స్మితా సబర్వాల్‌కు సాయంపై విచారణ వాయిదా
హైదరాబాద్: ‘ఔట్‌లుక్’ మేగజైన్ కథనం వివాదంలో సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు న్యాయపరమైన ఖర్చులకోసం రూ.15 లక్షలు మంజూరును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. హైదరాబాద్‌కు చెందిన కె.ఈశ్వరరావు, రచయిత, సామాజిక కార్యకర్త వత్సలా విద్యాసాగర్ ఈ అంశంపై వేర్వేరుగా పిల్‌లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
వీటిని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. అయితే అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి అభ్యర్థన మేరకు ఈ విచారణను తమ చాంబర్‌లో ఇన్ కెమెరా (రహస్య విచారణ) ద్వారా చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.