని పల్గుతండాకు చెందిన నాలుగేళ్ల చిన్నారి శుక్రవారం సాయంత్రం స్కూల్ బస్సు కిందపడి మృత్యువాతపడింది. తండావాసులు, పోలీసుల కథనం ప్రకారం.. పల్గుతండాకు చెందిన రామావత్ ప్రసాద్, పార్వతీలకు ఇద్దరు కూమార్తెలు. పెద్ద కూతురు వైష్ణవి(4) మాడ్గుల సెయింట్‌మేరీ స్కూల్లో నర్సరీ చదువుతోంది. పల్గుతండా నుంచి ప్రతిరోజు స్కూల్ బస్సులో తండాకు చెందిన విద్యార్థులతో కలిసి పాఠశాలకు వెళ్లివస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి స్కూల్ బస్సులో తండాకు వచ్చిన వైష్ణవి తండాలో బస్సు దిగింది. ఆ సమయంలో వైష్ణవి చేతిలో ఉన్న టిఫిన్‌బాక్స్ ఉన్న బుట్ట ప్రమాదశాత్తు కిందపడిపోయింది. కిందపడిన బుట్టను తీసుకునేందుకు వంగింది. గమనించని బస్సు డ్రైవర్ బస్సును ముందుకు కదిలించాడు. బస్సు వెనుక చక్రం ఆ చిన్నారి తలపై నుంచి పోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విద్యార్థులు అరవడంతో బస్సును నిలిపివేసిన డ్రైవర్ మృతదేహాన్ని చూసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న వైష్ణవి తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని చూసి చలించిపోయారు. ఈ ఏడాదే స్కూల్‌కు పంపించాం బిడ్డా.. అప్పుడే శవమైతివా.. అని రోదించిన తీరు తండావాసులను కన్నీరు పెట్టించింది. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సైదులు పంచనామా నిర్వహించి.. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
ప్రాణం తీసిన మూఢనమ్మకం
కడెం(ఖానాపూర్) : సాంకేతికరంగంలో దూసుకుపోతున్న ప్రస్తుత తరుణంలో మూఢనమ్మ కం ఓ చిన్నారి ప్రాణాన్ని బలిగొంది. నాటు వై ద్యం ఆశ్రయిస్తూ కొందరు ప్రాణాల మీద కు తెచ్చుకుంటున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని లింగాపూర్ గ్రామానికి సమీపంలో నివాసం ఉండే నక్క నర్సవ్వ–ఎర్రన్న దంపతుల కూతురు శిరీష(4) ఆదివారం పాము కాటుకు గురైంది. సాయంత్రం పాము కుట్టడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లక పసరు, నాటువైద్యం పేరిట కాలయాపన చే శారు తల్లిదండ్రులు. గ్రామస్తులు ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో రాత్రి సమయంలో ఖా నాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు చనిపోయిందన్న వార్త విన్న తల్లి ఆసుపత్రి ఎదుట భోరున విలపించడం అందరిని కలిచివేసింది. -
చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు
షాబాద్(చేవెళ్ల): ఓ చిన్నారిని స్కూల్ బస్సు చిది మేసింది. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లాలో సోమవారం జరి గింది. షాబాద్ మండ లం గోపిగడ్డకు చెందిన మోముల చంద్రశేఖర్‌రెడ్డి, లావణ్య దంపతులకు కుమారుడు సాత్విక్‌రెడ్డి, కూతురు ఆద్య (22 నెలలు) ఉన్నారు. బాలుడు షాబాద్‌లోని మాంటిస్సోరి స్కూల్లో చదువుతున్నాడు. సోమవారం ఉదయం గ్రామంలోకి వచ్చిన స్కూల్ బస్సులోకి కుమారుడిని ఎక్కించేందుకు చంద్రశేఖర్‌రెడ్డి ఇంటి నుంచి రోడ్డు మీదకు వచ్చాడు. అదే సమయంలో కూతురు ఆద్య ఇంట్లో నుంచి రోడ్డుపైకి వస్తుండగా డ్రైవర్ గమనించకుండా బస్సును ముందుకు తీసుకెళ్లాడు. ఆద్య చక్రాల కింద పడిపోయి తల ఛిద్రమై మృతి చెందింది. -
పదిహేనేళ్ల బాలిక హత్య?
మల్కన్‌గిరి: పదిహేనేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి అనంతరం హత్య చేశారన్న ఆరోపణలు మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితిలోని బెజంగవాడ గ్రామంలో బుధవారం రాత్రి హోరెత్తాయి. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బాలిక రెండు రోజుల నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు కూడా గ్రామం, గ్రామ పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయినా బాలిక జాడ తెలియలేదు. బాలికను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని గ్రామస్తులు భావించారు. అయితే బుధవారం రాత్రి 10 గంటల సమయంలో పొలాల్లో బాలిక మృతదేహం కనిపించింది. దీంతో స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. దుండగులు బాలిక గొంతు కోసి చంపినట్లు తెలిపారు. అలాగే ఒంటిపై తీవ్ర గాయాలుండడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అనంతరం గురువారం సాయంత్రం బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక మృతితో తల్లిదండ్రులు, గ్రామస్తులు భోరున విలపిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, ఎలాగైనా వారిని పట్టుకుని తగిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు. -
అమ్మమ్మ ఇంటికి వెళ్తుండగా...
యాదగిరిగుట్ట(ఆలేరు) : వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అమ్మమ్మ ఇంటికి బయల్దేరిన ఓబాలిక మృత్యువు ఒడిలోకి వెళ్లింది. ఈ విషాద ఘటన యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామంలో శుక్రవారం ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు, పోలీసులు కథనం ప్రకారం... వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన కామిటికార్ మమత, నర్సోజీ దంపతుల కూతురు సోని(15) ఇటీవల పదోతరగతి పూర్తిచేసింది. శుక్రవారం మృగశిర, రెండో శనివారం, ఆదివారం వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో చొల్లేరులో ఉండే అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది. మేనమామ ప్రకాశ్‌కు ఫోన్‌చేసి వస్తున్నానని చెప్పడంతో రమ్మన్నాడు. దీంతో సోని గురువారం మధ్యాహ్నం వరంగల్ నుంచి వచ్చే పుష్పుల్ రైలు ఎక్కి వంగపల్లి రైల్వేస్టేషన్లో 4గంటలకు దిగింది. వెంటనే మేనమామకు తన సెల్ నుంచి కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో వంగపల్లి నుంచి మర్రిగూడెం వరకు ఆటోలో వెళ్లి, గ్రామానికి కాలినడకన బయల్దేరింది. గ్రామానికి వాగులో నుంచి పిల్లబాటలో నడుస్తోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో వాగులో సుమారు 10 ఫీట్ల లోతు ఉన్న గుంతలో సోని పడిపోయింది. రాత్రంతా వెతుకులాట.. బాలిక రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో సోని అమ్మమ్మ రాధాబాయ్, తాత నర్సోజీ తన కొడుకు ప్రకాష్‌కు సమాచారం అందించారు. దీంతో ప్రకాష్ తన సెల్‌ఫోన్ నుంచి సోనికి పలుమార్లు ఫోన్‌చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో చొల్లేరు, మర్రిగూడెం, వంగపల్లి రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో రాత్రంతా వెతికాదు. ఎక్కడా కనిపించకపోవడంతో సోని తల్లిదండ్రులకు ఫోన్‌చేశాడు. అక్కడ కూడా లేదని చెప్పడంతో పలు ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేదు. రైతు చూడడంతో.. గ్రామానికి చెందిన రైతు గంధమల్ల గాలయ్య శుక్రవారం ఉదయం 11గంటల ప్రాంతంలో తన వ్యవసాయ బావి వద్దకు వాగు గుండా ఉన్న పిల్లబాటలో నుంచి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే బాట పక్కనున్న గుంతలో బాలిక శవం తేలి కనిపించగా గ్రామస్తులకు తెలియజేశాడు. అక్కడికి వెళ్లిన ప్రకాష్ తన మేనకోడలే అని గుర్తించాడు. మేనమామ, మనమరాలిని చూసి అమ్మమ్మ, తాతయ్య కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులతో పాటు యాదగిరిగుట్ట పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్సై–3 సాయినాథ్ వివరాలు సేకరించి, శవ పంచనామా చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతదేహాన్ని పోస్టుమాస్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సోని మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు -
బాలిక కుటుంబానికి న్యాయం చేస్తాం
నెక్కొండ : ఎలాంటి సంబంధం లేని ఓ బాలిక అన్నదమ్ముల గొడవలో ప్రాణాలు కోల్పోయిన బాలిక కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేస్తామని జిల్లా బాలల సంరక్షణ అధికారి(డీసీపీఓ) మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని బంజరుపల్లి శివారు ధర్మతండాలో ఈ నెల 30న రాళ్లు విసరడంతో అదే తండాకు చెందిన బాలిక అఖిల మృతిపై జిల్లా బాలల సంరక్షణ శాఖ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. బాలిక మృతి చెందిన విషయం తెలుసుకున్న మరుసటి రోజు ఎంజీఎం ఆస్పత్రిలో నెక్కొండ సీఐ వెంకటేశ్వర్రావు, ఎస్సై నవీన్‌కుమార్‌లను కలిసి వివరాలు తీసుకున్నట్లు మహేందర్‌రెడ్డి చెప్పారు. బాధిత కుటుంబ నేపథ్యం ప్రకారం.. వారి ఆర్థిక విషయాలపై గొవడకు కారణం, బాలిక మృతిపై పోలీసులు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర విచారణ రిపోర్టును మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకులు, జిల్లా ఉన్నతాధికారులు, బాలల సంక్షేమ కమిటీకి పంపనున్నట్లు ఆయన తెలిపారు. బాలిక తల్లిదండ్రులకు నాలుగో సంతా నం కాగా, పదో తరగతి చదివిన పెద్ద కూతురు(మూగ)కు పునరావాసం కల్పిస్తామన్నారు. ఆమెను వృత్తి విద్యా కోర్సు చదివించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే రెండో కుమార్తెకు వివాహం జరుగగా, మూడో కుమార్తెను నెక్కొండ కస్తూర్భా గురుకులంలో 8వ తరగతిలో చేర్పిస్తామన్నారు. ప్రభుత్వం తరుఫున బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విచారణలో అంగన్వాడీ టీచర్ సుధ, ఆయా పూలమ్మ, తండావాసులు పాల్గొన్నారు. -
రిమ్స్‌లో ఉద్రిక్తత
శ్రీకాకుళం సిటీ : పాముకాటుకు గురైన చిన్నారికి సకాలంలో వైద్యం అందించడంలో వైఫల్యం కారణంగా ఆ చిన్నారి మృతిచెందడం సంచలనం కలిగించింది. ఈ సంఘటన శ్రీకాకుళం రిమ్స్‌లో చోటుచేసుకుంది. తమ కుమార్తె మరణానికి రిమ్స్ వైద్యులే బాధ్యత వహించాలని బాధితులు ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బంది తీరుకు నిరసనగా చిన్నపిల్లల విభాగం వద్ద ఆందోళన చేశారు. చిన్నపిల్లల విభాగంలో డ్యూటీ వైద్యుడు రిమ్స్‌కు రావాలని పట్టుబట్టారు. అక్కడే బైఠాయించారు. రాత్రి 9 గంటల వరకు బాధితుల ఆందోళన రిమ్స్ వద్ద కొనసాగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... గార మండలంలో సాలిహుండంకు చెందిన దుబ్బక రమణ, రోషిణీలకు జోషిక, తనీష్ íఅనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమణ కేబుల్‌టీవీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో రమణ ఇంట్లోకి గోధుమరంగు నాగుపాము ప్రవేశించింది. ఇంట్లో ఆడుకుంటున్న మూడున్నరేళ్ల జోషిక ఎడమకాలికి కరిచింది. పాము కరిచిన విషయాన్ని జోషిక కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో జోషికకు గారలో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యసేవల కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అయితే 108కు ఫోన్ చేయగా స్పందించకపోవడంతో ఆటో సహాయంతో చిన్నారిని రిమ్స్‌కు తీసుకువచ్చారు. రిమ్స్‌లో ఏమి జరిగిందంటే... రిమ్స్ ఆస్పత్రికి మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో జోషికను తీసుకువచ్చారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు చిన్నపిల్లల విభాగంలో డ్యూటీ వైద్యులకు సమాచారం అందించారు. చిన్నారిని చిన్నపిల్లల విభాగంలో ఐసీయూ యూనిట్లో చేర్పించాల్సిందిగా అత్యవసర విభాగం వైద్యులు సూచించారు. అయితే డ్యూటీలో ఉండాల్సిన వైద్యులు సకాలంలో వైద్యసేవలు అందించడంలో వైఫల్యం వల్లే తమ కుమార్తె జోషిక మృతిచెందిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. జూనియర్ వైద్యులు ప్రాథమికంగా వైద్యసేవలు అందిచినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. వైద్యులకు చిన్నారి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తున్నప్పటికీ 35 ఎకరాల్లో రిమ్స్ ఆస్పత్రి ఉందని, మీరొక్కరే ఆస్పత్రికి పేషెంటుకాదని, చూస్తాంలే.. అంటూ నిర్లక్ష్యధోరణి సమాధానం వైద్యసిబ్బంది చెప్పారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మధ్యాహ్నం 1.30 గంటలకు రిమ్స్‌కు చిన్నారిని తీసుకువచ్చినప్పటీ ఓపీ షీట్ తీసుకోమని, కేషీట్ తీసుకోమని, పలు వార్డులకు వెళ్లమని ఉచిత సలహాలతో అత్యవసర సమయాన్ని వృథాచేశారని వాపోయారు. రాత్రి వరకు కొనసాగిన ఆందోళన చిన్నారి మృతికి చిన్నపిల్లల డ్యూటీ వైద్యులు ఎస్.సోమశేఖరే బాధ్యత వహించాలని బాధితులు డిమాండ్ చేశారు. చిన్నపిల్లల విభాగం వద్ద వారంతా ఆందోళనకు దిగారు. కొందరు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. విధులను అడ్డుకొనేయత్నం చేశారు. డ్యూటీ వైద్యులు వచ్చి చిన్నారి మృతికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమకు జరిగిన అన్యాయం మరెవ్వరికి జరగకూడదని పేర్కొన్నారు. రిమ్స్ సీఎస్ ఆర్ఎంవో డాక్టర్ బీసీహెచ్ అప్పలనాయుడు, పలు విభాగాల వైద్యులు రోష్మల్లికార్జున్, మూల వెంకట్రావు, హెచ్.రమేష్, నర్సింహమూర్తి, రమేష్ బాధితులతో రాత్రి 9 గంటల వరకు జరిపిన చర్చలు ఒక కొలిక్కి రాలేదు. దీనిపై విచారణ జరిపిస్తామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎస్ ఆర్ఎంవో సూచించినా... డ్యూటీ వైద్యుడు రిమ్స్‌కు వచ్చి తమకు జరిగిన నష్టంపై సమాధానం చెప్పాల్సిందేనని బాధితులు పట్టుబట్టారు. సమాచారం అందుకున్న రెండో పట్టణ ఎస్ఐ వై.రవికుమార్, సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చారు. ఎట్టకేలకు రిమ్స్ సీఎస్ ఆర్‌ఎంవోకు, రెండో పట్టణ పోలీసులకు బాధితులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవ్వడంతో సమస్య సద్దుమణిగింది. -
కూలర్..కిల్లర్
పెంచికల్పేట్(సిర్పూర్) : విద్యుదాఘాతం తో చిన్నారి మృతి చెందిన సంఘటన మంచిర్యాల లోని పెంచికల్పేట్ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై ప్రభాకర్ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన షేక్ సుభాన్-కల్పన దంపతులకు ఇద్దరు సంతానం. ఎల్కపల్లి గ్రామంలో ఓ ప్రైవేట్ పాఠశాల నడుపుతూ అక్కడే నివాసం ఏర్పరుచుకున్నారు. వీరికి కుమార్తె అబీజ్‌ఇండియా(11), కుమారుడు అకీర్‌ఇండియా ఉన్నారు. మంగళవారం ఉదయం ఇంటి సమీపంలో అమర్చిన కూలర్‌ను అబీజ్‌ఇండియా తాకడంతో విద్యుత్‌షాక్‌కు గురైంది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై మెరుగైన వైద్యం నిమిత్తం తన సొంత వాహనంలో కాగజ్‌నగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. బాలిక తండ్రి కాగజ్‌నగర్ మండలంలోని బోడెపెల్లి వీఆర్వోగా పనిచేస్తుండగా తల్లి స్థానికంగా ప్రైవేట్ పాఠశాల నిర్వహణ చూస్తోంది. మృతదేహాన్ని పంచనామా కోసం సిర్పూ ర్(టి) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అప్పటివరకు మాట్లాడింది..అంతలోనే..
గొంతులో వచ్చిన సమస్యకు చికిత్స పొందిన ఆ పాప గళం.. అంతలోనే శాశ్వతంగా మూగబోయింది. ఒక్కగానొక్క బిడ్డ అని అల్లారుముద్దుగా చూసుకుంటున్న అమ్మానాన్నల హృదయాల్లో ఆరని శోకాగ్ని రగిలింది. కాకినాడ జీజీహెచ్‌లో టాన్సిల్స్‌కు చికిత్స పొందిన రాయవరం మండలం వెదురుపాకకు చెందిన ప్రేమాంజలి (13) గురువారం మరణించింది. చికిత్సలో లోపమే పాపను బలిగొందని అయినవారు ఆక్రోశిస్తున్నారు. తూర్పుగోదావరి, సర్పవరం (కాకినాడ సిటీ): కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో వైద్యులు, నర్సుల నిర్లక్ష్యం కారణంగా చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. రాయవరం మండలం వెదురుపాక గ్రామానికి చెందిన రాయుడు వెంకటరమణ, సత్యవేణిల ఏకైక కుమార్తె రాయుడు ప్రేమాంజలి(13) ఏడో తరగతి చదువుతుంది. ఆమెకు టాన్సిల్స్(గొంతుకు ఇరువైపులా కాయలు) రావడంతో బుధవారం సాయంత్రం కాకినాడ సామాన్య ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. జీజీహెచ్‌లోని ఈఎన్టీ విభాగంలో చికిత్స పొందుతుండగా గురువారం ఉదయం 7.20 గంటల వరకు అందరితో బాగానే మాట్లాడిందని, జ్వరం, కడుపుమంట ఉండడంతో నర్సుని పిలిస్తే ఇంజక్షన్ ఇచ్చినట్టు బాలిక తల్లిదండ్రులు తెలిపారు. ఇంజక్షన్ ఇచ్చిన పది నిమిషాల్లోపే ఆమె ఒళ్లంతా దద్దుర్లు, విరేచనాలు, నోట్లో నుంచి రక్తం వచ్చిందని వెంటనే పీఐసీయూకి తరలించారని తెలిపారు. తరువాత ఎవ్వరినీ లోపలికి రానివ్వకుండా బాలిక తండ్రిని పదినిమిషాలు మాత్రమే లోపలికి అనుమతించారు. కొంత సమయం తరువాత మీ పాప చనిపోయిందని మధ్యాహ్నం 1.30 గంటలకు వైద్యులు తెలిపారని మృత్యురాలు మేనమామ బోరున విలపిస్తూ చెప్పారు. చాలా బాధాకరం హిమరేక్స్ ఫీవర్స్ కావచ్చు. బాలికకు ఇచ్చిన ఇంజక్షన్ పారాసిటమాల్ మాత్రమే. దీని వల్ల ప్రమాదం కాదు. ఇంజక్షన్ వల్ల మరణించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. కాబట్టి వైద్య బృందాన్ని వివరణ కోరాను. కొన్నిసార్లు హిమరేక్స్ ఫీవర్స్ ఉన్నప్పుడు కొన్ని ఇంజక్షన్లు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అయినా ఈ బాలికకు అటువంటి సూచనలు కనిపించలేదు. ఈ సంఘటనపై విచారిస్తున్నాం. మళ్లీ పునరావృతం కాకుండా చూస్తా.– డాక్టర్ ఎం.రాఘేవేంద్రరావు,జీజీహెచ్ సూపరింటెండెంట్, కాకినాడ -
కరెంట్ షాక్‌తో బాలిక మృతి
పొద్దున్నుండి ఇంట్లో చలాకీ గా తిరిగింది.. కుటుంబసభ్యులకు ముచ్చట్లు చెప్పింది.. అంతలోనే ఆ చిన్నారిపై విధి చిన్నచూపు చూసింది. ఆరేసిన దుస్తులు తెచ్చేందుకు బంగ్లాపైకి వెళ్లిన చిన్నారికి నిండు నూరేళ్లు నిండిపోయాయి.. కరెంటుషాక్‌తో చిన్నారి అనంతలోకాలకు పయనమైంది. హృదయవిదారకమైన ఈ సంఘటన ఆదివారం నగరంలోని ఇంద్రాపూర్‌లోని సంతోష్‌నగర్‌లో జరిగింది. నిజామాబాద్ క్రైం(నిజామాబాద్‌అర్బన్): నగరంలోని 5వ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి సంతోష్‌నగర్(ఇంద్రాపూర్)కు చెందిన అనిల్, సునీతకు ముగ్గు రు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. అనిల్ మేస్త్రీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిన్నకూతురు ఉమారాణి(12) మాణిక్‌భవన్‌లో 6వ తరగతి చదువుతోంది. ఆదివారం ఇంట్లో ఉతికిన దుస్తులను మేడపైన ఆరేశారు. సాయంత్రం వీటిని తీసుకురావడానికి ఉమారాణి మేడపైకి వెళ్లింది. దండెం పైనున్న దుస్తులు తీస్తుండగా దండెం పక్కనే ఉన్న విద్యుత్ సర్వీస్‌వైరు కిందకు ఊగుతుండడంతో బాలికకు వైరు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ సమయంలో మేడపై ఎవరు లేకపోవటంతో బాలికను ఎవరు గమనించలేదు. కొద్దిసేపటికి మేడపైకి వెళ్లిన చెల్లెలిని అన్న దేవరాజు పిలువగా పై నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆయన మేడపైకి వెళ్లాడు. అయితే ఉమారాణి పడిపోయి ఉండడాన్ని గమనించి ఆమెనే లేపేందుకు ప్రయత్నించగా దేవరాజుకు కూడా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో దేవరాజు బిగ్గరగా అరవగా కొంద ఉన్న ఇంట్లోవాళ్లు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కరంట్ షాక్‌తో స్వల్పంగా గా>యపడిన దేవరాజును చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న 5వ టౌన్ ఎస్సై శ్రీహరి ఘటన స్థలానికి చేరుకుని బాలికను పరిక్షించారు. బాలిక తలకు కరంట్ షాక్ తగినట్లు గుర్తించారు. ఎస్సై కేసు నమోదు చేసుకుని పాప మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టంగదికి తరలించనున్నట్లు తెలిపారు. స్వల్పగాయాలతో బయటపడిన దేవరాజు చికిత్స అనంతరం కోలుకోవటంతో ఇంటికి పంపించి వేశారు. ఉమారాణి మృతితో సంతోష్‌నగర్‌లో విషాదచాయలు అలుముకున్నాయి.∙ -
రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
సిర్పూర్(టి): మండలంలోని పారిగాం గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగు సంవత్సరాల చిన్నారి మతి చెందగా ఓ వద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. సిర్పూర్(టి) ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని ధనోరా గ్రామానికి చెందిన నాగుబాయి అనే వద్ధురాలు తన మనవరాలైన రాంటెంకి ఇషాని(04) ని తీసుకోని పారిగాం గ్రామంలోని ఓ పెళ్లి వేడుకలకు వచ్చింది. పారిగాం గ్రామంలో ఆటో దిగి గ్రామంలో జరిగే పెళ్లి వేడుకలకు వెళ్తుండగా సిర్పూర్(టి) నుంచి లోనవెల్లి గ్రామం వైపు వెళ్తున్న లోనవెల్లి గ్రామానికి చెందిన ఔత్కర్ శరత్ బైక్‌తో వీరిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇషాని మతి చెందింది నాగుబాయికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. -
నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం
బాపట్ల: విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం మంగళవారం రాత్రి చోటు చేసుకున్న పావని మృత్యువాత. గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని గతంలో అనేక కథనాలు సాక్షిలో ప్రచురించినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. దీంతో ఓ నిండు ప్రాణం విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యానికి బలైంది. మండలంలోని చెరువుజమ్ములపాలెం వద్ద బోయిన పావని విద్యుత్ వైర్లు తగులుకొని మృతి చెందినప్పటికి అధికారులు ఇంకా కళ్లుతెరవలేదు. భర్తీపూడి, ముత్తాయపాలెం జిల్లాపరిషత్ హైస్కూల్, ప్రాథమిక పాఠశాల మధ్యలో రోడ్డుపక్కనే ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదభరితంగా ఉంది. ఇప్పటికైనా విద్యుత్‌శాఖ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహాం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిండుప్రాణం పోయిందని ఎమ్మెల్యే కోన రఘుపతి పేర్కొన్నారు. మండలంలోని చెరువుజమ్ములపాలెంలో మంగళవారం రాత్రి మృతి చెందిన బోయిన పావని మృతదేహాన్ని బుధవారం పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎన్నిసార్లు విద్యుత్ అధికారులకు ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్పినా ఫలితం లేదని పావని తండ్రి నాగరాజుతోపాటు కుటుంబ సభ్యులు బోరున విలపించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కోన రఘుపతి విద్యుత్ అధికారులను మందలించారు. నియోజకవర్గంలో ప్రమాదభరితంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తించాలని సూచించారు. ఈవిషయంపై విద్యుత్ శాఖను నివేదిక కోరటంతోపాటు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని చెప్పారు. నరాలశెట్టి ప్రకాశరరావు, కోకి రాఘవరెడ్డి, ఆట్ల ప్రసాద్‌రెడ్డి,రాజా ఉన్నారు. ఎమ్మెల్సీ అన్నం పరామర్శ విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన బోయిన పావని మృతదేహాన్ని ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్ పరామర్శించారు. కుటుంభ సభ్యులను ఓదార్చటంతోపాటు ప్రభుత్వ పరమైన సాయం అందేవిధంగా చూస్తామని చెప్పారు. -
తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక..
జిన్నారం/గుమ్మడిదల (పటాన్చెరు): తోటి విద్యార్థుల వేధింపులకు మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించి చివరికి కన్నుమూసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో చోటు చేసుకుంది. శ్రీశైలం, పుణ్యవతి దంపతుల కూతురు లావణ్య తోటి విద్యార్థుల వేధింపులతో మనస్తాపానికి గురై వారం క్రితం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను వెంటనే హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారం రోజులు మృత్యువుతో పోరాడిన లావణ్య సోమవారం కన్నుమూసింది. లావణ్య బొంతపల్లి గ్రామంలోని ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె తరగతికే చెందిన ఇద్దరు విద్యార్థులు నెల రోజులుగా సూటిపోటి మాటలతో వేధించారు. ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతో చివరికి ఆత్మహత్యకు యత్నించింది. లావణ్య కుటుంబీకులు పాఠశాల యాజమాన్యంతో ఈ విషయమై గొడవకు దిగగా పోలీసులు సర్ది చెప్పారు. -
వీరికి సరదా.. వారికి ప్రాణసంకటం
దేవనహళ్లి: కొందరి సరదా మరికొందరికి ప్రాణసంకటమవుతోంది. అయినా సరదారాయుళ్లలో మార్పు రావడంలేదు. ఈ కోవలోనే ఓ యువకుడి వీలింగ్(బైక్ విన్యాసాల) పిచ్చికి బాలిక బలైంది. హైదరాబాద్-బెంగళూరు రహదారిలోని దేవనహళ్లి తాలూకా బుళ్ళహళ్లి గేట్ వద్ద ఈ విషాద ఘటన ఆదివారం ఉదయం జరిగింది. అంజలి అనే బాలిక తన తండ్రితో కలిసి మంచినీరు తెచ్చుకునేందుకు రోడ్డు దాటుతోంది. ఈ క్రమంలో ఓ యువకుడు ఖరీదైన బైక్‌తో వీలింగ్ చేస్తూ ఆమెను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అంజలి అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. వీలింగ్ చేస్తూ అతడి వెనుకే వచ్చిన మరికొందరు యువకులను సైతం పట్టుకుని కొట్టి వారి ఖరీదైన బైక్‌లను ధ్వంసం చేశారు. వీకెండ్స్‌లో బెంగళూరు నుంచి వచ్చే యువకులు నందికొండ వరకూ వీలింగ్ చేస్తూ స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. వీలింగ్ను అరికట్టాలని ఎంతోకాలంగా పోలీసులకు విన్నవించుకున్నా వారు చర్యలు తీసుకోలేదని, ఈ ఘటనకు పోలీసులే కారణమని ఆరోపిస్తూ స్థానికులు గంటపైగా రాస్తారోకో చేపట్టారు. విజయపుర పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చనిపోయిన పాప కదిలిందంటూ..
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ప్రాణముండగానే.. బాలిక మృతి చెందినట్లు ప్రభుత్వ వైద్యులు నిర్ధారించారనే ప్రచారం శనివారం నగరంలో కలకలం రేపింది. విజ యవాడ న్యూరాజరాజేశ్వరిపేటకు చెందిన పోతిన సాయిదుర్గ (14) పదిరోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఈ నెల 25న ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాలిక తీవ్ర శ్వాసకోశవ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు నిర్ధారించి తొలుత అక్యుట్ మెడికేర్ (ఏఎంసీ)లో, అనంతరం వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సచేశారు. శుక్రవారం అర్ధరాత్రి 12.30కు బాలిక మృతి చెందడంతో బంధువులకు అప్పగించారు. అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా.. శనివారం మధ్యాహ్నంఅంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తుండగా బాలిక కదిలిందని బంధువుల్లో ఒకరికి అనుమానం వచ్చింది. ఆర్ఎంపీని తీసుకురాగా ఆయన నాడికొట్టుకుంటోందని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. దీంతో తమ బిడ్డను బతికించుకునేందుకు కుటుంబ సభ్యులు మూడు ఆస్పత్రులకు తీసుకెళ్లినా వారంతా పాప చనిపోయిందని నిర్ధారించారు. అయినప్పటికీ పాప బతుకుతుందనే ఆశతో మళ్లీ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసుల సమక్షంలో ఈసీజీ తీసిన వైద్యులు బాలిక మరణించిందని తేల్చారు. -
ప్రేమోన్మాది దాడిలో గాయపడిన సంధ్య మృతి..
-
చిన్నారిని బలిగొన్న టీవీ సీరియల్!
టీవీలు, సినిమాలు వినోదాన్ని పంచాలి. నవ్వించాలి. ఏకాంతాన్ని మరిపించాలి. విజ్ఞానాన్ని పంచాలి. చరిత్రను, సంస్కృతిని చాటిచెప్పాలి. కానీ.. అలా జరగడంలేదు. సినిమాలే కాదు, సీరియళ్లు కూడా హింసను, పగను, ద్వేషాన్ని ప్రేరేపిస్తున్నాయి. వినోదాన్ని పంచాల్సిందిపోయి.. విషాదాన్ని మిగిలిస్తున్నాయి. సాక్షి, బెంగళూరు: హింస, పగ, ద్వేషంతో కూడిన నేటి టీవీ సీరియళ్లు పిల్లలపై ఎంతటి దుష్ప్రభావాన్ని చూపుతాయో తెలిపే సంఘటన ఇది. తల్లిదండ్రులతో కలిసి టీవీలో సీరియల్ చూసిన ఓ చిన్నారి, అందులో హీరోయిన్ చేసినట్లుగానే మంటల మధ్య డ్యాన్స్ చేయడానికి యత్నించి సజీవ దహనమైంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళ్తే... దావణగెరె జిల్లా హరిహర పట్టణలోని ఆశ్రయ కాలనీలో నివాసం ఉంటున్న చైత్రా, మంజునాథల కుమార్తె ప్రార్థన (7). రెండో తరగతి చదువుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో ఓ టీవీ చానల్లో ప్రసారమయ్యే ‘నందిని’ సీరియల్‌ను ఇష్టంగా చూసేది. ఈ నెల 11న ప్రార్థనను పాఠశాల నుంచి తీసుకొచ్చిన నాయనమ్మ టీవీ ఆన్ చేసి బయటికి వెళ్లిపోయింది. ఆ సమయంలో సీరియల్లో హీరోయిన్ తనకు తాను నిప్పంటించుకొనే సన్నివేశం రావడంతో తాను కూడా అలాగే చేయాలనుకున్న బాలిక.. ఇంట్లో ఉన్న పేపర్లను చుట్టూ వేసుకుని నిప్పంటించింది. వాటి మధ్య నిలబడి డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించింది. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రార్థనా శరీరానికి నిప్పంటుకొని తీవ్ర గాయాలయ్యాయి. బాధను తట్టుకోలేక ప్రార్థన కేకలు వేయడంతో పొరుగువారంతా వచ్చి, మంటలను ఆర్పేసి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కోలుకోలేనిస్థాయిలో బాలిక శరీరం కాలిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 24 గంటలు గడవకముందే మరణించింది. ఏ తల్లిదండ్రులకూ ఈ పరిస్థితి వద్దు.. ఘటన వివరాలను ప్రార్థన తల్లిదండ్రులు బుధవారం మీడియాకు వివరించారు. ‘మా చిన్నారి ఆ సీరియల్‌ను ప్రతిరోజూ చూస్తూ వాటిలోని పాత్రలను అనుకరించేది. ఆ సీరియల్లో హీరోయిన్ చేసినట్లుగానే చేసింది. ఇన్ని రోజులు బాధలో ఉన్న మేము, భవిష్యత్తులో ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదనే నిజాన్ని మీడియా ఎదుట చెబుతున్నాం’అని కంటతడి పెట్టుకున్నారు. -
వైఎస్ఆర్ జిల్లాలో దారుణం
ప్రొద్దుటూరు: వైఎస్సార్ కడప జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు అమృతానగర్‌కు చెందిన దంపతులు కన్నకూతురిని దారుణంగా హత్యచేశారు. అనంతరం కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి కిడ్నాప్ డ్రామాకు తెరతీశారు. స్థానికంగా నివాసముంటున్న గైబుషా, ఫాతిమా దంపతులు తమ ఐదేళ్ల కూతురు రొఖియా(5) కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దంపతులిద్దరు పొంతన లేని సమాధానాలు చెప్తుండటంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో ఇంటి ఆవరణలోనే పాప మృతదేహాన్ని గుర్తించారు. దీంతో తల్లిదండ్రులను గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. చిన్నారి రొఖియాకు మెదడువాపు వ్యాధి సోకడంతో తల రోజు రోజుకు లావుగా పెరుగుతూ అంద వికారంగా కనిపిస్తుండటంతో తామే హతమార్చి నీళ్ల బకెట్లో పడేశామని పోలీసులకు తెలిపారు. -
టిప్పర్ ఢీకొని రెండేళ్ల చిన్నారి మృతి
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. టిప్పర్ ఢీకొని రెండేళ్ల పాప మృతి చెందింది. జిల్లాలోని ఇల్లెందు మండలంలోని పొలారంలో టిప్పర్ ఢీకొని రెండేళ్ల పాప చనిపోయింది.. ఇంటి ముందు ఆడుకుంటున్న వినీత(2) అనే చిన్నారిని ప్రమాదవశాత్తూ టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
విశాఖలో సైకో భయోత్పాతం
- బాలిక మృతి, మరొకరికి గాయాలు విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా కైలాసపురంలో ఓ సైకో భయోత్పాతం సృష్టించాడు. తాగిన మైకంలో కత్తితో దాడి చేయడంతో ఓ పదేళ్ల బాలిక మృతిచెందింది. పక్కనే ఉన్న మరో ఎనిమిదేళ్ల బాలికకు తీవ్రగాయాలయ్యాయి. బాలిక పరిస్థితి విషమంగా ఉంది. కంచరపాలెం పోలీసులు సైకోను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాలిక మృతదేహంతో ఆందోళన
సర్వీసు రోడ్లు పూర్తి చేయకపోవడం వల్లే ప్రమాదం గుడిహత్నూర్: రోడ్డు దాటుతున్న ఓ బాలికను లారీ ఢీకొనడంతో మృతి చెందింది. జాతీయ రహదారి మృత్యుమార్గంగా మారిందని.. సర్వీసు రోడ్ల అసంపూర్తి నిర్మాణంతో ప్రమాదాలు జరుగుతున్నా యని ఆ బాలిక మృతదేహంతో గురువారం గ్రామ స్తులు, తల్లిదండ్రులు గుడిహత్నూర్‌లోని జాతీయ రహదారిపై బైఠాయించారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన హోళం బే రాజు, జ్యోతి దంపతుల కూతురు శృతి (11) స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువు తోంది. బుధవారం రాత్రి పెన్సిల్, ఎరేజర్ కొను క్కోవడానికి 44వ నంబరు జాతీయ రహదారి దాటుతుండగా లారీ ఢీకొట్టింది. దీంతో శృతి ఎగిరి రోడ్డుపై పడిపోయింది. చుట్టుపక్కల వారు అంబు లెన్స్‌లో రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమ ధ్యంలో మృతి చెందింది. సర్వీసు రోడ్లు అసం పూర్తిగా ఉండడంతో గతంలోనూ ప్రమాదాలు జరి గాయి. ఈ క్రమంలో స్థానికులు అండర్ టన్నెల్ బ్రిడ్జి నిర్మించాలని పలుమార్లు ఆందోళన చేశారు. అలాగే, గురువారం గ్రామస్తులు రోడ్డుపై టెంటు వేసి ఆమె మృతదేహంతో బైఠాయించారు. జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరిస్తామని రాసివ్వడంతో ఆందోళన విరమించారు. -
వేరొకరిని ప్రేమించిందని కక్షగట్టి..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మెర్సిడిస్ కారులో జరిగిన యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వేరే వ్యక్తితో లవ్ అఫైర్ ఉందన్న అక్కసుతోనే హత్యచేశానని నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. సౌత్-వెస్ట్ డీసీపీ సురేందర్ కుమార్ కథనం ప్రకారం.. కొన్ని రోజుల కిందట స్థానిక నజఫ్ గఢ్‌కు చెందిన సిమ్రన్(17) ఇద్దరు స్నేహితులతో కలిసి షాపింగ్‌కు వెళ్లింది. షాపింగ్ తర్వాత ఇద్దరితో కలిసి మెర్సిడిస్ కారులో ఇంటి సమీపానికి చేరుకుంది. ఓ యువకుడు కారు దిగి వెళ్లిపోయాడు. కారులోనే ఉన్న శుభం గుప్తా, సిమ్రన్ను ఆమె తల్లి చూస్తుండగానే తుపాకీతోనే కాల్చేశాడు. ఆ వెంటనే సిమ్రన్ తల్లి ఇంటి ముందున్న కారు వద్దకు పరుగున వెళ్లి చూడగా కూతురు అప్పటికే చనిపోయింది. ఈ విషయంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. హత్యకు కొంత సమయం ముందు వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలు, తీసుకున్న వీడియోలు సిమ్రన్ మొబైల్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీని ఆధారంగా నిందితుడి కోసం గాలించి, దక్షిణ ఢిల్లీలోని ఓ బంధువు ఇంట్లో తలదాచుకున్న శుభమ్ గుప్తాను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సురేందర్ కుమార్ తెలిపారు. నితిన్ అనే మరో వ్యక్తితోనూ సన్నిహితంగా ఉండటం, తనకు అబద్ధాలు చెప్పడంతో హత్యచేసినట్లు నిందితుడు శుభమ్ గుప్తా వెల్లడించాడు. తన తల్లి పోన్ చేపినప్పుడు నితిన్ లాగా మాట్లాడాలని చెప్పడంతో శుభమ్‌కు విపరీతమైన కోపం వచ్చింది. అంతకుముందు ఇద్దరు ఓ పార్టీకి వెళ్లగా తీసుకున్న ఫొటోలలో.. చేతిలో పిస్తోల్‌తో దిగిన ఫొటోకు అన్ని బుల్లెట్లు లోడ్ చేసి ఉన్నాయి అని క్యాప్షన్ తో పోస్ట్ చేశాడు. ఇంటి ముందు కారు ఆపిన తర్వాత.. నితిన్ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, వెంటనే తుపాకీతో కాల్చేశానని చెప్పాడు. కాల్పులు జరిపిన అనంతరం తాను భయంతో అక్కడినుంచి పారిపోయానని నిందితుడు పూర్తి వివరాలను పోలీసులకు తెలిపాడు. సిమ్రన్ మొబైల్ ఆధారంగానే కేసు మిస్టరీని త్వరగా ఛేదించగలిగామని పోలీసులు వివరించారు. -
తల్లి చూస్తుండగానే ఓ యువతిని కాల్చేశాడు..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. తల్లి చూస్తుండగానే ఓ యువతిని ఆమె స్నేహితుడే తుపాకీతో కాల్చి హత్యచేశాడు. ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక నజఫ్ గఢ్‌కు చెందిన పదిహేడేళ్ల యువతి తన ఇద్దరు స్నేహితులతో కలిసి షాపింగ్ చేసేందుకు బయటకు వెళ్లింది. షాపింగ్ ముగించుకున్న తర్వాత ఇద్దరు యువకులు(ఆమె ఫ్రెండ్స్) ఆ యువతిని తమ మెర్సిడేజ్ కారులో ఇంటివద్ద డ్రాప్ చేశారు. అయితే ఇంటి ముందే ఆ యువకులతో మాట్లాడుతూ ఉంది. షాపింగ్‌కు వెళ్లిన తన కూతురు తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె తల్లి ఆందోళన చెందింది. అదే సమయంలో.. తన కూతురితో పాటుగా ఉన్న ఇద్దరు స్నేహితులలో ఒక యువకుడు ఇంటి ముందు మెర్సిడేజ్ కారు నుంచి కారు నుంచి దిగి వెళ్లిపోగా, మరో యువకుడు కారులో ఉన్నాడని చెప్పారు. కొన్ని క్షణాల తర్వాత ఆమె గమనిస్తుండగానే తుపాకీతో కాల్చినట్లుగా శబ్ధం వచ్చిందని, ఆ సౌండ్ విన్న వెంటనే కారు వద్దకు పరుగున వెళ్లి చూడగా తన కూతురు రక్తపు మడుగులో పడి ఉందని కన్నీటి పర్యంతమయింది. చివరగా రాత్రి ఏడున్నర గంటలకు కూతురితో ఫోన్లో మాట్లాడినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడు తుపాకీని ఘటన స్థలంలో వదిలేసి పరారయ్యాడని పోలీసులకు బాధితురాలి తల్లి వివరించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆ యువకుడి వివరాలు సేకరించి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
డ్రైవర్ నిర్లక్ష్యానికి బాలిక మృతి
వేములపల్లి: నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం ఆగమోత్కూరులో డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ చిన్నారి నిండు ప్రాణం బలి అయిపోయింది. తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వెళ్లగా కుమార్తె రక్ష(5) కూడా వారితో వెళ్లింది. అక్కడ ఆమె ఆడుకుంటుండగా ట్రాక్టర్ డ్రైవర్ ఆమెను గమనించకుండా నిర్లక్ష్యంగా ట్రాక్టర్‌ను వెనుకకు నడిపాడు. దీంతో ట్రాక్టర్ కింద పడిపోయిన ఆ చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. -
నార్కెట్‌పల్లిలో దారుణం
నార్కెట్‌పల్లి: అంగవైకల్యంతో బాధపడుతున్న యువతి అగ్నికి ఆహుతయింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం మాండ్ర గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఇళ్లు మొత్తం మంటలు వ్యాపించడంతో.. అందులో ఉన్న వికలాంగురాలు బోసు సుజాత(16) బయటకు రాలేక మంటలకు ఆహుతై మృతిచెందింది. -
డెంగీతో బాలిక మృతి
జహీరాబాద్: మెదక్ జిల్లా జహీరాబాద్ జమాల్ కాలనీకి చెందిన ఓ బాలిక డెంగీతో బాధపడుతూ మృతి చెందింది. స్థానికంగా నివాసముంటున్న ఆయేషా(12) ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం: ప్రియురాలి మృతి
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం తాడిపర్తిలో గురువారం విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనలో ప్రియురాలు మృతి చెందగా.. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. తాడిపర్తి గ్రామానికి చెందిన వారు ఈ విషయాన్ని గమనించి... యువకుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యవతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డెంగీతో బాలిక మృతి
జవహర్‌నగర్: డెంగీతో ఓ బాలిక మృతిచెందిన ఘటన జవహర్‌నగర్‌లోని గబ్బిలాలపేటలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండల కేంద్రానికి చెందిన గోపి, మల్లీశ్వరీ దంపతులు బతుకుదెరువు కోసం వలస వచ్చి జవహర్‌నగర్‌లోని గబ్బిలాలపేటలో నివాముంటున్నారు. వీరి పెద్దకూతురు గాయత్రి (4) నెలరోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా దమ్మాయిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షలు నిర్వహించి డెంగీ సోకిందని వైద్యులు గుర్తించారు. అనంతరం తీవ్ర జ్వరం, వాంతులు రావడంతో ఏఎస్‌రావునగర్‌లోని అంకూర్ ఆస్పత్రికి..అక్కడి నుంచి పంజగుట్టలోని అంకూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో బాలిక గాయత్రి గురువారం తెల్లవారుజామున మృతిచెందింది. నాలుగేళ్లకే.. నూరేళ్లు నిండాయా తల్లి.. ఈ సంవత్సరమే పాఠశాలకు వెళ్లి ఏబీసీడీలు నేర్చుకుంటున్న తమ కూతురుని చూసిమెంతో మురిసిపోయామనే.. అంతలోనే ఇలా మృత్యువాత పడుతుందను కోలేదని బాలిక తల్లిదండ్రులు గోపి, మల్లీశ్వరి రోదనలు మిన్నంటాయి. నాలుగేళ్లకే నీకు నూరేళ్లు నిండాయా... నా బంగారు కొండా.. అంటూ మల్లీశ్వరి గుండెలుబాదుకుంటూ రోదించిన తీరు హృదయ విదారకం. -
కరెంట్ షాక్‌తో చెట్టుపైనే చివరి శ్వాస
మామిడికాయలు కోసేందుకు కూలీకి వెళ్లిన బాలిక మృతి హుస్నాబాద్ రూరల్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం అంతకపేటలో మామిడి కాయలు తెంపేందుకు శనివారం కూలీకి వెళ్లిన బాలిక కరెంట్ షాక్‌తో చెట్టుపైనే మృతి చెందింది. భీమదేవరపల్లి మండలం కన్నారానికి చెందిన మందడల రాజు, శారదల పెద్ద కూతురు సంధ్య(16) ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసింది. సెలవులు కావడంతో గ్రామస్తులతో కలసి అంతకపేటలో మామిడి కాయలు తెంపేందుకు కూలీకి వచ్చింది. చెట్టు ఎక్కి కాయలు తెంపుతుండగా.. అక్కడున్న విద్యుత్ తీగల్ని గమనించక పోవడంతో షాక్ కొట్టి చెట్టుపైనే మృతి చెందింది. అదే చెట్టుపై ఉన్న సాంబరాజు, నితిన్‌లు సంధ్యను చూసి భయంతో చెట్టుపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అంతకపేటకు చెందిన రాంరెడ్డి మామిడితోటను మరొకరు గుత్తకు తీసుకుని కాయలను తెంపిస్తున్నాడు. కాయలు తెంపేందుకు బాలకార్మికులను వినియోగించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడితోట యజమాని, గుత్తేదారు, విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. -
విద్యుత్ తీగ తెగిపడి బాలిక దుర్మరణం
సిరివెళ్ల: కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామంలో శనివారం ఉదయం 11 కేవీ విద్యుత్ తీగ తెగిపడి గడ్డం చెన్నమ్మ(14) అనే బాలిక మృతిచెందింది. ప్రకాష్ కుమార్తె చెన్నమ్మ శనివారం ఉదయం ఇంటి ముందు ఉండగా పైనున్న విద్యుత్ తీగ ఒక్కసారిగా తెగిపడింది. దాంతో విద్యుత్ షాక్‌కు గురైన చెన్నమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. -
విద్యుత్ తీగ తెగిపడి బాలిక దుర్మరణం
సిరివెళ్ల: కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామంలో శనివారం ఉదయం 11 కేవీ విద్యుత్ తీగ తెగిపడి గడ్డం చెన్నమ్మ(14) అనే బాలిక మృతిచెందింది. ప్రకాష్ కుమార్తె చెన్నమ్మ శనివారం ఉదయం ఇంటి ముందు ఉండగా పైనున్న విద్యుత్ తీగ ఒక్కసారిగా తెగిపడింది. దాంతో విద్యుత్ షాక్‌కు గురైన చెన్నమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. -
గుంటూరు ఆస్పత్రిలో మరో దారుణం
గుంటూరు : గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మరో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగానే ఓ బాలిక మృతిచెందింది. అయితే, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని ఆ బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రి వద్ద తమకు న్యాయం చేయాలంటూ బాలిక మృతదేహంతో బంధువులు ఆందోళన చేస్తున్నారు. గత నెల ఎలుకలు కొరకడంతో ఓ పసివాడు మృతిచెందిన విషయం విదితమే. -
డెంగీతో చిన్నారి మృతి
చెన్నూరు: వైఎస్ఆర్ జిల్లా లో డెంగీతో ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలం చిన్నమాసపల్లి గ్రామంలో వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన మాదినేని గిరిప్రసాద్, ఉమాదేవి దంపతులకు కావ్యశ్రీ(6) కుమార్తె. కాగా, గత మూడు రోజులుగా జ్వరం రావడంతో కడప ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించారు. తిరుపతిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కావ్యశ్రీ మృతి చెందింది. డెంగీ తో బాలిక మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. -
హాస్టల్ విద్యార్థిని ఆకస్మిక మృతి
అనారోగ్యమే కారణమని అధికారుల వెల్లడి కశింకోట: స్థానిక సమగ్ర సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం బాలిక మంగళవారం ఆకస్మికంగా మృతి చెందింది. అనారోగ్యంమే కారణమని అధికారులు తెలిపారు. మాకవరపాలెం మండలం అప్పన్నదొరపాలెం గ్రామానికి చెందిన అడిగర్ల గౌతమి (11) ఇక్కడి వసతి గృహంలో ఉంటూ స్థానిక బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో సోమవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చూపించారు. మంగళవారం కూడా ఉబ్బసంతో బాధపడుతూ ఆయాసంతో పాటు వాంతులు కావడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి జె.ప్రశాంతి పరీక్షించి పరిస్థితి బాగోగపోవడంతో అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. అక్కడ గౌతమి మృతి చెందినట్లు వసతిగృహం సంక్షేమ అధికారి శ్యామల, పీహెచ్సీ వైద్యాధికారి జె.ప్రశాంతి తెలిపారు. ఆ బాలికకు ఉబ్బసంతోపాటు గుండెకు సంబంధించిన వ్యాధి ఉందని, విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఇప్పటికే వైద్యం పొందుతోందని చెప్పారు. ఈ విషయాన్ని తెలియజేయకుండా వసతిగృహం తెరిచినప్పుడు ఈ నెల 17న వచ్చి చేరినట్లు తెలిపారు. తమ కుమార్తెకు ఆరోగ్యం సరిగాలేదని, విశాఖలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నామని తల్లిదండ్రులు తెలిపారని అనకాపల్లి అసిస్టెంట్ సాంఘిక సంక్షేమ అధికారి పి.వి.ఎస్.ఎస్.జయలక్ష్మి తెలిపారు. గౌతమి గత ఏడాది ఆరో తరగతిలో ఇక్కడ చేరిందన్నారు. రోజూ తమతోపాటు ఉండే గౌతమి ఆకస్మాత్తుగా మృతి చెందడం విద్యార్థులను కలచివేసింది. ఆ బాలిక మృతికి సంతాపంగా మౌనం పాటించి బాలికల హైస్కూలుకు సెలవు ప్రకటించారు. మతదేహాన్ని అనకాపల్లి ఆస్పత్రి నుంచి స్వస్థలానికి తీసుకెళ్లారు. ఎంఈఒ ఎం.ఎస్. స్వర్ణకుమారి పాఠశాలను పరిశీలించి గౌతమి మృతి గురించి వివరాలు తెలుసుకున్నారు. -
బాలిక ప్రాణం తీసిన బాల్య వివాహం
14 ఏళ్ల వయస్సులో పెళ్లి 16 ఏళ్లకు గర్భిణి కాన్పు అయిన 16 రోజులకు మృతిచెందిన బాలిక దగదర్తి : బాల్య వివాహం ఓ బాలిక ప్రాణాలు తీసింది. 14 ఏళ్ల వయస్సులోనే తల్లిదండ్రులు పెళ్లి చేయడం ఆ అమాయకురాలి జీవితాన్ని నాశనం చేసింది. 16 ఏళ్ల వయస్సులోనే గర్భిణి వచ్చింది. కాన్పు అయిన 16 రోజుల్లో ఆ బాలిక మౌనిక (16) మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని వెలుపోడు పంచాయతీ మజరా కామినేనిపాళెంలో గురువారం చోటుచేసుకుంది. రోజుల పసికూన అమ్మ ఒడికోల్పోయాడు. కామినేనిపాళెంకు చెందిన వంకదారి మాల్యాద్రి, ధనలక్ష్మీ దంపతుల కుమార్తె మౌనికను అదే గ్రామానికి చెందిన కండే రాము, జయమ్మ దంపతుల రెండో కుమారుడు చిన హజరత్తయ్యకు ఇచ్చి ఏడాదిన్నర కిందట వివాహం చేశారు. మొదటిలో సజావుగా సాగిన కాపురం ఆరు నెలలకే అత్తమామల వేధింపులు ఎక్కువయ్యాయని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో మౌనిక గర్భందాల్చిన మూడు నెలలకే అత్తమామలు పుట్టింటికి పంపినారన్నారు. అప్పటి నుంచి తల్లిదండ్రుల సంరక్షణలో వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఈ నెల 13వ తేదీన నెల్లూరు జూబ్లి హాస్పటల్లో మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆపరేషన్ చేసి వైద్యులు పురుడుపోశారన్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం మౌనిక కళ్లు తిరుగుతున్నాయి అని పడిపోవడంతో హుటాహుటిన వైద్యపరీక్షలకు తరలిస్తుండగా కొడవలూరు మండలం రాజుపాళెం సమీపంలోకి వెళ్లేటప్పటికి మృతి చెందిందన్నారు. అనంతరం తల్లిదండ్రులు మౌనిక మృతదేహాన్ని అత్తాంటికి చేర్చగా అత్తమామలు, భర్త ఇళ్లు వదిలి పరారయ్యారని చెప్పారు. ఉదయం వైద్యపరీక్షలకు భర్త చిన హజరత్తయ్య కూడ వచ్చాడని చెప్పారు. ఈ సంఘటన గురించి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. పదో తరగతి చదువుతుండగనే వివాహం.. టెన్త చదివే సమయంలోనే మౌనికకు వివాహం చేశారు. చిన్నతనంలోనే వివాహమైన మౌనిక మృతి చెందడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఆరోగ్య సిబ్బంది సరైన వైద్యం అందించకనా లేక పోషకాహార లోపమా అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి భారతీరెడ్డిని వివరణ కోరగా మౌనిక గర్భం ధరించిన నాటి నుంచి మరణించనంత వరకు వైద్యపరీక్షలు చేపట్టిన రికార్డులను పరిశీలించి తగిన చర్యలు చేపడతామన్నారు. -
అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి
జంగారెడ్డిగూడెం రూరల్ :జంగారెడ్డిగూడెం శ్రీరామ్‌నగర్‌లో ఒక ఇంట్లో 16 సంవత్సరాల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం మండలం వేగవరానికి చెందిన దాసరి మహాలక్ష్మయ్య, లక్ష్మి దంపతుల కుమార్తె దాసరి చిట్టెమ్మను, జంగారెడ్డిగూడెం శ్రీరామ్‌నగర్‌లో ఉంటున్న ఆర్ఎంపీ వైద్యుడు పీవీ మల్లేశ్వరరావు పెంచుకుంటున్నారు. మూడు సంవత్సరాలుగా చిట్టెమ్మ డాక్టర్ మల్లేశ్వరరావు వద్దే ఉంటోందని తల్లితండ్రులు తెలిపారు. ఆదివారం ఉదయం 6 గంటలకు తాను తనభార్యతో విజయవాడ శుభాకార్యానికి వెళ్లినట్లు డాక్టర్ మల్లేశ్వరరావు తెలిపారు. అయితే ఇంట్లో చిట్టెమ్మ ఉరి వేసుకున్న విషయం తన బావమరిది అయిన విజయకృష్ణ, కిషోర్ ఫోన్ ద్వారా తనకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ఇంట్లో బెడ్రూమ్లో ఫ్యాన్‌కు చున్నితో వేలాడుతూ చిట్టెమ్మ మృతదేహం కనిపించింది. కాళ్లు కూడా నేలకు ఆనించి ఉండటంతో చిట్టెమ్మే ఉరివేసుకుని ఉంటుందా, లేక వేరే ఏదైనా ఘటన చోటు చేసుకుని ఉండి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకటరావు, సీఐ శ్రీనివాసయాదవ్, ఎస్సై ఆనందరెడ్డిలు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. చిట్టెమ్మ మృతితో తల్లితండ్రులతో పాటు, బంధువుల్లో విషాదఛాయలు అలముకున్నాయి. నిన్న రాత్రే తన కూతురు చిట్టెమ్మ ఫోన్లో మాట్లాడిందని చెబుతూ తల్లి లక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. -
కదులుతున్న బస్సులోంచి తోసేశారు
మోగా: తమ కూతురుపై ఆకృత్యాలకు పాల్పడుతున్న వారిని అడ్డుకున్నందుకు కదులుతున్న బస్సులోంచి తోసేయడంతో కూతురు చనిపోగా కన్నతల్లికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. మోగా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ తల్లి, పద్నాలుగేళ్ల కూతురు, కుమారుడు కలిసి గురుద్వారా దర్శనానికి ప్రైవేట్ బస్సులో బయలు దేరారు. పది కిలో మీటర్లు వెళ్లాక బస్సులోని కొందరు వ్యక్తులు తమ కూతురుతో తప్పుడుగా ప్రవర్తించడం గుర్తించిన తల్లి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఓ వ్యక్తి మొదట ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె కండక్టర్‌కు ఫిర్యాదు చేయగా అతడు కూడా చెడుగా ప్రవర్తించినవారితో జతకట్టి అందరూకలిసి తల్లిని కూతురుని తిట్టడం మొదలుపెట్టారు. భయంతో ఆ తల్లి బస్సు డ్రైవర్ వద్దకు వెళ్లి బస్సు ఆపాల్సిందిగా బతిమిలాడుకున్నా.. అతడు ఆపకుండా నడిపాడు. అలా పదిహేను నిమిషాల పాటు వారిని బస్సులో ఇబ్బంది పెట్టి కిందికి తోసేశారు. దీంతో రోడ్డు మీద పడి బలమైన గాయాల పాలయిన బాలిక.. గంటలపాటు ఎవరి సాయం అందక నడిరోడ్డుపైనే ప్రాణాలుకోల్పోయింది. గాయాలపాలయిన తల్లి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. బస్సును గుర్తించిన పోలీసులు బస్సు డ్రైవర్, కండక్టర్ ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. -
స్వైన్‌ఫ్లూతో యువతి మృతి
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మరో స్వైన్‌ఫ్లూ మృతి నమోదైంది. ఆదిలాబాద్‌కు చెందిన గీతకు (18) స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయింది. చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతిచెందింది. ఈ ఏడాది జనవరి నుంచి గాంధీ ఆస్పత్రిలో జరిగిన స్వైన్‌ఫ్లూ మరణాల సంఖ్య 65కు పెరిగింది. గాంధీ ఐసోలేషన్ వార్డులో చిన్నారితోపాటు తొమ్మిది మంది స్వైన్‌ఫ్లూ బాధితులకు, డిజాస్టర్, ఏఎంసీ వార్డులో 22 మంది స్వైన్‌ఫ్లూ అనుమానితులకు వైద్య సేవలు అందిస్తున్నారని గాంధీ నోడల్ అధికారి కే. నర్సింహులు తెలిపారు. -
డెంగ్యూతో చిన్నారి మృతి
పులివెందుల :డెంగ్యూతో బాధపడుతూ ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పులివెందుల మండలంలోని అచ్చెవల్లి గ్రామానికి చెందిన గంగాధర రెడ్డి, అరుణ దంపతుల కుమార్తె చరిష్మా రెడ్డి(4)కి ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే బాలిక డెంగ్యూతో బాధపడుతున్నట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. కాగా చికిత్స పొందుతూ బాలిక శుక్రవారం ఉదయం మృతి చెందింది. అయితే గ్రామంలో 15 రోజుల కిందట మరో చిన్నారి కూడా డెంగ్యూ మహమ్మారికి బలయ్యాడు. దీంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. -
అత్యుత్సాహమే ప్రాణం తీసింది..
న్యూఢిల్లీ: ఇద్దరు టీనేజ్ పిల్లల అత్యుత్సాహం ఒకరి ప్రాణాలు తీసిన ఘటన దక్షిణ ఢిల్లీలోని వసంత విహార్ ఏరియాలో చోటు చేసుకుంది. తన స్నేహితురాలిని సరదాగా అలా బైటికి తీసుకెళ్లాలనుకున్న ఓ టీనేజ్ కుర్రాడు ఇంటిలోంచి కారును దొంగతనంగా తీసుకొచ్చాడు. కానీ కారును అదుపు చేయడంలో విఫలమై ఒక చెట్టును ఢీ కొట్టాడు. దీంతో 16 సం.రాల అమ్మాయి అక్కడిక్కడే చనిపోయింది. దీంతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఆ కుర్రాడు తీవ్ర గాయాలతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకుంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. -
వైద్యం వికటించి బాలిక మృతి
చింతకాని : వైద్యం వికటించి బాలిక మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో చోటుచేసుకుంది. చింతకాని మండలంలోని చిన్నమండవ గ్రామానికి చెందిన ఏసు తన కుమార్తె మనీషా(6) జ్వరంతో బాధ పడుతుండటంతో శనివారం మధ్యాహ్నం నాగులవంచలోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లాడు. ఆయన బాలికను పరీక్షించి ఓ ఇంజెక్షన్ ఇచ్చారు. కానీ అది వికటించటంతో అరగంటలోనే బాలిక చనిపోయింది. దీంతో బాధితులు గ్రామంలో ఆందోళనకు దిగారు. -
జగ్గయ్యపేటలో రోడ్డు ప్రమాదం
జగ్గయ్యపేట(కృష్ణా జిల్లా): గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీ కొనడంతో ఆరేళ్ల పాప మృతి చెందింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని అనుమంచిపల్లి గ్రామంలో జాతీయ రహదారి 65 శనివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. నల్లగొండ జిల్లా దామరచర్లకు చెందిన ఒక కుటుంబం ఆటోలో పెనగంచిప్రోలు జాతరకు వెళ్లారు. జాతర నుంచి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ఆటోను అనుమంచిపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరేళ్ల పాప అక్కడికక్కడే మృతి చెందింది. ఆటోలో ఉన్న డ్రైవర్‌తో సహా, ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. గాయాలయిన వారిని జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వాహనం కోసం ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
స్కూల్ బస్సు ప్రమాదం: బాలిక మృతి
మంగళగిరి (గుంటూరు): ఓ ప్రైవేటు స్కూల్ బస్సు రోడ్డుపై అడ్డంగా ఉన్న తాటిమొద్దును ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్ కొత్తపాలెం గ్రామాల మధ్య శుక్రవారం ఉదయం జరిగింది. వివరాలు.. నోటకి గ్రామంలో ఉన్న విజ్ఞాన్ విహార్‌కు చెందిన స్కూల్ బస్సు కొత్తపాలెం, శృంగవరపుపురం గ్రామాల నుంచి 30 మంది విద్యార్థులతో బయలుదేరింది. నూతక్ కొత్తపాలెం గ్రామాల మధ్య రోడ్డుపై అడ్డంగా వేసిన తాటిమొద్దును బస్సు ఢీ కొట్టింది. తాటిమొద్దు బస్సులోకి దూసుకొని రావడంతో లహరి(8) అనే చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. బస్సులో ఉన్న మిగతా విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకొని తమ పిల్లలను తీసుకొని వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గోడ కూలి బాలిక మృతి
పశ్చిమగోదావరి : ఇంటిపై కప్పు తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు గోడకూలి బాలిక మృతి చెందింది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం మల్లాయిగూడెం గ్రామపంచాయతీలోని ఏసీ అగ్రహారంలో సోమవారం జరిగింది. వివరాలు.. ఏసీ అగ్రహారానికి చెందిన గొంది శ్రీజ(8) పాఠశాలకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన మెండ్రు రమేష్ శిథిలావస్థలో ఉన్న తన ఇంటి కప్పును తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు గోడకూలి అటుగా వెళ్తున్న బాలికపై పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన అధికారులు ఎమ్మార్వో, ఎమ్డీవోలు సంఘటనాస్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
స్కూలు బస్సు ఢీకొని చిన్నారి మృతి
హైదరాబాద్: హైదరాబాద్‌లోని మోతీనగర్ సమీపంలో స్కూలు బస్సు ఢీకొని ఒక చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ది స్లేట్ స్కూలుకు చెందిన బస్సు ఢీకొట్టి ఆక్స్ఫర్డ్ స్కూలులో చదువుకుంటున్న సానియా(8) అనే చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియ రావాల్సి ఉంది. -
బాలికను మింగినది
గజపతినగరం రూరల్: వారంతా ఆటపాటలు, సరదా సంతోషాలు తప్ప, కల్లాకపటం తెలియని, ప్రమాద విషయాలు పట్టని చిన్నారులు. కార్తీకమాసం కదా అని అంతా కలిసి పిక్నిక్కి వెళ్లారు. మధ్యాహ్నం వరకు ఆటపాటలతో కేరింతలు కొట్టారు. భోజనాలు చేసి సరదాగా స్నానానికి వెళ్లారు. చిన్నారులు కదా నాతో జలకాలాడడానికి వచ్చారన్న జాలి లేకుండా చం పావతి నది నలుగురు చిన్నారులకు తన గర్భంలోకి లాగేసింది. అష్టకష్టాలు పడి ఓ ముగ్గురు చిన్నారులు బయట పడగలిగినప్పటికీ ఓ బాలిక మాత్రం విగతజీవిగా మారింది. విహారంలో విషాదం సంభవించిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్త బగ్గాం గ్రామానికి చెందిన 15మంది పిల్లలు ఆదివారం ఇదే మండలంల్నో కొణిశ గ్రామానికి పిక్నిక్కు వెళ్లారు. చిన్నారులంతా ఆటపాటలతో గడిపి భోజనాలు చేసిన అనంతరం సమీపంలో ఉన్న చంపావతి నదిలో స్నానాల కోసం దిగారు. పిల్లల్లో కొంతమంది ఒడ్డున,మరికొంతమంది నది మధ్యలోకి వెళ్లి స్నానాలు చేయసాగారు. అందరూ 15సంవత్సరాల లోపు వయస్సు వారే.అయితే దురదృష్ట వశాత్తు సిరిపురపు రేణుక అనే బాలిక నదిలో స్నానం చేస్తుండగా పెద్దగోతిలో పడిపోయి రక్షించండి బాబోయ్ అని కేకలు వేస్తూ మునిగి పోతున్న సమయంలో ఒడ్డున కూర్చున్న అర్జి నాగలక్ష్మి రేణుకను రక్షించబోయి ఆమెతో పాటు నీటిలో మునుగుతూ తేలుతూ ఉంది.ఇంతలో రేణుక తమ్ముడు రఘు, నాగలక్ష్మి తమ్ముడు నరేంద్ర అక్కలిద్దరినీ రక్షించబోయి వారు కూడా నదిలో మునిగి పోతూ పెద్ద కేకలు వేయగా అదే గ్రామానికి చెందిన కన్నూరి శ్రీను అనే వ్యక్తి పరుగుపరుగున వచ్చి ఆముగ్గురినీ ఒక్కొక్కరినీ బయటకు నెట్టివేసి వారి ప్రాణాలను కాపాడాడు. శ్రీను ఆసమయంలో లేక పోతే రేణుకతో పాటు ఆముగ్గురు విగత జీవులై ఉండేవారని గ్రామస్తులు తెలిపారు. రేణుక ఆచూకీ కోసం మూడు గంటల పాటు వెతుకులాట నదిలో మునిగిపోయిన రేణుక కోసం స్థానికులతో పాటు ఎస్సై డి.సాయికృష్ణ బృందం,అగ్నిమాపక సిబ్బంది,స్థానిక తహశీల్దార్ ప్రసాద్ పాత్రో ఇతర అధికారులు శాయశక్తులా మూడుగంటల పాటు వెతికారు. అయితే చివరికి రేణు కకు వరుసకు అన్నయ్య అయిన సిరిపురపు సూర్యనారాయణ, పోలీసు బృందానికి ఆమె మృతదేహం దొరకింది. దీంతో రేణుక బంధువులు, గ్రామ ప్రజల కన్నీటితో గ్రామం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. రేణుక తల్లి దండ్రులు రమణ,సత్యవతి కూలి పనికోసం తిరుపతి వలస వెళ్లారు. ఆ దంపతులకు రేణుక,రఘు అనే ఇద్దరు పిల్లలు ఉండడంతో వారిద్దరు అమ్మమ్మ సంరక్షణలో ఉన్నారు. రేణుక మృతిచెందిన సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు రోదిస్తూ తిరుపతి నుంచి బయల్దేరారు. గ్రామ సర్పంచ్ సంజీవరావు సహాయంతో పోలీసుల సమక్షంలో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో శవపంచనామా నిర్వహించారు. వేగావతిలో విద్యార్థి గల్లంతు విశ్వనాథపురం(పాచిపెంట): సాలూరులోని సత్యసాయి జూనియర్ కళాశాల విద్యార్థి దాసరి వంశీ (17) పాచిపెంట మండలం విశ్వనాథపురంలోని వేగావతి నదిలో ఆదివారం గల్లంగయ్యాడు. సహ విద్యార్థుల సమాచారం మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. కళాశాలకు చెందిన విద్యార్థులు పిక్నిక్ కోసం వేగావతి నది వద్దకు వచ్చారు.సరదాగా నదిలో దిగిన విద్యార్థి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థులు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో ఎస్సై రవికుమార్‌తో పాటు ఉప తహశీల్దార్ గిరిధర్,సాలూరు అగ్నిమాపక సిబ్బంది సాయంత్రం వరకూ గాలింపు చేపట్టినా మృతదేహం లభించలేదు. వంశీ తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకును తల్లి పాచిపనులు చేసుకుంటూ చదివిస్తోంది. కుమారుడు గల్లంతయ్యాడన్న విషయం తె లుసుకున్న తల్లి భోరున విలపించడంతో ఎవరికీ ఆపతరం కాలేదు. వంశీ సాలూరు అగురువీధికి చెందినవాడు. -
దేవుడే.. తీసుకుపోయాడు!
శివరాత్రి పర్వదినం కావడంతో ఆ దంపతులు.. తమ పిల్లలతో కలసి దేవుడి దర్శనానికని బయల్దేరారు. వచ్చీరాని మాటలతో తమ మూడేళ్ల చిన్నారి అల్లరిని దారి పొడువునా సంతోషంగా భరిస్తూ, మురిసిపోయారు. కాసేపట్లో గమ్యస్థానం చేరుకుంటారు.. ఇంతలోనే పెద్ద శబ్దం. ఏం జరిగిందో తెలుసుకునేలోపే వారు ప్రయాణిస్తున్న వాహనం పల్టీలు కొడుతోంది. అనుకోని ఈ సంఘటనతో అంతా భీతిల్లిపోయారు.. ఆ భీతి నుంచి ఇంకా బయటపడకముందే పిడుగులాంటి నిజాన్ని చూశారు. అంతవరకూ ఆటపాటలతో సందడి చేసిన తమ గారాలపట్టి.. రక్తమోడుతూ, కొనఊపిరితో గిలగిలా కొట్టుకుంటూ కళ్లముందే ప్రాణాలు వదులుతుంటే.. ఏమీ చేయలేక నిశ్ఛేష్టులై ఉండిపోయారు. దేవుడు దర్శనానికి వెళ్తున్న ఆ చిన్నారిని.. ఆ దేవుడే తన వద్దకు తీసుకుపోయాడు. బెలగాం/గరుగుబిల్లి, న్యూస్‌లైన్ : రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక దుర్మరణం చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామానికి చెందిన అడప రత్నాకర్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ బొబ్బిలిలో కుటుంబ సభ్యులతో కలసి నివాసం ఉంటున్నారు. శివరాత్రి సందర్భంగా పిల్లలకు పాలకొండ గ్రామంలో దేవుని వద్ద కొప్పు తీయించాలని కారులో కుటుంబ సమేతంగా బయల్దేరారు. రత్నాకరే కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. గరుగుబిల్లి మండలం ఖడ్గవలస జంక్షన్ దాటిన తరువాత కారు టైర్‌కు పంక్చరైంది. దీంతో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో రత్నాకర్ కుమార్తె హరీష్మ(3) తీవ్ర గాయాలపాలై, సంఘటన స్థలంలోనే మృతి చెందింది. కుమారుడు అరుణ్‌కుమార్‌కు, రత్నాకర్‌కు తీవ్రగాయాలయ్యాయి. వీరిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కళ్ల ముందే కుమార్తె మృతి చెందడం.. భర్త, కుమారుడు తీవ్ర గాయాలపాలు కావడంతో రత్నాకర్ భార్య కావ్య ఖిన్నురాలైంది. భోరున విలపించింది.