Too Many Twists In LB Nagar Varshita Death Case - Sakshi
Sakshi News home page

HYD: మిస్టరీగా చిన్నారి మృతి.. ఆటోడ్రైవర్‌ ఫోన్‌ కాల్‌ కీలకం!

Published Wed, Jul 20 2022 9:24 AM | Last Updated on Wed, Jul 20 2022 9:58 AM

Too Many Twists In LB Nagar Varshita Death Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎల్బీనగర్‌లో బాలిక మృతి కేసులో మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. బిల్డింగ్‌పై నుంచి కిందపడి ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

వివరాల ప్రకారం.. మధురానగర్‌లో నివాసం ఉంటున్న సత్యనారాయణ రెడ్డి రెండో కూతురు వర్షిత(9) కిరాణా షాపునకు వెళ్తున్నానంటూ తల్లికి చెప్పి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆటోలో చంద్రపురి కాలనీలోని ఓ బిల్డింగ్‌ వద్దకు వచ్చింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ ఫోన్ నుండి గుర్తుతెలియని వ్యక్తికి ఫోన్ చేసింది. అనంతరం,ఐదు నిమిషాల సమయంలో వర్షిత.. బిల్డింగ్‌ పైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందింది.

కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక​, చిన్నారి అసలు.. బిల్డింగ్ లోకి ఎందుకు వెళ్లింది? ఎవరికి కాల్ చేసింది? ఎలా పడిపోయింది? పాప మృతిలో పలు అనుమానాలు వ్య‍క్తమవుతున్నాయి. పోలీసులు.. వర్షితది హాత్యా? లేక ప్రమాదమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. భవనంలో ఉన్న వారిని పోలీసులు విచారిస్తున్నారు. సీసీ ఫుటేజీని సైతం పరిశీలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: ప్లైఓవర్‌ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement