ఏఐఎస్ సర్వీసుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకన్న ఆమె వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ ఐఏఎస్ బాలలత
24 గంటల్లోగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్
లేకపోతే జైపాల్‌రెడ్డి స్ఫూర్తి స్థల్ వద్ద నిరసన చేస్తామని హెచ్చరిక
స్మితపై చర్యలు తీసుకోవాలన్న పలు దివ్యాంగుల సంఘాల నాయకులు
పంజగుట్ట/సుందరయ్య విజ్ఞాన కేంద్రం: అఖిల భారత సర్వీసు (ఏఐఎస్)ల్లో దివ్యా ంగులకు రిజర్వేషన్లు ఎందుకంటూ సామా జిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రశ్నించిన సీని యర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ వ్యాఖ్య లను ప్రముఖ విద్యావేత్త, మాజీ ఐఏఎస్ అధికా రిణి మల్లవరపు బాలలత తీవ్రంగా ఖండించారు. బ్యూరో క్రాట్లకు శారీరక ఫిట్ నెస్‌కన్నా మానసిక ఫిట్‌నెస్ ఉండాలని.. కానీ స్మిత ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నారేమో కానీ మెంటల్‌గా ఫిట్‌గా లేరని మండి పడ్డారు.
తన లాంటి దివ్యాంగులను ఉద్దే శించి ఆమె చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే దివ్యాంగులను దూరంగా పెట్టాలని సమా జానికి సంకేతం ఇస్తున్నట్లుగా ఉన్నాయ న్నారు. సోమవారం హైదరా బాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో బాల లత మాట్లా డారు.
స్మిత వ్యాఖ్యలు వ్యక్తిగత మైనవా లేక ప్రభుత్వ ప్రతినిధిగా చేసినవో ఆమె వివరణ ఇవ్వాలన్నారు. ఆమెపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం వెంటనే చర్యలు తీసుకోవాలని.. 24గంటల్లోగా ఆమె చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించు కొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే దివంగత కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి సమాధి స్ఫూర్తిస్థల్ వద్ద
దివ్యాంగ సమాజమంతా శాంతియుత నిరసన తెలుపుతామన్నారు.
ప్రతిపక్షాలు, మీడియా, సమాజం స్పందించాలి..
జైపాల్‌రెడ్డి లాంటి పెద్ద నేత రెండు కాళ్లు పనిచేయకపోయినా ఉత్తమ పార్లమెంటేరియన్‌గా నిలిచారని బాలలత గుర్తు చేశారు. స్మితా సబర్వాల్ పదవికి రాజీ నామా చేసి తనతోపాటే మళ్లీ సివిల్స్ రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. ఈ విషయమై మిగిలిన బ్యూరో క్రాట్లు, ప్రతిపక్ష పార్టీలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మీడియా కూడా స్పందించాలని కోరారు.
కాగా, స్మిత వ్యాఖ్యలు దేశంలోని 4 శాతం దివ్యాంగుల మనోభా వాలు దెబ్బతీసేలా ఉన్నాయని అఖిల భారత దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు విమర్శించారు. రాజ్యా ంగాన్ని అమలు చేయాల్సిన ఒక ఐఏఎస్ అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పీవోడబ్ల్యూ సంధ్య వ్యాఖ్యా నించారు. మరోవైపు స్మితా సబర్వాల్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డెవలప్‌మెంట్ సొసైటీ ఫర్ ది డెఫ్ జాతీయ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో–కన్వీనర్ కాటమోనీ వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.
వరుస ఫిర్యాదులు
సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ సోమవారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా మరికొందరు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీ టీ)కు ఫిర్యాదు చేశారు. మరోవైపు శాంతి దివ్యాంగుల సంఘం అధ్యక్షురాలు శ్రీగిరి రజిని ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో స్మితపై కంప్లయింట్ ఇచ్చారు. అలాగే చదువుకోని వారంతా వికలాంగులతో సమానం అంటూ సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ ఆయనపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
క్షేత్రస్థాయిలో తిరుగుతున్న ఐఏఎస్‌లు ఎందరు?: మురళి
ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌పై ‘ఎక్స్’ వేదికగా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి అహంకారపూరిత, రాజ్యాంగాన్ని గౌరవించని వాళ్లు మన విధాన రూపకర్తలని మండిప డ్డారు. ‘దివ్యాంగుల చట్టం–1995 చట్టం ప్రకారమే ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ వచ్చా యని ఆవిడకు తెలియదా లేక పార్లమెంటు నే కించపరిచేలా గర్వం తలకెక్కిందా?’ అని దుయ్యబట్టారు. కలెక్టర్లు, జేసీలుగా పని చేస్తున్నప్పుడు మినహా అసలు ఎంత మంది ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో తిరు గుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ అండతో దేశంలోనే హెలికాప్టర్లలో తిరిగిన ఏకైక ఐఏఎస్ అధికారి కదా.. ఆ మాత్రం తల బిరుసు ఉంటుందేమోనని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment