నార్కెట్‌పల్లి: అంగవైకల్యంతో బాధపడుతున్న యువతి అగ్నికి ఆహుతయింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం మాండ్ర గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఇళ్లు మొత్తం మంటలు వ్యాపించడంతో.. అందులో ఉన్న వికలాంగురాలు బోసు సుజాత(16) బయటకు రాలేక మంటలకు ఆహుతై మృతిచెందింది.