వైద్యం వికటించి బాలిక మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో చోటుచేసుకుంది.
చింతకాని : వైద్యం వికటించి బాలిక మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో చోటుచేసుకుంది. చింతకాని మండలంలోని చిన్నమండవ గ్రామానికి చెందిన ఏసు తన కుమార్తె మనీషా(6) జ్వరంతో బాధ పడుతుండటంతో శనివారం మధ్యాహ్నం నాగులవంచలోని ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లాడు. ఆయన బాలికను పరీక్షించి ఓ ఇంజెక్షన్ ఇచ్చారు. కానీ అది వికటించటంతో అరగంటలోనే బాలిక చనిపోయింది. దీంతో బాధితులు గ్రామంలో ఆందోళనకు దిగారు.