సిద్దిపేట, న్యూస్‌లైన్ : కలెక్టర్ సిత్మాసబర్వాల్ శుక్రవారం సిద్దిపేటలో బిజీ బిజీగా గడిపారు. ఒకటేమిటి.. తనిఖీలు, సంద ర్శ నలు, సమీక్షలతో అధికారులను పరుగు లు తీయించారు. ముందుగా ఏరియా ఆస్పత్రి, మాతా శిశు వైద్యశాలను ఆయ న స్థానిక ఎమ్మెల్యే హరీష్‌రావుతో కలిసి తనిఖీ చేశారు. మొదట ప్రాంతీయ వైద్యశాలలోకి వెళ్లారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇతర వార్డు లోనూ పేషెంట్లకు అం దుతున్న సేవల్ని పరిశీలించారు. ఏజెన్సీ / ఔట్‌సోర్సింగ్‌ల ద్వారా చేపడుతున్న శానిటేషన్ పనులకు అదనంగా మున్సిపాలిటీ తరఫున కూడా పారిశుద్ధ్య సేవ లు అందుబాటులోకి తేవాలని ఇన్‌చార్జ్ కమిషనర్ లక్ష్మణ్‌ను కలెక్టర్ ఆదేశించా రు. ఈ రెండు వైద్యశాలల స్థితిగతులను ఎమ్మెల్యే హరీష్‌రావు ఆమెకు వివరిం చారు. అంతకు ముందు పట్టణంలోని కోమటిచెరువు వద్ద జరుగుతున్న పా ర్కు నిర్మాణ పనులను ఎమ్మెల్యేతో కలి సి పరిశీలించారు. కేంద్ర పర్యాటక శాఖ నుంచి రూ.1.50 కోట్లు ఇందుకు మం జూరయ్యాయి. వాటితో బంకిట్ హాల్ (హాటల్ తరహా) భవన నిర్మాణం, కట్ట అభివ ృద్ధి, పచ్చిక బైళ్లు, విద్యుద్దీపాలు వంటివి ఉన్నాయి. 660 మీటర్ల పొడవు న్న కట్టలో 150 మీటర్ల మేర ప్రస్తుతం తీర్చిదిద్దబోతున్నారని, మిగతా భాగా లు బాగు చేసేందుకు నిధులు ఇ ప్పిం చాలని కలెక్టరును ఎమ్మెల్యే కోరారు.
అంతర్గత రోడ్లపై కలెక్టర్ చక్కర్లు...
వ్యాపార, వాణిజ్య కేంద్రంగా నిత్యం ఎంతో రద్దీగా ఉండే డివిజన్ కేంద్రంలోని అంతర్గత రోడ్లపై కలెక్టర్ చక్కర్లు కొట్టారు. ఎంసీహెచ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ నుంచి చేపల మార్కెట్.. తదితర రోడ్ల మీదుగా ఆమె తన వాహనంలో తిరిగారు. ఆయా దారుల పరిస్థితులను, రోడ్లను అభివ ృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే.. కలెక్టర్‌కు వివరించారు. అలాగే చేపల మార్కెట్‌కు షెడ్డు, అదనంగా మరో రైతు బజారు ఏర్పాటు చేయాలని కోరారు. సబ్‌జైలును తరలించే అంశాన్ని ప్రస్తావించారు.
సిద్దిపేటకు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చిన కలెక ్టర్ స్మితాసబర్వాల్ సాయంత్రం ఆరు గంటల దాకా పట్టణంలోనే ఉన్నారు. దీంతో ఆమె వెంట ప్రాణహిత - చేవెళ్ల ఎత్తిపోతల పథకం, నీటి పారుదల, గ ృహ నిర్మాణ, మున్సిపల్, విద్య, రెవెన్యూ, వైద్య విధాన పరిషత్, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యు త్, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల జిల్లా, డివిజన్ అధికారులు ఉన్నారు. అంతకు ముందు ఆయా శాఖల అధికారులతో ఆమె ఆర్డీఓ చాంబరులో సమీక్షించారు. ఆయా పనులు పూర్తి చేయడానికి కాల వ్యవధిని నిర్దేశించారు.
సందర్శనలు.. తనిఖీలు.. సమీక్షలు
Published Sat, Nov 23 2013 3:46 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM
Advertisement