
అత్యుత్సాహమే ప్రాణం తీసింది..
న్యూఢిల్లీ: ఇద్దరు టీనేజ్ పిల్లల అత్యుత్సాహం ఒకరి ప్రాణాలు తీసిన ఘటన దక్షిణ ఢిల్లీలోని వసంత విహార్ ఏరియాలో చోటు చేసుకుంది. తన స్నేహితురాలిని సరదాగా అలా బైటికి తీసుకెళ్లాలనుకున్న ఓ టీనేజ్ కుర్రాడు ఇంటిలోంచి కారును దొంగతనంగా తీసుకొచ్చాడు. కానీ కారును అదుపు చేయడంలో విఫలమై ఒక చెట్టును ఢీ కొట్టాడు. దీంతో 16 సం.రాల అమ్మాయి అక్కడిక్కడే చనిపోయింది. దీంతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఆ కుర్రాడు తీవ్ర గాయాలతో ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకుంటున్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.