Smita Sabharwal
-
'స్మితా సబర్వాల్ అలా అనడం బాధాకరం'
మహిళలను గౌరవించే, వారి ఔన్నత్యాన్ని చూపించే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి (Mallu Laxmi) అన్నారు. మంగళవారం హైదరాబాద్ (Hyderabad) బాగ్‌లింగంపల్లిలోని ఐద్వా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. విభిన్నమైన కళా వారసత్వం ఉన్న తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీలను స్వాగతిస్తున్నామని ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) అనడం బాధాకరమని అన్నారు. అందాల పోటీ లంటే మహిళల శరీరాలను అవమానించడం తప్ప మరోటి కాదని పేర్కొన్నారు.అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క (Vimalakka) మాట్లాడుతూ మహిళల అందాలను కొలతల చూపడం, అర్ధ నగ్న సౌందర్యాన్ని ప్రదర్శించడం అవమానకరమని అన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అందాల పోటీల మీద ఖర్చుపెట్టే బదులు ప్రజలకు విద్యా, వైద్య సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు అనసూయ, ఐద్వా అధ్యక్షురాలు అరుణజ్యోతి, కేఎన్ ఆశాలత, ఝాన్సీ, స్వరూప, ఇందిర పాల్గొన్నారు. అందాల పోటీలు రద్దు చేయాలని ఆందోళన భారతదేశ నైతిక విలువలు, సాంస్కృతిక నైతికతను దిగజార్చే అసభ్యకరమైన అందాల పోటీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున మహిళలు ఆందోళన చేశారు. హైదరాబాద్‌లో మే 7 నుంచి 31 వరకు జరిగే 72వ మిస్ వరల్డ్–2025 (Miss World 2025) అందాల పోటీలను వ్యతిరేకిస్తూ మంగళవారం హిమాయత్‌నగర్ జంక్షన్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగాభారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు సృష్టించడంలో, మహిళల భద్రతను పెంచడంలో, మహిళలపై హింసాత్మక చర్యలను అరికట్టడంలో విఫలమైందన్నారు. సమస్యల నుంచి దృష్టి మరల్చడానికే ప్రభుత్వం ఈ పోటీలు నిర్వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.సీనియర్ నాయకురాలు పి.ప్రేమ్ పావని మాట్లాడుతూ.. అసలే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడం మరింత భారం కాదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పడాల నళిని, ఎస్.ఛాయాదేవి, ఫైమీద, ఎన్.కరుణ కుమారి, జ్యోతి శ్రీమాన్, షహనా అంజూమ్, రొయ్యల గిరిజ, ఎం.లక్ష్మి, కె.అరుణ వి.కమల, ఎ.దేవమ్మ, సీహెచ్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.చదవండి: హెచ్ఎండీఏ ‘మెగా మాస్టర్‌ప్లాన్–2050’పై భారీ కసరత్తు -
హైదరాబాద్‌లో ‘మిస్ వరల్డ్ ’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మరో ప్రతిష్టాత్మక పోటీలకు వేదిక కాబోతోంది. ప్రపంచమంతా ఆసక్తిగా తిలకించే ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీలు ఈ ఏడాది హైదరాబాద్‌లో జరగనున్నాయి. మే 7వ తేదీ నుంచి 31 వరకు నగరంలో 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించనున్నట్లు మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్, సీఈవో జులియా మోర్లే.. తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ బుధవారం సంయుక్తంగా ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి మిస్ వరల్డ్ లిమిటెడ్ ఈ పోటీలను నిర్వహించనుంది. పోటీల ప్రారంభ, ముగింపు, గ్రాండ్ ఫినాలే వేడుకలు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు జులియా మోర్లే వెల్లడించారు. ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’నినాదంతో ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: జులియా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించేందుకు ఆసక్తిగా ఎదుచూస్తున్నట్లు జులియా మోర్లే తెలిపారు. ‘గొప్ప సంస్కృతి, వారసత్వం, అద్భుత ఆతిథ్యం, వేగవంతమైన వృద్ధి ఉన్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తున్న ఈ పోటీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిస్ వరల్డ్ అభిమానులకు గొప్ప అనుభూతిని పంచనున్నాయి. ఈ భాగస్వామ్యం మిస్ వరల్డ్ పోటీల కోసం మాత్రమే కాదు.. సమూహాల సాధికారతకు, బ్యూటీ విత్ ఏ పర్సస్ అనే మా ఉమ్మడి నిబద్ధతకు నిదర్శనం’అని పేర్కొన్నారు. ఇది అద్భుతాల తెలంగాణ: స్మిత ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ వేదిక కావటంపై రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ సంతోషం వ్యక్తంచేశారు. ‘ఇది తెలంగాణ.. ఇక్కడ ప్రతి పండుగలో గొప్ప ఆనందం ఉంటుంది. ప్రతి చేతి నైపుణ్యం ఓ కొత్త కథను, ఆరాధనను తెలిపే నేల ఇది. ఇది తెలంగాణ.. అసలైన అందాలను ప్రతిబింబించే నేల. మిస్ వరల్డ్ వేదిక తెలంగాణలోని చేనేత గొప్పతనాన్ని, అద్భుతమైన ఆతిథ్యాన్ని, జానపద రీతులకు వేదిక కాబోతోంది’అని వెల్లడించారు. 2024 మిస్ వరల్డ్ పోటీలు ముంబైలో నిర్వహించారు. ఆ పోటీల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచారు. మే 31న జరిగే గ్రాండ్ ఫినాలేలో విజేతకు ఆమె వజ్రాల కిరీటాన్ని అలంకరిస్తారు. -
సికింద్రాబాద్‌లో పతంగుల సందడి.. కైట్స్ ఎగరేసిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ (ఫోటోలు)
-
కాళేశ్వరం విచారణకు స్మితా సబర్వాల్.. హాజరుకానున్న మాజీ సీఎస్
-
నాకేం తెలీదు.. గుర్తు లేదు: స్మితా సబర్వాల్
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు, అందులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా.. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను కమిషన్ ఇవాళ విచారణ జరిపింది.హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఈ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలుత ఓపెన్ కోర్టులో ‘‘అన్నీ నిజాలే చెప్తా..’’ అని కమిషన్ చీఫ్ జస్టిస్ పీసీ చంద్రఘోష్, స్మితా సబర్వాల్‌తో ప్రమాణం చేయించారు. ఆపై ప్రశ్నలు గుప్పించారు.కమిషన్: క్యాబినెట్ ఆమోదం లేకుండానే మూడు బ్యారేజీలకు చెందిన పరిపాలన అనుమతుల జీవోలు తెలియజేశారా?స్మితా సబర్వాల్: అది నా దృష్టిలో లేదుకమిషన్: కొన్ని ఫైల్స్ సీఎంఓ కి రాకుండానే క్యాబినెట్ అనుమతి పొందకుండానే పరిపాలన అనుమతులు పొందాయా?స్మితా సబర్వాల్: కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు నాకు సమాధానం తెలీదు.. అవగాహన కూడా లేదుకమిషన్: క్యాబినెట్ పొందకుండానే మూడు బ్యారేజీల నిర్మాణ పనులు ప్రారంభించారా? స్మితా సబర్వాల్: నాకు తెలీదుకమిషన్: దాచడానికి ఏమీ లేదు నిజాలు మాత్రమే చెప్పాలిస్మితా సబర్వాల్: సీఎంఓకి వచ్చేటువంటి ప్రతి ఫైల్ సీఎం అప్రూవల్ ఉంటుంది2014 నుంచి పదేళ్లపాటు గత ప్రభుత్వం సీఎంవోలో సెక్రటరీగా పని చేశాసీఎంవోలో ఏడు శాఖలను పర్యవేక్షించా మై రోల్ ఈజ్ లిమిటెడ్.. జనరల్ కోఆర్డినేషన్ మాత్రమే కమిషన్: మూడు బ్యారేజీలకు సంబంధించిన ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి నోట్స్ సీఎంవోకి వచ్చాయా?స్మితా సబర్వాల్: నా దృష్టిలో లేదు... నాకు ప్రస్తుతం గుర్తుకు లేదుఇదిలా ఉంటే.. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సైతం ఇవాళ్టి విచారణకు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వపరంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో.. ఉన్నత అధికారులందరినీ కమిషన్ విచారిస్తోంది. ఓపెన్ కోర్టు ద్వారా కమిషన్ ఛైర్మన్ పినాకి చంద్రఘోష్, మాజీ అధికారులపై ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నారు. నిన్న (బుధవారం) రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఇరిగేషన్ శాఖ మాజీ కార్యదర్శులు ఎస్కే జోషి, రజత్ కుమార్‌ను కమిషన్ విచారించింది.ఇదీ చదవండి: కాళేశ్వరం నిర్ణయం కేసీఆర్, హరీశ్రావులదే! -
హైకోర్టుకు స్మితా సబర్వాల్, KTR
-
వికలాంగులను సాటి మనుషులుగా చూడలేని వారిది చిత్త వైకల్యం!
‘వైకల్యం’ లేని మనుషులు అరుదు. కొందరికి అంగవైకల్యం, మరికొందరికి చిత్తవైకల్యం. ఎలాంటి వైకల్యమూ లేకపోవడం పరిపూర్ణత అవుతుంది. కాని అదెక్కడ కనిపిస్తుంది? చిత్తవైకల్యం మతిభ్రమణమూ కానక్కర లేదు, మందబుద్దీ కానక్కర లేదు. ఆస్థిర చిత్తాలు మనోవికారాలు ఆలోచనల వైపరీత్యాలు కూడా వైకాల్యాలే. కనుక ఒకరిని చూసి మరొకరు సానుభూతి చూపించ వలసిందేమి లేదు.వైకల్యాలు ప్రకృతి సహజంగా భావించి, పరస్పరం ప్రేమించుకొనడానికి, గౌరవించుకొనడానికి అవి అవరోధం కాకుండా చూసుకోవడమే మనం చేయవలసిందీ,చేయగలిగిందీ!‘ అంటూ ‘ మనోనేత్రం ’ పేరుతో వికలాంగుల సమస్యలను వస్తువుగా తీసుకొని, ప్రపంచ వికలాంగుల దినోత్సవ సందర్బంగా ( 19 మార్చ్ 1989 ) నేను రచించిన కవితా సంపుటికి తమ అమూల్యమైన అభినందన సందేశం అందిస్తూ ఆనాటి ప్రముఖ దినపత్రిక ఆంధ్రప్రభ సంపాదకులు పొత్తూరి వేంకటేశ్వర రావు గారు వెలిబుచ్చిన అభిప్రాయం ఇది.సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బహుకాలంగా పనిచేస్తున్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిణి సివిల్స్‌లో దివ్యాంగుల కోటాను విమర్శిస్తూ ‘వికలాంగులు ఐ ఏ ఎస్, ఐపీఎస్ వంటి ఉద్యోగాలకు సరిపోరని ’ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సరియైన సమాధానం పెద్దలు పొత్తూరి వారి మాటల్లో స్పష్టంగా ఉందని నేను భావిస్తున్నాను.పై అధికారిణి ప్రభుత్వంలో ఉంటూనే చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ స్వయంగా అంగవైకల్యంతో బాధపడుతున్న, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయే ఎంతో మంది అభ్యర్థులకు శిక్షణనిచ్చే ఒక ఐ ఏ ఎస్ అకాడమీని విజయవంతంగా నడుపుతున్న మల్లవరపు బాలలత గారు ‘ సివిల్ సర్వంట్ గా తాను పన్నెండేళ్లు పనిచేసానని, ఇలాంటి అధికారులు ఉండబట్టే రాజీనామా చేయాల్సి వచ్చిందని తన బాధను వ్యక్తపరిచారు. అంతేకాదు పై అధికారిణికి ఏదైనా జరగరానిది జరిగి దివ్యంగురాలు అయితే ఆమె తన పదవికి రాజీనామా చేస్తారా?’ అంటూ వారు వేసిన ప్రశ్న సమంజసమైంది, అందరూ ఆలోచించవలసింది.అంధులంటే ఎవరో కాదు కళ్లుండీ వాస్తవాన్ని చూడలేని గర్వాంధులు, ధనాందులు , మాదాంధులు ‘ అన్నాను ’ మనోనేత్రం‘ లో నేను 1992 లో కూడా ‘ వికలాంగులలో ‘విజేతలు’ పేరుతో నేను చేసిన మరో రచనలో తమ అంగవైకల్యాన్ని అధిగమించి ఎన్నో రంగాల్లో రాణించిన భక్తకవి సూరదాస్ మొదలుకొని ద్వారం వెంకటస్వామి నాయుడు( వయలిన్ ) ఎస్ జైపాల్ రెడ్డి ( రాజకీయాలు ), సుధాచంద్రన్ ( నాట్యం ), లూయీబ్రెయిల్ ( బ్రెయిల్ లిపి ), మేధావుల్లో మేటి అంటోనియో గ్రాన్సీ , విశ్వకవి భైరన్ వంటి ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ ప్రముఖుల పరిచయాలతో పాటు , నాకు గురుతుల్యులు ప్రముఖ హాస్య రచయిత ఎన్వీ గోపాల శాస్త్రి, వికలాంగుల జంట మా అమ్మానాన్నలు ఆండాళమ్మ వేముల రాజంల గురించి కూడా ఇందులో రాశాను.‘లోక కళ్యాణం కోసం కొందరు అడవులకు వెళ్లి ఋషులు మునులైతే సభ్యసమాజంలో ఉంటూ సాటివారిని బాగుచేయడానికి మరికొందరు వికలాంగులు అయ్యారు ’ అన్న నా మాటలను పేర్కొంటూ‘ వికలాంగులను సాటి మనుషులుగా చూడలేని చిత్తవైకల్యం ఎవరిలోనైనా ఉంటే ’మనోనేత్రం‘ దానిని పోగొట్టగల సాహిత్య ఔషధం’ అంటూ నా రచనకు మంచి కితాబునిచ్చి నన్ను ప్రోత్సహించిన పెద్దలు కీశే పొత్తూరి వెంకటేశ్వర రావు ( 1934 - 2020 ) గారికి శతకోటి వందనాలు !-వేముల ప్రభాకర్ -
ఐఏఎస్ అంటే బాడీతో కాదు బ్రెయిన్ తో పనిచేయాలి..
-
బుద్ధి వైకల్యం ప్రమాదకరం.. స్మితా సబర్వాల్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: అంగవైకల్యం కంటే బుద్ధి వైకల్యం చాలా ప్రమాదకరమని అంటున్నారు తెలంగాణ మంత్రి సీతక్క. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ దివ్యాంగుల కోటా కామెంట్లపై నెలకొన్న వివాదంపై మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా సీతక్క తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘అంగవైకల్యం కంటే బుద్ధి వైకల్యం ప్రమాదకరం. అంతా అవగాహన ఉందని మాట్లాడే వాళ్లు.. ఇతరుల అభిప్రాయలు గుర్తించకపోవడం కరెక్ట్ కాదు. అది వాళ్ల మానసిక వైకల్యం. ఐపీఎస్‌కు ఫిజికల్ ఫిట్నెస్ అవసరం. పోలీసులకు కలెక్టర్లకు తేడా తెలియదా?.... ఒక అధికారిగా ఉండి ఆమె అలా మాట్లాడడం తప్పు. ఆమె అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఆమె వ్యాఖ్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా’’.. అని మంత్రి సీతక్క అన్నారు.సాక్షితో స్మితా సబర్వాల్ఇదిలా ఉంటే.. తన ఎక్స్ పోస్ట్ వివాదం కావడంతో ఆమె నిన్న దానికి వివరణ ఇచ్చారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని, తాను తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని అన్నారామె. ఆపై వివాదం మరింత ముదిరింది. ఆమెపై ఇటు తెలంగాణలో, అటు ఏపీలోనూ పీఎస్‌లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. తాజాగా ఆమె సాక్షి టీవీ తో ఫోన్ లైన్లోనూ మాట్లాడారు. ‘‘నేను ఎవరినో కించపరచడానికో లేదంటే కాంట్రవర్సీ కోసమో ఆ వ్యాఖ్యలు చెయ్యలేదు. యూపీఎస్సీలో సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం నుంచి సీనియర్, ఫీల్డ్ వర్క్ చేసిన అధికారుల అభిప్రాయం తీసుకుంటుంది. రిజర్వేషన్ల అంశంలో నేను నా అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేశాను.. అని అంటున్నారామె. -
స్మితా సబర్వాల్ మెంటల్‌గా అన్‌ఫిట్
పంజగుట్ట/సుందరయ్య విజ్ఞాన కేంద్రం: అఖిల భారత సర్వీసు (ఏఐఎస్)ల్లో దివ్యా ంగులకు రిజర్వేషన్లు ఎందుకంటూ సామా జిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రశ్నించిన సీని యర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ వ్యాఖ్య లను ప్రముఖ విద్యావేత్త, మాజీ ఐఏఎస్ అధికా రిణి మల్లవరపు బాలలత తీవ్రంగా ఖండించారు. బ్యూరో క్రాట్లకు శారీరక ఫిట్ నెస్కన్నా మానసిక ఫిట్నెస్ ఉండాలని.. కానీ స్మిత ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నారేమో కానీ మెంటల్‌గా ఫిట్‌గా లేరని మండి పడ్డారు.తన లాంటి దివ్యాంగులను ఉద్దే శించి ఆమె చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే దివ్యాంగులను దూరంగా పెట్టాలని సమా జానికి సంకేతం ఇస్తున్నట్లుగా ఉన్నాయ న్నారు. సోమవారం హైదరా బాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో బాల లత మాట్లా డారు.స్మిత వ్యాఖ్యలు వ్యక్తిగత మైనవా లేక ప్రభుత్వ ప్రతినిధిగా చేసినవో ఆమె వివరణ ఇవ్వాలన్నారు. ఆమెపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం వెంటనే చర్యలు తీసుకోవాలని.. 24గంటల్లోగా ఆమె చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించు కొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే దివంగత కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి సమాధి స్ఫూర్తిస్థల్ వద్ద దివ్యాంగ సమాజమంతా శాంతియుత నిరసన తెలుపుతామన్నారు.ప్రతిపక్షాలు, మీడియా, సమాజం స్పందించాలి..జైపాల్‌రెడ్డి లాంటి పెద్ద నేత రెండు కాళ్లు పనిచేయకపోయినా ఉత్తమ పార్లమెంటేరియన్‌గా నిలిచారని బాలలత గుర్తు చేశారు. స్మితా సబర్వాల్ పదవికి రాజీ నామా చేసి తనతోపాటే మళ్లీ సివిల్స్ రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. ఈ విషయమై మిగిలిన బ్యూరో క్రాట్లు, ప్రతిపక్ష పార్టీలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మీడియా కూడా స్పందించాలని కోరారు.కాగా, స్మిత వ్యాఖ్యలు దేశంలోని 4 శాతం దివ్యాంగుల మనోభా వాలు దెబ్బతీసేలా ఉన్నాయని అఖిల భారత దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు విమర్శించారు. రాజ్యా ంగాన్ని అమలు చేయాల్సిన ఒక ఐఏఎస్ అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పీవోడబ్ల్యూ సంధ్య వ్యాఖ్యా నించారు. మరోవైపు స్మితా సబర్వాల్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ది డెఫ్ జాతీయ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో–కన్వీనర్ కాటమోనీ వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.వరుస ఫిర్యాదులుసీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ సోమవారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా మరికొందరు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీ టీ)కు ఫిర్యాదు చేశారు. మరోవైపు శాంతి దివ్యాంగుల సంఘం అధ్యక్షురాలు శ్రీగిరి రజిని ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో స్మితపై కంప్లయింట్ ఇచ్చారు. అలాగే చదువుకోని వారంతా వికలాంగులతో సమానం అంటూ సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ ఆయనపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు.క్షేత్రస్థాయిలో తిరుగుతున్న ఐఏఎస్‌లు ఎందరు?: మురళిఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌పై ‘ఎక్స్’ వేదికగా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి అహంకారపూరిత, రాజ్యాంగాన్ని గౌరవించని వాళ్లు మన విధాన రూపకర్తలని మండిప డ్డారు. ‘దివ్యాంగుల చట్టం–1995 చట్టం ప్రకారమే ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ వచ్చా యని ఆవిడకు తెలియదా లేక పార్లమెంటు నే కించపరిచేలా గర్వం తలకెక్కిందా?’ అని దుయ్యబట్టారు. కలెక్టర్లు, జేసీలుగా పని చేస్తున్నప్పుడు మినహా అసలు ఎంత మంది ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో తిరు గుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ అండతో దేశంలోనే హెలికాప్టర్లలో తిరిగిన ఏకైక ఐఏఎస్ అధికారి కదా.. ఆ మాత్రం తల బిరుసు ఉంటుందేమోనని విమర్శించారు. -
ఆ మాట చెప్పడానికి నువ్వు ఎవరు..?
-
IAS స్మితా సబర్వాల్ సంచలన ట్వీట్
-
సాయికిరణ్ 27.. సహన 739..
సాక్షిప్రతినిధి,కరీంనగర్/రామడుగు: ప్రతిభకు పేదరికం అడ్డు కానే కాదని మరోసారి రుజువైంది. తల్లిదండ్రులు కార్మికులైనా తాను కలెక్టర్ కావాలనుకున్న కలను ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు.. పేదరికం కారణంగా కొలువు చేయాల్సి రావడం, కోచింగ్ తీసుకోకుండా సొంతంగానే ప్రిపేరయి రెండో ప్రయత్నంలోనే లక్ష్యం చేరుకున్నారు. సివిల్స్ ర్యాంకు సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచిన నందాల సాయికిరణ్ విజయగాథను ఆయన సోదరి, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్ స్రవంతి ‘సాక్షి’కి వివరించారు. సాయికిరణ్ స్వగ్రామం రామడుగు మండలంలోని వెలిచాల. తల్లిదండ్రులు లక్ష్మి–కాంతారావు, సోదరి స్రవంతి ఉన్నారు. తండ్రి చేనేత కార్మికుడు, తల్లి బీడీ కార్మికులిగా పని చేస్తూ పిల్లల్ని పెంచారు. కుటుంబాన్ని బాగా చూసుకునేందుకు కాంతారావు మహారాష్ట్రలోని భీవండిలో చేనేత కార్మికుడిగా పని చేశారు. సాయికిరణ్ చిన్ననాటి నుంచి చదువులో ముందుండేవారు. ఐదో తరగతి వరకు సరస్వతి పాఠశాలలో చదివారు. ఆయన ప్రతిభను గుర్తించిన ఆ పాఠశాల కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ కరీంనగర్‌లోని తేజస్విని పాఠశాలలో ఆరో తరగతిలో చేర్పించారు. 2012లో పదోతరగతి, ట్రినిటీ జూనియర్ కళాశాలలో 2014లో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశారు. ఎన్ఐటీ వరంగల్‌లో సీటు సాధించిన సాయికిరణ్ 2018లో ఇంజినీరింగ్ పూర్తి చేయడంతోనే క్యాల్‌కమ్ కంపెనీలో ఉద్యోగం సాధించారు. తండ్రి మరణించినా.. తల్లి అండతో.. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగానే సాయికిరణ్ తండ్రి 2016లో కేన్సర్ బారిన పడి మృతిచెందారు. దీంతో తల్లి లక్ష్మి కష్టపడి బీడీలు చుట్టి, తన ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. కూతురు స్రవంతి బీటెక్ పూర్తి చేసి, ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో పని చేస్తున్నారు. సాయికిరణ్ 2018 నుంచి ఉద్యోగం చేస్తూనే ఆన్లైన్లో సివిల్స్ కోచింగ్ తీసుకుంటూ పరీక్షలకు సిద్ధమయ్యారు. గతేడాది విఫలమైనా రెండోసారి ఆలిండియా 27వ ర్యాంకు సాధించారు. వీరి తల్లి లక్ష్మి ఇప్పటికీ బీడీలు చుడుతుందని గ్రామస్తులు తెలిపారు. కాగా, సివిల్స్ ర్యాంకర్ సాయికిరణ్‌ను ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు. ప్రత్యేకత చాటుకున్న వెలిచాల.. గత పదేళ్లుగా ఉత్తమ గ్రామపంచాయతీగా పేరు పొందిన వెలిచాలకు ఇక్కడి అభివృద్ధి పనులపై స్టడీ టూర్ చేయడానికి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పలువురు సివిల్ సర్వీస్ ప్రతినిధులు వచ్చి, వెళ్తున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకున్న సాయికిరణ్ కష్టపడి చదివి, సివిల్స్ ర్యాంకు సాధించడంతో ఈ గ్రామం ప్రత్యేకత చాటుకుంది. ఢిల్లీలో కోచింగ్... కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన కొలనుపాక గీత–అనిల్ దంపతుల కూతురు సహన సివిల్స్ ఫలితాల్లో 739వ ర్యాంకు సాధించారు. ఆమె స్థానిక కెన్ క్రెస్ట్ స్కూల్లో పదోతరగతి, శ్రీగాయత్రి జూనియర్ కళాశాలలో ఇంటర్, హైదరాబాద్ జేఎన్టీయూలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తర్వాత ఢిల్లీలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్నారు. ప్రిలిమినరీ, మెయిన్స్ ఫలితాల్లో క్వాలిఫై అయ్యాక ఢిల్లీలో పలు మాక్ ఇంటర్వూ్యలకు అటెండయ్యారు. సహన తండ్రి అనిల్ కరీంనగర్లో పాత్రికేయుడిగా పని చేస్తున్నారు. స్మితా సబర్వాల్ స్ఫూర్తి.. ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్ కలెక్టర్‌గా పని చేసిన స్మితా సబర్వాల్ తనకు స్ఫూర్తి అని సహన తెలిపారు. తాను పాఠశాలలో చదువుతున్నపుడు స్మితా మేడంలా కలెక్టర్ అవ్వాలని ఆ రోజుల్లోనే ఫిక్స్ అయ్యానని, ఆ కల నెరవేర్చుకునేందుకు తాను సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. దీనికి తల్లిదండ్రులు ఎంతగానో సహకరించారన్నారు. పేదలకు సేవ చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. -
Eid Mubarak 2024: సానియా మీర్జాతో ఐఏఎస్ స్మితా సబర్వాల్ రంజాన్ వేడుకలు.. ఫొటోలు వైరల్
-
IAS Smita Sabharwal : ట్రెండింగ్‌లో మరో ఐఏఎస్ స్మితా సబర్వాల్.. రేర్ ఫొటోలు
-
ఆమ్రపాలి ఇన్ !..స్మితా సబర్వాల్ ఔట్
-
సెంట్రల్ సర్వీసులోకి వెళ్లేందుకు IAS స్మితా సబర్వాల్ దరఖాస్తు
-
ఇన్‌స్టాలో స్మితా సబర్వాల్ సందడి.. వీడియో వైరల్
సీనియర్ ఐఏఎస్, తెలంగాణ సీఎంవో అధికారిని స్మిత సబర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రభుత్వ కార్యకలాపాలతో పాటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లతో నిత్యం టచ్‌లో ఉంటారు స్మిత సబర్వాల్. ప్రభుత్వ పనులు సమర్థవంతంగా నిర్వహిస్తూనే, మరోవైపు సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలి, ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపేస్తుంటారు. ఈ మేరకు తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన స్వీట్ మూమెంట్స్‌ని కూడా ఆమె అభిమానులతో సోషల్‌మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ రీల్‌ను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మరింది. దీంతో నెటిజన్లు.. మేడమ్ సార్.. మేడమ్ అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2001 బ్యాచ్‌కు చెందిన స్మిత సబర్వాల్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి తన పనితీరుతో ఎంతో గుర్తింపు పొందారు. తెలంగాణ సీఎంవో అధికారిణిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళా కలెక్టర్‌గా మరింత పాపులర్ అయ్యారు. View this post on Instagram A post shared by 𝐏𝐫𝐚𝐭𝐢𝐜𝐡𝐞𝐞 𝐌𝐨𝐡𝐚𝐩𝐚𝐭𝐫𝐚 (@praticheemohapatra) View this post on Instagram A post shared by Smita Sabharwal (@smita_sabharwal1) View this post on Instagram A post shared by Smita Sabharwal (@smita_sabharwal1) -
సర్వీస్ మ్యాటర్ మాట్లాడేందుకే వెళ్లాను..
బంజారాహిల్స్ (హైదరాబాద్): తనతో పాటు మరో తొమ్మిది మంది డిప్యూటీ తహసీల్దార్ల పదోన్నతి విషయంపై మాట్లాడేందుకే ముఖ్యమంత్రి కార్యాలయ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను కలిసేందుకు ఆమె క్వార్టర్‌కు వెళ్లినట్లు మేడ్చల్ జిల్లా పౌర సరఫరాల శాఖ మాజీ డిప్యూటీ తహసీల్దార్ చెరుకు ఆనంద్‌కుమార్‌రెడ్డి శనివారం పోలీస్ కస్టడీలో వెల్లడించారు. సర్వీస్ మ్యాటర్ డిస్కస్ చేసేందుకే ఆమె ఇంటికి వెళ్లానని చెప్పిన ఆనంద్‌కుమార్, అర్ధరాత్రి ఎందుకు వెళ్లావని పోలీసులు అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1999లో గ్రూప్–2కు సెలెక్ట్ అయిన మొత్తం 26 మంది అభ్యర్థుల పోస్టింగ్‌లు కోర్టు వివాదంతో రద్దయ్యాయి. అయితే 2018లో కోర్టు జోక్యంతో వారందరికీ డిప్యూటీ తహసీల్దార్లుగా పోస్టింగ్లురాగా, ఇందులో 16 మందిని ఏపీకి కేటాయించారు. మిగతా పది మందికి తెలంగాణలో పోస్టింగ్లురాగా అందులో ఆనంద్‌కుమార్ కూడా ఒకరు. ఏపీలో 16 మందికి తహసీల్దార్లుగా ప్రమోషన్లు రాగా తెలంగాణలో మాత్రం నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా డీటీలుగానే ఉన్నామని, ఈ విషయం పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఆనంద్ కుమార్ వెల్లడించినట్లు తెలుస్తోంది. సీఎంవోలో కీలక బాధ్యతల్లో ఉన్న స్మితా సబర్వాల్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తే సీఎంతో మాట్లాడి న్యాయం చేస్తారన్న ఉద్దేశంతోనే కలవడానికి వెళ్ళినట్లుగా చెప్పాడు. అయితే ఆమెను కలవడానికి క్వార్టర్‌కు వెళ్లడం ఒక తప్పయితే, అర్ధరాత్రి వెళ్లడం మరో తప్పని పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆనంద్ కుమార్‌రెడ్డిని సస్పెండ్ చేసిన విషయం కూడా విదితమే. ఇదిలా ఉండగా బంజారాహిల్స్ రోడ్ నెం.12లో నీలోఫర్ చాయ్ తాగుదామని తనను మేడ్చల్‌నుంచి తీసుకొచ్చాడని స్మితా సబర్వాల్ ఇంటికి వెళ్లే విషయం తనకు తెలియదని, తనను అనవసరంగా ఇందులో ఇరికించాడని మరో నిందితుడు కొత్త బాబు కస్టడీలో పోలీసులకు వెల్లడించాడు. -
వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలి
సాక్షి, హైదరాబాద్: రాబోయే వేసవికాలంలో తాగునీటి సరాఫరాలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాల ని అధికారులను సీఎంవో, మిషన్ భగీరథ విభాగం కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశించారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అంతరాయాలు లేని తాగునీటి సరాఫరా కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆవాసాలు, విద్యాసంస్థలకు నిరాటంకంగా తాగునీటి సరాఫరా కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం తాగునీటి సరాఫరాపై మిషన్ భగీరథ కార్యాలయంలో స్మితా సబర్వాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం సాగుతున్న బల్క్, ఇంట్రా సరాఫరా తీరుపై స్మితా సబర్వాల్ సంతృప్తి వ్యక్తంచేశారు. రిజర్వాయర్ల నీటి మట్టాల నిరంతర పర్యవేక్షణ ఇంటెక్ వెల్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో ఉన్న పంపులు, మోటార్ల వ్యవస్థలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మెయిన్, సెకండరీ పైప్లైన్లలో ఎక్కడైనా లీకేజీలు ఏర్పడితే వెంటనే రిపేర్ చేసేలా మొబైల్ టీంలను నిరంతరం అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. మారుమూల, అట వీ ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాలు, రెసిడెన్షియల్ స్కూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ ప్రాంతాల్లో జరుగుతున్న మిషన్ భగీరథ తాగునీటి సరాఫరా తీరుపై గిరిజన, సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌చోంగ్తూతో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, వివిధ జిల్లాల చీఫ్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు పాల్గొన్నారు. -
Smita Sabharwal: నెల క్రితమే నిందితుడి రెక్కీ.. ప్లజెంట్ వ్యాలీలో కరువైన నిఘా
బంజారాహిల్స్: తెలంగాణ సీఎం కార్యాలయ అధికారిణి, సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి గురువారం అర్ధరాత్రి మేడ్చల్ జిల్లా పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ చెరుకు ఆనంద్ కుమార్‌రెడ్డి చొరబడిన వ్యవ హారంలో తవ్విన కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు నెల క్రితమే యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో ఉన్న ప్లజెంట్ వ్యాలీలో స్మితా సబర్వాల్ ఇంటికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఆ రోజు ఇంట్లో ఆమె లేకపోవడంతో తిరిగి వెళ్ళినట్లుగా గుర్తించారు. ఈ ఘటనలో మరో నిందితుడు బాబును జూబ్లీహిల్స్ వైపు వెళ్ళొద్దామంటూ తీసుకొచ్చిన నిందితుడు స్మితా సబ ర్వాల్ ఇంటిదాకా తీసుకొచ్చి ఆయనను కూడా ఈ కేసులో అడ్డంగా ఇరికించినట్లయింది. ఇదిలా ఉండగా బాబు బయట కారులో కూర్చోగా నిందితుడు ఆనంద్ కుమార్ రెడ్డి నేరుగా ఆమె ఇంట్లోకి వెళ్ళాడు. కారులో కూర్చున్న బాబు బయటికి దిగి తన సెల్ఫోన్లో అక్కడి క్వార్టర్లు అ న్నింటిని దర్జాగా వీడియో తీస్తున్నా ఏ ఒక్కరూ గుర్తించలేకపోయారు. సీసీ కెమెరాలు ఉండవా..?: స్మితా సబర్వాల్ ఉంటున్న ప్లజెంట్ వ్యాలీలో మొత్తం 23 క్వార్టర్స్ ఉన్నాయి. ఆమెది బి–11వ నెంబర్‌క్వార్టర్. తెలంగాణకు చెందిన ప్రముఖ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ క్వార్టర్లలో ఉంటున్నారు. అయితే ప్రధాన గేటు వద్ద జూబ్లీహిల్స్ పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఒకటి మాత్రమే రోడ్డు వైపు పని చేస్తోంది. లోనికి వెళ్ళిన తర్వాత ఒక్క కెమెరా కూడా లేకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన అనంతరం నిందితుడికి సంబంధించిన రాకపోకలకు దృష్టిపెట్టిన పోలీసులు నిఘా నేత్రాల కోసం ఆరా తీయగా ఒక్క చోట కూడా వాటి జాడ లేకుండా పోయింది. కమ్యూనిటీ పోలీసింగ్, నేనుసైతం అంటూ బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లు, వ్యాపార సంస్థల్లో సీసీ కెమెరాలు పెట్టుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసే అధికార యంత్రాంగానికి తాము ఉంటున్న ప్రాంతంలో మాత్రం ఒక్క సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన లేకుండా పోయింది. ఈ క్వార్టర్లలోకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారన్నది కూడా నిఘా గాలికి వదిలేసినట్లుగా గత మూడు రోజుల నుంచి పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఎవరిని కదిపితే ఏం సమస్యలొస్తాయోనని ఇక్కడి నిఘా విషయంలో పోలీసులు నోరు మెదపడం లేదు. ఇప్పటికైనా ఈ క్వార్టర్స్ వద్ద నిఘా నేత్రాలు ఏర్పాటు చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా నిందితుల కస్టడీ కోసం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిప్యూటీ తహసీల్దార్ సస్పెన్షన్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్‌కుమార్‌రెడ్డిపై వేటు పడింది. జిల్లా పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న ఆనంద్‌కు మార్రెడ్డిని సస్పెండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి తనుజా చంచల్‌గూడ జైలులో నిందితుడు ఆనంద్‌కుమార్‌రెడ్డికి సోమవారం సిబ్బంది ద్వారా సస్పెన్షన్ ఉత్తర్వులను అందజేశారు. -
భయానక పరిస్థితిని ఎదుర్కొన్నా
సాక్షి, హైదరాబాద్: ‘నా ఇంట్లో ఒక అగంతకుడు చొరబడటంతో గత రాత్రి అత్యంత భయానక పరిస్థితిని ఎదుర్కొన్నా. అప్రమత్తతతో ఉండటంతో నా ప్రాణాలను రక్షించుకోగలిగాను’అని ముఖ్యమంత్రి కార్యదర్శి స్మిత సబర్వాల్ ఆదివారం ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎంత సురక్షితంగా ఉన్నామనే భావనలో ఉన్నా.. ప్రతిసారీ తలుపులు, గడియలను స్వయంగా మనమే సరిచూసుకోవాలి’అన్న పాఠాన్ని ఈ ఘటన నేర్పిందని ఆమె పేర్కొన్నారు. ఆమె ఇంట్లో అర్ధరాత్రి వేళలో చొరబడిన ఓ డిప్యూటీ తహశీల్దార్‌తో పాటు అతడితో పాటు వచ్చిన మరో వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించిన విషయం తెలిసిందే. -
స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబాటు.. రిమాండ్‌కు నిందితులు
సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడిన కేసులో ఇద్దరిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్‌తో పాటు అతని స్నేహితుడు బాబును అరెస్ట్ చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. అక్రమ చొరబాటు, న్యూసెన్స్ కింద కేసు వాళ్లపై నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులను జడ్జి ఎదుట హాజరు పరచగా.. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ఆపై చంచల్‌గూడ్‌కు తరలించారు ఇద్దరిని. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ జిల్లా పౌరఫరాశాఖ కార్యాలయంలో ఆనంద్ కుమార్ రెడ్డి(45) డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నాడు. కాగా తనకు కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని స్మితా సబర్వాల్ దృష్టికి తీసుకెళ్లాలనుకున్నానని ఆనంద్ కుమార్ పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాను యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లోని ప్లెజెంట్ వ్యాలీలోని ఐఏఎస్ క్వార్టర్స్ వద్దకు వెళ్లినట్లు చెప్తున్నాడు. అయితే అపాయింట్మెంట్ లేకుండా అదీ రాత్రి పూట ఈ ఇద్దరూ ఆమె ఇంట్లోకి వెళ్లడం, అది భద్రతా సిబ్బంది కళ్లుగప్పడంతో కేసు నమోదు అయ్యింది. -
అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసీల్ధార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళా ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లోని స్మితా ఇంటి వద్ద మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ డిప్యూటీ తహసీల్దార్ హల్చల్ చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మేడ్చల్ జిల్లా పౌరఫరాశాఖ కార్యాలయంలో ఆనంద్ కుమార్ రెడ్డి(45) డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి తన స్నేహితుడు దుర్గా విలాస్ హోటల్ యజమాని బాబుతో కలిసి యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లోని ప్లెజెంట్ వ్యాలీలో ఆమె ఉంటున్న నివాస సముదాయం వద్దకు వచ్చాడు. తనకు అపాయింట్మెంట్ ఉందంటూ అక్కడి భద్రతా సిబ్బందిని నమ్మించి ఆనంద్రెడ్డిలోనికి ప్రవేశించి స్మీతా సబర్వాల్ ఇంటి వద్దకు వెళ్లాడు. అక్కడ భద్రత లేకపోవడంతో ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి వెళ్లాడు. అలికిడికి బయటకు వచ్చిన స్మితా సబర్వాల్ గుర్తు తెలియని వ్యక్తి కనిపించడంతో ఆందోళనకు గురై.. బయటకు వెళ్లిపోవాల్సిందిగా కేకలు వేసింది. దాంతో ఆనంద్ బయటకు వెళ్లిపోయాడు. తన అనుమతి లేకుండా గుర్తు తెలియని వ్యక్తిని లోనికి ఎవరు పంపారంటూ సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించడంతో అప్రమత్తమైన సిబ్బంది బయటకు వస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడు ఆనంద్ కుమార్‌తోపాటు అతడి వెంట వచ్చిన బాబును అదుపులోకి తీసుకున్నారు. వారి కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో స్మితా సబర్వాల్ ట్వీట్లను డిప్యూటీ తహసీల్దార్ రీట్వీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు తనకు ఎదురైన అనుభవాన్ని ఐఏఎస్ స్మితా సబర్వాల్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. గత రాత్రి అత్యంత బాధాకరమైన ఘటన జరిగిందని, తన ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడినట్లు తెలిపారు. అప్రమత్తతో వ్యవహరించి తన ప్రాణాలు కాపాడుకున్నట్లు తెలిపారు. మీరు ఎంత సురక్షితంగా ఉన్నామని భావించినా.. ఎల్లప్పుడూ వ్యక్తిగతంగా తలుపులు, తాళాలు తనిఖీ చేసుకోవాలంటూ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేయాలని పేర్కొన్నారు. Had this most harrowing experience, a night back when an intruder broke into my house. I had the presence of mind to deal and save my life. Lessons: no matter how secure you think you are- always check the doors/ locks personally.#Dial100 in emergency — Smita Sabharwal (@SmitaSabharwal) January 22, 2023 -
ఇక మహిళలకు ఆయుధాలు ఇవ్వాలేమో!: స్మితా సబర్వాల్
సాక్షి, హైదరాబాద్: రేప్ కేసుల్లో తాజా కోర్టు తీర్పులపై ముఖ్యమంత్రి కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ స్పందించారు ‘‘దేశంలో న్యాయపరంగా ఇలాగే నిరాశాజనక ధోరణి కొనసాగితే.. ఆయుధాలు కలిగి ఉండే హక్కును మహిళలకు కల్పించడానికి ఇది సరైన సమయం కావచ్చు’’.. అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం, చట్టం రెండూ వేర్వేరు అంశాలు కాకూడదని ఆమె ట్వీట్ చేశారు. గ్యాంగ్ రేప్ కేసులో ఓ దోషికి విధించిన శిక్షను 25 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు తగ్గించడంతో పాటు అతడికి బెయిల్ మంజూరు చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు, ఢిల్లీలో సంచలనం రేపిన ఓ అత్యాచారం, హత్యకేసులో దోషులకు విధించిన మరణ శిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె ఈవిధంగా స్పందించారు. బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించడంపైనా ఆమె గతంలో ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. If this trend of Judicial let-downs continue, it may be time to allow women of this country the Right to bear Arms ! 'Justice and Law cannot be two different things'. #shameful pic.twitter.com/JUrWKq2frY — Smita Sabharwal (@SmitaSabharwal) November 8, 2022 -
Telangana: స్మితా సబర్వాల్ గీత దాటారా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ గీత దాటారంటూ చర్చ నడుస్తోంది. గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానోపై అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో 11 మంది జీవిత ఖైదీలకు గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించి, విడుదల చేయడం దేశవ్యాప్తంగా దూమారం రేపుతోంది. వీరి క్షమాభిక్షకు వ్యతిరేకంగా తెలంగాణ కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి ట్విట్టర్ వేదికగా మూడు రోజులుగా ప్రచారోద్యమం నిర్వహిస్తున్నారు. ‘వాళ్లకు ఉరితాళ్లే సరి. పూలదండలతో సన్మానాలు కాదు. వారి క్షమాభిక్షను రద్దు చేసి మా నమ్మకాన్ని పునరుద్ధరించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతో పాటు రాజ్యాంగ అధిపతులకు విజ్ఞప్తి చేస్తున్న’ అని ఆమె ఆదివారం మరో ట్వీట్ చేశారు. గోద్రా జైలు నుంచి విడుదలైన తర్వాత వారిని కొందరు పూలదండలతో సత్కరించి మిఠాయిలు తినిపించడం, ఆ తర్వాత కొన్ని సంస్థలు సన్మానాలు చేయడం పట్ల చాలా మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇదే కోవలో స్మితా సబర్వాల్ సైతం స్పందించారు. గీత దాటారంటూ.. ‘ఒక మహిళగా, సివిల్ సర్వెంట్‌గా ఈ వార్తలు చదువుతున్నప్పుడు నమ్మలేక పోయిన. భయం లేకుండా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే బిల్కిస్ హక్కును హరించి, మనల్ని మనం స్వేచ్ఛా దేశంగా పిలుచుకోలేము’ అని రెండు రోజుల కింద ఆమె చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఆమె ధైర్యాన్ని చాలామంది ప్రశంసించారు. ఐఏఎస్ అధికారై ఉండి ఓ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం సర్వీసు నిబంధనలకు విరుద్ధమని మరికొందరు ఆమెను విమర్శిస్తున్నారు. దానికి ఆమె ‘ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ అధికారుల వాక్ స్వేచ్ఛను హరించే సర్వీసు నిబంధనలను రద్దు చేయాల్సిన సమయం వచ్చింది’ అంటూ చేసిన మరో ట్వీట్ సైతం వైరల్‌గా మారింది. వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా ద్వారా అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో తప్పులేదని కొందరు ఐఏఎస్ అధికారులు ఆమెకు బాసటగా నిలిచారు. గీత దాటారని మరికొందరు సహచరులు తప్పుబడుతున్నారు. ఇక గుజరాత్ ప్రభుత్వ నిర్ణయానికి మద్దతిస్తున్న వాళ్లు ఆమెపై సోషల్ మీడియాలో ప్రతిదాడి చేస్తున్నారు. They deserved the noose not garlands. Appeal to the Supreme Court and Constitutional heads to cancel the remission, and restore our faith. #JusticeForBilkisBano pic.twitter.com/ECqXhZacF4 — Smita Sabharwal (@SmitaSabharwal) August 21, 2022 On the same note, is it not time to Ungag us, the #civilservice . We give the best years of our life, learning and unlearning our pride that is #India. We are informed stakeholders.. then Why this ?? #FreedomOfSpeech pic.twitter.com/ymHNJFVjAR — Smita Sabharwal (@SmitaSabharwal) August 19, 2022 ఇదీ చదవండి: అమిత్ షా.. ఓ ప్రముఖ క్రికెటర్ తండ్రి.. కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు -
Handloom Every Day Challenge: చేనేతకు ‘ఐఏఎస్ బ్రాండ్’..
ఏదైనా బ్రాండ్‌ను ప్రమోట్ చేయాలన్నా.. దానిని ప్రజల్లోకి తీసికెళ్లి సేల్ చేయాలన్నా ఆయా సంస్థలు సెలబ్రిటీలను ఎంచుకుంటారు. వారి ద్వారా అయితేనే ప్రొడక్ట్ డిమాండ్ పెరుగుతుందనే నమ్మకం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రభుత్వ పరిధిలోని చేనేత రంగాన్ని ప్రమోట్ చేసేందుకు స్వయానా ఐఏఎస్ అ«ధికారులు రంగంలోకి దిగారు. చేనేతలోని పలు రకాల చీరెలను ధరించి వాటి విశిష్టతను సోషల్ మీడియా ద్వారా వివరిస్తున్నారు. నచ్చిన చీరలో ఫొటో దిగి దానిని ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో చేనేతకు భారీ డిమాండ్ పెరిగింది. చేనేతను ప్రోత్సహించేందుకు, కార్మికులకు సేల్స్‌ను పెంచేందుకు స్వయానా రంగంలోకి దిగారు ముఖ్యమంత్రి కార్యాలయపు కార్యదర్శి స్మిత సభర్వాల్. ఇటీవల చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. తెలంగాణలోని పలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారు తమ తమ ట్విట్టర్ అకౌంట్లలో పోస్టులు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారి ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. సై ్టలిష్ లుక్‌లో ఛాలెంజ్ చేసిన స్మిత సబర్వాల్ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయపు అధికారిణి స్మిత సభర్వాల్ ఓ చక్కటి చేనేత చీరను ధరించి ఆ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఈ చీరలో ఎంతో స్టయిలిష్ లుక్‌లో ఉన్నారు మేడం..’ అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్మిత ఆ పోస్ట్ ద్వారా హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చేనేతవస్త్రాన్ని ధరించాలంటూ ఛాలెంజ్ విసిరారు. ఇలా ఛాలెంజ్‌ను స్వీకరించిన వారు తమకు నచ్చిన చేనేత వస్త్రాల్లో సోషల్ మీడియాలో సందడి చేశారు. దేశం మొత్తం ఫిదా స్మిత సబర్వాల్ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారిలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ఐటీ శాఖ సెక్రటరీ జయేష్ రంజన్, నారాయణఖేడ్ జిల్లా కలెక్టర్ హరిచందన, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శిక్తా పట్నాయక్, యాదాద్రి జిల్లా కలెక్టర్ ప్రమీలా సత్పతి, ఐపీఎస్ అధికారిణులు శిఖాగోయల్, స్వాతిలక్రా తదితరులు వారికి నచ్చిన చేనేత చీరలను ధరించి ప్రతి ఛాలెంజ్‌ను విసరడం విశేషం. వీరి ఛాలెంజ్‌లు, డ్రస్సింగ్ సెన్స్‌కు ఫిదా అయిన నెటిజన్లు లైక్‌లు కొడుతూ కామెంట్స్‌తో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వీరే కాదు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు సైతం ఈ ఛాలెంజ్‌లో పాల్గొని తమ తమ రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాలను ప్రచారం చేశారు. వీరి ప్రచారంతో చేనేతకు ఊరట లభించడంతో పాటు అమ్మకాలు సైతం ఊపందుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద మనదేశం లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు స్వదేశీ బ్రాండ్‌కు అంబాసిడర్లుగా మారి ప్రపంచవ్యాప్తంగా నయా ట్రెండ్‌ను సృష్టించడం అభినందనీయం. – చైతన్య వంపుగాని, సాక్షి -
ఎలాంటి యూనిట్లు పెట్టుకున్నారు
తుర్కపల్లి: ఐకమత్యంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ వాసాలమర్రి ప్రజలకు సూచించారు. సీఎం కేసీఆర్ విప్లవాత్మక ఆలోచన వల్లే దళితబంధు పథకం వచ్చిందని, ఆ పథకాన్ని సది్వనియోగం చేసుకొని, అర్థికంగా ఎదిగి పది మందికి ఉపాధి చూపే స్థాయికి చేరుకోవాలని అన్నారు. బుధవారం ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ముఖ్యమంత్రి దత్తత గ్రామం వాసాలమర్రిలోని దళితవాడలో సీఎం కార్యదర్శి రాహుల్»ొజ్జ, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య, భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలసి పర్యటించారు. అనంతరం రైతు వేదిక భవనంలో దళితబంధు లబ్ధిదారులతో సమీక్ష నిర్వహించారు. లాబ్ధిదారులు ఏయే యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు, నెలకు ఎంత సంపాదిస్తున్నారు, కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆమె మాట్లాడుతూ.. ఎర్రవల్లి గ్రామం తరహాలో వాసాలమర్రిని కూడా అభివృద్ధి చేసుకోవాలని వారికి సూచించారు. గ్రామంలో కొత్తగా పాఠశాల భవనాలు, అంగన్వాడీ భవనాలు ఏర్పాటు చేస్తామని, చిన్న పరిశ్రమల ద్వారా పది మందికి ఉపాధి కల్పించాలని అన్నారు. ప్రభుత్వ విప్ సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ. వాసాలమర్రి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, ఇతర కులాల్లో ఉన్న యువకులకు కూడా వారి నైపుణ్యాన్ని బట్టి ఉపాధి కలి్పంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసాలమర్రి సర్పంచ్ పోగుల ఆంజనేయులు, జెడ్పీ వైస్ చైర్మన్ బీకునాయక్, అదనపు కలెక్టర్ దీపక్‌తివారి తదితరులు పాల్గొన్నారు. -
గోదావరి జలాలతో సస్యశ్యామలం
సాక్షి ప్రతినిధి, వరంగల్: గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ఆయకట్టు భూములను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం భూసేకరణ, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై ఆదివారం హన్మకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రులతో పాటు సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. మంత్రులు మాట్లాడుతూ 5.18 టీఎంసీల సామర్థ్యంతో 1,22,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన చేయగా.. ఆ మేరకు పూర్తి చేయకుండా నాటి పాలకులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో దేవాదుల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. జనగామ జిల్లా ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను పూర్తి చేయాలని సూచించారు. ఎత్తైన ప్రదేశంలో ఉన్న వేలేరుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పాలకుర్తి, ఘన్‌పూర్‌లో ఆగిన 6వ ప్యాకేజీ పనులు ప్రారంభించాలని చెప్పారు. మధ్యలోనే వెళ్లిపోయిన ముత్తిరెడ్డి దేవాదులపై సమీక్ష సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. చెరువులకు నీటి విడుదల సంబంధిత సమస్యలను స్మితా సబర్వాల్‌కు ముత్తిరెడ్డి వివరిస్తూ అధికారుల తీరుపై విమర్శలు చేశారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి ఆయన్ను వారించారు. ఇందుకు నిరసనగా ఎమ్మెల్యే సమావేశం నుంచి వాకౌట్ చేశారు. -
మహిళల భద్రతకు సీఎం ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, యాదాద్రి : రాష్ట్రంలోని ప్రతి మహిళ భద్రతతో ఉండేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఐఏఎస్, ఐపీఎస్‌లతో కూడిన కోర్ గ్రూపు కమిటీ సమావేశంలో ఆమె మహిళా భద్రత చర్యలను సమీక్షించారు. డయల్ 100, 181 తదితర హెల్ప్‌లైన్ వ్యవస్థల పనితీరు గురించి కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు లైంగిక వేధింపులపై ఫిర్యాదులు చేస్తే కలెక్టర్లు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే సునీతా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఫిర్యాదులపై మహిళా రక్షణ కమిటీలు తక్షణం స్పందించినప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్, సీఎంఓ హరితహారం ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్, ఐఏఎస్ అధికారి యోగితా రాణా, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖా కమిషనర్ వాకాటి కరుణ, హైదరాబాద్, నల్లగొండ, యాదాద్రి కలెక్టర్లు శ్వేతా మహంతి, ప్రశాంత్ జీవన్ పాటిల్, అనితా రామచంద్రన్, హైదరాబాద్ షీ టీం ఇన్చార్జి అనసూయ పాల్గొన్నారు. -
అభివృద్ధి మీ చేతుల్లోనే: స్మిత సబర్వాల్
సాక్షి, ఇందల్వాయి(నిజామాబాద్): గ్రామ అభివృద్ధి ఆ గ్రామ ప్రజల చేతుల్లోనే ఉంటుందని, ప్రతి ఒక్కరూ తమ గ్రామ ప్రగతి కోసం పని చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి (సీఎంవో) స్మిత సబర్వాల్ పిలుపునిచ్చారు. ప్రజల సహకారం ఉంటేనే ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవచ్చని తెలిపారు. ప్రజా ప్రతినిధులు నిత్యం గ్రామస్తులకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని సూచించారు. సర్పంచ్ల పనితీరు బాగలేక పోతే పదవులు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌తో కలిసి స్మిత సోమవారం జిల్లాలో పర్యటించారు. ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి, ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్, బాల్కొండ మండలం బుస్సాపూర్‌లో ‘పల్లెప్రగతి’ పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభల్లో గ్రామస్తులతో మాట్లాడారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చేపట్టిన పనుల వివరాల గురించి ఆరా తీశారు. గ్రామాల్లో చేపట్టిన పనులు నిజమా.. కాదా? అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, విద్యుత్, హరితహారం, మౌలిక వసతుల గురించి ఆరా తీశారు. చంద్రాయన్పల్లిలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. పరిశుభత్ర బాధ్యత ప్రజలదే.. ప్రభుత్వం చెప్పినా, చెప్పకపోయినా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన భాధ్యత ప్రజలపై ఉందని స్మిత పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టినపుడే కాకుండా ఎల్లప్పుడూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా అలవాటు చేసుకోవాలని సూచించారు. నిధుల లభ్యత ఆధారంగా గ్రామ పంచాయతీ అధికారులు సంవత్సర ప్రణాళికను పకడ్బందీగా రూపొందించాలని, గ్రామంలో చేపట్టబోయే అభివృద్ధి పనుల వివరాలను జీపీ కార్యాలయంలో ప్రదర్శించాలన్నారు. శిథిలావస్థకు చేరిన రోడ్లపై స్థానికులు అడిగిన ప్రశ్నలకు స్మిత బదులిస్తూ.. మిషన్ భగీరథ ద్వారారక్షిత జలాలు వంద శాతం ప్రజలకు చేరిన అనంతరం గ్రామాల్లోని అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మొక్కలు చనిపోతే చర్యలు: వర్గీస్ ప్రతి ఇంటిలో ఐదు పండ్ల మొక్కలను పెంచాలని సీఎంవో ఓఎïస్డీ ప్రియాంక వర్గీస్ సూచించారు. గత ఐదు విడతల్లో హరితహరంలో పెంచిన మొక్కల వల్లే సమృద్ధిగా వర్షాలు కురిశాయని చెప్పారు. ప్రతీ గ్రామ పంచాయతీ తప్పకుండా నర్సరీని కలిగి ఉండాలని, అందులో ప్రధానంగా నిమ్మ గడ్డి, కృష్ణ తులసి మొక్కలను పెంచాలన్నారు. నిమ్మ గడ్డి వలన దోమలు రాకుండా ఉంటాయన్నారు. ప్రతీ గ్రామంలో నిర్దేశిత మొక్కలు నాటి 85 శాతం మొక్కలు బతికేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపడతాయని, మొక్కలు చనిపోతే చర్యలు తప్పవని తెలిపారు. అడవుల్లో పండ్ల మొక్కలు నాటితే కోతుల బెడదను నివారించవచ్చని తెలిపారు. పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్‌రావ్, కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నాయని, పనితీరు బాగా లేకపోతే బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జెడ్పీ సీఈవో గోవింద్, ఆర్డీవో శ్రీనివాసులు, మిషన్ భగీరథ ఎస్ఈ రాజేందర్, ట్రాన్స్‌కో ఎస్ఈ సుదర్శనం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించండి.. తను పూరి గుడిసెలో నివాసం ఉంటున్నానని, తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని సామ్యానాయక్ తండాకు చెందిన లక్ష్మి స్మిత సబర్వాల్‌ను కోరారు. తన కోరిక తీర్చితే సంతోషిస్తానని ఆమె తెలపగా, స్మిత సబర్వాల్ సుముఖత వ్యక్తం చేశారు. -
సీఎం దృష్టికి తీసుకెళ్తాం: స్మితా సబర్వాల్
సాక్షి, అలంపూర్(మహబూబ్‌నగర్) : తుమ్మిళ్ల ఎత్తిపోతలలో చేపట్టాల్సిన పనులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్ చెప్పారు. మంగళవారం ఉదయం రాజోళి మండలంలోని ఈ పథకాన్ని ఆమె పరిశీలించారు. అంతకుముందు హెలికాప్టర్లో తుమ్మిళ్లకు చేరుకున్న ఆమెకు జెడ్పీచైర్‌పర్సన్ సరిత, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, కలెక్టర్ శశాంక స్వాగతం పలికారు. అనంతరం అల్పాహారం తీసుకున్న ఆమె పథకం పనులను పరిశీలించేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తుమ్మిళ్ల పథకంలోని జీరో పాయింట్ వద్దకు రాష్ట్ర నీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, సీఈ అనంతారెడ్డిలతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా తుంగభద్ర నది నుంచి అప్రోచ్ కెనాల్లోకి నీరు వచ్చే విధానాన్ని పరిశీలించారు. తుంగభద్ర నదిలో వరద నీరు ఎన్ని రోజులు కొనసాగుతుందో, నది అవతలివైపు ఉన్న గ్రామాలపై అధికారులతో ఆరా తీశారు. సమీపంలోని సుంకేసుల బ్యారేజీ, కేసీ కెనాల్ వివరాలను అడిగారు. ఈ లిఫ్టులో ప్రస్తుతం రెండు 5.5 హెచ్‌పీ, మరొకటి 10.5హెచ్‌పీ మోటార్లు ఉన్నాయని అధికారులు బదులిచ్చారు. ప్రస్తుతం మొదటి విడత పనులు పూర్తి కాగా, ఒక 5.5హెచ్‌పీ మోటార్ ద్వారా మాత్రమే నీటి పంపింగ్ అవుతోందన్నారు. అనంతరం తనగల వద్ద ఉన్న ఆర్డీఎస్ కెనాల్ డి–23 వద్దకు ఆమె వెళ్లి లిఫ్ట్ నుంచి నీరు చేరుకోవడాన్ని పరిశీలించారు. రెండో దశ పనులపైనా.. ఈ ఎత్తిపోతలలో భాగంగా రెండో దశలో చేపట్టాల్సిన రిజర్వాయర్లకు స్థల సేకరణకు రైతులు సిద్ధంగా ఉన్నారా? లేదా? అనే దానిపై స్మితాసబర్వాల్ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆర్డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి మాట్లాడుతూ.. 1.1 టీఎంసీ సామర్థ్యంతో నిర్మించే మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు సంబంధించి సుమారు వంద ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందన్నారు. మిగతా భూమిని సేకరించేందుకు అధికారులు సన్నద్ధమైతే రైతులు తప్పకుండా సహకరిస్తారన్నారు. ఈ ఎత్తిపోతల ద్వారా శాశ్వత ప్రయోజనాలు కలగాలంటే రిజర్వాయర్ల నిర్మాణం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది బాగా వర్షాలు కురవడం, ఎగువ నుంచి తుంగభద్రకు వరద నీరు రావడం వల్ల నీరు సమృద్ధిగా ఉందన్నారు. ఏటా ఇలాగే ఉంటుందని భావించలేమని, దీనిని దృష్టిలో ఉంచుకుని, వీలైనంత త్వరగా రిజర్వాయర్లు నిర్మించి, ఆర్డీఎస్ కెనాల్‌ను ఆధునికీకరించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు సుగుణమ్మ, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు రేణుక, నీటిపారుదలశాఖ ఎస్ఈ రఘునాథ్‌రావు, ఈఈ శ్రీనివాసులు, డీఈ శ్రీనివాస్, ఏఈఈలు శివరాజు, అంజనేయులు, వరుణ్ పాల్గొన్నారు. ఆర్డీఎస్ కెనాల్ వద్ద డెలివరీ సిస్టర్న్‌లో నీటి విడుదలను పరిశీలిస్తున్న అధికారులు పకడ్బందీగా ‘ప్రణాళిక’ పనులు గ్రామాల్లో ‘ప్రణాళిక’ పనులు పకడ్బందీగా నిర్వహించాలని సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్ ఆదేశించారు. తుమ్మిళ్ల పంప్‌హౌస్ సమీపంలో మొక్కను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హరితహారం, ప్రణాళిక పనులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, వీటి ద్వారా భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఎస్ ఏఈఈ శివరాజ్, డిప్యూటీ తహసీల్దార్ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. -
‘జూన్ నాటికి సాగు నీరందించాలి’
సాక్షి, కొత్తగూడెం : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా ల్లోని 6.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సీతారామ ఎత్తిపోతల పథకం పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశించారు. ఆదివారం ఆమె భద్రాద్రి జిల్లాలోని అశ్వాపురం, పాల్వంచ, ములకలపల్లి మండలాల్లో జరుగుతున్న ప్రాజెక్టు కెనాల్, పంప్‌హౌస్ పనులను పరిశీలించారు. నీటిపారుదల ఇంజనీరింగ్ అధికారులు, కాం ట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. జూన్ 2020 నాటికి సాగునీరు అందించేలా పనులు చేయాలన్నారు. మొదటి ప్యాకేజీలో భాగంగా చేస్తున్న పంప్‌హౌస్, కెనాల్ పనులపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే జనవరిలోగా పంప్‌హౌస్ డ్రైరన్ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆనకట్ట నుంచి బీజీకొత్తూరు వరకు కెనాల్ పనులు, పంప్‌హౌస్, వంతెనలు జన వరి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ 2 నెలలు యుద్ధ్దప్రాతిపదికన పనులు పూర్తి చేయాలన్నారు. -
‘మూసీ’పై అవసరమైన చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రాజెక్టు గేటు విరిగిన ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పందించారు. తక్షణమే పరిస్థితిని చక్కదిద్దాలని అధికారులు, ఇంజనీర్లను ఆదేశించారు. ఆదివారం ఉదయం మూసీ గేటు ఘటన పరిస్థితుల తీవ్రతను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సీఎంకు ఫోన్లో వివరించారు. దీంతో సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌తో పాటు ఈఎన్సీ మురళీధర్‌రావులను మూసీ సందర్శించి, తక్షణ నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్‌తో పాటు ఇంజనీర్లు బేగంపేట నుంచి హెలికాప్టర్లో మూసీ ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. స్టాప్‌లాగ్స్ బిగింపునకు 3 రోజులు అధికారులు మూసీ వద్దకు చేరుకున్నాక అక్కడి పరిస్థితిని సీఎంకు ఫోన్లో వివరించారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు ఎక్కువగా ఉండటం, గేటు ఊడటంతో 10వేల క్యూసెక్కుల మేర నీరు దిగువకు వెళ్తోందనీ,, దీన్ని నిరోధించేందుకు స్టాప్‌లాగ్స్ అవసరమనీ తెలిపారు. వాటిని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ) అధికారులు డిజైన్స్ రూపొందించి తయారు చేయించేందుకు కనీసం మూడు రోజులైనా పట్టవచ్చని వివరించినట్లు తెలిసింది. అప్పటిలోగా ప్రాజెక్టులో ఉన్న నీరంతా ఖాళీ అయ్యే అవకాశాలే అధికమని ఇంజనీర్ల అంచనా. ఒకవేళ ప్రైవేటు కాంట్రాక్టర్లకు గేటు అమర్చే పని అప్పగించినా మూడు రోజులు పడుతుందని భావిస్తున్నారు. గేటుకు ఒక పక్కభాగంలో కాంక్రీట్ నిర్మాణం దెబ్బతినడం, ఎగువన నుంచి భారీగా వచి్చన వరద ప్రవాహంతో అది విరిగిపోయినట్లు తెలుస్తోంది. -
విరిగిన మూసీ గేట్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్ష
సాక్షి, నల్గొండ : జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఓ రెగ్యులేటరీ గేట్ విరిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రాజెక్టులోని నీరు వృథాగా పోతుంది. ఈ నేపథ్యంలో మూసీ డ్యామ్ వద్దకు చేరుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, ఈఎన్సీ మురళీధర్‌రావు.. గేట్ విషయమై నీటిపారుదల అధికారులతో సమీక్ష చేపట్టారు. విరిగిన గేట్‌కు సంబంధించి నిపుణులు రూపొందించిన మ్యాప్‌ను మంత్రి జగదీశ్‌రెడ్డి పరిశీలించారు. గేట్‌ను తిరిగి యథావిధిగా అమర్చేందుకు అధికారులతో మంతనాలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లోనే గేట్‌ను యథావిధిగా అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
వీడియోకాల్‌తో ప్రతీ ఇంటి నల్లా పరిశీలన
సాక్షి, హైదరాబాద్: సోషల్ ఆడిట్లో భాగంగా ప్రతీ ఇంటి నల్లా కనెక్షన్‌ను వీడియో కాల్ ద్వారా పరిశీలించనున్నట్లు మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్ వెల్లడించారు. ఇంటింటికి నల్లాతో నీరు సరఫరా అవుతున్న తీరుపై సర్పంచ్‌లతో త్వరలోనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. శుక్రవారం ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. అత్యుత్తమ ప్రమాణాలు, నీటి శుద్ధి ప్రక్రియతో సరఫరా అవుతున్న భగీరథ నీటిని తాగేలా ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. పరిగి, గట్టు మండలాల స్థానిక ప్రజాప్రతినిధులకు భగీరథ నీటి వినియోగంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాలకు మంచి బాగుందని అధికారులను అభినందించారు. ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న వారు తమ గ్రామా ల్లోని ప్రజలంతా భగీరథ నీటినే వినియోగించేలా చైతన్యపరుస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. సమావేశంలో ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజనీర్లు జగన్మోహన్రెడ్డి, విజయపాల్‌రెడ్డి, విజయ్‌ప్రకాశ్, వినోభాదేవి, చెన్నారెడ్డి, రమేశ్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆగస్టులో ట్రయల్ రన్
ములకలపల్లి: సీతారామ ప్రాజెక్టు మొదటి దశకు ఆగస్టు చివరి నాటికి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు. మండల పరిధిలోని వీకే రామవరం, కమలాపురం గ్రామాల్లో జరుగుతున్న పంప్‌హౌస్, కెనాల్ నిర్మాణ పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రాజెక్టు పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. వీకే రామవరంలో జరుగుతున్న పనులపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కమలాపురంలో పనులు నత్తనడకన జరుగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు చేసే కార్మికులు తక్కువ సంఖ్యలో ఉన్నారని, ఎక్కువ సంఖ్యలో ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. కార్మికులను అధిక సంఖ్యలో నియమించుకుని, పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పనులు చేయాలి కాని.. కుంటిసాకులు చెప్తూ జాప్యం చేయడమేమిటని ఏజెన్సీలను ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పనులు జరగకపోవడానిక కారణాలేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు జాప్యం జరిగిన రోజులకు సంబంధించి సిబ్బంది వేతనాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. సైట్ మేనేజింగ్, ఇంజనీరింగ్ అధికారుల మధ్య సమన్వయం ఏమాత్రం లేదన్నారు. దశల వారీగా రోజుకు ఎంత పని చేయాల్సి ఉందనే అంశంపై ప్రణాళిక తయారుచేసుకుని దాని ప్రకారం పనులు చేస్తే త్వరగా పూర్తవుతాయన్నారు. రోజువారీ ఎంత కాంక్రీట్ పనులు చేయాల్సి ఉందని అడిగి తెలుసుకుని, మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణాలకు సంబంధించి రోజువారీ షెడ్యూల్‌ను అందచేస్తామని, ఆ ప్రకారం పనులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు మొదటి, రెండు, మూడు పంప్‌హౌస్‌ల పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని, వీటి ద్వారా సీఎం కార్యాలయం నుంచి సీసీ టీవీలు ఏర్పాటు చేసుకుని పనులను ప్రతీ రోజూ పర్యవేక్షిస్తానన్నారు. ప్రాజెక్ట్ మొదటి, రెండో దశలకు 6 మోటార్లు, మూడో దశకు 7 మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉందని, మొదటి దశకు ఆగస్టు చివరి నాటికి ట్రయల్‌రన్ నిర్వహించనున్నట్లు చెప్పారు గ్రావిటీ కెనాల్ 1,2,3,4,7,8 పనులు అక్టోబర్ మాసం చివరి నాటికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. సివిల్ పనుల్లో వేగం పెంచాలని, రానున్న వర్షాకాలం నాటికి సివిల్ పనులు పూర్తి చేయకపోతే వర్షాల వలన ఇబ్బందులు వస్తాయన్నారు. బీజీ కొత్తూరుకు వస్తుండగా కాలువ పనులు జరగడంలేదని గుర్తించానని, ఒక్క మనిషి కూడా కాలువ పనులు చేయడంలేదన్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండి పనులు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ, సీఎంఓ ఓఎస్డీ పెద్దారెడ్డి, ఈఈ నాగేశ్వరరావు, ములకలపల్లి తహశీల్దార్ ముజాహిద్, ప్రతిమ ఏజెన్సీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలి అశ్వాపురం: సీతారామ ప్రాజెక్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ నిర్మాణ సంస్థను, అధికారులను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్ట్ ప్యాకేజీ–1లో భాగంగా మండల పరిధిలోని బీజీకొత్తూరులో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్ట్ మొదటి పంప్‌హౌస్ పనులను ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీధర్‌దేశ్‌పాండే, ఇరిగేషన్ సలహాదారు పెంటారెడ్డి, జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీతో కలిసి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ శుక్రవారం సందర్శించారు. పంప్‌హౌస్ పనులు పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పంప్‌హౌస్, ప్యాకేజీ–1 కెనాల్, వంతెనల నిర్మాణ పనులు జరుగుతున్న తీరు, పనులు ఎంత వరకు పూర్తయ్యాయి, పనుల్లో పురోగతిని, గోదావరి జలాలు పంప్‌హౌస్ వరకు ఎప్పటి వరకు తరలిస్తారనే వివరాలు తెలుసుకున్నారు. బీజీకొత్తూరు పంప్‌హౌస్, ప్యాకేజీ–1 కెనాల్, కెనాల్‌పై వంతెనల నిర్మాణాలు అనుకున్నంత వేగంగా జరగడం లేదని, జనవరి 23న పనులను సందర్శించిన సమయంలో మార్చిలో మోటర్లు డ్రై రన్ నిర్వహించి మే నెల కల్లా పనులు పూర్తి చేయాలని ఆదేశించినా పనుల్లో ఎలాంటి పురోగతి లేదని, పనులపై తప్పుడు నివేదికలు ఇస్తున్నారని స్మితా సబర్వాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యంపై నిర్మాణ సంస్థ, అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని, పనుల్లో అలసత్వం వహిస్తే వేతనాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ మాట్లాడుతూ మొదటి పంహౌస్ , కెనాల్ పనులు వేగవంతం చేయాలన్నారు. మోటర్లు, పంపులు అమర్చే పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఖరీఫ్ కల్లా పాలేరు జలాలకు సీతారామ జలాలు అనుసంధానం చేసేలా పనుల్లో వేగం పెంచాలన్నారు. ప్రాజెక్ట్ పనుల్లో అలసత్వం వహించినా, పనులు గడువు లోపు పూర్తి చేయకున్నా ఊరుకునేది లేదని తగిన చర్యలు తప్పవని నిర్మాణ సంస్థను, ప్రాజెక్ట్ అధికారులను హెచ్చరించారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు సంబంధించి ప్రతీ రోజు జరిగిన పనులపై తనకు పూర్తి నివేదిక అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామ ప్రాజెక్ట్ ఎస్ఈ టీ.నాగేశ్వరరావు, ఈఈ బాబూరావు, డీఈలు మహేశ్వరరావు, వెంకటేశ్వరరావు, మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జీఎం శ్రీనివాసరావు, ఏఈలు రమేష్, శ్రీనివాస్, స్వాతి, రాజీవ్‌గాం«ధీ, దుర్గాప్రసాద్, మణుగూరు డీఎస్పీ సాయిబాబా, సీఐ రమేష్, తహసీల్దార్ అరుణ, ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
బాహుబలి 3 విజయవంతం
ధర్మారం: తెలంగాణ బాహుబలి అయిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం వద్ద ప్యాకేజీ– 6లో భాగంగా నిర్మించిన సర్జిపూల్ మరో అద్భుత ఘట్టానికి వేదిక అయింది. బుధవారం ఒక్కరోజే రెండు (3, 4) మోటార్ల వెట్ రన్‌ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. గత నెల 24న మొదటి మోటార్, 25న రెండో మోటార్‌ను సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ ప్రారంభించారు. రెండు మోటార్ల వెట్‌రన్ విజయవంతమైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మూడు, నాలుగో మోటార్ వెట్ రన్‌ను ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ నల్ల వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్డీ దేశ్‌పాండే, నీటి పారుదల శాఖ సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి, ఈఈ నూనె శ్రీధర్ బుధవారం నిర్వహించారు. ఎగిసిపడిన గంగమ్మ మోటార్లు ఆన్ చేసిన వెంటనే సుమారు 105 మీటర్ల లోతు నుంచి గోదావరి జలాలు ఉపరితలంలోని మేడారం రిజర్వాయర్‌లో ఏర్పాటు చేసిన మూడో సిస్టర్న్ ద్వారా ఎగిసి పడ్డాయి. అప్పటి వరకు ఉత్కంఠగా ఎదురు చూసిన అధికారులు గోదావరి పరుగులు చూసి సంబరాలు చేసుకున్నారు. ఎలాంటి అంతరాయం కలుగకుండా వెట్‌రన్ విజయవంతం కావటంతో ఇంజనీరింగ్ అధికారులు, నవయుగ కంపెనీ ప్రతినిధులు, ట్రాన్స్‌కో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తూ జై తెలంగాణ నినాదాలు చేశారు. మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం సిస్టర్న్‌ల వద్దకు చేరుకుని పూజలు నిర్వహించారు. సుమారు 30 నిమిషాలు వెట్‌రన్ నిర్వహించారు. సిస్టర్న్ ద్వారా ఉబికి వస్తున్న గోదావరి జలాలు సాయంత్రం నాలుగో మోటార్ ఈ క్రమంలోనే నాలుగో మోటార్ వెట్‌రన్‌ను కూడా అధికారులు సాయంత్రం విజయవంతంగా నిర్వహించారు. 6:45 గంటలకు ఇంజనీరింగ్ అధికారులు మోటార్ స్విచ్ ఆన్‌చేసి వెట్‌రన్ ప్రారంభించారు. ఎలాంటి అంతరాయం లేకుండా నాలుగో మోటార్ కూడా 25 నిమిషాలు విజయవంతంగా గోదావరి నీటిని 105 మీటర్ల ఉపరితలంలోని సిస్టర్న్ ద్వారా లిఫ్ట్ చేయడంతో అధికారులు ఆనందంలో మునిగిపోయారు. రెండు మోటార్లు ఒకే రోజు విజయవంతం కావడంపై ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌దేశ్‌పాండే హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. -
అద్భుతం ఆవిష్కృతం
ధర్మారం(ధర్మపురి): కాళేశ్వరం ప్రాజెక్టులో అద్భు తం ఆవిష్కృతమైంది. రాష్ట్ర సాగునీటి చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ కనీవినీ ఎరుగని రీతిలో జల దృశ్యం సాక్షాత్కారమైంది. పనులు మొదలైనప్పటి నుంచి రికార్డుల మీద రికార్డులు సొంతం చేసుకుంటున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మరో కీలకమైన మైలురాయిని అధిగమించింది. ప్యాకేజీ–6లో భాగం గా ధర్మారం మండలం నందిమేడారం వద్ద నిర్మిం చిన సర్జిపూల్లో ఏర్పాటు చేసిన భారీ మోటార్ వెట్‌రన్ విజయవంతమైంది. ఈ పరీక్షకు సంబంధించి సాంకేతిక ప్రక్రియలన్నీ పూర్తికావడంతో అధికారులు బుధవారం వెట్‌రన్ నిర్వహించారు. నందిమేడారం సర్జిపూల్లో నింపి ఉంచిన ఎల్లంపల్లి నీళ్లను రిజర్వాయర్‌లోకి విడుదల చేశారు. ఈ సర్జిపూల్లో మొత్తం 124.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 7 మోటార్లు బిగించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 4 మోటార్లు సిద్ధంచేశారు. వీటిలో మొదటి మోటార్‌ను వెట్‌రన్ చేయడం ద్వారా సర్జిపూల్ నుంచి రిజర్వాయర్‌లోకి నీటిని పంప్ చేశారు. తొలుత ఉదయం 11 గంటలకు భూగర్భంలోని పంప్‌హౌస్ వద్ద సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, నీటి పారుదల సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి, ఈఈ నూనె శ్రీధర్, నవయుగ సీఎండీ శ్రీధర్, జీధెం శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఇంజనీరింగ్ అధికారుల సమక్షంలో స్మితాసబర్వాల్ మొదటి పంప్ స్విచ్ ఆన్‌చేసి వెట్‌రన్ ప్రారంభించారు. మోటార్ ఆన్ చేయగానే పంపింగ్ ప్రారంభమై టన్నెల్ ద్వారా మేడారం రిజర్వాయర్ సమీపంలోని డెలివరీ సిస్టర్న్ ద్వారా నీరు పైకి వచ్చింది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో సాయంత్రం 5.30 గంటల సమయంలో ఇదే మోటార్‌కు మరోసారి వెట్‌రన్ నిర్వహించారు. ఈఎన్సీ, ఈఈల పనితీరు భేష్.. మొదటి మోటర్ వెట్‌రన్ విజయవంతం కావడం వెనుక ఇంజనీరింగ్ అధికారుల నిరంతర శ్రమ ఉందని సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ ప్రశంసించారు. ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీధర్, నీటి పారుదల సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి చాలా చక్కగా పనిచేశారని కొనియాడారు. ఈఎన్సీ వెంకటేశ్వర్లు చాలా కష్టపడ్డారని ఈఈ శ్రీధర్ స్మితాసబర్వాల్‌కు చెప్పగా.. మీరు కూడా సూపర్ వర్కర్ అని ఆమె కితాబిచ్చారు. -
అధికారుల వైఖరిపై స్మితాసబర్వాల్ అసంతృప్తి
సాక్షి, రామగుండం: గోలివాడ పంపుహౌస్ పనుల్లో పురో‘గతి’ లోపించడంతో పక్షం రోజుల్లోనే సీఎం పేషీ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ గురువారం రెండోసారి పర్యటించారు. ఈనెల 2న సీఎం కేసీఆర్ కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, గోలివాడ పంపుహౌస్ పనులను సందర్శించారు. ఆ సమయంలో వివిధ ప్రాజెక్టుల్లో అధికారులు పనుల పురోగతిపై ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే అంశంపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రబీకి సాగు నీరందించాలని ముందుగా నిర్ణయించినప్పటికీ మారిన రాజకీయ సమీకరణాలు, అకాల వర్షాలతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో వర్షాకాలానికి సాగు నీరందించాలనే లక్ష్యంతో సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి 31లోపు నూరు శాతం పూర్తి కష్టమే... సీఎం కేసీఆర్ పర్యటన సమయంలో గోలివాడ పంపుహౌస్‌ను సందర్శించిన సమయంలో వారం రోజుల్లో తొలిసారి ఒక మోటార్ డ్రైరన్ చేస్తామని, ప్రతీ పది రోజులకు ఒకసారి ఒక్కో మోటారు డ్రైరన్ చేసి మార్చి 31వ తేదీలోగా నూరుశాతం పంపుహౌస్‌ను వినియోగంలోకి తీసుకువస్తామని అధికారులు సీఎంకు విన్నవించినప్పటికీ పనుల పురోగతిని పరిశీలిస్తే కష్టమేనని తెలుస్తోంది. తాను పర్యటించి పక్షం రోజులైన గోలివాడ పంపుహౌస్‌లో ఒక్క మోటార్ కూడా డ్రైరన్ చేయకపోవడం పట్ల సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో సీఎం వ్యక్తిగత కార్యదర్శి స్మితా సబర్వాల్ గోలివాడ పంపుహౌస్‌ను సందర్శించారు. తొమ్మిది మోటార్లలో ఒక మోటారును బిగించగా, మరో మూడు మోటార్లకు సిమెంట్ ప్లాట్‌ఫామ్స్ సిద్ధం చేయగా, మరో మూడింటికి ఇప్పుడే ఎరక్షన్ పనులు కొనసాగుతుండగా, మిగతా రెండు మోటార్ల పనులు ఇంకా ప్రారంభించలేదు. దీనికి తోడు అదనంగా మరో నాలుగు మోటార్లను స్టాండ్‌బైగా బిగింపుకు గోలివాడ పంపుహౌస్‌లో డిజైన్ చేశారు. ఎర్త్ పనులు నూరు శాతం పూర్తికాగా కాంక్రీట్ పనులు 43 వేల క్యూబిక్ మీటర్లు పూర్తి చేయాల్సి ఉంది. పంపుహౌస్పరిధిలోని 18 లైన్ల పైపులైన్ పనులలో 487 పైపులను 17,964 ఆర్ఎంటీతో వేయాల్సి ఉండగా ఇప్పటివరకు 15,044 పనులు పూర్తయ్యాయి. ఫిబ్రవరి ఇరవై నాటికి పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. జనవరి 28న డ్రైరన్‌కు కసరత్తు...? గోలివాడ పంపుహౌస్‌లో తొమ్మిది మోటార్లలో ఈనెల 28వ తేదీన తొలి మోటార్ డ్రై రన్ చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరొకటి ఫిబ్రవరి 25న, ఏప్రిల్ 10 నాటికి మిగతా ఏడు మోటార్లను వినియోగంలోకి తీసుకురానున్నట్లు పేర్కొంటున్నారు. మోటార్ల డ్రైరన్ గడువు పెరుగుతుండడం పట్ల సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్ అధికారుల వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. ప్రణాళికబద్ధంగా పనులు చేపట్టడం లేదని, పనుల పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతోనే పనులలో పురోగతి మందగిస్తుందని, ఇకనుంచి పనులు వేగవంతం చేస్తేనే ఏప్రిల్ పది నాటికి పూర్తయి వర్షాకాలం నాటికి సాగునీరందించే అవకాశం అందని సూచించారు. -
మార్చి 31 నాటికి ‘భగీరథ’ నీళ్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటిలో నల్లా బిగించి, పరిశుభ్రమైన మంచినీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో ఎవరు కూడా మంచినీళ్ల కోసం బిందె పట్టుకుని బయట కనిపించవద్దని చెప్పారు. కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు అనే తేడా లేకుండా రాష్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ పథకం ద్వారానే మంచినీళ్లు అందివ్వాలని స్పష్టం చేశారు. ఈ పథకం పూర్తి చేయడంలో ఖర్చుకు వెనుకాడవద్దని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో మిషన్ భగీరథ పథకంపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు అనురాగ్‌శర్మ, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, మిషన్ భగీరథ ఈ.ఎన్.సీ. కృపాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, జోగు రామన్న, గొంగిడి సునీత, రాజేందర్‌రెడ్డి, కె.విద్యాసాగర్‌రావు, ఎన్.భాస్కర్‌రావుతో పాటు వివిధ జిల్లాల సీఈలు, ఈఈలు హాజరయ్యారు. సెగ్మెంట్ల వారీగా పనుల పురోగతిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. నీళ్లు ఇవ్వడంతోనే బాధ్యత తీరిపోదు.. రాష్ట్రంలో 23,968 ఆవాస ప్రాంతాలు ఉండగా... మిషన్ భగీరథతో ప్రస్తుతం 23,947 ప్రాంతాలకు ప్రస్తుతం నీరు అందుతోందని, మరో 21 గ్రామాలకు మాత్రమే అందాల్సి ఉందన్నారు. ఆ గ్రామాలు కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాల్లో ఉన్నవేనని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని 95 శాతం ఇళ్లకు నల్లాలు బిగించి మంచినీరు అందిస్తున్నట్లు నివేదించారు. ఓవర్ హెడ్ స్టోరేజీ రిజర్వాయర్ (ఓహెచ్ఎస్ఆర్) నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని వివరించారు. కేసీఆర్ మాట్లాడుతూ... ‘దళితవాడలు, ఆదివాసీగూడేలు, శివారు ప్రాంతాలు, మారుమూల పల్లెలు అన్నింటికీ మిషన్ భగీరథతోనే శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయడం ప్రభుత్వ లక్ష్యం. అచ్చంపేట, సిర్పూరు నియోజకవర్గాలు... ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కొత్తగూడెం లాంటి జిల్లాల్లోని మారుమూల చిన్న పల్లెలకు, ఎత్తయిన ప్రాంతాల్లోని ఆవాస ప్రాంతాలకూ కష్టమైనా, ఆర్థికంగా భారమైనా‡ మిషన్ భగీరథతోనే మంచినీరు సరఫరా చేయాలి. జనవరి 10లోగా అన్ని ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు చేరుకోవాలి. మార్చి 31లోగా అన్ని ప్రాంతాల్లో అన్ని పనులు పూర్తి చేయాలి. ఆ తర్వాత రాష్ట్రంలో నల్లా ద్వారా మంచినీళ్ల సరఫరా కాని ఇల్లు ఒక్కటీ మిగలొద్దు. ప్రతీ ఊరికి నీళ్లు పంపి, ప్రతీ ఇంటికి నల్లా ద్వారా మంచినీళ్లు ఇవ్వడంతోనే బాధ్యత తీరిపోదు. ఆ తర్వాత కూడా ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా మంచినీటి సరఫరా జరగాలి. ఒకసారి భగీరథతో శుద్ధి చేసిన నీరు తాగిన తర్వాత ప్రజలు మరో రకం నీళ్లు తాగలేరు. ఏ ఒక్క రోజు నీరు అందకున్నా తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. మిషన్ భగీరథ ప్రాజెక్టును పూర్తి చేయడం ఎంత ముఖ్యమో ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా దాన్ని నిర్వహించడం అంతే ముఖ్యం. ప్రతీ రోజు మంచినీటి సరఫరా చేయడానికి అవలంబించాల్సిన వ్యూహం ఖరారు చేసుకోవాలి’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సందేహాలు తొలగాయి... ‘మిషన్ భగీరథ చేపట్టాలని అనుకున్న రోజు చాలా మందికి చాలా అనుమానాలుండేవి. ఈ కార్యక్రమం అవుతుందా? అనే సందేహాలు ఉండేవి. అధికారులు, ఇంజనీర్లు కష్టపడి ఇంజనీరింగ్ పరంగా అద్భుతమైన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. వేల కిలోమీటర్ల పైపులైన్లు వేశారు. నదీ జలాలను ప్రతీ ఊరికి తరలిస్తున్నారు. ప్రతీ ఇంటికి మంచినీళ్లు అందిస్తున్నారు. దేశంలో మరెవ్వరూ చేయని అద్భుతాన్ని తెలంగాణ రాష్ట్రం చేసి చూపెడుతున్నది. దేశానికి ఇది ఆదర్శంగా నిలిచింది. అనేక రాష్ట్రాలు మిషన్ భగీరథ లాంటి పథకాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించాయి. మన నుంచి సహకారం కోరుతున్నాయి. ఆయా రాష్ట్రాలకు అవసరమైన సహకారం అందించడానికి మనం సంసిద్ధత వ్యక్తం చేశాం. మిషన్ భగీరథ తెలంగాణకు గర్వకారణం. దీన్ని విజయవంతం చేసిన ఘనత అధికారులు, ఇంజనీర్లదే. వారికి నా అభినందనలు. ఎంతో శ్రమకోడ్చిన ప్రతీ ఒక్కరికీ కతజ్ఞతలు’’అని సీఎం చెప్పారు. కాళేశ్వరం పర్యటన వాయిదా ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం వాయిదా పడింది. మంగళ, బుధవారాల్లో ఆయన కాళేళ్వరం ప్రాజెక్టును, పంప్‌హౌజ్‌లను సందర్శించాల్సి ఉంది. అయితే తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన ఎప్పుడు ఉంటుందో త్వరలో నిర్ణయిస్తారు. -
‘భగీరథ’ పనుల్లో వేగం పెంచాలి
సాక్షి, మరిపెడ(వరంగల్): మిషన్ భగీరథ పనులను గడువులోగా పూర్తి చేసి ఈనెల 26న ట్రయల్ రన్ చేయాలని భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం ఎదళ్లగుట్ట వద్ద కొనసాగుతున్న మిషన్ భగీ రథ పనులపై శనివారం ఆయన ముఖ్యమంత్రి కార్యాలయ సెక్రటరీ స్మితా సబర్వాల్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 24 వేల పై చిలుకులు గ్రామాలకు శుద్దీచేసిన నీరు అందించాలనే లక్ష్యంతో సీఎం కే సీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అబ్బాయిపాలెం నుంచి పాలకుర్తి, ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్‌తో పాటు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలానికి నీటి ని అందించనున్నట్లు ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఇందుకు రూ.1,700 కోట్లు ఖర్చు అంచనా వేసినట్లు తెలిపారు. అయితే అన్నింకంటే ముందుగా డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ, నర్సింహులపేట, కురవి, డోర్నకల్ మండలాలకు ఈనెల 15 వరకుభగీర«థ నీరందుతుందన్నారు. ఎదళ్లగుట్ట వద్ద జరుగుతున్న పనులు దాదాపు పూర్తయినట్లు తెలిపారు. గ్రామాల్లో ఏర్పాటు చేయాల్సిన పైపులైన్ పనులు 25 శాతం మాత్రమే మిగిలి ఉన్నాయని, అవి వారం రోజుల్లో పూర్తవుతాయన్నారు. అధికారులపై మండిపాటు.. బొడ్లాడ వద్ద జరుగుతున్న పనుల్లో జరుగుతున్న జాప్యంపై ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కావద్దని హెచ్చరించారు. అలాగే పరకాల నియోజకవర్గంలో జరుగుతున్న పనులు ఈనెల 8 వరకు పూర్తి చేస్తామని తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్, ధర్మసాగర్, జనగామలో ఈనెల 30లోగా పూర్తవుతాయని, అయితే ఇక్కడ పైప్‌లైన్ నిర్మాణంలో జాప్యం జరుగుతోందని ఇది సహించే విషయం కాదని చైర్మన్ మందలించారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే వేరే వారిని పెట్టుకుని పనులు చేయించుకుంటామని హెచ్చరించారు. ఏటూరునాగారం వద్ద జరుగుతున్న పనుల్లో ఎలక్ట్రోమెకానిక్ వర్క్స్ ఇంత వరకు పనులు ప్రారంభం కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఈనెల 15 వర కు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు, అధికారులకు చెప్పా రు. జనగామ 180 ఇంట్రా విలేజ్‌లో పనులు కావాల్సి ఉందన్నారు. యాదాద్రిలో 569 పనులకు 207 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇవన్ని ఈ నెల 20 వరకు పూర్తిచేస్తామని సమీక్షలో వెల్లడించారు. అధికారులకు స్వాగతం... మరిపెడ శివారులోని ఎస్సీ గురుకులం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలంలో భగీరథ వైస్ చైర్మ న్ వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎం కార్యాలయ సెక్రటరీ స్మితా సబర్వాల్ దిగారు. ఈ సందర్భంగా వారికి మం త్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎమ్మెల్యే రెడ్యానాయక్ స్వాగతం పలికారు. ఏ రోజు నివేదిక ఆ రోజు ఇవ్వాలి.. ఈనెల 26న మిషన్ భగీరథ ట్రయల్ రన్ చేయాల్సిందేనని సీఎం కార్యాలయం సెక్రటరీ స్మితా సబర్వాల్ అన్నారు. కొంత మంది అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అది సరైందని పద్ధతి కాదన్నారు. అ«ధికారులు సమన్వయంగా పనిచేయాలని ఆమె సూచించారు. ప్రతి రోజు 24 గంటలు పనిచేసి గడువులోగా పనులు పూర్తి చేయాలని చెప్పారు. రేపటిలోగా ఎప్పటి వరకు పనులు పూర్తి చేస్తారో నివేదిక తీసుకో వాలని సీఎంసీ సురేంద్రరెడ్డికి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం పనుల ను గడువులోగా పూర్తి కాకుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. సమీక్షలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, ప్రభుత్వ సలహదారుడు జ్ఞానేశ్వర్, జనగామ ఇన్చార్జి కలెక్టర్ అనితా రాంచంద్రన్, మహబూబాబాద్ జిల్లా జేసీ దామోదర్‌రెడ్డి, గుడిపుడి నవీన్, డి.ఎస్ రవిచంద్ర, మిషన్ భగీరథ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మెగా కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
నెలాఖరుకు ‘భగీరథ’ నీళ్లు
తిరుమలాయపాలెం: మిషన్ భగీరథ ద్వారా ఈ నెలాఖరుకు ఇంటింటికీ తాగునీరు అందించనున్నట్లు ఆ పథకం వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. మాదిరిపురం వద్ద శనివారం మిషన్ భగీరథ పనులను సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ సురేందర్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించాలనే సీఎం కేసీఆర్ ఆశయం త్వరలోనే నెరవేరబోతుందని, ఈనెల చివరి నాటికి పనులన్నీ పూర్తి చేసి గ్రామాల్లోని ఓహెచ్‌ఆర్‌లకు నీటిని చేరవేసే ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని 21 మండలాలు, ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలానికి తాగునీరు అందించేందుకు రూ.1,700కోట్లతో భగీరథ పనులు చేపట్టామన్నారు. ఆయా ప్రాంతాల్లో పనులు జాప్యం కావడంతో సీఎం ఆదేశాల మేరకు తాము పర్యటిస్తున్నామని చెప్పారు. కాగా.. ఇన్‌టేక్‌వెల్ నుంచి నీటిని సరఫరా చేసేందుకు మోటార్ల బిగింపు, పైపులైన్ నిర్మాణాలు ఆలస్యం కావడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టు సంస్థలు జాప్యం చేస్తే పనుల నుంచి తప్పుకోవాలని, అవసరమైతే తామే పనులు చేపడతామన్నారు. పనులు చేపట్టిన వివిధ శాఖల అధికారులు పొంతనలేని సమాధానం చెప్పడంతో ఆయన తీవ్రంగా ఆగ్రహించారు. ఈ క్రమంలోనే సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ జోక్యం చేసుకుని పనులు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు.. ఏ ప్రాంతంలో ఎంత మందితో పనులు చేయిస్తున్నారో సాయంత్రం నాటికి పూర్తి నివేదిక అందించాలని ఈఎన్సీ సురేందర్‌రెడ్డిని ఆదేశించారు. ఎన్ని సమీక్షలు చేసినా మీ తీరు మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల నాటికి తాగునీరు ఇవ్వకపోతే పోటీ చేయనని సీఎం కేసీఆర్ చెప్పిన రెండేళ్లలోనే పనులు వేగవంతం చేశారని అన్నారు. రూ.24వేల కోట్ల తో రాష్ట్రంలోని 24 వేల పైచిలుకు ఆవాసాలకు పరిశుద్ధమైన జలాలు అందించేందుకు శరవేగంగా పనులు పూర్తి చేసుకుని.. గ్రామాల్లోని ఓహెచ్‌ఆర్‌లకు నీటిని తీసుకెళ్లే పనులు చివరి దశకు చేరాయన్నారు. కార్యక్రమంలో డోర్నకల్, వైరా ఎమ్మెల్యేలు డీఎస్.రెడ్యానాయక్, భానోతు మదన్‌లాల్, యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి, సీఈ నాగేశ్వర్, వరంగల్ సెగ్మెంట్ ఎస్ఈ కృష్ణయ్య, జెడ్పీ సీఈఓ మారుపాక నగేష్, ఆర్డీఓ పూర్ణచందర్రావు, ఎంపీడీఓ వెంకటపతిరాజు, తహసీల్దార్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
తమిళనాడు తరహా వైద్యంపై సర్కారు ఆసక్తి
టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ, వైద్య మంత్రి ఓఎస్డీ ఆ రాష్ట్రంలో పర్యటన సాక్షి, హైదరాబాద్: తమిళనాడు తరహా వైద్యంపై తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. ప్రభుత్వ ఆసుప త్రుల్లో అధిక కాన్పులు జరపాలన్న లక్ష్యంతో ఇటీవల సీఎం అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్ నేతృత్వంలోని బృందం తమిళనాడులో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో బృందం ఆ రాష్ట్రంలో పర్యటించి వచ్చింది. తెలంగాణ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ) ఎండీ వేణుగోపాల్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఓఎస్డీ టి.గంగాధర్, మంత్రి వ్యక్తిగత కార్యదర్శి చంద్రశేఖర్ సోమవారం తమిళనాడుకు వెళ్లి వచ్చారు. అక్కడ ప్రభుత్వ ఆసుప త్రుల్లో కాన్పులు, నవజాత శిశువులకు అందిస్తున్న కిట్లు, తల్లీబిడ్డల సంక్షేమం కోసం అక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీసుకుంటున్న ప్రత్యేక జాగ్రత్తలను ఈ బృందం అధ్యయనం చేసింది. అదే తరహాలో ఇక్కడ కూడా కిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక్కడ అధ్వానం: తమిళనాడుతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలు అధ్వానంగా ఉన్నా యని బృందం అభిప్రాయపడింది. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు చేయించుకుంటే రూ.12 వేలు ప్రోత్సాహకం ఇవ్వడంతో మహిళలు ముందుకు వస్తున్నా రంది. మౌలిక సదుపా యాలు బాగున్నాయని, వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటున్నారని అధ్యయనంలో తేలింది. మనవద్ద ఆ పరిస్థితి లేకనే ప్రభుత్వాసుప త్రులపై విశ్వాసం పోయిందని అభిప్రాయపడింది. -
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి
-
‘మిషన్ భగీరథ’ వేగవంతం!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేసి సురక్షిత మంచినీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు మరింత వేగవంతం కానున్నాయి. ఈ నెల 2, 3 న జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలపై అధికారులతో సమీక్ష జరిపిన సంగతి తెలిసిందే. కొన్ని సందర్భాల్లో మిషన్ భగీరథ పనుల్లో అలసత్వంపై ఆయన అసంతృప్తిని కూడ వ్యక్తం చే శారు. మిషన్ భగీరథ పనుల వేగం పెంచేందుకు సీఎం కార్యాలయపు అదనపు కార్యదర్శి స్మితసబర్వాల్ను ప్రత్యేక పర్యవేక్షణ కోసం పంపిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతోసమావేశం నిర్వహించి పనుల వేగం పెంచారు. ఇదే సమయంలో మిషన్ భగీరథ పనులు నిర్దేశిత లక్ష్యం ప్రకారం పూర్తయ్యేందుకు ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మిత సబర్వాల్ మంగళవారం మెదక్, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు రొనాల్డ్‌రోస్, డాక్టర్ యోగితారాణాలు, ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టు సంస్థల నిర్వాహకులతో కలిసి పనులను పరిశీలించారు. మెదక్, నిజామాబాద్‌లో పనుల పరిశీలన.. జిల్లాలోని ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.1300 కోట్ల అంచనాతో మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టు సమీపంలో పెద్దరెడ్డిపేట వద్ద నిర్మిస్తున్న ఇన్‌టెక్ వెల్, వాటర్ గ్రిడ్ ట్రిట్మెంట్ ప్లాంట్, పంపింగ్ వెల్ పనులను స్మిత సబర్వాల్ తనిఖీ చేశారు. అనంతరం బాల్కొండ మండలంలోని ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్‌తో జలాల్పూర్ వద్ద నిర్మించే మిషన్ భగీరథ పనులను సబర్వాల్ పరిశీలించారు. ఇన్‌టెక్ వెల్, పంపింగ్ హౌస్, రోజుకు 14 కోట్ల లీటర్ల సామర్థ్యం గల మూడు వాటర్ ట్రిట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి రూ. 1350 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆమె తెలిపారు. జలాల్పూర్ ఇన్‌టెక్ వెల్‌కు అనుసంధానంగా అర్గుల్ వద్ద రోజుకు 6 కోట్ల లీటర్లు, ఇందల్వాయి వద్ద రోజుకు 4 కోట్ల లీటర్లు, మల్లన్నగుట్ట వద్ద రోజుకు 4 కోట్ల లీటర్ల సామర్థ్యం గల ట్రిట్మెంట్ ప్లాంట్ల పనులు చురుకుగా సాగుతున్నట్లు తెలిపారు. వీటికి తోడుగా గతంలో ఈ ప్రాంతంలో నిర్మించిన ఒక్కొక్కటి 3 కోట్ల లీటర్ల సామర్థ్యం కలిగిన 3 వాటర్ ట్రిట్మెంట్ ప్లాంట్లకు జలాల్పూర్ వద్ద నిర్మించే ఇన్‌టెక్ వెల్ నుంచి నీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. జలాల్పూర్ ఇన్‌టెక్ వెల్ నుంచి 20 మండలాల్లోని 860 ఆవాసాలకు తాగునీరు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇంటింటికీ సురక్షిత నీరు.. స్మిత సబర్వాల్‌తో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, మెదక్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్, మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ జగన్మోహన్రెడ్డి, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఎస్ఈ ప్రసాద్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్మితసబర్వాల్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న మిషన్ భగీరథ ప్రాజెక్టు రాష్ట్రానికే తలమానికం కావాలన్నారు. నిర్ణీత కాలంలో నిర్దేశించిన గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రధాన పనులతో పాటు గ్రామాలలో ఇంటింటికి అనుసంధానం చేసే పైపులైన్ల పనులను కూడా ఏకకాలంలో చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పైపులైన్ల నిర్మాణపు పనులను మే నెలాఖరులోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైతులకు నష్టం జరగరాదన్నారు. పెద్దరెడ్డిపేట వద్ద నిర్మించే వాటర్ ట్రిట్మెంట్ ప్లాంట్ సామర్థ్యం రోజుకు 14 కోట్ల 50 లక్షల లీటర్లు ఉందని తెలిపారు. పెద్దరెడ్డి పేట నుంచి 5.25 కిలో మీటర్లు దూరంలో ఉన్న తడమనూరు (మెదక్ జిల్లా)కు 100 మీటర్ల ఎత్తున పంపింగ్ చేయనున్నట్లు తెలిపారు. తడమనూరు నుంచి గ్రావిటి ద్వారా జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజక వర్గాలలోని అన్ని గ్రామాలతో పాటు బోధన్ మున్సిపాలిటీకి, ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని కొన్ని గ్రామాలకు సింగూరు జలాలను శుద్ధిచేసి సరఫరా చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 16 మండలాల్లోని 785 ఆవాసాలకు తాగునీరు సరఫరా చేయడం లక్ష్యమన్నారు. 2017 జూన్ నాటికి 213 గ్రామాలకు, 2017 డిసెంబరు నాటికి 512 గ్రామాలకు సింగూరు జలాలు అందుతాయని తెలిపారు. ఈ పనులను వేగంగా పూర్తి చేయించేందుకు ప్రభుత్వం రెగ్యులర్‌గా మానిటరింగ్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. -
‘భగీరథ’ పనుల్లో అలసత్వం వద్దు
ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ సాక్షి నెట్వర్క్: మిషన్ భగీరథ పనుల్లో అలసత్వం వీడాలని ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులకు సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి, ఆమనగల్లు, నాగర్‌కర్నూల్, గోపాల్‌పేటలలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను ఆమె రెండోరోజు శనివారం పరిశీలించారు. కల్వకురిలో పథకం పనులను ఆమెతోపాటు కలెక్టర్ టీకే శ్రీదేవి పరిశీలించారు. మూడేళ్లలో పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.ఆమనగల్లు మండలంలో భగీరథ పనులకు అడ్డుచెప్పిన అటవీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ మండలం గుడిపల్లి వద్ద జరుగుతున్న మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ థర్డ్ లిఫ్ట్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతుల అభ్యంతరం: గోపాల్పేట మండలం నాగపూర్ శివారులో సంప్‌హౌస్ నిర్మాణానికి సంబంధించి భూమి కోల్పోయిన రైతులు అభ్యంతరం తెలిపారు. స్మితాసబర్వాల్ స్థల పరిశీలన చేసి వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులకు చెప్పారు. ఆమె వెళ్లిపోయాక పలువురు రైతులు తమకు నష్టపరిహారం తేల్చకుండా పనులు ప్రారంభిస్తే ఒప్పుకునేది లేదని తెలిపారు. వారితో ఆర్డీఓ రాంచందర్ మాట్లాడి పూర్తిస్థాయిలో పరిహారం ఇస్తామని చెప్పి నచ్చజెప్పారు. -
ఖమ్మం పర్యటనలో స్మితాసబర్వాల్
సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. మిషన్ భగీరథ పనుల క్షేత్ర పరిశీలనలో భాగంగా జిల్లాకు విచ్చేసిన ఆమె వాజేడులో జరగుతున్న పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి పర్ణశాల, కొత్తగూడెం, వైరా, పాలేరులో వెళ్లి పనులను పర్యవేక్షించనున్నారు. -
సారొస్తారట...!
సాక్షిప్రతినిధి,ఖమ్మం: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముగియడంతో జిల్లా అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫీవర్ పట్టుకుంది. ఆయన ఎప్పుడు జిల్లాలో పర్యటిస్తారు..? ఏ పథకాలపై సమీక్షిస్తారు..? ఏం ప్రకటిస్తారోనని..? అధికారులు నివేదికల తయారీలో తలమునకలయ్యారు. రెండురోజులుగా కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్ ప్రధాన పథకాల అమలుతీరుపై అధికారులతో సమావేశమవుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్ నేడో..రేపో జిల్లాలో పర్యటిస్తుందన్న సమాచారంతో అధికారులు అలర్ట్ అయ్యారు. గ్రేటర్ ఎన్నికలు ముగిసినందున ఇక వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలే తరువాయే అన్న చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి ఖమ్మం నగరం, జిల్లాలో పర్యటించిన తర్వాతే ఎన్నికలుండే అవకాశాలున్నారుు. కాగా అధికారులు మాత్రం సీఎం పర్యటనకు సంబంధించి అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఖమ్మంపై దృష్టి పెడతారని, జిల్లాలోని వాటర్‌గ్రిడ్, మిషన్‌కాకతీయ పథకాలపై సమీక్షిస్తారని అధికారులు ఆ దిశగా ఈ పథకాలు ఏ స్థాయిలో ఉన్నాయో రోజూ సమీక్షిస్తున్నారు. పాలేరు-మాదిరిపురం, దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకాలకు కూడా శంకుస్థాపన చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి పర్యటన ముందుగా ప్రతి జిల్లాలో సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్ పర్యటించి ఏ పథకాలు ఏ దశలో ఉన్నాయో.. నివేదికను సీఎంకు అందజేస్తారు. జిల్లాలో కూడా ముందస్తుగా ఆమె పర్యటన ఉంటుందని సమాచారం. బుధ, గురువారం జిల్లాలో వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయతోపాటు పలు పథకాలకు సంబంధించి అమలు ఎలా ఉందో ఆకస్మిక తనిఖీ చేయనున్నట్లు తెలిసింది. ఆమె జిల్లాపై ఇచ్చిన నివేదిక ఆధారంగాా సీఎం పర్యటన షెడ్యూల్‌పై అధికారులు కసరత్తు చేస్తారని విశ్వసనీయంగా తెలిసింది. కార్పొరేషన్ ఎన్నికలపైనే ఉత్కంఠ.. ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో కార్పొరేషన్ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగియడంతో ఈనెలలో ప్రభుత్వం పెడుతుందా..మార్చి తర్వాత నిర్వహిస్తుందా..? అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. అన్ని పార్టీలు డివిజన్లలో ప్రచారాన్ని ఇప్పటికే హోరెత్తిస్తున్నాయి. ఈ పరిస్థితులుఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. మార్చి 2నుంచి ఇంటర్, ఆతర్వాత పదో తరగతి పరీక్షలు ఉండటంతో ఈ కొద్ది సమయంలో ప్రభుత్వం ఎన్నికలకు వెళుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తంగా సీఎం పర్యటన మాత్రం ఈనెలలో ఉంటుందని అధికారులు కూడా హడావిడి చేస్తున్నారు. హెలిప్యాడ్ పరిశీలన వాజేడు : తెలంగాణ సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ మండలంలో బుధవారం పర్యటించే అవకాశం ఉందనే నేపథ్యంలో మండల అధికారులు పూసూరులో హెలిప్యాడ్ ప్రాంతాన్ని మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులను పరిశీలించేందుకు ఆమె వస్తున్నట్లు తెలిసింది. -
నష్టం కలిగించి సారీ అంటారా?
‘ఔట్లుక్’ కథనంపై హైకోర్టు అసంతృప్తి ♦ సెక్సియస్ట్ వ్యాఖ్యలు హర్షణీయం కాదు ♦ ఆ కథనం హుందాగా లేదు ♦ ప్రతివాదులకు నోటీసులు జారీ ♦ విచారణ వాయిదా సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారి, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌పై ఔట్లుక్ వారపత్రిక ప్రచురించిన కథనంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ కథనంలో ఆమెపై చేసిన ‘సెక్సియస్ట్’ వ్యాఖ్యలు ఏమాత్రం హర్షణీయం కాదని పేర్కొంది. మహిళల హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని, అందువల్ల వారిని అన్ని వేళలా గౌరవించి తీరాలని వ్యాఖ్యానించింది. తాము ప్రచురించిన కథనంపై క్షమాపణలు సైతం తెలిపామన్న ఔట్లుక్ తరఫు సీనియర్ న్యాయవాది అనూప్ భంభానీ చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ‘‘చేయాల్సిన నష్టమంతా చేసి క్షమాపణలు చెబితే సరిపోతుందా..?’’ అని హైకోర్టు తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది. ఈ కేసులో న్యాయపోరాటం చేసేందుకు స్మితా సబర్వాల్‌కు నిధులు మంజూరు చేస్తూ జారీ చేసిన జీవో విషయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తెలిపింది. జీవోను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేశాక వ్యాజ్యాలపై విచారణ చేపడతామంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సారీ చెబితే కేసు వేయకూడదా... ఈ వ్యాజ్యాలపై తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి అంతకుముందు వాదనలు వినిపిస్తూ న్యాయపరమైన ఖర్చుల నిమిత్తం స్మితా సబర్వాల్‌కు రూ. 15 లక్షలను విడుదల చేశామని, అంతేకాక ఔట్‌లుక్‌పై ఆమె న్యాయస్థానంలో కేసు కూడా దాఖలు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనికి అనూప్ భంభానీ స్పందిస్తూ విధి నిర్వహణకు సంబంధించి ప్రభుత్వోద్యోగులు కేసు దాఖలు చేయడానికి వీల్లేదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ కార్టూన్ వేసి, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించింది. తాము క్షమాపణలు చెప్పామని, తమ కథనం వల్ల నష్టం జరిగిందని భావిస్తే దానిపై పోరాటానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయని, అంతేతప్ప ప్రజల నిధులను వ్యక్తిగత అవసరాల కోసం కేటాయించడం సరికాదని భంభానీ వాదించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ‘‘మీరు ప్రచురించిన కథనాన్ని ఒక్కసారి చదవండి. అది ఎంత అభ్యంతరకరంగా ఉందో మీకూ తెలుస్తుంది. మహిళల హుందాతనాన్ని, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మీరు రాస్తారు.. నష్టం చేస్తారు.. తరువాత సారీ అంటారు. మీరు చెప్పే సారీ ఎంత మంది చదివి ఉంటారు? కథనంపై చేసిన సెక్సియస్ట్ వ్యాఖ్యలపై మేం ఎంత మాత్రం సంతృప్తికరంగా లేం. ఫ్యాషన్ షో గురించి రాశారు. ముఖ్యమంత్రి, మంత్రులపై వ్యాఖ్యలు చేశారు. మీరు సారీ చెప్పినంత మాత్రాన ఆమె (స్మితా) సివిల్ సూట్ దాఖలు చేయకూడదా? ప్రభుత్వం తన నిధులను వివిధ రకాల పనులకు మళ్లిస్తుంది. మరి అలా మళ్లించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేయలేదేం? కల్తీ కల్లు, మద్యం తాగి మృతి చెందిన వారికి ప్రభుత్వం పరిహారమిస్తోంది. వారికి ప్రభుత్వం ఎందుకు పరిహారం ఇవ్వాలి. వారు చనిపోయింది ప్రభుత్వం వల్ల కాదు కదా? దేనికి నిధులివ్వాలో ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ వ్యాజ్యంలో ప్రస్తుతం తాము ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. -
‘మిషన్ భగీరథ’లో స్పీడు పెంచాలి.
- సంపు పనులను పరిశీలించిన స్మితా సబర్వాల్, ఎస్పీ సింగ్ మేడ్చల్ : మిషన్ భగీరథ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ అన్నారు. బుధవారం వారు మిషన్ భగీరథకు సంబంధించి మేడ్చల్ మండలంలోని ఘనాపూర్ క్షేత్రగిరిపై నిర్మించిన గోదావరి జలాల సంపును, మేడ్చల్‌లో టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో, గిర్మాపూర్, ఎల్లంపేట్, సోమారం గ్రామాల్లో సంపులను నిర్మించనున్న ప్రాంతాలను పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నాణ్యతలో రాజీ పడొద్దని, వచ్చేఏడాది ఏప్రిల్‌లోపు పనులను పూర్తిచేయాలని ఎస్పీ సింగ్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మేడ్చల్ తహశీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీడీఓ దేవసహాయం, నగర పంచాయతీ కమిషనర్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భోగారంలో సంపు నిర్మాణ పనులను పరిశీలించిన స్మితా సబర్వాల్ కీసర : మండలంలోని భోగారంలో మిషన్ భగీరథ పనులలో భాగంగా చేపడుతున్న సంపు నిర్మాణ పనులను సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. అధికారులతో కలిసి కీసరగుట్టలో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో పాల్గొని వెళ్లిపోయారు. -
'స్మితా సబర్వాల్‌కు నోటీసులు ఇవ్వలేం'
సాక్షి, హైదరాబాద్: 'ఔట్లుక్' మ్యాగజైన్ కథనం వివాదంలో ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్‌కు నోటీసులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుత దశలో ఆమెకు నోటీసులు అవసరం లేదని పేర్కొంది. నోటీసులు జారీ చేయాల్సిన తరుణం వచ్చిందని తాము భావిస్తే అప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. 'ఔట్లుక్' కథనంపై స్మితా సబర్వాల్ ఫిర్యాదు ఆధారంగా నమోదైన పోలీసుల కేసును కొట్టేయాలంటూ ఆ ప్రతిక ప్రతినిధులు వేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసినందున, ప్రస్తుత కేసును నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఔట్లుక్ వ్యవహారంలో న్యాయపరమైన ఖర్చుల నిమిత్తం స్మితా సబర్వాల్‌కు రూ.15 లక్షలు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి వాదనలు విన్నది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. స్మితా సబర్వాల్ వ్యవహారంలో ప్రభుత్వం ఈ విధంగా ప్రజాధనాన్ని వెచ్చించడం సరికాదన్నారు. అయితే పిటిషనర్ల వాదనతో ధర్మాసనం విభేదించింది. ఐఏఎస్‌ల ప్రతిష్టే ప్రభుత్వ ప్రతిష్టని పేర్కొంది. ఈ సమయంలోనే ఔట్లుక్ ప్రతినిధులపై కేసు కొట్టేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై చర్చ రాగా.. ఆ పిటిషన్‌పై వాదనలు ముగిశాయని, తీర్పు రిజర్వులో ఉందని న్యాయవాదులు తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, అయితే ఈ తీర్పు వచ్చే వరకు వేచి చూద్దామని, ఆ తరువాత ఈ వ్యాజ్యాలపై విచారణ చేపడుతామని తెలిపింది. దీనికి సత్యంరెడ్డి స్పందిస్తూ, స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ చేయాలని కోరారు. ఈ దశలో నోటీసులు అవసరం లేదని, అవసరమనుకున్నప్పుడు తాము తప్పక జారీ చేస్తామంటూ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
ఔట్లుక్ ప్రతినిధులకు ఊరట
తీర్పు వెలువరించే వరకు తదుపరి చర్యలన్నీ నిలిపివేత హైదరాబాద్: తన ప్రతిష్టను దెబ్బతీసేలా కథనం ప్రచురించారంటూ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తమపై సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఔట్లుక్ పత్రిక ప్రతినిధులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తీర్పును వెలువరించే వరకు ఈ కేసులో పిటిషనర్ల అరెస్ట్‌తోపాటు తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. స్మితా సబర్వాల్ ప్రతిష్టను దిగజార్చేలా కథనం, కార్టూన్ ప్రచురించారంటూ ఆమె భర్త, ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ఈ ఏడాది జూలై 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు ఔట్లుక్ పత్రిక ప్రతినిధులు మాధవి తాతా, సాహిల్ భాటియా, కృష్ణప్రసాద్, ఇంద్రనీల్రాయ్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ వీరు జూలై 13న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు బుధవారం విచారించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. తీర్పు వెలువరించేంత వరకు పిటిషనర్లపై పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తున్నట్లు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. -
స్మితా సబర్వాల్‌కు సాయంపై విచారణ వాయిదా
హైదరాబాద్: ‘ఔట్లుక్’ మేగజైన్ కథనం వివాదంలో సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు న్యాయపరమైన ఖర్చులకోసం రూ.15 లక్షలు మంజూరును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. హైదరాబాద్‌కు చెందిన కె.ఈశ్వరరావు, రచయిత, సామాజిక కార్యకర్త వత్సలా విద్యాసాగర్ ఈ అంశంపై వేర్వేరుగా పిల్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. అయితే అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి అభ్యర్థన మేరకు ఈ విచారణను తమ చాంబర్లో ఇన్ కెమెరా (రహస్య విచారణ) ద్వారా చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది. -
‘స్మితా సబర్వాల్‌కు రూ.15 లక్షల’పై విచారణ వాయిదా
మరో వ్యాజ్యంతో కలిపి 7న విచారిస్తామన్న ధర్మాసనం ఏజీ అభ్యర్థన మేర రహస్య విచారణ చేపట్టిన హైకోర్టు హైదరాబాద్: ‘ఔట్లుక్’ మ్యాగజైన్ కథనం వివాదంలో ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు న్యాయపరమైన ఖర్చుల నిమిత్తం రూ. 15 లక్షలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో తదుపరి విచారణ 7వ తేదీకి వాయిదా పడింది. ఇదే అంశానికి సంబంధించి మరో వ్యాజ్యం సోమవారం విచారణకు రానున్నందున ఈ రెండింటినీ కలిపి ఆ రోజున విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన కె.ఈశ్వరరావు గురువారం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై శుక్రవారం విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎ.సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. స్మితా సబర్వాల్ ఓ హోటల్లో పాల్గొన్న ప్రైవేటు కార్యక్రమం గురించి మ్యాగజైన్ కథనం, కార్టూన్ ప్రచురించిందని, ఇది పూర్తిగా ఆమె వ్యక్తిగత వ్యవహారమన్నారు. వ్యక్తిగత వ్యవహారానికి ఇలా ప్రజాధనాన్ని వెచ్చించడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ తమ ముందున్న వివరాలను బట్టి ఈ వ్యవహారం ప్రైవేటు వ్యవహారంగా అనిపించడం లేదని వ్యాఖ్యానించింది. స్మితా సబర్వాల్‌ను ప్రైవేటు వ్యక్తిగా ఆ కథనంలో చిత్రీకరించినట్లు అనిపించడం లేదని పేర్కొంది. ఐఏఎస్ అధికారిగానే చిత్రీకరిస్తూ ఆ కథనం ఉంటే, దానిని ప్రైవేటు వ్యవహారంగా పరిగణించలేమని తెలిపింది. అందువల్ల సంబంధిత కథనాన్ని, కార్టూన్‌ను చూడాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ ఈ అంశం తీవ్రమైంది కాబట్టి ఇన్ కెమెరా (రహస్య విచారణ) విచారణ జరపాలని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తమ చాంబర్లో విచారణ చేపట్టింది. -
'ఔట్ లుక్ పై సివిల్, క్రిమినల్ కేసులు పెట్టాలి'
హైదరాబాద్:ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను కించపరిచేలా తప్పుడు కథనం ప్రచురించిన ఔట్ లుక్ మ్యాగజైన్ పై సివిల్, క్రిమినల్ కేసులు పెట్టాలని ఐఏఎస్ అధికారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మను కలిసిన వారు.. ఒక ఐఏఎస్ అధికారిణిపై అనుచిత కథనం రాసిన ఆ మ్యాగజైన్ పై చర్యలు తీసుకోవాలన్నారు. ఔట్ లుక్ మ్యాగజైన్ పై సివిల్, క్రిమినల్ నమోదు చేయాలని సీఎస్ కు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఔట్లుక్ ఎడిటర్ ఇన్ చీఫ్ కృష్ణప్రసాద్, హైదరాబాద్‌లోని అసిస్టెంట్ ఎడిటర్ మాధవి టాటాలకు స్మితా సభర్వాల్ తరఫు న్యాయవాది ఈ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. క్షమాపణలు చెప్పాలని అందులో పేర్కొన్నారు. కాగా, స్మితా వివాదంపై 'ఔట్లుక్' పత్రిక చెప్పీ చెప్పనట్లుగా క్షమాపణలు చెప్పింది. 'ద బోరింగ్ బాబు' అనే కథనంలో తాము ఎవరి పేర్లూ పేర్కొనలేదని, అయినా.. తమకు తెలంగాణ ప్రభుత్వంలోని ఓ అధికారి లీగల్ నోటీసులు పంపారంటూ కొన్ని వార్తా పత్రికలు, టీవీ న్యూస్ చానళ్లు, వెబ్ సైట్లు చెప్పాయని ఔట్లుక్ పేర్కొంది. అయితే, మీడియా గందరగోళం మొదలై 36 గంటలు దాటిపోయినా, తమకు మాత్రం ఎలాంటి నోటీసు రాలేదని తెలిపింది. ప్రస్తుతం స్మితా సబర్వాల్ సీఎంవో కార్యాలయంలో అడిషనల్ కార్యదర్శి హోదాలో ఉన్నారు. గతంలో కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కలెక్టర్‌గా పని చేసి సమర్థురాలైన అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి అధికారిపై ఔట్లుక్ పత్రికలో వచ్చిన కథనాన్ని జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పక్షాలు తీవ్రంగా ఖండించాయి. -
ఇంతకు దిగజారతారా?: స్మితా సబర్వాల్
హైదరాబాద్: ఇంగ్లీష్ మ్యాగజైన్ ఔట్ లుక్ లో వచ్చిన అసభ్య కథనంపై న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చెప్పారు. కోర్టు దావాకు గల కారణాలను బుధవారం ఓ జాతీయ ఛానెల్ కు వివరించారు. ఉన్నతమైన సివిల్ సర్వీసెస్‌లో 14 ఏళ్లుగా కొనసాగుతున్న తనపైనే ఎల్లో జర్నలిజం ఈ స్థాయిలో వేధింపులకు పాల్పడుతుంటే సాధారణ మహిళల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించవచ్చని, ఇది కేవలం తనను మాత్రమేకాక యావత్ మహిళాలోకాన్ని అవమానపరిచిందని ఆమె అన్నారు. సదరు పత్రిక ప్రచురించిన అసభ్య కార్టూన్ పూర్వాపరాలను వివరిస్తూ 'నా పుట్టినరోజు నాడు నా భర్తతో కలిసి ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నాను. అప్పుడు నేను వేసుకున్న దుస్తుల్ని సూచిస్తూ వాళ్లు (ఔట్లుక్) ఇలా జుగుస్సాకరంగా వ్యవహరిస్తారనుకోలేదు' అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే తన తరఫు న్యాయవాది ఔట్ లుక్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చిందని, దీనిపై ఎంతటి పోరాటానికైనా తాను సిద్ధంగా ఉన్నానని సీఎంఓలో అడిషనల్ సెక్రటరీగా ఉన్న స్మిత స్పష్టం చేశారు. ఇదీ అసలు వివాదం ఔట్ లుక్ మ్యాగజైన్ తన తాజా సంచికలో 'నో బోరింగ్ బాబు' అనే శీర్షికతో ఓ కామెంట్ ప్రచురించింది. 'ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగే అన్ని సమావేశాలకు అద్భుతమైన వస్త్రధారణతో హాజరయ్యే ఓ బ్యూరోక్రాట్.. 'కంటికి ఇంపైన మహిళా అధికారి' గా అందరూ కితాబిస్తుంటారు' అని వ్యాఖ్యానించింది. దానికితోడు జీన్స్, టీషర్ట్ వేసుకున్న ఓ అధికారిణి ర్యాంప్ పై నడుస్తుంటే.. సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఆమెనే చూస్తోన్న అభ్యంతరకర కార్టూన్ ను ప్రచురించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన స్మితా సబర్వాల్ ఔట్ లుక్ పై న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధమయ్యారు. అదే పత్రికలో అంతే నిడివితో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా మ్యాగజైన్ కు నోటీసులు పంపారు. పలువురు మహిళా జర్నలిస్టులు సైతం ఆమెకు అండగా ఉంటామని ప్రకటించారు. -
స్మితా సభర్వాల్ భావోద్వేగం!
-
కోర్టుధిక్కరణ కేసుల్లో హైకోర్టుకు ఐఏఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసుల్లో ఐఏఎస్‌లు సందీప్‌కుమార్ సుల్తానియా, స్మితా సబర్వాల్ శుక్రవారం హైకోర్టు ఎదుట హాజరయ్యారు. వీరి హాజరును నమోదు చేసుకున్న జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ చల్లా కోదండరామ్ నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణకు వీరి హాజరుకు మినహాయింపునిస్తూ విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. కరీంనగర్ జిల్లా చెల్లూరు గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మహిళా స్వయం శక్తి భవనం నిర్మాణ పనులను సవాల్ చేస్తూ 2009లో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం యథాతథస్థితి కొనసాగించాలని అప్పట్లో ఆదేశించింది. కోర్టు ఆదేశాలు జారీచేసినా భవన నిర్మాణాన్ని ప్రారంభించినా అధికారులు చర్యలు చేపట్టలేదంటూ మల్లయ్య అనే వ్యక్తి కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలంటూ 2009లో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. 2009 నుంచి భవన నిర్మాణం పూర్తయ్యే వరకూ పనిచేసిన కలెక్టర్లను హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించడంతో సందీప్‌కుమార్, స్మితాసబర్వాల్లు కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేకపోయినందుకు క్షమాపణలు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా తాము కోర్టు ఉత్తర్వులను నిర్లక్షం చేయలేదని విన్నవించారు. వీరి వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. తదుపరి విచారణలకు హాజరుకు మినహాయింపునిస్తూ విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. -
స్మితా సబర్వాల్‌కు వారెంట్
మదనపల్లె: తెలంగాణ సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్‌కు చిత్తూరు జిల్లా మదనపల్లె ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మదనపల్లె మండలం కొండ్రామర్రిపల్లె సమీపంలోని గాయత్రి క్రషర్స్ (క్వారీ)లోని 39 మంది తమిళనాడు కూలీలను వెట్టిచాకిరీ నుంచి అప్పటి సబ్‌కలెక్టర్ స్మితాసబర్వాల్ విముక్తి కల్పించారు. యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. రెండుసార్లు సమన్లు జారీ చేసినా ఆ కేసు విచారణ నిమిత్తం ఆమె కోర్టుకు హాజరుకాలేదు. దీంతో న్యాయమూర్తి ప్రదీప్‌కుమార్ ఈ కేసును ఈ నెల 15కు వాయిదా వేస్తూ స్మితాసబర్వాల్‌కు బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. -
ఇన్చార్జి కలెక్టర్ శరత్ బదిలీ?
సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్ బదిలీపై వెళుతున్నట్టు సమాచారం. ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు జిల్లాలో గరిష్టంగా మూడేళ్లలోపు పనిచేసిన వారై ఉండాలి. మూడేళ్లు దాటితే ఇతర ప్రాంతానికి బదిలీ చేస్తారు. ప్రస్తుతం జిల్లా ఇన్చార్జిగా పనిచేస్తున్న డాక్టర్ శరత్ 2011 ఆగస్టు 18న జాయింట్ కలెక్టర్‌గా ఇక్కడికి వచ్చారు. ఫుల్‌టైం కలెక్టర్ పనిచేసిన స్మితాసబర్వాల్ జూన్ మాసంలో ముఖ్యమంత్రి సహాయ కార్యదర్శిగా బదిలీపై వెళ్లారు. ఖాళీ అయిన స్థానంలో కొత్త కలెక్టర్‌ను రాష్ర్ట ప్రభుత్వం నియమించకపోవటంతో అప్పటి నుంచి డాక్టర్ శరత్ ఇన్చార్జి కలెక్టర్‌గా కొనసాగుతున్నారు. నిబంధనల ప్రకారం ఆయనే జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. అయితే మంగళవారం నాటితో శరత్ విధి నిర్వహణ సమయం మూడేళ్లు దాటింది. ఈ నేపథ్యం ఎన్నికల కమిషన్ ఆయనను బదిలీ చేయవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం శరత్‌ను ఇక్కడే కొనసాగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
కొత్త పంథాలో ముందుకు..
సాక్షి, నిజామాబాద్ ప్రతినిధి: రాష్ట్రాన్ని కొత్త పంథాలో అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్దామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులతో కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘తెల్లరేషన్ కార్డుల దుర్వినియోగాన్ని అరికడితే 3, 4 కొత్త పథకాలను ప్రవేశపెట్టవచ్చు. బోధన రుసుం కింద రూ. 4 వేల కోట్లు దుర్వినియోగమవుతున్నాయి. కచ్చితమైన గణాంకాలు లేకపోవడంతోనే ఈ అవకతవకలు జరుగుతున్నాయి. అందుకే సర్వే నిర్వహిస్తున్నాం’ అని సీఎం పేర్కొన్నారు. ‘ఏం చేసినా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళదాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలపై సీఐడీ విచారణ బాధాకరమైనప్పటికీ తప్పదు. రాష్ట్రంలో 84 లక్షల కుటుంబాలు ఉంటే.. 91 లక్షల రేషన్‌కార్డులు ఉండడం సిగ్గుచేటు. తెల్లరేషన్ కార్డులు ఓ వ్యాధిలాగా అక్రమంగా పెరిగిపోయాయి. మొత్తంగా 20 నుంచి 23 లక్షల వరకు రేషన్‌కార్డులు అధికంగా ఉన్నాయి’ అని వివరించారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 5.93 లక్షల కుటుంబాలుంటే 6.16 లక్షల తెల్లరేషన్ కార్డులు ఉండటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని నెరవేరుద్దామన్నారు. ‘తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహ పూర్వకంగా ఉంటుంది. నేను సీఎం అయినప్పటికీ నాకు కొమ్ములేమీ ఉండవు. కలెక్టర్లు కూడా నవ్వుతూ పనిచేయాలి. కడుపునిండా తినాలి... చేతినిండా పనిచేయాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి ముందుకెళ్లాలి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేలను అధికారులు మర్యాదపూర్వకంగా ప్రొటోకాల్ ప్రకారం కార్యక్రమాలకు ఆహ్వానించాలి. నూతన రాష్ట్రంలో నూతన పంథాలో పోదాం. విమర్శలు, ప్రతివిమర్శలు లేకుండా ప్రజాప్రతినిధులు పనిచేయాలి. పనిచేసే అధికారులకు గుర్తింపు ఉంటుంది. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. ఆమె కరీంనగర్ కలెక్టర్‌గా రోడ్లను విస్తరించి మంచిపేరు తెచ్చుకున్నారు. ‘అమ్మలాలన’ పేరిట ఆమె ప్రజలకు చేరువయ్యారు’ అని కేసీఆర్ సూచించారు. -
పరిశ్రమల కోసం భూములు గుర్తించాలి
రాంనగర్ :రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన భూములను గుర్తించి వాటి వివరాలు ప్రభుత్వానికి అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ జిల్లా కలెక్టర్లను కోరారు. సోమవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు సీఎం నిర్ణయించినట్లు చెప్పారు. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన భూములను గుర్తించాలన్నారు. వాటిని సర్వేచేసి వివరాలను సర్వే నెంబర్లతో సహ తెలియజేయాలన్నారు. భూమి ఒకే చోట కాకుండా వేరు వేరు ప్రాంతాలలో ఉన్నదానిని గుర్తించాలని సూచించారు. పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన భూములు ఉన్నాయన్నారు. వాటిపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న జిల్లాలో పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు మాట్లాడుతూ జిల్లాలో 10134 ఎకరాల భూమిని గుర్తించి నట్లు చెప్పా రు. అందులో 4500ల ఎకరాలు సర్వేచేయగా 400 ఎకరాలు మాత్రమే పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉందని తెలిపారు. ఇంకా 6500ల ఎకరాల భూమిని సర్వే చేయించాల్సి ఉందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ హరిజవహర్‌లాల్, అదనపు జేసీ వెంకట్రావు, జిల్లా పరిశ్రమలశాఖ మేనేజర్ ప్రసాదరావు, డ్వామా పీడీ సునంద, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. భూపంపిణీ వివరాలు సేకరించాలి : రేమండ్ పీటర్ భూ పంపిణీకి అర్హులైన దళితులకు సంబంధించిన వివరాలను పకడ్బందీగా సేకరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రేమండ్ పీటర్ ఆదేశించారు. సోమవారం సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వ్యవసాయ ఆధారిత నిరుపేద షెడ్యూల్డ్ కులాల వారికి ఆగస్టు15న ప్రతి నియోజకవర్గంలో ఒక హాబిటేషన్లో భూ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. దానికి అనుగుణంగా ప్రతి నియోజకవర్గంలో గుర్తించబడిన హాబిటేషన్లో అందుబాటులో ఉన్న భూముల వివరాలు, కొనుగోలు చేయాల్సిన వివరాలను జిల్లాల వారీగా సమీక్షించారు. వ్యవసాయరంగంపై ఆధారపడిన భూమి లేని ఎస్సీలను గుర్తించాలన్నారు. లబ్ధిదారులు, స్వయం సహా యక సంఘాల సభ్యులను భాగస్వాములను చేసి భూములు అమ్మేవారీతో రేటు మాట్లాడాలని సూచించారు. జిల్లాస్థాయి కమిటీ ఆ భూమి విలువను నిర్థారించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు మాట్లాడుతూ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 12 హాబిటేషన్లను గుర్తించినట్లు తెలిపారు. ఈ గ్రామాలలో ఈ నెల 30 వరకు సర్వే పూర్తి అవుతుందని తెలిపారు. భూములు కొనుగోలు చేయడంలో కమ్యూనిటీ, స్వయం సహాయక సంఘూలను భాగస్వాములను చేసి వారి ద్వారా భూములను అమ్మే వారితో మాట్లాడినట్లు చెప్పారు. వెల్త్ ర్యాంకింగ్ ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసి భూములను పంపిణీ చేయనున్నట్లు వివరించారు. కాన్ఫరెన్స్‌లో సచివాలయం నుంచి సీఎం అడ్వయిజర్ రాంలక్ష్మణ్, షెడ్యూల్డు కులాల సంక్షేమ శాఖ కమిషనర్ రాహుల్‌బొజ్జా, సెర్పు సీఈఓ మురళి తదితరులు పాల్గొన్నారు. -
సీఎంవోలో ఇంకా గందరగోళమే!
కార్యదర్శులకు ఇప్పటికీ శాఖలు కేటాయించని వైనం ఫలితంగా ముందుకు కదలని ఫైళ్లు హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేషీ ఇంకా కుదురుకోలేదు. ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించి 40 రోజులు దాటుతున్నా పేషీలోని అధికారుల్లో ఎవరెవరూ ఏయే శాఖలు చూడాలన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. దీంతో ఫైళ్లన్నీ సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావుకు మినహా మిగిలిన కార్యదర్శులకు వెళ్లడంలేదు. ముఖ్యమంత్రి పేషీలోకి అధికారుల ఆలస్యంగా రావడం, ఇప్పటి వరకు వారికి ఎలాంటి శాఖలు కేటాయించకపోవడంతో గందరగోళం కొనసాగుతోంది. పేషీలో ప్రస్తుతం కేసీఆర్ ముఖ్యకార్యదర్శిగా నర్సింగరావు వ్యవహరిస్తున్నారు. స్మితా సబర్వాల్, రాజశేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి ప్రత్యేక కార్యదర్శులుగా ఉన్నారు. కానీ వీరికింకా శాఖలు కేటాయించలేదు. వివిధ శాఖల నుంచి సీఎం కార్యాలయానికి వచ్చే ఫైళ్లను అధ్యయనం చేసి, వాటిని ముఖ్యమంత్రికి వివరించడం, అందుకు అనుగుణంగా ఫైళ్లపై సంతకాలు చేయించి తిరిగి పంపించాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. అయితే ఎవరెవరు ఏ శాఖలు చూడాలన్నదానిపై స్పష్టత లేకపోవడంతో ఆ ఫైళ్లు ముందుకు కదలడంలేదు. సాక్షాత్తు సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌కు సంబంధించిన ఫైలు కూడా అలాగే ఉండిపోయింది. -
తెలంగాణ సీఎం పేషీలో నియామకాలు
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేషీలో అధికారులను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం అడిషనల్ పీఎస్‌గా వెంకట్ నారాయణ, అజిత్ కుమార్ రెడ్డి, పరమేశ్, ఓఎస్డీగా రషీద్ నియమితులయ్యారు. కాగా ఇప్పటికే మెదక్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న స్మితా సబర్వాల్ తెలంగాణ ముఖ్యమంత్రి పేషీలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. మరోవైపు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఓఎస్డీగా డీఎస్పీ జగదీశ్వర్‌రెడ్డి నియామకం అయ్యారు. -
బాధ్యతలు స్వీకరించిన స్మిత సబర్వాల్
హైదరాబాద్ : మెదక్ జిల్లా కలెక్టర్ స్మిత సబర్వాల్ శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. అనంతరం ఆమె సీఎం అదనపు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. పరిపాలన వ్యవహారాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న స్మిత సబర్వాల్ రెండుసార్లు ఉత్తమ కలెక్టర్‌గా అవార్డులు అందుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయండి.. నానో కారు గెలుచుకోండి అంటూ వినూత్న తరహా ప్రచారం చేపట్టి ఓటు శాతాన్ని పెంచి సంచలనం సష్టించారు. లాటరీలో గెలుపొందిన లచ్చవ్మ అనే మహిళకు నానో కారు బహుకరించారు. కాగా స్మితసబర్వాల్ భర్త అకున్ సబర్వాల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. -
కేసీఆర్ అదనపు కార్యదర్శిగా స్మితా సబర్వాల్
-
కేసీఆర్ అదనపు కార్యదర్శిగా స్మితా సబర్వాల్
హైదరాబాద్: మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ ను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి పేషీలో అదనపు కార్యదర్శిగా ఆమెను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు సీసీఎల్ఏగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గజ్వేల్ సభలో స్మితా సబర్వాల్ పై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించిన మరునాడే ఆమె బదిలీ కావడం విశేషం. మెదక్ జిల్లా కలెక్టర్ గా స్మితా సబర్వాల్ వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు నవ్యరీతిలో ముందుకెళ్లారు. 95 శాతం ఓటింగ్ సాధించిన గ్రామాలకు బహుమతులు ప్రకటించారు. -
తలెత్తుకునేలా .. అభివృద్ధి సాధిద్దాం
స్వరాష్ట్రంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు - జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచుదాం - ఉద్యమానికి ఊతమిచ్చింది మెతుకుసీమే - కేసీఆర్ సీఎం కావటం జిల్లా ప్రజల అదృష్టం - సంక్షేమం, అభివృద్ధే నూతన ప్రభుత్వ లక్ష్యం - ఆవిర్భావ వేడుకల్లో కలెక్టర్ స్మితా సబర్వాల్ - పోలీసు పరేడ్ గ్రౌండ్సలో జాతీయజెండా ఎగురవేత సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: అరవై ఏళ్ల కల ఫలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, స్వరాష్ట్రంలో ఆత్మవిశ్వాసంతో తలెత్తుకునేలా జిల్లాను అభివృద్ధిపథంలో నడిపిద్దామని కలెక్టర్ స్మితా సబర్వాల్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో వేడుకలు అంబరాన్నంటాయి. కలెక్టర్ మొదట సంగారెడ్డి ప్రభుత్వ అతిథి గృహం ఎదుట ఉన్న అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించారు. ఆ తర్వాత పోలీసు పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకుని జాయింట్ కలెక్టర్ శరత్, ఎస్పీ శెముషీ బాజ్‌పేయ్ తదితర అధికారలతో కలిసి వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ తెలంగాణ తల్లి విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పోలీసు పరేడ్ గ్రౌండ్స్ వేదికపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించటం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమానికి విత్తనాలు నాటి, నాయకత్వాన్ని అందించింది జిల్లా ప్రజలేనని అన్నారు. జిల్లా ముద్దుబిడ్డ కె. చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ పునర్నిర్మాణం జరగనుండటం జిల్లా ప్రజల అదృష్టమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కారం కావని, అంచెలంచెలుగా అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెలంగాణను, జిల్లాను అభివృద్ధిలో ముందుంచాలని ప్రజలు, అధికారులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం అంకితభావంతో కృషి చేస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీరు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే నూతన ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కలెక్టర్ స్మితా సబర్వాల్ జిల్లాకు చెందిన అమరవీరుల కుటుంబాల సభ్యులను పరామర్శించి వారిని సత్కరించారు. జిల్లాలోని అమరులైన 42 మంది కుటుంబాల సభ్యులను కలెక్టర్ స్మితాసబర్వాల్ సన్మానించారు. ఆవిర్భావ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ శరత్, ఎస్పీ శెముషీబాజ్‌పాయ్, న్యాయమూర్తి రాధారాణి, ఏజేసీ మూర్తి, డీఆర్ఓ దయానంద్, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, డ్వామా పీడీ రవీందర్, ఆర్వీఎం పీడీ యాస్మిన్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
వీరులారా.. వందనం..
- అమరుల త్యాగాలు తెలుసుకుని కన్నీటిపర్యంతమైన కలెక్టర్ - వారి కుటుంబాలను గుండెలకు హత్తుకుని ఓదార్పు - అంకితభావం, త్యాగగుణమే తెలంగాణకు బలం: స్మితా సబర్వాల్ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ ఉద్యమం ప్రతి మలుపులోనూ ఓ వీరుని మరణం ఉంటుంది. ఓ తల్లి కన్నీటి వేదన ఉంటుంది. గమ్యం ముద్దాడే వరకూ వెరవని వీరత్వం ఈ గడ్డది. ఆరిపోతున్న కొలిమికి పొరకయి నిప్పులు రాజేసిన పోరగాళ్లు.. పోలీసు లాఠీలకు.. తూటాలకు బతుకంతా పొక్కిలయినా.. బిగించిన పిడికిలి విడవని విద్యార్థి వీరులు.. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని త్యాగాలు ఈ నేల మీద జరిగాయి. 60 ఏళ్ల ఉద్యమం తనకుతాను హింసించబడిందే కాని, ఎక్కడా హింసకు పాల్పడ లేదు. ‘ప్రత్యేక’ ఆకాంక్ష కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న చరిత్ర ఇక్కడి బిడ్డలది. ‘తెలంగాణ కోసం రాజీనామా చేసిన నేతలందరినీ గెలిపిస్తే.. ‘నీకు ప్రాణాలు అర్పించుకుంటా తల్లీ’ అంటూ కట్టమైసమ్మ ఆలయం ఎదుట ఎదుట ఆత్మార్పణం చేసుకున్న విద్యార్థి బసంత్‌పూర్ ఇషాంత్‌రెడ్డి.. ‘తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం నా చావుతో కళ్లు తెరవాలంటూ’ పురుగుల మందు తాగిన చింతకింది మురళి... తెలంగాణ ఉద్యమ సమయంతో కేసీఆర్ అరెస్టుకు కలత చెంది ఆత్మహత్య చేసుకున్న మునుగూరి శ్రీకాంత్.. ఇంకా మోదుగపూల వనంలో రాలిన పువ్వులెన్నో.. ఇలాంటి వీరులగన్న తల్లులకే కాదు..! వాళ్ల త్యాగాలు విన్న ఏ తల్లికైనా గుండె బరువెక్కుతుంది. తెలంగాణ ఆవిర్భావ సంబురాల్లోనూ ఆదే దృశ్యం పునరావృతమైంది. తెలంగాణ అమరవీరుల సాహసాలను, త్యాగాలను విని కలెక్టర్ స్మితా సబర్వాల్ కన్నీళ్లు పెట్టారు. అమరవీరుల తల్లిదండ్రులను గుండెలకు హత్తుకున్నారు. వారిని ఓదార్చారు. ప్రభుత్వం అండంగా ఉంటుందని ధైర్యం చెప్పారు. సోమవారం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా ఏర్పాటు చేసిన అమర వీరుల కుటుంబాలకు సన్మాన కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.‘ సంఘటిత శక్తి, చిత్తశుద్ధిని, అంకిత భావాన్ని, త్యాగ గుణాన్ని, ప్రదర్శించే మానవ సమాజం తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక బలం’ అని ఈ సందర్భంగా కలెక్టర్ వ్యాఖ్యానించారు. -
అంబరాన్నంటిన సంబరాలు
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్ : నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన శుభవేళ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో వేడుకలు అంబరాన్నంటాయి. సంగారెడ్డిలో ని పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో అధికారిక వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అ ద్దంపట్టే రీతిలో అధికారులు ఆవిర్భావ వేడుకలు నిర్వహిం చారు. కలెక్టర్ స్మితా సబర్వాల్ జాతీయజెండాను ఎగురవే సి పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని స్వేచ్ఛ కు చిహ్నమైన పావురాళ్లను నింగిలోకి ఎగురవేశారు. రంగురంగుల పూలతో తీర్చిదిద్దన బతుకమ్మలతో వేడులకు తరలివచ్చిన మహిళలు...తెలంగాణతల్లి వేషధారణలో ఉన్న చిన్నారి వద్ద బతుకమ్మలను ఉంచి బతుకమ్మ ఆడా రు. అనంతరం మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహిం చారు. డప్పువాయిద్యాలు, పోతరాజుల నృత్యాలతో బోనాలు ఊరేగింపు కన్నులపండువగా సాగింది. పేరిణీ శివతాండవం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మెదక్‌లోని సాంఘిక సంక్షేమశాఖ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ‘బతుకమ్మ..బతుకమ్మ..ఉయ్యాలో’ అంటూ ఆడిపాడారు. సదాశివపేట మండలం నందికంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు తెలంగాణ జానపద గేయంపై ఓ నృత్యరూపకాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఆతర్వాత పటాన్‌చెరుకు చెందిన శివసాయి హై స్కూల్ విద్యార్థుల కళారూపం కూడా ఆహూతులను అలరింపజేసింది. ‘జయజయహే తెలంగాణ...జననీ జయకేతనం’ అంటూ సంగారెడ్డి మండం ఇస్మాయిల్‌ఖాన్‌పేట విద్యార్థులు నృత్యప్రదర్శన అహూతులను విశేషంగా ఆకట్టుకుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులను కలెక్టర్ స్మితా సబర్వాల్, జేసీ శరత్, డీఈఓ రాజేశ్వర్‌రావు అభినందించి జ్ఞాపికలను అందజేశారు. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఎంపిక చేసిన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశాయి. 1948 మంది లబ్ధిదారులకు రూ.22.71 కోట్లు విలువ చేసే ఆస్తులను కలెక్టర్ స్మితా సబర్వాల్ అందజేశారు. డీఆర్డీఏ ద్వారా 762 ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రూ.21.50 లక్షల చెక్కులు అందించారు. మెప్మా ద్వారా ఎంపికై 54 మంది లబ్ధిదారులకు కలెక్టర్ రూ.2.16 లక్షల విలువ చేసే 54 కుట్టుమిషన్లు అందజేశారు. అలాగే ఏడు ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రూ.16.50 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా రూ.29.34 లక్షల విలువ చేసే వినికిడి యంత్రాలను 489 మంది విద్యార్థులకు కలెక్టర్ అందించారు. అలాగే అంధుల కోసం 69 బ్రెయిలీ కిట్స్ పంపిణీ చేశారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా 500 మందికి హెల్త్‌కార్డులు అందించారు. వికలాంగుల సంక్షేమశాఖ ద్వారా ఆదర్శ వివాహం చేసుకున్న వారికి రూ.7.50 లక్షల ప్రోత్సాహక నగదును కలెక్టర్ పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ఎంపిక చేసిన 52 మంది లబ్ధిదారులకు ఆటోలు ఇతర యూనిట్స్ కలెక్టర్ స్మితా సబర్వాల్ అందజేశారు. -
స్మితా సభర్వాల్ భావోద్వేగం!
మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సభర్వాల్ కంట తడి పెట్టారు. ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జరిగిన సంఘటనలను తలచుకుని పలుమార్లు కళ్లు తుడుచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరుల కుటుంబాలను సత్కరించే కార్యక్రమంలో ఈ దృశ్యం కనిపించింది. అమరవీరుల త్యాగాలను తలచుకుని భావోద్వేగానికి గురైన స్మితా సభర్వాల్.. పలుమార్లు కంటతడి పెట్టుకోవడం కనిపించింది. ఈ కార్యక్రమంలో శ్రీకాంతాచారి తండ్రి మాట్లాడుతూ, తన బిడ్డలాంటి చాలామంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఉందని అన్నారు. -
రియల్ మోసం
- కారుచౌకగా 110 ఎకరాలు కొట్టేసిన వ్యాపారులు - ఐదింతలు ఎక్కువకు ఏపీఐఐసీకి కట్టబెట్టేందుకు వ్యూహం - మోసపోయామంటూ అధికారులను ఆశ్రయించిన బాధితులు - రెండేళ్లుగా ఫైల్‌ను పెండింగ్‌లో ఉంచిన యంత్రాంగం - తాజాగా కలెక్టర్ స్మితా సబర్వాల్‌పై వ్యాపారుల ఒత్తిడి - ఆగమేఘాల మీద కదులుతున్న ఫైలు - కొత్త ప్రభుత్వం ఏర్పడేలోపే తతంగం ముగించేందుకు మంత్రాంగం పేదలను కొట్టి పెద్దలు జేబులు నింపుకోవడమంటే ఇదే. వ్యవసాయ భూములను కారుచౌకగా కొట్టేసిన ‘రియల్’ వ్యాపారులు ఆ భూములనే ఐదింతలు ఎక్కువ చేసి ఏపీఐఐసీకి కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మోసం గురించి తెలుసుకున్న రైతన్న నెత్తీనోరు మొత్తుకుని న్యాయం చేయాలంటూ రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయింది. సాక్షాత్తూ జాయింట్ కలెక్టరే ఇది ‘రియల్’ మోసం అని నిర్ధారించినా బడుగు రైతులకు న్యాయం జరగడం లేదు. తాజాగా కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చిన వ్యాపారులు.. తమ పథకం అమలు చేసేందుకు పెండింగ్‌లో ఉన్న ఫైల్‌ను ఆగమేఘాల మీద క్లియర్ చేయిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మసిపూసి ‘మాయ’ చేసి.. అధికారులకు ‘ఆశ’ చూపి... రైతులను అమాయకులను చేసి రూ .కోట్ల ప్రజాధనం కొల్లగొడుతున్న ‘రియల్’ మోసమిది. ఎకరాకు రూ. లక్ష చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేసిన రియల్ వ్యాపారులు గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే ఇండస్ట్రీయల్ పార్కుగా మలిచి ఏపీఐఐసీకి ఎకరాకు రూ. 6 లక్షల చొప్పున అంటగట్టేందుకు సిద్ధమయ్యారు. ధర చెల్లింపు విషయంలో మోసం జరిగిందని బాధిత రైతులు కలెక్టర్‌కు రెండు సంవత్సరాల క్రితం ఫిర్యాదు చేసినా, అవేమీ పట్టించుకోని యంత్రాగం 110 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కలెక్టర్ కార్యాలయంలో దీనికి సంబందించిన ఫైల్ వాయువేగంతో పరుగులు పెడుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడే లోగా ఫైల్‌ను క్లియర్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రూ.కోట్ల కూడబెట్టే కుట్ర నంగనూరు మండలం నర్మెట గ్రామ పంచాయతీ పరిధిలోని మైసంపల్లి మదిర గ్రామ శివారులో భూములున్న రైతుల నుంచి 2010లో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సర్వే నంబర్ 341 నుంచి 350 వరకు సుమారు 110 ఎకరాలను కొనుగోలు చేశారు. అప్పట్లో గ్రామానికి చెందిన రైతులు చంద్రయ్య, ఐలయ్య, రవి, నర్సింహులుతో పాటు మరికొందరు రైతుల నుంచి ఎకరాకు రూ.60 వేల నుంచి రూ. ఒక లక్ష వరకు రైతుల అవసరాలను బట్టి భూమికి ధర నిర్ణయించి కారు చౌకగా భూములు కొట్టేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఈ భూమిని అధిక ధరకు ఏపీఐఐసీకి అప్పగించేందుకు పథక రచన చేశారు. జరిగిన మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన రైతులు 2011లో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మైసంపల్లి, నర్మెట గ్రామాల రైతుల పిటిషన్‌తో స్పందించిన జేసీ శరత్ 2012లో గ్రామ రెవెన్యూ సదస్సుల్లో ఈ విషయంపై చర్చించారు. రైతులకు అన్యాయం జరిగిందని నిర్ధారించారు. వారికి న్యాయం జరిగిన తర్వాతే ఆ భూముల ను ఇండస్ట్రీయల్ పార్క్‌కు అప్పగించాలని సూచించారు. అప్పటి నుంచి దీనికి సంబంధించిన ఫైల్ పెండింగ్ ఉంది. కలెక్టర్‌పై ఒత్తిడి తాజాగా 110 ఎకరాలకు సంబంధించిన ఈ ఫైల్ క్లియర్ చేయించడానికి ఓ వ్యక్తి వ్యాపారుల తో డీల్ కుదుర్చుకుని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్‌పై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. ఒత్తిడికి తలొగ్గిన అధికారులు ఆగమేఘాల మీద ఫైల్ తెప్పించి వ్యాపారులకు అనుకూలంగా క్లియర్ చేస్తున్నట్లు సమాచారం. ఎకరాకు రూ.6 లక్షల చొప్పున 105 ఎకరాలను, ఎకరాకు రూ. 5 లక్షల చొప్పున మరో ఐదు ఎకరాలను మొత్తం దాదాపు రూ. 6.55 కోట్లకు ఏపీఐఐసీకి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. అంతా సవ్యంగా సాగితే కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఒక రోజు ముందుగానే సిద్ధం చేసిన చెక్కులు వ్యాపారుల చేతిలోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. కాసులకు కక్కుర్తిపడి ఈ వ్యవహారంలో రెవిన్యూ అధికారుల ఉదాసీనత కిందస్థాయి నుంచి పై స్థాయి వరకు కనపడుతోంది. గ్రామ పంచాయతీ పరిధిలోని వ్యవసాయ భూములను ఇండస్ట్రీయల్ పార్కుగా మార్చాలంటే కచ్చితంగా గ్రామ పంచాయతీ తీర్మానం ఉండాలి. కానీ పార్కు నిర్మాణానికి సంబంధించి నేటికీ గ్రామ పంచాయతీ తీర్మానం జరగలేదు. 2012 నుంచి రైతులు చేసిన ఫిర్యాదులు పెండింగ్‌లోనే ఉన్నాయి. భూమికి సంబంధించిన పరిహార వ్యవహారాలను పర్యవేక్షించే విభాగం సంగారెడ్డిలో ఉండడంతో రైతులు ఆ కార్యాలయం చుట్టూ ఏళ్లుగా తిరుగుతూనే ఉన్నారు. ఇదేమీ పట్టించుకోకుండా జిల్లా కలెక్టర్ కార్యాలయం గుడ్డిగా ఫైల్ క్లియర్ చేయడానికి సిద్ధంకావడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
వార్షిక రుణ ప్రణాళిక రూ. 4,112 కోట్లు
- గతేడాదితో పోలిస్తే 24.69 శాతం వృద్ధి - పంట రుణ వితరణ లక్ష్యం రూ. 1,758 కోట్లు - ఖరీఫ్‌లో రూ.1,185 కోట్లు.. రబీలో రూ. 573 కోట్లు - తాజా లక్ష్యాలపై రైతుల ఆశలు సాక్షి, సంగారెడ్డి : వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. గతేడా ది వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.3,097 కోట్లు కాగా.. 24.69 శాతం పెంపుదలతో ఈ ఆర్థిక సం వత్సరంలో రూ. 4,112 కోట్ల రుణాలు పంపిణీ చేయాలనే లక్ష్యాన్ని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి లక్ష్యం లో రూ.1,015 కోట్ల రుణ వితరణను పెంచింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,134 కోట్ల పంట రుణాలను పంపిణీ చేయాలనే టార్గెట్‌ను పెట్టుకోగా..ఈ ఏడాది లక్ష్యాన్ని రూ.1,758 కోట్లకు పెంచింది. ఖరీఫ్‌లో రూ.1,185 కోట్లు, రబీలో రూ. 573 కోట్ల రుణాలను అన్నదాతలకు పంపిణీ చేయాలని బ్యాంకర్లకు నిర్దేశించారు. ఈ మేరకు లక్ష్యాలను నిర్దేశిస్తూ లీడ్ బ్యాంక్ రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను సోమవారం కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆవిష్కరించారు. లక్ష్యాలు పెంపు.. తాజా వార్షిక ప్రణాళికలో అన్ని రంగాల రుణ లక్ష్యాల్లో భారీ వృద్ధి కనిపించింది. ప్రాధాన్యత రంగాలకు రూ. 2,737 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని గతేడాది లక్ష్యాన్ని విధించుకోగా ఈ ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యాన్ని రూ.3,680 కోట్లకు పెంచారు. అంశాల వారీగా పెరిగిన లక్ష్యాలను పరిశీలిస్తే.. గతేడాది ప్రణాళికలో వ్యవసాయ కాలపరిమితి రుణ లక్ష్యం రూ.198 కోట్లు కాగా ఈ ఏడాది రూ.237 కోట్లకు పెంచారు. అదే విధంగా వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు రుణ లక్ష్యాన్ని రూ.126 కోట్ల నుంచి రూ.151 కోట్లకు పెంచారు. వ్యవసాయేతర రుణ లక్ష్యాన్ని రూ.252 కోట్ల నుంచి రూ.302 కోట్లకు పెంచారు. ఇతర ప్రాధాన్యత రంగాల రుణ లక్ష్యాన్ని రూ.271 కోట్ల నుంచి రూ.525 కోట్లకు పెంచారు. స్వ యం సహాక సంఘాల రుణ లక్ష్యాన్ని రూ.486 కోట్ల నుంచి రూ.583 కోట్లకు పెంచారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహ కమతాలకు రుణ లక్ష్యాన్ని రూ.270 కోట్ల నుంచి రూ.324 కోట్లకు పెంచారు. అదే విధంగా ప్రా ధాన్య యేతర రంగాల్లో గతేడాది రూ.360 కోట్ల రుణ లక్ష్యాన్ని పెట్టుకోగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 432 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. గతేడాది లక్ష్యాలు అసంపూర్తి గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,097 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని ప్రణాళిక రూపొందించుకున్నప్పటికీ కేవలం 86 శాతం లక్ష్య ఛేదనతో 2,667 కోట్ల రుణాలను మాత్రమే పంపిణీ చేయగలిగారు. వ్యవసాయ, ఎస్‌హెచ్‌జీ రంగాలు మినహాయిస్తే ఇతర రంగాల లక్ష్యాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. వరుసగా ఎన్నికలు రావడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా ప్రభుత్వ ప్రోత్సాహాక పథకాలకు రుణాల పంపిణీని నిలిపివేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఈ ఏడాది బ్యాంకర్లు లబ్ధిదారులకు ఉదారంగా రుణాలు పంపిణీ చేయాల్సిన అవసరముంది. ప్రణాళికను విడుదల చేసిన కలెక్టర్ కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాకు చెందిన 2014-15 వార్షిక రుణప్రణాళికను సోమవారం కలెక్టర్ స్మితాసబర్వాల్ తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రుణ ప్రణాళిక ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్ నెలలోనే విడుదల చేయాల్సి ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈనెల 28 లోపు ఆవిష్కరించాల్సిందిగా ఎస్ఎల్ బీసీ ఆదేశించిందన్నారు. ఈ ప్రణాళికలో పంట రుణాలను గత ఎడాది లక్ష్యంపై 50 శాతం పెంచి రూ. 1,758 కోట్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇతర రుణాల కోసం రూ.4,112 కోట్లు నిర్ణయించామన్నారు. ఆవిష్కరణలో లీడ్ బ్యాంక్ మెనేజర్ వెంకటయ్య, ఏఎల్డీఎం రఘురామ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పండుగ చేసిన పంతుళ్లపై చర్యలు?
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : డీఈఓ రమేశ్ బదిలీ కాగానే బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్న ఉపాధ్యాయుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై శాఖాపరమైన చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. డీఈఓ రమేశ్ ఈనెల 18వ తేదీ ఆదివారం రిలీవ్ కాగా, సోమవారం డీఈఓ కార్యాలయానికి తరలివచ్చిన ఓ ఉపాధ్యాయ సంఘం నేతలు డీఈఓ కార్యాలయ ఆవరణలోనే బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ విషయాన్ని ‘పంపిచేశామని.. పండగ చేశారు’ అన్న శీర్షికతో మంగళవారం సంచికలో సాక్షి కథనాన్ని ప్రచురించింది. సెలవులో ఉన్న కలెక్టర్ స్మితా సబర్వాల్ ఘటన పూర్వాపరాలను ఆరా తీయాలని జేసీ శరత్‌ను ఆమె ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో జేసీ శరత్ ఈ ఘటనపై విచారణ జరపాలని రెవెన్యూశాఖకు చెందిన సీనియర్ అధికారిని ఆదేశించారు. ఏం జరిగిందంటే... డీఈఓగా రమేశ్ బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచే విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు కృషి చేశారు. ఈ క్రమంలోనే పనిచేయని చాలామంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. దీంతో కొందరు ఉపాధ్యాయులు ఆయన్ను ఎలాగైనా జిల్లా నుంచి సాగనంపాలని ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగానే మాజీ ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి ద్వారా అప్పటి సీఎం కిరణ్ మీద ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12న రమేశ్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పటికే ఎన్నికల విధుల్లో ఉన్న డీఈఓను రిలీవ్ చేయలేనని కలెక్టర్ వెల్లడించడంతో బదిలీ తాత్కాలికంగా ఆగిపోయింది. ఈ నెల 16తో ఎన్నికల ప్రక్రియ ముగిసినందున డీఈఓను రిలీవ్ చేయాలని కలెక్టర్‌ను విధ్యాశాఖ ఆదేశించింది. దీంతో ఈ నెల 18న కలెక్టర్ రమేశ్‌ను రిలీవ్ చేశారు. దీంతో గుర్తింపు పొందిన ఓ ఉపాధ్యాయ సంఘం నేతలు 19 వ తేదీన కొత్త డీఈఓ రాజేశ్వర్‌రావుకు శుభాకాంక్షలు తె లిపారు. అనంతరం డీఈఓ కార్యాలయ ఆవరణలోనే బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఉపాధ్యాయుల తీరుపై విమర్శలు వెల్లువెత్తడం, సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. -
సార్వత్రిక లెక్కింపునకు సర్వం సిద్ధం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి స్మితా సబర్వాల్ తెలిపారు. జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు నియోజకవర్గ స్థానాలకు మొత్తం మూడు కేంద్రాల్లో లెక్కింపు నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్లో ఎస్ఐసీలో ఓట్ల లెక్కింపు సిబ్బందికి రెండవ రాండమైజేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత నెల 30న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో 76.84 శాతం ఓటింగ్ నమోదైంద న్నారు. మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్చెరు నియోజకవర్గాలకు పటాన్ చెరు మండలం రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో, సంగారెడ్డి మండలం పసల్‌వాదిలోని ఎంఎన్ఆర్ వైద్య కళాశాలలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. కాశీపూర్‌లోని డీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నారాయణ్‌ఖేడ్, అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. జహీరాబాద్ పార్లమెంటరీ స్థానం ఓట్ల లెక్కింపు డీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో, మెదక్ పార్లమెంటరీ ఓట్ల కౌంటింగ్ గీతం విశ్వవిద్యాలయంలో ఉంటుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్లను ముందుగా లెక్కిస్తామన్నారు. ఓట్ల లెక్కింపును కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో వీడియో ద్వారా చిత్రీకరిస్తామని తెలిపారు. -
‘హైరిస్క్’లో ఉత్తమసేవలు
సిద్దిపేట అర్బన్,న్యూస్‌లైన్: మహిళలకు కాన్పు పునర్జాన్మలాంటిదంటారు. ప్రసవ వేదనతో ఉన్న గర్భిణులకు సిద్దిపేట మాతా శిశు సంక్షేమ ఆస్పత్రి (ఎంసీహెచ్)లోని హైరిస్క్ (సీమాంక్) కేంద్రం ద్వారా వైద్యులు విశిష్ట సేవలనందిస్తున్నారు. కాన్పు సమయంలో సమస్యలు వస్తే గతంలో వారిని హైదరాబాద్‌కు తరలించేవారు. దీంతో వారి సంబంధీకులు అంత దూరం వెళ్లలేక పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించేవారు. ఈ క్రమంలో కొందరు వైద్యులు ఇదే అదనుగా భావించి వారినుంచి అధిక మొత్తంలో డబ్బులు గుంజేవారు. హైదరాబాద్‌కు వెళ్లే క్రమంలో శిశువు, గర్భిణులకు ప్రాణాప్రాయంం ఏర్పడేది. ఈ పరిస్థితుల్లో ప్రతి గర్భిణి ఆసుపత్రిలో కాన్పు చేయించుకోవాలనే ఉద్దేశంతో కలెక్టర్ స్మితా సబర్వాల్ ప్రత్యేక చొరవ చూపారు. మూడు జిల్లాల సరిహద్దులో ఉన్న సిద్దిపేటలో ఈ కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావించి ఆ దిశగా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఎంసీహెచ్‌లో ఉన్న బిల్డింగ్‌లో రూ. 16 లక్షలతో కేంద్రానికి అవసరమైన పరికరాలు, పడకలు ఇతర సామగ్రిని సమకూర్చారు. ఫిబ్రవరి 1న కలెక్టర్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరిలో 73, మార్చిలో 87, ఏప్రిల్‌లో 101 శస్త్ర చికిత్సలను నిర్వహించడంతో పాటు ఈ నెల12వరకు మరో 37 శస్త్ర చికిత్సలను నిర్వహించి రికార్డు నెలకొల్పారు. ఈ నెల 12వరకు కాన్పు సీరియస్‌గా ఉన్న గర్భిణులు 298 మందికి శస్త్ర చికిత్సలు చేశారు. కాను సీరియస్‌గా ఉన్న పరిస్థితిల్లో వారంతా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే రూ. 20 వేల చొప్పున బిల్లులు భరించాల్సి వచ్చేది. ఈ కేంద్రం ఏర్పాటు వ్ల సుమారు రూ. 60లక్షల వరకు భారం తప్పింది. ఎంసీహెచ్‌లో వైద్యసేవలు పొందుతున్న గర్భిణులు కాన్పు సమయంలో సీరియస్‌గా ఉంటే వెంటనే హైరిస్క్ కేంద్రంలో చేర్చి శస్త్ర చికిత్స చేస్తారు. హైబీపీ, రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు రక్తం అందజేస్తున్నారు. ఇక్కడ కూడా కాని సీరియస్ కేసులను హైదరాబాద్ ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారు. కేంద్రం ఇన్చార్జి 24గంటలు కేంద్రలో అందుతున్న సేవలను పర్యవేక్షిస్తున్నారు. గైనకాలజిస్ట్ అరుణ, అనెీస్థీషియన్ కృష్ణారావు గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలనందిస్తున్నారు. 50 పడకల ఆసుపత్రిగా మార్చాలి ఈ కేంద్రంలో వైద్యసేవలు అందుతుండడంతో గర్భిణుల సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం ఉన్న 20 పడకలతో ఇబ్బందిగా ఉంది. 50 పడకల కేంద్రంగా మార్చాల్సిన అవసరముంది. రాత్రి వేళల్లో వచ్చేవారికి సేవలందించేందుకు వీలుగా వైద్యుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. -
‘స్థానిక’ తీర్పు నేడే
* జెడ్పీటీసీ స్థానాలు: 46 * పోటీ చేసిన అభ్యర్థులు: 236 * ఎంపీటీసీ స్థానాల సంఖ్య: 685 * పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య: 2,583 సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ఉత్కంఠకూ తెరపడనుంది. వీటి ఫలితాల కోసం ఇటు అభ్యర్థులు.. అటు ప్రజలు సుమారు నెల రోజులకు పైగా నిరీక్షిస్తున్నారు. జిల్లాలోని 46 జెడ్పీటీసీ, 685 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతలుగా జరిగిన విషయం విదితమే. గత నెల 6న 24 మండలాలు, 11న 22 మండలాలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. కాగా ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో మండలాల వారీగా ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సంగారెడ్డిలో 15 మండలాలు, మెదక్‌లో 18 మండలాలు, సిద్దిపేటలో 13 మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సోమవారం సమీక్షించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు. మరోవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. మండలానికి పది కౌంటర్లు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ మండలాల వారీగా జరగనుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్లను లెక్కిస్తారు. ప్రతి మండలానికి పది చొప్పున కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో కౌంటర్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, ముగ్గురు కౌంటింగ్ సిబ్బంది ఉంటారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలను 25 చొప్పున బండిళ్లు కడతారు. ఇలా కట్టిన బండిళ్లను ఒకచోట డ్రమ్ములోచేర్చి ఆ తర్వాత వెయ్యి చొప్పున కౌంటింగ్ సిబ్బందికి అందజేస్తారు. ఐదు టేబుల్స్‌లో జెడ్పీటీసీ, ఐదు టేబుల్స్‌లో ఎంపీటీసీ ఓట్లను లెక్కిస్తారు. ఇదిలా ఉంటే బ్యాలెట్ పత్రాల ఓట్ల లెక్కింపునకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీంతో ఫలితాలు వెల్లడి జాప్యమయ్యే అవకాశం ఉంది. మొదటగా ఆర్సీపురం ఫలితాలు చివరగా జహీరాబాద్, పటాన్చెరు మండలాల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జెడ్పీ చైర్మన్ పదవి ఏ పార్టీకి దక్కుతుందోనని పార్టీలతోపాటు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ ఎస్ పార్టీలు తామంటే తాము మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గత ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయిగా ఉంది. అయితే తెలంగాణ సాధించామన్న ధీమాతో ఉన్న టీఆర్ఎస్ గ్రామీణ ఓటర్లు తమ పార్టీకి పట్టం కడతారని ఆశిస్తోంది. ఏ పార్టీకి మెజార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు వస్తాయో వేచి చూడాల్సి ఉంది. కౌంటింగ్ కేంద్రాల వివరాలు సంగారెడ్డి ఎంపీపీ కార్యాలయం: సంగారెడ్డి మండలం తారా డిగ్రీ కళాశాల: సదాశివపేట, కొండాపూర్, ఆర్సీపురం, మునిపల్లి, రాయికోడ్, ఝరాసంగం మహిళా ప్రాంగణం(సంగారెడ్డి): పటాన్చెరు, న్యాల్కల్, కోహీర్, మనూర్ పాత డీఆర్డీఏ కార్యాలయం(సంగా రెడ్డి): నారాయణఖేడ్, కంగ్టి, కల్హేర్ రాయల్ డిగ్రీ కాలేజ్(మెదక్): పాపన్నపేట, పెద్దశంకరంపేట, చేగుంట, అల్లాదుర్గం, రేగోడ్, మెదక్, కొల్చా రం, నర్సాపూర్, పుల్కల్, వెల్థుర్తి, జిన్నారం, శివ్వంపేట, హత్నూర {పభుత్వ డిగ్రీ కాలేజ్(మెదక్): టేక్మాల్, రామాయంపేట, చిన్నశంకరంపేట, అందోలు, కౌడిపల్లిఇందూరు బీఈడీ, ఇంజినీరింగ్ కళాశాల భవనం(సిద్దిపేట): మిరుదొడ్డి, జగదేవ్‌పూర్, నంగనూరు, దుబ్బాక, కొండపాక, చిన్నకోడూరు, సిద్దిపేట, ములుగు, దౌల్తాబాద్, వర్గల్, గజ్వేల్, తొగుట, తూప్రాన్. -
17న ఓటరు పండుగ విజేతలకు బహుమతులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కలెక్టర్ స్మితా సబర్వాల్ నిర్వహించిన ‘ఓటరు పండుగ’లో విజేతలుగా నిలిచిన వారికి ఈనెల 17న బహుమతులు ప్రదానం చేయనున్నారు. పోలింగ్ 95 శాతం నమోదైన గ్రామాలకు రూ.2 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందజేయడానికి ప్రణాళిక రూపొందించి ఆ మేరకు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఓటరు పండగను ఘనంగా నిర్వహించారు. గత నెల 30న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 92 శాతానికిపైగా పోలింగ్ నమోదైన గ్రామాలు జిల్లా వ్యాప్తంగా 102 ఉన్నాయి. ఆయా గ్రామాల్లో పది మంది చొప్పున లక్కీడిప్ ద్వారా విజేతలను ఈనెల 8న కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ఎంపిక చేశారు. కలెక్టర్ స్మితా సబర్వాల్ సమక్షంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి రజనీప్రియ ఓటర్ల సమక్షంలో డ్రా తీశారు. డ్రాలో ఎంపికైన వారికి సుమారు రూ.1,300 నుంచి రూ.1,400 విలువ చేసే బహుమతులను ఈనెల 17న సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఆడిటోరియలో నిర్వహించే ఓటరు పండుగ కార్యక్రమంలో అందజేస్తారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,020 మంది విజేతలుగా ఎంపికయ్యారు. ఇందులో ఐదుగురికి బంపర్ బహుమతులతోపాటు ఒకరికి మెగా బహుమతి కింద నానో కారు అందజేస్తారు. నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతం వివరాలు.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నియోజకవర్గాల వారిగా పోలైన ఓట్ల వివరాలు రిటర్నింగ్ అ‘దికారుల నుంచి శనివారం రాష్ట్ర ఎన్నికల ప్ర‘దాన కార్యాలయూనికి అందార వివరాలు ఇలా ఉన్నార. మెదక్ జిల్లా 1. సిద్ధిపేట 74.20 2. మెదక్ 77.57 3. నారాయుణఖేడ్ 77.18 4. ఆం‘దోల్(ఎస్సీ) 79.35 5. నర్సాపూర్ 85.97 6. జహిరాబాద్(ఎస్సీ) 70.66 7. సంగారెడ్డి 73.68 8. పటాన్చెరు 67.67 9. దుబ్బాక 82.52 10. గజ్వేల్ 83.85 -
నేడే ఓట్ల జాతర
సాక్షి, సంగారెడ్డి: సార్వత్రిక సంగ్రామం జరగనుంది. జిల్లాలోని రెండు లోక్‌సభ, పది అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధమైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ ప్రకటించారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేలా ఓటర్లను నజరానాలతో ప్రోత్సహించడం ద్వారా జిల్లాలో 95 శాతం పోలింగ్ జరిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికలకు సంబంధించిన సమగ్ర గణాంకాలు ఇలా ఉన్నాయి... -
తొలి విడత పోరులో పోలింగ్ 81.83 %
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తొలివిడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపడంతో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంలో ఓటర్లను ప్రలోభపెట్టటానికి విశ్వప్రయత్నాలు చేశారు. దీంతో అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పలుచోట్ల కాంగ్రెస్, టీడీపీ నాయకులు డబ్బు పంచుతూ ప్రజలకు దొరికిపోయారు. తొలివిడతలో 24 జెడ్పీటీసీ, 349 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 81.83శాతం పోలింగ్ నమోదైంది. కాశీపూర్ గ్రామంలోని 43వ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల కమిషన్ రీపోలింగ్‌కు ఆదేశించింది. బ్యాలెట్ పేపరుపై అభ్యర్థుల పేరు తప్పుగా ముద్రించడమే రీపోలింగ్‌కు కారణం. ఈనెల 11న రీపోలింగ్ నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి స్మితాసబర్వాల్ తెలిపారు. పగటి ఉష్ణోగ్రత 42 డిగ్రీలు ఉండటంతో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు పది మందికి పైగా వడదెబ్బ బారినపడ్డారు. ఇదిలాఉండగా కంగ్టి మండలం గర్డేగాం గ్రామం రక్తమోడింది. దాదాపు 20 నిమిషాల పాటు పోలింగ్ నిలిచిపోయింది. మునిపెల్లి మండలం తాడిపల్లి గ్రామంలో ఎస్ఐ నారాయణరెడ్డి ఓవర్ యాక్షన్ తో కొంతమంది మహిళా ఓటర్లు భయపడి ఓటు వేయకుండానే వెనుదిరిగిపోయారు. చెర్లగూడెం ఎంపీటీసీ పరిధిలోని కాశీపూర్‌లో బ్యాలెట్ పత్రాలపై పేర్లు తప్పుగా ముద్రిం చారు. స్థానిక అభ్యర్థుల పేర్లకు బదులుగా పోతిరెడ్డిపల్లికి చెందిన అభ్యర్థులు పేర్లు ముద్రించారు. 187 ఓట్లు పడిన తరువాత అధికారులు గుర్తించారు. దీంతో 43 నంబర్ బూత్‌లో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశించింది.కంగ్టి మండలం గరిడేగాంలో ఓ వ్యక్తి ఓటు వేసే విషయంలోకాంగ్రెస్,టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాలు ఒకరినొకరు తోసుకున్నారు. పరస్పరం రాళ్లు విసురుకోవడంతో దాదాపు నలుగురు గాయపడ్డారు. మునిపల్లి మండలం తాడిపల్లి పోలింగ్ కేంద్రంలో ఎస్ఐ నారాయణ రెడ్డి ఓటర్లను తీవ్ర భయాందోళనకు గురి చేశారు. ఆయన పోలింగ్‌కేంద్రంలో కూర్చొని వచ్చిపోయే ఓటర్లను చిత్రీకరిస్తుండటంతో ఓటర్లు ఓటు వేయడానికి బయడ్డారు. కొందరు ఓటు వేయకుండానే వెనుదిరిగిపోయారు. అంతకు ముందు రాత్రే పోలీసులపై తాడిపల్లి గ్రామస్థులు తిరగబడిన విషయం తెలిసిందే. ఎస్ఐ తీరుపై అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొండపాక మండల కేంద్రంలో దమ్మక్కపల్లిలో శనివారం రాత్రి టీఆర్ఎస్కు చెందిన ఓ కార్యకర్త డబ్బు పంచుతుండగా కాంగ్రెస్ వాళ్లు పట్టుకున్నారు. తిరిగి అదే వ్యక్తి పోలింగ్ కేంద్రం వద్ద కనిపించడంతో కాంగ్రెస్ వాళ్లు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు స్వల్పంగా లాఠీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. వట్టిపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఓటర్లకు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. మిరుదొడ్డి మండలం మోతెలో శనివారం అర్ధరాత్రి కాంగ్రెస్ అభ్యర్థి పంచిన మద్యం, డబ్బు గొడవకు దారి తీసింది. ఆదివారం కొంతమంది మహిళలు కాంగ్రెస్ అభ్యర్ధిపై గొడవకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితి సద్దుమణిగింది. గ్రామంలో అదనపు పోలీసులు బలగాలను మోహరించారు. మిరుదొడ్డిలో ఓటు వేసేందుకు వచ్చిన నలుగురు ఓటర్లు.. ఎండవేడిని తట్టుకోలేక అస్వస్థకు గురయ్యారు. వారిని ప్రభుత్వ ఆస్పత్రిలోకి తీసుకెళ్లి వైద్యం చేయించారు.జిల్లాలో మొత్తం 1,149 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు వెబ్‌క్యామ్ పెట్టి ఆన్‌లైన్‌తో అనుసంధానం చేసి పర్యవేక్షిస్తామని కలెక్టర్ చెప్పారు. కానీ 300 పోలింగ్ కేంద్రాల్లోనే వెబ్ క్యామ్ ఏర్పాటు చేశారు. దీని వల్ల పోలింగ్ కేంద్రాల్లో ఏం జరిగిందో తెలియకుండా పోయింది. ఇంజినీరింగ్ విద్యార్థులకు పరీక్షలు ఉండటం వల్ల ఎన్నికల విధులకు వారు రాలేకపోయారని, అందుకోసమే అన్ని పోలింగ్ కేంద్రాలకు వెబ్ సిస్టమ్ అమలు చేయలేకపోయామని అధికారులు చెప్పడం గమనార్హం. -
పంపేందుకు పైరవీ
సంగారెడ్డి: కలెక్టర్ స్మితా సబర్వాల్‌ను జిల్లా నుంచి పంపించేందుకు బడా పారిశ్రామిక సంస్థలు హైదరాబాద్‌లో ఎత్తులు వేస్తున్నాయి. ఆమె బదిలీ కోసం పారిశ్రామికవేత్తలంతా కలిసి ఏకంగా సెక్రటేరియట్‌లోనే లాబీయింగ్ మొదలుపెట్టారు. ‘ముఖ్య’నేత బంధువు ద్వారా ఇప్పటికే ‘రాయబేరాలు’ చేసినట్టు అత్యంత విశ్వసనీయ వ్యక్తుల నుంచి ‘సాక్షి’కి సమాచారం అందింది. రూ.కోట్లకు కోట్లు ఆర్జిస్తూ ‘సామాజిక బాధ్యత’ను మరిచిపోయిన కంపెనీల ముక్కుపిండి సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) నిధులు వసూలు చేయాలనుకోవడమే ఆమెపై పారిశ్రామికవేత్తల గుర్రుకు కారణంగా తెలుస్తోంది. రూ.కోట్లలో ‘సామాజిక బాధ్యత’ బకాయిలు జిల్లాలోని ప్రతి పరిశ్రమ స్థాపనకు అయ్యే వ్యయంలో 0.02 శాతం సొమ్మును సీఎస్ఆర్ నిధుల కింద చెల్లించాలి. జిల్లాలో దాదాపు 958 భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. ఈ లెక్కన కార్పొరేటు కంపెనీలు రూ.కోట్లలో బకాయి పడ్డాయి. వీటినుంచి 2012-13 ఆర్థిక సంవత్సరానికే రూ.41.64 కోట్లు రావాల్సి ఉంది. ఈ నిధుల వసూలుపై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇటీవ ల సంబంధిత అధికారులతో ‘సామాజిక బాధ్యత’ నిధులపై సమీక్ష జరిపారు. జనవరి మాసాంతం లోపు కనీసం 50 శాతం బకాయిలు వసూలు చేయాలని, నిధులు చెల్లించని పరిశ్రమల బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ఇలా వసూలుచేసిన మొత్తాన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం వినియోగించాలని ఆమె నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఐదుగురు అధికారులను నియమించి పరిశ్రమల వివరాలన్నీ తెప్పించారు. బాకీ వసూలుచేసే బాధ్యతను కూడా వారికే అప్పగించారు. ఈ పరిస్థితుల్లో సీఎస్ఆర్ బకాయి నిధులు చెల్లించడం ఆయా కంపెనీలకు అనివార్యంగా మారింది. దీంతో పారిశ్రామికవేత్తలంతా ఏకమై సీఎస్ఆర్ నిధులు చెల్లించకుండా ఉండేందుకు కొత్త ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఒకసారి సీఎస్ఆర్ నిధులు చెల్లించడం ప్రారంభిస్తే ప్రతి కలెక్టర్ ఇదే విధానాన్ని కొనసాగిస్తారనే భయంతోనే వారంతా కలెక్టర్ స్మితాసబర్వాల్‌ను బదిలీ చేయించేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. సీఎస్ఆర్ నిధుల బకాయి రూ.41 కోట్లు ఉండడంతో అందులోని 25 శాతం నిధులు ఖర్చు చేస్తే కలెక్టర్‌నే బదిలీపై పంపొచ్చనే ఆలోచనతో పారిశ్రామికవేత్తలంతా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్‌లో కూర్చుని సచివాలయంలో పథక రచన చేస్తున్నారని, అవసరమైతే ఢిల్లీ నుంచి ఒత్తిడి తెచ్చి ఆమెను ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. -
సీఎస్ఆర్ నిధులు చెల్లించాల్సిందే..
కలెక్టరేట్, న్యూస్‌లైన్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద నిధులు చెల్లించాల్సిందేనని పరిశ్రమల యాజమాన్యాలను కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆదేశించారు. సీఎస్ఆర్ కింద వివిధ పరిశ్రమల నుంచి రూ.46 కోట్లకు గాను కేవలం రూ.90 లక్షలు మాత్రమే రావడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు రాబట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత’ నిధుల అంశంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిశ్రమలు చెల్లించాల్సిన వాటిలో 50 శాతం నిధులను ఈ నెలాఖరులోగా జమ చేయాలని సూచించారు. డివిజన్ స్థాయిలో అధికారులు పరిశ్రమల యాజమాన్యాలతో చర్చించి సీఎస్ఆర్ నిధులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశ్రమలు తమ ఇష్టానుసారంగా నిధులు ఖర్చు చేయరాదన్నారు. జిల్లా కమిటీ ఆమోదం మేరకే పనులను చేపట్టాలన్నారు. వారి బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వండి.. సీఎస్ఆర్ నిధులు చెల్లించేందుకు ఉత్సాహం చూపని పరిశ్రమల బ్యాంకు నిర్వహణ ఖాతాల వివరాలను తెలియజేయాల్సిందిగా లీడ్ బ్యాంకు మేనేజర్‌ను కలెక్టర్ ఆదేశించారు. నిధులు చెల్లించని ఆయా పరిశ్రమల బ్యాంకు ఖాతాలను సీజ్ చేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఆయా నిధులను వివిధ అభివృ ద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తామన్నారు. అందుకు సంబంధించి పూర్తి వివరాలను జిల్లా వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. సమావేశంలో జేసీ శరత్, డీఐసీ జీఎం సురేశ్‌కుమార్, సీపీఓ గురుమూర్తి, లేబర్ కమిషనర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈలు పాల్గొన్నారు. -
పెండింగ్ పనులు పూర్తిచేయాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: మున్సిపాలిటీల్లో 2010 నుంచి 2013 వరకు మంజూరైన అన్ని పెండింగ్ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో అర్బన్‌డే నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2013-14కు సంబంధించి మంజూరైన పనులను ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలన్నారు. 10 నుంచి 13 వరకు ఉన్న పనులను జనవరి నాటికి పూర్తి చేయకుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. డంపింగ్ యార్డులను ప్రతి మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ భూములు కేటాయించడానికి ఆర్డీఓ, తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రత్యేక స్థలం లేని మున్సిపల్ కమిషనర్లు ఈ నెల 15లోగా అనుకూలమైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి ప్రతిపాదనలను అందజేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత మున్సిపల్ కమిషనర్లపై కఠిన చర్యలు తప్పవన్నారు. కమిషనర్లు ప్రతిరోజు వార్డుల్లో పర్యటించి ప్రధాన కూడళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, నల్లాల వద్ద చెత్త పేరుకోకుండా చూడాలన్నారు. పారిశుద్ధ్య వారోత్సవాల సందర్భంగా కమిషనర్లు క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో మార్పు కార్యక్రమాన్ని ఈ నెల చివరి నుంచి అమలు చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో మెప్మా పీడీ పూర్ణ చందర్, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, హెల్త్ సీఆర్పీలు, టీఎల్ఎఫ్లు పాల్గొన్నారు. -
గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను 30 రోజుల నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ జిల్లా అధికారులను ఆదేశించారు. గడువు పూర్తయిన కార్మిక శాఖ అధికారులు 10 ఆర్జీలపై ఎలాంటి సమాచారం ఇవ్వక పోవడంపై డిప్యూటీ కమిషనర్ కోటేశ్వర్‌రావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లైన్ సర్వే, బీసీ వెల్ఫేర్, పొల్యూషన్, ఫారెస్టు అధికారులు సకాలంలో తమ ఆర్జీలను పరిశీలించి పరిష్కరించాల్సిందిగా హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 7,053 ఫిర్యాదులు అందగా ఇందులో 6,500 పరిష్కారం కాగా 195 ఫిర్యాదులు తిరస్కరణకు గురయ్యాయన్నారు. 30 రోజుల్లోగా పరిష్కరించాల్సినవి 207, 30 రోజుల పైబడి 29 దరఖాస్తులు ఉన్నాయన్నారు. 3 నెలలు పైబడినవి 81, ఆరు నెలలు పైబడి 16 దరఖాస్తులు ఆయా శాఖల్లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పంచాయతీ నిధులు సక్రమంగా ఉపయోగించి గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించాలని తనను కలిసిన సర్పంచ్‌లకు సూచించారు. పంచాయతీ నిధుల దుర్వినియోగం చేస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సర్పంచ్‌లకు తెలిపారు. గ్రామాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి అంటు వ్యాధులు ప్రబల కుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్‌లు పనిచేసే ప్రతి పనికి సంబంధించి ఖచ్చితమైన రికార్డులను నిర్వహించాలని సూచించారు. వీఆర్ఏ నుంచి వీఆర్ఓలుగా పదోన్నతులు పొందిన 47 మందికి కలెక్టర్ ప్రోసిడింగ్ అందజేశారు. ఈ సమావేశంలో జేసీ శరత్, ఏజేసీ మూర్తి, డీఆర్ఓ సాయిలు, ఆర్డీఓ సాయిలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అధికారులపై నిఘా!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అధికారులు, సిబ్బంది హాజరు, సమయ పాలనపై దృష్టి సారించిన కలెక్టర్ స్మితాసబర్వాల్ మరో అడుగు ముందుకు వేశారు. జిల్లా కేంద్రంలోనే అధికారులు నివసిస్తున్నారా లేదా అనే అంశంపై సోమవారం రహస్యంగా ఆరాతీశారు. రెవెన్యూ విభాగానికి చెందిన ముగ్గురు మండల స్థాయి అధికారులకు కలెక్టర్ గూఢచర్య బాధ్యతలు అప్పగించారు. అధికారులు తాము అందజేసిన చిరునామాలో ఉన్నారా లేదా అనే అంశంపై మంగళవారం అర్ధరాత్రి వరకు ఈ బృందం స్వయంగా తనిఖీలు నిర్వహించింది. తనిఖీలో వెల్లడైన వివరాలతో కూడిన నివేదికను మంగళవారం కలెక్టర్‌కు సమర్పించింది. సుమారు 70 మంది ప్రభుత్వ అధికారులకు గాను, 25 మంది స్థానిక నివాసాలకు సంబంధించిన చిరునామా, ఫోన్ నంబర్లు కూడా ఇవ్వలేదు. వీరికి నోటీసులు జారీ చేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వీరితో పాటు స్థానికంగా ఉండని అధికారులపై నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ సమాయత్తమవుతున్నట్లు సమాచారం. కాగా ప్రభుత్వ శాఖల అధికారులు జిల్లా కేంద్రంలోనే ఉండాలంటూ బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా చాలా మంది అధికారులు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్న సమాచారంతో కలెక్టర్ రహస్యంగా సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉండని అధికారులపై కలెక్టర్ ఆరా తీసిన నేపథ్యంలో కొందరు అధికారులు ఆగమేఘాల మీద అద్దె ఇళ్లు వెతుక్కునే పనిలో పడ్డారు. -
సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు చేరినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. వివిధ శాఖల పరిధిలోని పథకాల అమలు తీరుపై మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో అధికారులకు ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పథకాల విజయవంతం కోసం జిల్లా, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రధానంగా విద్య, సన్నిహిత, మార్పు, వ్యక్తిగత మరుగుదొడ్ల కార్యక్రమాల తీరుపై కలెక్టర్, జేసీ శరత్, ఏజేసీ మూర్తి, సంబంధిత శాఖల అధికారులు, ఆయా పథకాల లక్ష్యాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. టెన్త్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలి జిల్లా వ్యాప్తంగా 556 ఉన్నత పాఠశాలల్లో 277 రెడ్, 243 ఎల్లో గ్రేడింగ్‌లో ఉన్నాయని, ఆయా పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి గత ఏడాది కన్నా మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గణితం, ఇంగ్లిష్, సామాన్య శాస్త్రంలో విద్యార్థులు వెనుకబడి ఉన్నారని, ఆయా పాఠ్యాంశాల్లో మెరుగైన ఫలితాలకు వ్యక్తిగత శ్రద్ధతో కృషి చేయాలని సూచించారు. వసతి గృహాల్లో మెరుగైన వసతులతో పాటు నాణ్యతతో కూడిన మెనూను అమలు చేసేందుకు సన్నిహిత కార్యక్రమం పేరిట దత్తత అధికారులను నియమించామన్నారు. వారంతా ఈనెల 15వ తేదీలోగా ఆయా వసతి గృహాలను సందర్శించి 15లోగా నివేదికను సాంఘిక సంక్షేమాధికారికి అందజేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో బాలల ఆరోగ్య పరీక్షలు ఇంకా పూర్తి కాలేదని, స్థానిక వైద్యాధికారులతో కలిసి విద్యార్థుల ఆరోగ్య సమస్యలను నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమన్వయంతో ‘మార్పు’ను సాధించాలి ఐసీడీఎస్, ఐకేపీ, ఆర్డబ్ల్యూఎస్, మెప్మా, డీఎంహెచ్ఓ శాఖల సమన్వయంతో జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాల సంఖ్యను పెంచడంతో పాటు మాతాశిశు మరణాల రేటును తగ్గించాలని కలెక్టర్ సూచించారు. గర్భిణుల గుర్తింపు, వైద్య పరీక్షలు, హైరిస్కు గర్భిణులను గుర్తించడం, పౌష్టికాహార పంపిణీ తదితర అంశాలపై గ్రామైక్య సంఘాలతో విధిగా చర్చించి, ఆయా సమావేశాలకు ఏఎన్ఎంలు హాజరయ్యేలా చూడాలన్నారు. విధిగా పీహెచ్సీ కేంద్రాలను తనిఖీ చేసి నిర్దేశించిన జాబితా ప్రకారం ఈనెల 15లోగా నివేదిక అందజేయాలన్నారు. వసతి గృహాల్లో స్కైప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని ఎంపీడీఓలకు సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను కూడా జనవరి చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. బీఆర్జీఎఫ్ పనుల జాప్యంపై ఆగ్రహం డివిజన్ స్థాయిలోన బీఆర్జీఎఫ్ పనులపై సమీక్ష నిర్వహించినా సంబంధిత పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు పూర్తి స్థాయి సమాచారంతో హాజరుకాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2011-12కు సంబంధించి పనులను జనవరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటరు నమోదులో సిద్దిపేట డివిజన్లో 1751 మంది విద్యార్థులు నూతనంగా నమోదయ్యారని, వీరికి వెంటనే కార్డులు జారీ చేస్తామని శరత్ తెలిపారు. లబ్ధిదారుల వద్దకే పింఛన్లు సామాజిక భద్రతా పింఛన్లు ఇకపై నిర్దేశిత సమయంలో నేరుగా లబ్దిదారుల వద్దకు వెళ్లి పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఏజెన్సీలను కలెక్టర్ఆదేశించారు. 500 మంది లబ్దిదారులకు ఒకరు చొప్పున సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతినెలా 2 నుంచి 7వ తేదీ వరకు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని అన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం, ఇన్చార్జి డీఎంహెచ్ఓ పద్మ, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, సీపీఓ గురుమూర్తి, ఆర్డీఓలు ధర్మారావు, వనజాదేవి, ముత్యంరెడ్డి పాల్గొన్నారు. -
ధర తేలకుండానే క్రషింగ్!
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: చక్కెర పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి, కలెక్టర్ స్మితా సబర్వాల్ చెరకు మద్దతు ధరపై యాజమాన్యాలతో చర్చిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. రైతుల డిమాండ్లను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతున్న యాజమాన్యాలు మద్దతు ధర ప్రకటించకుండానే క్రషింగ్ ప్రారంభించాయి. మద్దతు ధర మాట ఎలా ఉన్నా తమ ఫ్యాక్టరీలకు రైతులు చెరకు తరలించక తప్పని పరిస్థితిని యాజమాన్యాలు సృష్టిస్తున్నాయి. ఓ వైపు రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నా ఇతర ప్రాంతాల నుంచి (ఆఫ్ జోన్) చెరకును తరలిస్తూ రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. టన్నుకు కనీసం రూ.3 వేలు మద్దతు ధర చెల్లించాలని రైతు సంఘాల ప్రతినిధులు డిమాండు చేస్తున్నాయి. మంత్రి గీతారెడ్డి సమక్షంలో జరిగిన చర్చల్లోనూ ధర చెల్లింపుపై పురోగతి కనిపించలేదు. టన్నుకు రూ. 2,600కు మించి చెల్లించేది లేదంటూ యాజమాన్యాలు తెగేసి చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో 30 మంది రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు సోమవారం చెరకు పరిశ్రమల శాఖ కమిషనర్‌ను కలిసేందుకు సమాయత్తమవుతున్నారు. బహిరంగ మార్కెట్లో చక్కెర ధరను సాకుగా చూపుతూ ఫ్యాక్టరీల యాజమాన్యాలు మద్దతు ధరపై మొండికేస్తున్నాయి. చక్కెర అమ్మకాలపై వ్యాట్, ఎక్సైజ్ సుంకం తొలగిస్తే ఫ్యాక్టరీ యాజమాన్యాలు రైతులు డిమాండు చేస్తున్న మేర మద్దతు ధర ప్రకటించే అవకాశముందని రైతు సంఘాలు కమిషనర్‌కు విన్నవించాలని నిర్ణయించారు. ప్రస్తుతం చక్కెరపై ఐదు శాతం, చెరకుపై ఆరు శాతం ఎక్సైజ్ ట్యాక్స్‌ను ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో చక్కెరపై వ్యాట్ వసూలు లేనందున స్థానికంగా కూడా ఎత్తేయాలని రైతులు డిమాండు చేస్తున్నారు. ఆందోళన బాట జిల్లాలోని గణపతి, ట్రైడెంట్, నిజాం డక్కన్ చక్కెర కర్మాగారాలు టన్ను చెరకుకు రూ.2,600 చొప్పున చెల్లించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. మద్దతు ధరపై రైతుల అభ్యంతరాల నేపథ్యంలోనే యాజమాన్యాలు చెరకు క్రషింగ్ ప్రారంభించాయి. సంగారెడ్డిలోని గణపతి షుగర్స్, జహీరాబాద్‌లోని ట్రైడెంట్ ఫ్యాక్టరీలు చెరకు గానుగ ప్రారంభించాయి. గణపతి షుగర్స్ 7,600 హెక్టార్ల పరిధిలో రైతులతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఫ్యాక్టరీ క్రషింగ్ సామర్థ్యం మాత్రం రెట్టింపుగా ఉండటంతో ఆఫ్జోన్ అంటే ఒప్పందం లేని జహీరాబాద్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున చెరకు తరలిస్తోంది. ఇందుకోసం ఏజెంట్ల ద్వారా రైతులను మచ్చిక చేసుకుంటూ లోపాయికారిగా కొంత మొత్తం అదనంగా చెల్లించేందుకు సిద్ధమవుతున్నట్లు రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం, ఫ్యాక్టరీల యాజమాన్యాలు మొండిపట్టు వీడని పక్షంలో ఆందోళన తప్పదని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. -
మరో వికెట్ డౌన్!
సాక్షి, సంగారెడ్డి: మరో వికెట్ పడింది. కలెక్టర్ స్మితా సబర్వాల్ కఠిన వైఖరి, ముక్కుసూటి వ్యవహారం మరో జిల్లా అధికారి బదిలీకి దారితీసింది. ఇటీవల పలుమార్లు కలెక్టర్ ఆగ్రహానికి గురై వార్తల్లో నిలిచిన నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ సి. శ్రీధర్ బదిలీ అయ్యారు. డ్వామా పీడీగా డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఆయన్ను మాతృశాఖ ‘సాంఘిక సంక్షేమ’కు తిప్పి పంపుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి జె. రేమండ్ పీటర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్‌కు డ్వామా పీడీగా పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్ఏసీ) అప్పగించాలని జిల్లా కలెక్టర్‌ను ఈ ఉత్తర్వుల్లో ఆదేశించారు. 2012 ఫిబ్రవరి 29న డ్వామా పీడీగా శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కొత్త కలెక్టర్ స్మితా సబర్వాల్ పలుమార్లు డ్వామా పీడీ శ్రీధర్ పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈనేపథ్యంలో పీడీ శ్రీధర్ సొంత శాఖకు బదిలీ చేయాలని కోరుతూ గ్రామీణాభివృద్ధి శాఖకు దరఖాస్తు చేసుకోవడం.. చకచక ఉత్తర్వులు జారీ కావడం జరిగింది. బదిలీని కోరుతూ గట్టిగా ప్రయత్నించడంవల్లే వెంటనే ఉత్తర్వులు జారీ అయ్యాయని అధికారుల్లో చర్చ జరుగుతోంది. కాగా బదిలీ ఉత్తర్వులు వెలువడిన తర్వాత పీడీ శ్రీధర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ .. పదవీ కాలంలో మెదక్ జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని, ఇక్కడి ప్రజలు చాలా మంచివారని పేర్కొన్నారు. బదిలీకి వెనుక గల కారణాలను తెలపాలని కోరగా.. ‘నో కామెంట్’ అని స్పందించారు. క్యూ కట్టారు... గత నెల 16న కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన స్మితా సబర్వాల్ తొలి రోజు నుంచే దూకుడును అవలంబిస్తున్నారు. సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ ఆయా ప్రభుత్వ ప్రభుత్వ శాఖల అధిపతులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. అధికారుల పనితీరు, సామర్థ్యం, వ్యవహార శైలిపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన ఆమె.. పనితీరు సరిగ్గా లేని కొందరు అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇదే కోవలో కలెక్టర్ ఆగ్రహానికి గురైన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రంగారెడ్డి ఈ నెల 18 నుంచి దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లిపోయారు. జిల్లా రెవెన్యూ అధికారి ఐ. ప్రకాశ్ కుమార్ సైతం ఈ నెల 6న దీర్ఘకాలిక సెలవుపై తప్పుకున్నారు. వీరిద్దరూ కూడా కలెక్టర్ ఆగ్రహానికి గురైనవారే. ఇక జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌గా గత నెల 4న బాధ్యతలు స్వీకరించిన ఇ. రవికుమార్‌ను ఆ మర్నాడే కలెక్టర్ స్మితా సబర్వాల్ వెనక్కి పంపించారు. మరి కొంతమంది జిల్లాధికారులు సైతం స్వచ్ఛందంగా తప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇతర జిల్లాల్లో మంచి పోస్టింగ్‌ల కోసం స్థానిక నేతల మద్దతు కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నట్లు సర్వత్రా చర్చ జరుగుతోంది. -
బ్యాంక్ మేళా.. భళా
సాక్షి, సంగారెడ్డి: ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల లబ్ధిదారుల సౌకర్యార్థం ‘జీరో బ్యాలెన్స్’ ఖాతాలు తెరిచేందుకు ఈ నెల 27, 28 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక బ్యాంక్ మేళాలకు అనూహ్య స్పందన లభించిందని కలెక్టర్ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆమె గణాంకాలతో కూడిన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 292 ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంక్ బ్రాంచీలలో 93,249 ఖాతాలు తెరిచేందుకు దరఖాస్తులు అందగా 76,458 మంది లబ్ధిదారులకు కొత్త ఖాతాలు ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. మిగిలిన 16,791 లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన ముగిసిన తర్వాత వారి ఖాతాలు సైతం ప్రారంభిస్తామన్నారు. ఎస్బీహెచ్ తన 36 బ్రాంచీల ద్వారా అత్యధికంగా 34,112 ఖాతాలు ప్రారంభిస్తే.. ఎస్బీఐ తన 41 బ్రాంచీల్లో 20,413 ఖాతాలు, ఏపీజీవీబీ 85 శాఖల ద్వారా 14,038 ఖాతాలు, ఆంధ్రాబ్యాంక్ 27 శాఖల ద్వారా 4600 ఖాతాలను తెరిచినట్లు కలెక్టర్ తెలిపారు. నగదు బదిలీ పథకం కింద వంట గ్యాస్, ఉపకార వేతనాలు, బంగారుతల్లి, పింఛన్లు, జననీ సురక్ష యోజన, ఇన్పుట్ సబ్సిడీ తదితర పథకాల లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభించేందుకు బ్యాంక్ మేళాలు నిర్వహించిన లీడ్ బ్యాంక్ మేనేజర్ టీటీ వెంకయ్య, ఆయా బ్యాంకుల మేనేజర్లకు కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎల్డీఎం వివరణ: ‘కొండాపూర్‌లో జీరో మేళాలు’ అనే శీర్షికతో గురువారం సాక్షిలో వచ్చిన కథనంపై లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకయ్య స్పందించారు. తొగరపల్లి ఎస్బీఐలో 150 ఖాతాలు, ఏపీజీవీబీ అనంతసార్లో 172 ఖాతాలు, తేర్పొల్ శాఖలో 148 ఖాతాలను తెరిచినట్లు ఆయన వివరణ ఇచ్చారు. -
సందర్శనలు.. తనిఖీలు.. సమీక్షలు
సిద్దిపేట, న్యూస్‌లైన్ : కలెక్టర్ సిత్మాసబర్వాల్ శుక్రవారం సిద్దిపేటలో బిజీ బిజీగా గడిపారు. ఒకటేమిటి.. తనిఖీలు, సంద ర్శ నలు, సమీక్షలతో అధికారులను పరుగు లు తీయించారు. ముందుగా ఏరియా ఆస్పత్రి, మాతా శిశు వైద్యశాలను ఆయ న స్థానిక ఎమ్మెల్యే హరీష్‌రావుతో కలిసి తనిఖీ చేశారు. మొదట ప్రాంతీయ వైద్యశాలలోకి వెళ్లారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇతర వార్డు లోనూ పేషెంట్లకు అం దుతున్న సేవల్ని పరిశీలించారు. ఏజెన్సీ / ఔట్‌సోర్సింగ్‌ల ద్వారా చేపడుతున్న శానిటేషన్ పనులకు అదనంగా మున్సిపాలిటీ తరఫున కూడా పారిశుద్ధ్య సేవ లు అందుబాటులోకి తేవాలని ఇన్చార్జ్ కమిషనర్ లక్ష్మణ్‌ను కలెక్టర్ ఆదేశించా రు. ఈ రెండు వైద్యశాలల స్థితిగతులను ఎమ్మెల్యే హరీష్‌రావు ఆమెకు వివరిం చారు. అంతకు ముందు పట్టణంలోని కోమటిచెరువు వద్ద జరుగుతున్న పా ర్కు నిర్మాణ పనులను ఎమ్మెల్యేతో కలి సి పరిశీలించారు. కేంద్ర పర్యాటక శాఖ నుంచి రూ.1.50 కోట్లు ఇందుకు మం జూరయ్యాయి. వాటితో బంకిట్ హాల్ (హాటల్ తరహా) భవన నిర్మాణం, కట్ట అభివ ృద్ధి, పచ్చిక బైళ్లు, విద్యుద్దీపాలు వంటివి ఉన్నాయి. 660 మీటర్ల పొడవు న్న కట్టలో 150 మీటర్ల మేర ప్రస్తుతం తీర్చిదిద్దబోతున్నారని, మిగతా భాగా లు బాగు చేసేందుకు నిధులు ఇ ప్పిం చాలని కలెక్టరును ఎమ్మెల్యే కోరారు. అంతర్గత రోడ్లపై కలెక్టర్ చక్కర్లు... వ్యాపార, వాణిజ్య కేంద్రంగా నిత్యం ఎంతో రద్దీగా ఉండే డివిజన్ కేంద్రంలోని అంతర్గత రోడ్లపై కలెక్టర్ చక్కర్లు కొట్టారు. ఎంసీహెచ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ నుంచి చేపల మార్కెట్.. తదితర రోడ్ల మీదుగా ఆమె తన వాహనంలో తిరిగారు. ఆయా దారుల పరిస్థితులను, రోడ్లను అభివ ృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే.. కలెక్టర్‌కు వివరించారు. అలాగే చేపల మార్కెట్‌కు షెడ్డు, అదనంగా మరో రైతు బజారు ఏర్పాటు చేయాలని కోరారు. సబ్‌జైలును తరలించే అంశాన్ని ప్రస్తావించారు. సిద్దిపేటకు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చిన కలెక ్టర్ స్మితాసబర్వాల్ సాయంత్రం ఆరు గంటల దాకా పట్టణంలోనే ఉన్నారు. దీంతో ఆమె వెంట ప్రాణహిత - చేవెళ్ల ఎత్తిపోతల పథకం, నీటి పారుదల, గ ృహ నిర్మాణ, మున్సిపల్, విద్య, రెవెన్యూ, వైద్య విధాన పరిషత్, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్, విద్యు త్, ఆర్అండ్బీ తదితర శాఖల జిల్లా, డివిజన్ అధికారులు ఉన్నారు. అంతకు ముందు ఆయా శాఖల అధికారులతో ఆమె ఆర్డీఓ చాంబరులో సమీక్షించారు. ఆయా పనులు పూర్తి చేయడానికి కాల వ్యవధిని నిర్దేశించారు. -
ఒక్కదెబ్బకు 21 మంది
సాక్షి, సంగారెడ్డి: కలెక్టర్ స్మితా సబర్వాల్ దూకుడు పెంచారు. ఒకేసారి మూకుమ్మడిగా 21 మంది తహశీల్దార్లు, 9 మంది మంది డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేసి సంచలనం సృష్టించారు. స్థాన చలనం పొందినవారిలో 16 మండలాల తహశీల్దార్లుండగా.. అందులో 6 మంది హెచ్ఎండీఏ పరిధిలోని మండలాల తహశీల్దార్లే కావడం విశేషం. మిగిలిన ఐదు మందిలో ఇద్దరికి పోస్టింగ్ కేటాయించకుండా వెయింటింగ్‌లో ఉంచగా, ముగ్గురికి పరిపాలన విభాగాల్లో తహశీల్దార్లుగా బదిలీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రెవెన్యూ విభాగంలో భారీగా కదలికలు చోటు చేసుకోవడం అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కరీంనగర్ కలెక్టర్‌గా పనిచేసినప్పుడు అక్కడ సైతం ఒకేసారి 40 మంది తహశీల్దార్లను బదిలీ చేసి స్మితా సబర్వాల్ వార్తల్లో నిలిచారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జిల్లాలో పరిపాలనను గాడిలో పెట్టేందుకు దృష్టిసారించిన కలెక్టర్, ఆ దిశగా దూకుడు చర్యలు తీసుకుంటూ అధికారుల్లో గుబులు పుట్టిస్తున్నారు. జిల్లాకు వచ్చిన కొత్తలోనే ఆమె తహశీల్దార్ల పనితీరు, వ్యవహార శైలికి సంబంధించిన ఫైళ్లను తెప్పించుకోవడంతో పాటు వివిధ వర్గాల ద్వారా వివరాలను ఆరా తీశారు. ప్రతి సోమ, శుక్రవారం నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో సైతం కొందరు తహశీల్దార్లతో ముఖాముఖీగా మాట్లాడి వారి పనితీరు, సామర్థ్యంపై స్వయంగా ఒక అవగాహనకు వచ్చేందుకు ప్రయత్నించారు. పనితీరుతో పాటు ఆయా మండలాల్లో ఉండే పని ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని సమర్థులకు ప్రాధాన్యత గల పోస్టింగ్‌లు కేటాయించినట్లు చర్చ జరుగుతోంది. గతంలో తహశీల్దార్ల బదిలీలు, పోస్టింగ్‌లలో పైరవీలు, ముడుపులు కీలకంగా వ్యవహరించేవని ఆరోపణలున్నాయి. హెచ్ఎండీఏ పరధిలోని మండలాల తహశీల్దార్ పోస్టులకు భారీ డిమాండు ఉంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ముఖ్య నేతల సిఫారసుతో పాటు భారీగా ముడుపులు ముట్టజెప్పి పోస్టింగ్‌లు పొందిన వారూ ఉన్నారు. గత మే, జూన్ నెలల్లో చివరి సారిగా తహశీల్దార్ల బదిలీలు జరిగాయి. అప్పుడు, అంతకు ముందు భారీగా ఖర్చు చేసుకుని పోస్టింగ్‌లు తెచ్చుకున్న కొందరు అధికారులకు తాజా బదిలీలు గట్టి షాక్‌నిచ్చాయి. సుదీర్ఘ కాలంగా ఒకేచోట పనిచేస్తున్నారనే కారణంతోనే 9 మంది డీటీలను బదిలీ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. -
పీహెచ్సీ సిబ్బంది పనితీరు మెరుగు పర్చుకోవాలి
టేక్మాల్: స్థానిక పీహెచ్సీ సిబ్బంది తమ పనితీరును మెరుగు పర్చుకోవాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ హెచ్చరించారు. గురువారం టేక్మాల్ మండలం బొడ్మట్‌పల్లిలోని పీహెచ్సీ సబ్‌సెంటర్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆమె సబ్‌సెంటర్ బోర్డును, చార్ట్‌లను పరిశీలించి వాటిని మార్చాలని డాక్టర్ ఇర్షద్‌కు సూచించారు. గ్రామసర్పంచ్ కంకర బీరప్పను అడిగి సబ్‌సెంటర్ పనితీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. గ్రామంలో ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు నిర్మించుకునేలా అధికారులు స్థానికులను ప్రోత్సహించాలన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి వెంటనే బిల్లులు చెల్లించాలని ఆదేశించారు.అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని పరిశీలించారు. పంచాయతీ కావాల్సిన ఫర్నిచర్‌ను, సామగ్రిని దాతలు, గ్రామస్తుల సహకారంతో సమకూర్చుకోవాలన్నారు. గ్రామంలో వీఆర్ఓ కార్యలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో తేవాలన్నారు. పదిహేను రోజుల్లోనీటి సౌకర్యం కల్పించండి నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లకు పదిహేను రోజుల్లో నీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ స్మితాసబర్వాల్ సంబంధిత ఏఈలను ఆదేశించారు. గురువారం మండల కేంద్రమైన టేక్మాల్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను కలెక్టర్ అకస్మికంగా సందర్శించారు. మరుగుదొడ్లకు నీటి సౌకర్యంలేక నిరుపయోగంగా ఉంటే బాలికలు మూత్ర విసర్జనకు బహిర్భూమిని ఆశ్రయిస్తే సమస్యలు ఉత్పన్నం కావా అని మండిపడ్డారు. త్వరలో నీటి సౌకర్యం కల్పించి వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. పక్కన నిర్మిస్తున్న మోడల్ స్కూల్ భవన నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని వచ్చే ఏడాది ఏప్రిల్‌లోగా పూర్తి చేసి అందించాలని ఆదేశించారు. లేని పక్షంలో సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకు ముందు పాఠశాల తరగతి గదుల్లో తిరుగుతూ విద్యార్థులతో ముచ్చటించారు. వారి నుంచి వచ్చే సమధాలతో సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు చిన్నప్పటినుంచే ఇంగ్లిషులో మాట్లాడడం, రాయడం నేర్చుకోవాలని సూచించారు. తోటి విద్యార్థులతో సంభాషణలు ఇంగ్లిష్‌లోనే చేయాలన్నారు. ఉపాధ్యాయులు వారికి అర్థమయ్యే రీతిలో బోధిస్తూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ఆమె వెంట ఆర్డీఓ వనజాదేవి, తహశీల్దార్ నాగేశ్వర్రావు, ఎంపీడీఓ విశ్వప్రసాద్, ఎంఈఓ వీర్సంగప్ప, ప్రిన్సిపాల్ అరుణ, ఆర్ఐ తారాబాయి. వీఆర్వో సత్యనారాయణ తదితరులు ఉన్నారు. -
‘వైద్యం’.. వేగిరం!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తానంటూ ప్రకటించిన కలెక్టర్ స్మితాసబర్వాల్ అదే విధంగా ప్రభుత్వ వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఐదు ప్రభుత్వ విభాగాల సమన్వయంతో చేపట్టిన ‘మార్పు’ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ కార్యక్రమం అమలుకు ఈ నెలాఖరు వరకు గడువు విధించారు. క్షేత్రస్థాయిలో ఇంకా మార్పు అమలుపై అవగాహన లేకపోవడంతో ఫలితాల సాధనపై వైద్య వర్గాల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు, వైద్యుల హాజరు తదితరాలను స్వయంగా పర్యవేక్షించేందుకు ‘స్కైప్’ సాంకేతికతను కలెక్టర్ ఆసరా చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 66 పీహెచ్‌సీలకు గాను 50, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో 12కు గాను 9 చోట్ల స్కైప్ టెక్నాలజీ సిద్ధం చేశారు. వైద్యులు, రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడే అవకాశం ఉండటంతో వైద్యులు ఉరుకులు, పరుగుల మీద ఆస్పత్రులకు చేరుకుంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రూ.1.25 కోట్ల ఆసుపత్రి అభివృద్ధి నిధులు ఉండటంతో పారిశుద్ధ్యం నిర్వహణ తదితరాలపై ఖర్చు చేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ప్రస్తుతం 52 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. మెరుగైన వైద్య సేవలు అందించే ఆస్పత్రులకు నిధులు, సిబ్బంది పెంచుతామంటూనే, పనితీరు బాగా లేనివారిపై వేటు వేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. జహీరాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట మాతా శిశు ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య మెరుగ్గా ఉంది. గజ్వేల్, నర్సాపూర్, రామాయంపేట తదితర చోట్ల ఆసుపత్రి ప్రసవాల సంఖ్య పెరగాలంటూ కలెక్టర్ నిర్దేశించారు. ‘మార్పు’ వేగంపై ఆందోళన మాత, శిశు మరణాల రేటు తగ్గింపు లక్ష్యంగా ‘మార్పు’ అమలు దిశగా కలెక్టర్ సంబంధిత విభాగాలను సమాయత్తం చేస్తున్నారు. అయితే ఐదు ప్రభుత్వ శాఖలకు సంయుక్తంగా ఈ కార్యక్రమం అమలు బాధ్యతను అప్పగించారు. స్వయం సహాయక సంఘాలను ‘మార్పు’ అమలులో భాగస్వాములను చేయడంతో వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే నవంబరు నెలాఖరుకల్లా ఫలితాలు చూపాలంటూ లక్ష్యం నిర్దేశించడంపై సంబంధిత శాఖలు మల్లగుల్లాలు పడుతున్నాయి. పది ఆరోగ్య క్లస్టర్లలో స్వయం సహాయక సంఘాలకు శిక్షణ ఇవ్వడం తలకు మించిన భారంగా మారేలా కనిపిస్తోంది. ఒక్కోచోట 700 నుంచి వేయి మంది మహిళలకు శిక్షణ ఇవ్వాల్సి ఉండటంతో ఏర్పాట్లపై సంబంధిత అధికారులు తల పట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ‘మార్పు’ అమలు ప్రణాళిక తయారీలో తమను భాగస్వాములను చేసి ఉంటే మెరుగైన శిక్షణకు అవకాశముండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైద్య సేవలు మెరుగు దిశగా కలెక్టర్ వడివడిగా అడుగులు వేస్తుండటంతో, అందుకోలేక సంబంధిత విభాగాలు ఆయాస పడుతున్నాయి. -
హౌసింగ్ బోర్డు స్థలాలపై కలెక్టర్ ఆరా
సిద్దిపేట, న్యూస్‌లైన్ : సిద్దిపేట హౌసింగ్ బోర్డు స్థలాల మీద అక్రమార్కులు కన్నేసిన వైనంపై జిల్లా పాలనా యంత్రాంగం అప్రమత్తమైంది. ‘జాగు చేస్తే జాగా గల్లంతు!’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టరు స్మితాసబర్వాల్ స్పందించారు. అర్బన్డేను పురస్కరించుకుని ఆయా మున్సిపాలిటీల కమిషనర్లతో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఆమె సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం సిద్దిపేట పురపాలక సంఘం కమిషనర్ ఆర్.రాంబాబును ప్రత్యేకంగా పిలిచి ఆ జాగా వ్యవహారంపై ప్రశ్నించారని సమాచారం. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని కలెక్టర్ తేల్చిచెప్పారని తెలుస్తోంది. తనకు రెవెన్యూ శాఖ తరఫున సహకారం ఇప్పిస్తే సదరు స్థలాలను సందర్శిస్తామని కమిషనర్ విన్నవించడంతో ఆమె అందుకు సానుకూలత వ్యక్తం చేశారని తెలిసింది. తహశీల్దారు/డిప్యూటీ తహశీల్దారుతో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలని స్మితాసబర్వాల్ ఆదేశించారు. నాలుగు ఎకరాల 15 గుంటల స్థలాన్ని సంయుక్తంగా సర్వే చేసి ఏమైనా ఆక్రమణకు గురైందా లేక సురక్షితంగా ఉన్నదా..? అనేది ఈ నేపథ్యంలో నిర్ధారించనున్నారు. స్థానిక అధికారుల్లో కదలికలు... సిద్దిపేటలోని హౌసింగ్ బోర్డు 1340 సర్వే నంబరులో నాలుగు ఎకరాల 15 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు స్థానిక అధికారుల్లో కదలికలు మొదలయ్యాయి. కలెక్టరు ఆదేశాల ప్రకారం రంగంలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆ జాగా మొత్తం ఖాళీగా ఉన్నదా లేక ఏమైనా కట్టడాలు వెలిశాయా? అనేది చూస్తారు. అక్రమార్కులు ఆక్రమించుకోకుండా కంచె వేయించేందుకు ఇప్పటికే ప్రతిపాదించారు. ప్రభుత్వ భూమిని రక్షించేందుకు రెవెన్యూ అధికారులు, ఏమైనా అనుమతిలేని నిర్మాణాలు జరిగితే చర్యలు తీసుకునేందుకు మున్సిపల్ యంత్రాంగం యోచిస్తున్నాయి. మొత్తంగా రెండు శాఖలూ సమన్వయంతో పట్టణంలోని సర్కారు జాగాలను కాపాడడంలో ఏమేరకు సఫలీకృతమవుతాయో చూడాలి. -
విద్య, వైద్యం ఇవే నా లక్ష్యం: కలెక్టర్ స్మిత సబర్వాల్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూనే జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తానని కలెక్టర్ స్మిత సబర్వాల్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్‌గా ఈ నెల 16న బాధ్యతలు స్వీకరించిన స్మిత తొలిసారిగా బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయ, ఇతర ఒత్తిళ్లను సాకుగా చూపుతూ పనిచేయని అధికారులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. వివిధ ప్రభుత్వ శాఖల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పారదర్శకతకు పెద్ద పీట వేస్తానని కలెక్టర్ స్మిత సభర్వాల్ తెలిపారు. సమావేశంలో కలెక్టర్ తెలిపిన విషయాలు ఆమె మాటల్లోనే... గత ఏడాది పదో తరగతి ఫలితాలు నిరాశజనకంగా ఉన్నాయి. ‘పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ సిస్టమ్’ ద్వారా విద్యారంగం మెరుగుదలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తా. యూనిట్ పరీక్ష మొదలుకుని అన్ని పరీక్షల మార్కులను సేకరించి, పాఠశాలల వారీగా పరిస్థితిని సమీక్షిస్తాం. ‘డాష్ బోర్డు’ ద్వారా పాఠశాలల పనితీరును ప్రదర్శిస్తాం. మూడు నెలల్లో ట్రాకింగ్ సిస్టంను కొలిక్కి తెస్తాం. వీలైనంత తక్కువ ఖర్చుతో ఈ పద్ధతిని అమల్లోకి తెస్తాం. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లలో ‘స్కైప్’ సాంకేతికతను ప్రవేశ పెట్టాల్సిందిగా ఇప్పటికే ఆదేశించాను. బాలికల హాస్టళ్లకు తొలి ప్రాధాన్యత ఇస్తాం. విద్యా బోధన, మౌళిక సౌకర్యాలు తదితరాలను ‘స్కైప్’ ద్వారా పర్యవేక్షించేందుకు వీలవుతుంది. నవంబర్ 15లోగా ఈ విధానాన్ని ఆచరణలోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు అన్ని స్థాయిల్లోనూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచుతాం. ప్రసవాలు ఎక్కువగా జరిగే ఆస్పత్రుల్లో ప్రసూతి వైద్యుడు, అనస్థీయషినిస్టు, చిన్న పిల్లల వైద్యుడు ఉండేలా చర్యలు తీసుకుంటాం. అవసరమైన చోట వైద్య సిబ్బందిని సర్దుబాటు చేసే యోచనలో ఉన్నాం. ప్రస్తుతం 40 శాతంగాఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను 60 నుంచి 80 శాతం వరకు తీసుకెళ్తాం. మాతా, శిశు మరణాల రేటు తగ్గించేందుకు పీహెచ్‌సీలు, ఉప కేంద్రాలను బలోపేతం చేస్తాం. ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తాం. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ఐకేపీ విభాగాలను ‘మార్పు’ అనే ఒకే గొడుగు కిందకు తెస్తాం. మాతా శిశు మరణాలు, ఇమ్యూనైజేషన్, పోషకాహారం వంటి అంశాలపై మహిళా సమాఖ్య నుంచి సమాచారాన్ని తీసుకుని లోపాలను సరిదిద్దుతాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లలో ‘స్కైప్’ను ఏర్పాటు చేస్తాం. దీంతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సంబంధిత విభాగాల అధికారులు తక్షణ పర్యవేక్షణకు వీలుంటుంది. జిల్లాలో 26 మోడల్ స్కూళ్లకు గాను 8 మాత్రమే పాక్షికంగా పూర్తయ్యాయి. మిగతావి ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిని పూర్తి చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. మున్సిపాలిటీల్లో నెలలో ఒక శనివారం ‘అర్బన్ డే’ నిర్వహించి, పారిశుధ్యం నిర్వహణపై దృష్టి పెడతాం. ప్రతీ మూడో వారం పారిశుధ్య వారంగా పరిగణిస్తాం. మురుగు కాల్వలు శుభ్రం చేయడం, పొదల తొలగింపు, నీటి ట్యాంకుల పరిశుభ్రత, బ్లీచింగ్ పనులకు ప్రాధాన్యత ఇస్తాం. ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజనం, అమృత హస్తం, ఐడీసీఎస్, సంక్షేమ హాస్టళ్ల అవసరాలకు అవసరమైన బియ్యం సేకరణకు డిసెంబర్ నుంచి ‘మన బియ్యం’ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సహకారంతో 167 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ధాన్యం అమ్మిన 72 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశాం. ఎరువులు, విత్తనాల సరఫరా, పంట రుణాల లక్ష్యం, ఇంజనీరింగ్ శాఖల పనితీరుతో పాటు ఇతర అంశాలపై క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తాం. అధికారులు, సిబ్బందిని సమన్వయం చేస్తూ మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తా. డుమ్మాల మాస్టర్లకు ఇక చెక్! జిల్లాలో విద్యారంగం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. డీఈఓ రమేష్‌తో పాటు ఇటీవల బదిలీపై జిల్లాకు వచ్చిన కలెక్టర్ స్మితా సబర్వాల్ పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా బుధవారం కలెక్టర్ డీఈఓతో సుమారు రెండు గంటల పాటు సమావేశమై విద్యావ్యవస్థ తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వ పాఠశాలలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలలకు రావడం లేదని, సోమవారం నిర్వహించిన డయల్‌యువర్ కలెక్టర్ కార్యక్రమంలో 28 ఫిర్యాదులు రాగా అందులో 11 ఫిర్యాదులు ఉపాధ్యాయులు హాజరు కావడం లేదనే వచ్చాయి. దీంతో కలెక్టర్ ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయుల వివరాలతో పాటు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఫోన్ నంబర్లను డీఈఓ ద్వారా తీసుకున్నారు. ఇకమీదట ప్రతిరోజు రెండు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని డీఈఓను ఆదేశించినట్లు తెలిసింది. తాను సైతం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన ప్రతి సందర్భంలోను కచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్న పాఠశాలలను తనిఖీ చేస్తానని, ప్రతిరోజు ఉదయం ఏదో ఒక పాఠశాలకు ఫోన్‌చేసి ప్రధానోపాధ్యాయుడితోపాటు విద్యార్థులతో మాట్లాడతానని అన్నట్లు తెలిసింది. రాజకీయ వత్తిడిలు ఎన్ని వచ్చినా చదువు విషయంలో రాజీపడవద్దని ఎక్కడైనా చిన్నపాటి పొరపాట్లు దొర్లితే మొదటి తప్పుగా క్షమించాలని, అదే తప్పు తరుచుగా జరుగుతుంటే ఉపేక్షించేది లేదని, డీఈఓ స్థాయిలో చర్యలు తీసుకుంటూ తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే డీఈఓ రమేశ్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేయడంతోపాటు పాఠశాల సమయానికి హెచ్ఎంలకు ఫోన్, విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ పిల్లల చదువుపై ఆరా తీస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కలెక్టర్ కూడా ఉపాధ్యాయుల పనితీరుపై దృష్టి సారించడంతో ఉపాధ్యాయులలో ఆందోళన మొదలైంది. ఓవైపు డీఈఓ నిర్ణయాలతో మింగుడుపడని ఉపాధ్యాయ సంఘాలు ఆయన బదిలీకి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో కలెక్టర్ కూడా డీఈఓను సమర్థిస్తూ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతుండడంతో ఉపాధ్యాయ సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. నిర్లక్ష్యం వహిస్తే వేటే వచ్చే మార్చిలోగా ఆదర్శ, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల భవన నిర్మాణాలను పూర్తి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఈఈ అనిల్‌కుమార్‌ను కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆదేశించారు. ఇందులో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా వేటు తప్పదని హెచ్చరించారు. బుధవారం తన కార్యాలయంలో ఆర్‌ఎంఎస్‌ఏ, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీ భవన నిర్మాణాలపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలోని 43 మోడల్ పాఠశాలల భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ఏ ఒక్క భవనాన్ని కూడా పూర్తి చేయకపోవడంపై ఆమె ఆ శాఖ అధికారులపై మండిపడ్డారు. నిర్మాణానికి అవసరమైన నిధులను వెంటనే చెల్లిస్తున్నా ఎందుకు జాప్యం జరుగుతుందని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తన దృష్టికి తేవాలన్నారు. ప్రభుత్వ అనుమతితో వారి స్థానంలో కొత్తవారిని నిర్వహిస్తామని తెలిపారు. రాజీవ్ విద్యామిషన్ విభాగంలో పని చేస్తోన్న ఇంజనీరింగ్ అధికారులు రోజూ ఏదోఒక పాఠశాల పనులను పరిశీలించి ఎప్పటికప్పుడు ఆర్వీఎం పీఓకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి బుధవారం భవన నిర్మాణాలపై సమీక్షింశాలని కలెక్టర్ పీఓకు సూచించారు. ఇంజనీరింగ్ అధికారులు సహకరించకపోతే నోటీసులు జారీ చేయాలని, అయినా తీరు మార్చుకోని వారి సంగతి తాను చూస్తానన్నారు. రామాయంపేట, మిరుదొడ్డిలో నవంబర్ ఒకటిలోగా, ఝరాసంగం, మునిపల్లిలో 15వ తేదీలోగా, పుల్కల్, బొల్లారం, జక్కపల్లిలో నవంబర్ 30లోగా, రాయికోడ్ ఆదర్శ పాఠశాలల భవన నిర్మాణ పనులను డిసెంబర్ 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నూతనంగా మంజూరైన కేజీబీవీ భవనాలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కేజీబీవీల్లో స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులను ఏర్పాటు చేయాలన్నారు. జూలై నాటికే పూర్తి చేస్తామన్నారు మోడల్ పాఠశాల భవన నిర్మాణాలను జూలై 30 నాటికి పూర్తి చేసి అప్పగిస్తామని ఆ శాఖ ఈఈ అనిల్‌కుమార్ హామీ ఇచ్చారని రాజీవ్ విద్యామిషన్ పీఓ రమేశ్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. గతంలో ఇచ్చిన మాట మేరకు ఎక్కడ కూడా భవన నిర్మాణ పనుల్లో పురోగతి లేదన్నారు. సమావేశంలో ఆర్వీఎం సీఎంఓ సత్యనారాయణ, డీఈఈ అంజిరెడ్డి, కోఆర్డినేటర్ రమాదేవి, సాంఘిక సంక్షే మ శాఖ అధికారి సత్యనారాయణతో ఆర్వీఎం, సోషల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. -
పేదల సమస్యలపై కలెక్టర్ మార్క్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సమీక్షలు, హెచ్చరికలతో పాలనను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కలెక్టర్ స్మితా సబర్వాల్ ‘ప్రజా విజ్ఞప్తుల దినం’ నిర్వహణపై దృష్టి సారించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే అర్జీదారుల సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా నిర్వహణ తీరులో పలు మార్పులు సూచించారు. వ్యయ, ప్రయాసాలకోర్చి జిల్లా కేంద్రానికి వచ్చే అర్జీదారులకు అసౌకర్యం కలగకుండా వేగవంతంగా అర్జీలు స్వీకరించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రతి సోమవారం కలెక్టర్, అధికారులు పాల్గొనే ‘ప్రజా విజ్ఞప్తుల దినం’లో సమస్యలు విన్నవించేందుకు సామాన్యులు వస్తూ ఉంటారు. అర్జీదారుల వివరాలు నమోదు చేసేందుకు ఓ ప్రత్యేక సెల్ ఉన్నా గంటల కొద్దీ క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వారాల తరబడి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న అర్జీదారులు కూడా ఉన్నారు. వారి సమస్యలు పరిష్కరించే దిశలో కలెక్టర్ ‘ప్రజా విజ్ఞప్తుల దినం’ నిర్వహణలో పలు మార్పుల దిశగా సూచనలు చేశారు. సమావేశ మందిరంలోని రెండు ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ల ద్వారా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితా ప్రదర్శిస్తారు. ‘పరిష్కారం, ప్రజావాణి సెల్’కు అందిన విజ్ఞాపనలు ఏ దశలో ఉన్నదీ తెలిపేలా ఏర్పాట్లు చేస్తారు. దీంతో అర్జీదారుల వ్యయ, ప్రయాసాలు కొంతమేర తగ్గే అవకా శం ఉంది. అర్జీదారుల వివరాలు నమోదు చే సేందుకు కౌంటర్లను నాలుగుకు పెంచనున్నా రు. విభాగాల వారీ గా కౌంటర్లు ఏర్పాటు చేసి అర్జీలను కంప్యూటరీకరిస్తారు. సచివాలయం తరహాలో కలెక్టరేట్ సముదాయంలో ‘మీసేవ’ దరఖాస్తుల పురోగతిని తెలిపేలా ‘డిజిటల్ బోర్డు’ ఏర్పాటు చేయనున్నారు. త్వరలో ‘కీలక’ బదిలీలు? కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే స్మితా సబర్వాల్ విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధాన శాఖల సమీక్షలు ముగిసిన తర్వాత క్షేత్ర స్థాయి అధికారుల బదిలీపై కలెక్టర్ దృష్టి సారించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్ఐలు, డీటీలు, తహశీల్దార్ల బదిలీపై గతంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి. వారి పనితీరును బేరీజు వేసిన తర్వాత బదిలీలు ఉంటాయని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. -
చేతకాకుంటే నిర్వహించొద్దు
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : ‘ఇదేమి ఏర్పాట్లు.. క్యాంప్‌కు హాజరైన వారికి కనీస సౌకర్యాలు లేకపోతే ఎలా? కూర్చోవడానికి కుర్చీలు లేకపోవడం దారుణం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కనీసం తాగునీరు కూడా అందించకుంటే ఎలా? పేర్ల నమోదు కౌంటర్లు రెండే ఏర్పాటు చేస్తే ఎలా? చేతగాని పక్షంలో క్యాంప్‌లు నిర్వహించవద్దు’ అంటూ సదరన్ క్యాంప్ నిర్వహణ తీరుపై డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డిపై కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి లోపాలు జరిగే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. శుక్రవారం జిల్లా ప్రభుత్వాస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన సదరన్ క్యాంప్‌కు ఆమె ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. వైకల్య గుర్తింపు కోసం ఇక మీదట నెలకు మూడు క్యాంప్‌లు నిర్వహిస్తామని, దీనిని వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యాంప్‌కు హాజరైన వారికి పది మంది ప్రత్యేక వైద్య నిపుణుల తో పరీక్షలు నిర్వహించి ధ్రువపత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ క్యాంప్‌లో ఎలాంటి అనుమానాలకూ తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 30 వేలకు పైగా వివిధ రకాల పింఛన్లను అందిస్తున్నామని, మరో 500లకు పైగా అర్హులైన వికలాంగులు ఉన్నారని వీరికి పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ అందరికీ సర్టిఫికెట్లు అందించాలన్న ఉద్దేశంతోనే ఈ క్యాంప్‌ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, డీఎంహెచ్ఓ రంగారెడ్డి, డీసీహెచ్ఎస్ మీనాకుమారి, ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, తహశీల్దార్ గోవర్ధన్, మున్సిపల్ కమీషనర్ కృష్ణారెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంగుల రవి, పట్నం సుభాష్, కసిని విక్రాంత్, శ్రీకాంత్, మందుల రాధాకృష్ణ, శివరాజ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లకు 167 కేంద్రాలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఖరీఫ్‌కు సంబంధించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వీలుగా జిల్లాలో 167 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరి ధాన్యాల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఆధార్ అనుసంధానం, నిత్యావసర సరుకుల పంపిణీ ఇతర అంశాలపై పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన సాధారణ రకం వరి ధాన్యం క్వింటాల్‌కు రూ.1,310, గ్రేడ్-ఏ రకం ధాన్యానికి రూ. 1,345లకు తగ్గకుండా కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 2013-14 సంవత్సరానికి సంబంధించి లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలుకు ఐకేపీ ద్వారా 119 కేంద్రాలు, వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా 48 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నవంబర్ మొదటి వారం నుంచి ధాన్యం మార్కెట్లోకి వస్తుందని ఆ ప్రకారం కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్లపై స్వయం సహాయక సభ్యులకు పూర్తి స్థాయి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాలకు అవసరమైన ప్యాడి, పవర్ క్లీనర్స్, మాయిశ్చరైజ్ మీటర్లు, తూకం యంత్రాలు, టార్పాలిన్లు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డుల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆమె మార్కెటింగ్ శాఖ ఏడీకి సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను 72 గంటల్లోగా రైతు ఖాతాలో జమ చేస్తామన్నారు. రైతులు ఎదుర్కొనే సమస్యల సత్వర పరిష్కారం కోసం ఆర్డీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎ.శరత్, వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, డీఎస్ఓ ఏసు రత్నం, మార్కెటింగ్ ఏడీ నవీన్‌రెడ్డి, ఆర్డీఓలు ముత్యంరెడ్డి, వనజాదేవి తదితరులు పాల్గొన్నారు. -
ఈ కలెక్టర్ మాకొద్దు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా కలెక్టర్ ఆకస్మిక బదిలీ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఎన్నికల ఏడాదిలో స్మితా సబర్వాల్‌ను కలెక్టర్‌గా నియమించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త కలెక్టర్ పోస్టింగును రద్దు చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో స్మితా సబర్వాల్ నేతలు, ఉద్యోగుల పట్ల వ్యవహరించిన తీరుపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. అభివృద్ధి కార్యక్రమాల పేరిట అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కార్యకలాపాలు ముమ్మరం చేసే ప్రణాళికలో ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకమునుపే ఇన్నాళ్లూ పెండింగులో వున్న పనులు, కార్యకర్తలను సంతృప్తిపరిచే పనులు పూర్తిచేయాలనే ఉద్దేశం కనిపిస్తోంది. అయితే కొత్తగా వచ్చే కలెక్టర్ నిబంధనల పేరిట ప్రతీ వ్యవహారాన్ని బూతద్దంలో పెట్టి చూస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందనే భావన ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. బదిలీ రద్దు చేయించడం ద్వారానే సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవచ్చనే అభిప్రాయం నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్‌తో పాటు కొందరు ఎమ్మెల్యేలు స్మితా సబర్వాల్ పోస్టింగును రద్దు చేయాలంటూ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు స్మితా సబర్వాల్ పోస్టింగ్ రద్దుపై జిల్లా మంత్రులను సంప్రదించినట్లు తెలిసింది. అయితే డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఈ అంశంపై స్పందించేందుకు విముఖత చూపినట్లు సమాచారం. డిప్యూటీని ఇరుకున పెట్టేందుకే? డిప్యూటీ సీఎంతో సహా జిల్లాకు చెందిన మంత్రుల అభిప్రాయం తీసుకోకుండానే కలెక్టర్‌గా స్మితా సబర్వాల్ నియామకం జరిగినట్లు ప్రచారం. సీఎం కిరణ్‌తో ఏడాదికాలంగా డిప్యూటీ సీఎం తీవ్రంగా విభేదిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రకటన వెలువడిన తర్వాత ఇతర మంత్రులు కూడా సీఎంతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం సహా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న నేతలను ఇరుకున పెట్టేందుకే కొత్త కలెక్టర్ నియామకం జరిగినట్లు అధికార పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. 3 -
కొత్త కలెక్టర్‌గా స్మితా సబర్వాల్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా నూతన కలెక్టర్‌గా 2001 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ నియమితులయ్యారు. కలెక్టర్ దినకర్‌బాబు రాష్ట్ర సహకార మార్కెటింగ్ ఫెడరేషన్(మార్కఫెడ్) మేనేజింగ్ డెరైక్టర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీకే మహంతీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ యేడాది జూన్ వరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన స్మితా సబర్వాల్ ప్రస్తుతం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. 2000 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి దినకర్‌బాబు 2012 జూలైలో జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు. సుమారు 15 నెలల పాటు కలెక్టర్‌గా పనిచేసిన దినకర్‌బాబు ఆకస్మిక బదిలీపై రాజకీయ, అధికారిక వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. రెండు నెలల క్రితమే కలెక్టర్ బదిలీ జరుగుతుందనే ప్రచారం జరిగింది. అయితే వచ్చే యేడాది జరిగే సాధారణ ఎన్నికల వరకు కొనసాగించాల్సిందిగా దినకర్‌బాబు చేసిన విజ్ఞప్తికి సానుకూల స్పం దన లభించినట్లు సమాచారం. అయితే ప్రస్తుత బదిలీపై దినకర్‌బాబుకు ముందస్తు సమాచారం లేదని తెలిసింది. డిప్యూటీ సీఎం, జిల్లా మంత్రులు సహా అధికార పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం పరిగణనలోకి తీసుకోకుండానే స్మితా సబర్వాల్‌కు పోస్టింగ్ ఇచ్చినట్లు వెల్లడవుతోంది. సీఎం కిరణ్‌తో డిప్యూటీ సీఎం దామోదర తీవ్రంగా విభేదిస్తున్న నేపథ్యంలో కలెక్టర్ నియామకం చర్చనీయాంశమైంది. స్మితా సబర్వాల్ ప్రొఫైల్ జననం: 19 జూన్, 1977 మాతృభాష: బెంగాలీ విద్య: బీకాం (సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ, సికింద్రాబాద్) ఐఏఎస్:2001 బ్యాచ్, (తొలి ప్రయత్నంలోనే యుపీఎస్సీ పరీక్షలో జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు) 2001లో ఆదిలాబాద్ ట్రెయినీ కలెక్టర్ 2003-04లో చిత్తూరు అసిస్టెంట్ కలెక్టర్ 2004-06లో పీడీ, రూరల్ డెవలప్మెంట్ 2006-07లో మున్సిపల్ కమిషనర్, వరంగల్ 2007-2011లో జాయింట్ కలెక్టర్ కర్నూలు, హైదరాబాద్ 2011-2013 జూన్ వరకు కరీంనగర్ కలెక్టర్‌గా విధుల నిర్వహణ ముక్కుసూటి అధికారి 2001 బ్యాచ్‌కు చెందిన స్మితా సబర్వాల్‌కు ముక్కుసూటి అధికారిగా పేరుంది. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన 26 నెలల్లో పాలనపై తనదైన ముద్ర వేశారు. పౌర సరఫరాల శాఖ వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ ఐఏఎస్ అధికారిని పట్టుబట్టి బదిలీ చేయించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన 25 మంది వైద్య సిబ్బందిని మూకుమ్మడిగా బదిలీ చేశారు. ఒకే పర్యాయం 40 మంది తహశీల్దార్లను బదిలీ చేసి రెవెన్యూ పాలన గాడిలో పెట్టారు. ప్రభుత్వ పథకాల అమలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో కరీంనగర్ జిల్లాను అగ్రస్థానంలో నిలిపినందుకు రాష్ట్ర ఐటీ శాఖ నుంచి రెండు పథకాలు, రూ.15 లక్షల రివార్డు సాధించారు. 20 సూత్రాల పథకం అమలులో 2011-12కు గాను జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపారు. ‘అమ్మ లాలన’, ‘మార్పు’ తదితర కార్యక్రమాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. బాల్యంలో కర్ణాటక అండర్ 16 జట్టుకు బ్యాడ్మింటన్‌లో ప్రాతినిథ్యం వహించారు. ఈమె భర్త ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్.